బడాబడా కంపెనీలు భారత్‌ వీడిపోవడానికి కారణం ఇదేనా..!  | India Becoming Graveyard For World Auto Giants | Sakshi
Sakshi News home page

బడాబడా కంపెనీలు భారత్‌ వీడిపోవడానికి కారణం ఇదేనా..! 

Published Sat, Sep 11 2021 5:37 PM | Last Updated on Sat, Sep 11 2021 6:02 PM

India Becoming Graveyard For World Auto Giants - Sakshi

ప్రముఖ అమెరికా ఆటో మొబైల్‌ దిగ్గజం ఫోర్డ్‌ భారత్‌లో తన ఉత్పత్తి నిలిపివేస్తు కీలక నిర్ణయం తీసుకున్న నిర్ణయం తెలిసిందే. గత నాలుగు సంవత్సరాలు క్రితం 2017లో జనరల్‌మోటార్స్‌ కూడా భారత్‌ను వీడింది. పలు విదేశీ కంపెనీలు తట్టబుట్టా సర్దుకుని భారత్‌ను వీడుతున్నాయి. ఒక్కసారిగా భారత్‌ను వీడటంతో ఆయా కంపెనీల డీలర్లపై భారీ ప్రభావం పడనుంది. అంతేకాకుండా కంపెనీల ఉద్యోగుల జీవితాలు ఆగమ్యాగోచరం కానుంది.. హ్యూందాయ్‌ మినహా మిగిలిన విదేశీ ఆటోమొబైల్‌ కంపెనీలు భారత్‌ ఆటోమొబైల్‌ రంగంలో కేవలం ఆరుశాతం వాటాను మాత్రమే కల్గిఉన్నాయి. భారత మార్కెట్‌లో ఫోర్డ్‌ 2 శాతం కంటే తక్కువ , ఫోక్స్‌వ్యాగన్‌ ఒక శాతం మేర మాత్రమే వాటాలను కల్గి ఉంది. ప్రపంచమార్కెట్‌లో అత్యంత విజయంతమైన టయోటా కూడా భారత్‌లో కేవలం 3 శాతం వాటానే కల్గి ఉంది.  

చదవండి: సెడాన్‌ అమ్మకాల్లో ఆ కారుదే అగ్రస్థానం

పన్నుల భారమే కారణమా..!
అధిక పన్నుల భారం వలనే పలు విదేశీ కంపెనీలు భారత్‌ నుంచి బయటకు వెళ్తున్నట్లు బిజినెస్‌ స్టాండర్ట్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ టీఎన్‌ టీనన్‌ అభిప్రాయపడ్డారు. టయోటా గతంలో భారీ పన్నుల భారం విషయంపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. టయోటా భారత మార్కెట్ల నుంచి ఎటియోస్‌, కరోలా ఆల్టిస్‌ మోడళ్లను నిలిపివేసింది. విదేశీ ఆటోమొబైల్‌ దిగ్గజాలు భారత మార్కెట్‌లో సుస్థిర స్థానాలను నిలుపుకోవడానికి ఎంతగా ప్రయత్నించిన పలు కంపెనీలు నిలవలేకపోయాయి. కొద్ది రోజుల ప్రముఖ దిగ్గజ ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ సంస్థ భారత్‌లోకి వచ్చేందుకు దిగుమతి సుంకాలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాలను విన్నవించిన విషయం తెలిసిందే. విదేశీ కార్లపై ట్యాక్స్‌ విషయంలో టెస్లా, హ్యుందాయ్‌, బెంజ్‌, ఫోక్స్‌వ్యాగన్‌ కంపెనీలు కేంద్రానికి విజ్ఞప్తులు చేశాయి. విదేశీ కంపెనీల కార్లపై ప్రభుత్వం సుమారు 100 శాతం మేర ట్యాక్స్‌లను వసూలు చేస్తోంది.

భారత్‌లో వాటికే ఎక్కువ ప్రాధాన్యం..!
భారత్‌ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కొనుగోలుదారులు ఎక్కువగా తక్కువ ఖర్చుతో నడిచే తక్కువ ధర కలిగిన కార్లపై ఎక్కువ మోజు చూపుతారు. తక్కువ ఖర్చుతో వచ్చే వాహనాలు విదేశీ కంపెనీల దగ్గర సరిపోయే మోడల్స్‌ లేవు.  భారత మార్కెట్‌లో మారుతి,  హ్యుందాయ్ మాత్రమే  విజయవంతమైన ప్రవేశ-స్థాయి కార్‌ మోడళ్లను కలిగి ఉన్నాయి. ఫోర్డ్, టయోటా ,  ఫోక్స్‌వ్యాగన్‌, వంటి కంపెనీల నుంచి భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన మారుతి  ఆల్టోతో పోటీ పడే కార్లు ఆయా విదేశీ  ఆటోమొబైల్‌ కంపెనీల వద్ద లేవు. మారుతి ఆల్టో ఎంట్రీ లెవల్‌ మార్కెట్‌లో రూ.3 లక్షల నుంచి కొనుగోలుదారులకు అందుబాటులో ఉంది. ఇంతా తక్కువ ఖర్చులో భారత వాహన ప్రియులకు తయారుచేయడం బడాబడా కంపెనీలకు అంతగా తెలియదు. హ్యూందాయ్‌ లాంటి కంపెనీలు భారత ప్రజలకు తగ్గట్టుగా బహిరంగ మార్కెట్‌లోకి వాహనాలను తీసుకురావడంతో తన స్థానాన్ని పదిలంగా నిలుపుకుంటుంది.  

వాహన కొనుగోలు దారుల కొనుగోలు స్థాయి గణనీయంగా పెరిగింది. దీంతో చాలా మంది కొనుగోలుదారులు మారుతి 800సీసీ కారు నుంచి రూ. 6 లక్షల నుంచి 10 లక్షల మధ్య వచ్చే కార్లను కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యారు. హ్యుందాయ్ నుంచి ఐ20, సుజుకి నుంచి స్విఫ్ట్ బాలెనో, టాటా మోటార్స్ కు చెందిన టియాగో, ఆల్ట్రోజ్ వంటి కార్లపై ఎక్కువగా ఆదరణను పొందాయి. 

 చదవండి : Ford: ప్లీజ్‌ మమ్మల్ని వదిలేసి వెళ్లొద్దు!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement