SCREENS
-
మరో 100 స్క్రీన్లు వస్తున్నాయ్..
న్యూఢిల్లీ: సినిమా ప్రదర్శన వ్యాపారంలో ఉన్న పీవీఆర్ ఐనాక్స్ వచ్చే ఏడాది కొత్తగా సుమారు 100 స్క్రీన్లను జోడిస్తోంది. ఇందుకోసం రూ.200 కోట్లు పెట్టుబడి చేయనున్నట్టు కంపెనీ ఈడీ సంజీవ్ కుమార్ బిజ్లి వెల్లడించారు. రాబోయే కాలంలో ఏటా 100 స్క్రీన్లను ప్రారంభిస్తామని తెలిపారు.‘ఈ సంవత్సరం ఇప్పటివరకు 70 దాకా స్క్రీన్లను తెరిచాము. 45–50 తెరలను మూసివేశాం. 2024లో మరో 40 జతచేస్తాం. అలాగే మరో 10–15 మూసివేస్తాం. మొత్తంగా ఈ ఏడాది దాదాపు 75 మూసివేసి, 120 స్క్రీన్లను జోడించాలనే ఆలోచన ఉంది. అసెట్ లైట్ మోడల్‌ను అనుసరిస్తాం. పెట్టుబడికి పెద్ద సహకారం డెవలపర్ల నుండి వస్తోంది. డిసెంబర్ త్రైమాసికం ఇప్పుడు మెరుగైన స్థానంలో ఉన్నట్లు కనిపిస్తోంది. అక్టోబర్ కాస్త నిస్తేజంగా ఉంది. కానీ నవంబర్ ఇప్పటికే జోరు మీద ఉంది. కొత్త సినిమాలు విడుదల కానుండడంతో క్యూ3 చాలా మెరుగ్గా కనిపిస్తోంది.ఆర్థిక సంవత్సరం రెండవ అర్ధ భాగం చాలా మెరుగ్గా ఉంది. ఏప్రిల్–సెప్టెంబర్ కాస్త స్తబ్దుగా ఉంది. ఎందుకంటే చాలా సినిమాల రిలీజ్లు అక్టోబర్–మార్చికి వాయిదా పడ్డాయి. కంపెనీ క్యూ3, క్యూ4లో విడుదలయ్యే కొత్త సినిమాలతో జోరుమీద ఉంది’ అని సంజీవ్ కుమార్ వివరించారు. మూవీ జాకీ పేరుతో ఆర్టిఫీషియల్ ఆధారిత వాట్సాప్ చాట్‌బాట్‌ను కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం పీవీఆర్ ఐనాక్స్ దేశవ్యాప్తంగా 111 నగరాల్లోని 355 ప్రాపర్టీలలో 1,744 తెరలను కలిగి ఉంది. -
'ఏఐ-టెక్నాలజీ'తో కూడిన.. స్నాప్‌చాట్ లెన్స్ స్టూడియో!
ఆగ్యుమెంటెడ్ రియాలిటీ(ఏఆర్) ఫీల్డ్‌లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ ‘స్నాప్‌చాట్’ లేటెస్ట్ జెనరేటివ్ ఏఐ టెక్నాలజీని లాంచ్ చేసింది. ఇప్పుడు ఏఐ డెవలపర్లు ఏఐ–పవర్డ్ లెన్సెస్ను క్రియేట్ చేయవచ్చు. స్నాప్‌చాట్ యూజర్లు వాటిని తమ కంటెంట్‌లో ఉపయోగించవచ్చు.డెవలపర్ప్రోగ్రామ్ ‘లెన్స్ స్టూడియో’కు సంబంధించిన అప్‌గ్రేడెడ్ వెర్షన్ గురించి ప్రకటించింది స్నాప్‌చాట్. దీనితో ఆర్టిస్ట్‌లు, డెవలపర్లు స్నాప్‌చాట్, వెబ్సైట్, యాప్స్ కోసం ఏఆర్ ఫీచర్లను క్రియేట్ చేయవచ్చు. ఏఆర్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేయడానికి పట్టే సమయాన్ని వారాల నుంచి గంటలకు తగ్గిస్తుంది లెన్స్ స్టూడియో.ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో ప్లస్..డిస్ప్లే: 6.78 అంగుళాలురిఫ్రెష్రేట్: 120 హెచ్జడ్రిజల్యూషన్: 1080*2436 పిక్సెల్స్కనెక్టివిటీ: 5జీమెమోరీ: 256జీబి 12జీబి ర్యామ్ఫ్రంట్ కెమెరా: 32 ఎంపీబ్యాటరీ: 4600 ఎంఏహెచ్బరువు: 190 గ్రా.స్క్రీన్ ఎక్స్పాండర్ అండ్ మాగ్నిఫైయర్..బ్రాండ్: పోట్రానిక్స్మోడల్: పీవోఈఆర్–1899ప్రాడక్ట్ డైమెన్షన్స్: 10*3*3 సీఎం 50గ్రా.కంపెటబుల్ డివైజెస్: మానిటర్, ట్యాబ్, స్మార్ట్ఫోన్ఆల్–ఇన్–వన్ స్క్రీన్ క్లీనర్..బ్రాండ్: సౌన్స్కలర్: బ్లాక్మోడల్ నెంబర్: ఎస్సీఎంజీబీకె–బీకె5బరువు: 200 గ్రాస్పెషల్ ఫీచర్స్: పోర్టబుల్, నాన్–స్లిప్, స్ట్రెచబుల్, ఫోల్డబుల్లెన్స్ మెటీరియల్: గ్లాస్ఇవి చదవండి: ‘మై గ్లామ్’లో మోడళ్లు.. -
ఫైనల్‌కు 13 భారీ స్క్రీన్స్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: భారత్ – ఆస్ట్రేలియా మధ్య ఆదివారం జరిగే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌ను ప్రజలు ఒకే చోట వీక్షించేలా రాష్ట్రంలో 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) కార్యదర్శి ఎస్.గోపీనాథ్‌రెడ్డి తెలిపారు. 2 లక్షల మంది మ్యాచ్ చూసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఇక్కడ ప్రవేశం పూర్తిగా ఉచితమని చెప్పారు. ఇందుకయ్యే ఖర్చు మొత్తం అసోసియేషన్ భరిస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సహకారంతో ఏసీఏ అనేక విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్), స్టేడియాల్లో సదుపాయాలు, క్రీడాకారులకు పౌష్టికాహారం, విశాఖలో నూతన స్టేడియం నిర్మాణం, స్కూల్ విద్యార్థులకు లీగ్ టోర్నమెంట్స్.. ఇలా ఏసీఏ ప్రణాళికలను ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు. దేశంలోనే తొలిసారిగా దేశంలోనే తొలిసారిగా సెమీ ఫైనల్ మ్యాచ్ కోసం విశాఖ, కడప, విజయవాడలో ఏర్పాటు చేసిన బిగ్ స్క్రీన్లకు మంచి స్పందన వచ్చింది. ఈ ఉత్సాహంతో ఫైనల్ మ్యాచ్ కోసం ఉమ్మడి జిల్లాల కేంద్రాల్లో భారీ స్క్రీన్లు ఏర్పాటుకు నిర్ణయించాం. ఈ నిర్ణయాన్ని సీఎం వైఎస్ జగన్ అభినందించారు. ఇందుకు ధన్యవాదాలు. ప్రతి చోటా కనీసం 10 వేల మంది కూర్చొనేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఆర్జే, డీజే, ప్రత్యేక లైటింగ్, అధునాతన సౌండ్ సిస్టమ్స్, ఫుడ్ కోర్టులూ ఏర్పాటు చేస్తున్నాం. విశాఖలో రూ. 300 కోట్లతో కొత్త స్టేడియం విశాఖలో బీసీసీఐతో కలిసి రూ.300 కోట్లతో నూతన స్టేడియం నిర్మాణం విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లాం. ఆయన వెంటనే స్థలాన్ని కేటాయించాలని ఆదేశాలు జారీ చేశారు. తక్కువ సమయంలోనే రూ.100 కోట్లు విలువ చేసే స్థలాన్ని కేటాయిస్తున్నారు. అన్నీ అనుకూలిస్తే నెల రోజుల్లోనే స్టేడియంకు శంకుస్థాపన చేస్తాం. ఈ స్టేడియం సామర్థ్యం 50 వేల పైనే ఉంటుంది. రాష్ట్రంలో క్రికెట్ మౌలిక సదుపాయాలు, ఆటగాళ్ల సంక్షేమం, శిక్షణపై ఏసీఏ ప్రత్యేక దృష్టి సారించింది. నెల్లూరులో, పశ్చిమ గోదావరిలో స్టేడియంల నిర్మాణం జరుగుతోంది. పులివెందుల స్టేడియం పనులు తుది దశలో ఉన్నాయి. అన్నింట్లోనూ మెషినరీ, నెట్లు, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నాం. కోచ్‌లను శిక్షణ కోసం ఎన్సీఏకు పంపిస్తున్నాం. ఏపీఎల్‌ను విజయవంతంగా నిర్వహించడంతో ఏసీఏకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. సీఎం వైఎస్ జగన్ సహకారంతోనే రెండు సీజన్లు విశాఖలో నిర్వహించాం. పదేళ్లుగా ప్రీమియర్ లీగ్స్ నిర్వహిస్తున్న తమిళనాడు, కర్ణాటక కంటే ఆంధ్రాకే మంచి ర్యాంకింగ్ వచ్చింది. త్వరలో స్కూల్ లీగ్స్ ఏసీఏ అధ్యక్షుడు శరత్‌చంద్రారెడ్డి నాయకత్వంలో ఆంధ్రా క్రికెట్లో మార్పులకు ప్రణాళికలు సిద్ధం చేశాం. వీటిలో ముఖ్యమైనది పాఠశాలల స్థాయిలో లీగ్స్. 12 నుంచి 16 ఏళ్లలోపు వారికి ప్రతి నియోజకవర్గం పరిధిలో టోర్నమెంట్స్ నిర్వహిస్తాం. వీటిలో ప్రతిభ చూపిన వారిని సబ్‌సెంటర్లకు, అక్కడి నుంచి జిల్లా, రాష్ట్రస్థాయికి.. ఇలా ఉన్నత స్థాయికి వెళ్లేలా శిక్షణ ఇస్తాం. ఆటగాళ్ల ఫిట్నెస్ పెంచేందుకు జోనల్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి క్రికెటర్‌కు నెలకు రూ.3 వేలు పౌష్టికాహారం కోసం అందజేస్తున్నాం. ఇందుకు సుమారు రూ.కోటి వరకు ఖర్చవుతోంది. దేశంలో మరే అసోసియేషన్ ఇవ్వని విధంగా రిటైర్డ్ రంజీ ఆటగాళ్లకు నెలకు రూ.10 వేలు చొప్పున ఎక్స్‌గ్రేషియా అందిస్తున్నాం. ప్రతిభ ఉన్న ఆటగాళ్లను శిక్షణ కోసం విదేశాలకు పంపాలని ఏసీఏ నిర్ణయించింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకస్తుందని ప్రకటించింది. దీనిపై ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లో శిక్షణ ఇచ్చే వారితో సంప్రదింపులు కూడా జరిగాయి. సీజన్ పూర్తయిన వెంటనే ఆటగాళ్లను పంపిస్తాం. -
ఉద్యోగుల కోసం 7 స్క్రీన్లు బుక్ చేసిన సీఈఓ - తలైవా సినిమా అంటే అట్లుంటది!
మన దేశంలో తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్‌కి ఉన్న ఫ్యాన్స్ పాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తమిళనాడులో ఇది మరింత ఎక్కువగా ఉందన్న విషయం అందరికి తెలిసిందే. కాగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జైలర్ సినిమా ఈ రోజు విడుదలైంది. దీనికోసం తమిళనాట ఒక కంపెనీ సీఈఓ తమ ఎంప్లాయిస్ కోసం 7 స్క్రీన్స్ బుక్ చేసాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, ఫ్రెష్‌వర్క్స్ కంపెనీ ఫౌండర్ అండ్ సీఈఓ గిరీష్ మాతృభూతం తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగుల కోసం జైలర్ స్పెషల్ షోలు వేయిస్తున్నట్లు సమాచారం. దీని కోసం ఏకంగా ఏడు స్క్రీన్స్ బుక్ చేసుకున్నాడు. తమ 2200 మంచి ఉద్యోగుల కోసం ఇవి బుక్ చేసినట్లు తానే స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించాడు. ఇదీ చదవండి: 60 ఏళ్లనాటి పాత బుక్ కోటీశ్వరున్ని చేసింది - ఎలానో తెలిస్తే ఆశ్చర్యపోతారు! ఫ్రెష్‌వర్క్స్ కంపెనీ చెన్నై, హైదరాబాద్, బెంగళూరు కేంద్రాలుగా పనిచేస్తోంది. ఈ సంస్థ సీఈఓ రజినీకాంత్ వీరాభిమాని.. కావున జైలర్ సినిమా రిలీజ్ రోజునే ఉద్యోగులకు సినిమా చూపించాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. కబాలి మూవీ విడుదల సమయంలో కూడా చెన్నైలో ఒక థియేటర్ బుక్ చేసాడు. అంతకు ముందు కొచ్చాడియన్, లింగా, ఎంతిరన్ సినిమాలకు కూడా ఇలాగే చేశారు. గిరీష్ చేస్తున్న పనికి తమళనాడులో అతని పేరు మారుమ్రోగిపోతోంది. రజిని అభిమానులు ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు. 2200 tickets 7 screens Freshworks employees only #thalaivaralaparai #TigerkaHukum #ThalaivarNirandharam #freshworksda pic.twitter.com/shjOumBeaY — Girish Mathrubootham (@mrgirish) August 9, 2023 -
డ్యూయల్ డిస్ప్లేతో బెల్ ప్లస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔట్‌డోర్ డిజిటల్ ప్రకటనల రంగంలో డ్యూయల్ డిస్ప్లేతో బెల్ ప్లస్ మీడియా సంచలనం సృష్టిస్తోంది. కంపెనీ ఏర్పాటైన రెండేళ్లలోనే అన్ని మెట్రో నగరాల్లో 3,200 పైచిలుకు స్క్రీన్లతో విస్తరించింది. యాపిల్, ఆడి, మలబార్ వంటి దిగ్గజ బ్రాండ్ల ప్రకటనలను డిజిటల్ తెరలపై టీ–హబ్, డీఎల్ఎఫ్, లోధా, హైహోమ్, అరబిందో, ఇనార్బిట్ తదితర వందలాది గృహ సముదాయాలు, కమర్షియల్ ప్రాజెక్టులు, మాల్స్‌లో ప్రదర్శిస్తోంది. భారత్‌లో ఔట్‌డోర్ డిజిటల్ ప్రకటనల రంగంలో వేగంగా వృద్ధి చెందుతున్న కంపెనీగా నిలిచామని బెల్ ప్లస్ మీడియా కో–ఫౌండర్లు గాయత్రి రెడ్డి చప్పిడి, దేవ్ అభిలాష్ రెడ్డి కొత్తపు తెలిపారు. ఏడాదిలో 20,000 స్క్రీన్లు, 20 నగరాలకు చేరుకోవాలన్నది లక్ష్యమన్నారు. తొలిసారిగా..: రెండు డిస్ప్లేలతో దేశంలో తొలిసారిగా స్క్రీన్లను ఏర్పాటు చేశామని గాయత్రి వివరించారు. ‘అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌తో వినూత్న అనుభూతి, అతి తక్కువ ఖర్చు, సౌకర్యంతోపాటు ప్రకటనలను కస్టమైజ్ చేసుకునే వీలుండడం వల్లే సక్సెస్ అయ్యాం. స్క్రీన్కు ఉండే సెన్సార్‌తో ఎంత మంది వీక్షించారో తెలుసుకోవచ్చు. పైన ఉండే డిస్ప్లేలో బ్రాండ్ల ప్రకటనలు, కింది డిస్ప్లేలో సంబంధిత సొసైటీ నోటీసులు, అసోసియేషన్ సందేశాలు, కార్యక్రమాలు ప్రదర్శిస్తాం. సొసైటీలకు సేవలు ఉచితం. పైగా వారికి అద్దె చెల్లిస్తాం. క్లయింట్‌కు బెల్ ప్లస్ అప్లికేషన్ ఇస్తాం. ప్రకటనల కంటెంట్‌ను వారే ఎంచుకోవచ్చు’ అని తెలిపారు. -
పీవీఆర్ కొత్త స్క్రీన్ల ఏర్పాటు
ముంబై: ఈ ఆర్థిక సంవత్సరం(2022–23)లో కొత్తగా 100 స్క్రీన్లు(తెరలు) ఏర్పాటు చేయనున్నట్లు మల్టీప్లెక్స్ దిగ్గజం పీవీఆర్ లిమిటెడ్ తాజాగా పేర్కొంది. ఇందుకు రూ. 350 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించింది. మల్టీప్లెక్స్ రంగంలోని మరో కంపెనీ ఐనాక్స్ లీజర్తో విలీనం 2023 ఫిబ్రవరికల్లా పూర్తికావచ్చని అంచనా వేస్తోంది. దీంతో పీవీఆర్ ఐనాక్స్‌గా సంయుక్త బిజినెస్‌ను నిర్వహించనున్నట్లు పీవీఆర్ సీఈవో గౌతమ్ దత్తా పేర్కొన్నారు. వీక్షకులు తిరిగి సినిమా థియేటర్లకు వచ్చేందుకు ఉత్సాహాన్ని చూపుతున్నట్లు వెల్లడించారు. దీంతో ఆహారం, పానీయాల విభాగం అమ్మకాలు సైతం పుంజుకున్నట్లు ఏప్రిల్–జూన్(క్యూ1) ఫలితాలపై స్పందిస్తూ వివరించారు. వెరసి తెరల విస్తరణకు ప్రణాళికలు వేస్తున్నట్లు తెలియజేశారు. ఈ ఏడాది బాటలోనే వచ్చే రెండు, మూడేళ్లలో కూడా విస్తరణను కొనసాగించే వీలున్నట్లు తెలియజేశారు. 60 శాతం తెరలను నగరాలలో ఏర్పాటు చేయనుండగా.. మిగిలిన వాటిని కొత్త ప్రాంతాలలో నెలకొల్పనున్నట్లు వివరించారు. రూర్కెలా, డెహ్రాడూన్, వాపి, చెన్నై, కోయంబత్తూర్, తిరువనంతపురం, అహ్మదాబాద్‌లో విస్తరణను చేపట్టనున్నట్లు వెల్లడించారు. నిధులను నగదు నిల్వలు, అంతర్గత వనరులు, రుణాల ద్వారా సమకూర్చుకోనున్నట్లు తెలియజేశారు. -
రామ్ గోపాల్ వర్మ 'లడ్కీ'కి హిట్ టాక్.. మరిన్ని థియేటర్లలో..
Ram Gopal Varma Ladki Movie: పూజా భాలేకర్ ప్రధాన పాత్రలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఇండియాస్ ఫస్ట్ మార్షల్ ఆర్ట్స్ ఫిలిం ‘లడ్కీ’ (తెలుగులో ‘అమ్మాయి‘). ఈ చిత్రం టి అంజయ్య, శ్రేష్ఠ పటేల్ మూవీస్ సమర్పణలో ఇండో, చైనీస్ కో ప్రొడక్షన్స్, పారిజాత క్రియేషన్స్, ఆర్ట్సీ మీడియా పతాకాలపై రూపొందింది. ఈ నెల 15న ప్రపంచ వ్యాప్తంగా 47,000 స్క్రీన్ లలో విడుదలైంది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడం, సక్సెస్ అవ్వడంతో మరిన్ని స్క్రీన్స్ పెంచుతున్నారు. ఇక సినిమా విజయవంతంగా ప్రదర్శితం కావడంతో చిత్రయూనిట్ మీడియాతో ముచ్చటించింది. రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. ‘రామసత్యనారాయణకు ఈ సినిమాతో ఏ సంబంధం లేకపోయినా కూడా మాకు ఎంతో సహాయం చేశారు. ఆయన మా శ్రేయోభిలాషిగా ఈ సినిమా కోసం ఎంతో పని చేశారు. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఎన్నోసార్లు చెప్పాను. ఎంటర్ ది డ్రాగన్ సినిమా చూసినప్పటి నుంచి అలాంటిది ఒకటి చేయాలని అనుకున్నాను. పూజా భాలేకర్ లాంటి మార్షల్ ఆర్ట్స్ తెలిసిన అమ్మాయి దేశంలోనే లేరు. కొత్త జానర్లో సినిమాను ప్రయత్నించాం. కొత్తదనంతో సినిమాలు తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని మళ్లీ ‘అమ్మాయి’ సినిమాతో నిరూపించారు. నాకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రాపర్ సక్సెస్ మీట్‌ను త్వరలోనే ఏర్పాటు చేస్తాం’ అని తెలుపారు. రామసత్యనారాయణ మాట్లాడుతూ.. ‘అమ్మాయి లాంటి మంచి చిత్రాన్ని నిర్మించినందుకు ఆర్జీవీ గారికి, వెనుకుండి సపోర్ట్ ఇచ్చిన మా అంజన్న గారిని అభినందిస్తున్నాను. మా అంజన్న ఐదు సినిమాలు తీశారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశాం. ఇక రేపటి నుంచి ఏపీలో మరో వంద థియేటర్లు పెంచుతున్నారని చెప్పడం కోసం మీడియా ముందుకు వచ్చాం. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం ఆర్జీవీ. చైనాలో 40 శాతం అడ్వాన్స్ బుకింగ్ జరిగింది. మొదటి రోజే రూ. 150 కోట్లు కలెక్ట్ చేసింది జర్నలిస్ట్ మిత్రుడు చెప్పారు. అన్ని చోట్లా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. పూజా బాగా నటించింది. ఇప్పటికే ఆమెకు ఆఫర్లు వస్తున్నాయి. ఇంత మంచి హిట్ ఇచ్చినందుకు ఆర్జీవీ గారు, అంజన్న గారికి థ్యాంక్స్’ అని అన్నారు. నిర్మాత టి. అంజయ్య మాట్లాడుతూ.. ‘ఆర్జీవీ గారికి థ్యాంక్స్. ఆయనతో నాది ఐదేళ్ల ప్రయాణం. ఈ చిత్రం ఆయనకు మానసిక పుత్రిక. సినిమాను చూస్తూ అందరూ చొక్కాలు చించుకుంటున్నారు. శివ తర్వాత ఈ సినిమానే అంత పెద్ద హిట్ అయింది. ఈ సినిమాకు సీక్వెల్ తీయమని అంటున్నారు. ఆ చిత్రాన్ని కూడా నేనే నిర్మిస్తాను. ఎంతో పెద్ద సక్సెస్ వచ్చినా, ఫ్లాప్ వచ్చినా కూడా ఆర్జీవీ ముందుకు వెళ్తూనే ఉంటారు. ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు ఆయనకు థ్యాంక్స్’ అని పేర్కొన్నారు. -
కూర్చోనివ్వని సినిమా
మనుషులతో వాస్తవం నిత్యం దోబూచులాడుతూ ఉంటుంది. కళ్లకు కట్టిన గంతలు తెరిస్తే ఏం చూడాల్సి వస్తుందోనని భయం. చేదు నిజంలో కంటె, తియ్యని అబద్ధంలో జీవించడమే మనిషికి ఆనందం. అయితే ఒక చేదు నిజాన్ని విని గుండె ఆగినంత పనైంది ఆ తల్లికి! అయినప్పటికీ కుమారుడిని అర్థం చేసుకుంది. భర్తతో పోరాడింది. కొడుకుకు, భర్తకు మధ్య నలిగిపోయింది. ఈ థీమ్‌తో ఒక సంచలనాత్మక చిత్రాన్ని తెరకెక్కించారు క్వీర్ సినిమాలు (హోమో సెక్సువల్) తీయడంతో సిద్ధహస్తుడైన శ్రీధర్ రంగాయన్. ఆ చిత్రం పేరు ‘ఈవెనింగ్ షాడోస్’. జనవరి 10న మెట్రో నగరాల్లోని పరిమిత థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. అబ్బాయి ఊరి నుంచి రాగానే వివాహం చేయాలని సంకల్పించారు తల్లిదండ్రులు. పెళ్లిచూపులు ఏర్పాటు చేశారు. అబ్బాయికి విషయం చెప్పారు. అయితే ఆ అబ్బాయి.. ‘‘అమ్మా! ఎందుకో నాకు అమ్మాయిల మీద మనసు పోవట్లేదు’ అన్నాడు. తల్లి షాకయ్యింది. ఏం సమాధానం చెప్పాలో ఆమెకు అర్థం కాలేదు. ‘ఈవెనింగ్ షాడోస్’ చిత్రంలోని సీన్ ఇది. ముంబైకి చెందిన ఒక యువకుడు కర్ణాటకలోని తన స్వగ్రామానికి చేరుకుంటాడు. ఇంట్లో పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తారు. అమ్మాయిని చూడటానికి తనకు మనస్కరించడం లేదని, తాను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నానని, తాను ‘గే’ అని తల్లికి చెప్పుకుంటాడు. ఆవిడకు ఏం చేయాలో అర్థం కాదు. ఆ యువకుడి పేరు కార్తిక్ (దేవాంశ్ దోషి). మోనా అంబేగాన్కర్ కార్తిక్ తల్లిగా నటించారు. అనంత్ మహదేవన్, అర్పిత్ చౌదరీ, యామినీ సింగ్, అభయ్ కులకర్ణి, వీణా నాయర్, దిశా ఠాకూర్ ఇందులో నటించారు. 2018, జనవరి 11న ఈ చిత్రాన్ని ఆస్ట్రేలియాలో ప్రదర్శించి, అవార్డులు అందుకున్నారు. చాలామంది గేలను కలిసి, వారి జీవితాల గురించి స్వయంగా తెలుసుకున్న అనుభవంతో ఈ చిత్రం తీశారు రంగయాన్. బెంగళూరు ఫిలిమ్ ఫెస్టివల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించినప్పుడు, చాలామంది ప్రేక్షకులు ఎంతో ఇబ్బందిపడడం గమనించారు రంగాయన్. ముఖ్యంగా మగవారు ఇబ్బంది పడటం ఆయనకు కనిపించింది. కొందరు హాలులో నుంచి బయటకు వెళ్లిపోయారు. ప్రేక్షకుల స్పందనను నేరుగా చూడటం వలన చిత్రం గురించి ప్రేక్షకుల అభిప్రాయాలను స్వయంగా తెలుసుకున్నారు రంగాయన్. ఈ కథను రంగాయన్ 2009లో రాయడం ప్రారంభించారు. సినిమా తీయడానికి తగినంత డబ్బు దొరకడంలో ఆలస్యం జరగడంతో, ఏడు సంవత్సరాల తరవాత ఈ చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నం ప్రారంభించారు. బాలారిష్టాలు దాటుకుని 2016లో చిత్ర నిర్మాణం ఊపందుకుంది. తియ్యడం వరకు బాగానే ఉంది కానీ, విడుదల చేయడం ఇబ్బందికరంగా మారింది. ట్రెడిషనల్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ముందుకు రాలేదు. అందువల్ల ఈ చిత్రాన్ని ఇప్పుడు చాలా ప్రత్యేకంగా విడుదల చేయాలని ఆయన భావిస్తున్నారు. 200 థియేటర్లలో శుక్రవారం నాడు విడుదల చేసే పద్ధతి నుంచి బయటకు రావాలనుకుంటున్నారు. అన్ని థియేటర్లలో విడుదల చేస్తే ఎవ్వరూ వెళ్లి చూడరు. తక్కువ స్క్రీన్లు ఉన్నచోట విడుదల చేసి, ఈ సినిమాకి ఎటువంటి ఆదరణ వస్తుందో చూడాలనుకుంటున్నారు రంగాయన్. – జయంతి -
సెన్సార్ తెరలతో యాక్సిడెంట్లకు చెక్
సాక్షి, టెక్నాలజీ : ట్రాఫిక్ కూడళ్లలో సిగ్నల్ లైట్లు పడినా వాహనదారులు ఒక్కోసారి దూసుకుపోవటం.. లేదా వాహనాల మధ్య నుంచే రోడ్డును దాటాలని పాదాచారులు చేసే ప్రయత్నం ప్రమాదాలకు దారి తీయటం చూస్తున్నాం. అయితే సాంకేతికతకు మరింత ఆధునీకరణ తోడైతే అలాంటి ఘటనలను నివారించొచ్చని శాస్త్రవేత్తలు నిరూపిస్తున్నారు. సెన్సార్ స్క్రీన్ల ద్వారా యాక్సిడెంట్లకు చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు. దీని ప్రకారం సిగ్నల్ వద్ద ముందుగా ఇరు పక్కల పెద్ద తెరలు కనిపిస్తాయి. వాటి మీద టైమ్ పడుతుంది. ఈ సమయంలో వాహనాలు ఫ్రీగా వెల్లిపోతుంటాయి. వాటిని దాటి ఎవరైనా రోడ్డు దాటాలని ప్రయత్నిస్తే వెంటనే అలారం మోగి ట్రాఫిక్‌ను పర్యవేక్షించేవారికి సందేశం వెళ్తుంది. మరోవైపు వాహనాలు వెళ్తున్న దిశలో కూడా ఈ స్క్రీన్లు దర్శనమిచ్చినప్పుడు వాహనాలు ఎక్కడిక్కడే ఆగిపోతాయి. అప్పుడు పాదాచారులు నిరభ్యరంతంగా రోడ్డును దాటేయొచ్చు. ఉత్తర ఉక్రెయిన్‌లోని చెర్నిహివ్ నగరంలో ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టు ప్రారంభించగా.. అది సత్ఫలితాన్ని ఇస్తోంది. త్వరలో దీనిని వివిధ దేశాలకు విస్తరించాలని ప్రాజెక్టును చేపట్టిన యూ-కోరీచన్ సంస్థ ఆలోచన చేస్తోంది. -
సెన్సార్ తెరలతో యాక్సిడెంట్లకు చెక్
-
సిగ్గు చేటు: తేజస్ రైల్లో ప్రయాణీకుల చేతివాటం
భారతదేశపు తొలి లగ్జరీ రైలు తేజస్. సోమవారం ముంబై-గోవాల మధ్య ఈ రైలును అట్టహాసంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు ప్రారంభించారు. ఎన్నో అత్యధునిక సౌకర్యాలున్న ఈ రైల్లో ప్రయాణీకులు వీక్షించేందుకు ప్రతి సీటు వెనుక భాగంలో ఎల్సీడీ స్క్రీన్లు, హెడ్ ఫోన్లను అమర్చారు. అయితే, సర్వీసును ప్రారంభించిన మూడు రోజుల్లోనే ప్రయాణీకులు చేతివాటం చూపించారు. మొత్తం రైలులో 20 బోగీలు ఉన్నాయి. వీటిలో కొన్ని బోగీల్లో ఎల్సీడీ స్క్రీన్లు పగలిపోయాయి. మరికొన్ని బోగీల్లో అందుబాటులో ఉంచిన హెడ్ ఫోన్లు మాయమయ్యాయి. ఈ మేరకు ఓ జాతీయ మీడియా సంస్ధ కథనాన్ని ప్రచురించింది. రైలు ప్రవేశపెట్టిన మూడు రోజుల్లోనే ఇలాంటి ఘటన జరగడంతో విస్తుపోవడం రైల్వే అధికారుల వంతైంది. ఎన్నో వ్యయ ప్రయాసలు పడి ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన తొలి లగ్జరీ రైలు తేజస్. అలాంటిది ప్రయాణీకులే సామాజిక స్పృహ లేకుండా ప్రవర్తించడం సిగ్గు చేటు. -
కంటికి శ్రమ తగ్గించే 'స్క్రీనర్లు'
న్యూయార్క్ః ఆధునిక జీవితంలో ప్రతి విషయం ఫింగర్ టిప్స్ పై ఉండాలంటే స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్ ల్యాప్ లపై ఆధారపడటం తప్పడం లేదు. కొందరు ఆధునిక టెక్నాలజీకి, సామాజిక మాధ్యమాలకు బానిసలు కూడ అయిపోతున్నారు. ఈ నేపథ్యంలో అతిగా స్క్రీన్ చూడటం వల్ల అనేక అనర్థాలు కలుగుతున్నాయి. స్క్రీన్ నుంచి వెలువడే కాంతికి కంటి సమస్యలూ అధికమౌతున్నాయి. ఇందుకు పరిష్కారం దిశగా ఆలోచించిన పరిశోధకులు కంటికి రక్షణ కల్పించే పారదర్శక అద్దాలను అందుబాటులోకి తెచ్చారు. స్క్రీన్ చూసేప్పుడు వాటిని వినియోగించడంవల్ల కాంతిని నిరోధించి కంటికి శ్రమ తగ్గిస్తాయని చెప్తున్నారు. స్క్రీనర్ల పేరిట కాంతిని నిరోధించే ప్రయోగాత్మక పారదర్శక అద్దాలు అందుబాటులోకి వచ్చాయి. కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ ట్యాప్ లు అధికంగా వాడేవారు తీవ్రమైన కంటి సమస్యలతో బాధపడుతుండటాన్ని దృష్టిలో పెట్టుకున్న 28 ఏళ్ళ ఛినో కిమ్ ఆ దిశగా ఆలోచించాడు. ఆధునిక అద్దాలను ధరించడంవల్ల అత్యధిక సమయం స్క్రీన్లు చూసేవారికి ఎంతో ఉపయోగంగా ఉంటుందని చెప్తున్నాడు. టెక్ సంస్కృతి వైరస్ లా వ్యాపిస్తున్న నేటి తరుణంలో కంటిని కాపాడేందుకు తన నూతన సృష్టి ఎంతగానో సహకరిస్తుందని ఇటీవల జరిగిన ఎన్ వై యు ఇంటరాక్టివ్ టెలికమ్యూనికేషన్స్ కార్యక్రమం స్ప్రింగ్ షోలో తెలిపాడు. 'స్క్రీనర్' ను తలకు ధరించి చూడ్డంద్వారా కంటి సమస్యలనుంచి బయటపడొచ్చని ఛినోకిమ్ చెప్తున్నాడు. దైనందిన జీవితంలో ఎక్కువశాతం స్క్రీన్లను చూసేవారు స్మార్ట్ ఫిల్మ్ తో తయారు చేసిన లెన్స్ కలిగిన ఈ స్క్రీనర్ ను వినియోగిస్తే ఫలితాలు ఉంటాయంటున్నాడు. 'మెషీన్ లెర్నింగ్ ఫర్ ఆర్ట్స్' చదువుతున్న సమయంలో తనకు ఈ కొత్త ఆలోచన వచ్చిందని, బేసిక్ మెషీన్ లెర్నింగ్ అండ్ కంప్యూటర్ ప్రోగ్రామ్ ద్వారా ఈ అద్దాలను రూపొందించినట్లు కిమ్ తెలిపాడు. స్క్రీనర్లు కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ నుంచి కూడ రక్షిస్తాయని తెలిపాడు. -
ఇప్పటికైనా సక్సెస్ చిక్కేనా ?
-
కొత్తగా వంద స్క్రీన్లు : పీవీఆర్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వందకు పైగా కొత్త స్క్రీన్లను ఏర్పాటు చేయనున్నామని మల్టీప్లెక్స్ చెయిన్ ఆపరేటర్, పీవీఆర్ శుక్రవారం తెలిపింది. ఇందుకోసం రూ.150 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నామని పీవీఆర్ ఎండీ, అజయ్ బిజిలి చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న వంద స్క్రీన్లలలో సగం మెట్రో నగరాల్లో ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రస్తుతమున్న 400 స్క్రీన్లకు ఇవి అదనమని పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన సీఐఐ బిగ్ పిక్చర్ సమిట్‌లో ఆయన మాట్లాడారు. ప్రతీ ఏడాది వంద స్క్రీన్లు ఏర్పాటు చేయాలనుకుంటున్నామని, మొత్తం స్క్రీన్ల సంఖ్యను వెయ్యికి పెంచడం లక్ష్యమని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే మన దేశంలో సినిమా హాళ్ల కొరత తీవ్రంగా ఉందని చెప్పారు. భారత్‌లో వినోదపు పన్ను అధికంగా ఉందని, ఈ పన్నును తగ్గించాల్సిన అవసరముందని పేర్కొన్నారు.