General Motors
-
ప్రముఖ కంపెనీలో 1000 మందికి లేఆఫ్స్!
ప్రముఖ కార్ల తయారీ సంస్థ జనరల్ మోటార్స్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,000 మందిని ఉద్యోగం నుంచి తొలగించింది. ఉద్యోగాల కోతను ధ్రువపరుస్తూ జనరల్ మోటార్స్ ప్రకటన విడుదల చేసింది. కంపెనీ కార్యకలాపాలను క్రమబద్ధీకరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. విద్యుత్ వాహనాల వృద్ధి కొనసాగుతుండడంతో ఈ విభాగంలో అధికంగా పెట్టుబడులు అవసరమవుతాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఖర్చులు తగ్గించుకునేందుకు కంపెనీ ప్రయత్నిస్తుందని స్పష్టం చేసింది.‘భవిష్యత్తులో విద్యుత్ వాహనాలకు భారీ గిరాకీ ఏర్పడనుంది. వాటి తయారీ, అందులో వాడే సాఫ్ట్‌వేర్‌కు అధికంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. వచ్చే ఏడాదిలోపు కంపెనీ వ్యయాలను రెండు బిలియన్ డాలర్ల (రూ.16,884 కోట్లు) నుంచి నాలుగు బిలియన్ డాలర్లు(రూ.33,768 కోట్లు) వరకు తగ్గించుకోవాలని లక్ష్యంగా నిర్ణయించాం. ఈ పోటీ మార్కెట్లో గెలవాలంటే వేగంగా నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయాలి. నిర్వహణ వ్యయాలను తగ్గించుకుని, సామర్థ్యాల వినియోగాన్ని పెంచుకోవాలి. ఖర్చుల తగ్గింపులో భాగంగానే ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తీసుకున్నాం’ అని కంపెనీ ప్రకటనలో తెలిపింది.ఇదీ చదవండి: ట్రంప్ ఎన్నికతో భారత్‌వైపు చూపుఆగస్టులో ఉద్యోగుల క్రమబద్ధీకరణ పేరుతో సాఫ్ట్వేర్ విభాగంలో పనిచేసే 1,000 కంటే ఎక్కువ మంది సిబ్బందిని గతంలో జనరల్ మోటార్స్ తొలగించింది. సెప్టెంబర్‌లో కాన్సాస్ తయారీ కర్మాగారంలో దాదాపు 1,700 మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించింది. 2023లో దాదాపు 5,000 మంది ఉద్యోగులను తొలగించింది. -
4.49 లక్షల వాహనాలు వెనక్కి.. అమెరికన్ కంపెనీ కీలక ప్రకటన
అమెరికన్ వాహన తయారీ 'జనరల్ మోటార్స్' కంపెనీ 4,49,000 కంటే ఎక్కువ పికప్ ట్రక్కులు, ఎస్‌యూవీలకు రీకాల్ ప్రకటించింది. ఈ విషయాన్ని యూఎస్ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది.కంపెనీ రీకాల్ ప్రకటించిన వాహనాల జాబితాలో.. 2023-2024 కాడిలాక్ ఎస్కలేడ్, ఎస్కలేడ్ ESVలు, 2023 చేవ్రొలెట్ సిల్వరాడో 1500, 2023-2024 చేవ్రొలెట్ టాహో, సబర్బన్ సిఐ 1500, 2023 జీఎంసి సియెర్రా 1500, 2023-24 జీఎంసి యుకాన్ ఎక్స్ఎల్ మోడల్స్ ఉన్నాయి.రీకాల్ ప్రకటించడానికి ప్రధాన కారణం.. ఎలక్ట్రానిక్ బ్రేక్ కంట్రోల్ మాడ్యూల్ సాఫ్ట్వేర్ బ్రేక్ ఫ్లూయిడ్ కోల్పోయినప్పుడు వార్ణింగ్ ప్రదర్శించడంలో లోపం అని తెలుస్తోంది. ఇది బ్రేకింగ్ పనితీరును తగ్గిస్తుంది, దీని వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి కంపెనీ రీకాల్ ప్రకటించింది.కంపెనీ వాహనాలను వినియోగిస్తున్న కస్టమర్లకు అక్టోబర్ 28న మెయిల్ ద్వారా సమాచారం అందించనున్నట్లు కంపెనీ పేర్కొంది. అయితే ఈ సమస్యను కంపెనీ ఉచితంగా పరిష్కరిస్తుంది. దీనికోసం డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. -
General Motors: 1,245 ఉద్యోగాల తొలగింపును రద్దు చేసిన ప్రఖ్యాత సంస్థ
అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధభయాలు, అనిశ్చితి వాతావరణంలో కంపెనీలు తమ ఖర్చులు తగ్గించుకుంటున్నాయి. ప్రధానంగా ఉద్యోగుల జీతభత్యాలు కంపెనీలకు భారంగా మారుతున్నాయి. ఫలితంగా ఉద్యోగాలు తొలగిస్తున్నాయి. కానీ అందుకు భిన్నంగా జనరల్ మోటార్స్ సంస్థ 1245 ఉద్యోగాల తొలగింపును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. బ్రెజిల్ దేశంలోని సావో పాలో రాష్ట్రంలో ఉన్న సావో జోస్ డోస్ క్యాంపస్, సావో కేటానో డో సుల్, మోగి దాస్ క్రూజెస్లోని ఫ్యాక్టరీల్లో జనరల్ మోటార్స్ 1,245 ఉద్యోగుల తొలగింపును రద్దు చేయనున్నట్లు అక్కడి కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తున్న యూనియన్ ఇటీవల తెలిపింది. ముందుగా కంపెనీ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే అందుకు విరుద్ధంగా కార్మికులు బ్రెజిలియన్ లేబర్ కోర్టును ఆశ్రయించారు. దాంతో ఉద్యోగుల తొలగింపును కొనసాగించడానికి అనుమతి కోసం సంస్థ సైతం కోర్టుకెళ్లింది. ఇరుపక్షాల వాదనలు విచారించిన కోర్టు..కంపెనీ అభ్యర్థనను తిరస్కరించింది. దాంతో మరుసటి రోజు జనరల్‌మోటార్స్ ఈ ప్రకటన చేసింది. ఇదీ చదవండి: ఎలాన్‌మస్క్ కుమారుడికి ఇండియన్ సైంటిస్ట్ పేరు జనరల్ మోటార్స్ అమెరికాకు చెందిన వాహన తయారీ సంస్థ. కంపెనీ ప్రధాన కార్యాలయం అమెరికాలోని మిచిగాన్‌లో ఉంది. జనరల్ మోటార్స్ చెవ్రొలెట్, జీఎంసీ, కాడిలాక్, బ్యూక్ తో సహా పలు ప్రసిద్ధ ఆటోమొబైల్ బ్రాండ్లను తయారుచేస్తుంది. 2022 నాటికి జనరల్ మోటార్స్‌లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,67,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2016లో కంపెనీ ఉద్యోగులు 2,25,000 మంది ఉండేవారు. -
హ్యుందాయ్ చేతికి జనరల్ మోటార్స్ ప్లాంట్.. కొత్త ప్లాన్ ఏంటంటే?
ప్రముఖ అమెరికన్ కార్ల తయారీ సంస్థ 'జనరల్ మోటార్స్' భారతదేశంలోని తన తాలెగావ్ ప్లాంట్ సౌత్ కొరియా దిగ్గజం 'హ్యుందాయ్ ఇండియా' చేతికి అందించినట్లు సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం హ్యుందాయ్ కంపెనీ మహారాష్ట్రలోని జనరల్ మోటార్ యూనిట్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ డీల్ విలువ ఎంత అనేదానికి సంబంధించిన వివరాలు అధికారికంగా వెలువడలేదు. దేశంలో అత్యధిక కార్లను విక్రయిస్తున్న సంస్థల జాబితాలో ఒకటైన హ్యుందాయ్ తన ఉనికిని మరింత విస్తరించడానికి ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. 2025 నుంచి ఉత్పత్తి.. హ్యుందాయ్ కంపెనీ ఈ కొత్త ప్లాంట్‌లో 2025 నుంచి ఉత్పత్తి ప్రారంభించే అవకాశం ఉంది. ఇప్పటికే సంస్థ ఈ సంవత్సరం ప్రారంభంలో తమిళనాడులో ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ఏకంగా రూ. 20వేలకోట్లు పెట్టుబడికి ఒప్పందం కుదుర్చుకుంది. ఇక తాలెగావ్ కొత్త ప్లాంట్‌లో ఏడాదికి 10 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఇదీ చదవండి: అందులోని వాహనాల ఖరీదే వేలకోట్లు.. ఆ ప్యాలెస్ గురించి తెలిస్తే షాకవుతారు! భారతదేశంలో జనరల్ మోటార్స్ అమ్మకాలు రోజురోజుకి తగ్గుముఖం పడుతుండటంతో త్వరలో ఇండియాను వదిలేసే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. కాగా ఇప్పుడు మహారాష్ట్ర ప్లాంట్ వదులుకోవడంతో ఆ నమ్మకం మరింత బలపడింది. ఇప్పటికే ఫోర్డ్ కంపెనీ కూడా మన దేశంలో ఉత్పత్తిని నిలిపివేసిన సంగతి తెలిసిందే. -
ఎలాన్ మస్క్‌కు షాక్.. ట్విట్టర్లో యాడ్స్ బంద్!
అమెరికాకు చెందిన జనరల్ మోటార్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ట్విట్టర్లో ప్రకటనలు ఇవ్వబోమని శుక్రవారం వెల్లడించింది. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన కొద్ది గంటలకే ఈ నిర్ణయం ప్రకటించడం గమనార్హం. అయితే ట్విట్టర్లో తమ కస్టమర్లతో మాత్ర యథావిధిగా ఇంటరాక్ట్ అవుతామని జనరల్ మోటార్స్ స్పష్టం చేసింది. కొత్త యాజమాన్యంలో ట్విట్టర్ ఏ విధంగా ముందుకు వెళ్తుందో చూసి ప్రకటనలు ఇచ్చే విషయంపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని వివరించింది. ప్రత్యర్థి సంస్థ.. ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో నెం.1గా ఉన్న టెస్లాకు జనరల్ మోటార్స్ ప్రధాన ప్రత్యర్థి సంస్థ. ఎలాన్ మస్క్ తర్వాత విద్యుత్ వాహన రంగంలో వేల కోట్లు పెట్టుబడి పెట్టింది కూడా జనరల్ మోటార్సే కావడం గమనార్హం. టెస్లాకు మరో ప్రత్యర్థి అయిన ఫోర్డ్ మోటార్స్ కూడా ట్విట్టర్లో ప్రకటనలపై స్పందించింది. ఎలాన్ మస్క్-ట్విట్టర్ మధ్య డీల్‌కు ముందు కూడా తాము ఈ సామాజిక మాధ్యమంలో ప్రకటనలు ఇవ్వలేదని చెప్పింది. కొత్త యాజమాన్యం తీరును బట్టి ప్రకటనలపై నిర్ణయం ఉంటుందని చెప్పింది. అయితే కస్టమర్లతో మాత్రం ట్విట్టర్లో సంబంధాలు కొనసాగిస్తామని పేర్కొంది. రివియాన్, స్టెలాంటిస్, ఆల్ఫబెట్‌కు చెందిన వేమో సంస్థలు మాత్రం ట్విట్టర్లో ప్రకటనల నిలిపివేతపై ఇంకా స్పందించలేదు. మరో సంస్థ నికోలా మాత్రం ట్విట్టర్లో యథావిధిగా ప్రకటనలు కొనసాగిస్తామని స్పష్టం చేసింది. 44 బిలయన్ డాలర్లు వెచ్చింది ట్విట్టర్ కొనుగోలు ప్రక్రియను శుక్రవారం అధికారికంగా పూర్తి చేశారు ఎలాన్ మస్క్. అనంతరం పక్షికి స్వేచ్ఛ వచ్చిందని కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతాను కూడా పునరుద్ధరించే విషయంపై ఆలోచిస్తామని చెప్పారు. చదవండి: ట్విటర్ డీల్ డన్: మస్క్ తొలి రియాక్షన్ -
ఒమిక్రాన్ ఎఫెక్ట్..! మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం..! గూగుల్, ఫేస్బుక్, ఇంటెల్ బాటలోనే...
ప్రపంచదేశాలను కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఒమిక్రాన్ దెబ్బకు కేసులు గణనీయంగా పెరగడంతో ఆయా దేశాలు లాక్ డౌన్‌ను విధించే ఆలోచనలో ఉన్నాయి. కాగా ఒమిక్రాన్ ప్రభావం దిగ్గజ టెక్ కంపెనీలపై కూడా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గూగుల్, ఫేస్బుక్, ఇంటెల్ బాటలోనే..! 2022 జనవరి అమెరికా లాస్‌వెగాస్‌లో జరిగే టెక్ కాన్ఫరెన్స్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. దిగ్గజ టెక్ కంపెనీలు గూగుల్, ఫేస్బుక్, ఇంటెల్ ఇప్పటికే పాల్గొనకూడదని నిర్ణయించుకున్నాయి. వారి బాటలోనే మైక్రోసాఫ్ట్ కూడా పయనిస్తోంది. సీఈఎస్-2022 షోలో పాల్గొనట్లేదని మైక్రోసాఫ్ట్ ఒక ప్రకటనలో వెల్లడించింది. అంతేకాకుండా తాత్కలికంగా టెక్ కాన్ఫరెన్స్‌ను వాయిదా వేయాలని మైక్రోసాఫ్ట్ సూచించింది. లాస్ వెగాస్‌లో జనవరి 5,6,7,8 తేదీల్లో కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో జరగనుంది. 40కు పైగా కంపెనీలు లెనొవొ, టీ-మొబైల్స్, ఏటీ అండ్ టీ, మెటా, ట్విటర్, అమెజాన్, టిక్‌టాక్, పింట్రెస్ట్, ఆల్ఫాబెట్‌కు చెందిన వేమో వంటి 40కి పైగా బడా టెక్ కంపెనీలు ఎలక్ట్రానిక్స్ సదస్సుకు హాజరు కావాల్సి ఉండగా....వీరు కూడా సీఈఎస్-2022 షోలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నాయి. ఈ షోలో సుమారు 2200 కంటే ఎక్కువ టెక్ కంపెనీలు పాల్గొనున్నాయి. అంతర్జాతీయ సదస్సులు వాయిదా..! అంతర్జాతీయంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలపై తన ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. వచ్చే ఏడాది జనవరి 17 నుంచి 21వ తేదీ వరకూ ఐదు రోజులు జరగాల్సిన దావోస్ 2022 వార్షిక సమావేశాన్ని వేసవి కాలానికి వాయిదా వేస్తున్నట్లు వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఇప్పటికే తెలిపింది.కాగా మరోవైపు ఒమిక్రాన్ అలజడితో జెనీవాలో జరగాల్సిన డబ్య్లూటీవో మినిస్టీరియల్ (ఎంసీ12) కూడా వాయిదా పడింది. చదవండి: చెప్పినట్లే చేశాడు..అన్నింటీని అమ్మేసిన ఎలన్ మస్క్..! -
ఎలక్ట్రిక్ వెహికల్ చరిత్రను మార్చిన టెస్లా
ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల చూస్తే.. సామాన్యుడు బయటకి వెళ్లాలంటే బయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెట్రోల్, డీజిల్ ధరల ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇలాంటి సందర్భంలో ఎలక్ట్రిక్ వాహన కంపెనీలు తమకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నాయి. నిన్న, మొన్న మొన్నటి వరకు ఎలక్ట్రిక్ వాహనాలు అంటే.. అమ్మో అనే ప్రజలు నేడు వాటి కొనుగోళ్లవైపు ఆసక్తి కనబరుస్తున్నారు. అలాగే, కాలం కలిసి రావడం వల్ల ఎలక్ట్రిక్ వాహన ధరలు కూడా భారీగా తగ్గుతున్నాయి. అయితే, చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలు గత 10 ఏళ్ల నుంచి మాత్రమే అందుబాటులో ఉన్నాయి అనుకుంటున్నారు. అలా అనుకుంటే పొరపాటే!. వీటికి ఒక చరిత్ర ఉంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహన చరిత్ర గురుంచి తెలుసుకుందాం. ఎలక్ట్రిక్ వాహనాల చరిత్ర మొదటి సారిగా 1830లో ప్రారంభమైంది. ఎలక్ట్రిక్ వాహనంలో గ్యాసోలిన్-శక్తితో పనిచేసే మోటారు కాకుండా ప్రొపల్షన్ కోసం ఎలక్ట్రిక్ మోటారును ఉపయోగిస్తారు. ఎలక్ట్రిక్ కారుతో పాటు, బైక్‌లు, మోటారు సైకిళ్ళు, పడవలు, విమానాలు, రైళ్లు అన్నీ విద్యుత్తుతో నడిచే అవకాశం ఉంది. ప్రస్తుతం నడుస్తున్నాయి కూడా... ఎలక్ట్రిక్ వెహికల్ ప్రారంభం 1828లో హంగేరియన్ అన్యోస్ జెడ్లిక్ అతను ఎలక్ట్రిక్ మోటారుతో నడిచే చిన్న తరహా మోడల్ కారును కనుగొన్నాడు. సుమారు 1832లో రాబర్ట్ ఆండర్సన్ మొదటి క్రూడ్ ఎలక్ట్రిక్ వాహనాన్ని అభివృద్ధి చేస్తాడు. 1835లో మరొక చిన్న-తరహా ఎలక్ట్రిక్ కారును హాలండ్‌లోని గ్రోనింగెన్‌కు చెందిన ప్రొఫెసర్ స్ట్రాటింగ్, అతని సహాయకుడు క్రిస్టోఫర్ బెకర్ కలిసి రూపొందించారు. 1835లో వెర్మోంట్లోని బ్రాండన్ కు చెందిన కమ్మరి థామస్ డావెన్‌పోర్ట్ ఒక చిన్న తరహా ఎలక్ట్రిక్ కారును నిర్మించాడు.(చదవండి: Starlink: శాటిలైట్ ఇంటర్నెట్పై అసహనం) 1842లో థామస్ డేవెన్పోర్ట్, స్కాట్స్ మాన్ రాబర్ట్ డేవిడ్సన్ ఇద్దరూ కలిసి ఒక ఎలక్ట్రిక్ వాహనాన్ని విజయవంతంగా తయారు చేశారు. కానీ, దీనిని చార్జ్ చేయాలంటే కొంచెం కష్టం అయ్యేది. ఫ్రెంచ్ వ్యక్తి గాస్టన్ ప్లాంటే 1865లో ఒక మంచి బ్యాటరీని కనుగొన్నాడు. దానిలో సమస్యలు రావడంతో అతని తోటి దేశస్థులు కామిల్లె ఫౌర్ 1881లో ఎలక్ట్రిక్ శక్తిని నిల్వ ఉంచుకునే బ్యాటరీని మరింత మెరుగుపరిచారు. ఎలక్ట్రిక్ వాహనాలు నడవాలంటే ముఖ్యంగా బ్యాటరీ అవసరం. 1899లో బెల్జియంలో నిర్మించిన ఎలక్ట్రిక్ రేసింగ్ కారు 68 మైలు వేగంతో వెళ్లి ప్రపంచ రికార్డు సృష్టించింది. దీనిని కామిల్లె జెనాట్జీ రూపొందించారు. 1900-1920 ఎలక్ట్రిక్ కార్లను ఉదయం ప్రారంభించడానికి చాలా సమయం పట్టేది. తర్వాత ఫోర్డ్ ఒక చౌకగ్యాస్ కారుని తయారు చేసింది. ఫోర్డ్ మోటార్ కంపెనీ మోడల్ టి పేరుతో పరిచయం చేసింది. అప్పట్లో ఇది చాలా ఉపయోగపడినప్పటికి అనుకున్నంత రాణించలేక పోయింది.జనరల్ మోటార్స్ కాడిలాక్ టూరింగ్ ఎడిషన్ కింద ఎలక్ట్రిక్ వాహనాన్ని పరిచయం చేస్తుంది. తర్వాత దశాబ్దాలలో గ్యాసోలిన్, డీజిల్ కార్ల జోరు పెరడంతో ఎలక్ట్రిక్ కార్లు కొద్ది కాలం పాటు కనుమరుగు అయ్యాయి. ఎలక్ట్రిక్ కార్ల పరిమిత డ్రైవింగ్ రేంజ్, ఎక్కువ ఛార్జింగ్ సమయం, భారీ బ్యాటరీల వల్ల నిలదొక్కుకోలేక పోయింది.(చదవండి: నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ 'స్క్విడ్ గేమ్' మరో రికార్డు) 1961-1970 ప్రధాన ఆటోమేకర్లు ఎలక్ట్రిక్ కార్ల తయారిని అపలేదు. బ్యాటరీలతో రన్ చేయడానికి జనరల్ మోటార్స్ ప్రయోగాలు చేసింది. అమెరికన్ మోటార్స్ కార్పొరేషన్ అమిట్రాన్ అనే ప్రోటోటైప్ ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. కేవలం కొన్ని సంవత్సరాలలో అమిత్రాన్ ను అమ్మకానికి తీసుకొని రావాలని యోచిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. కానీ అలా, జరగలేదు.(చదవండి: మహీంద్రా థార్‌కు పోటీగా మారుతి నుంచి అదిరిపోయే కార్...!) 1971 -1980 ఆ తర్వాత ఫ్లోరిడాలోని సెబ్రింగ్-వాన్ గార్డ్ కంపెనీ సిటీకార్ పరిచయం చేసింది. ఇది కొన్ని సంవత్సరాలలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగా మారింది. చివరికి 4,400 కంటే ఎక్కువ కార్లు అమ్ముడయ్యాయి. సిటీకార్ టాప్ స్పీడ్ గంటకు 38 మైళ్లు. కానీ, ఆ తర్వాత ఈవీ కూడా కనుమరుగు అయ్యాయి. లిథియం-అయాన్ బ్యాటరీ గుండె అయిన కోబాల్ట్-ఆక్సైడ్ క్యాథోడ్ ను జాన్ గుడ్ ఎనౌన్, అతని సహచరులు ఆక్స్ ఫర్డ్ విశ్వ విద్యాలయంలో కనుగొన్నారు. రాబోయే దశాబ్దాల్లో, ఈ ఆవిష్కరణ ద్వారా సాధ్యమైన బ్యాటరీల వస్తాయి అని పేర్కొన్నారు. 2019లో గుడ్ ఎనౌన్, మరో ఇద్దరు పరిశోధకులకు లిథియం-అయాన్ బ్యాటరీలను అభివృద్ధి చేసినందుకు నోబెల్ బహుమతి లభించింది. 2000-2010 2003లో స్థాపించబడిన టెస్లా మోటార్స్ కంపెనీ మొదటి కారు టెస్లా రోడ్ స్టర్ రహదారి మీదకు రావడంతో ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ఇది రెండు సీట్ల స్పోర్ట్స్ కారు. దీని ధర $80,000 కంటే ఎక్కువ. ఇది ఒకసారి చార్జ్ చేస్తే 200 మైళ్ల కంటే ఎక్కువ వెళ్ళగలదు. దీనిలో లిథియం-అయాన్ బ్యాటరీలను ఉపయోగించారు. ఇక ఆ తర్వాత నుంచి అనేక కంపెనీలు ఎలక్ట్రిక్ కార్ల తయారీ వైపు మొగ్గు చూపాయి. ఇప్పుడు ప్రస్తుతం మనదేశంలో టాటా మోటార్స్, హ్యూందాయి, టెస్లా, ఎంజి మోటార్స్ ఎలక్ట్రిక్ కార్లను తీసుకొనివస్తున్నాయి. -
5 ఆటోమొబైల్ కంపెనీల దెబ్బకి నిరుద్యోగులుగా 64,000 మంది
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన నాన్నకు ప్రేమతో సినిమాలో పేర్కొన్నట్లుగా ఎక్కడో జరిగిన ఒక చర్య వల్ల ప్రస్తుతం జరుగుతున్న పని మీద ప్రభావం పడుతుంది. అలాగే, జీవితంలో మనం తీసుకునే కొన్ని నిర్ణయాలు వెంటనే కాకపోయిన ఆ తర్వాత ఎంతో కొంత ప్రభావం చూపుతాయి. ఇప్పుడు అదే పరిస్థితి ఆటోమొబైల్ రంగంలో జరుగుతున్నట్లు కనిపిస్తుంది. గత ఐదేళ్లలో భారతదేశం విడిచివెళ్లిపోతున్న సంఖ్య రోజు రోజుకి పెరిగి పోతుంది. దేశం విడిచిపోతున్న విదేశీ ఆటో మొబైల్ కంపెనీల వల్ల సుమారు 64,00 మంది ఉద్యోగం కోల్పోయినట్లు, రూ.2,485 కోట్ల నష్టం డీలర్లకు వాటిల్లినట్లు ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్ అసోసియేషన్(ఎఫ్ఎడీఎ) భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖతో పంచుకున్న డేటాలో వెల్లడించింది. ఆరు ప్రధాన ఆటోమోటివ్ కంపెనీలు బ్రాండ్లు అయిన ఫోర్డ్, జనరల్ మోటార్స్, మ్యాన్ ట్రక్స్, ఫీయట్, హార్లే డేవిడ్సన్, యుఎం మోటార్ సైకిల్స్ వంటి అనేక దిగ్గజ విదేశీ వాహన కంపెనీలు 2017 నుంచి భారతదేశంలో అమ్మకాలను నిలిపివేశాయి. ఈ నిర్ణయం వల్ల 464 మందికి పైగా డీలర్లు ప్రభావితం అయ్యారు. ఎఫ్ఎడీఎ అధ్యక్షుడు వింకేష్ గులాటి మాట్లాడుతూ.. "ఈ ఎంఎన్సీల ఆకస్మికంగా వెళ్ళిపోవడం మొత్తం ఆటో రిటైల్ పరిశ్రమకు చాలా బాధను కలిగిస్తాయి. వినియోగదారుల నుంచి సరైన మద్దతు లేకుండా వ్యాపారం చేయడం కష్టం. కానీ, దిగ్గజ కంపెనీలు తీసుకునే నిర్ణయం భారీ పెట్టుబడులతో ఈ రంగంలోనికి ప్రవేశించాలి అనుకునే స్టార్టప్ కంపెనీల ఉత్సాహాన్ని దెబ్బతీస్తుంది" అని ఆగస్టులో జరిగిన ఎఫ్ఎడీఎ మూడవ ఆటో రిటైల్ సమావేశానికి హాజరైన భారీ పరిశ్రమల మంత్రి మహేంద్ర నాథ్ పాండేను ఉద్దేశించి ప్రస్తావించారు. ఫోర్డ్ ఇండియా అనేక సంవత్సరాలుగా నిలుదొక్కుకునేందుకు ప్రయత్నించిన తర్వాత ఫోర్డ్ ఇండియా సెప్టెంబర్ 9, 2021న నిష్క్రమించింది. భారత్‌లో ఫోర్డ్ కంపెనీ కార్ల ప్లాంట్లను మూసివేస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో స్వంత ఉద్యోగులలో 4,000 మందికి పైగా రెండు తయారీ ప్లాంట్లలో పనిచేస్తున్నారు. ఫోర్డ్ తీసుకున్న నిర్ణయం వల్ల వారు నిరుద్యోగులుగా మారనున్నారు. భారత్‌లో కార్యకలాపాలు నిలిపివేస్తున్న నేపథ్యంలో తమ పరిహారంపై స్పష్టతనివ్వాలని దేశీ ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య ఎఫ్ఏడీఏ డిమాండ్ చేసింది. ఫోర్డ్ ఇండియా ఎండీ అనురాగ్ మెహ్రోత్రాకు ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ వింకేష్ గులాటీ ఈ మేరకు లేఖ రాశారు. (చదవండి: విద్యార్థులకు గుడ్‌న్యూస్ అందించిన మైక్రోసాఫ్ట్...!) -
బడాబడా కంపెనీలు భారత్ వీడిపోవడానికి కారణం ఇదేనా..!
ప్రముఖ అమెరికా ఆటో మొబైల్ దిగ్గజం ఫోర్డ్ భారత్‌లో తన ఉత్పత్తి నిలిపివేస్తు కీలక నిర్ణయం తీసుకున్న నిర్ణయం తెలిసిందే. గత నాలుగు సంవత్సరాలు క్రితం 2017లో జనరల్‌మోటార్స్ కూడా భారత్‌ను వీడింది. పలు విదేశీ కంపెనీలు తట్టబుట్టా సర్దుకుని భారత్‌ను వీడుతున్నాయి. ఒక్కసారిగా భారత్‌ను వీడటంతో ఆయా కంపెనీల డీలర్లపై భారీ ప్రభావం పడనుంది. అంతేకాకుండా కంపెనీల ఉద్యోగుల జీవితాలు ఆగమ్యాగోచరం కానుంది.. హ్యూందాయ్ మినహా మిగిలిన విదేశీ ఆటోమొబైల్ కంపెనీలు భారత్ ఆటోమొబైల్ రంగంలో కేవలం ఆరుశాతం వాటాను మాత్రమే కల్గిఉన్నాయి. భారత మార్కెట్లో ఫోర్డ్ 2 శాతం కంటే తక్కువ , ఫోక్స్‌వ్యాగన్ ఒక శాతం మేర మాత్రమే వాటాలను కల్గి ఉంది. ప్రపంచమార్కెట్లో అత్యంత విజయంతమైన టయోటా కూడా భారత్‌లో కేవలం 3 శాతం వాటానే కల్గి ఉంది. చదవండి: సెడాన్ అమ్మకాల్లో ఆ కారుదే అగ్రస్థానం పన్నుల భారమే కారణమా..! అధిక పన్నుల భారం వలనే పలు విదేశీ కంపెనీలు భారత్ నుంచి బయటకు వెళ్తున్నట్లు బిజినెస్ స్టాండర్ట్ లిమిటెడ్ చైర్మన్ టీఎన్ టీనన్ అభిప్రాయపడ్డారు. టయోటా గతంలో భారీ పన్నుల భారం విషయంపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. టయోటా భారత మార్కెట్ల నుంచి ఎటియోస్, కరోలా ఆల్టిస్ మోడళ్లను నిలిపివేసింది. విదేశీ ఆటోమొబైల్ దిగ్గజాలు భారత మార్కెట్లో సుస్థిర స్థానాలను నిలుపుకోవడానికి ఎంతగా ప్రయత్నించిన పలు కంపెనీలు నిలవలేకపోయాయి. కొద్ది రోజుల ప్రముఖ దిగ్గజ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ భారత్‌లోకి వచ్చేందుకు దిగుమతి సుంకాలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాలను విన్నవించిన విషయం తెలిసిందే. విదేశీ కార్లపై ట్యాక్స్ విషయంలో టెస్లా, హ్యుందాయ్, బెంజ్, ఫోక్స్‌వ్యాగన్ కంపెనీలు కేంద్రానికి విజ్ఞప్తులు చేశాయి. విదేశీ కంపెనీల కార్లపై ప్రభుత్వం సుమారు 100 శాతం మేర ట్యాక్స్‌లను వసూలు చేస్తోంది. భారత్‌లో వాటికే ఎక్కువ ప్రాధాన్యం..! భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కొనుగోలుదారులు ఎక్కువగా తక్కువ ఖర్చుతో నడిచే తక్కువ ధర కలిగిన కార్లపై ఎక్కువ మోజు చూపుతారు. తక్కువ ఖర్చుతో వచ్చే వాహనాలు విదేశీ కంపెనీల దగ్గర సరిపోయే మోడల్స్ లేవు. భారత మార్కెట్లో మారుతి, హ్యుందాయ్ మాత్రమే విజయవంతమైన ప్రవేశ-స్థాయి కార్ మోడళ్లను కలిగి ఉన్నాయి. ఫోర్డ్, టయోటా , ఫోక్స్‌వ్యాగన్, వంటి కంపెనీల నుంచి భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన మారుతి ఆల్టోతో పోటీ పడే కార్లు ఆయా విదేశీ ఆటోమొబైల్ కంపెనీల వద్ద లేవు. మారుతి ఆల్టో ఎంట్రీ లెవల్ మార్కెట్లో రూ.3 లక్షల నుంచి కొనుగోలుదారులకు అందుబాటులో ఉంది. ఇంతా తక్కువ ఖర్చులో భారత వాహన ప్రియులకు తయారుచేయడం బడాబడా కంపెనీలకు అంతగా తెలియదు. హ్యూందాయ్ లాంటి కంపెనీలు భారత ప్రజలకు తగ్గట్టుగా బహిరంగ మార్కెట్లోకి వాహనాలను తీసుకురావడంతో తన స్థానాన్ని పదిలంగా నిలుపుకుంటుంది. వాహన కొనుగోలు దారుల కొనుగోలు స్థాయి గణనీయంగా పెరిగింది. దీంతో చాలా మంది కొనుగోలుదారులు మారుతి 800సీసీ కారు నుంచి రూ. 6 లక్షల నుంచి 10 లక్షల మధ్య వచ్చే కార్లను కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యారు. హ్యుందాయ్ నుంచి ఐ20, సుజుకి నుంచి స్విఫ్ట్ బాలెనో, టాటా మోటార్స్ కు చెందిన టియాగో, ఆల్ట్రోజ్ వంటి కార్లపై ఎక్కువగా ఆదరణను పొందాయి. చదవండి : Ford: ప్లీజ్ మమ్మల్ని వదిలేసి వెళ్లొద్దు! -
భారత్‌కు గుడ్‌బై చెప్పిన మరో దిగ్గజ కంపెనీ..!
అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ మోటార్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో ఫోర్డ్ కంపెనీ కార్ల ప్లాంట్లను మూసివేస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో భారత్‌లో ఫోర్డ్ కంపెనీ కార్ల ఉత్పత్తి నిలిచిపోనుంది. సనంద్, చెన్నై నగరాల్లోని ప్లాంట్లను ఫోర్డ్ మూసివేయనుంది. కంపెనీకి భారీ నష్టాలు, బహిరంగ మార్కెట్లో వృద్ధి లేకపోవడంతో ఫోర్డ్ మోటార్ కంపెనీ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: India’s First Electric Vehicle : భారత తొలి ఎలక్ట్రిక్ కారు ఇదేనండోయ్..! లాభాలకంటే నష్టాలే ఎక్కువ..! 2021 నాల్గవ త్రైమాసికం నాటికి గుజరాత్‌లోని సనంద్‌లో వాహనాల తయారీని, 2022 రెండవ త్రైమాసికానికి చెన్నైలో వాహన ఇంజిన్ తయారీని ఫోర్డ్ నిలిపివేస్తుందని ఫోర్డ్ ఒక ప్రకటనలో తెలిపింది. జీఎమ్ మోటార్స్ తరువాత భారత్ నుంచి వైదొలుగుతున్న రెండో కంపెనీగా ఫోర్డ్ నిలిచింది. 2017లో జనరల్ మోటార్స్ భారత్‌లో కార్ల అమ్మకాలను నిలిపివేసింది. గత 10 సంవత్సరాలలో 2 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా నిర్వహణ నష్టాలను ఫోర్డ్ చవిచూసింది. భారత్‌లో స్థిరమైన లాభదాయకమైన వ్యాపారాన్ని సృష్టించడానికి పునర్నిర్మాణ చర్యలు తీసుకున్న పెద్ద ఉపయోగం లేకుండా పోయింది. తాజాగా ఫోర్డ్ తీసుకున్న నిర్ణయం కంపెనీలో పనిచేసే 4 వేల మంది ఉద్యోగుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారనుంది. కోవిడ్ -19 లాక్డౌన్, డేటెడ్ ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోతో ఫోర్డ్ మరింత నష్టపోతున్న స్థానిక సంస్థగా తయారైంది. జులై నాటికి, సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) షేర్ చేసిన డేటా ప్రకారం ఫోర్డ్ రెండు ప్లాంట్లలో ఉన్న 450,000 యూనిట్ల ఇన్స్టాల్ చేయబడిన సామర్థ్యంలో కేవలం 20 శాతం యూనిట్లను మాత్రమే ఆపరేట్ చేస్తోన్నట్లు తెలుస్తోంది. ఫోర్డ్ ఇప్పటివరకు భారత్‌లో సుమారు రెండు బిలియన్ డాలర్లపైగా పెట్టుబడి పెట్టింది. 350 ఎకరాల చెన్నై ప్లాంట్ సంవత్సరానికి 200,000 యూనిట్లు, 340,000 ఇంజిన్ల వాహన తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. సనంద్ ప్లాంట్ 460 ఎకరాలలో విస్తరించి ఉండగా, సంవత్సరానికి 240,000 యూనిట్లు, 270,000 ఇంజిన్ల వాహన తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఫోర్డ్ మోటార్ కంపెనీ 1.57 శాతం మార్కెట్ వాటాతో, భారత అతిపెద్ద కార్ల తయారీదారుల జాబితాలో ఫోర్డ్ తొమ్మిదవ స్థానంలో నిలిచింది. ఫోర్డ్ ఫిగో, ఆస్పైర్, ఫ్రీస్టైల్, ఎకోస్పోర్ట్, ఎండీవర్ భారత్‌లో ఐదు మోడళ్లను విక్రయిస్తుంది చదవండి: BMW i Vision AMBY : ది సూపర్ ఎలక్ట్రిక్ సైకిల్..! రేంజ్ తెలిస్తే షాక్..! -
ట్రాఫిక్‌కు చెక్: ఫ్లైయింగ్ కార్లు వచ్చేస్తున్నాయ్!
హ్యుందాయ్ మోటార్స్, జనరల్ మోటార్స్ సంయుక్తంగా ఫ్లైయింగ్ కార్లపై దృష్టిసారించాయి. వీరి భాగస్వామ్యంతో ఫ్లైయింగ్ కార్ల ఉత్పత్తి మరింత వేగం పుంజుకోనుంది. 2025లోపు ఎయిర్ టాక్సీలను మొదలు పెట్టాలని ఇరు కంపెనీలు ఆశాభావం వ్యక్తం చేశాయి. ఫైయింగ్ కార్లలో భాగంగా హ్యుందాయ్ ఎస్-ఏ1 ఎయిర్ టాక్సీలను సీఈఎస్-2020 కాన్ఫరెన్స్‌లో ఇప్పటికే రిలీజ్ చేయగా, జనరల్ మోటార్స్ 2021 జనవరిలో ఫైయింగ్ కాడిలాక్ కాన్సెప్ట్‌ను రిలీజ్ చేసింది. కాగా ఈ ఫ్లైయింగ్ కార్లు హైబ్రిడ్ ఇంజన్ కాన్సెప్ట్‌తో పనిచేయనున్నాయి. ఫ్లైయింగ్ కార్ల రాకతో ట్రాఫిక్ జామ్స్‌కు చెక్‌పెట్టవచ్చునని ఇరు కంపెనీలు భావిస్తున్నాయి. ఎయిర్ టాక్సీల రాకతో వాయు ప్రయాణాల మార్కెట్ విలువ 2040 వరకు సుమారు ఒక ట్రిలియన్ (రూ. 73 లక్షల 28 వేల 450 కోట్లు)కు చేరగా, అదే 2050 సంవత్సరానికి తొమ్మిది ట్రిలియన్లకు చేరుకుంటుందని ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ తెలిపింది. కాగా ఫ్లైయింగ్ కార్లపై ఇప్పటికే ప్రముఖ స్టార్టప్ కంపెనీలతోపాటు, దిగ్గజ ఆటోమోబైల్ కంపెనీలు టయోటా మోటార్, డైమ్లెర్ ఏజీ, చైనాకు చెందిన గీలీ మోటార్ కంపెనీలు దృష్టిసారించాయి. చదవండి : Huwaie: వాహనాల తయారీ కాదు.. ఏకంగా డ్రైవర్‌లెస్ కార్! -
దిగ్గజ కంపెనీ తొలి సీఎఫ్‌వోగా దివ్య రికార్డు
భారత సంతతికి చెందిన మహిళ ప్రపంచ ఆటో దిగ్గజ కంపెనీలో కీలక అధికారిగా ఎంపికయ్యారు. చెన్నైలో జన్మించిన దివ్య సూర్యదేవర (39) అతిపెద్ద వాహన సంస్థ జనరల్ మోటార్స్ కు సీఎఫ్‌వోగా నియమితులయ్యారు. చక్ స్టీవెన్స్ స్థానంలో దివ్య ఈ పదవికి ఎంపికయ్యారు. సెప్టెంబర్ నుంచి దివ్య సీఎఫ్‌వోగా పదవీ బాధ్యతలను స్వీకరించనున్నారని జనరల్స్ మోటార్స్ వెల్లడించింది. గత అనేక సంవత్సరాలుగా అనేక కీలక పాత్రల్లో దివ్య అనుభవం, నాయకత్వం కారణంగా ఆర్ధిక కార్యకలాపాల్లో అంతటా దృఢమైన వ్యాపారాన్ని నిర్మించుకున్నామని బార్రా ఒక ప్రకటనలో తెలిపారు. 2014 నుంచి జీఎంకు సీఈవోగా మేరీ బర్రా (59)కు దివ్య రిపోర్ట్ చేయనున్నారు. దీంతో ప్రపంచంలోనే ఆటో పరిశ్రమలో అత్యున్నత పదవులను స్వీకరించిన తొలి మహిళలుగా సీఎఫ్‌వో దివ్య , సీఈవో మేరీ రికార్డు సృష్టించారు. ఇంతవరకు ఏ ఆటో కంపెనీలో సీఈవో, సీఎఫ్‌వో పదవులను మహిళలు స్వీకరించలేదు. కాగా మద్రాసు యూనివర్శిటీ నుంచి కామర్స్‌లో మాస్టర్స్ పట్టా పొందిన దివ్య , అమెరికా హార్వర్డ్ యూనివర్శిటీ ద్వారా ఎంబీఏ సాధించారు. అనంతరం ఛార్టర్డ్ ఫైనాన్షియల్ ఎనలిస్ట్ (సీఎఫ్ఏ) ధృవీకరణ పొందారు. 2005లో జనరల్ మెటార్స్ కంపెనీలో జాయిన్ అయిన దివ్య జూలై , 2017 నుంచి కార్పొరేట్ ఫైనాన్స్‌కు వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. -
జనరల్ మోటార్స్ వాహనాల భారీ రీకాల్
వాషింగ్టన్: అమెరికాకు చెందిన అతిపెద్ద ఆటో మేకర్ జనరల్ మోటార్స్ సంస్థ భారీ ఎత్తున వాహనాలను రీకాల్ చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 8లక్షల పికప్ ట్రక్కులను వెనక్కి తీసుకుంటోంది. నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ యంత్రంగా శుక్రవారం ఈ వివరాలను వెల్లడించింది. షెవర్లే సిల్వరాడో 1500, జీఎంసీ సియర్రా1500 పికప్ టక్కులను రీకాల్ చేస్తోంది. 2014 నాటి మోడల్ ట్రక్కులు షెవర్లే సిల్వరాడో 1500, జీఎంసీ సియర్రా1500 లలో తాత్కాలికంగా విద్యుత్ శక్తి స్టీరింగ్‌లో లోపాలు, ముఖ్యంగా తక్కువ వేగంతో ప్రయాణించే సమయంలో తాత్కాలిక సమస్యలు ఎదురవుతున్నాయని జనరల్ మోటార్స్ ప్రకటిచింది. అందుకే వీటిని రీకాల్ చేస్తున్నట్టు చెప్పింది. అమెరికాలో 6 లక్షల 90వేలు వాహనాలను, కెనడాలో 80వేలు వాహనాలతోపాటు ఇతర మార్కెట్లలో 25వేల వాహనాలను రీకాల్ చేస్తోంది. జీఎం డీలర్లు కొత్త సాఫ్ట్‌వేర్‌తో ఈ లోపాన్ని పరిష్కరించనున్నారని ప్రకటించింది. అయితే ప్రమాదాలు, గాయాలకు సంబంధింత తమ దగ్గర ఎలాంటి సమాచారం లేదని జీఎం ప్రతినిధి టామ్ వికిన్సన్ పేర్కొన్నారు. అయితే 2015 సం.రం మోడల్ వాహనాల్లో దీనికి సంబంధించి కొన్ని మార్పులను జోడించింది. -
జీఎంపై పోరుకు సై అన్న డీలర్లు
న్యూడిల్లీ: అమెరికన్ ఆటోమేకర్ జనరల్ మోటార్స్‌పై దేశవ్యాప్తంగా ఉన్న డీలర్లు పోరాటానికి దిగనున్నారు. ఏడాది చివరినాటికి భారతదేశంలో తమ వాహన విక్రయాలను నిలిపివేస్తున్నామన్న ప్రకటనతో జనరల్‌మోటార్స్ డీలర్లు ఆందోళన పడిపోయారు. కంపెనీ నిర్ణయానికి నిరసనగా మంగళవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించనున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న140 షోరూంలను నిర్వహిస్తున్న 96మంది డీలర్లు ఈ ధర్నాకు దిగనున్నారు. తమ మొత్తం పెట్టుబడులలో సుమారు 12 శాతం మాత్రమే నష్టపరిహారం చెల్లించడంతో అసంతృప్తిగా ఉన్న డీలర్లు నిరసనకు దిగుతున్నారు. ఇంతకుముందెన్నడూ లేని రీతిలో ఆటో మొబైల్ డీలర్లు తమ నిరసనను తెలపనున్నారు. దేశీయ మార్కెట్‌నుంచి అకస్మాత్తుగా వైదొలగడం తమను తీరని నష్టాల్లోకి నెట్టివేయడంతో ఈ నిర్ణయం తప్పలేదని భారతీయ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఫాడా) అధ్యక్షుడు జాన్ పాల్ కుట్టుకరణ్ చెప్పారు. దాదాపు 15 వేల ఉద్యోగాలను కోల్పోతున్నామని, సంబంధిత మంత్రుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లేందుకు డీలర్లు, ఇతర ఉద్యోగులుఈ ఆందోళన చేపట్టనున్నట్టు చెప్పారు. మరోవైపు జనరల్ మోటార్స్ రూపొందించిన షరతు ప్రకారం జులై 15లోపు కంపెనీ ప్రతిపాదనను ఆమోదించని డీలర్‌కు పరిహారం మొత్తంలో 50శాత మాత్రమే లభిస్తుంది. అలాగే 15 సెప్టెంబర్ నాటికి ఈ ప్రతిపాదనను ఆమోదించకపోతే, డీలర్‌కు ఎలాంటి నష్టపరిహారం లభించదు. కాగా స్థానికంగా ఉత్పత్తి చేయబడిన 10మోడళ్ల ద్వారా తయారీ కార్యకలాపాలను విస్తరించనున్నామని, తదుపరి ఐదు సంవత్సరాలలో పెంచడానికి భారతదేశంలో 1 బిలియన్ డాలర్ల పెట్టుబడిని 2015 ప్రకటించింది. అయితే దేశీయంగా డిమాండ్ క్షీణించడంతో స్తానిక విక్రయాలను నిలిపివేస్తున్నట్టు ఇటీవల (మే 18న) జనరల్ మోటార్స్ ప్రకటించింది. అలాగే ఇండియాలో కార్ల ఉత్పత్తిని మాత్రం నిలిపివేయడంలేదని స్పస్టం చేసింది. ఈ నేపథ్యంలోనే గుజరాత్‌లోని హలోల్ వద్ద మొదటి ప్లాంట్‌లో ఉత్పత్తిని నిలిపివేసింది. మహారాష్ట్రలోని ప్లాంట్‌నుంచి వాహనాల ఎగుమతిపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా షెవర్లే , బీట్ సెడాన్ కార్లను లాటిన్ అమెరికాకు ఎగుమతి చేయడాన్ని తాజాగా ప్రారంభించింది కూడా. , -
భారత్ లో ఇక ఆ కార్లను అమ్మరు!
-
భారత్ లో ఇక ఆ కార్లను అమ్మరు!
అమెరికన్ మల్టినేషనల్ కార్పొరేషన్ జనరల్ మోటార్స్ కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది చివరి నుంచి భారత్ లో జనరల్ మోటార్స్ కార్లను అమ్మకూడదని నిర్ణయించింది. ప్రపంచంలో అత్యంత పోటీతత్వ మార్కెట్లలో ఒకటైన భారత్ లో ఈ కంపెనీ ప్యాసెంజర్ కారు అమ్మకాలు ఒకశాతం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. ఇటు అమ్మకాలు పెంచుకోలేని జనరల్ మోటార్స్ భారత్ నుంచి నిష్క్రమించాలని నిర్ణయించింది. పునర్నిర్మాణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ తెలిపింది. విక్రయాలు ఆపివేసినా.. దేశీయంగా తయారీ కొనసాగిస్తామని కంపెనీ పేర్కొంది. ఇక్కడ తయారీని పెంచి, ఇతర దేశాల్లో ఈ కార్లను విక్రయించనుంది. భారత్ నుంచి ఎక్కువగా మెక్సికో, లాటిన్ అమెరికా దేశాలకు జనరల్ మోటార్స్ తన కార్లను ఎగుమతి చేస్తోంది. ఈ ఏడాది ఎగుమతులు రెట్టింపు చేయాలని జనరల్ మోటార్స్ నిర్దేశించుకుంది. కంపెనీకున్న టలేగావ్ ప్లాంట్ 130,000 వాహనాలను తయారుచేసే సామర్థ్యం కలిగి ఉంది. విక్రయాల నిలిపివేతతో భారత విక్రయ సంస్థ షెవ్రొలే ప్రైవేట్ లిమిటెడ్ ను కంపెనీ మూసివేయనుందని ఈ తయారీసంస్థ భారత అధినేత చెప్పారు. ఈ విషయంపై ఆయన ఇప్పటికే గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ కు వెళ్లి చర్చలు కూడా జరిపినట్టు తెలిసింది. భారత్ లో విక్రయాలను నిలిపివేయాలని తాము తీసుకున్న నిర్ణయం జీఎం ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ ప్రదర్శనను మరింత బలోపేతం చేసేందుకు ఓ కీలకమైన మైలురాయి వంటిదని జనరల్ మోటార్స్ వైస్ ప్రెసిడెంట్, జనరల్ మోటార్స్ ఇంటర్నేషనల్ అధినేత స్టీఫన్ జాకోబి తెలిపారు. -
ఈ కార్ల ధరలు పెరుగుతున్నాయ్!
న్యూఢిల్లీ: వరుసగా వాహన కంపెనీలు వాహనాల ధరలను పెంచేస్తున్నాయి. కార్ల దిగ్గజం జనరల్ మోటార్స్ ఇండియా తమ కార్ల ధరలను పెంచుతున్నట్టు మంగళవారం ప్రకటించింది. పెరిగిన ఇన్పుట్ ఖర్చులు, కరెన్సీ హెచ్చుతగ్గులు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ తెలిపింది. ప్రతికూల పరిస్థితుల ప్రభావంతో వచ్చే నెల 2017 జనవరి నుంచి తన వాహనాల ధరలను రూ.30,000 వరకు పెంచుతున్నట్లు తెలిపింది.. జనవరి 1, 2017 నుంచి 1-2 శాతం ధరలు పెరగనున్నాయని, ఇది ఉత్పత్తి మరియు వేరియంట్లపై ఆధారపడి ఉంటుందని జిఎం ఇండియా సేల్స్ వైస్ ప్రెసిడెంట్ హర్ దీప్ బ్రార్ ఒక ప్రకటనలో చెప్పారు. ముడి పదార్థం ధరల పెరుగుదలతో ఉత్పాదక వ్యయం గణనీయంగా పెరిగిందనీ, ఫారిన్ ఎక్స్ఛేంజ్ రేటు , అత్యధిక ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల కారణాల రీత్యా ధరలు పెంపు తప్పనిసరి అయిందన్నారు. కాగా దాదాపు అన్ని కంపెనీలు వచ్చే జనవరి నుంచి తమ వాహనాల ధరలను పెంచనున్నట్టు ఇటీవల ప్రకటించాయి. హ్యుందాయ్ మోటార్స్, టాటా మోటార్స్, టయోటా, నిస్సాన్, బెంజ్ సహా అనేక కంపెనీల కార్ల ధరలు పెరగనున్న సంగతి తెలిసిందే. -
జీఎం కార్ల ధరలు పెంపు
న్యూఢిల్లీ: జనరల్ మోటార్స్(జీఎం) ఇండియా తాజాగా వాహన ధరలను రూ.51,000 వరకు పెంచింది. బడ్జెట్లో లగ్జరీ ట్యాక్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్సు వడ్డింపే ధరల పెంపునకు కారణమని కంపెనీ తెలిపింది. మోడల్‌ను బట్టి ధరల పెంపు రూ.3,500-రూ.51,000 శ్రేణిలో ఉంటుందని పేర్కొంది. ధరల పెంపు తక్షణం అమలులోకి వస్తుందని తెలిపింది. -
లక్షన్నర షెవ్రోలె కార్లు వెనక్కి
ముంబై: ఒకటికాదు రెండు కాదు ఏకంగా 1.5 లక్షల షెవ్రోలె కార్లను వెనక్కి తీసుకుంటున్నట్లు జనరల్ మోటార్స్ సంస్థ సోమవారం ప్రకటించింది. 2007 నుంచి 2014 సంవత్సరాల మధ్య అమ్ముడయిన షెవ్రోలె స్పార్క్, షెవ్రోలె బీట్, షెవ్రోలె ఎంజాయ్ మోడళ్ల బ్యాటరీల్లో సాంకేతిక సమస్యలు ఉన్నట్లు గుర్తించినందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ పేర్కొంది. ఈ మేరకు కార్ల యజమానులకు ప్రత్యేకంగా లేఖలు రాసింది. ప్రస్తుతం ఆయా మోడళ్ల కార్లలో ఉన్న వైరింగ్తో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నట్లు గుర్తించామని, తగిన మార్పులను ఉచితంగా నిర్వహిస్తామని జనరల్ మోటార్స్ ఇండియా ప్రతినిధులు తెలిపారు. వాహనదారులు సమీపంలోని షెవ్రోలె షో రూమ్ లకు వెళితే రెండు గంటల వ్యవధిలో మరమ్మతు చేసి పంపుతామన్నారు. -
చిన్న కారు.. పెద్ద పోటీ
800 సీసీ విభాగంలో లీడర్ ఆల్టోనే ⇒ ఇయాన్‌తో సవాలు విసిరిన హ్యుందాయ్ ⇒ క్విడ్తో బరిలోకి దూసుకొచ్చిన రెనో ⇒ 2016లో నిస్సాన్ 800 సీసీ కారు ⇒ వరుసలో టాటా, జనరల్ మోటార్స్ కూడా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆల్టో.. మారుతి సుజుకి తయారు చేస్తున్న ఈ 800 సీసీ కారు ప్రత్యేకతేంటో తెలుసా? భారత్‌లో గత 10 ఏళ్లుగా టాప్ సెల్లింగ్ మోడల్. 2014-15లో అయితే ఏకంగా 2,64,492 ఆల్టో కార్లు అమ్ముడుపోయాయి. అంటే... ఏడాదికి దాదాపు 26 లక్షల కార్లు అమ్ముడుపోయే భారత మార్కెట్లో 10% వాటా ఈ ఒక్క బ్రాండ్‌దే. అంతకు ముందటి ఏడాదితో పోల్చినా ఇది 2.4% అధికం. మారుతికి ఉన్న బ్రాండ్ విలువకు ఈ కారు 800 సీసీ విభాగంలో ఉండడం ఇంతటి అమ్మకాలకు కారణమన్నది ఆటో రంగ నిపుణుల మాట. ఇంతటి ప్రాధాన్యమున్న 800 సీసీ విభాగంలో హ్యుందాయ్ సంస్థ ‘ఇయాన్’తో బరిలోకి దిగింది. విక్రయాల పరంగా దేశంలో 6వ స్థానంలో నిలిచిన ఈ మోడల్ అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరంలో 78,334 మేర నమోదయ్యాయి. ఈ మార్కెట్ అత్యంత ఆకర్షణీయంగా ఉండటంతో తామూ పోటీలో ఉన్నామంటూ మరిన్ని కంపెనీలు సిద్ధమవుతున్నాయి. సంచలనాలకు వేదిక.. ఎప్పటి నుంచో చిన్నకారు తెస్తామని వాగ్దానం చేస్తూ వచ్చిన రెనో... ఇటీవలే 800 సీసీ ‘క్విడ్’ను మార్కెట్లోకి తెచ్చి సందడి చేసింది. నిజానికి చిన్నకారు కోసం గతంలో నిస్సాన్‌తో జట్టుకట్టినా ఆ భాగస్వామ్యం ఫలవంతం కాలేదు. దీంతో బజాజ్‌తో కలసి చిన్నకారు తయారు చేసే ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే దాదాపు నమూనాను పూర్తి చేసిన బజాజ్... రెనో అధికారుల్ని ఆహ్వానించి దాన్ని చూపించింది. ఆ మోడల్‌ను మార్కెట్‌కు కూడా చూపించటం గమనార్హం. అయితే ఆ మోడల్ ద్వారా తాము అంతర్జాతీయంగా పోటీ పడలేమని భావించిన రెనో... ఆ భాగస్వామ్యాన్ని కూడా వదులుకుంది. చివరకు తానే సొంతగా భారతీయ ఇంజనీర్లను విశ్వసించి బరి లోకి దిగింది. తన మోడళ్లలో అత్యంత సక్సెస్ఫుల్ మోడల్‌గా ఉన్న ‘డస్టర్’కు మినీ రూపమా?... అన్న మాదిరిగా క్విడ్‌ను తయారు చేసి మార్కెట్లోకి తెచ్చింది. దీంతో ఆల్టో, ఇయాన్, క్విడ్ మధ్య పోటీ రసవత్తరంగా ఉంటుందనేది ఆటో నిపుణుల విశ్లేషణ. క్విడ్ అభివృద్ధికి, చెన్నై ప్లాంటు విస్తరణకు రూ.2,000 కోట్ల దాకా కంపెనీ వెచ్చించింది. ప్రస్తుతమున్న చిన్న కార్లకు భిన్నంగా, అంత్యంత ఆకర్షణీయమైన డిజైన్‌తో ఈ మోడల్‌ను తెచ్చామని రెనో అంటోంది. గ్లోబల్ కారుగా అభివృద్ధి చేసిన క్విడ్‌ను భారత్‌తో పాటు ద క్షిణాఫ్రికా, బ్రెజిల్ తదితర దేశాల్లోనూ విక్రయించనున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌పై దృష్టిపెట్టి ఏటా 10 లక్షల యూనిట్ల విక్రయాలు నమోదు చేస్తామని కంపెనీ ధీమాగా చెబుతోంది. భారత్‌లో కంపెనీ మార్కెట్ వాటా ప్రస్తుతం 2 శాతంగా ఉంది. దీన్ని 2016-17 నాటికి 5 శాతానికి చేరుస్తామని, అందులో క్విడ్ పాత్ర ఎక్కువగా ఉంటుందని రెనో చెబుతోంది. టాటా మోటార్స్ నుంచి.. ‘పెలికాన్’ కోడ్ నేమ్‌తో టాటా మోటార్స్ సైతం మరో చిన్నకారును అభివృద్ధి చేస్తున్నట్టు సమాచారం. 800 సీసీ డీజిల్ మోటార్‌తో పెలికాన్‌ను రూపొందిస్తున్నట్టు ఆటో వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కంపెనీ నానో కార్లతో సామాన్యులకూ దగ్గరైంది. 624 సీసీలో పలు నానో మోడళ్లను విక్రయిస్తోంది. అలాగే కైట్ పేరుతో హ్యాచ్ బ్యాక్ మోడల్‌ను రూపొందిస్తోంది. నానోకు, కైట్‌కు మధ్యస్తంగా పెలికాన్ ఉంటుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. పెలికాన్ 800 సీసీ కారు ధర రూ.2.5 లక్షలు ఉండే అవకాశముంది. స్పార్క్ ప్లాట్‌ఫామ్‌పై జీఎం కొత్త కారు.. జనరల్ మోటార్స్(జీఎం) సైతం 800 సీసీ విభాగంలోకి ప్రవేశించే అవకాశాలున్నాయి. మార్కెట్లో ఉన్న మోడళ్ల కంటే తక్కువ ధరను నిర్ణయించడం ద్వారా అమ్మకాలను పెంచుకోవాలన్నది కంపెనీ ఆలోచన. షెవర్లే స్పార్క్ ప్లాట్‌ఫామ్‌పై కారును అభివృద్ధి చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు మారుతి సుజుకీ 800 సీసీ డీజిల్ ఇంజన్‌ను ఒకటిరెండు నెలల్లో ఆవిష్కరించనుంది. వ్యాన్లు, ఇతర యుటిలిటీ వాహనాలను మినహాయిస్తే దేశంలో అన్ని కంపెనీలవీ కలిపి దేశవ్యాప్తంగా 2014-15లో 18,76,017 కార్లు అమ్ముడయ్యాయి. వచ్చే ఏడాది నిస్సాన్ కూడా.. చెన్నైలో నిస్సాన్-రెనోలకు ఉమ్మడి ప్లాంటుంది. ఏటా 4 లక్షల యూనిట్లను తయారు చేసే సామర్థ్యం ఉన్న ఈ ప్లాంట్‌ను రెండూ సమానంగా ఉపయోగించుకుంటున్నాయి. దీన్లోనే క్విడ్ మోడల్‌ను రెనో అభివృద్ధి చేసింది. చిన్న కార్ల తయారీ కోసం రెండు సంస్థలూ రూపొందించిన కామన్ మాడ్యూల్ ఫ్యామిలీ ప్లాట్‌ఫామ్‌పై క్విడ్ రూపుదిద్దుకుంది. ఇప్పుడు ఇదే ప్లాట్‌ఫామ్‌పై నిస్సాన్ సైతం ‘రెడీ-గో’ పేరిట 800 సీసీ కారును అభివృద్ధి చేస్తోంది. నిస్సాన్ లోకాస్ట్ కార్ బ్రాండ్ అయిన డాట్సన్ నుంచి ఇది విడుదల కాబోతోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ మోడల్ రోడ్డెక్కుతుందని, ధర రూ.2.5 లక్షల నుంచి ప్రారంభమవుతుందని సమాచారం. -
జీఎం నుంచి ‘కాప్టివా’ కొత్త వెర్షన్
ధర రూ. 27.36 లక్షలు న్యూఢిల్లీ: జనరల్ మోటార్స్ (జీఎం) తన ‘కాప్టివా’ మోడల్లోనే మరో వెర్షన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ. 27.36 లక్షలు (ఎక్స్ షోరూం ఢిల్లీ). తమ కంపెనీ మార్కెట్ వృద్ధి కోసమే ఈ కొత్త వెర్షన్‌ను మార్కెట్ లోకి తీసుకొస్తున్నామని జీఎం మోటార్స్ ఇండియా ప్రెసిడెంట్ అరవింద్ సక్సేనా అన్నారు. ఈ అప్డేటెడ్ మోడల్ మాన్యువల్, ఆటోమెటిక్ అనే రెండు వెర్షన్లలో లభించనున్నాయి. -
కార్ల విక్రయాలు జూమ్
పుంజుకున్న నవంబర్ అమ్మకాలు.. రానున్న నెలల్లో మరింత పెరగవచ్చు ముడి చమురు ధరలు తగ్గడం ప్రయోజనకరమే ఎక్సైజ్ సుంకం రాయితీలు మరికొంతకాలం పొడిగించాలి: కార్ల కంపెనీల అభ్యర్థన న్యూఢిల్లీ: వాహన విక్రయాలు నవంబర్‌లో పుంజుకున్నాయి. పండుగల సీజన్లో పెరిగి, ఏడాది చివరలో వాహన విక్రయాలు తగ్గడం రివాజు. కానీ ఈసారి అనూహ్యంగా నవంబర్‌లో వాహనాల అమ్మకాలు పెరిగాయి. వాహన పరిశ్రమలో రికవరీకి ఇది సంకేతమని నిపుణులంటున్నారు. మారుతీ సుజుకి, హ్యుందాయ్, హోండా, టయోటా కంపెనీల వాహన విక్రయాలు పెరగ్గా, జనరల్ మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఫోర్డ్ ఇండియాలు విక్రయాలు తగ్గాయి. టాటా మోటార్స్ విక్రయాలు ఫ్లాట్‌గా ఉన్నాయి. వినియోగదారుల సెంటిమెంట్ కనిష్ట స్థాయిలో ఉండడం, అధికంగా ఉన్న వడ్డీరేట్లు కారణంగా డిమాండ్ తక్కువగా ఉంటోందని మహీంద్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్(ఆటోమోటివ్ డివిజన్) ప్రవీణ్ షా పేర్కొన్నారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడం వల్ల ఇంధన ధరలు కూడా తగ్గుతున్నాయని, దీంతో వాహన అమ్మకాలు రానున్న నెలల్లో మరింతగా పుంజుకుంటాయని చెప్పారు. వాహన పరిశ్రమ మరింతగా కోలుకోవాలంటే కార్లపై ఎక్సైజ్ సుంకం తగ్గింపు రాయితీలు మరికొంత కాలం పొడిగించాలని, అలాగే జరుగుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరల మధ్య వ్యత్యాసం తగ్గుతుండడంతో డీజిల్ కార్లకు డిమాండ్ తగ్గుతోందని జనరల్ మోటార్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ పి. బాలేంద్రన్ చెప్పారు. ఏడాది కాలంలో నాలుగు కొత్త మోడళ్లను అందించడం వల్ల అమ్మకాలు బావున్నాయని హ్యుందాయ్ కంపెనీ సీనియర్ వైస్-ప్రెసిడెంట్(సేల్స్ అండ్ మార్కెటింగ్)రాకేశ్ శ్రీవాత్సవ చెప్పారు. మోటార్ సైకిళ్ల అమ్మకాలు 41 శాతం, స్కూటర్ల అమ్మకాలు 62 శాతం చొప్పున పెరిగాయని టీవీఎస్మోటార్ పేర్కొంది. కాగా మారుతీ సుజుకీ ఎగుమతులు 53 శాతం పెరిగాయి. నవంబర్‌లో ఐదు లక్షలకు పైగా టూవీలర్లను విక్రయించామని హీరో మోటోకార్ప్ తెలిపింది. ఏడాది కాలంలో కొత్తగా 150 డీలర్ల అవుట్లెట్లను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. ఇటీవలే కొలంబియాలో ఆరు హీరో మోడళ్లను అందిస్తున్నామని,120 అవుట్లెట్ల ద్వారా వీటిని విక్రయిస్తున్నామని వివరించింది. ఈ నవంబర్ నెలలోనే 150 సీసీ మోడల్ ఎక్స్‌ట్రీమ్‌లో స్పోర్టీయర్ వెర్షన్‌ను విడుదలచేశామని పేర్కొంది. -
రికవరీ బాటలో వాహన మార్కెట్
న్యూఢిల్లీ: వాహన విక్రయాలు ఈ ఏడాది సెప్టెంబర్‌లో జోరుగా ఉన్నాయి. వాహన మార్కెట్ రికవరీ బాట పట్టిందని నిపుణులంటున్నారు. మారుతీ సుజుకి, హ్యుందాయ్, హోండా, టయోట, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీల దేశీయ విక్రయాలు పెరిగాయి. టాటా మోటార్స్, జనరల్ మోటార్స్, ఫోర్డ్ ఇండియా కంపెనీల అమ్మకాలు మాత్రం తగ్గాయి. దేశీయ అమ్మకాలు, ఎగుమతులతో కూడిన మొత్తం అమ్మకాలు కొన్ని కంపెనీలవి మినహా పుంజుకున్నాయి. కొత్త మోడళ్లు, పండుగల సీజన్ ప్రారంభం కావడం, తదితర అంశాలు దీనికి కారణాలని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. అయితే పూర్తి రికవరీకి ఇంకా సమయం ఉందని ఆ వర్గాలు అభిప్రాయపడ్డాయి. సెంటిమెంట్ పాజిటివ్‌గా ఉందని, పండుగల సీజన్ కారణంగా అమ్మకాలు రానున్న నెలల్లో మరింతగా పుంజుకోగలవని నిపుణులంటున్నారు. తొలిసారిగా కార్లను కొనుగోలు చేసేవాళ్లు, ఎక్స్ఛేంజ్ విధానంలో కార్లను కొనుగోలు చేసేవాళ్లు పెరుగుతున్నారని హ్యుందాయ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్(సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేశ్ శ్రీవాత్సవ పేర్కొన్నారు. మారుతీ సుజుకి దేశీయ అమ్మకాలు 10 శాతం పెరగ్గా, ఎగుమతులు 28 శాతం చొప్పున తగ్గాయి. హ్యుందాయ్ దేశీయ అమ్మకాలు 15 శాతం పెరగ్గా, ఎగుమతులు 21 శాతం తగ్గాయి. జనరల్ మోటార్స్ అమ్మకాలు 37 శాతం తగ్గాయి. దేశీయ మార్కెట్లో టయోట అమ్మకాలు 4 శాతం పెరిగాయి. నిస్సాన్ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకూ తమ అమ్మకాలు 107 శాతం పెరిగాయని పేర్కొంది. ఫోర్డ్ ఇండియా ఎగుమతులు రెట్టింపయ్యాయి. టాటా మెటార్స్ ఎగుమతులు 18 శాతం పెరిగాయి. హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా బైక్‌ల అమ్మకాలు 19 శాతం, స్కూటర్ల అమ్మకాలు 50 శాతం చొప్పున పెరిగాయి. టీవీఎస్ మోటార్ కంపెనీ దేశీయ టూ-వీలర్ల అమ్మకాలు 29 శాతం, స్కూటర్ల అమ్మకాలు 63 శాతం, త్రీ-వీలర్ల అమ్మకాలు 18 శాతం, ఎగుమతులు 15 శాతం చొప్పున పెరిగాయి. బజాజ్ ఆటో ఎగుమతులు 19 శాతం పెరిగాయి. -
వ్యాపారాలకు అవరోధాలు తొలగించాలి
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ తలపెట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ లక్ష్యం సాధ్యం కావాలంటే ముందుగా వ్యాపారాలకు ఆటంకాలు తొలగించాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ ఆటోమొబైల్ దిగ్గజాలు అభిప్రాయపడ్డాయి. వ్యాపారాలకు అనువైన విధానాలు తీసుకురావాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. వాహనాల తయారీ సంస్థల సమాఖ్య (సియామ్) వార్షిక సదస్సులో పాల్గొన్న పలు దిగ్గజ కంపెనీలు ఈ మేరకు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశాయి. వ్యాపార అనుమతులు మొదలుకుని పన్నులు, మౌలిక సదుపాయాలు, రవాణా దాకా అనేక అంశాలు దేశీయంగా ఆటో పరిశ్రమ ఎదుగుదలకు అవరోధాలుగా ఉంటున్నాయని పేర్కొన్నాయి. ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించగలదని ఆశిస్తున్నట్లు జపాన్ ఆటోమొబైల్ తయారీ సంస్థల అసోసియేషన్ (జేఏఎంఏ) చైర్మన్ ఫుమిహికో ఐకీ చెప్పారు. జపాన్‌కి చెందిన పలు ఆటోమొబైల్ విడిభాగాల సరఫరా సంస్థలు భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించాలనుకుంటున్నాయని, అయితే.. ఇక్కడ అనుమతులపరమైన అంశాల్లో ఆటంకాలు ఎదుర్కొంటున్నాయన్నారు. ప్లాంటు నిర్మాణ అనుమతుల ప్రక్రియ కొన్ని సందర్భాల్లో చాలా సంక్లిష్టంగా ఉండటం వల్ల వ్యాపార ప్రణాళికలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోందని చెప్పారు. పైగా అంతర్జాతీయ ప్రమాణాలకు విరుద్ధంగా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన పన్నుల విధానం ఉండటం కూడా సమస్యాత్మకంగా ఉంటోందని ఐకీ తెలిపారు. మరోవైపు, అన్ని రాష్ట్రాల్లో పన్నుల పరంగా ఒకే రకమైన ప్రమాణాలు పాటించాల్సిన అవసరం ఉందని, అప్పుడే వాహనాలను అందుబాటు ధరల్లో అందించడం సాధ్యపడుతుందని జనరల్ మోటార్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ స్టెఫాన్ జాకోబీ చెప్పారు. పారిశ్రామిక విధానాలు, నిబంధనలు దీర్ఘకాలిక ప్రాతిపదికన స్థిరంగా ఉంటే మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి వీలవుతుందని చెప్పారు. టారిఫ్‌లను తగ్గించడం ద్వారా భారత్ మరిన్ని వాణిజ్యావకాశాలు అందిపుచ్చుకోవచ్చని జాకోబీ తెలిపారు. ఎల్లకాలం తోడ్పాటునివ్వలేం: వాణిజ్య శాఖ ప్రపంచవ్యాప్తంగా సుంకాలపరమైన అడ్డంకులు తొలగిపోతున్న నేపథ్యంలో దేశీ ఆటోమొబైల్ పరిశ్రమకు ఎల్లకాలం టారిఫ్లపరమైన రక్షణ కల్పించడం సాధ్యం కాదని వాణిజ్య శాఖ కార్యదర్శి రాజీవ్ ఖేర్ వ్యాఖ్యానించారు. ఇతర దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు దేశీ కంపెనీలకు విదేశీ సంస్థల నుంచి పోటీ ఎదురవకుండా ప్రభుత్వం జాగ్రత్త చర్యలు తీసుకుంటోందన్నారు. ఆటో రంగం విషయంలోనే యూరోపియన్ యూనియన్‌తో ఎఫ్‌టీఏపై చర్చల్లో ప్రతిష్టంభన నెలకొందని ఖేర్ వివరించారు. అయితే, ఇలాంటి పరిస్థితి ఎన్నాళ్లు కొనసాగగలదన్నది ఆలోచించాల్సిన అంశమని ఖేర్ పేర్కొన్నారు. మరోవైపు, ఆటో రంగానికి తోడ్పాటునివ్వడం కోసం ఎగుమతులకు ఊతమిచ్చేలా ప్రభుత్వం ప్రోత్సాహకాలు కొనసాగించగలదని చెప్పారు. 2016 ప్రణాళిక లక్ష్యాలు మిస్.. గత మూడేళ్లలో ఆర్థిక మందగమనం కారణంగా డిమాండ్ క్షీణించిన నేపథ్యంలో దేశీ ఆటోమొబైల్ సంస్థలు 2016 నాటికి నిర్దేశించుకున్న లక్ష్యాల్లో దాదాపు పాతిక శాతాన్ని సాధించలేకపోయే అవకాశాలు ఉన్నాయి. చిన్న కార్లు, ఆటో విడిభాగాలు మొదలైన వాటి ఎగుమతుల ఊతంతో ఆటోమోటివ్ మిషన్ ప్లాన్ (ఏఎంపీ) 2006-2016 కింద 145 బిలియన్ డాలర్ల వార్షిక టర్నోవరు సాధించాలని దేశీ కంపెనీలు నిర్దేశించుకున్నాయి. అయితే ఇంకా మిగిలి ఉన్న కాలాన్ని బట్టి చూస్తే ఇందులో 20- 25 శాతం లక్ష్యాన్ని సాధించలేకపోవచ్చని ఏసీఎంఏ, ఐసీఆర్ఏ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సర్వీసెస్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. డిమాండ్ పెరుగుదలకు ప్రభుత్వం గానీ తోడ్పాటు అందించగలిగితే.. ఇది 13-17 శాతానికి తగ్గొచ్చని నివేదికలో పేర్కొంది. -
భారత్‌కు క్యూ కట్టిన కార్ల దిగ్గజాల బాస్‌లు
న్యూఢిల్లీ: జనరల్ మోటార్స్, హోండా కంపెనీల అధినేతలు ప్రధాని నరేంద్ర మోడీని గురువారం కలిశారు. జనరల్ మోటార్స్ చైర్మన్ టిమ్ సోల్సో, హోండా మోటార్ కంపెనీ చైర్మన్ ఫుమిహికో ఐకెలు విడివిడిగా ప్రధానిని కలిశారని ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంఓ) తెలిపింది. 2020 కల్లా ప్రపంచంలో మూడో అతి పెద్ద వాహన మార్కెట్‌గా భారత్ అవతరించనున్నదనే అంచనాలున్నాయని, అందుకే పలు అంతర్జాతీయ కంపెనీలు భారత్‌పై దృష్టి సారిస్తున్నాయని నిపుణులంటున్నారు. అంతేకాకుండా భారత్ కేంద్రంగా కార్లను ఇతర దేశాలకు ఎగుమతి చేయడం లక్ష్యంగా పలు అంతర్జాతీయ వాహన దిగ్గజ కంపెనీలు భారత్ వైపు చూస్తున్నాయని వారంటున్నారు. ఈ నేపధ్యంలో ఈ రెండు కంపెనీల చైర్మన్లు మోడీని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 40 కొత్త మోడళ్లు: జీఎం సీఈఓ మేరీ బర్రా జీఎం చైర్మన్ టిమ్ సోల్సోతో పాటు ఆ కంపెనీ సీఈఓ మేరీ బర్రా కూడా మోడీతో సమావేశమయ్యారు. ప్రధానిగా విజయం సాధించినందుకు అభినందనలు తెలపడానికి మోడీని కలిశామని వివరించారు. ఆ తర్వాత పరిశ్రమల మంత్రి నిర్మలా సీతారామన్‌ను కూడా ఆమె కలిశారు. కంపెనీ అంతర్జాతీయ టర్న్ అరౌండ్ ప్రణాళికల్లో భాగంగా ఆమె భారత్‌లో పర్యటిస్తున్నారు. డీలర్లు, వాహన విడిభాగాల సరఫరాదారులతో సమావేశమవుతారు. భారత్‌తో సహా మొత్తం అంతర్జాతీయ మార్కెట్లలో 40 కొత్త మోడళ్లనందించనున్నామని ఈ సందర్భంగా ఆమె చెప్పారు. అయితే ఎప్పటిలోగా ఈ మోడళ్లను అందించే గడువును ఆమె వెల్లడించలేదు. 2020 కల్లా మూడో అతిపెద్ద వాహన మార్కెట్‌గా భారత్ అవతరిస్తుందనే అంచనాలున్నాయని, అందుకే భారత్ మార్కెట్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని వివరించారు. ఇక్కడ తీవ్రమైన పోటీ ఉందని, అందుకే మంచి వాహనాన్ని అందిస్తే తప్ప విజయం సాధించలేమని పేర్కొన్నారు. 1996లో భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన జనరల్ మోటార్స్ సంస్థ ఇప్పటివరకూ రూ.2,740 కోట్ల నష్టాలను చవిచూసింది.