మన దేశంలో తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్‌కి ఉన్న ఫ్యాన్స్ పాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తమిళనాడులో ఇది మరింత ఎక్కువగా ఉందన్న విషయం అందరికి తెలిసిందే. కాగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జైలర్ సినిమా ఈ రోజు విడుదలైంది. దీనికోసం తమిళనాట ఒక కంపెనీ సీఈఓ తమ ఎంప్లాయిస్ కోసం 7 స్క్రీన్స్ బుక్ చేసాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం, ఫ్రెష్‌వర్క్స్ కంపెనీ ఫౌండర్ అండ్ సీఈఓ గిరీష్ మాతృభూతం తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగుల కోసం జైలర్ స్పెషల్ షోలు వేయిస్తున్నట్లు సమాచారం. దీని కోసం ఏకంగా ఏడు స్క్రీన్స్ బుక్ చేసుకున్నాడు. తమ 2200 మంచి ఉద్యోగుల కోసం ఇవి బుక్ చేసినట్లు తానే స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించాడు.
ఇదీ చదవండి: 60 ఏళ్లనాటి పాత బుక్ కోటీశ్వరున్ని చేసింది - ఎలానో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ఫ్రెష్‌వర్క్స్ కంపెనీ చెన్నై, హైదరాబాద్, బెంగళూరు కేంద్రాలుగా పనిచేస్తోంది. ఈ సంస్థ సీఈఓ రజినీకాంత్ వీరాభిమాని.. కావున జైలర్ సినిమా రిలీజ్ రోజునే ఉద్యోగులకు సినిమా చూపించాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. కబాలి మూవీ విడుదల సమయంలో కూడా చెన్నైలో ఒక థియేటర్ బుక్ చేసాడు. అంతకు ముందు కొచ్చాడియన్, లింగా, ఎంతిరన్ సినిమాలకు కూడా ఇలాగే చేశారు. గిరీష్ చేస్తున్న పనికి తమళనాడులో అతని పేరు మారుమ్రోగిపోతోంది. రజిని అభిమానులు ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు.
2200 tickets 7 screens Freshworks employees only #thalaivaralaparai #TigerkaHukum #ThalaivarNirandharam #freshworksda pic.twitter.com/shjOumBeaY
— Girish Mathrubootham (@mrgirish) August 9, 2023
Comments
Please login to add a commentAdd a comment