గత ఏడాది భారత్‌కు గుడ్‌బై చెప్పుతూ..అమెరికన్ దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీ ఫోర్ఢ్ మోటార్స్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. భారత్‌లోని రెండు కార్ల ప్లాంట్స్‌లో ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఫోర్ట్ మోటార్స్ గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రకటించింది. కాగా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పీఎల్‌ఐ స్కీంలో భాగంగా ఫోర్డ్ మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి విభాగంలో రిఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమైంది.
ఫోర్డ్ రివర్స్ గేర్..!
ఈవీ విభాగంలో భారత్‌లో కార్ల ఉత్పత్తిపై ఫోర్డ్ మోటార్స్ పునరాలోచనలో పడింది. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల తయారీకి ప్రణాళిక ఫోర్డ్ మోటార్స్ రూపొందిస్తోంది. కాగా ఎలక్ట్రిక్ కార్ల తయారీ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పీఎల్‌ఐ స్కీమ్ కోసం ఫోర్డ్ మోటార్స్ దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఈ పీఎల్‌ఐ స్కీమ్‌లో ఫోర్డ్‌తో పాటు మారుతీ సుజుకీతో సహా పలు దిగ్గజం కార్ల తయారీ కంపెనీలు కూడా దరఖాస్తు చేసుకున్నాయి.
ఎలక్ట్రిక్ వాహనాల ఎగుమతి..!
ఫోర్డ్ మోటార్స్‌కు చెందిన గుజరాత్‌లోని సనద్ ప్లాంట్ నుంచి వంద శాతం ఎలక్ట్రిక్ కార్ల తయారీ చేస్తూ, కార్లను విదేశాలకు ఎగుమతి చేయాలని కంపెనీ భావిస్తోంది. ఇక పీఎల్ఐ కింద ఫోర్డ్ సమర్పించిన దరఖాస్తుకు కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. తమ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినందుకు ఫోర్డ్ ఇండియా కేంద్రానికి సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలను తెలిపింది. ఆమోదం పొందిన సంస్థలు వచ్చే రెండేళ్లలో స్ట్రాటెజీ, ప్రోడక్ట్స్ మీద దృష్టి సారించనున్నాయి. 2024 నుండి అయిదేళ్ల పాటు పీఎల్ఐ స్కీమ్ అమలవుతుందని తెలిపింది.
చదవండి: ఇన్వెస్టర్లకు కనక వర్షం కురిపిస్తున్న ప్రముఖ కంపెనీ..!
Comments
Please login to add a commentAdd a comment