2020కల్లా వాహన తయారీలో భారత్ మూడో స్థానానికి | India to become 3rd largest auto manufacturer by 2020: Ford | Sakshi
Sakshi News home page

2020కల్లా వాహన తయారీలో భారత్ మూడో స్థానానికి

Published Mon, Mar 30 2015 12:44 AM | Last Updated on Sat, Sep 2 2017 11:33 PM

2020కల్లా వాహన తయారీలో భారత్ మూడో స్థానానికి

2020కల్లా వాహన తయారీలో భారత్ మూడో స్థానానికి

 ఫోర్డ్ మోటార్స్ అంచనా..
 కోయంబత్తూరు: భారత్‌లో ఆటోమొబైల్ పరిశ్రమ వేగంగా వృద్ధి చెందుతోందని ఫోర్డ్ మోటార్స్ తెలిపింది. దేశంలో ఆటోమొబైల్ పరిశ్రమ 2020 నాటికి 70 లక్షల వాహనాల తయారీ మార్క్‌ను చేరుకుంటుందని పేర్కొంది. దీంతో భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆటోమొబైల్ తయారీ దేశంగా (అమెరికా, చైనాల తర్వాత) ఆవిర్భవిస్తుందని తెలిపింది. భారత జీడీపీలో ఆటోమొబైల్ రంగం వాటా 7 శాతంగా ఉంటుందని ఫోర్డ్ మోటార్స్ ప్రెసిడెంట్ డేవిడ్ డూబెన్‌స్కీ అభిప్రాయపడ్డారు. ఆయన ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆదివారం మాట్లాడారు. తాము మంచి ఉత్పత్తులను ప్రజలకు అందిస్తున్నామని, మంచి వ్యాపారాభివృద్ధిని నమోదు చేస్తున్నామని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement