హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంపొందించే లక్ష్యంగా ప్రవేశపెట్టిన ఫేమ్–2 పథకం కింద 2022లో 7.43 లక్షల ఈ–వెహికల్స్‌కు ప్రోత్సాహకాలు లభించాయి. వీటిలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు 6.63 లక్షల యూనిట్లు నమోదయ్యాయి. ఈ–త్రీ వీలర్లు 70,159 యూనిట్లు, ఈ–ఫోర్ వీలర్లు 5,375, ఈ–బస్‌లు 3,738 యూనిట్లు ఉన్నాయి. వీటిని కొనుగోలు చేసిన కస్టమర్లకు ప్రోత్సాహకాల కింద ప్రభుత్వం రూ.3,305 కోట్లు ఖర్చు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment