Toyota Hilux Discounts: భారతీయ మార్కెట్లో 'టయోటా' (Toyota) కార్లకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కంపెనీ ఇప్పుడు తన పికప్ ట్రక్కు 'హైలక్స్' (Hilux) మీద కనీవినీ ఎరుగని డిస్కౌంట్ ప్రకటించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం, ఇప్పటికే మంచి సంఖ్యలో అమ్ముడవుతున్న 'టయోటా హైలక్స్ పికప్' (Toyota Hilux Pickup) ట్రక్కు మీద కంపెనీ రూ. 6 లక్షల నుంచి రూ. 8 లక్షల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. గతంలో సంస్థ ఈ వెహికల్ బేస్ వేరియంట్ ధరలు రూ. 3.60 లక్షలు తగ్గించి, ఇతర వేరియట్ల ధరలను రూ. 1.35 లక్షల వరకు పెంచింది. కాగా ఇప్పుడు భారీ డిస్కౌంట్ ప్రకటించింది.
టయోటా హైలక్స్ మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది. అవి స్టాండర్డ్ ఎమ్‌టి, హై ఎమ్‌టి, హై ఏటీ. ఈ పికప్ ట్రక్కు ఇప్పటి వరకు 1300 యూనిట్లు అమ్ముడైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీని ధరలు రూ. 30.40 లక్షల నుంచి రూ. 37.90 లక్షల మధ్య ఉన్నాయి.
(ఇదీ చదవండి: యమహా ఆర్ఎక్స్100 మళ్ళీ రానుందా? ఇదిగో క్లారిటీ!)
ప్రస్తుతం దేశంలోని కొన్ని కంపెనీ డీలర్‌షిప్‌లు రూ. 6 లక్షల డిస్కౌంట్ అందిస్తున్నట్లు, ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలోని డీలర్‌షిప్‌లు రూ. 8 లక్షల వరకు తగ్గింపుని అందిస్తున్నట్లు సమాచారం. అయితే తగ్గింపులు ఒక నగరం నుంచి మరో నగరానికి మారే అవకాశం ఉంటుంది. ఖచ్చితమైన డిస్కౌంట్స్ గురించి తెలుసుకోవడానికి సమీపంలో ఉండే అధికారిక డీలర్‌షిప్‌లను సందర్శించి తెలుసుకోవచ్చు.
(ఇదీ చదవండి: అదరగొట్టిన 'నెక్సాన్ ఈవీ'.. టాటా ఆంటే మినిమమ్ ఉంటది!)
2022 మార్చిలో ప్రారంభమైన ఈ హైలక్స్ అద్భుతమైన డిజైన్, ఫీచర్స్ కలిగి మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. దీని కోసం కంపెనీ ఇందులో 2.8 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ అమర్చింది. మాన్యువల్ వేరియంట్‌లలో 201 బిహెచ్‌పి, 420 ఎన్ఎమ్ టార్క్.. ఆటోమేటిక్ వేరియంట్‌లలో 500 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ అండ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. కావున ఉత్తమ పనితీరుని అందిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment