foreign brands
-
విదేశీ బ్రాండ్ల చలో భారత్
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే వేగవంతమైన వృద్ధి, అధిక యువ జనాభా, బలమైన వినియోగం.. వెరసి భారత్ మార్కెట్ విదేశీ బ్రాండ్లను ఆకర్షిస్తోంది. గతంలో భారత్ మార్కెట్ నుంచి వెళ్లిపోయిన సంస్థలు పునరాలోచనలో పడ్డాయి. ఇప్పటికే కొన్ని సంస్థలు తిరిగి భారత్‌లోకి పునరాగమనం చేయనున్నట్టు ప్రకటించేశాయి. పలు బహుళజాతి సంస్థలు భారత్‌లో బలమైన వృద్ధి అవకాశాలతో చొచ్చుకుపోతుండగా.. తాము ఎందుకు అలా రాణించకూడదన్న దృక్పథంతో అవి తమ పెట్టుబడుల ప్రణాళికలను సమీక్షించుకుంటున్నట్టు పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా భారత్ ఆశాకిరణంగా కనిపిస్తుండడంతో గతంలో ఇక్కడి నుంచి తట్టా, బుట్టా సర్దేసుకుని వెళ్లిన విదేశీ కంపెనీలు, మరో విడత ఇక్కడ కాలు మోపేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి.యూరప్‌లో రెండో అతిపెద్ద రిటైల్ చైన్ ‘క్యారీఫోర్’, భారత్‌లోనూ అదే మాదిరి విజయగాధను నమోదు చేయాలని భావించింది. కానీ, విధానాలు ఫలితమివ్వకపోవడంతో 2014 జూలైలో భారత్‌లోని క్యాష్ అండ్ క్యారీ స్టోర్ల వ్యాపారాన్ని మూసేసి వెళ్లిపోయింది. మరో ఫార్మాట్‌తో తిరిగి భారత్‌లోకి వస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. అంతేకాదు అమెరికాకు చెందిన బహుళజాతి ఆటో సంస్థ (డెట్రాయిట్) ఫోర్డ్ మోటార్ 2022 సెప్టెంబర్‌లో భారత్ మార్కెట్‌ను వీడింది.కరోనా తర్వాత డిమాండ్ క్షీణత, పోటీ పెరిగిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవలే తమిళనాడు సర్కారు ఫోర్డ్ యాజమాన్యంతో మాట్లాడగా.. చెన్నైకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరైమలై ప్లాంట్‌లో తయారీని త్వరలో ప్రారంభిస్తామంటూ ప్రకటించింది. భారత్‌లో అపార అవకాశాలు మరికొన్ని విదేశీ బ్రాండ్లను సైతం ఆకర్షిస్తున్నాయి. దీంతో అవి తిరిగొచ్చేందుకు ఉత్సాహం చూపిస్తున్నాయి. జాయింట్ వెంచర్లు అమెరికాకు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహనాల సంస్థ హార్లే డేవిడ్సన్ సైతం తొలుత భారత మార్కెట్లో సొంతంగా వ్యాపార అవకాశాల కోసం ప్రయత్నం చేసి, నష్టాలు వస్తుండడంతో తప్పుకుంది. హీరో మోటోకార్ప్‌తో కలసి జాయింట్ వెంచర్ రూపంలో గతేడాది మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. చైనాకు చెందిన ఫ్యాషన్ సంస్థ షీన్ రిలయన్స్ రిటైల్‌తో టై అప్ పెట్టుకుని భారత్‌లోకి తిరిగి ప్రవేశించింది. క్యారీఫోర్ యూరప్‌లో మలీ్టబ్రాండ్ (బహుళ బ్రాండ్ల) రిటైల్ అవుట్లెట్లతో మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు భారత్‌లో ఇదే విధమైన వ్యాపారం కోసం దుబాయ్ అప్పారెల్ గ్రూప్‌తో జట్టు కట్టింది. పోర్డ్ మోటార్స్ సైతం ఈ విడత భారత్‌లో రిటైల్ విక్రయాలు కాకుండా, ఎలక్ట్రిక్ వాహనాల ఎగుమతులకు భారత్‌ను కేంద్రంగా చేసుకోవాలనే ప్రణాళికతో వస్తోంది. విధానాల ఫలితం.. క్యాష్ అండ్ క్యారీ వ్యాపారం నుంచి మెట్రో సైతం గతేడాది వైదొలగడం గమనార్హం. తన వ్యాపారాన్ని రిలయన్స్‌కు అమ్మేసి వెళ్లిపోయింది. మలీ్టబ్రాండ్ రిటైల్ వ్యాపారం పట్ల వాల్‌మార్ట్ గ్రూప్ సైతం ఆసక్తితో ఉండగా, ఎఫ్‌డీఐ విధానాల్లో స్పష్టత లేమితో.. చివరికి 2018లో 16 బిలియన్ డాలర్లతో ఫ్లిప్‌కార్ట్‌ను సొంతం చేసుకుంది. కానీ, ఆ తర్వాతి కాలంలో ఐకియా, యాపిల్ సంస్థలు ఇక్కడి రిటైల్ మార్కెట్లోకి అడుగు పెట్టడం తెలిసిందే. ప్రభుత్వ ప్రగతిశీల విధానాలతో విదేశీ కంపెనీల్లో ఆసక్తి పెరిగినట్టు సబి్నవిస్ తెలిపారు. విస్మరించలేనివి...భారత వినియోగ మార్కెట్ ప్రపంచంలోనే పెద్దదంటూ, ఇక్కడి అవకాశాలను కంపెనీలు విస్మరించలేనివిగా ఫ్రాంచైజీ ఇండియా చైర్మన్ గౌరవ్ మార్య తెలిపారు. భారత్‌లో అవకాశాలకు అనుగుణంగా తమ వ్యూహాలను సర్దుబాటు చేసుకునేందుకు క్యారీఫోర్, ఫోర్డ్, తదితర విదేశీ బ్రాడ్లు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ఇదే అంశంపై సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ స్పందిస్తూ.. అతిపెద్ద మార్కెట్, వేగవంతమైన వృద్ధి, విజయవంతమైన ఆర్థిక సంస్కరణలు భారత్‌లో అవకాశాలను అన్వేíÙంచేలా విదేశీ ఇన్వెస్టర్లను ప్రేరేపిస్తున్నట్టు వివరించారు. అతిపెద్ద వినియోగ మార్కెట్, బలమైన వృద్ధి విదేశీ బ్రాండ్లను ఆకర్షిస్తున్నట్టు బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనమిస్ట్ మదన్ సబ్నవిస్ సైతం అభిప్రాయపడ్డారు.ఎల్రక్టానిక్స్, రెన్యువబుల్ ఎనర్జీ, విజ్ధానాధారిత సేవలు తదితర రంగాల్లో విదేశీ కంపెనీలు భారీ పెట్టుబడుల ప్రకటనలు చేస్తున్నట్టు చంద్రజిత్ బెనర్జీ తెలిపారు. ‘‘విదేశీ సంస్థలతో మాట్లాడినప్పుడు భారత్‌లో కార్యకలాపాలు చేపట్టేందుకు అవి ఎంతో ఆసక్తితో ఉన్నట్టు తెలిసింది. స్థిరమైన ఆర్థిక వృద్ధి నేపథ్యంలో భారత్ ఇక ముందు పెద్ద ఎత్తున విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షిస్తుందని భావిస్తున్నాం’’అని బెనర్జీ వివరించారు. -
టైటన్ హీలియోస్‌కు కొత్త బ్రాండ్స్
న్యూఢిల్లీ: లగ్జరీ వాచ్‌ల విక్రయంలో ఉన్న టైటన్ హీలియోస్ మరిన్ని విదేశీ బ్రాండ్స్‌ను జోడిస్తోంది. 12–18 నెలల్లో కొత్తగా 10 బ్రాండ్స్‌ను పరిచయం చేయనుంది. ప్రస్తుతం హీలియోస్ స్టోర్లలో టామీ హిల్ఫిగర్, టిస్సో, స్వరోస్కీ, ఫాజిల్ వంటి 45 బ్రాండ్ల వాచ్‌లు కొలువుదీరాయి. వీటి ధరలు రూ.5,000 మొదలుకుని రూ.1,00,000 వరకు ఉన్నాయి. మరోవైపు హీలియోస్ స్టోర్ల సంఖ్యను కంపెనీ గణనీయంగా పెంచుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 50 ఔట్లెట్లు రానున్నాయని టైటన్ వాచెస్, వేరబుల్స్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ శుక్లా వెల్లడించారు. ‘మొత్తం వ్యాపారంలో హీలియోస్ నుంచి 10 శాతం ఆదాయం సమకూరుతోంది. ఈ విభాగం ఆదాయం 45 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నాం. హీలియోస్ టర్నోవర్‌లో 20 శాతం కొత్త కలెక్షన్, లిమిటెడ్ ఎడిషన్స్ నుంచి అందుకోవాలని దృష్టిపెట్టాం. పండుగల సీజన్ ప్రమోషన్స్ కారణంగా కస్టమర్ల రాక, ఆన్లైన్ సేల్స్ 20–25 శాతం అధికం అవుతాయని భావిస్తున్నాం. అన్ని బ్రాండ్స్‌లో కలిపి ఏటా 150 దాకా కేంద్రాలను జోడిస్తున్నాం’ అని వివరించారు. టైటన్‌కు దేశవ్యాప్తంగా 95 నగరాలు, పట్టణాల్లో 240 హీలియోస్ స్టోర్లు ఉన్నాయి. హీలియోస్తోపాటు టైటన్ వరల్డ్, ఫాస్ట్‌ట్రాక్, రాగా, జూప్, ఎస్ఎఫ్ బ్రాండ్లలో 1,110కిపైగా కేంద్రాలు ఉన్నాయి. -
అక్కడ డొక్కు డొక్కు.. ఇక్కడ డుగ్గు డుగ్గు
రాయల్ ఎన్ఫీల్డ్.. యెజ్డీ.. జావా.. నార్టన్... బీఎస్ఏ.. విశ్వ విఖ్యాత బైక్ బ్రాండ్లు ఇవి. విదేశాల్లో మనుగడ సాధించలేక చేతులెత్తేసిన ఈ బ్రాండ్లన్నీ భారతీయుల చేతిలో మళ్లీ ప్రాణం పోసుకున్నాయి. అమ్మకాల్లో దుమ్మురేడమే కాదు.. మళ్లీ వాటిని గ్లోబల్ బ్రాండ్లుగా నిలబెట్టి మనోళ్లు సత్తా చాటుతున్నారు!మహీంద్రా కంపెనీ క్లాసిక్ లెజెండ్స్ తాజాగా ప్రఖ్యాత బ్రిటిష్ మోటార్‌సైకిల్ బ్రాండ్ బీఎస్ఏను భారత్‌లో ప్రవేశపెట్టడం తెలిసిందే. అక్కడ మూసేసిన ఈ కంపెనీని కొనుగోలు చేసి, మన మార్కెట్లో లాంచ్ చేసింది. విదేశీ బ్రాండ్లకు మన దగ్గర తిరిగి జీవం పోస్తూ... 1994లో ప్రారంభమైన ఈ ట్రెండ్ ఇప్పటికీ నాన్‌స్టాప్‌గా కొనసాగుతూనే ఉంది. ఇంగ్లాండ్‌లో కార్యకలాపాలను నిలిపేసిన బ్రిటిష్ మోటార్ సైకిల్ కంపెనీ రాయల్ ఎన్ఫీల్డ్ను ఐషర్ గ్రూప్ 1994లో చేజిక్కించుకుంది. అయితే, మన దగ్గర ఈ బ్రాండ్‌ను మళ్లీ జనాల్లోకి తీసుకెళ్లేందుకు ఆ కంపెనీకి 15 ఏళ్లు పట్టింది. 2009లో క్లాసిక్ 350, క్లాసిక్ 500 మోటార్ సైకిళ్లు డుగ్గు డుగ్గు మంటూ మళ్లీ మన రోడ్లపై పరుగులు తీయడం మొదలైంది. ఇప్పుడు యువతకు ఈ మోటార్ సైకిల్స్ అంటే ఎంత క్రేజో చెప్పాల్సిన పని లేదు! ‘2009లో విడుదల చేసిన క్లాసిక్‌తో రాయల్ ఎన్ఫీల్డ్ గ్లోబల్ కంపెనీగా అపూర్వ విజయం సొంతం చేసుకుంది. మొదట్లో ఏడాదికి 50,000 బుల్లెట్లను అమ్మడమే గగనంగా ఉన్న స్థాయి నుంచి ప్రస్తుతం అనేక మోడల్స్ దన్నుతో వార్షిక సేల్స్ 8.5 లక్షలకు ఎగబాకాయి’ అని కంపెనీ సీఈఓ గోవిందరాజన్ పేర్కొన్నారు. 2009 నుంచి ఇప్పటిదాకా రాయల్ ఎన్ఫీల్డ్ 75 లక్షల మోటార్ సైకిళ్లను విక్రయించగా అందులో 40 లక్షలు క్లాసిక్ మోడల్ కావడం మరో విశేషం. ఈ నెల 12న కూడా కంపెనీ కొత్త క్లాసిక్‌ను ప్రవేశపెట్టింది.యెజ్డీ.. కుర్రకారు హార్ట్ ‘బీట్’ అనుపమ్ తరేజా సారథ్యంలోని క్లాసిక్ లెజెండ్.. గ్లోబల్ బైక్ బ్రాండ్స్ జావా, యెజ్డీ, బీఎస్ఏలను భారతీయులకు మళ్లీ పరిచయం చేసింది. 1970లో మార్కెట్ నుంచి వైదొలగిన చెక్ కంపెనీ జావా.. 2018లో మనోళ్ల చేతికి చిక్కింది. అప్పటి నుంచి 1.4 లక్షల జావాలు రోడ్డెక్కాయి. గత నెల 13న జావా 42 మోడల్‌ను సైతం రంగంలోకి దించింది. ఇక అప్పట్లో అదిరిపోయే బీట్తో కుర్రోళ్ల మనను కొల్లగొట్టిన యెజ్డీ కూడా 1996లో అస్తమించి.. 2022లో లెజెండ్స్ ద్వారా తిరిగి ప్రాణం పోసుకుంది. 60 వేల బైక్‌లు ఇప్పటిదాకా అమ్ముడవ్వడం విశేషం. బీఎస్ఏ అయితే, 1973లోనే మూతబడింది. దాన్ని ఆనంద్ మహీంద్రా పోటాపోటీగా దక్కించుకుని యూకేతో పాటు భారత్‌లోనూ మళ్లీ ప్రవేశ పెట్టారు.అదే బాటలో టీవీఎస్, హీరో... ఇక దేశీ దిగ్గజం టీవీఎస్ కూడా మరో విఖ్యాత బ్రిటిష్ బైక్ బ్రాండ్ నార్టన్‌ను కేవలం రూ.153 కోట్లకు కొనుగోలు చేసింది. 2025 నాటికి తొలి మోడల్‌ను ప్రవేశపెట్టడంతో పాటు మూడేళ్లలో ఆరు కొత్త నార్టన్ బైక్‌లను తీసుకొచ్చే సన్నాహాల్లో ఉంది. ఈ ప్రఖ్యాత బ్రాండ్లను దక్కించుకోవడంతో పాటు వాటి చారిత్రక నేపథ్యాన్ని అలాగే కొనసాగించడం ద్వారా ఒరిజినాలిటీని కాపాడుతున్నామని తరేజా వ్యాఖ్యానించారు. బీఎస్ఏను భారత్‌లోనే తయారు చేస్తున్నా, దాని బ్రిటిష్ బ్రాండ్ ప్రాచుర్యం పదిలంగా ఉందన్నారు. ఇక భారత్‌లో నేరుగా ప్లాంట్ పెట్టి, చేతులెత్తేసిన హార్లీ డేవిడ్సన్కు హీరో మోటోకార్ప్ దన్నుగా నిలిచింది. ఆ కంపెనీతో జట్టుకట్టి మళ్లీ హార్లీ బైక్‌లను భారతీయులకు అందిస్తోంది. ఎక్స్440 బైక్‌ను ఇక్కడే అభివృద్ధి చేయడం విశేషం. దీన్ని దేశీయంగా హీరో ఉత్పత్తి చేస్తున్పప్పటికీ, ప్రామాణిక హార్లీ బైక్ బ్రాండ్ విలులో ఎలాంటి మార్పులు చేయలేదని కంపెనీ ప్రెసిడెంట్, సీఈఓ జోషెన్ జీట్స్ పేర్కొన్నారు. భారత్‌లో నేరుగా విక్రయాల్లో వెనుకబడ్డ బీఎండబ్ల్యూ మోటోరాడ్, టీవీఎస్‌తో జట్టుకట్టింది. టీవీఎస్ రూపొందించిన 500 సీసీ లోపు బైక్‌లు 60 వేలకు పైగా అమ్ముడవ్వడం మనోళ్ల సత్తాకు నిదర్శనం! → 2015లో మహీంద్రా మెజారిటీ పెట్టుబడితో ఫై క్యాపిటల్ ఓనర్ అనుపమ్ తరేజా క్లాసిక్ లెజెండ్స్ అనే కంపెనీని నెలకొల్పారు. జావా, యెజ్డీ, బీఎస్ఏ వంటి గ్లోబల్ ఐకాన్లను దక్కించుకుని, పునరుద్ధరించారు.→ 2013లో టీవీఎస్ బీఎండబ్ల్యూ మోటోరాడ్‌తో డీల్ కుదుర్చుకుంది, తద్వారా ప్రపంచ మార్కెట్ కోసం 500 సీసీ లోపు బైక్‌లను అభివృద్ధి చేసి, ఇంటా బయటా విక్రయిస్తోంది. 2020లో టీవీఎస్ మోటార్ కంపెనీ ప్రఖ్యాత బ్రిటిష్ మోటార్‌సైకిల్ బ్రాండ్ నార్టన్‌ను కొనుగోలు చేసింది; వచ్చే మూడేళ్లలో ఆరు కొత్త మోడల్స్‌ను ప్రవేశపెట్టే పనిలో ఉంది.→ 1994లో ఐషర్ గ్రూప్ ఇంగ్లాండ్‌లో పూర్తిగా అమ్మకాలను నిలిపేసిన బ్రిటిష్ బైక్ దిగ్గజం రాయల్ ఎన్ఫీల్డ్ను చేజిక్కించుకుంది. 2009లో ‘క్లాసిక్’ బ్రాండ్‌కు తిరిగి జీవం పోయడంమే కాదు.. గ్లోబల్ కంపెనీగా దీన్ని మళ్లీ నిలబెట్టింది.→ 2023లో హీరో మోటోకార్ప్ భారత్‌లో విఫలమై షట్టర్ మూసేసిన హార్లే డేవిడ్సన్కు మళ్లీ ఇక్కడ ప్రాణం పోసింది. ఎక్స్440 మోడల్‌ను విడుదల చేసి సక్సెస్ కొట్టింది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
వచ్చే ఐదేళ్లలో ఐదువేల స్టోర్లు.. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారంటే..
అభివృద్ధి చెందుతున్న ఎమర్జింగ్ ఎకానమీగా ఇండియా ఎదుగుతోంది. దాంతో అంతర్జాతీయంగా చాలాదేశాల నుంచి పెట్టుబడులు ఆకర్షిస్తోంది. అందులో భాగంగానే గ్లోబల్ రిటైల్ కంపెనీలు ఇండియా బాట పడుతున్నాయి. దేశీయ వినియోదారులను ఆకర్షించడానికి పెద్ద మొత్తంలో స్టోర్లు ఓపెన్ చేస్తున్నాయి. యువత గ్లోబల్ బ్రాండ్లకు ఆకర్షితులు అవుతుండడంతో ఇండియాలో తమ మార్కెట్ పెంచుకోవాలని కంపెనీలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఈ ఏడాది ఇండియాలో విదేశీ కంపెనీలు స్టోర్లు ఓపెన్ చేయడానికి సుమారు 160 బ్రాండ్లు లోకల్ సంస్థలతో లేదా సొంతంగా స్టోర్లు పెట్టడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఫారిన్ కంపెనీలకు లోకల్ పార్టనర్లను వెతకడంలో సాయపడే ఫ్రాంచైజ్ ఇండియా హోల్డింగ్స్ తాజాగా నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం ఒక ఏడాదిలో ఇంత భారీగా ఫారిన్ బ్రాండ్లు ఇండియాకు రావడం ఇదే మొదటిసారి. విదేశీ కంపెనీలు వచ్చే ఐదేళ్లలో సుమారు 5 వేల స్టోర్లను ఓపెన్ చేస్తాయని అంచనా. ఫలితంగా దాదాపు రూ.2078 కోట్లు ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇండియాలో తమ కార్యకలాపాలు సాగించాలనుకుంటున్న కంపెనీల్లో ఫుడ్ అండ్ బెవరేజెస్ సెక్టార్ సంస్థలే ఎక్కువగా ఉన్నాయని ఫ్రాంచైజ్ ఇండియా హోల్డింగ్స్ ఛైర్మన్ గౌరవ్ మౌర్య పేర్కొన్నారు. ముఖ్యంగా కేఫ్, కాఫీ చెయిన్స్ ఏర్పాటు చేయడానికి కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయని చెప్పారు. సాధారణంగా బర్గర్లు, పిజ్జా స్టోర్లను ఫారిన్ కంపెనీలు ఎక్కువగా ఓపెన్ చేయడానికి ఆసక్తి చూపిస్తుంటాయి. ఇదీ చదవండి: చంద్రయాన్-3.. స్లీప్‌మోడ్‌లోనూ సిగ్నల్.. ఇస్రో కీలక అప్డేట్ ఫ్రాంచైజ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం, థాయ్‌లాండ్‌కు చెందిన అతిపెద్ద కాఫీ చెయిన్ కేఫ్ అమెజాన్, యూఎస్ కంపెనీ పీట్స్ కాఫీ వంటి కంపెనీలు ఈ ఏడాది ఇండియాలో తమ స్టోర్లు ఓపెన్ చేయాలని చూస్తున్నట్లు తెలిసింది. గ్లోబల్ కంపెనీలు పెద్ద మొత్తంలో కాఫీ స్టోర్లను ఓపెన్ చేయనుండడంతో స్టార్‌బక్స్ కూడా తన విస్తరణను వేగవంతం చేసింది. -
శ్రేయాస్ మీడియా ఇక గ్లోబల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మూవీ ఈవెంట్స్, ప్రమోషన్స్‌లో దేశంలో అగ్ర శ్రేణి సంస్థ శ్రేయాస్ మీడియా రూ.30 కోట్ల నిధులను సమీకరిస్తోంది. వ్యూహాత్మక, ప్రముఖ పెట్టుబడిదార్లతో ఈ మేరకు కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. మధ్య ప్రాచ్య, యూఎస్, ఏషియా పసిఫిక్‌తోపాటు దేశవ్యాప్తంగా విస్తరణకు తాజా నిధులను ఉపయోగిస్తామని శ్రేయాస్ గ్రూప్ ఫౌండర్ గండ్ర శ్రీనివాస్ రావు మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన శ్రేయాస్ మీడియా 2011లో ప్రారంభమైంది. దక్షిణాదిన 1,500లకుపైగా ఈవెంట్స్‌ను నిర్వహించింది. వీటిలో 1,000 దాకా సినిమా ప్రచార కార్యక్రమాలు ఉన్నాయి. దుబాయిలోనూ కార్యకలాపాలు ప్రారంభించింది. తెలుగుతో మొదలై దక్షిణాది భాషలకు సేవలను విస్తరించింది. గరిష్టంగా 10 కోట్ల మంది.. దక్షిణాది సినిమాలతో కలిసి పనిచేసేందుకు దేశ, విదేశీ బ్రాండ్స్ సిద్ధంగా ఉన్నాయని శ్రీనివాస్ వెల్లడించారు. ‘స్పాన్సర్స్‌కు సినిమాలతో పెద్ద ఎత్తున మైలేజ్ వచ్చేలా ఈవెంట్స్ చేస్తున్నాం. కార్యక్రమాల్లో సినీ తారలు ఉండడంతో బ్రాండ్స్ సులువుగా వీక్షకులకు చేరువ అవుతున్నాయి. ప్రపంచంలోనే ఇది విభిన్న కాన్సెప్ట్. నటులు, దర్శకులు, నిర్మాతలకు సామాజిక మాధ్యమాల్లో కోట్లాది మంది అభిమానులున్నారు. సినిమాతో ముడిపడి ఏ కార్యక్రమం చేసినా స్పాన్సర్ బ్రాండ్స్ కోట్లాది మందికి చేరువ అవుతున్నాయి. ఒక్కో కార్యక్రమాన్ని గరిష్టంగా 10 కోట్ల మందికిపైగా వీక్షిస్తున్నారు. అందుకే విదేశీ బ్రాండ్స్ స్పాన్సర్షిప్కు ముందుకు వస్తున్నాయి. దక్షిణాది సినిమాల గురించి దేశ, విదేశాల్లోనూ మాట్లాడుకుంటున్నారు. ఇది మాకు, బ్రాండ్స్‌కు గొప్ప వ్యాపార అవకాశం‘ అని ఆయన వివరించారు. కొత్త విభాగాల్లోకి ఎంట్రీ.. సినిమా ఆసరాగా కొత్త విభాగాల్లో ప్రవేశిస్తామని శ్రీనివాస్ వెల్లడించారు. ‘శ్రేయాస్ఈటీ ఓటీటీని పునర్నిర్మిస్తాం. ఇందులో భాగంగా నూతన సాంకేతికతతో ఇంటెరాక్టివ్ మూవీస్, మినీ, స్నాక్ మూవీస్తోపాటు తొలిసారిగా 8డీ మూవీస్ పరిచయం చేస్తాం. రెట్రో మూవీస్‌ను పొందుపరుస్తాం. కంపెనీ 2027 నాటికి ఏటా 650 సినిమా కార్యక్రమాలు, 120 మూవీ ప్రమోషన్స్ చేపట్టాలని లక్ష్యంగా చేసుకుంది. గ్రూప్ టర్నోవర్ రూ.700 కోట్లు ఆశిస్తోంది. ఇందులో మూవీ ఈవెంట్స్ వాటా రూ.285 కోట్లు ఉంటుందని అంచనా. 2021–22లో రూ.20 కోట్ల టర్నోవర్ సాధించాం’ అని చెప్పారు. –శ్రేయాస్ గ్రూప్ ఫౌండర్ గండ్ర శ్రీనివాస్ రావు -
నైకీ, హెచ్అండ్ఎం బ్రాండ్స్‌కు చైనా షాక్
బీజింగ్: వీగర్ ముస్లింల అణిచివేత అంశంలో చైనా వైఖరిని వ్యతిరేకిస్తున్న విదేశీ కంపెనీలను కట్టడి చేయడంపై డ్రాగన్ దేశం దృష్టి పెట్టింది. ఈ క్రమంలో హెచ్అండ్ఎం, నైకీ, జారా తదితర విదేశీ బ్రాండ్స్ .. పిల్లలకు హానికరమైన బొమ్మలు, దుస్తులు మొదలైనవి దేశంలోకి దిగుమతి చేస్తున్నాయంటూ ఆరోపించింది. ఈ వారంలో అంతర్జాతీయ బాల కార్మికుల దినోత్సవం సందర్భంగా ఇలాంటి 16 కంపెనీలకు చెందిన టీ-షర్టులు, బొమ్మలు, టూత్‌బ్రష్షులు మొదలైన వాటిని ‘‘నాణ్యత, భద్రత పరీక్షలో అర్హత పొందని’’ ఉత్పత్తులుగా చైనా కస్టమ్స్ ఏజెన్సీ ఒక జాబితా తయారు చేసింది. వీటిని ధ్వంసం చేయడం లేదా వాపసు పంపడం చేస్తామని పేర్కొంది. అయితే, వివాదాస్పదమైన షాంజియాంగ్ ప్రావిన్స్ పరిణామాల గురించి గానీ, విదేశీ కంపెనీల విమర్శలను గానీ ఈ సందర్భంగా ప్రస్తావించలేదు. దుస్తులు, బొమ్మల్లో హానికారకమైన అద్దకాలు, ఇతర రసాయనాలు ఉన్నాయని మాత్రమే తెలిపింది. షాంజియాంగ్ ప్రావిన్స్‌లో వీగర్ ముస్లింలను అణిచివేస్తూ, వెట్టిచాకిరీ చేయిస్తోందంటూ చైనా ఆరోపణలు ఎదుర్కొంటోంది. అక్కడి ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల తమపైనా విమర్శలు వస్తుండటంతో హెచ్అండ్ఎం ఇకపై షాంజియాంగ్ ప్రావిన్స్‌లో ఉత్పత్తయ్యే పత్తిని తమ ఉత్పత్తుల్లో వినియోగించబోమంటూ ఇప్పటికే ప్రకటించింది. ఈ ప్రకటనతో ఆగ్రహించిన చైనా ఈ-కామర్స్ కంపెనీలు తమ ప్లాట్‌ఫామ్స్ నుంచి హెచ్అండ్ఎం ఉత్పత్తులను తొలగించాయి. ఆ కంపెనీతో పాటు నైకీ, అడిడాస్ వంటి ఇతర విదేశీ బ్రాండ్స్‌కి సంబంధించిన యాప్స్‌ను కూడా యాప్ స్టోర్స్ తొలగించాయి. అయితే తాజా పరిణామంపై నైక్, జారా, హెచ్ అండ్ ఎం ఇంకా స్పందించలేదు. -
విదేశీ టీకాలకు మూడు రోజుల్లోనే అనుమతులు
న్యూఢిల్లీ: దేశంలో అత్యవసర వినియోగానికి విదేశీ కోవిడ్ టీకా సంస్థలు పెట్టుకునే దరఖాస్తులపై మూడు రోజుల్లోనే నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. విదేశీ కంపెనీలు పెట్టుకున్న పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులు అవి అందిన మూడు పనిదినాల్లోగా డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) ఆధ్వర్యంలో పనిచేసే సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్ట్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్‌సీవో) అనుమతి మంజూరు చేస్తుందని వివరించింది. సదరు విదేశీ సంస్థ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఉత్పత్తి ప్రాంతం, ఉత్పత్తి) దిగుమతి అనుమతి పత్రాలను సీడీఎస్‌సీవో పరిశీలిస్తుందని పేర్కొంది. సంతృప్తికరంగా ఉంటే ఆయా కోవిడ్ టీకాలను పరిమితులకు లోబడి అత్యవసర పరిస్థితుల్లో వినియోగానికి మాత్రమే అనుమతిస్తుందని తెలిపింది. మార్గదర్శకాలకు లోబడి ఆ టీకాను వినియోగించాల్సి ఉంటుందని పేర్కొంది. విదేశీ టీకా కంపెనీలు భారత్‌లోని తమ అనుబంధ సంస్థ ద్వారా గానీ అధీకృత ఏజెంట్ ద్వారా గానీ సీడీఎస్‌సీవోకు దరఖాస్తు చేసుకోవాలనిఆరోగ్య శాఖ తెలిపింది. ‘వ్యాక్సినేషన్లో వినియోగించటానికి ముందుగా సదరు విదేశీ టీకాను 100 మంది లబ్ధిదారులకు వేసి, వారం రోజుల పరిశీలన తర్వాత ప్రభుత్వ నిపుణుల కమిటీ వారి పరిస్థితిని అధ్యయనం చేస్తుంది. ఆ టీకా రోగ నిరోధక శక్తి, భద్రతలను బేరీజు వేశాకే అనుమతి ఇస్తుంది’అని వివరించింది. సీడీఎస్‌సీవో ప్రోటోకాల్ ప్రకారం సదరు విదేశీ టీకాల ప్రతి బ్యాచ్‌ను కసౌలీలోని సెంట్రల్ డ్రగ్స్ రీసెర్చి లేబొరేటరీ(సీడీఎల్) ద్వారానే విడుదల చేయాల్సి ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు అమెరికా, యూకే, జపాన్‌ల్లో అత్యవసర వినియోగానికి అనుమతించిన కోవిడ్ టీకాలకు దేశంలో ఫాస్ట్‌ట్రాక్ విధానంలో అనుమతులివ్వాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. -
విదేశీ బ్రాండ్లకు దేశీ బాండ్..!
ఫ్రాంచైజీలో ఔట్లెట్లు తెరుస్తున్న ఎల్లో టై హాస్పిటాలిటీ ⇒ ప్రస్తుతం 6 బ్రాండ్లు; ఒక్కోదానికి రూ.6–8 కోట్ల ఖర్చు ⇒ రూ.9 కోట్ల టర్నోవర్; రూ.30 కోట్ల నిధుల సమీకరణపై దృష్టి ⇒ ‘స్టార్టప్ డైరీ’తో సంస్థ ఫౌండర్ అండ్ సీఈఓ కరన్ టన్నా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ట్విస్ట్ ఆఫ్ థడ్కా, వ్రాప్చిక్, ధడూం, బీబీ జాన్, బ్రోస్టర్.. ఇవేవో బాలీవుడ్ సినిమా పేర్లు అనుకునేరు. ఇవన్నీ పాపులర్ ఫుడ్ బ్రాండ్లు. వెరైటీ రుచులతో దేశీయ భోజనప్రియుల్ని వహ్వా అనిపిస్తున్నాయి. మన దేశంలో ఈ బ్రాండ్లకు అంబాసిడర్‌గా మారి... ఫ్రాంచైజీ విధానంలో స్టోర్లను ఏర్పాటు చేస్తోంది ‘ఎల్లో టై హాస్పిటాలిటీ’. విదేశీ బ్రాండ్లు, వాటి రుచులు, సంస్థ విస్తరణ ప్రణాళికల గురించి సంస్థ ఫౌండర్ అండ్ సీఈఓ కరన్ టన్నా ‘స్టార్టప్ డైరీ’కి వివరించారు. గుజరాత్‌లోని సర్దార్ పటేల్ యూనివర్సీటీలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేశాక.. జనరల్ మోటార్స్, మెకెన్సీ కంపెనీల్లో పనిచేశా. 2012లో అహ్మదాబాద్ కేంద్రంగా ఆటోమొబైల్ సర్వీస్ అండ్ రిపెయిర్ చెయిన్ ‘కార్ప్లస్’ను ఆరంభించా. కానీ, తల్లిదండ్రులకు రెస్టారెంట్ ఉండటం వల్ల కావొచ్చు... ఆ రంగంలోనే ఏదో సాధించాని అనిపించేది. అహ్మదాబాద్‌లో పార్సీ రెస్టారెంట్ గుడీస్ను ప్రారంభించా. తర్వాత బేకరీ స్టార్టప్ ఫ్లోర్బాక్స్ను ఓపెన్ చేశా. అక్కడి నుంచి విపుల్ పటేల్‌కు చెందిన ఫాస్ట్‌ఫుడ్ చెయిన్ కచ్చీకింగ్ రెస్టారెంట్లో పార్టనర్‌గా జాయినయ్యా. నేను చేరిన కొత్తలో 18 ఔట్లెట్లుగా ఉన్న కచ్చీకింగ్ను రెండేళ్ల కాలంలో 200 ఔట్లెట్లకు విస్తరించా. అయినా సంతృప్తిగా లేదు. ఎందుకంటే పైన చెప్పిన సంస్థలన్నింట్లోనూ స్వదేశీ రుచులే ఉంటాయి. విదేశీ ఫుడ్ బ్రాండ్స్ రుచులు చూద్దామంటే దేశంలో ఒక్క ఔట్లెట్ కూడా లేదే అనిపించేది. అదే యెల్లో టై హాస్పిటాలిటీకి బీజం వేసింది. ఓ ప్రైవేట్ ఇన్వెస్టర్‌తో కలసి రూ.16 కోట్లతో ముంబై కేంద్రంగా 2015 డిసెంబర్లో యెల్లో టై హాస్పిటాలిటీని ప్రారంభించా. ఫ్రాంచైజీకి రూ.60–70 లక్షలు.. ఆయా బ్రాండ్ స్టోర్‌ను ఫ్రాంచైజీ విధానంలో స్థానికంగా ప్రారంభించడమే మా వ్యాపార విధానం. ఒక్కో ఔట్‌లెట్‌కు రూ.60–70 లక్షల పెట్టుబడి కావాలి. ఔట్లెట్ ఏర్పాటుకు కనీసం 1,000 చ.అ. స్థలం అవసరం. రూ.3 లక్షల నుంచి రూ.3 కోట్ల వరకు ఫ్రాంచైజీ బ్రాండ్లున్నాయి. తొలి ఏడాది ఫీజుతో పాటు నెలవారీ ఆదాయంలో వాటా ఇవ్వాల్సి ఉంటుంది. అది బ్రాండ్‌ను బట్టి 6–10 శాతం వరకూ ఉంటుంది. బ్రాండ్ల వారీగా చూస్తే.. బ్రోస్టర్ 6 శాతం, ధడూమ్ 8 శాతం, ట్విస్ట్ ఆఫ్ థడ్కా, బీబీ జాన్ 10 శాతంగా ఉన్నాయి. మార్చితో ముగియనున్న ఆర్ధిక సంవత్సరం నాటికి రూ.9 కోట్ల టర్నోవర్‌ను చేరుకుంటాం. వాహనాల్లో వంటల సరఫరా..: వంటకాల తయారీ, సరఫరా కోసం చంఢీఘడ్, హైదరాబాద్, ముంబై, రాజ్‌కోట్, ఢిల్లీలో వెండర్స్ ఉన్నారు. ఇక్కడి నుంచే దేశవ్యాప్తంగా ఉన్న ఔట్లెట్లకు ఫ్రోజెన్ వెహికిల్స్‌లో వంటకాలను సరఫరా చేస్తాం. ఎందుకంటే ఫుడ్ క్వాలిటీ, రుచిలో తేడాలుండకూడదు. మా సంస్థకు కన్సల్టెంట్‌గా షెఫ్ హర్పాల్ ఉన్నారు. తనయ్ గోరేగావ్కర్ మెయిన్ షెఫ్‌గా ఉండగా... 8 మంది ఇతర షెఫ్‌లున్నారు. ఫ్రాంచైజీ ఔట్‌లెట్‌ను ఏర్పాటు చేయడం నుంచి ఇంటీరియర్, బ్రాండ్ గుర్తింపు, మెనూ ఎంపిక, వంటకాల తయారీ, సరఫరా, మార్కెటింగ్ వరకు అన్ని సేవలూ అందిస్తాం. హైదరాబాద్‌లో బ్రోస్టర్ ఔట్లెట్.. అమెరికాకు చెందిన జెన్యూన్ బ్రోస్టర్ చికెన్ (జీబీసీ), లండన్‌కు చెందిన వ్రాప్చిక్, దుబాయ్‌కు చెందిన జస్ట్ ఫలాఫెల్. మన దేశం నుంచి చెఫ్ హర్పాల్ సింగ్‌కు చెందిన ట్విస్ట్ ఆఫ్ థడ్కా, బీబీ జాన్, మా సొంత బ్రాండ్ ధడూంలున్నాయి. వీటిల్లో ప్రస్తుతం బ్రోస్టర్ ఔట్లెట్ ముంబై, కోల్‌కతా, రాయ్‌పూర్, సూరత్, పట్నా, హైదరాబాద్‌లో, ట్విస్ట్ ఆఫ్ థడ్కా (వెజ్ బ్రాండ్) బెంగళూరు, అమృత్సర్, బీబీ జాన్ జలంధర్‌లో ఉన్నాయి. ఏప్రిల్‌లో ధడూం, ఫలాఫెల్ బ్రాండ్లను ముంబైలో, వ్రాప్చిప్ను బెంగళూరులో ప్రారంభించనున్నాం. రూ.30 కోట్ల నిధుల సమీకరణ.. ప్రస్తుతం మాకు విదేశీ బ్రాండ్లు 3, మన దేశం నుంచి 3 బ్రాండ్లతో ఒప్పందాలున్నాయి. ఒక్కో బ్రాండ్‌తో జీవితకాల ఒప్పందం కోసం రూ.6–8 కోట్లు ఖర్చవుతుంది. వచ్చే నెల మొదటి వారంలోగా రూ.2.72 కోట్లతో అమెరికాకు చెందిన ప్రీమియం క్లబ్ బ్రాండ్‌తో ఒప్పందం చేసుకోనున్నాం. మొత్తం మీద ఈ ఏడాది ముగింపు నాటికి 10 బ్రాండ్లతో ఒప్పందం చేసుకోవాలనేది లక్ష్యం. అలాగే 2017 ముగింపు నాటికి అన్ని బ్రాండ్లు కలిపి 50కి, మన బ్రాండ్లు కనీసం 5 ఔట్లెట్లు విదేశాల్లో తెరవాలని లక్ష్యించాం. అందుకే తొలిసారిగా నిధుల సమీకరణ చేయాలని నిర్ణయించాం. ఈ ఏడాది ముగింపు నాటికి ఈక్విటీ రూపంలో రూ.30 కోట్ల నిధులను సమీకరిస్తాం. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
భారత్ లో అత్యంత ప్రభావిత బ్రాండ్ గూగుల్
విదేశీ బ్రాండ్లదే హవా.. చిట్టచివరిలో దేశీ బ్రాండ్లు.. న్యూఢిల్లీ: దేశంలో అత్యంత ప్రభావితమైన బ్రాండ్‌గా గూగుల్ అవతరించింది. టాప్-10 ప్రభావిత బ్రాండ్ల జాబితాలో ఇది అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. గ్లోబల్ మార్కెట్ రీసెర్చ్ కంపెనీ ఇప్సో (ఐపీఎస్ఓఎస్) నివేదిక ప్రకా రం.. గూగుల్ తర్వాతి స్థానాల్లో ఫేస్బుక్, జి-మెయిల్, మైక్రోసాఫ్ట్, శాంసంగ్, వాట్స్యాప్లు ఉన్నాయి. ఇవ్వన్నీ కూడా విదేశీ బ్రాండ్లే. అంటే టాప్-6లో ఏ ఒక్క దేశీ బ్రాండ్ కూడా స్థానం పొందలేదు. జాబితాలో స్థానం పొందిన దేశీ బ్రాండ్లలో ఫ్లిప్‌కార్ట్ టాప్‌లో ఉంది. ఇది ఏడవ స్థానంలో నిలిచింది. అమెరికాకు చెందిన అమెజాన్ 8వ స్థానంలో ఉంది. దీని తర్వాతి స్థానాల్లో ఎస్బీఐ (9వ స్థానం), ఎయిర్టెల్ (10వ స్థానం) ఉన్నాయి.