Ford Motors
-
అడ్వెంచర్స్ కోసం అద్భుతమైన వాహనం: ఫియర్స్ ఫోర్డ్ సూపర్ డ్యూటీ క్యాంపర్ ట్రక్ (ఫోటోలు)
-
విదేశీ బ్రాండ్ల చలో భారత్
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే వేగవంతమైన వృద్ధి, అధిక యువ జనాభా, బలమైన వినియోగం.. వెరసి భారత్ మార్కెట్ విదేశీ బ్రాండ్లను ఆకర్షిస్తోంది. గతంలో భారత్ మార్కెట్ నుంచి వెళ్లిపోయిన సంస్థలు పునరాలోచనలో పడ్డాయి. ఇప్పటికే కొన్ని సంస్థలు తిరిగి భారత్‌లోకి పునరాగమనం చేయనున్నట్టు ప్రకటించేశాయి. పలు బహుళజాతి సంస్థలు భారత్‌లో బలమైన వృద్ధి అవకాశాలతో చొచ్చుకుపోతుండగా.. తాము ఎందుకు అలా రాణించకూడదన్న దృక్పథంతో అవి తమ పెట్టుబడుల ప్రణాళికలను సమీక్షించుకుంటున్నట్టు పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా భారత్ ఆశాకిరణంగా కనిపిస్తుండడంతో గతంలో ఇక్కడి నుంచి తట్టా, బుట్టా సర్దేసుకుని వెళ్లిన విదేశీ కంపెనీలు, మరో విడత ఇక్కడ కాలు మోపేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి.యూరప్‌లో రెండో అతిపెద్ద రిటైల్ చైన్ ‘క్యారీఫోర్’, భారత్‌లోనూ అదే మాదిరి విజయగాధను నమోదు చేయాలని భావించింది. కానీ, విధానాలు ఫలితమివ్వకపోవడంతో 2014 జూలైలో భారత్‌లోని క్యాష్ అండ్ క్యారీ స్టోర్ల వ్యాపారాన్ని మూసేసి వెళ్లిపోయింది. మరో ఫార్మాట్‌తో తిరిగి భారత్‌లోకి వస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. అంతేకాదు అమెరికాకు చెందిన బహుళజాతి ఆటో సంస్థ (డెట్రాయిట్) ఫోర్డ్ మోటార్ 2022 సెప్టెంబర్‌లో భారత్ మార్కెట్‌ను వీడింది.కరోనా తర్వాత డిమాండ్ క్షీణత, పోటీ పెరిగిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవలే తమిళనాడు సర్కారు ఫోర్డ్ యాజమాన్యంతో మాట్లాడగా.. చెన్నైకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరైమలై ప్లాంట్‌లో తయారీని త్వరలో ప్రారంభిస్తామంటూ ప్రకటించింది. భారత్‌లో అపార అవకాశాలు మరికొన్ని విదేశీ బ్రాండ్లను సైతం ఆకర్షిస్తున్నాయి. దీంతో అవి తిరిగొచ్చేందుకు ఉత్సాహం చూపిస్తున్నాయి. జాయింట్ వెంచర్లు అమెరికాకు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహనాల సంస్థ హార్లే డేవిడ్సన్ సైతం తొలుత భారత మార్కెట్లో సొంతంగా వ్యాపార అవకాశాల కోసం ప్రయత్నం చేసి, నష్టాలు వస్తుండడంతో తప్పుకుంది. హీరో మోటోకార్ప్‌తో కలసి జాయింట్ వెంచర్ రూపంలో గతేడాది మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. చైనాకు చెందిన ఫ్యాషన్ సంస్థ షీన్ రిలయన్స్ రిటైల్‌తో టై అప్ పెట్టుకుని భారత్‌లోకి తిరిగి ప్రవేశించింది. క్యారీఫోర్ యూరప్‌లో మలీ్టబ్రాండ్ (బహుళ బ్రాండ్ల) రిటైల్ అవుట్లెట్లతో మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు భారత్‌లో ఇదే విధమైన వ్యాపారం కోసం దుబాయ్ అప్పారెల్ గ్రూప్‌తో జట్టు కట్టింది. పోర్డ్ మోటార్స్ సైతం ఈ విడత భారత్‌లో రిటైల్ విక్రయాలు కాకుండా, ఎలక్ట్రిక్ వాహనాల ఎగుమతులకు భారత్‌ను కేంద్రంగా చేసుకోవాలనే ప్రణాళికతో వస్తోంది. విధానాల ఫలితం.. క్యాష్ అండ్ క్యారీ వ్యాపారం నుంచి మెట్రో సైతం గతేడాది వైదొలగడం గమనార్హం. తన వ్యాపారాన్ని రిలయన్స్‌కు అమ్మేసి వెళ్లిపోయింది. మలీ్టబ్రాండ్ రిటైల్ వ్యాపారం పట్ల వాల్‌మార్ట్ గ్రూప్ సైతం ఆసక్తితో ఉండగా, ఎఫ్‌డీఐ విధానాల్లో స్పష్టత లేమితో.. చివరికి 2018లో 16 బిలియన్ డాలర్లతో ఫ్లిప్‌కార్ట్‌ను సొంతం చేసుకుంది. కానీ, ఆ తర్వాతి కాలంలో ఐకియా, యాపిల్ సంస్థలు ఇక్కడి రిటైల్ మార్కెట్లోకి అడుగు పెట్టడం తెలిసిందే. ప్రభుత్వ ప్రగతిశీల విధానాలతో విదేశీ కంపెనీల్లో ఆసక్తి పెరిగినట్టు సబి్నవిస్ తెలిపారు. విస్మరించలేనివి...భారత వినియోగ మార్కెట్ ప్రపంచంలోనే పెద్దదంటూ, ఇక్కడి అవకాశాలను కంపెనీలు విస్మరించలేనివిగా ఫ్రాంచైజీ ఇండియా చైర్మన్ గౌరవ్ మార్య తెలిపారు. భారత్‌లో అవకాశాలకు అనుగుణంగా తమ వ్యూహాలను సర్దుబాటు చేసుకునేందుకు క్యారీఫోర్, ఫోర్డ్, తదితర విదేశీ బ్రాడ్లు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ఇదే అంశంపై సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ స్పందిస్తూ.. అతిపెద్ద మార్కెట్, వేగవంతమైన వృద్ధి, విజయవంతమైన ఆర్థిక సంస్కరణలు భారత్‌లో అవకాశాలను అన్వేíÙంచేలా విదేశీ ఇన్వెస్టర్లను ప్రేరేపిస్తున్నట్టు వివరించారు. అతిపెద్ద వినియోగ మార్కెట్, బలమైన వృద్ధి విదేశీ బ్రాండ్లను ఆకర్షిస్తున్నట్టు బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనమిస్ట్ మదన్ సబ్నవిస్ సైతం అభిప్రాయపడ్డారు.ఎల్రక్టానిక్స్, రెన్యువబుల్ ఎనర్జీ, విజ్ధానాధారిత సేవలు తదితర రంగాల్లో విదేశీ కంపెనీలు భారీ పెట్టుబడుల ప్రకటనలు చేస్తున్నట్టు చంద్రజిత్ బెనర్జీ తెలిపారు. ‘‘విదేశీ సంస్థలతో మాట్లాడినప్పుడు భారత్‌లో కార్యకలాపాలు చేపట్టేందుకు అవి ఎంతో ఆసక్తితో ఉన్నట్టు తెలిసింది. స్థిరమైన ఆర్థిక వృద్ధి నేపథ్యంలో భారత్ ఇక ముందు పెద్ద ఎత్తున విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షిస్తుందని భావిస్తున్నాం’’అని బెనర్జీ వివరించారు. -
ఫోర్డ్: వేల ఉద్యోగాలకు ఎసరు..!
సాక్షి, ముంబై: వేలాది ఉద్యోగాల కోతలు కేవలం ఐటీ కంపెనీలను మాత్రమే కాదు ఇతర కంపెనీల ఉద్యోగులను కూడా వణికిస్తున్నాయి. తాజాగా యూఎస్ బేస్డ్ ఆటో మేకర్ ఫోర్డ్ మోటార్ ఉద్యోగులకు మరోసారి షాకిస్తోంది. ఐరోపా అంతటా దాదాపు 3200 మందికి ఉద్వాసన పలకనుందన్న వార్త కలవరం రేపింది. వీరిలో ఎక్కువగా జర్మనీలోని ఉద్యోగులు ప్రభావితమైనట్టు తెలుస్తోంది. Germany’s IG Metall union warned Ford that it would take actions to disrupt production throughout Europe if the carmaker did not reverse its plans to cut thousands of jobs in the country and move some product development work to the United States https://t.co/m3UF1JqC6H pic.twitter.com/JUOumSr4Mb — Reuters (@Reuters) January 24, 2023 జర్మనీలోని ఐజీ మెటల్ యూనియన్ ఉటంకిస్తూ రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. దీని ప్రకారం 2,500 వరకు ప్రొడక్ట్ డెవలప్మెంట్ జాబ్స్ , 700 వరకు అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగులను తీసివేయనుంది. జర్మన్ ప్లాంట్స్ ఎక్కువగా ప్రభావితం కానున్నాయి. అయితే ఈ ఉద్యోగ కోతలు అమల్లోకి వస్తే పోరాటానికి దిగుతామని యూనియన్ బెదిరించింది. ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలలో ఉపయోగించే మెటీరియల్‌ల కోసం పెరుగుతున్న ఖర్చులు, అమెరికా ఐరోపా ఆర్థిక వ్యవస్థల మందగమనంతోపాటు, వాహన తయారీదారులు ఖర్చులను తగ్గించుకోవాల్సిన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ నెల ప్రారంభంలో టెస్లా ప్రారంభించిన ఈవీ ప్రైస్ వార్ ఈ ఒత్తిడిని మరింత పెంచిందని అంచనా . అయితే తాజా నివేదికలపై స్పందించేందుకు జర్మనీలోని ఫోర్డ్ ప్రతినిధి నిరాకరించారు. అయితే ఎలక్ట్రిక్ వాహనాల (EVలు) ఉత్పత్తికి మారడానికి నిర్మాణాత్మక సర్దుబాట్లు అవసరమని పేర్కొన్నట్టు సమాచారం. కాగా గత సంవత్సరం ఫోర్డ్ కంపెనీ 3వేల మందిని తొలగించింది. అయితే ఈవీ మార్కెట్‌కు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో ఫోర్డ్ ఆల్-ఎలక్ట్రిక్ మోడల్‌ను ఉత్పత్తి నిమిత్తం, కొలోన్ ఫ్యాక్టరీలో తయారీని పెంచడానికి ఈ సంవత్సరం ప్రారంభంలో 2 బిలియన్ల డాలర్ల పెట్టుబడిని ప్రకటించిన తరువాత తాజా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. -
భారత్‌కు భారీ షాక్.. దేశం నుంచి వెళ్లిపోతున్న ప్రఖ్యాత కార్ల కంపెనీ!
