దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచడానికి ‘ఫేమ్’ పథకం స్థానంలో రెండు సంవత్సరాలకు రూ.10,900 కోట్లతో పీఎం ఈ-డ్రైవ్ స్కీమ్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పీఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్‌హాన్స్‌మెంట్ (పీఎం ఈ-డ్రైవ్) పథకంపై నిర్ణయం తీసుకున్నట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
ఏయే వాహనాలకు ఎంతెంత?
పీఎం ఈ-డ్రైవ్ పథకం 24.79 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, 3.16 లక్షల ఈ-త్రీ వీలర్లు, 14,028 ఈ-బస్సులకు మద్దతు ఇస్తుంది. అలాగే 88,500 ఛార్జింగ్ సైట్‌లకు కూడా ఈ స్కీమ్ ప్రోత్సాహం అందిస్తుందని మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు.
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లు, ఈ-అంబులెన్స్‌లు, ఈ-ట్రక్కులు, ఇతర అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ వాహనాల (EVలు) వాడకాన్ని ప్రోత్సహించడానికి ఈ పథకం కింద రూ.3,679 కోట్ల విలువైన సబ్సిడీలు/డిమాండ్ ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తుంది.
ఇదీ చదవండి: న్యూ లాంచ్: ఎలక్ట్రిక్ యుటిలిటీ కారు ఎంజీ విండ్సర్
14,028 ఈ-బస్సుల కొనుగోలు కోసం ప్రభుత్వ, ప్రజా రవాణా సంస్థలకు రూ.4,391 కోట్లు అందిస్తారు. రోగుల తరలింపు కోసం ఈ-అంబులెన్స్ వినియోగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కొత్త చొరవను తీసుకుంది. ఈ-అంబులెన్స్‌ల విస్తరణకు రూ.500 కోట్లు కేటాయించింది. అలాగే ఈ-ట్రక్కుల వినియోగాన్ని ప్రోత్సహించడానికి రూ.500 కోట్లు అందించనుంది.
Comments
Please login to add a commentAdd a comment