stop
-
కన్ఫర్మ్ కాని టికెట్‌తో రైలెక్కితే దించేస్తారు
సాక్షి, హైదరాబాద్: కన్ఫర్మ్ కాని వెయిటింగ్ జాబితాలో ఉన్న రైలు టికెట్‌తో రిజర్వ్డ్ కోచ్‌లలో ప్రయాణిస్తే టీసీలు ఇక రైలు నుంచి దింపేస్తారు. వారు జనరల్ క్లాస్ టికెట్ ధర చెల్లించి అప్పటికప్పుడు ఆ కోచ్‌లోకి మారాల్సి ఉంటుంది. లేని పక్షంలో రైలు దిగిపోవాల్సిందే. ఈమేరకు రైల్వే బోర్డు నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటివరకు.. రిజర్వేషన్ క్లాస్‌కు సంబంధించిన వెయిటింగ్ లిస్ట్ టికెట్‌తో అదే క్లాసులో పెనాల్టీ చెల్లించి ప్రయాణించేందుకు కొనసాగుతున్న ’అనధికార’ వెసులుబాటుకు అవకాశం లేకుండా రైల్వే బోర్డు ఈ నిర్ణయాన్ని తీసుకుంది.ఇక ఆ టికెట్‌తో వెళ్లడం కుదరదు..రిజర్వ్డ్ కోచ్‌లలో ప్రయాణం చేసేందుకు ఆన్లైన్లో టికెట్ కొన్నప్పుడు.. కన్ఫర్మ్ అయితే సంబంధిత కోచ్‌లలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించొచ్చు. కానీ, ప్రయాణ సమయం నాటికి కన్ఫర్మ్ కాని పక్షంలో ఆ టికెట్ రద్దయి, టికెట్ రుసుము మొత్తం సంబంధీకుల బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. టికెటే రద్దయినందున, ఆ టికెట్ ప్రయాణానికి వీలుండదు.కానీ, రైల్వే స్టేషన్లలోని టికెట్ కౌంటర్లో కొనుగోలు చేసిన రిజర్వ్డ్ క్లాస్ టికెట్ కన్ఫర్మ్ కాని పక్షంలో ఆ టికెట్ రుసుము కోసం మళ్లీ స్టేషన్‌లోని కౌంటర్‌కు వెళ్లి రద్దు ఫామ్ పూరించి టికెట్‌తో కలిపి అందజేస్తే గానీ ఆ డబ్బులు తిరిగి చెల్లిస్తారు. కానీ, చాలామంది ఆ కన్ఫర్మ్ కాని టికెట్‌ను రద్దు చేసుకోకుండా, సంబంధిత కోచ్ లో ప్రయాణిస్తారు. టీసీ వచ్చినప్పుడు ఫైన్ చెల్లించటం లేదా, ఎంతో కొంత ము ట్టచెప్పటం ద్వారానో ప్రయాణాన్ని కొనసాగిస్తారు. ఇద్దరు ముగ్గురు కలిసి ప్రయాణిస్తున్నప్పుడు, కొన్ని టికెట్లు కన్ఫర్మ్ అయి, కొన్ని వెయిటింగ్ జాబితాలోనే ఉండిపోతే, అలాగే సర్దుకుని వెళ్తుంటారు. కానీ, ఇక నుంచి అలాంటి అవకాశం లేకుండా రైల్వే బోర్డు కఠినతరం చేసింది.అలా పట్టుబడితే పెనాల్టీనేటికెట్ కన్ఫర్మ్ కాని పక్షంలో దాన్ని రద్దు చే సుకోవాల్సిందే. ఒక వేళ ఆ టికెట్‌తో రిజర్వ్ డ్ కోచ్‌లో ప్రయాణిస్తూ పట్టుబడితే, వారి నుంచి రూ.250 నుంచి రూ.440 వరకు పెనాల్టీ వ సూలు చేసి, వారిని తదు పరి స్టేషన్లో దింపి, జనర ల్ క్లాస్ టికెట్ రుసుము తీ సుకుని అందులోకి మార్పి స్తారు. జనరల్ క్లాస్‌లో అవకాశం లేనప్పుడు స్టేషన్లో దించేస్తారు. ఈమేరకు జోన్లకు రైల్వేబోర్డు నుంచి ఆదేశాలు వెలువడ్డాయి.వేలల్లో ఫిర్యాదులు.. అలా చేస్తే టీసీలపైనా చర్యలుకన్ఫర్మ్ కాని టికెట్‌తో ప్రయాణించటం నిబంధనలకు విరుద్ధం. అయినా కూడా వాటితో రిజర్వ్డ్ కోచ్‌లలో.. టీసీల సహకారంతో ప్రయాణించే పద్ధతి అనధికారికంగా అమలులో ఉంది. ఇలా క్రమంగా రిజర్వ్డ్ కోచ్‌లలో ఇలాంటి వారి సంఖ్య పెరుగుతూండటంతో.. రిజర్వేషన్ టికెట్‌తో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. కొంతమంది వారిని దబాయించి మరీ సీటులో జాగా కల్పించుకుని ప్రయాణిస్తున్నారు. మరికొందరు సీట్లలో ఏదో ఓ వైపు కూర్చుని వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు.ఇలాంటి వాటిపై ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు రైల్వే బోర్డుకు 8 వేల వరకు ఫిర్యాదులందినట్టు తెలిసింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన రైల్వే బోర్డు, నిబంధనలను కచ్చితంగా అనుసరించాలని, రిజర్వ్డ్ కన్ఫర్మ్ టికెట్ లేని వారు ఎట్టి పరిస్థితిలో రిజర్వ్డ్ కోచ్‌లలో ప్రయాణించకుండా చూడాలని, ఒకవేళ టీసీలు వారికి వీలు కల్పించినట్టు తేలితే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరికలు జారీ అయ్యాయి. కాగా, కన్ఫర్మ్ కాని టికెట్ ఉన్న వారిని జనరల్ కోచ్‌లకు తరలిస్తే, వాటిపై మరింత భారం పెరుగుతుందనీ,. ఈ నేపథ్యంలో రైళ్లలో జనరల్ కోచ్‌ల సంఖ్య పెంచాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. -
తాజ్ మహల్‌ను తేజో మహల్ అంటూ కావడియాత్రకు మహిళ
‘అది తాజ్ మహల్ కాదు.. తేజో మహల్.. మహాశివుని దేవాలం.. భోలేనాథుడు నాకు కలలో కనిపించి ఈ విషయాన్ని చెప్పాడు’ అంటూ ఒక మహిళ యూపీలోని ఆగ్రాలో గల తాజ్‌మహల్ దగ్గరకు చేరుకుని నానా హంగామా చేసింది.తాజ్ మహల్ చూసేందుకు వచ్చిన జనం ఆ మహిళను చూసేందుకు గుమిగూడటంతో తోపులాట చోటుచేసుకుంది. ఇంతలో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ మహిళను తాజ్ మహల్ లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో ఆ మహిళ నిరాశగా వెనుదిరాగాల్సి వచ్చింది.ఈ ఘటన నేటి ఉదయం(సోమవారం) ఉదయం తాజ్ మహల్ పశ్చిమ ద్వారం దగ్గర చోటుచేసుకుంది. ఆ మహిళ పేరు మీనా రాథోడ్. ఆమె.. తాను హిందూ మహాసభ మహిళా మోర్చా ఆగ్రా జిల్లా అధ్యక్షురాలినని మీడియాకు తెలిపింది. ఆ మహిళ తన భుజాలపై కావడి పెట్టుకుని తాజ్‌మహల్ చేరుకుంది. ఆమెను గమనించిన పోలీసులు తాజ్‌లోనికి కావడి తీసుకువెళ్లకూడదంటూ అడ్డుకున్నారు.అయితే ఆమె పోలీసులతో వాదనకు దిగింది. రెండు రోజుల క్రితం భోలేనాథుడు తనకు కలలో కనిపించాడని, తేజోమహల్ ఒక దేవాలయం అని, అక్కడ కావడి సమర్పించాలని తనకు చెప్పాడని ఆమె పోలీసులకు తెలిపింది. అమె తాజ్‌మహల్ లోనికి వెళ్లే విషయంలో మొండిగా వ్యవహరించడంతో పోలీసులు.. సుప్రీం కోర్టు నుంచి ఆర్డర్ తీసుకువస్తేనే అనుమతిస్తామని ఆమెకు తెలిపారు. దీంతో ఆమె మరో మార్గంలేక కావడితో సహా ఇంటిదారి పట్టింది. -
తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
సాక్షి,హైదరాబాద్: అయిదెకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం తాజాగా రైతు బంధు నిధులు విడుదలచేయడంపై ఎన్నికల కమిషన్(ఈసీ ఆంక్షలు విధించింది. లోక్‌సభ ఎన్నికల పోలింగ్ తర్వాతే నిధులు విడుదల చేయాలని ఈసీ ఆదేశించింది. రైతు బంధుపై ఈసీకి ఎన్.వేణు కుమార్ అనే వ్యకి ఫిర్యాదు చేశారు. రైతు బంధు చెల్లింపులపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఈసీ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో రంగంలోకి దిగిన ఈసీ రైతుబంధు నిధుల పంపిణీకి బ్రేకులు వేసింది. -
నేటితో ప్రచారం సమాప్తం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. పంపకాలకు తెరలేవనుంది. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి ఎన్నికల ప్రచారం మూగబోనుంది. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లోని 13 నియోజకవర్గాల పరిధిలో నేటి సాయంత్రం 4 గంటలతోనే ప్రచార కార్యక్రమాలకు ఫుల్ స్టాప్ పెట్టాల్సి ఉంటుంది. నేటి సాయంత్రం తర్వాత ఇక రాజకీయ నేతలు, స్టార్ క్యాంపైనర్లు ఎన్నికలకు సంబంధించిన వ్యవహారాలపై మీడియాతో మాట్లాడరాదని, ప్రెస్ కాన్ఫరెన్స్‌లు నిర్వహించరాదని ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రలోభాలపై దృష్టి పోలింగ్‌కు రెండు రోజులే మిగిలి ఉండడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రలోభాల పంపిణీపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాయి. ఓ వైపు పోల్ మెనేజ్మెంట్కు ఏర్పాట్లు చేసుకుంటూ మరోవైపు ఓటర్లకు పెద్ద ఎత్తున డబ్బులు, మద్యం పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఒక్కో ఓటరుకు రూ.2వేల నుంచి రూ.3వేలు చొప్పున పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్టు చర్చ జరుగుతోంది. గ్రామీణ నియోజకవర్గాల్లో ఇప్పటికే డబ్బులు, మద్యం పంపిణీ ప్రారంభమైనట్టు తెలుస్తోంది. పోలింగ్‌కు ముందు రోజు రాత్రి నాటికే ఓటర్లకు డబ్బులు, మద్యం చేరవేసేందుకు ఇప్పటికే అన్ని పార్టీల అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకున్నట్టు సమాచారం. ఇక పోలింగ్‌కు ముందు రోజు రాత్రి మద్యం నిల్వలను బయటకి తీసి ఓటర్లకు పంపిణీ చేయనున్నారని చర్చ జరుగుతోంది. డబ్బులు, మద్యం పంపిణీని ఎన్నికల యంత్రాంగం ఎంత మేరకు నియంత్రించ గలుగుతుందో చూడాలి. -
ఇతర సంస్థల నుంచి డీజిల్ కొనుగోళ్ల నిలిపివేత
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్, నయారా ఎనర్జీ వంటి కంపెనీల నుంచి డీజిల్ కొనుగోళ్లను వచ్చే ఏడాది నుంచి నిలిపివేయాలని ప్రభుత్వ రంగ హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) భావిస్తోంది. వైజాగ్ రిఫైనరీ విస్తరణ పనులు పూర్తయి, వచ్చే ఆర్థిక సంవత్సరం రాజస్థాన్‌లో కొత్త రిఫైనరీని నిర్మించిన తర్వాత నుంచి దీన్ని అమలు చేయనున్నట్లు ఇన్వెస్టర్లతో సమావేశంలో సంస్థ వెల్లడించింది. వైజాగ్ రిఫైనరీ ప్రస్తుత వార్షిక సామర్ధ్యం 13.7 మిలియన్ టన్నులుగా ఉండగా విస్తరణ పనులు పూర్తయితే 15 మిలియన్ టన్నులకు పెరుగుతుందని కంపెనీ చైర్మన్ పుష్ప్ కుమార్ జోషి చెప్పారు. రాజస్థాన్ రిఫైనరీ 72 శాతం పూర్తయ్యిందని, వచ్చే ఏడాది దశలవారీగా వినియోగంలోకి వస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం తాము విక్రయించే పెట్రోల్‌లో 43 శాతం, డీజిల్‌లో 47 శాతం ఇంధనాలను ముంబై, వైజాగ్ రిఫైనరీలు సమకూరుస్తున్నాయి. వైజాగ్ రిఫైనరీ విస్తరణ పనులు పూర్తయ్యాక డీజిల్ విక్రయాల్లో హెచ్‌పీసీఎల్ సొంత రిఫైనరీల వాటా 61 శాతానికి పెరుగుతుంది. రాజస్థాన్ రిఫైనరీ కూడా అందుబాటులోకి వస్తే మొత్తం డీజిల్‌ను హెచ్‌పీసీఎల్ సొంతంగానే ఉత్పత్తి చేసుకోగలుగుతుంది. దేశీయంగా మొత్తం పెట్రోల్ బంకుల్లో దాదాపు పావు శాతం బంకులు హెచ్‌పీసీఎల్‌వే ఉన్నాయి. అయితే, వాటిలో విక్రయ అవసరాలకు తగినంత స్థాయిలో సొంతంగా పెట్రోల్, డీజిల్ ఉత్పత్తి చేసుకోలేకపోతుండటంతో ప్రైవేట్ సంస్థల నుంచి కొనుగోలు చేయాల్సి వస్తోంది. హెచ్‌పీసీఎల్ ఇప్పటికే తమ ముంబై రిఫైనరీ సామరŠాధ్యన్ని 7.5 మిలియన్ టన్నుల నుంచి 9.5 మిలియన్ టన్నులకు విస్తరించింది. -
‘కృత్రిమ మేథ’తో రసాయన దాడులు? ‘ఛాలెంజ్’ స్వీకరించిన ‘ఓపెన్ ఏఐ’
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)తో ముడిపడిన విస్తృత నష్టాలను అంచనా వేయడానికి, తగ్గించడానికి ఓపెన్ ఏఐ బృందం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్, న్యూక్లియర్ బెదిరింపులు, వ్యక్తిగత ఒప్పందాలు, సైబర్ సెక్యూరిటీ, అటానమస్ రెప్లికేషన్తో సహా సంభావ్య ఏఐ బెదిరింపులపై ఈ బృందం దృష్టి సారించనుంది. అలెగ్జాండర్ మాడ్రీ నేతృత్వంలోని ఈ బృందం.. ఏఐని ఉపయోగించుకుని ఎవరైనా చేసే కుట్రపూరిత చర్యలకు అడ్డుకట్ట వేసే పనిని ప్రారంభించింది. అలాగే ఏఐ వ్యవస్థను దుర్వినియోగం చేయడం వల్ల కలిగే నష్టాలను పరిశోధిస్తుంది. ఇటువంటి దుర్వినియోగాన్ని నిరోధించడానికి ఓపెన్ ఏఐ ఒక ఛాలెంజ్ కూడా నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. దీనిలో ఉత్తమంగా నిలిచిన వాటికి ఏపీఐ క్రెడిట్‌తో పాటు 25 వేల డాలర్లు(ఒక డాలర్ రూ.83.15) అందించనున్నట్లు ప్రకటించింది. చాట్ జీపీటీ తరహా సాంకేతికతను అభివృద్ధి చేసే ఓపెన్ ఏఐ ఇప్పుడు ఏఐతో ఏర్పడే ముప్పును అంచనా వేయడానికి ఉద్దేశించిన ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తోంది. ఇటీవలే దీని గురించి వెల్లడించింది. దీని ప్రధాన లక్ష్యం ఏఐ సాంకేతికత వినియోగం ద్వారా ఉత్పన్నమయ్యే భారీ ముప్పులపై అధ్యయనం చేయడం, అంచనా వేయడం, తగ్గించడం. గత జూలైలో.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా తలెత్తే ముప్పును అరికట్టేలా ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని ఓపెన్ ఏఐ సూచించింది. కృత్రిమ మేధస్సుతో ముడిపడిన ఏఐ వ్యవస్థలు ఏదో ఒక రోజు మానవ మేధస్సును అధిగమించవచ్చనే ఆందోళన ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. అయితే ఓపెన్ ఏఐ.. కృత్రిమ మేథలో తలెత్తే ముప్పును నివారించే దిశగా ముందడుగు వేస్తోంది. ఈ నేపధ్యంలో 2023 మే నెలలో ఈ సంస్థ.. ఏఐతో కలిగే ముప్పును ప్రస్తావిస్తూ, ఒక బహిరంగ లేఖను ప్రచురించింది. కృత్రిమ మేథస్సుతో కలిగే నష్టాలను ప్రపంచ స్థాయిలో తీవ్రంగా పరిగణించాలని ఆ లేఖలో ఓపెన్ ఏఐ కోరింది. ఇది కూడా చదవండి: ఖతార్‌లో అత్యాచారానికి ఏ శిక్ష విధిస్తారు? -
విద్యుదుత్పత్తిని ఆపేయండి
సాక్షి, అమరావతి: శ్రీశైలం ప్రాజెక్టు ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తిని తక్షణమే నిలిపేయాలని తెలంగాణ జెన్కోను కృష్ణా బోర్డు ఆదేశించింది. నీటి కేటాయింపులు చేయాలని ఎలాంటి ప్రతిపాదన పంపకుండా, బోర్డు అనుమతి లేకుండా విద్యుదుత్పత్తి చేస్తూ ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు తరలిస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు తెలంగాణ జెన్కో సీఎండీకి కృష్ణాబోర్డు చైర్మన్ శివ్‌నందన్‌కుమార్ శుక్రవారం లేఖ రాశారు. శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ జెన్కో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని వదిలేస్తుండటం వల్ల రెండు రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని కృష్ణా బోర్డుకు బుధవారం ఏపీ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి లేఖ రాశారు. తక్షణమే విద్యుదుత్పత్తిని ఆపేసేలా తెలంగాణ జెన్కోను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన కృష్ణాబోర్డు చైర్మన్ శివ్‌నందన్‌కుమార్ తక్షణమే విద్యుదుత్పత్తిని నిలిపేయాలని తెలంగాణ జెన్కోను ఆదేశించారు. కృష్ణాబేసిన్‌లో ఈ ఏడాది సగటు వర్షపాతం కంటే తక్కువగా కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేయడాన్ని ఎత్తిచూపారు. దాంతో కృష్ణానదిలో నీటిలభ్యత తగ్గుతుందని, ఆ మేరకు శ్రీశైలం ప్రాజెక్టులోను లభ్యత తగ్గుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్న నీటిని సంరక్షించుకుని తాగు, సాగునీటి అవసరాల కోసం వాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఇకపై ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేయవద్దని తెలంగాణ జెన్కోను ఆదేశించారు. కానీ.. తెలంగాణ జెన్కో కృష్ణా బోర్డు ఆదేశాల భేఖాతరు చేస్తూ శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 38,140 క్యూసెక్కులను దిగువకు వదలేస్తుండటం గమనార్హం. -
అల్లర్లతో ఢిల్లీ హై అలర్ట్.. భద్రతపై సుప్రీంకోర్టు కీలక నోటీసులు..
ఢిల్లీ: హర్యానాలో అల్లర్లకు నిరసనగా విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ వంటి సంఘాలు ర్యాలీలు నిర్వహించతలపెట్టిన నేపథ్యంలో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు కీలక నోటీసులు జారీ చేసింది. మతపరమైన విద్వేష ప్రసంగాలు చేయకుండా జాగ్రత్తలు పాటించాలని ఆదేశించింది. సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని స్పష్టం చేసింది. సీసీటీవీలతో నిఘాను మరింత పెంచాలని ఆయా ప్రభుత్వాలకు జారీ చేసిన నోటిసుల్లో పేర్కొంది. హర్యానాలోని నుహ్ జిల్లాలో ఘర్షణలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై పలు హిందూ సంఘాలు నిరసన తెలిపాయి. ఢిల్లీతో సహా చుట్టపక్కల రాష్ట్రాల్లో దాదాపు 30 వరకు ర్యాలీలు, సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రకటన విడుదల చేశాయి. ఇప్పటికే ఉన్న అల్లర్లు మరింత పెరిగే అవకాశం ఉందని, ఈ ర్యాలీలకు అనుమతించవద్దంటూ సుప్రీకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. భద్రతను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు పంపింది. అదనపు బలగాలను మోహరించాలని నోటీసుల్లో పేర్కొంది. ర్యాలీలపై పిటీషన్ దాఖలు.. హర్యానాలో రెండు వర్గాల మధ్య చెలరేగిన అల్లర్ల సెగ దేశ రాజధాని ఢిల్లీని కూడా తాకింది. నుహ్ జిల్లాలో అల్లర్లకు నిరసనగా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్లు ర్యాలీలు నిర్వహించతలపెట్టాయి. ఈ నేపథ్యంలో అల్లర్లు మరింత పెరిగే అవకాశం ఉందని సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలైంది. ఆయా సంఘాలు ర్యాలీలను రద్దు చేయాలని కోరుతూ పిటీషనర్ ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఈ పిటీషన్‌పై విచారణ చేపట్టనున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. నుహ్, గుర్‌గ్రామ్‌లలో ఆందోళనలు తీవ్రస్థాయికి చేరాయి. అల్లర్లను ప్రేరేపించే చిన్న సంఘటన కూడా భారీ స్థాయిలో ఆస్తి, ప్రాణ నష్టాన్ని కలిగించే అవకాశం లేకపోలేదు. కావున అల్లర్లను రెచ్చగొట్టే ఎలాంటి మతపరమైన ర్యాలీలకు అనుమతించవద్దని సుప్రీంకోర్టుకు దాఖలు చేసిన పిటీషన్లో పేర్కొన్నారు. హర్యానా ఘటనకు నిరసనగా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆందోళనలకు పిలుపునిచ్చారు. దీంతో ఢిల్లీలోని నారిమన్ విహార్ మెట్రో స్టేషన్ పరిధిలో బలగాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. మేవాత్ ప్రాంతంలో విశ్వహిందూ పరిషత్ నిరసనలకు పిలుపునిచ్చింది. మానేసర్‌లో భిసమ్ దాస్ మందిర్ వద్ద భజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ మహా పంచాయత్‌ను నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో అల్లర్లు మరింత పెరిగే అవకాశం ఉన్నందున ర్యాలీలకు అనుమతించవద్దని సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలైంది. హర్యానాలో సోమవారం అల్లర్లు చెలరేగాయి. విశ్వహిందూ పరిషత్ ర్యాలీపై ఇతర వర్గం వారు దాడి చేయడంతో అల్లర్లు ప్రారంభమయ్యాయి. అల్లరిమూకలు వందల సంఖ్యలో వాహనాలకు నిప్పంటించారు. అల్లర్లను అదుపుచేయడానికి ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. ఇంటర్నెట్ నిలిపివేసింది. ఇదీ చదవండి: ఎన్సీఆర్కు పాకిన హర్యానా మత ఘర్షణలు.. 116 మంది అరెస్ట్.. ఢిల్లీ హై అలర్ట్ -
జడ్జిగారూ.. వందే భారత్ ఆగేలా ఆదేశించండి
ఢిల్లీ: భారత సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్ గురించి దేశంలో ఎక్కువ చర్చ నడుస్తోంది. ఒకదాని తర్వాత మరో సర్వీస్ పట్టాలెక్కుతుండడంతో.. ఇతర రైళ్లపైనా ఈ ప్రభావం పడుతోంది. అయితే.. తాజాగా సుప్రీం కోర్టులో వందేభారత్ గురించి ఓ పిటిషన్ దాఖలు అయ్యింది. వందేభారత్ రైలును తమ ఊరి స్టేషన్లో ఆగేలా రైల్వే శాఖకు ఆదేశాలు జారీ చేయాలంటూ కేరళకు చెందిన ఓ యువ లాయర్ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలో పిటిషనర్ పీటీ షీజీష్‌ను సుప్రీం కోర్టు మందలించగా.. కనీసం ప్రభుత్వం ఈ ప్రతిపాదనను పరిశీలించేలా ఆదేశాలివ్వాలని కోరగా.. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ మండిపడింది. ఇది అసాధారణమైన విజ్ఞప్తి.. దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని పోస్టాఫీసుగా భావించొద్దంటూ ధర్మాసనం మండిపడింది. వందేభారత్ రైలు ఎక్కడ ఆగాలో నిర్ణయించాలని మమ్మల్ని కోరుతున్నావ్?.. తర్వాత ఢిల్లీ-ముంబై రాజధానిని ఆపాలని అడుగుతావా?.. ఇది విధానాలకు సంబంధించిన విషయం కాబట్టి అధికారులకు దగ్గరకు వెళ్లాలని ఆగ్రహం వ్యక్తం చేస్తూనే పిటిషనర్‌కు బెంచ్ సూచించింది. ఇక పరిశీలనకు పంపాలన్న అభ్యర్థనకు సైతం అభ్యంతరం వ్యక్తం చేసిన సీజేఐ.. ఇందులో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేశారు. వందేభారత్ రైలు.. తిరువనంతపురం నుంచి కాసర్గోడ్ మధ్య నడుస్తోంది. అత్యధిక జన సాంద్రత.. పైగా ప్రయాణికుల రద్దీతో ఉండే మలప్పురం స్టేషన్‌కు మాత్రం వందేభారత్ స్టాప్ కేటాయించలేదు. బదులుగా.. తిరూర్ రైల్వేస్టేషన్లో వందేభారత్‌కు స్టాప్‌ను కేటాయించించింది రైల్వేశాఖ. అయితే.. ఆ తర్వాత ఆ ప్రతిపాదనను విస్మరించిందని.. చుట్టుపక్కల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంట్నునారంటూ పిటిషనర్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. బదులుగా 60 కిలోమీటర్ల దూరంలోని పలక్కాడ్ షోర్నూర్‌కు స్టాప్ మంజూరు చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు పిటిషనర్. అయితే.. వందే భారత్ రైలు వంటి హై స్పీడ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు వ్యక్తిగత లేదంటే స్వార్థ ప్రయోజనాల ఆధారంగా డిమాండ్‌పై స్టాప్‌లు కేటాయించబడవు. ప్రజల డిమాండ్ మేరకు స్టాప్‌లు ఏర్పాటు చేస్తే, ఎక్స్‌ప్రెస్ రైలు అనే పదం తప్పుగా మారుతుంది అని ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. అంతకు ముందు పిటిషనర్ కేరళ హైకోర్టులోనూ ఓ పిటిషన్ వేయగా.. అది రైల్వే పరిధిలోకి వస్తుందంటూ ఉన్నత న్యాయస్థానం ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది. -
రద్దయిన పలు రైళ్లు .. ప్రయాణికుల తిప్పలు
-
కీర్తి సురేష్ పెళ్లి పై ఆమే తండ్రి సీరియస్
-
నన్నెవరూ ఆపలేరు.. ‘సత్యమేవ జయతే’ రోడ్డు షోలో రాహుల్..
తిరువనంతపురం: భయభ్రాంతులకు గురి చేసినా, ఎంపీ పదవి నుంచి తొలగించినా వయనాడ్ లోక్‌సభ స్థానం ప్రజలకు ప్రాతినిధ్యం వహించకుండా తననెవరూ అడ్డుకోలేరని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తేలి్చచెప్పారు. అనర్హత వేటు తర్వాత తొలిసారిగా కేరళలోని వయనాడ్ జిల్లాలో ఆయన మంగళవారం పర్యటించారు. కల్పెట్టాలో ‘సత్యమేవ జయతే’ పేరిట రోడ్డు షో నిర్వహించారు. తనను జైలులో పెట్టినప్పటికీ వయనాడ్ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తూనే ఉంటానన్నారు. 'నాపైకి పోలీసులను పంపిస్తే, నా ఇంటిని లాక్కుంటే భయపడే ప్రసక్తే లేదు. అదానీ గురించి, ఆయనతో ప్రధాని మోదీకి సంబంధాల గురించి నా ప్రశ్నలను తట్టుకోలేకే లోక్‌సభ నుంచి పంపించారు' అన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించినందుకు రాహుల్‌పై బీజేపీ ప్రభుత్వం క్రూరంగా మాటల దాడికి పాల్పడిందని ఆయన సోదరి ప్రియాంకాగాంధీ వాద్రా ఆరోపించారు. అబద్ధాలు చెప్పేవారికి, దు్రష్పచారం చేసేవారికి నిజాలు చేదుగానే ఉంటాయని ఎద్దేవా చేశారు. చదవండి: 300 పైగా సీట్లతో బీజేపీ గెలుపు.. మోదీనే మూడోసారి ప్రధాని: అమిత్ షా -
పెద్ద తలనొప్పిగా మారిన స్పామ్ కాల్స్
-
ఈగనా మజాకా! ఏకంగా పది గ్రామాల్లో పెళ్లిళ్లు ఆగిపోయాయి..
ఇంతవరకు ఎన్నోరకాల వింత వింత సంఘటనలు గురించి విన్నాం. ఏగ్రామంలోనైనా కనీసం ఏడాదికి ఎంతకాదన్న సుమారుగా మూడు నుంచి పది వరకు పెళ్లి సంబరాలు జరుగుతుంటాయి. కానీ ఇక్కడ ఆయా గ్రామాల్లో పెళ్లిళ్లే జరగడం లేదు. పైగా అక్కడి కోడళ్లు సైతం తమ తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయి కాపురానికి రానని తెగేసి చెబుతున్నారు. అసలు ఏంటి ఇది? ఎందుకిలా? అని ఆశ్యర్యపోకండి. అసలు విషయం వింటే ఆ! అని నోరెళ్లబెడతారు. వివరాల్లోకెళ్తే...ఉత్తరప్రదేశ్‌లో హర్దోయ్‌లోని పది గ్రామాల్లో పెళ్లిళ్లు జరగడం లేదు. అక్కడ ఉన్న తల్లిదండ్రులు సైతం తమ పిల్లలకు పెళ్లిళ్లు చేసేందుకు సిద్ధంగా లేరట. కేవలం ఈగలు కారణంగా అక్కడ పెళ్లిళ్లు జరగడం లేదంట. ఆయా గ్రామాల్లో చాలా బీభత్సంగా అక్కడ ఈగలు పెరిగిపోయాయట. వాటి ధాటికి ఆయా గ్రామాల్లో నివశిస్తున్న వారిని ఎవరూ పెళ్లి చేసుకునేందుకు ముందుకు రావడం లేదు. పైగా ఆ గ్రామాల్లోని కోడళ్లు సైతం కాపురానికి రామంటూ తమ పుట్టింటికి వెళ్లిపోతున్నారట. అంతేగాదు ఈ ఊర్నీ వదిలేసి రావాలి లేదా మమ్మల్ని వదిలేయండి అని ఆ ఊరి కోడళ్లే తమ భర్తలతో తెగేసి చెబుతున్నారు. ఆయా గ్రామాల్లోని అబ్బాయిలకు, అమ్మాయిలకు ఇప్పడూ పెళ్లి ఒక సమస్యగా మారింది. ఆయా గ్రామాల్లోని ప్రజలు ఈగలను వదిలించుకోవాలని గ్రామం వెలుపల కూర్చొని నిరసనలు చేస్తున్నారు కూడా. ఈ నిరసనలో మహిళలు పొయ్యిలతో సహ పాల్గొంటున్నారు. వాస్తవానికి ఆయా గ్రామాల్లో 2014 ముందు వరకు అంతా బాగానే ఉంది. అక్కడ ఒక పౌల్ట్రీ ఫారం ప్రారంభమైంది. అది ప్రారంభించిన కొద్దిరోజులకే ఈగల బెడద పెరిగిపోయింది. అది ఇప్పుడూ ఎంతలా ఉందంటే...గతంలో కంటే ఈగలు వందల రెట్లు ఉన్నాయి. ఈ మేరకు పౌల్ట్రీ ఫారమ్‌కు సమీపంలో ఉన్న కార్పెంటర్పూర్వా గ్రామం తోపాటు కుయాన్, పట్టి, దహి, సలేంపూర్, ఫతేపూర్, ఝల్పూర్వా, నయాగావ్, డియోరియా, ఎక్ఘరాలకు ఈగల భయం వ్యాపించింది. పాపం ఇక్కడి గ్రామస్తులు మాదిరిగానే పాలక వర్గం సైతం ఈ ఈగల విషయంలో నిస్సహాయంగా ఉంది. (చదవండి: వివాహ మండపంలోకి ఎద్దు ఎంట్రీ..పరుగులు తీస్తున్న జనాలు) -
ఐటీ సంస్థలపై ద్వంద్వ పన్ను నివారించాలి
న్యూఢిల్లీ:ఆస్ట్రేలియాలో ఆఫ్‌షోర్ సేవల రూపంలో భారత ఐటీ సంస్థలకు వస్తున్న ఆదాయంపై ద్వంద్వ పన్నును నివారించేందుకు సత్వరం చర్యలు చేపట్టాలని భారత్ కోరింది. ద్వంద్వ పన్నుల నివారణ చట్టం (డీటీఏఏ)లో ఈ మేరకు సవరణలు త్వరగా చేయాలని డిమాండ్ చేసింది. పశ్చిమ ఆస్ట్రేలియా డిప్యూటీ ప్రధాని రోగర్ కుక్‌తో సమావేశం సందర్భంగా గురువారం కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. డీటీఏఏకు సవరణ అన్నది ఎంతో ముఖ్యమైన విషయంగా గుర్తు చేశారు. భారత్-ఆస్ట్రేలియా వాణిజ్య ఒప్పందం కింద దీనిపై లోగడ అంగీకారం కుదిరినట్టు చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో భారత్-ఆస్ట్రేలియా సమగ్ర ఆర్థిక సహకార, వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడం గమనార్హం. కాకపోతే ఇది ఇంకా అమల్లోకి రావాల్సి ఉంది. భారత విద్యార్థులకు వీసాల జారీలో జాప్యాన్ని కూడా మంత్రి ప్రస్తావించారు. భారత విద్యార్థులు, పర్యాటకుల వీసా దరఖాస్తులను వేగంగా ప్రాసెస్ చేసే మార్గాలను చూస్తామని ఆ్రస్టేలియా అంగీకరించింది. విద్య, కీలకమైన ఖనిజాలు, వ్యవసాయం, ఇంధనం, పర్యాటకం, మైనింగ్ టెక్నాలజీలో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలన్న అభిప్రాయాన్ని ఇరు దేశాలు వ్యక్తం చేశాయి. పరస్పర ప్రయోజనాల దృష్ట్యా వాణిజ్య ఒప్పందం అమలుకు సంబంధించి ఆమోద ప్రక్రియలను వేగవంతం చేయాలని భారత్ కోరింది. -
చర్చలు జరిగేందుకైన దాడి చేయడం ఆపండి!
legally binding security guarantees if NATO shut the Door: రష్య ఉక్రెయిన్‌పై తన దాడిని ఏడో రోజు కూడా కొససాగిస్తూనే ఉంది. ప్రస్తుతం ప్రజా ఆవాసాలపై కూడా దాడి చేసి రాజధాని కైవ్లోకి చొరబడేందుకు యత్నిస్తోంది. ఇప్పటికే పలు నగరాలలోకి బలగాలు చొరబడ్డాయి. దీంతో ఉక్రెయిన్ అద్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ అర్థవంతమైన చర్చలు జరిగేందుకైన ముందు ఉక్రెయిన్‌లోని నగరాలపై దాడి చేయడం ఆపేయాలని అన్నారు. కనీసం ప్రజలపై బాంబు దాడి చేయడం ఆపేయాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాదు ఉక్రెయిన్ను నాటోలోకి తీసుకోవడానికి సిద్ధంగా లేకున్నా.. రష్యా ఉక్రెయిన్ నాటోలో ఉండకూడదనుకుంటే గనుక కనీసం ఉక్రెయిన్‌కు చట్టబద్ధంగా కట్టుబడి ఉండే భద్రతా హామీలను రూపొందించాలి అని భాగస్వామ్య దేశాలను జెలెన్ స్కీ కోరారు. ఉక్రెయిన్ పతనమైతే ఈ రష్యన్ దళాలన్నీ మీ నాటో సభ్య దేశాల సరిహద్దుల్లో ఉంటాయని తెలుసుకోవడం చాలా ముఖ్యం అన్నారు. అంతేకాదు అక్కడ కూడా మీకు ఇదే ప్రశ్న తలెత్తుందని స్పష్టం చేశారు. మరోవైపు ఉక్రెయిన్ గత వారం రష్యన్ దళాల దండయాత్రను తట్టుకోవడంలో సహాయపడటానికి నాటో సభ్యుల నుంచి ఆయుధాల రవాణాను పొందింది. అంతేగాక రష్యాను కట్టడి చేసి దిశగా పశ్చిమ దేశాలు రష్యా ఆర్థిక వ్యవస్థపై ఆంక్షలను కూడా ప్రవేశపెట్టాయి. అయితే జెలన్ స్కీ నో ఫ్లై జోన్ విధించడంతో పాటు మరిన్ని చేయాలని జెలెన్స్కీ అంతర్జాతీయ సమాఖ్యను కోరారు. రష్యా సైనిక చర్యతో త్వరితగతిన లాభలు పొందలేదని ప్రధాన నగరాలను స్వాధీనం చేసుకోలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉక్రెయిన్ యుద్ధ భూమిలో ఒంటరిగా నిలబడి ఉందని, పైగా దాని స్వంత భద్రత పశ్చిమ దేశాలతో ముడిపడి ఉందనే విషయాన్ని గుర్తించాలన్నారు. అంతేకాదు తమకు ప్రతి రోజు యుద్ధం ఉందని, తమకు సహాయం కావాలని చెప్పారు. "నేను నా దేశం కోసం నిరంతరం పనిచేస్తున్నా, మేము మా భూమిని, మా ప్రజలను రక్షించుకునేందకు చివరి వరకు నిలబడి పోరాడుతాం. మా పిల్లల భవిష్యత్తు కోసం నిలబడతాం ". అని జెలెన్ స్కీ చెప్పారు. (చదవండి: పుతిన్ ఆంక్షలు... రష్యన్లు దేశం విడిచి వెళ్లకుండా కట్టడి!) -
ఆ ప్రయాణికులకు షాకిచ్చిన ఓలా, ఉబర్ డ్రైవర్లు
సాక్షి, హైదరాబాద్: ఓలా, ఉబెర్ డ్రైవర్లు క్యాబ్ బంద్ తలపెట్టారు. దీంతో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే సుమారు మూడు వేల క్యాబ్‌లపై ప్రభావం పడింది. ఉబెర్, ఓలా సంస్థలు సరైన కమీషన్లు ఇవ్వడం లేదని, తమ శ్రమకు తగిన ఆదాయం లభించడం లేదని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రివేళల్లో రాకపోకలు సాగించే క్యాబ్‌లు చాలావరకు నిలిచిపోయాయి. ఓలా, ఉబెర్ సర్వీసులకు ఆటంకం ఏర్పడడంతో జీఎమ్మార్ ఎయిర్ పోర్టు మూడు ప్రత్యామ్నాయ క్యాబ్‌లను అందుబాటులోకి తెచ్చింది. ►ఎయిర్‌పోర్టు నుంచి సాధారణంగా ప్రతిరోజూ సుమారు 5000 క్యాబ్‌లు 24 గంటల పాటు సేవలందజేస్తాయి. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి క్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయి. కానీ కోవిడ్ దృష్ట్యా కొంతకాలంగా క్యాబ్‌ల సంఖ్య 3 వేలకు తగ్గింది. గతంలో ఎయిర్‌పోర్టుకు నడిపే క్యాబ్‌లకు రోజుకు రూ.2000 నుంచి రూ.3000 వరకు ఆదాయం లభించగా ఇప్పుడు రోజుకు రూ.1000 కూడా రావడం లేదని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ►ఎయిర్‌పోర్టులో రూ.250 పార్కింగ్ చార్జీలు, డీజిల్ ఖర్చు మినహాయిస్తే రోజుకు రూ.500 మాత్రమే మిగులుతున్నాయని తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అసోసియేషన్ ప్రతినిధి షేక్ సలావుద్దీన్ విస్మయం వ్యక్తం చేశారు. ఓలా, ఉబెర్ సంస్థల నుంచి సరైన కమీషన్లు లభించకపోవడంతోనే తాము తీవ్రంగా నష్టపోతున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే ఎయిర్‌పోర్టు నుంచి ఓలా, ఉబెర్ క్యాబ్‌ల సేవలను నిలిపివేసినట్లు పేర్కొన్నారు. కమీషన్లు పెంచాలి.. ప్రభుత్వం గతంలో ప్రతిపాదించినట్లుగా కిలోమీటర్‌కు రూ.17 చొప్పున ఇవ్వాలని డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతంఒక కిలోమీటర్‌పై రూ.10 కూడా గిట్టుబాటు కావడం లేదని, దీంతో రూ.లక్షల్లో అప్పులు తెచ్చి కొనుగోలు చేసిన వాహనాలకు నెల నెలా రుణాలు కూడా చెల్లించలేకపోతున్నట్లు పేర్కొన్నారు. కమీషన్లు పెంచే వరకు క్యాబ్‌లు నడపబోమని సలావుద్దీన్ స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయంగా మూడు క్యాబ్ సర్వీసులు.. డ్రైవర్ల ఆందోళన దృష్ట్యా ఉబెర్, ఓలా సేవలకు ఆటంకం ఏర్పడడంతో జీఎమ్మార్ ఎయిర్‌పోర్టు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టారు. ఎయిర్‌పోర్టు నుంచి చాయిస్, 4 వీల్స్, క్విక్ రైడ్ అనే మూడు క్యాబ్ సర్వీస్ ఆపరేటర్లను అందుబాటులోకి తెచ్చారు. ప్రయాణికుల డిమాండ్ మేరకు ఆర్టీసీ పుష్పక్ బస్సు లు కూడా అందుబాటులో ఉన్నాయని, ప్రయాణికుల కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. చదవండి: వారి కన్నీటి కథ.. కండలు కరిగినా కడుపునిండదాయె -
తప్పుడు ప్రకటనలపై గూగుల్ కీలక నిర్ణయం
లండన్: వాతావరణ మార్పుపై తప్పుడు సమాచారం అందించే ప్రకటనలను తమ ప్లాట్‌ఫామ్‌పై ప్రోత్సహించకూడదని ప్రముఖ అంతర్జాతీయ కంపెనీ గూగుల్ నిర్ణయించింది. తన ప్లాట్‌ఫామ్స్‌పై శీతోష్ణస్థితి మార్పుపై తప్పుడు సమాచారం వ్యాపించకుండా నిరోధించడం, అలాంటి సమాచారాన్ని ఇతరులు ఆర్జనకు ఉపయోగించుకోకుండా నిలిపివేయడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. గూగుల్‌కు చెందిన యూట్యూబ్‌కు కూడా తాజా నిర్ణయం వర్తింస్తుందని కంపెనీ వెల్లడించింది. శాస్త్రీయాధా రితం కాని శీతోష్ణస్థితి మార్పు సమాచారాన్ని ఇతర ప్రకటనకర్తలు తమ ప్రకటనల పక్కన కనిపించాలని కోరుకోరని తెలిపింది. శీతోష్ణస్థితి మార్పు అనేది లేదని చెపుతూ సొమ్ము చేసుకునే వీడియోలను యూట్యూబ్‌లో ఉంచమని పేర్కొంది. ఇటీవల కాలంలో వాతావరణ మార్పు లేదా గ్రీన్హౌస్ వాయువుల వల్ల ప్రమాదం అనేవి నిజాలు కావని కొందరు ప్రచారం ఆరంభించిన సంగతి తెలిసిందే! వీరు తమ వాదనలకు అనుకూలంగా వీడియోలను, ప్రకటనలను రూపొందిస్తున్నారు. ఇలాంటివాటిని నిరోధిం చాలని కంపెనీ నిర్ణయించుకుంది. ఈ మార్పు అమలుకు కంపెనీ ఆటోమేటెడ్ టూల్స్‌ను ఉపయో గించనుంది. పర్యావరణ హితకారులైన కొన్ని విధానాలను ఇటీవల గూగుల్ ప్రవేశపెట్టింది. అయితే తాజా మార్పులను కొందరు నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఒక సమాచారం సరైనదా? కాదా? ఎలా గూగుల్ నిర్ణయిస్తుందని వాతావరణ పరిశోధకురాలు లీసా షిప్పర్ ప్రశ్నించారు. ఈ విషయంలో కంపెనీ మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు కోరుతున్నారు. -
బడాబడా కంపెనీలు భారత్ వీడిపోవడానికి కారణం ఇదేనా..!
ప్రముఖ అమెరికా ఆటో మొబైల్ దిగ్గజం ఫోర్డ్ భారత్‌లో తన ఉత్పత్తి నిలిపివేస్తు కీలక నిర్ణయం తీసుకున్న నిర్ణయం తెలిసిందే. గత నాలుగు సంవత్సరాలు క్రితం 2017లో జనరల్‌మోటార్స్ కూడా భారత్‌ను వీడింది. పలు విదేశీ కంపెనీలు తట్టబుట్టా సర్దుకుని భారత్‌ను వీడుతున్నాయి. ఒక్కసారిగా భారత్‌ను వీడటంతో ఆయా కంపెనీల డీలర్లపై భారీ ప్రభావం పడనుంది. అంతేకాకుండా కంపెనీల ఉద్యోగుల జీవితాలు ఆగమ్యాగోచరం కానుంది.. హ్యూందాయ్ మినహా మిగిలిన విదేశీ ఆటోమొబైల్ కంపెనీలు భారత్ ఆటోమొబైల్ రంగంలో కేవలం ఆరుశాతం వాటాను మాత్రమే కల్గిఉన్నాయి. భారత మార్కెట్లో ఫోర్డ్ 2 శాతం కంటే తక్కువ , ఫోక్స్‌వ్యాగన్ ఒక శాతం మేర మాత్రమే వాటాలను కల్గి ఉంది. ప్రపంచమార్కెట్లో అత్యంత విజయంతమైన టయోటా కూడా భారత్‌లో కేవలం 3 శాతం వాటానే కల్గి ఉంది. చదవండి: సెడాన్ అమ్మకాల్లో ఆ కారుదే అగ్రస్థానం పన్నుల భారమే కారణమా..! అధిక పన్నుల భారం వలనే పలు విదేశీ కంపెనీలు భారత్ నుంచి బయటకు వెళ్తున్నట్లు బిజినెస్ స్టాండర్ట్ లిమిటెడ్ చైర్మన్ టీఎన్ టీనన్ అభిప్రాయపడ్డారు. టయోటా గతంలో భారీ పన్నుల భారం విషయంపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. టయోటా భారత మార్కెట్ల నుంచి ఎటియోస్, కరోలా ఆల్టిస్ మోడళ్లను నిలిపివేసింది. విదేశీ ఆటోమొబైల్ దిగ్గజాలు భారత మార్కెట్లో సుస్థిర స్థానాలను నిలుపుకోవడానికి ఎంతగా ప్రయత్నించిన పలు కంపెనీలు నిలవలేకపోయాయి. కొద్ది రోజుల ప్రముఖ దిగ్గజ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ భారత్‌లోకి వచ్చేందుకు దిగుమతి సుంకాలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాలను విన్నవించిన విషయం తెలిసిందే. విదేశీ కార్లపై ట్యాక్స్ విషయంలో టెస్లా, హ్యుందాయ్, బెంజ్, ఫోక్స్‌వ్యాగన్ కంపెనీలు కేంద్రానికి విజ్ఞప్తులు చేశాయి. విదేశీ కంపెనీల కార్లపై ప్రభుత్వం సుమారు 100 శాతం మేర ట్యాక్స్‌లను వసూలు చేస్తోంది. భారత్‌లో వాటికే ఎక్కువ ప్రాధాన్యం..! భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కొనుగోలుదారులు ఎక్కువగా తక్కువ ఖర్చుతో నడిచే తక్కువ ధర కలిగిన కార్లపై ఎక్కువ మోజు చూపుతారు. తక్కువ ఖర్చుతో వచ్చే వాహనాలు విదేశీ కంపెనీల దగ్గర సరిపోయే మోడల్స్ లేవు. భారత మార్కెట్లో మారుతి, హ్యుందాయ్ మాత్రమే విజయవంతమైన ప్రవేశ-స్థాయి కార్ మోడళ్లను కలిగి ఉన్నాయి. ఫోర్డ్, టయోటా , ఫోక్స్‌వ్యాగన్, వంటి కంపెనీల నుంచి భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన మారుతి ఆల్టోతో పోటీ పడే కార్లు ఆయా విదేశీ ఆటోమొబైల్ కంపెనీల వద్ద లేవు. మారుతి ఆల్టో ఎంట్రీ లెవల్ మార్కెట్లో రూ.3 లక్షల నుంచి కొనుగోలుదారులకు అందుబాటులో ఉంది. ఇంతా తక్కువ ఖర్చులో భారత వాహన ప్రియులకు తయారుచేయడం బడాబడా కంపెనీలకు అంతగా తెలియదు. హ్యూందాయ్ లాంటి కంపెనీలు భారత ప్రజలకు తగ్గట్టుగా బహిరంగ మార్కెట్లోకి వాహనాలను తీసుకురావడంతో తన స్థానాన్ని పదిలంగా నిలుపుకుంటుంది. వాహన కొనుగోలు దారుల కొనుగోలు స్థాయి గణనీయంగా పెరిగింది. దీంతో చాలా మంది కొనుగోలుదారులు మారుతి 800సీసీ కారు నుంచి రూ. 6 లక్షల నుంచి 10 లక్షల మధ్య వచ్చే కార్లను కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యారు. హ్యుందాయ్ నుంచి ఐ20, సుజుకి నుంచి స్విఫ్ట్ బాలెనో, టాటా మోటార్స్ కు చెందిన టియాగో, ఆల్ట్రోజ్ వంటి కార్లపై ఎక్కువగా ఆదరణను పొందాయి. చదవండి : Ford: ప్లీజ్ మమ్మల్ని వదిలేసి వెళ్లొద్దు! -
నేటి నుంచి ఈ క్రెడిట్/డెబిట్ కార్డుల జారీ బంద్..!
ముంబై: అమెరికాకు చెందిన మాస్టర్‌కార్డ్ నేటి నుంచి కొత్త డెబిట్/క్రెడిట్ కార్డులను జారీ చేయదు. కొద్ది రోజుల క్రితం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాస్టర్ కార్డులపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. డేటా నిల్వ నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు మాస్టర్‌కార్డ్ సేవలను ఆర్బీఐ నిలిపివేసింది. ప్రధాన చెల్లింపు వ్యవస్థ ఆపరేటర్లు కొత్త దేశీయ కస్టమర్లలోకి ప్రవేశించలేరని ఆర్బీఐ పేర్కొంది. మాస్టర్‌కార్డ్ పై నిషేధం విధించడంతో చాలా ప్రైవేటు బ్యాంకులకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. పలు ప్రైవేటు బ్యాంకులు తమ ఖాతాదారుల మాస్టర్ కార్డ్ సేవలను వీసా కార్డు వంటి ప్రత్యామ్నాయ సంస్థలతో జతకట్టాల్సిన అవకాశం ఏర్పడింది. దేశంలోని స్థానిక డేటా నిల్వ నియమాలకు సంబంధించి ఆర్బీఐ నుంచి చర్యలు ఎదుర్కొన్న మూడో ప్రధాన చెల్లింపు వ్యవస్థ ఆపరేటర్‌గా మాస్టర్‌కార్డ్ నిలిచింది. గతంలో డేటా స్టోరేజ్ విషయంలో అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకింగ్ కార్ప్, డైనర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థ కార్డులను ఆర్బీఐ నిషేధించింది. కొద్ది రోజుల క్రితం ఆర్బీఐ భారత్‌లో బ్యాంకు ఖాతాదారులకు కొత్త మాస్టర్‌కార్డు డెబిట్/ క్రెడిట్ కార్డులను జారీ చేయకుండా వివరణాత్మక ఉత్తర్వులను విడుదల చేసింది. ఆర్బీఐ తీసుకున్న చర్యతో ప్రస్తుతం దేశంలోని మాస్టర్ కార్డ్ హోల్డర్ల సేవలను ప్రభావితం చేయదని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఖాతాదారులు ఆర్బీఐ నిర్ణయంతో ప్రభావితం కానప్పటికీ బ్యాంక్ సేవలు దెబ్బ తినే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా పలు బ్యాంకులు వీసా వంటి ప్రత్యామ్నాయ సంస్థలతో కొత్త వాణిజ్య ఒప్పందాలపై సంతకం చేయవలసి ఉన్నందున ఈ చర్య బ్యాంకింగ్ రంగాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుందని బ్యాంకింగ్ అధికారులు సూచించారు. ఈ ప్రక్రియలో భాగంగా బ్యాక్ ఎండ్ టెక్నాలజీ ఇంటిగ్రేషన్‌కు దాదాపు ఐదు నెలలు సమయం పట్టే అవకాశం ఉందని బ్యాంకింగ్ అధికారులు పేర్కొన్నారు. -
ప్రభుత్వ విప్ ఉదయభానును అడ్డుకున్న తెలంగాణ పోలీసులు
-
ప్రభుత్వ విప్ ఉదయభానును అడ్డుకున్న తెలంగాణ పోలీసులు
కృష్ణా జిల్లా: జగ్గయ్యపేట మండలం ముక్త్యాల గ్రామ సమీపంలోని పులిచింతల ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్న ఏపీ ప్రభుత్వ విప్ సామినేని ఉదయభానును తెలంగాణ సరిహద్దు వద్ద ఆ రాష్ట్ర పోలీసులు అడ్డుకున్నారు. తెలంగాణ భూభాగం గుండా టీఎస్ పోలీసులు అనుమతించకపోవటంతో కృష్ణా జిల్లా ముత్యాల నుండి గుంటూరు జిల్లా మాదిపాడుకు కృష్ణా నదిలో పడవ ద్వారా పులిచింతల ప్రాజెక్టు వద్దకు సామినేని చేరుకున్నారు. అడ్డుకోవడం దారుణం... పులిచింతల వద్ద తెలంగాణ అక్రమంగా విద్యుదుత్పత్తి చేస్తోందని.. ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లిన మమ్మల్ని అడ్డుకోవడం దారుణమని ఉదయభాను ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖరీఫ్ సీజన్ మొదలవకుండా విద్యుదుత్పత్తి వల్ల నీరు వృథా అవుతోందన్నారు. విభజన హామీలను తెలంగాణ తుంగలో తొక్కుతోందని.. బచావత్ ట్రిబ్యునల్ చెప్పిన ప్రకారం నీటిని వాడుకోవాలని ఉదయభాను అన్నారు. ‘‘వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు జలయజ్ఞంలో భాగంగా పులిచింతల నిర్మించారు. తెలంగాణలోనే వైఎస్ ఎక్కువ ప్రాజెక్టులు కట్టారు. తెలంగాణ మంత్రులు నేతలు వైఎస్ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్.. వైఎస్ గురించి మాట్లాడిన మాటలు సబబు కాదు. కేసీఆర్ కూడా ఈ అంశంపై పునరాలోచించాలి. శనివారం ఒక్కరోజే ఒక టీఎంసీ వృధా చేశారు. ఒక టీఎంసీ పదివేల సాగుకు ఉపయోగపడుతుంది. ఇప్పటివరకు 75 టీఎంసీలు వృధా చేశారు. ఇరు రాష్ట్రాలు స్నేహపూర్వకంగా ఉండాలని సీఎం జగన్ చెప్పారు. దేవుడు చెప్పినా వినం అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆత్మపరిశీలన చేసుకోవాలని’’ సామినేని హితవు పలికారు. -
తెలంగాణ సరిహద్దులో ఏపీ అంబులెన్స్‌ల నిలిపివేత
సాక్షి, సూర్యాపేట: తెలంగాణ సరిహద్దులో ఏపీ అంబులెన్స్‌లను తెలంగాణ పోలీసులు నిలిపివేస్తున్నారు. అంబులెన్స్‌లను వెనక్కి పంపడంతో కోవిడ్ పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రి లెటర్, కోవిడ్ కంట్రోల్ రూమ్ నుంచి జారీ చేసిన పాస్‌లు ఉంటేనే అనుమతి ఇస్తున్నారు. పంచలింగాల టోల్గేట్ వద్ద.. కర్నూలు: పంచలింగాల టోల్గేట్ తెలంగాణ సరిహద్దు వద్ద ఏపీ అంబులెన్స్‌లపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. అంబులెన్స్ అపివేయటంతో చికిత్స అందక ఒకరు మృతి చెందారు. ఆర్టీఏ బోర్డర్ వద్ద మరికొన్ని అంబులెన్స్‌లు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసు అధికారులతో ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ మాట్లాడారు. అంబులెన్స్‌లను పంపించేందుకు అధికారులతో కూడా ఎమ్మెల్యే చర్చలు జరిపారు. దీంతో అంబులెన్స్‌ను అనుమతించారు. కాగా, పొరుగు రాష్ట్రాల నుంచి కోవిడ్–19 వైద్య సేవల కోసం తెలంగాణకు వస్తున్నవారిని అనుమతించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందేందుకు రావాలంటే సదరు ఆస్పత్రి అంగీకారం తప్పనిసరిగా ఉండాలని తెలిపింది. చికిత్స చేసేందుకు సానుకూలంగా ఉన్నట్టుగా ఆస్పత్రితో ముందస్తు ఒప్పందం చేసుకోవాలని పేర్కొంది. అనంతరం పోలీసు శాఖ అనుమతి కోసం కంట్రోల్ రూమ్‌కు వివరాలు సమర్పించి రసీదు తీసుకోవాలని సూచించింది. చదవండి: ఇక తెలంగాణలో ప్రవేశానికి ఇవి తప్పనిసరి లాక్డౌన్: సరిహద్దులు దిగ్బంధం.. -
274 పంచాయతీల్లో ఎన్నికల్లేవు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 274 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు ఆగిపోయాయి. నాలుగు విడతల్లో నిర్వహిస్తున్న పంచాయతీ ఎన్నికల్లో ఈ గ్రామాల ప్రస్తావనే లేదు. రాష్ట్రంలో మొత్తం 13,371 గ్రామ పంచాయతీలున్నాయి. తొలి విడతలో 3,249 పంచాయతీల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. రెండో విడతలో 3,328 పంచాయతీల్లో రేపు (ఈ నెల 13న), మూడో విడతలో 3,221 పంచాయతీల్లో ఈ నెల 17న పోలింగ్ జరగనుంది. నాలుగో విడతగా 3,299 గ్రామాల్లో ఈనెల 21న నిర్వహించే ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నాలుగు విడతల్లోను ఎన్నికల నోటిఫికేషన్ జారీచేయనివి 274 పంచాయతీలున్నాయి. వీటిలో అత్యధికంగా గుంటూరు జిల్లాలో 69 ఉన్నాయి. ఏడాది కిందట పెద్ద గ్రామ పంచాయతీలుగా ఉన్న వాటిని పలుచోట్ల స్థానికుల డిమాండ్ మేరకు రెండుగా వర్గీకరించారు. అనంతరం ఆయా పంచాయతీల్లో వార్డుల విభజన జరగలేదు. దీంతో వాటిలో ఎన్నికలు నిర్వహించడంలేదు. కొన్ని పంచాయతీలకు సంబంధించి కోర్టుల్లో కేసులున్నాయి. అందువల్ల ఈ పంచాయతీలకు కూడా ఎన్నికలు నిర్వహించడంలేదు. నోటిఫికేషన్ జారీ అయినా జరగనివి మరికొన్ని ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ అయిన తరువాత కూడా వివిధ కారణాలతో మరికొన్ని పంచాయతీల్లో ఎన్నికలు ఆగిపోయాయి. మొదటి విడతలో నోటిఫికేషన్ జారీచేసినా సర్పంచి, వార్డు పదవులకు నామినేషన్లు దాఖలు కాకపోవడంతో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెలిచర్ల పంచాయతీలో ఎన్నికలు నిలిచిపోయాయి. రెండో విడత నోటిఫికేషన్ ఇచ్చిన పంచాయతీల్లోను మూడుచోట్ల ఎన్నికలు నిలిచిపోయినట్లు పంచాయతీరాజ్‌శాఖ అధికారులు తెలిపారు. మూడో విడత ఉపసంహరణకు, నాలుగో విడత నామినేషన్ల దాఖలుకు నేడు గడువు మూడో విడత ఎన్నికలు జరగనున్న 3,221 పంచాయతీల్లో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియనుంది. అనంతరం ఎంతమంది పోటీలో ఉన్నారన్న స్పష్టత రానుంది. నాలుగో విడతలో ఎన్నికలు జరిగే గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. -
12 ఏళ్లలో మొదటిసారి...
నిఫ్టీ, సెన్సెక్స్‌లు 10 శాతం లోయర్ సర్క్యూట్ పరిమితిని తాకడంతో స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్‌ను 45 నిమిషాల పాటు నిలిపేశారు. ఇలా సర్క్యూట్ బ్రేకర్ కారణంగా ట్రేడింగ్ నిలిచిపోవడం గత 12 ఏళ్లలో ఇదే మొదటిసారి. ఈ సర్క్యూట్ బ్రేకర్స్ సంగతేంటో చూద్దాం... ► స్టాక్ మార్కెట్లో అధిక స్థాయిల్లో నెలకొనే ఒడిదుడుకులను నివారించే ఉద్దేశంతో సర్క్యూట్ బ్రేకర్ విధానాన్ని అనుసరిస్తారు. సెన్సెక్స్, నిఫ్టీలు 10, 15, 20 శాతం... ఈ మూడు స్థాయిల్లో పెరిగినా, పతనమైనా, సర్క్యూట్ బ్రేకర్లు వర్తిస్తాయి. ► 10 శాతం: ఉదయం సెషన్లో ట్రేడింగ్‌ను 45 నిమిషాల పాటు ఆపేస్తారు. ఒంటి గంట నుంచి గం.2.30 ని. మధ్య అయితే 15 నిమిషాల పాటు ట్రేడింగ్‌ను నిలిపేస్తారు. గం.2.30.ని. తర్వాత ట్రేడింగ్ నిలిపివేత ఉండదు. ► 15 శాతం: మధ్యాహ్నం ఒంటి గంటకు ముందు ట్రేడింగ్‌ను గం.1.45 నిమిషాలు నిలిపేస్తారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్య అయితే 45 నిమిషాల పాటు ట్రేడింగ్‌ను ఆపేస్తారు. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత అయితే ఆ రోజుకు పూర్తిగా ట్రేడింగ్‌ను నిలిపేస్తారు. ► 20 శాతం ఉంటే...: ట్రేడింగ్‌ను ఆ రోజుకు పూర్తిగా ఆపేస్తారు. ► 2008, జనవరి 22: సర్క్యూట్ బ్రేకర్ల కారణంగా ట్రేడింగ్ నిలిచిపోయింది. లేమాన్ బ్రదర్స్ దివాలా తీయడంతో ప్రపంచ మార్కెట్లు భారీగా పతనం కావడంతో సెన్సెక్స్ 1,408 పాయింట్లు పతనమైంది. సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకు పైగా పతనం కావడం ఇదే మొదటిసారి. ► 2009, మే 18:∙యూపీఏ ప్రభుత్వం రెండోసారి భారీ మెజార్టీతో అధికారంలోకి రావడంతో సెన్సెక్స్ 17 శాతం (2,111 పాయింట్లు) లాభపడి 14,284 పాయింట్లకు ఎగసింది. ఆ ఒక్క రోజే రెండు సార్లు సెన్సెక్స్ సర్క్యూట్ బ్రేకర్లను తాకింది. 1992, మార్చి 2న అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ ఉదార ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టడంతో సెన్సెక్స్ 21 శాతం ఎగసింది. ఈ సందర్భంలో కూడా ట్రేడింగ్‌ను నిలిపేశారు.