Ford Ends Production units In India భారతీయులు ఎక్కువ ఇష్టపడే కార్లు జాబితా తీస్తే అందులో తప్పకుండా ఫోర్డ్ కూడా ఉంటుంది. ఈ అమెరికన్ కంపెనీ భారత్ ఆటోమొబైల్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును కూడా సంపాదించుకుంది. అయితే భారీ నష్టాలు కారణంగా ఈ సంస్థ దేశం నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించింది. గత దశాబ్ద కాలంగా సుమారు 2 బిలియన్ డాలర్ల నష్టాలను చవిచూశామని కంపెనీ వెల్లడించింది. ఫోర్డ్‌కు భారతదేశంలో రెండు ప్లాంట్లు ఉన్నాయి. ఒకటి గుజరాత్‌లోని అహ్మదాబాద్ సమీపంలోని సనంద్‌లో ఉండగా, మరొకటి తమిళనాడులోని చెన్నై సమీపంలో ఉంది. సనంద్ ప్లాంట్ నుంచి, ఫోర్డ్ వారి ఫిగో, ఫ్రీస్టైల్, ఆస్పైర్ వంటి చిన్న కార్లను ఉత్పత్తి చేసేది. చెన్నై ప్లాంట్ నుంచి, ఫోర్డ్ ఎకోస్పోర్ట్, ఎండీవర్‌లను ఉత్పత్తి చేస్తుంది. 9 సెప్టెంబర్ 2021న ఫోర్డ్ కంపెనీ భారతదేశంలో తన కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అందులో భాగంగానే సనంద్ ప్లాంట్‌లో ఉత్పత్తిని అక్టోబర్ 2021లో నిలిపివేసింది. కార్లు, ఇంజిన్లు ఎగుమతి ప్రయోజనాల కోసం చెన్నై ప్లాంట్‌ని ఇప్పటి వరకు కొనసాగిస్తూ వచ్చింది. ప్రస్తుతం చెన్నై యూనిట్‌ని కూడా నిలిపివేయడంతో దేశంలో తన కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసినట్లైంది. ఎకోస్పోర్ట్ ఫోర్డ్‌కు ఆటోమొబైల్ రంగంలో మంచి గుర్తింపును తీసుకొచ్చిందనే చెప్పాలి. దీని తర్వాత మార్కెట్లో ఇతర కార్లకు గట్టి పోటిని కూడా ఇవ్వగలిగింది ఫోర్డ్. అయితే కంపెనీ తీసుకొచ్చిన కొత్త డిజైన్ కార్లు మార్కెట్లో ఆశించినంతగా క్లిక్ కాలేదు. చివరికి, ఫోర్డ్‌కు భారీ నష్టాలు రావడంతో దేశం నుంచి నిష్క్రమించడం తప్ప వేరే మార్గం కనపడలేదు. చదవండి: Reliance Industries: ఇది టీజర్ మాత్రమే.. అసలు కథ ముందుంది.. రిలయన్స్ వార్నింగ్ -
టాటా చేతికి ఫోర్డ్ ఇండియా ప్లాంట్
న్యూఢిల్లీ: అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్‌కు గుజరాత్‌లోని సాణంద్‌లో ఉన్న ప్లాంటును కొనుగోలు చేస్తున్నట్లు దేశీ దిగ్గజం టాటా మోటార్స్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఫోర్డ్ ఇండియా (ఎఫ్ఐపీఎల్), గుజరాత్ ప్రభుత్వం, టాటా మోటర్స్ అనుబంధ సంస్థ టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ (టీపీఈఎంఎల్) అవగాహనా ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం స్థలం, భవంతులు, వాహనాల తయారీ ప్లాంటు, యంత్రాలు, పరికరాలు మొదలైనవి టీపీఈఎంఎల్ కొనుగోలు చేయనుంది. అలాగే, నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి ఎఫ్ఐపీఎల్ సాణంద్ ప్లాంటులోని వాహనాల తయారీ కార్యకలాపాల్లో పాలుపంచుకునే, అర్హత కలిగిన ఉద్యోగులు కూడా టీపీఈఎంఎల్‌కు బదిలీ అవుతారు. తదుపరి కొద్ది వారాల వ్యవధిలోనే టీపీఈఎంఎల్, ఎఫ్ఐపీఎల్ పూర్తి స్థాయి ఒప్పందం కుదుర్చుకోనుంది. సాణంద్ ప్లాంట్‌లో ఇంజిన్ల తయారీని ఫోర్డ్ కొనసాగించనుండటంతో అందుకు అవసరమైన స్థలాన్ని ఆ కంపెనీకి టాటా మోటార్స్ లీజుకు ఇవ్వనుంది. నీరు, విద్యుత్, వ్యర్థాల ట్రీట్మెంట్ ప్లాంటు మొదలైనవి రెండు సంస్థలు కలిసి వినియోగించుకోనున్నాయి. కొత్త పెట్టుబడులు.. తమ వాహనాల ఉత్పత్తికి అనువుగా యూనిట్‌ను సిద్ధం చేసే దిశగా టీపీఈఎంఎల్ కొత్త యంత్రాలు, పరికరాలపై ఇన్వెస్ట్ చేయనుంది. తద్వారా ఏటా 3 లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉండేలా ప్లాంటును తీర్చిదిద్దనుంది. తర్వాత రోజుల్లో దీన్ని 4 లక్షల యూనిట్ల స్థాయికి పెంచుకోనుంది. ‘మొత్తం ప్రక్రియ పూర్తయ్యేందుకు కొద్ది నెలలు పడుతుంది. ప్యాసింజర్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఇది మాకు తోడ్పడుతుంది. పైగా సాణంద్‌లోని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ ప్లాంటుకు పక్కనే ఈ యూనిట్ ఉండటం కూడా మాకు కలిసి వస్తుంది‘ అని టాటా మోటార్స్ పేర్కొంది. ‘టాటా మోటార్స్‌కు దశాబ్ద కాలం పైగా గుజరాత్‌తో అనుబంధం ఉంది. సాణంద్‌లో సొంత తయారీ ప్లాంటు ఉంది. రాష్ట్రంలో మరిన్ని ఉపాధి, వ్యాపార అవకాశాల కల్పనకు మేము కట్టుబడి ఉన్నామని తెలియజేసేందుకు ఈ ఒప్పందమే నిదర్శనం‘ అని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్, టీపీఈఎంఎల్ ఎండీ శైలేష్ చంద్ర తెలిపారు. తమ వాహనాలకు కొనుగోలుదారుల్లో డిమాండ్ నెలకొనడంతో గత కొన్నాళ్లుగా కంపెనీ అనేక రెట్లు వృద్ధి సాధించిందని వివరించారు. ఉద్యోగులకు భరోసా.. 2011లో ఫోర్డ్ ఇండియా సాణంద్‌లోని ప్లాంటులో కార్యకలాపాలు ప్రారంభించింది. సుమారు 350 ఎకరాల్లో వాహన అసెంబ్లీ ప్లాంటు, 110 ఎకరాల్లో ఇంజిన్ల తయారీ యూనిట్ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు దేశీ మార్కెట్లో నిలదొక్కుకునేందుకు ప్రయత్నించి విఫలమైన ఫోర్డ్ గతేడాది సెప్టెంబర్‌లో భారత్‌లో తయారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై దిగుమతి చేసుకున్న వాహనాలు మాత్రమే విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. దీని వల్ల పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. అయితే, తాజా ఒప్పందంతో ఆ సమస్య తప్పుతుందని గుజరాత్ ప్రభుత్వం తెలిపింది. ‘ఫోర్డ్ ప్లాంటు మూసివేతతో 3,000 మంది పర్మనెంటు ఉద్యోగులు, 20,000 మంది వర్కర్లతో పాటు కంపెనీకి విడిభాగాలు సరఫరా చేసే అనుబంధ సంస్థల్లో ను భారీ సంఖ్యలో ఉద్యోగాల్లో కోత పడే పరిస్థితి నెలకొంది. కానీ, ప్రస్తుత ఒప్పందంతో ఆ సమస్య పరిష్కారమవుతుంది‘ అని పేర్కొంది. -
భారత్‌లో ఫోర్డ్, అమ్మో ఇన్ని వేల కోట్లు నష్టపోయిందా!
వాహన రంగంలో ఉన్న యూఎస్ సంస్థ ఫోర్డ్.. ఎగుమతుల కోసం భారత్‌లో ఎలక్ట్రిక్ వెహికిల్స్ తయారీ ప్రణాళికను విరమించుకుంది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల కింద అనుమతి పొందినప్పటికీ కంపెనీ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. చెన్నై, గుజరాత్‌లోని సనంద్ ప్లాంట్లలో ఇతర ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నట్టు వెల్లడించింది. పునర్వ్యవస్థీకరణలో భాగంగా భారత్‌లో వాహనాల తయారీని నిలిపివేస్తున్నట్టు ఫోర్డ్ 2021 సెప్టెంబర్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. విదేశాల్లో తయారైన వెహికిల్స్‌ను మాత్రమే దేశంలో విక్రయించాలని నిర్ణయించింది. భారత్‌లోని ప్లాంట్ల కోసం ఫోర్డ్ సుమా రు రూ.19,250 కోట్లు వెచ్చించింది. అయితే కంపెనీ రూ.15,400 కోట్ల నష్టాలను మూటగట్టుకుంది. విదేశీ మార్కెట్ల కోసం సనంద్ ప్లాంటులో ఇంజన్ల తయారీ కొనసాగుతోంది. రెండు తయారీ కేంద్రాలను విక్రయించాలని కంపెనీ కొన్ని నెలలుగా ప్రయత్నిస్తోంది. -
'ఫోర్డ్' చేతులెత్తేసింది, రంగంలోకి దిగిన రతన్ టాటా!
రతన్ టాటా..వెటరన్ పారిశ్రామికవేత్త..పరిచయం అక్కర్లేని పేరు. వ్యాపార రంగంలో సంచలన, వినూత్న నిర్ణయాలకు పెట్టింది ఆయన పేరు. ఇటీవల అప్పుల భారంతో కూరుకుపోయిన ఎయిరిండియాను రతన్ టాటాకు చెందిన టాటా గ్రూపు కొనుగోలు చేసింది. తాజాగా కోవిడ్‌తో దెబ్బకు దివాళా తీసే స్థితిలో ఉన్న అమెరికన్ ఆటోమొబైల్ సంస్థ 'ఫోర్డ్' యూనిట్‌ను కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు. కరోనా క్రైసిస్‌లో సైతం టాటా గ్రూప్‌కు చెందిన టాటా మోటార్స్ మనదేశంలో 85 శాతం వెహికల్స్‌ను ఉత్పత్తి చేస్తుండగా..అమెరికాకు చెందిన ఫోర్డ్ కంపెనీ చేతులెత్తేసింది. ఈ మేరకు భారత్‌లోని ఫోర్డ్ కంపెనీ కార్ల ప్లాంట్లను మూసివేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో, సంసద్(గుజరాత్), చెన్నై (తమిళనాడు) నగరాల్లోని రెండు ప్లాంట్లను అమ్మకానికి పెట్టింది. అందులో సంసద్ యూనిట్‌ను కొనుగోలు చేసేందుకు టాటా మోటార్స్ సిద్ధమైంది. కొనుగోళ్లలో భాగంగా సంసద్ యూనిట్ ప్రతినిధుల్ని టాటా గ్రూప్ సంప్రదించినట్లు తెలుస్తోంది. వచ్చేవారం గుజరాత్ సీఎం విజయ్ రూపానీ అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో టాటా గ్రూప్.., ఫోర్డ్ యూనిట్లను కొనుగోలు ప్రతిపాదనలపై స్పష్టత రానుంది. ఒకవేళ అదే జరిగితే మరికొద్ది రోజుల్లో ఫోర్డ్ యూనిట్‌ను టాటా మోటార్స్ హస్తగతం చేసుకోనుంది. ఇక గుజరాత్ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్‌ను టాటాకు అమ్మిన తర్వాత.. పీఎల్ఐ స్కీమ్‌లో ఫోర్డ్ పెట్టుబడులు పెట్టనుందని తెలుస్తోంది. ఈ పరిణామాలన్నింటిపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందేనని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. చదవండి: ఆ యుద్ధం.. వీళ్ల ప్రేమకు శాపంగా మారింది -
గత ఏడాది భారత్‌కు గుడ్‌బై..! ఇప్పుడు మళ్లీ రిఎంట్రీ ఇవ్వనున్న అమెరికన్ దిగ్గజ కంపెనీ..!
గత ఏడాది భారత్‌కు గుడ్‌బై చెప్పుతూ..అమెరికన్ దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీ ఫోర్ఢ్ మోటార్స్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. భారత్‌లోని రెండు కార్ల ప్లాంట్స్‌లో ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఫోర్ట్ మోటార్స్ గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రకటించింది. కాగా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పీఎల్ఐ స్కీంలో భాగంగా ఫోర్డ్ మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి విభాగంలో రిఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమైంది. ఫోర్డ్ రివర్స్ గేర్..! ఈవీ విభాగంలో భారత్‌లో కార్ల ఉత్పత్తిపై ఫోర్డ్ మోటార్స్ పునరాలోచనలో పడింది. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల తయారీకి ప్రణాళిక ఫోర్డ్ మోటార్స్ రూపొందిస్తోంది. కాగా ఎలక్ట్రిక్ కార్ల తయారీ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పీఎల్ఐ స్కీమ్ కోసం ఫోర్డ్ మోటార్స్ దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఈ పీఎల్ఐ స్కీమ్‌లో ఫోర్డ్‌తో పాటు మారుతీ సుజుకీతో సహా పలు దిగ్గజం కార్ల తయారీ కంపెనీలు కూడా దరఖాస్తు చేసుకున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల ఎగుమతి..! ఫోర్డ్ మోటార్స్‌కు చెందిన గుజరాత్‌లోని సనద్ ప్లాంట్ నుంచి వంద శాతం ఎలక్ట్రిక్ కార్ల తయారీ చేస్తూ, కార్లను విదేశాలకు ఎగుమతి చేయాలని కంపెనీ భావిస్తోంది. ఇక పీఎల్ఐ కింద ఫోర్డ్ సమర్పించిన దరఖాస్తుకు కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. తమ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినందుకు ఫోర్డ్ ఇండియా కేంద్రానికి సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలను తెలిపింది. ఆమోదం పొందిన సంస్థలు వచ్చే రెండేళ్లలో స్ట్రాటెజీ, ప్రోడక్ట్స్ మీద దృష్టి సారించనున్నాయి. 2024 నుండి అయిదేళ్ల పాటు పీఎల్ఐ స్కీమ్ అమలవుతుందని తెలిపింది. చదవండి: ఇన్వెస్టర్లకు కనక వర్షం కురిపిస్తున్న ప్రముఖ కంపెనీ..! -
ఈవీ రంగంలో ఫోర్డ్ మోటార్స్ భారీగా పెట్టుబడులు
ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్ అయిన మన దేశంలో అమెరికన్ కంపెనీలు రాణించలేక పోతున్నాయి. ఇక్కడి ప్రజల నాడిని పట్టుకోవడంలో దిగ్గజ ఆటో మొబైల్ కంపెనీలు వైఫల్యం చెందుతున్నాయి. ఆశావహ అంచనాలతో అడుగుపెట్టడం.. ఆఖరుకు తట్టా బుట్టా సర్దుకుపోవడం అమెరికా బ్రాండ్లకు పరిపాటిగా మారిందనడంలో అతిశయోక్తి లేదు. అయితే, ఇటీవల భారత్ మార్కెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన ఫోర్డ్ మోటార్స్ ఆటో దిగ్గజం అమెరికాలో మూడు బ్యాటరీ కర్మాగారాలు, ఒక అసెంబ్లీ ప్లాంట్‌ను నిర్మించడానికి దక్షిణ కొరియా సంస్థ ఎస్కె ఇన్నోవేషన్ కోతో చేతులు కలిపినట్లు ప్రకటించింది. బ్యాటరీ కర్మాగారాలు, అసెంబ్లీ ప్లాంట్ నిర్మాణ కోసం 11.4 బిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా ఫోర్డ్ 7 బిలియన్ డాలర్లు, ఎస్కె ఇన్నోవేషన్ కో 4.4 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 11,000 మంది కార్మికులను కూడా నియమించుకుంటున్నట్లు ఫోర్డ్ పేర్కొంది. 2025 నాటికి ఎలక్ట్రిక్ వాహనాలలో 30 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలనే ఫోర్డ్ ప్రణాళికలో భాగం. ఏడాది క్రితం ఈ సంస్థ పగ్గాలు చేపట్టిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జిమ్ ఫార్లీ అన్నీ వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు ప్రయత్నాలను వేగవంతం చేశారు.(చదవండి: సామాన్యులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు) -
బ్రేక్ ఇన్ ఇండియా
వినాయక చవితి అందరిలో ఉత్సాహం నింపి, తీపిని పంచితే, ఆ కార్ల తయారీ కర్మాగార కార్మికులకు మాత్రం చేదువార్త తెచ్చింది. చెన్నై శివార్లలో కళకళలాడుతూ కనిపించే ‘ఫోర్డ్’ కార్ల తయారీ కర్మాగారం ఇప్పుడిక మూగబోనుంది. వందల మంది వీధినపడనున్నారు. గుజరాత్లో అహ్మదాబాద్ సమీపంలోని ఫోర్డ్ కర్మాగారంలోనూ అదే పరిస్థితి. పాతికేళ్ళ పాటు భారత్‌లో కార్యకలాపాలు సాగించి, కార్ల తయారీ కర్మాగారాలు రెండు నెలకొల్పి, వందల కోట్ల డాలర్లు పెట్టుబడిగా పెట్టిన అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం ‘ఫోర్డ్ మోటార్స్’ నష్టాలే తప్ప లాభాలు వచ్చే పరిస్థితి లేదని గ్రహించి, భారత్‌లో కార్ల తయారీకి స్వస్తి పలుకుతోంది. కొన్నేళ్ళ క్రితం జనరల్ మోటార్స్ (జీఎం), ఇటీవల హార్లే డేవిడ్సన్, ఇప్పుడు ఫోర్డ్ మోటార్స్ నష్టాల కారణంగా భారత్ నుంచి నిష్క్రమణ బాట పట్టడం గమనార్హం. ప్రపంచంలోకెల్లా అయిదో అతి పెద్ద ఆటోమొబైల్ మార్కెటైన భారత్‌లో ఇలా ప్రసిద్ధ అమెరికన్ కంపెనీలు రాణించలేక చతికిలబడడం ఒక రకంగా విచిత్రం. అనేక విధాలుగా విషాదం. ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్న ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదానికి అనూహ్యంగా పడుతున్న బ్రేకులకు నిదర్శనం. దేశంలో నెలకొన్న వ్యాపార వాతావరణానికి నిలువుటద్దం. గత పదేళ్ళలో భారత్‌లో దాదాపు 200 కోట్ల డాలర్ల మేర ఫోర్డ్ నష్టపోయింది. నిర్వహణ కారణాల వల్లనే ఆ సంస్థ నిష్క్రమిస్తోందనీ, దేశంలో ఇన్వెస్టర్ సెంటిమెంట్‌కు ఇదేమీ దెబ్బ కాదనీ సర్కారు ఉవాచ. కానీ, దీని వెనుక గమనించాల్సిన అంశాలెన్నో ఉన్నాయి. ఆర్థిక సంస్కరణలు మొదలైన 1991 తరువాత భారత్‌కు వచ్చిన తొలి అంతర్జాతీయ సంస్థల్లో ఫోర్డ్ ఒకటి. వందల కోట్లు ఇక్కడ పెట్టుబడిగా పెట్టి, ఇక్కడే కార్ల తయారీ సాగించినా, ఫోర్డ్ మన మార్కెట్లో 2 శాతం కన్నా తక్కువ వాటానే సాధించగలిగింది. మదుపు పెట్టిన ప్రపంచ శ్రేణి సంస్థలకు దేశంలోని అతి షరతులు, అధిక పన్నులతో నమ్మకమే పోతోంది. అవి విసిగిపోతున్నాయనడానికి తాజా ఉదాహరణ ఫోర్డ్ నిష్క్రమణ. ఇది ఒక వర్గం విశ్లేషకుల మాట. మరో వర్గం మాత్రం భారత్‌లో సరైన కార్లను తీసుకురాలేని ఫోర్డ్ అప్రయోజకత్వం వల్లే ఈ దుఃస్థితి దాపురించిందని వాదిస్తోంది. ఈ రెండు వాదనల్లోనూ ఎంతో కొంత నిజం ఉంది. భారత్‌లో కార్ల తయారీ, విక్రయంలోకి దిగిన ఫోర్డ్ సంస్థ అనేక పొరపాట్లు చేసింది. భారత వినియోగదారుల నాడిని సరిగ్గా పట్టుకోలేకపోయింది. భారత మార్కెట్లో ప్రధానభాగం చిన్న కార్లదే. ఆ విభాగాల్లో ఫోర్డ్ అందిస్తున్న కార్లు పరిమితమే. మారుతి, హ్యుండయ్ల వైవిధ్యంతో ఫోర్డ్ పోటీపడలేకపోయింది. అయితే, భారతీయ మార్కెట్‌ను వదిలిపెట్టకుండా, మహీంద్రా సంస్థతో సంయుక్త భాగస్వామ్యం ద్వారా తన ఉనికిని నిలబెట్టుకోవాలనీ ఆ మధ్య ప్రయత్నించింది. అది ఆచరణ సాధ్యం కాలేదు. మరోపక్క అనేక ఇతర ప్రపంచ స్థాయి ఆటోమొబైల్ సంస్థల లానే ఫోర్డ్ సైతం చిక్కుల్లో పడింది. తగినంత సరఫరాలు లేక అమెరికాలోనే గిరాకీకి తగినంత ఉత్పత్తి చేయలేని పరిస్థితి. మూడేళ్ళుగా భారత ఆర్థికవ్యవస్థ మందకొడిగా ఉంది. ఆటోమొబైల్ మార్కెట్లో మునుపటి జోరూ తగ్గింది. 2020 నాటికి దేశంలో 50 లక్షల మేర ప్రయాణికుల కార్ల అమ్మకాలుంటాయని అంచనా వేస్తే, 30 లక్షలలోపునకే పరిమితమైంది. ఇంకా చేతులు కాల్చుకోవడం అర్థం లేదని బ్రెజిల్లో లాగానే ఇక్కడా ఫోర్డ్ ఇంటిదారి పడుతోంది. దేశంలో పెట్టుబడి పెట్టిన అంతర్జాతీయ సంస్థల మనుగడకు అవసరమైన కనీస ప్రయోజనాలను గద్దెనెక్కిన ప్రభుత్వాలూ పట్టించుకోలేదు. వేసే పన్నుల్లో తేడాలతో సహా మార్కెట్ మొత్తం చిన్నకార్లకే అనుకూలంగా మార్చేశాయి. కార్ల వినియోగదారుల, ఉత్పత్తిదారుల సంగతి మన విధాననిర్ణేతలు ఎందుకనో పట్టించుకోనే లేదు. దాంతో, మార్కెట్లో 70 శాతం రెండే రెండు సంస్థల చేతిలో ఉంటే, మిగిలిన వాటా కోసం పదికి పైగా సంస్థలు పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. భారంగా మారిన పెట్రోల్ ధరలు, ఉద్గారాలపై ప్రభుత్వ విధాన నిర్ణయాలలో పదే పదే మార్పులు, కరోనాతో మూలిగే నక్కపై తాటిపండు పడింది. భారత్‌లో కార్ల తయారీని ఫోర్డ్ ఆపేయడం వల్ల దాని కర్మాగారాల్లో పని చేసే నాలుగన్నర వేల మంది దాకా ఉద్యోగులే కాక, ఆ తయారీపై ఆధారపడ్డ అనేక అనుబంధ వ్యాపార వర్గాలు, శ్రామిక వర్గం వీధిన పడక తప్పదు. ఆర్థికవ్యవస్థ అస్తుబిస్తుగా ఉన్న వేళ ఈ ఉద్యోగ, ఉపాధి అవకాశాల నష్టంతో పాటు ప్రభుత్వానికి చెడ్డ పేరూ తప్పదు. గ్యాసోలిన్ వాహనాలపై సర్కారు వారి అధిక పన్నుభారం సైతం విదేశీ సంస్థల భాగస్వామ్యానికి పెను సమస్య. ఇప్పుడిక, టెలికామ్ లానే, ఆటోమొబైల్ రంగంలో కూడా అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు భారత్ తగినది కాదనే ముద్ర పడిపోతుంది. ప్రభుత్వ విధానలోపాలతో ఈ రెండు రంగాలూ ఏవో రెండు సంస్థలకే పట్టం కట్టే ‘ద్విధాధిపత్యా’నికి చోటిచ్చాయి. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏలు) లేకపోవడం, క్షేత్రస్థాయి పరిస్థితులు – ఇలా అనేక కారణాల వల్ల కనీసం ఆటో, ఆటో అనుబంధ తయారీ కేంద్రంగానైనా భారత్ అవతరించ లేకపోయింది. ఎలక్ట్రిక్ వాహనాల వైపు మారిపొమ్మంటున్న కేంద్ర వైఖరి వల్ల కార్ల తయారీ సంస్థలకు మరింత సంక్షోభం తప్పదు. అయితే, రేపు ఎలక్ట్రిక్ వాహనాల శకం వచ్చినా ఇటు బ్యాటరీలు, అటు చిప్‌ల తయారీదార్లను దేశంలోకి ఆకర్షించలేకపోతే, దేశ ఆర్థికానికి ఒరిగేదేమీ లేదు. నిజానికి, 1990లు, 2000ల కాలంలో మన దేశంలోకి పెట్టుబడులను ఆకర్షించి, ఉద్యోగాల కల్పనకు తోడ్పడ్డ కొద్ది రంగాల్లో ఆటోమొబైల్ రంగం ఒకటి. అందులోనే ఇప్పుడు ఆకర్షణను పోగొట్టుకుంటే, లోపం మన విధానాల్లోనూ ఉన్నట్టేగా! -
భారత్ ఆటోమొబైల్.. ‘అమ్మో’రికా!
న్యూఢిల్లీ: ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్ అయిన భారత్‌లో.. అమెరికన్ కంపెనీలు రాణించలేక చతికిలపడుతున్నాయి. ఆశావహ అంచనాలతో అడుగుపెట్టడం.. ఆఖరుకు తట్టా బుట్టా సర్దుకుపోవడం యూఎస్ బ్రాండ్లకు పరిపాటిగా మారిందనడంలో అతిశయోక్తి లేదు. భారత్ మార్కెట్ నాడిని పట్టుకోవడంలో వైఫల్యం.. ఇక్కడి పన్నులు చిన్న కార్లకు అనుకూలంగా ఉండడం వాటి వైఫల్య కారణాల్లో ప్రధానమైనవి. జనరల్ మోటార్స్ (చెవ్రోలెట్), హార్లే డేవిడ్సన్ నష్టాల కారణంగా భారత్ మార్కెట్ నుంచి నిష్క్రమించగా.. తాజాగా ఫోర్డ్ మోటార్స్ కూడా ఇదే విధమైన నిర్ణయం తీసుకుంది. ఇవన్నీ ప్రపంచ మార్కెట్లో దిగ్గజ బ్రాండ్లు కావడం గమనార్హం. దీంతో భారత ఆటో మార్కెట్ ప్రపంచ ఆటో దిగ్గజాలకు, ముఖ్యంగా అమెరికన్ కంపెనీలకు ఎందుకు మిస్టరీగా ఉంటోందన్న ప్రశ్న మరోసారి ఉదయించింది. ముందు అంచనాలు ఘనంగానే ఉంటాయి. కానీ భారత్ మార్కెట్లోకి ప్రవేశించిన తర్వాత అమెరికా కంపెనీల అంచనాలు మారిపోతున్నాయి. ఒక స్థాయికి మించి పెట్టుబడులు పెట్టేందుకు ఈ కంపెనీలు సాహసించడం లేదు. ఇదే మార్కెట్లో దక్షిణ కొరియా, జపాన్, ఆఖరుకు చైనా కంపెనీలు పోటీపడుతూ బలంగా చొచ్చుకుపోతుంటే.. అమెరికా కంపెనీలకే ఈ పరిస్థితి ఎందుకన్నది చర్చనీయాంశంగా మారింది. వృద్ధి బలహీనం భారత్ ఆటోమొబైల్ మార్కెట్లో పోటీ తీవ్ర స్థాయిలోనే ఉంటోంది. దీనికితోడు 2010 నుంచి 2020 ఆర్థిక సంవత్సరం మధ్య విక్రయాల్లో వార్షిక వృద్ధి 3.6 శాతం మించి లేదు. అంతకుముందు పదేళ్ల కాలంలో విక్రయాల్లో వృద్ధి 10 శాతంపైనే కొనసాగుతూ వచ్చింది. వృద్ధి బలహీనంగా> ఉండడం కూడా అమెరికా కంపెనీల కష్టాలకు కారణమేనని చెప్పుకోవచ్చు. 2011లో ఫోర్డ్ అత్యధికంగా 98,537 కార్లను విక్రయించగా.. అదే గరిష్టంగా మిగిలిపోయింది. ఇందులో సగం కార్లను హ్యుందాయ్ మోటార్ ఇండియా ఒక్క నెలలోనే విక్రయిస్తుండడాన్ని పరిశీలించాలి. మారుతి సుజుకీ తర్వాత దేశీ కార్ల మార్కెట్లో హ్యుందాయ్ రెండో దిగ్గజంగా కొనసాగుతోంది. ఫలించని ఫోర్డ్ ప్రయత్నాలు ఫోర్డ్ మోటార్స్ 2019లో మహీంద్రా అండ్ మహీంద్రాతో కలసి జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అందులో ఫోర్డ్‌కు 49 శాతం వాటా, మహీంద్రాకు మెజారిటీ వాటాను ప్రతిపాదించాయి. ఈ ప్రయత్నంతో అయినా నష్టాలకు చెక్‌పెట్టి.. లాభాల్లోకి ప్రవేశించొచ్చని ఫోర్డ్ ఆశపడగా.. అది కూడా సఫలం కాలేదు. జాయింట్ వెంచర్ ప్రతిపాదన నుంచి రెండు సంస్థలు గతేడాది విరమించుకున్నాయి. కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నాయి. గత పదేళ్లలో రెండు బిలియన్ డాలర్లకు పైగా నష్టాలను (రూ.15వేల కోట్లు) మూటగట్టుకున్న ఫోర్డ్.. ఇక్కడ ఇక నెగ్గలేమన్న నిశ్చితాభిప్రాయానికి వచ్చేసింది. ఫలితమే నిష్క్రమణ నిర్ణయం. ఖరీదైన బైక్‌లకు పేరొందిన హార్లేడేవిడ్సన్ కూడా 2020 సెప్టెంబర్‌లో భారత్ మార్కెట్లో ప్రత్యక్ష కార్యకలాపాలకు స్వస్తి పలుకుతున్నట్టు ప్రకటించడం గమనించాలి. విక్రయాలు ఆశించిన మేర లేకపోవడం, బైక్‌ల తయారీని స్థానికంగా చేపట్టకుండా దిగుమతులపైనే ఈ సంస్థ ఆధారపడడం ప్రతిబంధకాలుగా మారాయి. దిగుమతి చేసుకునే బైక్‌లపై పన్నుల భారం అధికంగా ఉండడంతో.. దీన్ని తగ్గించాలని అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం పలు సందర్భాల్లో భారత్‌ను పరోక్షంగా హెచ్చరించారు కూడా. అయినా ఆ ఒత్తిళ్లకు భారత్ తలొగ్గలేదు. దీంతో భారత్‌లో నేరుగా విక్రయ కార్యకలాపాల నుంచి తప్పుకుంటున్నట్టు హార్లే డేవిడ్సన్ ప్రకటించింది. ఆ తర్వాత భారత్‌లో హార్లే డేవిడ్సన్ విక్రయాలు, సర్వీసు కోసం హీరో మోటోతో డీల్ కుదుర్చుకోవడం గమనార్హం. సరైన వ్యూహాల్లేకపోవడం? భారత కస్టమర్లు ‘వ్యాల్యూ ఫర్ మనీ’ చూస్తారు. తాము పెడుతున్న డబ్బుకు తగిన విలువ లభిస్తుందా? అని ఎక్కువ మంది పరిగణించే అంశం. అమెరికా దిగ్గజాలు.. ప్రపంచంలోని ఇతర మార్కెట్లలో మాదిరే భారత్‌లోనూ ‘బిగ్ ఈజ్ బ్యూటిఫుల్’ (పెద్దదే ముద్దు) మంత్రం ఫలిస్తుందన్న అంచనాలు తప్పాయి. చిన్న కార్లు, తక్కువ ఖరీదున్న బైక్‌లకే ఇక్కడ పెద్ద మార్కెట్ అన్న సూక్ష్మాన్ని అవి గుర్తించలేకపోయాయి. భారత్‌లో ప్రతీ 10 కార్లు, మోటారుసైకిళ్ల విక్రయాల్లో 7 బడ్జెట్ విభాగంలోనివే ఉంటున్నాయి. పైగా ఇతర మార్కెట్లలో మాదిరే ఉత్పత్తులు, మార్కెటింగ్ విధానాలు భారత్‌లో ఫలిస్తాయన్న అంచనాలూ సరికాదు. భారత కస్టమర్లు విక్రయానంతర సేవలనూ దృష్టిలో పెట్టుకుంటారన్నది నిజం. మారుతీ, హ్యాందాయ్, ఇటీవలే ప్రవేశించిన కియా మెరుగ్గా రాణించడానికి మార్కెట్నాడిని పట్టుకోవడం వల్లేనని ఓ విశ్లేషకుడు పేర్కొన్నారు. ‘‘జపాన్, కొరియా సంస్థల్లా కాకుండా.. ఇతర పాశ్చాత్య వాహన కంపెనీలు బలహీన యాజమాన్య నిర్వహణ, భారత్ లో పోటీ విషయం లో బలహీన అంచనా లే అవి రాణించలేకపోవ డానికి కారణాలు’’ అని రెనో అండ్ స్కోడా భారత ఆపరేషన్స్‌కు గతంలో చీఫ్‌గా పనిచేసిన సుధీర్‌రావు చెప్పారు. పన్నుల పాత్ర.. జీఎం, ఫోర్డ్, ఇతర అంతర్జాతీయ ఆటోమొబైల్ కంపెనీలు భారత్‌లో విజయం సాధించలేకపోవడం వెనుక పన్నుల పాత్ర కూడా ఉందని పరిశ్రమల వర్గాల అభిప్రాయంగా ఉంది. ఇక్కడి పన్నులు చిన్న కార్లకు అనుకూలంగా ఉన్న విషయాన్ని పేర్కొంటున్నారు. నాలుగు మీటర్ల కంటే తక్కువ పొడవు, 1.2 లీటర్ల సామర్థ్యం వరకు ఇంజన్లు కలిగిన కార్లపై జీఎస్టీ 28 శాతం, ఒక శాతం సెస్సు అమల్లో ఉంది. ఇంతకుమించి పొడవు, ఇంజన్ సామర్థ్యాలతో కూడిన కార్లపై పన్ను భారం 50% వరకు ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ప్రపంచంలో మరెక్కడా ఈ తరహా పన్నుల విధానం లేదని టొయోటా కిర్లోస్కర్ మోటార్ మాజీ వైస్ చైర్మన్ శేఖర్ విశ్వనాథన్ పేర్కొన్నారు. చిన్న కార్ల మోడళ్లను తీసుకొచ్చినా విక్రయాలు భారీగా ఉంటే తప్ప లాభసాటి కాదన్నారు. ‘టొయోటా ఒక్క ఇన్నోవా వాహనం విక్రయంపై వచ్చిన లాభాన్ని.. చిన్న కార్ల నుంచి తెచ్చుకోవాలంటే కనీసం 80 ఎటియోస్లను విక్రయించాల్సి ఉంటుంది’ అన్నారు. -
బడాబడా కంపెనీలు భారత్ వీడిపోవడానికి కారణం ఇదేనా..!
ప్రముఖ అమెరికా ఆటో మొబైల్ దిగ్గజం ఫోర్డ్ భారత్‌లో తన ఉత్పత్తి నిలిపివేస్తు కీలక నిర్ణయం తీసుకున్న నిర్ణయం తెలిసిందే. గత నాలుగు సంవత్సరాలు క్రితం 2017లో జనరల్‌మోటార్స్ కూడా భారత్‌ను వీడింది. పలు విదేశీ కంపెనీలు తట్టబుట్టా సర్దుకుని భారత్‌ను వీడుతున్నాయి. ఒక్కసారిగా భారత్‌ను వీడటంతో ఆయా కంపెనీల డీలర్లపై భారీ ప్రభావం పడనుంది. అంతేకాకుండా కంపెనీల ఉద్యోగుల జీవితాలు ఆగమ్యాగోచరం కానుంది.. హ్యూందాయ్ మినహా మిగిలిన విదేశీ ఆటోమొబైల్ కంపెనీలు భారత్ ఆటోమొబైల్ రంగంలో కేవలం ఆరుశాతం వాటాను మాత్రమే కల్గిఉన్నాయి. భారత మార్కెట్లో ఫోర్డ్ 2 శాతం కంటే తక్కువ , ఫోక్స్‌వ్యాగన్ ఒక శాతం మేర మాత్రమే వాటాలను కల్గి ఉంది. ప్రపంచమార్కెట్లో అత్యంత విజయంతమైన టయోటా కూడా భారత్‌లో కేవలం 3 శాతం వాటానే కల్గి ఉంది. చదవండి: సెడాన్ అమ్మకాల్లో ఆ కారుదే అగ్రస్థానం పన్నుల భారమే కారణమా..! అధిక పన్నుల భారం వలనే పలు విదేశీ కంపెనీలు భారత్ నుంచి బయటకు వెళ్తున్నట్లు బిజినెస్ స్టాండర్ట్ లిమిటెడ్ చైర్మన్ టీఎన్ టీనన్ అభిప్రాయపడ్డారు. టయోటా గతంలో భారీ పన్నుల భారం విషయంపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. టయోటా భారత మార్కెట్ల నుంచి ఎటియోస్, కరోలా ఆల్టిస్ మోడళ్లను నిలిపివేసింది. విదేశీ ఆటోమొబైల్ దిగ్గజాలు భారత మార్కెట్లో సుస్థిర స్థానాలను నిలుపుకోవడానికి ఎంతగా ప్రయత్నించిన పలు కంపెనీలు నిలవలేకపోయాయి. కొద్ది రోజుల ప్రముఖ దిగ్గజ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ భారత్‌లోకి వచ్చేందుకు దిగుమతి సుంకాలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాలను విన్నవించిన విషయం తెలిసిందే. విదేశీ కార్లపై ట్యాక్స్ విషయంలో టెస్లా, హ్యుందాయ్, బెంజ్, ఫోక్స్‌వ్యాగన్ కంపెనీలు కేంద్రానికి విజ్ఞప్తులు చేశాయి. విదేశీ కంపెనీల కార్లపై ప్రభుత్వం సుమారు 100 శాతం మేర ట్యాక్స్‌లను వసూలు చేస్తోంది. భారత్‌లో వాటికే ఎక్కువ ప్రాధాన్యం..! భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కొనుగోలుదారులు ఎక్కువగా తక్కువ ఖర్చుతో నడిచే తక్కువ ధర కలిగిన కార్లపై ఎక్కువ మోజు చూపుతారు. తక్కువ ఖర్చుతో వచ్చే వాహనాలు విదేశీ కంపెనీల దగ్గర సరిపోయే మోడల్స్ లేవు. భారత మార్కెట్లో మారుతి, హ్యుందాయ్ మాత్రమే విజయవంతమైన ప్రవేశ-స్థాయి కార్ మోడళ్లను కలిగి ఉన్నాయి. ఫోర్డ్, టయోటా , ఫోక్స్‌వ్యాగన్, వంటి కంపెనీల నుంచి భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన మారుతి ఆల్టోతో పోటీ పడే కార్లు ఆయా విదేశీ ఆటోమొబైల్ కంపెనీల వద్ద లేవు. మారుతి ఆల్టో ఎంట్రీ లెవల్ మార్కెట్లో రూ.3 లక్షల నుంచి కొనుగోలుదారులకు అందుబాటులో ఉంది. ఇంతా తక్కువ ఖర్చులో భారత వాహన ప్రియులకు తయారుచేయడం బడాబడా కంపెనీలకు అంతగా తెలియదు. హ్యూందాయ్ లాంటి కంపెనీలు భారత ప్రజలకు తగ్గట్టుగా బహిరంగ మార్కెట్లోకి వాహనాలను తీసుకురావడంతో తన స్థానాన్ని పదిలంగా నిలుపుకుంటుంది. వాహన కొనుగోలు దారుల కొనుగోలు స్థాయి గణనీయంగా పెరిగింది. దీంతో చాలా మంది కొనుగోలుదారులు మారుతి 800సీసీ కారు నుంచి రూ. 6 లక్షల నుంచి 10 లక్షల మధ్య వచ్చే కార్లను కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యారు. హ్యుందాయ్ నుంచి ఐ20, సుజుకి నుంచి స్విఫ్ట్ బాలెనో, టాటా మోటార్స్ కు చెందిన టియాగో, ఆల్ట్రోజ్ వంటి కార్లపై ఎక్కువగా ఆదరణను పొందాయి. చదవండి : Ford: ప్లీజ్ మమ్మల్ని వదిలేసి వెళ్లొద్దు! -
ఫోర్డ్... రివర్స్‌గేర్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న యూఎస్ కంపెనీ ఫోర్డ్ మోటార్ భారత్‌లోని తయారీ కేంద్రాలను మూసివేస్తోంది. అలాగే ఎకో స్పోర్ట్, ఫిగో, అసై్పర్ మోడళ్ల అమ్మకాలకు స్వస్తి పలకనుంది. ముస్టాంగ్ కూపే, మ్యాచ్–ఈ వంటి దిగుమతి చేసుకున్న వాహనాలను మాత్రమే ఇక్కడ విక్రయించనున్నట్టు గురువారం ప్రకటించింది. పునరి్నర్మాణ కార్యక్రమంలో భాగంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. సరీ్వస్, విడి భాగాలు, వారంటీ కవరేజ్ కోసం పూర్తి కస్టమర్ సపోర్ట్ కార్యకలాపాలను కొనసాగిస్తామని కంపెనీ తెలిపింది. గుజరాత్ సనంద్‌లోని అసెంబ్లింగ్ సెంటర్‌ను ఈ ఏడాది అక్టోబర్–డిసెంబర్ మధ్య, చెన్నైలోని వాహనాలు, ఇంజన్ల తయారీ కేంద్రాన్ని 2022 ఏప్రిల్–జూన్ కాలంలో మూసివేస్తామని కంపెనీ వెల్లడించింది. అమెరికా వాహన కంపెనీల్లో భారత్‌లో ప్లాంట్లను మూసివేసిన తొలి సంస్థ జనరల్ మోటార్స్ కాగా రెండోది ఫోర్డ్ కానుంది. విలువను సృష్టించడానికి.. ‘ఫోర్డ్ ప్లస్ ప్రణాళికలో భాగంగా స్థిర, లాభదాయక వ్యాపారాన్ని దీర్ఘకాలికంగా అందించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. సరైన స్థాయిలో వృద్ధికి, విలువను సృష్టించడానికి మూలధనాన్ని కేటాయిస్తాం’ అని ఫోర్డ్ మోటార్ కంపెనీ ప్రెసిడెంట్ జిమ్ ఫార్లే ఈ సందర్భంగా తెలిపారు. ‘డీలర్లతో కలిసి పనిచేస్తూ విలువైన కస్టమర్ల కోసం శ్రద్ధ వహిస్తాం. భారత్ మాకు వ్యూహాత్మకంగా ముఖ్యమైనది. ప్రపంచవ్యాప్తంగా భారీ, ముఖ్యమైన ఉద్యోగుల స్థావరంగా ఫోర్డ్ బిజినెస్ సొల్యూషన్స్ కొనసాగుతుంది’ అని వివరించారు. ఫోర్డ్ బిజినెస్ సొల్యూషన్స్‌లో 11,000 పైచిలుకు మంది పనిచేస్తున్నారు. సామర్థ్యంలో 21 శాతమే.. భారత్‌లో వాహనాల తయారీలో కంపెనీ పెట్టుబడులు కొనసాగించడానికి, అందుకు తగ్గ రాబడిని అందించే మార్గాన్ని చూపించాల్సిన అవసరం ఉందని ఫోర్డ్ ఇండియా ప్రెసిడెంట్ అనురాగ్ మెహరోత్రా అన్నారు. ‘దురదృష్టవశాత్తు మేము మార్గాన్ని చూపించలేకపోయాం. ఇప్పుడు భారతదేశంలో వ్యాపారాన్ని పునరి్నరి్మంచడం తప్ప మరో మార్గం లేదు. కొత్త ఉత్పత్తుల పరిచయం, వ్యయాలను తగ్గించడానికి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లపై దృష్టి, మహీంద్రా వంటి సంస్థలతో భాగస్వామ్యం, కాంట్రాక్ట్ తయారీతో సహా చేపట్టిన ప్రయత్నాలన్నీ విఫలమైన తర్వాత కంపెనీ పునర్నిర్మాణ చర్య తీసుకుంది. భారత ఆటోమొబైల్ రంగంలో అంచనాలకు తగ్గట్టుగా వృద్ధి లేదు. మా ప్లాంట్లు స్థాపిత సామర్థ్యంలో కేవలం 21 శాతం మాత్రమే పనిచేస్తున్నాయి. అందుకే మేము ఎగుమతులపై దృష్టి పెట్టాం. కానీ యూఎస్, యూరప్‌లో నిబంధనలను కఠినతరం చేయడంతో పరిమాణం పడిపోయింది. ఉపాధి కోల్పోయిన ఉద్యోగులకు సహేతుక ప్యాకేజీ ఇస్తాం. ప్లాంట్ల విషయంలో కొనుగోలుదార్లతో చర్చిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు. దేశంలో భారీ పెట్టుబడులు.. రెండు ప్లాంట్లపై సంస్థ రూ.18,500 కోట్లు పెట్టుబడి చేసింది. ఏటా 6,10,000 ఇంజన్లు, 4,40,000 వాహనాల తయారీ సామర్థ్యం ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఎకో స్పోర్ట్, ఫిగో, అస్పైర్ మోడళ్లు తయారవుతున్నాయి. 70 దేశాలకు వీటిని ఎగుమతి చేస్తున్నారు. ఇక నుంచి వీటి తయారీతోపాటు విక్రయాలు సైతం భారత్‌లో నిలిచిపోనున్నాయి. గత 10 ఏళ్లలో కంపెనీ నిర్వహణ నష్టాలు రూ.14,800 కోట్లు పేరుకుపోయాయి. భారీ స్థాయిలో పెట్టుబడులు చేసినప్పటికీ అంచనాలకు తగ్గట్టుగా కార్లకు డిమాండ్ లేకపోవడం సమస్యను తీవ్రం చేసింది. కంపెనీ నిర్ణయం 4,000 మంది ఉద్యోగులతోపాటు 300 ఔట్లెట్లను నిర్వహిస్తున్న 150 డీలర్íÙప్స్ ప్రిన్సిపల్స్‌పైన పడనుంది. డీలర్లకు షాక్... రూ.2,000 కోట్ల పెట్టుబడులపై ప్రభావం ‘ఫోర్డ్ డీలర్లు రూ.2,000 కోట్లకుపైగా పెట్టుబడి చేశారు. కంపెనీ నిర్ణయం షాక్‌కు గురి చేసింది’ అని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. 40,000 పైచిలుకు ఉద్యోగులు ఈ డీలర్ల వద్ద పనిచేస్తున్నట్టు వివరించింది. రూ.150 కోట్ల విలువైన 1,000 వాహనాలు వీరి వద్ద నిల్వ ఉన్నట్టు ఫెడరేషన్ ప్రెసిడెంట్ వింకేశ్ గులాటీ వెల్లడించారు. ‘డెమో వెహికిల్స్ సైతం డీలర్ల వద్ద ఉన్నాయి. అయిదు నెలల క్రితం వరకు కూడా డీలర్లను కంపెనీ నియమించుకుంది. ఇటువంటి డీలర్లు భారీగా నష్టపోతారు. ఫ్రాంచైజీ ప్రొటెక్షన్ యాక్ట్‌ను కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకురావాలి. పార్లమెంటరీ కమిటీ ఈ విషయాన్ని ప్రతిపాదించింది కూడా. 2017 నుంచి భారత మార్కెట్లో జనరల్ మోటార్స్, మ్యాన్ ట్రక్స్, హార్లే డేవిడ్సన్, యూఎం లోహియా.. తాజాగా ఫోర్డ్ ఇండియా బోర్డ్ తిప్పేసింది’ అని అన్నారు. -
భారత్‌కు గుడ్‌బై చెప్పిన మరో దిగ్గజ కంపెనీ..!
అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ మోటార్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో ఫోర్డ్ కంపెనీ కార్ల ప్లాంట్లను మూసివేస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో భారత్‌లో ఫోర్డ్ కంపెనీ కార్ల ఉత్పత్తి నిలిచిపోనుంది. సనంద్, చెన్నై నగరాల్లోని ప్లాంట్లను ఫోర్డ్ మూసివేయనుంది. కంపెనీకి భారీ నష్టాలు, బహిరంగ మార్కెట్లో వృద్ధి లేకపోవడంతో ఫోర్డ్ మోటార్ కంపెనీ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: India’s First Electric Vehicle : భారత తొలి ఎలక్ట్రిక్ కారు ఇదేనండోయ్..! లాభాలకంటే నష్టాలే ఎక్కువ..! 2021 నాల్గవ త్రైమాసికం నాటికి గుజరాత్‌లోని సనంద్‌లో వాహనాల తయారీని, 2022 రెండవ త్రైమాసికానికి చెన్నైలో వాహన ఇంజిన్ తయారీని ఫోర్డ్ నిలిపివేస్తుందని ఫోర్డ్ ఒక ప్రకటనలో తెలిపింది. జీఎమ్ మోటార్స్ తరువాత భారత్ నుంచి వైదొలుగుతున్న రెండో కంపెనీగా ఫోర్డ్ నిలిచింది. 2017లో జనరల్ మోటార్స్ భారత్‌లో కార్ల అమ్మకాలను నిలిపివేసింది. గత 10 సంవత్సరాలలో 2 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా నిర్వహణ నష్టాలను ఫోర్డ్ చవిచూసింది. భారత్‌లో స్థిరమైన లాభదాయకమైన వ్యాపారాన్ని సృష్టించడానికి పునర్నిర్మాణ చర్యలు తీసుకున్న పెద్ద ఉపయోగం లేకుండా పోయింది. తాజాగా ఫోర్డ్ తీసుకున్న నిర్ణయం కంపెనీలో పనిచేసే 4 వేల మంది ఉద్యోగుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారనుంది. కోవిడ్ -19 లాక్డౌన్, డేటెడ్ ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోతో ఫోర్డ్ మరింత నష్టపోతున్న స్థానిక సంస్థగా తయారైంది. జులై నాటికి, సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) షేర్ చేసిన డేటా ప్రకారం ఫోర్డ్ రెండు ప్లాంట్లలో ఉన్న 450,000 యూనిట్ల ఇన్స్టాల్ చేయబడిన సామర్థ్యంలో కేవలం 20 శాతం యూనిట్లను మాత్రమే ఆపరేట్ చేస్తోన్నట్లు తెలుస్తోంది. ఫోర్డ్ ఇప్పటివరకు భారత్‌లో సుమారు రెండు బిలియన్ డాలర్లపైగా పెట్టుబడి పెట్టింది. 350 ఎకరాల చెన్నై ప్లాంట్ సంవత్సరానికి 200,000 యూనిట్లు, 340,000 ఇంజిన్ల వాహన తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. సనంద్ ప్లాంట్ 460 ఎకరాలలో విస్తరించి ఉండగా, సంవత్సరానికి 240,000 యూనిట్లు, 270,000 ఇంజిన్ల వాహన తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఫోర్డ్ మోటార్ కంపెనీ 1.57 శాతం మార్కెట్ వాటాతో, భారత అతిపెద్ద కార్ల తయారీదారుల జాబితాలో ఫోర్డ్ తొమ్మిదవ స్థానంలో నిలిచింది. ఫోర్డ్ ఫిగో, ఆస్పైర్, ఫ్రీస్టైల్, ఎకోస్పోర్ట్, ఎండీవర్ భారత్‌లో ఐదు మోడళ్లను విక్రయిస్తుంది చదవండి: BMW i Vision AMBY : ది సూపర్ ఎలక్ట్రిక్ సైకిల్..! రేంజ్ తెలిస్తే షాక్..! -
ఆటోమేటిక్ గేర్ బాక్స్ గల కారును లాంచ్ చేసిన ఫోర్డ్
ఆటోమేటిక్ గేర్ బాక్స్ గల ఫిగో కారును ఫోర్డ్ నేడు(జూలై 22) భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర ₹7.75 లక్షలు(ఎక్స్ షోరూమ్)గా ఉంది. ఫోర్డ్‌ఫిగో ఆటోమేటిక్ కారు మిడ్-స్పెక్ టైటానియం, టైటానియం ప్లస్ ట్రిమ్స్ లో అందుబాటులో ఉంటుంది. ఫోర్డ్ సబ్ కాంపాక్ట్ ఎస్యువీ ఎకోస్పోర్ట్ లో ఉపయోగించిన గేర్ బాక్స్ ఇందులో వాడారు. దీనిలో గల ఇంజిన్ గరిష్ఠంగా 95 బిహెచ్ పీ పవర్, 119 ఎన్ఎమ్ పీక్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనిలో మరింత పెప్పీ డ్రైవింగ్ అనుభవం కోసం 'స్పోర్ట్' మోడ్ ను అందించారు. ఫోర్డ్ ఫిగో ఆటోమేటిక్ కారు 16 కి.మీ.పీ.ఎల్(ఏఆర్ఏఐ సర్టిఫైడ్) మైలేజ్ ఇవ్వనున్నట్లు సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న ఫిగో హ్యాచ్ బ్యాక్స్ డీజిల్ వేరియెంట్లకు ఆటోమేటిక్ గేర్ బాక్స్ లభించదు. రెగ్యులర్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఎప్పటిలాగే ఫిగో ఇతర వేరియెంట్లలో కొనసాగుతుంది. 2021 ఫిగో ఆటోమేటిక్ కొత్త డ్యూయల్ టోన్ 15 అంగుళాల అలాయ్ వీల్స్ తో రీడిజైన్ చేయబడ్డాయి. ఇక ఇతర ఫీచర్ల విషయానికి వస్తే కొత్త ఫిగో ఆటోమేటిక్ 7.0 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రెయిన్ సెన్సింగ్ వైపర్ లు, రిమోట్ కీలెస్ వంటివి ఉన్నాయి. భద్రతా కోసం ఇందులో ఆరు ఎయిర్ బ్యాగులు, ఈబీడీతో ఏబిఎస్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్-లాంచ్ అసిస్ట్ లను పొందుతుంది. -
జేవీకి.. ఫోర్డ్, మహీంద్రాల ‘టాటా’
న్యూఢిల్లీ, సాక్షి: దేశీయంగా భాగస్వామ్య సంస్థ(జేవీ)ను ఏర్పాటు చేయాలన్న ప్రణాళికలకు తెరదించినట్లు తాజాగా ఆటో రంగ దిగ్గజాలు ఫోర్డ్ మోటార్, మహీంద్రా అండ్ మహీంద్రా వెల్లడించాయి. కోవిడ్-19 నేపథ్యంలో గత 15 నెలలుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకున్న మార్పుల ప్రభావంతో జేవీ ఆలోచనను విరమించుకున్నట్లు రెండు కంపెనీలూ విడిగా తెలియజేశాయి. గతేడాది అక్టోబర్‌తో పోలిస్తే వ్యాపార వాతావరణంలో పలు మార్పులు చోటు చేసుకున్నట్లు ఫోర్డ్ మోటార్ ప్రతినిధి టీఆర్ రీడ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. జేవీ ఏర్పాటుకు ఏడాది కాలంగా రెండు కంపెనీలూ ప్రణాళికలు వేస్తూ వచ్చాయి. ఇందుకు గడువు డిసెంబర్ 31తో ముగియనుండటంతో జేవీ ఆలోచనకు స్వస్తి చెప్పాయి. నిజానికి తొలి ప్రణాళికల ప్రకారం పెట్టుబడులకు సంబంధించి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం లేదా గడువును పెంచుకోవడం వంటివి చేపట్టవలసి ఉన్నట్లు ఆటో వర్గాలు తెలియజేశాయి. అయితే కోవిడ్-19 కారణంగా మారిన పరిస్థితులతో వెనకడుగు వేసినట్లు పేర్కొన్నాయి. (కార్ల మార్కెట్లో ఆ 5 కంపెనీలదే హవా) వర్ధమాన మార్కెట్లకు వర్ధమాన మార్కెట్లలో విక్రయించేందుకు వీలుగా చౌక వ్యయాలతో వాహనాల తయారీ కోసం ఫోర్డ్, ఎంఅండ్ఎం జేవీని ఏర్పాటు చేయాలని 2019లో ప్రణాళికలు వేశాయి. వీటిలో భాగంగా మూడు కొత్త యుటిలిటీ వాహనాలను అభివృద్ధి చేయాలని భావించాయి. మధ్యతరహా ఎస్యూవీ తయారీతో వీటిని ప్రారంభించాలని యోచించాయి. అంతేకాకుండా వర్ధమాన మార్కెట్లలో విక్రయించేందుకు వీలుగా ఎలక్ట్రిక్ వాహనాలను సైతం రూపొందించాలని ప్రణాళికలు వేశాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వాహన తయారీ ప్రణాళికలపై ఎలాంటి వివరాలనూ వెల్లడించలేమని రీడ్ స్పష్టం చేశారు. (యాపిల్ నుంచి సెల్ఫ్‌డ్రైవింగ్ కారు!) ఒత్తిడి పెరుగుతోంది మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎలక్ట్రిక్ వాహనాలు, సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల తయారీపై ఇటీవల పలు కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి. అయితే వీటి అభివృద్ధికి వీలుగా ప్రత్యేకంగా నిధులను వెచ్చించవలసి ఉండటంతో పలు కంపెనీలపై ఒత్తిడి పెరుగుతున్నట్లు ఆటో రంగ నిపుణులు పేర్కొన్నారు. ఇందువల్లనే ఫ్రాన్స్ కంపెనీలు పీఎస్ఏ, ఫియట్ క్రిస్లర్ మధ్య విలీనానికి బాటలు పడినట్లు అభిప్రాయపడ్డారు. 2021 మార్చిలోగా ఈ రెండు కంపెనీల మధ్య 38 బిలియన్ డాలర్ల విలువైన విలీనం జరగనున్న విషయం విదితమే. కాగా.. మహీంద్రా, తదితర కంపెనీలతో జత కట్టడం ద్వారా వాహన తయారీలో వ్యయాలను తగ్గించుకోవాలని ఫోర్డ్ తొలుత భావించింది. తద్వారా ప్రపంచ స్థాయిలో 8 శాతం నిర్వహణ మార్జిన్లను సాధించాలని లక్ష్యాన్ని పెట్టుకుంది. అయితే ఈ వ్యూహాలను కొనసాగించనున్నట్లు రీడ్ తాజాగా స్పష్టం చేశారు. ఇందుకు దక్షిణాసియాలోని మరో కంపెనీపై జత కట్టే వీలున్నట్లు ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు. -
5జీ టెక్నాలజీ: కొత్త తరం కార్లు
సాక్షి, న్యూఢిల్లీ : మోటారు వాహనాల రంగంలో ‘5 జి’ ఇంటర్నెట్ విప్లవాత్మక మార్పులు తీసుకరానుంది. వేగంగా దూసుకెళ్లే కార్లతోపాటు సెల్ఫ్ డ్రైవింగ్ కార్లకు ‘5జీ’ నెట్‌వర్క్‌ను అనుసంధానం చేస్తున్నారు. దీని వల్ల ఓ రోడ్డు మీద వెళుతున్న వాహనాలు ఒకదానికొకటి అతివేగంగా సమాచారం ఇచ్చి పుచ్చుకుంటాయి. తద్వారా ఎదురుకానున్న ప్రమాదాలను ముందే ఊహించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ వాహనాలు ప్రమాదాల నుంచి తప్పించుకోగలవు. ఎదురుగా రోడ్డుపై గుంతలు వున్నా, రోడ్డుకు అడ్డుగా ప్రమాదకరమైనవి ఏవీ ఉన్నా, ముందుగా వెళ్లిన వాహనాల ద్వారా వెనకాల వచ్చే వాహనాలు తెలుసుకోగలవు. ‘5 జీ’ సాంకేతిక పరిజ్ఞానాన్ని సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలు మరింత ఎక్కువగా, సమర్థంగా ఉపయోగించుకోగలవని గ్లాస్గో కెలెడోనియన్ యూనివర్శిటీ (జీసీయూ) నిపుణలు చెప్పారు. ‘టెస్లా లాంటి కార్లు భవిష్యత్తులో 5జీ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకొని తమ చుట్టూ కొన్ని చదరపు మైళ్ల విస్తీర్ణంలో రోడ్డు భద్రతకు సంబంధించిన అంశాలను ఎప్పటికప్పుడు తెలసుకుంటాయి. రోడ్డుపై ఎక్కడైన గుంతలు, రాళ్లు రప్పలు ఉన్నాయా ? వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి? రోడ్డును మంచు కప్పేసిందా ? గాలి దుమారం ఎదురుకానుందా? అన్న విషయాలను ముందుగానే తెలుసుకొని వాటికి అనుగుణంగా స్పందిస్తాయి’ భవిష్యత్ కార్ల పరిశోధనా బృందం సభ్యుడు డాక్టర్ డిమిట్రియాస్ లయరోకాపిస్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో ఏటా 13 లక్షల మంది మరణిస్తుంటే, ఐదు కోట్ల మంది గాయపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు తెలియజేస్తున్నాయి. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని వస్తోన్న కొత్త కార్ల వల్ల ఈ ప్రమాదాలు గణనీయంగా పడిపోతాయని డాక్టర్ డిమిట్రియా చెప్పారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ‘ఫోర్డ్’ కంపెనీ ఇప్పటికే ఈ దిశగా పనులను చేపట్టిందని, ఈ ఏడాది చివరి నాటికి తన కార్లలో 80 శాతం కార్లకు కొత్త 5జీ నెట్‌వర్క్‌ను అనుసంధించాలని లక్షంగా పెట్టుకుంది. -
ఫోర్డ్ కంపెనీ మాజీ ప్రెసిడెంట్ కన్నుమూత
కాలిఫోర్నియో : ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ ఫోర్డ్ మోటార్స్ మాజీ ప్రెసిడెంట్ లీ ఐకాకా మంగళవారం కన్నుమూశారు. పార్కిన్సన్ వ్యాధితో గత కొద్దిరోజులుగా బాధపడుతున్న ఆయన 94వ ఏట బెల్ ఏయిర్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. లిడొ ఆంథోనీ ఐకాకా(లీ ఐకాకా) 1924లో పెన్సిల్వేనియాలోని అలైన్టౌన్లో ఇటాలియన్ దంపతులకు జన్మించారు. 1946లో ఫోర్డ్ మోటార్స్ కంపెనీలో ఇంజినీర్‌గా కెరీన్‌ను మొదలుపెట్టిన ఆయన ఆనతి కాలంలో ఫోర్డ్ కంపెనీ ప్రెసిడెంట్‌గా, క్రిస్లర్ కంపెనీ సీఈఓగా బాధ్యతలు నిర్వహించారు. ఆటో మొబైల్ రంగాన్ని ఐకాకా కొత్త పుంతలు తొక్కించారు. లీ ఐకాక నేతృత్వంలోనే ఫోర్డ్ ముస్టాంగ్, క్రిస్లర్ వ్యాన్లు రూపుదిద్దుకున్నాయి. -
మహీంద్రాతో ఫోర్డ్ జాయింట్ వెంచర్
న్యూఢిల్లీ: భారత మార్కెట్లో అవకాశాలు అందిపుచ్చుకోవడం కష్టతరంగా మారుతుండటంతో విదేశీ ఆటోమొబైల్ కంపెనీలు క్రమంగా కార్యకలాపాలు తగ్గించుకుంటున్నాయి. అమెరికన్ సంస్థ జనరల్ మోటార్స్ .. భారత్‌లో కార్యకలాపాలను తగ్గించుకోవడంతో పాటు దేశీయంగా కార్ల విక్రయాలు నిలిపివేసింది. తాజాగా అదే బాటలో మరో అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్ మోటార్ కూడా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఫోర్డ్ తాజాగా భారత్‌లో మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం)తో కలిసి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ఇందుకు సంబంధించిన ఒప్పందం కుదుర్చుకునే దిశగా జరుపుతున్న చర్చలు తుది దశల్లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో, ఫోర్డ్ భారత్‌లో స్వతంత్రంగా నిర్వహిస్తున్న కార్యకలాపాలను ఇకపై నిలిపివేసే అవకాశాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. చర్చల సారాంశం ప్రకారం కొత్తగా ఏర్పాటు చేయబోయే జాయింట్ వెంచర్లో ఫోర్డ్‌కు 49 శాతం, మహీంద్రాకు 51 శాతం వాటాలు ఉంటాయి. ప్రస్తుతం భారత్‌లో తమ ఆటోమోటివ్ వ్యాపార కార్యకలాపాలు, అసెట్స్, ఉద్యోగులు మొదలైనవన్నీ కూడా ఫోర్డ్ ఈ కొత్త సంస్థకు బదలాయిస్తుంది. ఈ డీల్ విలువ ఎంతన్నది వెల్లడి కానప్పటికీ.. మొత్తం మీద 90 రోజుల్లోగా ఒప్పందం పూర్తి కావొచ్చని అంచనాలు ఉన్నాయి. దీన్ని ఒకరకంగా భారత్ నుంచి ఫోర్డ్ పాక్షిక నిష్క్రమణగానే భావించవచ్చని సంబంధిత వర్గాలు అభిప్రాయపడ్డాయి. ప్రస్తుతం ఫోర్డ్ భారత విభాగం మాతృసంస్థకు రాయల్టీలు చెల్లించాల్సి వస్తుండటం వల్ల కార్ల ధరలు కొంత అధికంగా ఉంటున్నాయి. ఒకవేళ డీల్ కానీ సాకారమైన పక్షంలో రాయల్టీల ప్రసక్తి ఉండదు కాబట్టి.. ఫోర్డ్ కార్ల రేట్లు తగ్గొచ్చన్న అంచనాలు ఉన్నాయి. అలాగే తక్కువ వ్యయాలతో ఫోర్డ్, మహీంద్రా ఎప్పటికప్పుడు కొంగొత్త మోడల్స్‌ను వేగవంతంగా ప్రవేశపెట్టేందుకు ఈ జేవీ ఉపయోగపడనుంది. డీల్ కారణంగా భారత విభాగానికి వచ్చే నిధులతో నష్టాలను కొంత మేర భర్తీ చేసుకోవచ్చని ఫోర్డ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ డీల్ ఒకరకంగా రెండు సంస్థలకు ప్రయోజనకరంగానే ఉండగలదని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. 2017లోనే మహీంద్రాతో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం రెండు సంస్థలూ కలిసి కొత్తగా స్పోర్ట్ యుటిలిటీ వెహికల్స్, ఎలక్ట్రిక్ కార్స్ మొదలైన వాహనాలు నిర్మించాలని తలపెట్టాయి. ప్రస్తుతం మరో అడుగు ముందుకేసి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి. కష్టతరమైన భారత మార్కెట్.. భారత వాహనాల మార్కెట్ వృద్ధి గణనీయంగానే ఉన్నప్పటికీ.. ఇటీవల కొంత మందగించింది. గత ఆర్థిక సంవత్సరం కార్ల అమ్మకాల వృద్ధి కేవలం 3 శాతానికే పరిమితమైంది. 33 లక్షల కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో కార్ల విక్రయాల వృద్ధి ఏకంగా 8 శాతం మేర నమోదైంది. ప్రస్తుతానికి విక్రయాల వృద్ధి మందగించినా 2023 నాటికల్లా ఏటా 50 లక్షల పైచిలుకు అమ్మకాలతో భారత్ ప్రపంచంలోనే మూడో అతి పెద్ద కార్ల మార్కెట్‌గా అవతరించవచ్చని అంచనాలున్నాయి. అయితే, మారుతీ సుజుకీ వంటి దేశీ దిగ్గజం, కొరియాకు చెందిన హ్యుందాయ్ ఆధిపత్యం అధికంగా ఉన్న దేశీ మార్కెట్లో ఇతర దేశాల కార్ల కంపెనీలు పట్టు సాధించడం కష్టతరంగా ఉంటోంది. ఫోర్డ్ గత ఆర్థిక సంవత్సరం కేవలం 93,000 వాహనాలు మాత్రమే విక్రయించగలిగింది. గడిచిన 2 దశాబ్దాల్లో భారత మార్కెట్‌పై ఫోర్డ్ 2 బిలియన్ డాలర్ల పైగా పెట్టుబడులు పెట్టింది. ఇన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నా, భారత మార్కెట్లో ఫోర్డ్ వాటా కేవలం 3 శాతానికే పరిమితమైంది. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే ఫోర్డ్ తాజాగా ప్రత్యామ్నాయ అవకాశాలు పరిశీలిస్తోంది. -
2020కల్లా వాహన తయారీలో భారత్ మూడో స్థానానికి
ఫోర్డ్ మోటార్స్ అంచనా.. కోయంబత్తూరు: భారత్‌లో ఆటోమొబైల్ పరిశ్రమ వేగంగా వృద్ధి చెందుతోందని ఫోర్డ్ మోటార్స్ తెలిపింది. దేశంలో ఆటోమొబైల్ పరిశ్రమ 2020 నాటికి 70 లక్షల వాహనాల తయారీ మార్క్‌ను చేరుకుంటుందని పేర్కొంది. దీంతో భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆటోమొబైల్ తయారీ దేశంగా (అమెరికా, చైనాల తర్వాత) ఆవిర్భవిస్తుందని తెలిపింది. భారత జీడీపీలో ఆటోమొబైల్ రంగం వాటా 7 శాతంగా ఉంటుందని ఫోర్డ్ మోటార్స్ ప్రెసిడెంట్ డేవిడ్ డూబెన్‌స్కీ అభిప్రాయపడ్డారు. ఆయన ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆదివారం మాట్లాడారు. తాము మంచి ఉత్పత్తులను ప్రజలకు అందిస్తున్నామని, మంచి వ్యాపారాభివృద్ధిని నమోదు చేస్తున్నామని అన్నారు.