Girish
-
‘నారాయణ’ యాజమాన్యం నిర్లక్ష్యానికి మా కుమారుడు బలి
తెనాలిరూరల్: నారాయణ కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు మరణించాడని తెనాలి బుర్రిపాలెం రోడ్డులోని బీసీ కాలనీకి చెందిన కర్రె విజయ్‌కుమార్ దంపతులు ఆవేదన వ్యక్తంచేశారు. తమకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదని కన్నీటిపర్యంతమయ్యారు. ఈ మేరకు ఆదివారం తెనాలిలో విజయకుమార్ దంపతులు విలేకరులతో మాట్లాడారు. ‘మాకు కుమారుడు గిరీష్ అర్వంత్(15), కుమార్తె ఉన్నారు. కుమారుడు గిరీష్‌ను హైదరాబాద్‌లోని హయత్‌నగర్ పరిధిలో గల కోహెడ నారాయణ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరంలో చేర్పించాము. ఈ నెల 12వ తేదీన కాలేజీ హాస్టల్లో చేరిన గిరీష్ తరచూ ఫోన్ చేసి తనకు అక్కడ బాగాలేదని ఇంటికి వచ్చేస్తానని చెబుతున్నాడు. మేం అర్వంత్‌కు సర్దిచెబుతూ వచ్చాం. అక్కడ ఇబ్బందులను భరించలేక అర్వంత్ ఈ నెల 19వ తేదీ అర్ధరాత్రి హాస్టల్ గోడ దూకి బయటకు రావాలని ప్రయత్నించాడని, ఈ క్రమంలో కరెంట్ షాక్ తగిలి మృతిచెందాడని కాలేజీ యాజమాన్యం తెలిపింది. వెంటనే మేం వెళ్లి మా కుమారుడి మృతదేహాన్ని తీసుకువచ్చి అంత్యక్రియలు పూర్తిచేశాం. మా కుమారుడి విషయంలో నారాయణ కాలేజీ యాజమాన్యం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. అంతమంది చదువుతున్న కాలేజీ, హాస్టల్ నుంచి మా బిడ్డ బయటకు వెళ్లే ప్రయత్నం చేస్తే యాజమాన్యం ఏం చేస్తుంది? మాకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదు.’ అని విజయకుమార్ దంపతులు కన్నీటిపర్యంతమయ్యారు. -
హాస్టల్లో ఉండలేక.. పారిపోయేందుకు ప్రయత్నం
హయత్‌నగర్ (హైదరాబాద్): కళాశాల హాస్టల్లో ఉండలేక గోడదూకి పారిపోయేందుకు ప్రయతి్నంచిన ఓ విద్యార్థి కరెంట్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ర్యాంకుల కోసం విద్యార్థులపై కార్పొరేట్ యాజమాన్యాల ఒత్తిడికి నిదర్శనంగా నిలిచిన ఈ హృదయ విదారకమైన సంఘటన గురువారం హయత్‌నగర్ పీఎస్ పరిధిలో వెలుగులోకి వచి్చంది. తెనాలికి చెందిన ఎ.విజయ్‌కుమార్ వ్యాపారం చేసుకుంటూ నగరంలోని ఈస్ట్ మారేడ్‌పల్లిలో నివాసముంటున్నారు.ఆయనకు ఓ కొడుకు, కూతురు సంతానం. కొడుకు గిరీశ్‌కుమార్ (15)ను ఇంటర్ మొదటి సంవత్సరం చదివించేందుకు పది రోజల కిందట హయత్‌నగర్ పీఎస్ పరిధిలోని కోహెడ వద్ద ఉన్న నారాయణ జూనియర్ కళాశాల హాస్టల్లో చేర్పించాడు. ఇక్కడ చదవడం ఇష్టం లేని విద్యార్థి తల్లిదండ్రులకు విషయం చెప్పాడు. దీంతో రెండ్రోజుల కిందట వచి్చన తల్లి కొడుకును బుజ్జగించి, మళ్లీ వచ్చి తీసుకెళ్తానని నచ్చజెప్పి వెళ్లింది. ఈ క్రమంలో హాస్టల్ నుంచి వెళ్లిపోవాలని భావించిన గిరీశ్‌కుమార్ బుధవారం రాత్రి కళాశాల నుంచి మెట్ల మార్గం ద్వారా బయటకు వెళ్లాడు. విద్యార్థి కనిపించక పోవడంతో నిర్వాహకులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గురువారం అర్ధరాత్రి తర్వాత కాలేజీ ప్రహరీ పక్కన గిరీశ్ మృతదేహాన్ని గురించ్తిన కాలేజీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఒంటరిగా బయటికి వచి్చన విద్యార్థి హాస్టల్ గోడ దూకి పారిపోయేందుకు ప్రహరీ గోడ ఎక్కాడని, గోడ పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ తీగలు తలకు తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు గుర్తించారు. కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే గిరీశ్ చనిపోయాడని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. -
పోలీసుల ముందే టీడీపీ దాడులు
-
సీఈవోకే షాక్ ఇచ్చిన సాఫ్ట్వేర్ కంపెనీ.. రూ.1000 కోట్లు క్యాన్సిల్!
దేశీయ సాఫ్ట్వేర్ సంస్థ ఫ్రెష్‌వర్క్స్ దాని సీఈవోకే షాక్ ఇచ్చింది. క్లౌడ్ ఆధారిత సాఫ్ట్వేర్-యాజ్-ఎ-సర్వీస్ కంపెనీగా సేవలందిస్తున్న ఫ్రెష్‌వర్క్స్ డైరెక్టర్ల బోర్డు కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో అయిన గిరీష్ మాతృబూతంకు 2022లో కేటాయించిన ఆరు మిలియన్ స్టాక్ యూనిట్ల పనితీరు అవార్డును రద్దు చేసింది. ఈ మేరకు యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఫైలింగ్‌లో కంపెనీ పేర్కొంది. కఠినమైన స్థూల ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా పనితీరు లక్ష్యాలలో చేసిన మార్పులే సీఈవో పనితీరు అవార్డును రద్దు చేయడానికి కారణంగా నాస్డాక్-లిస్టెడ్ కంపెనీ అయిన ఫ్రెష్‌వర్క్స్ పేర్కొంది. అయితే 19 మిలియన్ల డాలర్ల (రూ.157 కోట్లు) విలువతో కొత్త వార్షిక దీర్ఘకాలిక ఈక్విటీ ప్రోత్సాహక అవార్డుకు సీఈవో గిరీష్ మాతృభూతం అర్హులవుతారని కంపెనీ తెలిపింది. “సీఈవో మాతృభూతం పర్ఫామెన్స్ బేస్డ్ రిస్ట్రిక్టివ్ స్టాక్ యూనిట్స్ అవార్డును రద్దు చేసి 2024లో ఆయనకి వార్షిక దీర్ఘకాలిక ఈక్విటీ ప్రోత్సాహక అవార్డును అందించాలని నిర్ణయించడంతోపాటు దీర్ఘకాలిక ఈక్విటీ ప్రోత్సాహక కార్యక్రమాన్ని పెట్టుబడిగా పరిగణించేందుకు కంపెనీ స్టాక్‌హోల్డర్ల అభిప్రాయాలను తీసుకున్నాం" అని ఫైలింగ్‌లో కంపెనీ పేర్కొంది. 2023కి ఫ్రెష్‌వర్క్స్ మొత్తం స్టాక్ ఆధారిత పరిహారం ఖర్చు 212 మిలియన్ డాలర్లు. 2021లో కంపెనీ తన ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO)ను ప్రారంభించింది. కంపెనీ బోర్డు 6 మిలియన్ స్టాక్ యూనిట్లను ఈసీవో మాతృభూతమ్కు బహుళ-సంవత్సరాల పనితీరు-ఆధారిత పరిమిత స్టాక్ యూనిట్ అవార్డుగా మంజూరు చేసింది. సీఈవో పనితీరు అవార్డు మొత్తం విలువ 131 మిలియన్ డాలర్లు ( సుమారు రూ. 1000 కోట్లు). -
ఉద్యోగుల కోసం 7 స్క్రీన్లు బుక్ చేసిన సీఈఓ - తలైవా సినిమా అంటే అట్లుంటది!
మన దేశంలో తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్‌కి ఉన్న ఫ్యాన్స్ పాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తమిళనాడులో ఇది మరింత ఎక్కువగా ఉందన్న విషయం అందరికి తెలిసిందే. కాగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జైలర్ సినిమా ఈ రోజు విడుదలైంది. దీనికోసం తమిళనాట ఒక కంపెనీ సీఈఓ తమ ఎంప్లాయిస్ కోసం 7 స్క్రీన్స్ బుక్ చేసాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, ఫ్రెష్‌వర్క్స్ కంపెనీ ఫౌండర్ అండ్ సీఈఓ గిరీష్ మాతృభూతం తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగుల కోసం జైలర్ స్పెషల్ షోలు వేయిస్తున్నట్లు సమాచారం. దీని కోసం ఏకంగా ఏడు స్క్రీన్స్ బుక్ చేసుకున్నాడు. తమ 2200 మంచి ఉద్యోగుల కోసం ఇవి బుక్ చేసినట్లు తానే స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించాడు. ఇదీ చదవండి: 60 ఏళ్లనాటి పాత బుక్ కోటీశ్వరున్ని చేసింది - ఎలానో తెలిస్తే ఆశ్చర్యపోతారు! ఫ్రెష్‌వర్క్స్ కంపెనీ చెన్నై, హైదరాబాద్, బెంగళూరు కేంద్రాలుగా పనిచేస్తోంది. ఈ సంస్థ సీఈఓ రజినీకాంత్ వీరాభిమాని.. కావున జైలర్ సినిమా రిలీజ్ రోజునే ఉద్యోగులకు సినిమా చూపించాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. కబాలి మూవీ విడుదల సమయంలో కూడా చెన్నైలో ఒక థియేటర్ బుక్ చేసాడు. అంతకు ముందు కొచ్చాడియన్, లింగా, ఎంతిరన్ సినిమాలకు కూడా ఇలాగే చేశారు. గిరీష్ చేస్తున్న పనికి తమళనాడులో అతని పేరు మారుమ్రోగిపోతోంది. రజిని అభిమానులు ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు. 2200 tickets 7 screens Freshworks employees only #thalaivaralaparai #TigerkaHukum #ThalaivarNirandharam #freshworksda pic.twitter.com/shjOumBeaY — Girish Mathrubootham (@mrgirish) August 9, 2023 -
వాణిజ్య వాహనాలకు మంచి రోజులు
ముంబై: రెండేళ్ల పాటు తిరోగమనం తర్వాత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య వాహనాల అమ్మకాలు మరింత పుంజుకోగలవని ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్ అంచనా వేస్తోంది. వివిధ విభాగాల్లో డిమాండ్ మెరుగుపడటం ఇందుకు దోహదపడగలదని ఆశిస్తోంది. కొత్త ట్రక్కుల శ్రేణిని ఆవిష్కరించిన సందర్భంగా టాటా మోటర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిరీష్ వాఘ్ సోమవారం ఈ విషయాలు తెలిపారు. ట్రక్కుల వినియోగం, రవాణా రేట్ల పెరుగుదల, రవాణా సంస్థల విశ్వాస సూచీ మొదలైన అంశాలన్నీ సానుకూలంగా కనిపిస్తున్నాయని ఆయన చెప్పారు. అలాగే మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం మరింతగా దృష్టి పెడుతుండటం వల్ల కూడా టిప్పర్ ట్రక్‌లకు డిమాండ్ పెరుగుతోందని వాఘ్ వివరించారు. 2020, 2021 ఆర్థిక సంవత్సరాల్లో స్కూల్ బస్సుల సెగ్మెంట్ గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం తర్వాత నుంచి కొంత పుంజుకుందని, ఉద్యోగుల రవాణాకు ఉపయోగించే వాహనాల విభాగం కూడా మెరుగుపడుతోందని ఆయన చెప్పారు. ‘మొత్తం మీద చూస్తే అన్ని విభాగాలు మెరుగ్గానే కనిపిస్తున్నాయి. ఈ ఏడాది వాణిజ్య వాహనాల అమ్మకాలు బాగుంటాయని ఆశావహంగా ఉన్నాము‘ అని వాఘ్ పేర్కొన్నారు. టాటా మోటర్స్ కొత్తగా ప్రవేశపెట్టిన వాహనాల్లో తొలిసారిగా సీఎన్జీతో నడిచే మధ్య, భారీ స్థాయి కమర్షియల్ వాహనాలు (ఎంఅండ్‌హెచ్‌సీవీ), తేలికపాటి టిప్పర్లు, ట్రక్కులు మొదలైనవి ఉన్నాయి. వీటితో పాటు తమ ప్రైమా, సిగ్నా, అల్ట్రా ట్రక్కులలో అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ఏడీఏఎస్) తదితర కొత్త ఫీచర్లను కూడా కంపెనీ ఆవిష్కరించింది. -
నా పులులతోపాటే నేనూ!
తణుకు: ఓ పక్క ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు.. కళ్లెదుటే బాంబుల వర్షం.. ప్రాణాలు అరచేత పట్టుకుని గడుపుతున్న జనం.. ఈ పరిస్థితుల్లో రోజురోజుకూ అక్కడి పరిస్థితులు అధ్వానంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడకు చదువు కోసం, ఉద్యోగం కోసం వెళ్లిన భారతీయులంతా స్వదేశానికి చేరుకుంటున్నప్పటికీ.. పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన డాక్టర్ గిరిష్‌కుమార్ పాటిల్ మాత్రం స్వదేశానికి వచ్చేందుకు ససేమిరా అంటున్నారు. అందుకు కారణం.. తాను ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్న వన్యప్రాణులను వదిలి రాలేకపోవడమే. తణుకు పట్టణానికి చెందిన డాక్టర్ గిరికుమార్ 2007లో ఉక్రెయిన్‌లో మెడిసిన్ పూర్తి చేశారు. చదువు పూర్తయ్యాక సెవెరోగోనెట్కస్ నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఆర్థోపెడిక్ సర్జన్ వద్ద అసిస్టెంట్ డాక్టర్‌గా పనిచేస్తున్నారు. జంతువులంటే ఇష్టపడే గిరికుమార్ దాదాపు రెండేళ్ల క్రితం ఒక జూలో గాయపడిన జాగ్వార్ (మచ్చలు కలిగిన చిరుతపులి)ను అధికారుల అనుమతితో దత్తత తీసుకున్నారు. దీనికి తోడుగా అర్నెళ్ల క్రితం బ్లాక్ పాంథర్ (నల్ల చిరుతపులి)ను పెంచుతున్నారు. ఇటాలియన్ మెష్టిఫ్ సంతతికి చెందిన మరో మూడు కుక్కలనూ పెంచుకుంటున్నారు. ఉక్రెయిన్‌లో యుద్ధం మొదలయ్యాక ఆరు రోజుల పాటు జంతువులతోపాటు బంకర్లో దాక్కున్న ఆయన ప్రస్తుతం తన ఇంటి వద్ద బేస్మెంట్లో ఉంటున్నారు. తాను నివాసం ఉంటున్న ప్రాంతాలను రష్యా సైనికులు తమ ఆధీనంలోకి తీసుకోవడంతో ప్రస్తుతం కర్ఫ్యూ కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో బయటకు వెళ్లే అవకాశం లేకపోగా నాలుగైదు రోజులకు సరిపడా ఆహారం మాత్రం అందుబాటులో ఉన్నట్లు గిరికుమార్ ‘సాక్షి’తో చెప్పారు. ప్రముఖుల ఫోన్లకు బదులేమిచ్చారంటే.. గిరికుమార్‌తో ఇటీవల ఎంపీ విజయసాయిరెడ్డి ఫోన్లో మాట్లాడారు. పీఎం కార్యాలయం ప్రతినిధులతోపాటు మాజీ సీఎం చంద్రబాబు సైతం గిరికుమార్‌తో సంప్రదింపులు చేశారు. అయితే.. తాను పెంచుకుంటున్న జంతువులకు లైసెన్సులు ఇచ్చి.. ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ ప్రాంత సమీపంలోని గోకవరం వద్ద సఫారీ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. అలా అయితేనే తాను స్వదేశానికి రావడానికి సిద్ధంగా ఉంటానని స్పష్టం చేసి.. జంతువులపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. -
ఎలక్ట్రిక్ బస్సులు రెడీ అయ్యాయి
కేవలం కాలుష్య ఉద్గారాలను తగ్గించడమే కాకుండా వాహన యజమానులకు నిర్వహణ వ్యయం తగ్గించి అధిక లాభాలిచ్చే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంపైనే దృష్టి సారిస్తున్నట్లు టాటా మోటార్స్ ప్రకటించింది. తమ ఇంజనీర్లలో అత్యధిక శాతం దీనిపైనే కృషి చేస్తున్నట్లు టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ హెడ్ గిరీష్ వాఘ్ చెప్పారు. విజయవాడకు వచ్చిన వాఘ్ కొత్తగా ప్రవేశపెట్టనున్న ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల విషయాలతో పాటు, దేశీయ వాహనరంగ వృద్ధి, విస్తరణ వంటి పలు అంశాలను ‘సాక్షి’కి వివరించారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు ఇవీ... – సాక్షి, అమరావతి దేశీ వాణిజ్య వాహన రంగం ఎలా ఉంది? కోలుకుంటున్న సంకేతాలున్నాయా? గడచిన ఏడాదిన్నరగా ఆటోమొబైల్ పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది. పెద్ద నోట్ల రద్దు, బీఎస్4 నిబంధనలు, జీఎస్టీ అమలుతో పరిశ్రమ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంది. జీఎస్టీ తర్వాత జూలై నుంచి అమ్మకాలు బాగున్నాయి. పరిశ్రమ సగటు వృద్ధిరేటు కంటే టాటా మోటార్స్ అధిక వృద్ధిని నమోదు చేసింది. మార్కెట్ వాటా బాగా పెరిగింది. దేశంలో ఏటా 7 లక్షల వాణిజ్య వాహనాలు అమ్ముడవుతున్నాయి. ఇందులో 46 శాతం వాటా టాటా మోటార్స్‌దే. ఈ ఏడాది ఈ అమ్మకాల వృద్ధి 8–9 శాతం ఉండొచ్చు. వచ్చే రెండేళ్లలో పరిశ్రమ వృద్ధి బాగుంటుంది. అది ఏ స్థాయిలో ఉంటుందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాలి. భారత్ మాలా, సాగర్ మాలా, నదుల అనుసంధానం ప్రాజెక్టులకు తోడు బ్యాంకులకు మూలధనం సమకూర్చడం వల్ల వచ్చే 18 నుంచి 24 నెలలు వాణిజ్య వాహనాల అమ్మకాలు బాగుంటుంటాయని అంచనా వేస్తున్నాం. స్వచ్ఛ భారత్ వల్ల కూడా చిన్న స్థాయి వాహనాల అమ్మకాలు పెరుగుతున్నాయి. బస్సులు, ఆటోలు వంటి ప్యాసింజర్ వాహనాల అమ్మకాల సంగతో..? బస్సులనేవి ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థల కొనుగోళ్లపై, ఆటోల విక్రయాలు వాటికి రాష్ట్ర ప్రభుత్వాలిచ్చే పర్మిట్లపై ఆధారపడి ఉంటాయి. ప్యాసింజర్ వాహనాల విక్రయాల్లో 40% వాటా రోడ్డు రవాణా సంస్థలదే. ఈ ఏడాది ఒక్క మహారాష్ట్ర తప్ప మిగిలిన రాష్ట్రాల నుంచి కొత్త బస్సులకు ఆర్డర్లు లేవు. దీంతో ఈ రంగం నెగటివ్ వృద్ధిని నమోదు చేసింది. మొత్తంగా చూస్తే మౌలికరంగంపై పెద్ద ఎత్తున ప్రభుత్వం వ్యయం చేస్తుండటం, వినిమయశక్తి పెరగడంతో మధ్య స్థాయి, భారీ, స్మాల్ అండ్ లైట్ పికప్ వాహనాల అమ్మకాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బస్సుల వంటి వాహనాలకు వస్తే కొన్నాళ్లు వేచి చూడాలి. ఇప్పుడిప్పుడే బీఎస్4 నిబంధనలకు అలవాటు పడుతున్న పరిశ్రమ 2020 నుంచి అమల్లోకి వచ్చే బీఎస్6 నిబంధనలకు సిద్ధంగా ఉందా? కాలుష్య ఉద్గారాలను తగ్గించడమే కాకుండా వాహనాల నిర్వహణ వ్యయం తగ్గించడం ద్వారా లారీ యజమానులకు అధికాదాయం వచ్చేలా టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నాం. బీఎస్4 వాహనాల్లో ఈ విధానాన్నే అనుసరించాం. బీఎస్6 నిబంధనల్లో కూడా నిర్వహణ వ్యయం మరింత తగ్గించడంపై దృష్టి సారిస్తున్నాం. మా ఇంజనీర్లలో అత్యధికశాతం మంది బీఎస్6 టెక్నాలజీని అభివృద్ధి చేయడంపైనే దృష్టి పెట్టారు. అదే విధంగా ఏటా రూ.1,500 కోట్ల చొప్పున మూడేళ్ల పాటు ఇన్వెస్ట్ చేయనున్న మొత్తంలో కూడా అత్యధికభాగం బీఎస్6కే కేటాయిస్తున్నాం. ఈ ఏడాది విడుదల చేసిన మోడల్స్ అన్నీ బీఎస్4 నిబంధనలకు అనుగుణంగా ఉన్నవే. త్వరలోనే సిగ్నా రేంజ్లో కొత్త మోడల్స్‌ను మార్కెట్లోకి విడుదల చేయనున్నాం. ఇప్పుడంతా ఎలక్ట్రికల్ వాహనాలపై చర్చ జరుగుతోంది.. మీ ప్రణాళికలేంటి? ఎలక్ట్రికల్ బస్సుల తయారీలో టాటా మోటార్స్ ముందంజలో ఉందని చెప్పగలను. ఇప్పటికే స్టార్‌బస్ పేరుతో 9 మీటర్లు, 12 మీటర్ల బస్సులను అభివృద్ధి చేశాం. కొన్ని రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా పరీక్షలు నిర్వహించి విజయం సాధించగా, మరికొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు చేస్తున్నాం. ఒక్కసారి ఆర్డర్లు వస్తే విక్రయాలకు సిద్ధంగా ఉన్నాం. డీజిల్, ఎలక్ట్రిక్‌తో నడిచే హైబ్రిడ్ బస్సులను కూడా సిద్ధం చేశాం. ఎంఎంఆర్డీఏ (ముంబై) నుంచి 25 హైబ్రిడ్ బస్సులకు ఆర్డరు రాగా ఇప్పటికే 15 బస్సులను సరఫరా చేశాం. వీటిని త్వరలోనే అధికారికంగా ప్రారంభిస్తారు. ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగంపైనా దృష్టి సారిస్తున్నాం. ఇస్రో సహకారంతో ఫ్యూయల్ సెల్ బస్‌లపై దృష్టి పెట్టాం. హైడ్రోజన్‌తో నడిచే ఈ ఫ్యూయల్ సెల్‌కు సంబంధించి నమూనా సిద్ధంగా ఉంది. దీనిని గత ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించాం. వీటితో పాటు సీఎన్జీ, ఎల్ఎన్జీ వాహనాలపై కూడా దృష్టి సారిస్తున్నాం. ప్రస్తుతానికి ఎలక్ట్రిక్ వాహనాలు రీచార్జ్ చేయాల్సి ఉండటంతో షార్ట్ రూట్, నిర్దేశించిన రూట్లలో మాత్రమే నడపగలం. 7 సీటర్ ఆటోలైన మ్యూజిక్ ఐరిస్‌లో కూడా ఎలక్ట్రిక్ వెర్షన్లను సిద్ధం చేశాం. భారీ వాణిజ్య వాహనాల్లో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టడానికి చాలా సమయం పడుతుంది. ఇక్కడ తయారీ యూనిట్‌ను పెట్టే అవకాశం ఉందా? ప్రస్తుతం టాటా మోటార్స్‌కు దేశంలో 5 తయారీ యూనిట్లు, మూడు బాడీ బిల్డింగ్ యూనిట్లు ఉన్నాయి. వీటి ఉత్పత్తిలో 70 శాతం మాత్రమే వినియోగిస్తున్నాం. దీంతో ప్రస్తుతానికి కొత్తగా ఎక్కడా తయారీ యూనిట్లు పెట్టే ఆలోచన లేదు. వ్యాపార పరంగా ఏపీ మాకు కీలకమైన రాష్ట్రం. కొత్త యూనిట్‌ను పెట్టే ఆలోచన ఉంటే తప్పకుండా ఆంధ్రప్రదేశ్‌ను పరిగణనలోకి తీసుకుంటాం. -
ఉరివేసుకుని ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
కీసర మండలం భోగారంలోని హోలీమేరీ ఇంజనీరింగ్ హాస్టల్లో గిరీష్(20) అనే ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ గదిలో ఫ్యానుకు వేలాడుతూ విద్యార్థులకు కనిపించాడు. ఈ విషయం విద్యార్థులు కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. ఆత్మహత్యకు పాల్పడ్డ గిరిష్ స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా. సంఘటనాస్థలాన్ని స్థానిక సీఐ గురువారెడ్డి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్రభుత్వ ఆసుపత్రిలో సబ్ కలెక్టర్ తనిఖీలు
నెల్లూరు : నెల్లూరు జిల్లా గూడూరు ప్రభుత్వ ఆస్పత్రిని సబ్‌కలెక్టర్ గిరీష్ శనివారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రక్తం బాటిళ్లు సంఖ్య చాలా తక్కవగా ఉండటంతో ఆయన వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే విధులకు ఆలస్యంగా వచ్చిన సిబ్బందిపై మండి పడ్డారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండాలని ఆయన వారికి సూచించారు. ఆసుపత్రిలో కనీసం మంచి నీరు కూడా అందుబాటులో లేకపోవడంపై రోగులు సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. -
కష్టాల ఒడే బతుకు బడి!
రైతన్న కష్టాలను తీర్చే వినూత్న పరికరాల రూపకర్త ‘పంట పక్షుల పాలు పాలి కాపు అప్పుల పాలు’ అన్నారు పెద్దలు. ఈ మాటలు పక్షుల బెడద తీవ్రతను చెప్తున్నాయి . ప్రస్తుతం ఉన్న కూలీల కొరతతో పక్షులకు కాపలా కాయడం పెద్ద సమస్య. దీనికి పరిష్కారంగా ఆయన పక్షులను పారదోలే పరికరాన్ని రూపొందించాడు గిరీష్. వేసిన పంటను బట్టి దాన్ని పాడు చేసే పక్షులు, జంతువులను పారదోలేందుకు వాటి సహజ శత్రువుల ధ్వనిని రికార్డు చేసి ఒక మెమరీ కార్డులో అమర్చి పంట పొలంలో ఏర్పాటు చేస్తారు. అది సృష్టించే శబ్ధ తరంగాలతో పక్షులు, జంతువులు పారిపోతాయి. ఒక పరికరం రెండెకరాల మేరకు ప్రభావం చూపుతుంది. ఇనుము కొలిమిలో పడి కాలి సమ్మెట దెబ్బలతో పదునెక్కినట్లు జీవితంలో చవిచూసిన కష్టాలు అతనిలో పట్టుదలను పెంచాయి. ఓ మామూలు రైతు బిడ్డ. రైతు బతుకులో ఒడిదుడుకులు ఎస్‌ఎస్‌ఎల్‌సీతోనే చదువుకు మంగళహారతి పాడించాయి. అయితేనేం జీవితం నేర్పిన పాఠాలు, కష్టాలకు ఎదురీదే క్రమంలో నేర్చుకున్న ప్రత్యక్ష పాఠాలు ఆయనను ఓ శాస్త్రవేత్తగా తీర్చిదిద్దాయి. పేరొందిన శాస్త్రవేత్తలే పరిజ్ఞానానికి అబ్బురపడేట్లు చేశాయి. బిజాపూ ర్లోని కార్వార్కు చెందిన గురుపాదప్ప, బసవమ్మల బిడ్డ. ఐదుగురు తోబుట్టువులతో కష్టాలు పంచుకొని పెరిగాడు. గురుపాదప్ప సన్నకారు రైతు. ఉన్న ఆరెకరాల పొలంతో ఏడుగురి బట్టపొట్ట గడవాలి. చదువుకుంటే బతుకు బాగుపడే మాటేమో కాని ఆకలి సావాసం మాత్రం నీడలా వెంటాడే పరిస్థితి. ఈ పరిస్థితిలో కుటుంబానికి ఆసరాగా నిలవడానికి గిరీష్ ఎస్ఎస్ఎల్సీతోటే చదువు ముగించాడు. చదువు మీద ఆశను చంపుకున్నాడు కానీ చిన్ననాటి శాస్త్రపరిజ్ఞానం మీద పట్టు సాధించాలనే ఆశయాన్ని మాత్రం చంపుకోలేదు. చిన్ననాడే ఇంట్లో పాడయిన ఎలక్ట్రిక్ పరికరాలను పట్టుపట్టి బాగుచేసి, పట్టు సాధించాడు. బోరు మోటరే తొలి గురువు గిరీష్ పొలంలో ఓ బోరు బావి ఉండేది. అయితే అది అస్తమానం తిప్పలు పెట్టేది. దాన్ని రిపేర్ చేయించడానికే చాలా ఖర్చు పెట్టాల్సి వచ్చేది. ఇందుకు అప్పులు చేయాల్సి వచ్చేది. తండ్రి కష్టాన్ని కండ్లారా చూసిన గిరీష్ బోరు సంగతేదో తేల్చాలనుకున్నాడు. ప్రతి రోజు బోరు దగ్గరకెళ్లి పరిశీలించేవాడు. ఏదేదో చేసేవాడు. ఇది చూసిన వాళ్లంతా గిరీష్‌కి పిచ్చెక్కిందని వెక్కిరించేవారు. బోరులో సమస్య ఎక్కడుందో తెలుసుకోవాలన్నది నా ప్రయత్నం. అందుకోసమే నిత్యం బోరు దగ్గర కూర్చుని అందులో ఉన్న వైర్లు వాటి పనితీరు ఇలా అన్నింటిని గమనించేవాణ్ని. ఇది చూసిన వాళ్లంతా నాకు పిచ్చిపట్టింది అని అనేవారు. ఆఖరుకు అమ్మనాన్న కూడా ఇరుగుపొరుగు మాటలతో భయపడి నన్ను ఆ బోరు దగ్గర కెళ్లొద్దని మందలించారు. అయినా ఆగలేదు. ఎవరికీ తెలియ కుండా రాత్రిళ్లు లాంతరు పట్టుకొని బోరు దగ్గరకెళ్లే వాణ్ని. అలా మా బోరుబావి మోటార్ నాకు గురువుగా మారింది. ఆ పాఠాలే నేటి నా ఆవిష్కరణలకు స్ఫూర్తయ్యాయి అని గిరీష్ తన జీవన ప్రస్థానాన్ని వివరించారు. తన ఆశలకు రూపం ఇవ్వడానికి ఊరొదిలిన గిరీష్ బెంగళూరు చేరి తన ఆలోచనలకు పదును పెట్టుకున్నాడు. వాటిని ‘నాబార్డ్’ సంస్థ దృష్టికి తీసుకెళ్లాడు. నాబార్డ్ ప్రతినిధులను గిరీష్ తపన, ప్రతిభ ఆకట్టుకుంది. వారందించిన ఆర్థిక సహకారంతో ఒక బోర్వెల్ స్కానర్, బర్డ్ రిపెల్లెంట్లను రూపొందించాడు. వీటిని పరీక్షకు పెట్టగా పరిశీలనకు వచ్చిన రాయచూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం సంతృప్తి చెంది కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఈ పరికరాలను రాయచూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం తన వ్యవసాయ క్షేత్రాల్లో వినియోగిస్తోంది. అన్నదాత కోసం ఎన్నో ఆవిష్కరణలు.. రైతుబిడ్డగా పుట్టిన గిరీష్‌కు రైతుల పాట్లన్నీ తెలుసు. ఇందులో ప్రధానమైనది నీటి సమస్య. భూగర్భ జలాలే ఆధారంగా వ్యవసాయం సాగే ప్రాంతాల్లో రైతులు బోర్లు వేసి నీరు పడక చివరకు ఉన్న మడి చెక్కలను అమ్ముకున్న వారు అనేకులు. అందుకే భూగర్భంలోని నీటిని తెలుసుకునేందుకు బోర్వెల్ స్కానర్ అనే పరికరాన్ని రూపొందించాడు. అనంతరం పంటలకు పక్షుల బెడదను తప్పించేందుకు బర్డ్ రిపెల్లంట్ను తయారు చేశాడు. తరువాత క్రమంలో లీడ్ సెన్సర్ ఇరిగేషన్ కంట్రోల్‌ను కనుక్కున్నాడు. ఇది పంటకు నీరవసరమైనప్పుడు బోర్ మోటార్ తనకు తానుగా స్టార్టయ్యేటట్లు చేస్తుంది. ప్రస్తుతం బోర్వెల్ స్కానర్‌ను మరింత ఆధునీకరించి బోర్వెల్ స్కానర్ రెండో వర్షన్ రూపకల్పనలో నిమగ్నమయ్యాడు. బోర్వెల్ స్కానర్: సాధారణంగా భూమిలో స్టాక్‌వాటర్, రెగ్యులర్ వాటర్ అని రెండు రకాల నీటి నిల్వలుంటాయి. వీటిలో స్టాక్‌వాటర్ ఉన్నచోట బోరు వేస్తే మొదట నీళ్లు పడినట్టే కనిపిస్తాయి కానీ...ఆ నీళ్లు వారంరోజుల్లో అయిపోయి బోర్ ఫెయిలవుతుంది. అందుకే రెగ్యులర్ వాటర్ ఉన్న చోట బోరు వేయాల్సి ఉంటుంది. రెగ్యులర్ వాటర్ ఎక్కడుందో కనిపెట్టడానికే ‘బోర్వెల్ స్కానర్’ ఉపయోగపడుతుంది. బోరు వేయాలనుకున్న ప్రాంతంలో కనీసం ఐదు నుండి పది అడుగుల లోతుకు తవ్వాల్సి ఉంటుంది. అనంతరం బోర్వెల్ స్కానర్‌కు అమర్చిన ఒక కేబుల్‌ను బోర్లోకి, మరో కేబుల్‌ను ల్యాప్‌టాప్‌కు అనుసంధానం చేస్తారు. స్కానర్‌లో అమర్చిన మైక్రో చిప్‌ల ద్వారా ఆ బోర్లో ఎంత లోతున నీళ్లు ఉన్నాయి, నీళ్లుంటే అవి నిలువనీరా? ఊట నీరా? అనే వివరాలు ల్యాప్ టాప్ నమోదవుతాయి. ఈ సమాచారంతో నీటి లభ్యత వివరాలు తెలిసిపోతాయి. ఈ బోర్వెల్ స్కానర్ ధర రూ. 82 వేలు. వ్యవసాయ శాఖ అధికారులే ముందుకొచ్చి రైతు ప్రయోజనాలను సంరక్షించేందుకు ఈ స్కానర్లను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. లీడ్ సెన్సర్ ఇరిగేషన్ కంట్రోల్: ఇది మోటార్‌కు బిగించే పరికరం. పంటకు నీటి అవసరం ఏర్పడినపుడు పొలంలో అమర్చిన సెన్సర్లు నేలలో తడిని గుర్తించి మోటారుకు సంకేతాలు అందిస్తాయి. దాంతో మోటారు తనకు తానుగా స్టార్టయి నీరు విడుదల చేస్తుంది. ఇందులో ఉష్టోగ్రత నమోదు చేసే పరికరం, నేలలోని తేమను కొలిచే సెన్సర్ లీడ్ సెన్సర్ అనే పరికరాలు అమర్చి ఉంటాయి. ఈ పరికరం ధర రూ.26,000. విద్యుత్ కోతల సమయంలో పడిగాపులు కాసి పంటకు నీరు పెట్టాల్సిన బాధ ఈ పరికరం తీరుస్తుంది. ఆసక్తి గల రైతులు గిరీష్‌ను 09902133996 ద్వారా సంప్రదించవచ్చు. - షహనాజ్ కడియం, సాక్షి, బెంగళూరు