![Evtric Motors Reaches 100 Dealerships Pan India - Sakshi](/styles/webp/s3/article_images/2022/05/12/EVTRIC%20Motors%20copy.jpg.webp?itok=sjDIw8qj)
ఎలక్ట్రిక్ వెహికల్ సంస్థ ఈవిట్రిక్ సరికొత్త మైలురాయిని చేరుకుంది. దేశ వ్యాప్తంగా 100 డీలర్ షిప్‌లను పూర్తి చేసుకుందని ఆ సంస్థ ఫౌండర్ మనోజ్ పాటిల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈవిట్రిక్ మోటార్స్ 6 నెలల కాలంలోనే దేశ వ్యాప్తంగా 100కు పైగా డీలర్ షిప్‌ను చేరుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఈవీట్రిక్ స్కూటర్లు రాజస్థాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తెలంగాణ, కేరళ, వెస్ట్ బెంగాల్, బీహార్ వంటి రాష్ట్రాలలో లభిస్తున్నాయని తెలిపారు. మెట్రో నగరాలకు అతీతంగా ఆగ్రా, వారణాసి, అలీఘర్, జోధ్‌పూర్, బికనీర్, సూరత్ తో పాటు ఇతర ప్రాంతాల్లో సత్తా చాటుందని అన్నారు.
ఇక దేశంలో పెరిగిపోతున్న పెట్రో ధరల కారణంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగం పెరిగిపోతుందని, డిమాండ్‌కు అనుగుణంగా వెహికల్స్‌ను కొనుగోలు దారులకు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఈవిట్రిక్ ఫౌండర్ మనోజ్ పాటిల్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment