గతంలో వెళ్లిపోయినవి తిరిగొస్తున్న వైనం
ఆకర్షిస్తున్న చక్కని వృద్ధి అవకాశాలు
మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సై
క్యారీఫోర్, ఫోర్డ్ మోటార్స్ రీ ఎంట్రీ
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే వేగవంతమైన వృద్ధి, అధిక యువ జనాభా, బలమైన వినియోగం.. వెరసి భారత్ మార్కెట్ విదేశీ బ్రాండ్లను ఆకర్షిస్తోంది. గతంలో భారత్ మార్కెట్ నుంచి వెళ్లిపోయిన సంస్థలు పునరాలోచనలో పడ్డాయి. ఇప్పటికే కొన్ని సంస్థలు తిరిగి భారత్‌లోకి పునరాగమనం చేయనున్నట్టు ప్రకటించేశాయి. పలు బహుళజాతి సంస్థలు భారత్‌లో బలమైన వృద్ధి అవకాశాలతో చొచ్చుకుపోతుండగా.. తాము ఎందుకు అలా రాణించకూడదన్న దృక్పథంతో అవి తమ పెట్టుబడుల ప్రణాళికలను సమీక్షించుకుంటున్నట్టు పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా భారత్ ఆశాకిరణంగా కనిపిస్తుండడంతో గతంలో ఇక్కడి నుంచి తట్టా, బుట్టా సర్దేసుకుని వెళ్లిన విదేశీ కంపెనీలు, మరో విడత ఇక్కడ కాలు మోపేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి.
యూరప్‌లో రెండో అతిపెద్ద రిటైల్ చైన్ ‘క్యారీఫోర్’, భారత్‌లోనూ అదే మాదిరి విజయగాధను నమోదు చేయాలని భావించింది. కానీ, విధానాలు ఫలితమివ్వకపోవడంతో 2014 జూలైలో భారత్‌లోని క్యాష్ అండ్ క్యారీ స్టోర్ల వ్యాపారాన్ని మూసేసి వెళ్లిపోయింది. మరో ఫార్మాట్‌తో తిరిగి భారత్‌లోకి వస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. అంతేకాదు అమెరికాకు చెందిన బహుళజాతి ఆటో సంస్థ (డెట్రాయిట్) ఫోర్డ్ మోటార్ 2022 సెప్టెంబర్‌లో భారత్ మార్కెట్‌ను వీడింది.
కరోనా తర్వాత డిమాండ్ క్షీణత, పోటీ పెరిగిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవలే తమిళనాడు సర్కారు ఫోర్డ్ యాజమాన్యంతో మాట్లాడగా.. చెన్నైకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరైమలై ప్లాంట్‌లో తయారీని త్వరలో ప్రారంభిస్తామంటూ ప్రకటించింది. భారత్‌లో అపార అవకాశాలు మరికొన్ని విదేశీ బ్రాండ్లను సైతం ఆకర్షిస్తున్నాయి. దీంతో అవి తిరిగొచ్చేందుకు ఉత్సాహం చూపిస్తున్నాయి.
జాయింట్ వెంచర్లు
అమెరికాకు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహనాల సంస్థ హార్లే డేవిడ్సన్ సైతం తొలుత భారత మార్కెట్లో సొంతంగా వ్యాపార అవకాశాల కోసం ప్రయత్నం చేసి, నష్టాలు వస్తుండడంతో తప్పుకుంది. హీరో మోటోకార్ప్‌తో కలసి జాయింట్ వెంచర్ రూపంలో గతేడాది మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. చైనాకు చెందిన ఫ్యాషన్ సంస్థ షీన్ రిలయన్స్ రిటైల్‌తో టై అప్ పెట్టుకుని భారత్‌లోకి తిరిగి ప్రవేశించింది. క్యారీఫోర్ యూరప్‌లో మలీ్టబ్రాండ్ (బహుళ బ్రాండ్ల) రిటైల్ అవుట్‌లెట్లతో మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు భారత్‌లో ఇదే విధమైన వ్యాపారం కోసం దుబాయ్ అప్పారెల్ గ్రూప్‌తో జట్టు కట్టింది. పోర్డ్ మోటార్స్ సైతం ఈ విడత భారత్‌లో రిటైల్ విక్రయాలు కాకుండా, ఎలక్ట్రిక్ వాహనాల ఎగుమతులకు భారత్‌ను కేంద్రంగా చేసుకోవాలనే ప్రణాళికతో వస్తోంది.
విధానాల ఫలితం..
క్యాష్ అండ్ క్యారీ వ్యాపారం నుంచి మెట్రో సైతం గతేడాది వైదొలగడం గమనార్హం. తన వ్యాపారాన్ని రిలయన్స్‌కు అమ్మేసి వెళ్లిపోయింది. మలీ్టబ్రాండ్ రిటైల్ వ్యాపారం పట్ల వాల్‌మార్ట్ గ్రూప్ సైతం ఆసక్తితో ఉండగా, ఎఫ్‌డీఐ విధానాల్లో స్పష్టత లేమితో.. చివరికి 2018లో 16 బిలియన్ డాలర్లతో ఫ్లిప్‌కార్ట్‌ను సొంతం చేసుకుంది. కానీ, ఆ తర్వాతి కాలంలో ఐకియా, యాపిల్ సంస్థలు ఇక్కడి రిటైల్ మార్కెట్లోకి అడుగు పెట్టడం తెలిసిందే. ప్రభుత్వ ప్రగతిశీల విధానాలతో విదేశీ కంపెనీల్లో ఆసక్తి పెరిగినట్టు సబి్నవిస్
తెలిపారు.
విస్మరించలేనివి...
భారత వినియోగ మార్కెట్ ప్రపంచంలోనే పెద్దదంటూ, ఇక్కడి అవకాశాలను కంపెనీలు విస్మరించలేనివిగా ఫ్రాంచైజీ ఇండియా చైర్మన్ గౌరవ్ మార్య తెలిపారు. భారత్‌లో అవకాశాలకు అనుగుణంగా తమ వ్యూహాలను సర్దుబాటు చేసుకునేందుకు క్యారీఫోర్, ఫోర్డ్, తదితర విదేశీ బ్రాడ్లు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ఇదే అంశంపై సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ స్పందిస్తూ.. అతిపెద్ద మార్కెట్, వేగవంతమైన వృద్ధి, విజయవంతమైన ఆర్థిక సంస్కరణలు భారత్‌లో అవకాశాలను అన్వేíÙంచేలా విదేశీ ఇన్వెస్టర్లను ప్రేరేపిస్తున్నట్టు వివరించారు. అతిపెద్ద వినియోగ మార్కెట్, బలమైన వృద్ధి విదేశీ బ్రాండ్లను ఆకర్షిస్తున్నట్టు బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనమిస్ట్ మదన్ సబ్నవిస్ సైతం అభిప్రాయపడ్డారు.
ఎల్రక్టానిక్స్, రెన్యువబుల్ ఎనర్జీ, విజ్ధానాధారిత సేవలు తదితర రంగాల్లో విదేశీ కంపెనీలు భారీ పెట్టుబడుల ప్రకటనలు చేస్తున్నట్టు చంద్రజిత్ బెనర్జీ తెలిపారు. ‘‘విదేశీ సంస్థలతో మాట్లాడినప్పుడు భారత్‌లో కార్యకలాపాలు చేపట్టేందుకు అవి ఎంతో ఆసక్తితో ఉన్నట్టు తెలిసింది. స్థిరమైన ఆర్థిక వృద్ధి నేపథ్యంలో భారత్ ఇక ముందు పెద్ద ఎత్తున విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షిస్తుందని భావిస్తున్నాం’’అని బెనర్జీ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment