కంటికి శ్రమ తగ్గించే 'స్క్రీనర్లు' | These Experimental Glasses Stop You from Staring at Screens | Sakshi
Sakshi News home page

కంటికి శ్రమ తగ్గించే 'స్క్రీనర్లు'

Published Mon, Jul 11 2016 12:39 PM | Last Updated on Mon, Sep 4 2017 4:37 AM

కంటికి శ్రమ తగ్గించే 'స్క్రీనర్లు'

కంటికి శ్రమ తగ్గించే 'స్క్రీనర్లు'

న్యూయార్క్ః ఆధునిక జీవితంలో ప్రతి విషయం ఫింగర్ టిప్స్ పై ఉండాలంటే స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్ ల్యాప్ లపై ఆధారపడటం తప్పడం లేదు. కొందరు ఆధునిక టెక్నాలజీకి, సామాజిక మాధ్యమాలకు బానిసలు కూడ అయిపోతున్నారు. ఈ నేపథ్యంలో అతిగా స్క్రీన్ చూడటం వల్ల అనేక అనర్థాలు కలుగుతున్నాయి. స్క్రీన్ నుంచి వెలువడే కాంతికి  కంటి సమస్యలూ అధికమౌతున్నాయి. ఇందుకు పరిష్కారం దిశగా ఆలోచించిన పరిశోధకులు కంటికి రక్షణ కల్పించే పారదర్శక అద్దాలను అందుబాటులోకి తెచ్చారు. స్క్రీన్ చూసేప్పుడు వాటిని వినియోగించడంవల్ల కాంతిని నిరోధించి కంటికి శ్రమ తగ్గిస్తాయని చెప్తున్నారు.

స్క్రీనర్ల పేరిట కాంతిని నిరోధించే ప్రయోగాత్మక పారదర్శక అద్దాలు అందుబాటులోకి వచ్చాయి. కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ ట్యాప్ లు అధికంగా వాడేవారు తీవ్రమైన కంటి సమస్యలతో బాధపడుతుండటాన్ని దృష్టిలో పెట్టుకున్న 28 ఏళ్ళ ఛినో కిమ్ ఆ దిశగా ఆలోచించాడు. ఆధునిక అద్దాలను ధరించడంవల్ల అత్యధిక సమయం స్క్రీన్లు చూసేవారికి ఎంతో ఉపయోగంగా ఉంటుందని చెప్తున్నాడు. టెక్ సంస్కృతి వైరస్ లా వ్యాపిస్తున్న నేటి తరుణంలో కంటిని కాపాడేందుకు తన నూతన సృష్టి ఎంతగానో సహకరిస్తుందని ఇటీవల జరిగిన ఎన్ వై యు ఇంటరాక్టివ్ టెలికమ్యూనికేషన్స్ కార్యక్రమం స్ప్రింగ్ షోలో తెలిపాడు.

'స్క్రీనర్' ను తలకు ధరించి  చూడ్డంద్వారా కంటి సమస్యలనుంచి బయటపడొచ్చని ఛినోకిమ్ చెప్తున్నాడు. దైనందిన జీవితంలో ఎక్కువశాతం స్క్రీన్లను చూసేవారు స్మార్ట్ ఫిల్మ్ తో తయారు చేసిన లెన్స్ కలిగిన ఈ స్క్రీనర్ ను వినియోగిస్తే ఫలితాలు ఉంటాయంటున్నాడు.  'మెషీన్ లెర్నింగ్ ఫర్ ఆర్ట్స్' చదువుతున్న సమయంలో తనకు ఈ కొత్త ఆలోచన వచ్చిందని, బేసిక్ మెషీన్ లెర్నింగ్ అండ్ కంప్యూటర్ ప్రోగ్రామ్ ద్వారా ఈ అద్దాలను రూపొందించినట్లు కిమ్ తెలిపాడు. స్క్రీనర్లు కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ నుంచి కూడ రక్షిస్తాయని తెలిపాడు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement