Fame India Scheme Revised: Electric Two-Wheeler Subsidy Slashed - Sakshi
Sakshi News home page

FAME II Subsidy: ఈవీ బైక్‌ కొనుగోలు దారులకు భారీ షాక్‌.. జులై 1 నుంచి కొత్త నిబంధనలు అమలు?

Published Mon, May 22 2023 3:22 PM | Last Updated on Mon, May 22 2023 4:09 PM

Fame India Scheme Revised: Electric Two-Wheeler Subsidy Slashed - Sakshi

ఎలక్ట్రిక్‌ వెహికల్‌ కొనుగోలు దారులకు కేంద్రం షాకిచ్చింది. ఎలక్ట్రిక్‌ బైక్‌ల వినియోగాన్ని ప్రోత్సహించేలా కొనుగోలు దారులకు అందించే సబ్సీడీని భారీగా తగ్గించనుంది. దీంతో ఈవీ బైక్స్‌ ధరలు ఆకాశాన్నంటనున్నాయి.   

కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ పర్యావరణ హితమైన విద్యుత్‌ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించేలా ఫాస్ట‌ర్ అడాప్ష‌న్ అండ్ మాన్యుఫాక్చ‌రింగ్ ఆఫ్ ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్స్ (ఫేమ్‌-2) స్కీంను ప్రవేశ పెట్టింది. ఈ పథకంలో భాగంగా విద్యుత్ వాహ‌నాల కొనుగోలుపై ఒక కేడ‌బ్ల్యూహెచ్‌కు రూ.10వేల‌ సబ్సిడీని రూ. 15 వేలకు పెంచి వేసింది. వాహనం ఖరీదులో 20 శాతమే అందించే సబ్సిడీని సైతం 40 శాతానికి పెంచింది.

ఇప్పుడా 40 శాతం సబ్సీడీని 15 శాతానికి తగ్గిస్తూ కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధికారికంగా నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇక తగ్గించిన సబ్సీడీ జూన్‌ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు పేర్కొన్నాయి. 

21 శాతం వృ‍ద్దితో 
జేఎంకే రిసెర్చ్‌  అనలటిక్స్‌ నివేదిక ప్రకారం.. గత ఏప్రిల్‌ నెలలో ఈవీ వాహనాల కొనుగోళ్లు పెరిగినట్లు వెల్లడించింది.  21 శాతం వృద్దితో గత ఏడాది ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ నెల వరకు 1,10,503 యూనిట్లు అమ్ముడు పోయాయి. 

అదే నెలలో దేశంలోని ఉత్తర్‌ ప్రదేశ్‌, మహరాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌లలో మొత్తం కలుపుకొని 21,845 వెహికల్స్‌ను కొనుగోలు చేశారు. ఎక్కువ వెహికల్స్‌ను కొనుగోలు చేసిన జాబితాలో ఓలా ప్రథమ స్థానంలో ఉండగా, టీవీఎస్‌, ఎథేర్‌ మోటార్స్‌లు వరుస స్థానాల్లో ఉన్నాయి.  

10వేల కోట్లు కేటాయింపు
దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ బైక్‌లు, ఆటోలు, కార్లు, బస్సుల వినియోగానికి తోడ‍్పడేలా ఫేమ్‌ పథకంలో కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రోత్సహకాలు అందిస్తుంది. ఇందుకోసం రూ.10,000 కోట్లను కేటాయించింది. ఏప్రిల్‌ 1, 2019 నుంచి మూడేళ్లకాలానికి ఇది వర్తిస్తుందని తెలిపింది. 

చదవండి👉 అమ్మకానికి సుందర్‌ పిచాయ్‌ ఇల్లు.. కొనుగోలు చేసిన యాక్టర్‌.. ఎవరో తెలుసా?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement