Glasses
-
ఈ వెయిటర్ ఏం ఎనర్జీ డ్రింక్ తీసుకున్నట్టుంది?
-
కట కటా... మర్కటా!
ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ కోతి వీడియో వైరల్ అయింది. మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఇంతకీ ఈ వీడియోలో ఏముంది అనగా....ఒకాయన ఏదో ఆలోచిస్తూ ఆలయం మెట్లు ఎక్కుతూ వస్తుంటాడు. ఆ మెట్ల పక్కన గద్దెపై కూర్చున్న కోతి ఆ వ్యక్తి కళ్లద్దాలను లాగేసుకుంది. ఇతడు బిత్తరపోతూ ఉండగానే ‘ఈ అద్దాలు నాకు సెట్ అవుతాయా’ అన్నట్లుగా ట్రయల్స్ స్టార్ట్ చేసింది కోతి. ఈలోపు అక్కడికి వచ్చిన ఒక మహిళ కొన్ని పండ్లను కోతి ముందు పెట్టింది. అంతే...ఆ అద్దాలను పక్కన పెట్టి పండ్ల పని పట్టింది కోతి. ఈ వీడియోను చూస్తూ బిగ్గరగా నవ్వుతున్న వాళ్లతో పాటు ‘అయ్యో..ఈ వనజీవులు ఎంత ఆకలితో అల్లడుతున్నాయో కదా!’ అని బాధపడుతున్న వారూ ఎందరో ఉన్నారు. -
తస్సాదియ్యా.. ఈ యువతి విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్ కావాల్సిందే!
-
కళ్ల జోడు లేకుండా చదవలేకపోతున్నా: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘జీర్ణం చేసుకోవడం కొంచెం కష్టమే అయినా.. కళ్లజోడు లేకుండా నేను ఇప్పుడు చదవలేకపోతున్నా’.. అధికారికంగానే వయసు మీరుతోంది’ అని ట్విటర్ వేదికగా మంత్రి కేటీఆర్ చమత్కరించారు. ఈ మేరకు కళ్లజోడుతో ఉన్నఫోటోలను శుక్రవారం ట్వీట్చ ఏశారు. బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామాను ఉద్ధేశించి ట్వీట్ చేస్తూ ‘ఆర్థిక విధానాల్లో విఫలమైన బ్రిటన్ ప్రధాని లిజ్ కేవలం 45 రోజుల్లో తన పదవికి రాజీనామా చేశారు. భారత్‌లో మాత్రం 30 ఏళ్లలో లేనంత నిరుద్యోగం, 45 ఏళ్లలో లేనంత ద్రవ్యోల్బణం, ప్రపంచంలోనే అతి ఎక్కవ ఎల్పీజీ ధరలు, అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ కనిష్ట స్థాయికి పడిపోవడం వంటి వాటిని మనప్రధాని ఇచ్చారు’ అని పేర్కొన్నారు. -
గురువర్యా.. ఇదిగో మీ కళ్లజోడు!
సాక్షి, విజయవాడ/చీరాల అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన గురుపూజోత్సవంలో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందిన ఉపాధ్యాయులకు సీఎం వైఎస్ జగన్ అవార్డులను అందజేస్తుండగా.. అవార్డు అందుకుంటున్న బాపట్ల జిల్లా చీరాల రూరల్ మండలం ఈపూరుపాలెం జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మొలబంటి వెంకటేశ్వర్లు కళ్ల జోడు కింద పడిపోయింది. ఆ విషయం గమనించిన సీఎం జగన్.. దానిని చేత్తో పైకి తీసి, ఆ ప్రధానోపాధ్యాయుడి జేబులో పెట్టారు. ఓ గురువు పట్ల సీఎం వినయం ప్రదర్శించిన తీరును అక్కడ ఉన్న వారంతా ప్రశంసించారు. చదవండి: (రాష్ట్రంలోనే క్యాన్సర్‌కు చెక్) -
100 గ్రాముల కళ్ల జోడు..100 నిమిషాల వీడియోల్ని రికార్డ్ చేస్తుంది!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమీ టెక్నాలజీ విభాగంలో మరో అడుగు ముందుకు వేసింది. అగ్మెంటెడ్ రియాలిటీతో 'మిజియా ఏఆర్ గ్లాసెస్ కెమెరా ' స్మార్ట్ గ్లాస్‌ను విడుదల చేసింది. షావీమీ 'మిజియా ఏఆర్ స్మార్ట్ గ్లాస్‌ను చైనాలో విడుదల చేయగా.. గ్లోబల్ మార్కెట్లో ఎప్పుడు విడుదల చేస్తున్నారనే అంశంపై షావోమీ స్పందించింది. తాము విడుదల చేసిన ఈ ఏఆర్ స్మార్ట్ గ్లాస్‌ను భారత్ మార్కెట్లో త్వరలోనే అందుబాటులోకి తెస్తామని తెలిపింది. ఆ తర్వాత డిమాండ్‌ను బట్టి ఇతర దేశాల మార్కెట్లకు పరిచయం చేస్తామని పేర్కొంది. మిజియా ఏఆర్ గ్లాసెస్ ఫీచర్లు రూ.29,030 విలువైన మిజియా ఏఆర్ గ్లాసెస్‌లో డ్యుయల్ కెమెరా సెటప్, 50 మెగా పిక్సెల్ క్వాడ్ బేయర్ సెన్సార్లు, 8మెగా పిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో కెమెరా, ఐఓఎస్ ఆప్టికల్ స్టెబిలైజేన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 5ఎక్స్ ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేస్తుండగా 15ఎక్స్ హైబ్రిడ్ వరకు జూమ్ చేసుకోవచ్చని షావోమీ ప్రతినిధులు వెల్లడించారు. పనితనం అంటే ఇదే మరి కేవలం 100గ్రాముల బరువు ఉండే ఈ స్మార్ట్ గ్లాస్ పనితీరులో అమోఘమని షావోమీ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ గ్లాస్లో ఉన్న కెమెరాలు ఫోటోల్ని తీయడం, షేర్ చేయడం సెకన్లలో జరిగిపోతాయని స్పష్టం చేసింది. ఈ గ్లాస్లో మరో ప్రత్యేకత ఏంటంటే 100 నిమిషాల వీడియో పుటేజీని నాన్ స్టాప్‌గా రికార్డ్ చేస్తుందని షావోమీ సీఈవో లీ జూన్ చెప్పారు. స్టోరేజీ ఎంతంటే స్నాప్ డ్రాగన్ 8చిప్ సెట్‌తో వస్తున్న ఈ స్మార్ట్ గ్లాస్లో 3జీబీ ర్యామ్ 32జీబీ స్టోరేజ్ సౌకర్యం ఉంది. 1,020 ఎంఏహెచ్ బ్యాటరీ, 10డబ్ల్యూ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్, 30నిమిషాల్లో 80శాతం బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కే సామర్ధ్యం ఉంది. 3,000 నిట్స్ పీక్స్ బ్రైట్‌నెస్‌తో ఓఎల్ఈడీ స్క్రీన్‌తో వస్తుండగా.. ఈ స్మార్ట్ గ్లాసెస్ డిజిటల్ అసిస్టెంట్‌గా పనిచేస్తాయని విడుదల సందర్భంగా షావోమీ వెల్లడించింది. -
కోతి కళ్లుజోడుని ఎలా తిరిగి ఇచ్చిందో చూడండి!
మన ఇళ్లలోని వస్తువులను కోతులు ఏవిధంగా ఎత్తుకుపోతాయో అందరికీ తెలుసు. ఆ వస్తువులను కోతులు తీసుకెళ్లి ఎక్కడో పడేస్తాయి తప్ప అవి మనకు దొరికే అవకాశం కూడా ఉండదు. కానీ అందుకు విరుద్ధంగా ఇక్కడోక కోతి ఒక వ్యక్తి కళ్లజోడుని ఎత్తుకుపోయి మళ్లా తిరిగి ఇచ్చేసింది. అలా ఎలా ఇచ్చేసిందబ్బా అనిపిస్తుందా? అనుమానంగా ఉందా? అయితే తెలుసుకుందాం రండి. (చదవండి: చీరకట్టు ‘ప్రియుడు’.. ఇది ఏ ఫ్యాషనో తెలుసా?) వివరాల్లోకెళ్లితే.....ఐపీఎస్ ఆఫీసర్ రూపిన్ శర్మ కళ్లజోడుని ఒక కోతి ఎత్తుకుపోతుంది. పైగా ఆ కళ్లజోడు పట్టుకుని ఒక మెస్‌పై కుర్చోంటుంది. దీంతో మొదట అతనికి ఏం చేయాలో తోచదు. ఆ తర్వాత ఆయన ఒక జ్యూస్ ప్యాక్‌ని తీసుకువచ్చి కోతికి ఇస్తాడు. కోతులు సహజసిద్ధంగా ఉండే అనుకరించే బుద్ది కారణంగా ఆ కోతి జ్యూస్ ప్యాక్‌ని తీసుకుని కళ్లజోడుని మెస్ మీద నుంచి వదిలేస్తుంది. అయితే ఆ కళ్లజోడు మెస్‌లో ఇరుక్కుపోతుంది. అయినప్పటికీ ఆ తెలివైన కోతీ ఆ మెస్‌లో ఇరుక్కుపోతున్న కళ్లజోడుని తీసి మరీ శర్మకి తిరిగి ఇస్తుంది. దీనికి సంబంధించిన వీడియోకి "ఒక చేత్తో తీసకుంటూ ఇంకో చేత్తో ఇచ్చింది" అనే క్యాప్షన్ జోడించి ట్టిట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అంతేకాదు నెటిజన్లు తినేందుకు ఏమి ఇవ్వకపోతే కోతులు మనవస్తువులను అంత తేలిగ్గా తిరగి ఇవ్వవు అంటూ రకరకాలు ట్వీట్ చేశారు. (చదవండి: హృదయాన్ని కదిలించే ‘స్వీట్ రిక్వస్ట్’) Smart 🐒🐒🐒 Ek haath do, Ek haath lo 😂😂😂😂🤣 pic.twitter.com/JHNnYUkDEw — Rupin Sharma IPS (@rupin1992) October 28, 2021 -
అనుమానాస్పదంగా కనిపిస్తున్నారు కదూ.. నిజం తెలిస్తే, ఆశ్చర్యపోతారు
ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తులను చూస్తుంటే.. ఎవరో అనుమానాస్పదుల్లా కనిపిస్తున్నారు కదూ? ఎందుకు వారు ముఖాన్ని దాచుకుంటున్నారు? ఏదైనా ల్యాబ్‌లో పనిచేస్తూ .. మరిచిపోయి డైరెక్ట్‌గా రోడ్డు మీదకు వచ్చేశారా? లేదా.. మనుషులను పోలి ఉండే గ్రహంతర వాసులా? ఇలాంటి వింత ఆలోచనలు అనుమానాలన్నీ మీ బుర్రను తొలిచేయడం మొదలుపెట్టే ఉంటాయి. (చదవండి: పదేళ్లుగా ఉదయాన్నే లేవడం, ఊరంతా బలాదూర్ తిరగడం.. ఈ కుక్క ప్రత్యేకత) అసలు నిజం తెలిస్తే, ఆశ్చర్యపోతారు. మాస్కును మించి ముఖాన్ని కవర్ చేసేసేలా వీరు ధరించినవి కొత్తరకం గాగుల్స్. నిజం.. ఇవి సరికొత్త కళ్లజోళ్లు. సాధారణంగా ఎండ నుంచి కళ్లను రక్షించే సన్గ్లాసెన్ను మాత్రమే ఇప్పటివరకు చూసి ఉంటారు. కానీ, ఈ సన్‌గ్లాసెస్ మాత్రం మీ ముఖం మొత్తాన్ని ఎండ ప్రభావం నుంచి కాపాడుతాయి. జపాన్‌కు చెందిన ఓ కంపెనీ అధిక నాణ్యత గల పాలికార్బొనేట్‌తో వీటిని రూపొందించింది. సాధారణ సన్ గ్లాసెస్లాగే వీటిని కూడా చెవుల పైభాగం నుంచి ధరించొచ్చు. ప్రస్తుతం కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఈ గాగుల్స్ ఎండ నుంచే కాదు, కరోనా వంటి మహమ్మారి రోగాల నుంచి కూడా మిమ్మల్ని కాపాడుతాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా ఎవరైనా వీటిని ధరించొచ్చు. ఆన్లైన్ మార్కెట్లో వివిధ పరిమాణాలు, ధరల్లో ఇవి లభిస్తున్నాయి. (చదవండి: కరోనా ఆంక్షలు.. బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి.. అప్పుడొచ్చింది ఓ మైండ్ బ్లోయింగ్ ఐడియా!) -
గాంధీజీ కళ్లజోడు.. జీవితాన్నే మార్చేసింది!
ప్రిటోరియా: దక్షిణాఫ్రికాలో మహాత్మా గాంధీ ధరించిన బంగారు వృత్తాకారపు కళ్లజోడు ఇటీవల వేలం పాటలో అత్యంత భారీ మొత్తానికి అమ్ముడు పోయింది. మూడు వారాల క్రితం దక్షిణాఫ్రికాలోని బ్రిస్టల్‌ల్లో నిర్వహించిన ఈ వేల పాటలో ఆ కళ్లజోడు సుమారు 260,000 పౌండ్లకు అమ్ముడుపోడంతో దాని యాజమాని హర్షం వ్యక్తం చేశాడు. ఈ కళ్లజోడును దక్షిణాఫ్రికా పర్యటన సమయంలో మహత్మా గాంధీ ధరించారు. ఈ అరుదైన వస్తువును ఆమెరికాకు చెందిన ఓ వ్యక్తి కొనుగోలు చేశాడు. గాంధీజీ కళ్లద్దాలకు రిజర్వ్ ధరను 15,000 పౌండ్లగా నిర్ణయించారు. అయితే దీనిని సొంతం చేసుకునేందుకు భారతదేశంతో సహా వివిధ దేశాల నుండి చాలా మంది ఆసక్తిచూపించినట్లు వేలం పాట నిర్వహకుడు ఆండీ స్టోవ్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా స్టోవ్ శనివారం అక్కడి మీడియాతో మాట్లాడుతూ.. “ఇది అద్భుతమైన ఫలితం. ఇప్పటికీ నమ్మలేకపోతున్న. ఇంత మొత్తంలో ఈ కళ్లజోడు వేలానికి పోతుందని ఎవరూ కూడా ఊహించలేదు. నిజానికి ఈ కళ్లద్దాలు దాదాపు 50 ఏళ్లుగా తమ ప్రదర్శన శాలలోనే ఉంటోంది. అయితే కొంతమంది దీనిని వేలంలో ఎవరూ కొనరని, పనికి రాని వస్తువుగా చూసేవారు. దీనిని బయటపడేయడమే ఉత్తమమంటూ దీని యాజమానికి పలువురు సూచించారు. అయితే ఈ కళ్లజోడు యాజమాని ఓ వృద్ధుడు. అతడి కుటుంబం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. వేలంలో ఊహించనంతా మొత్తానికి అమ్ముడుపోడంతో అతడి జీవితాన్నే మార్చేసేంతా డబ్బును అతడు పొందాడు’ అని పేర్కొన్నాడు. అయితే కళ్లద్దాలను కొనుగోలును సొంతం చేసుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా భారత్, ఖతార్, కెనడా, రష్యా, అమెరికా నుంచి పాల్గొన్నారని చెప్పాడు. అయితే దీనిని 1920-1930 మధ్య కాలంలో గాంధీజీ దక్షిణాఫ్రికా పర్యటన అనంతరం తిరిగి భారత్‌కు వెళ్లేటప్పుడు సదరు వృద్దుడి మామకు ఇచ్చినట్లు స్టోవ్ వెల్లడించాడు. ఇది దాదాపు దశాబ్ధాలుగా వారి వద్దే ఉంటోందని, గాంధీ ఇక్కడకు వచ్చినప్పుడు వృద్ధుడి మామ దక్షిణాఫ్రికాలోని బ్రిటిష్ పెట్రోలియంతో కలిసి పనిచేసేవాడని చెప్పాడు. భారత్‌లో గాంధీ స్వాతంత్ర్య పోరాటాన్ని ప్రారంభించడానికి ముందు ఇక్కడ చాలా సంవత్సరాలు గడిపారని, ఆ సమయంలో గాంధీజీ వారి ఇంట్లోనే నివిసించినట్లు అతడు తెలిపాడు. ఆయనకు ఆతిథ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతగా గాంధీ ఈ కళ్లజోడును వారికి బహుకరించారని స్టోవ్ వెల్లడించాడు. అయితే ఈ కళ్లద్దాలు మొత్తం బంగారు పూతతో ఉండి ప్రిస్క్రిప్షన్ లెన్స్‌లతో ఇమిడి ఉంటుందని అతడు చెప్పాడు. ఇక ముక్కు పట్టి కూడా బంగారంలోనే ఉంటుందన్నాడు. ఈ వేలంలో గాంధీకి సంబంధించిన పలు వస్తువులలో ఈ అద్దాలు ఉత్తమైనవే కాకుండా మొత్తం ప్రదర్శనలో ఐకానిక్‌గా నిలిచిందని స్టోవ్ తెలిపాడు. -
‘కళ్లజోడుతో హాట్‌గా కనిపించరు.. అందుకే ఇలా’
టోక్యో : జపాన్‌లో మహిళల వేషధారణపై పలు సంస్థలు విధిస్తున్న ఆంక్షలు దుమారం రేపుతున్నాయి. పని ప్రదేశాల్లో మహిళలు కళ్లజోడు ధరించి విధుల్లోకి రావొద్దని, బూట్లకు బదులు ఎత్తయిన హైహీల్స్ ధరించాలని నిబంధనలు పెట్టాయి. కళ్లజోడుతో మహిళ సిబ్బంది విధుల్లో ఉంటే వారి మేకప్‌ను అవి డామినేట్ చేస్తాయని రెస్టారెంట్ నిర్వాహకులు అంటుండగా.. భద్రత కోసమే మహిళా సిబ్బందికి కళ్లజోడు పెట్టుకోవద్దని ఆంక్షలు విధించామని ఎయిర్‌లైన్స్ సంస్థలు చెప్తున్నాయి. ఈ ఆంక్షలపై జపాన్ వ్యాప్తంగా మహిళా లోకం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పురుషులకు ఎటువంటి ఆంక్షలు పెట్టకుండా తమపైనే వివక్ష చూపుతున్నారని, అలాంటప్పుడు కళ్లజోళ్లు అమ్మడం నిషేదించాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు.‘కళ్లజోడు నిషేదించబడింది’అనే హ్యాష్‌టాగ్‌తో ట్రోలింగ్ మొదలు పెట్టారు. ‘కళ్లజోడుతో హాట్‌గా కనిపించడం కుదరదు, బాస్‌కు నచ్చదు. అందుకే కాబోలు ఈ దిక్కుమాలిన ఆంక్షలు’ అని మహిళలు తిట్టిపోస్తున్నారు. గంటల తరబడి హైహీల్స్ వేసుకుంటే పని చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుందని, కాళ్లు ఎర్రగా వాచిపోయి రక్తం వచ్చిన సందర్బాలూ ఉన్నాయని పలువురు మహిళా సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదిమాత్రమే కాకుండా.. హైహీల్స్‌తో అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని డాక్టర్లు చెప్తున్నారని వెల్లడించారు. హైహీల్స్‌తో నరకాన్ని చూస్తున్నామని పేర్కొంటూ.. #KuToo ఉద్యమాన్ని లేవనెత్తారు. మీటూ ఉద్యమం స్ఫూర్తిగానే కూటూ వచ్చిందని ఇషిక్వారా మహిళా ఉద్యోగిని వెల్లడించారు. జపనీస్‌లో కూటూ అంటే బాధ అని అర్థం. జపాన్‌లో పాఠశాల విద్యార్థినులపై కూడా ఆంక్షలు విధించడం గమనార్హం. నల్లని జట్టుతో.. వైవిధ్యమైన జడతో విద్యార్థినులు స్కూల్‌కు రావాలని ఆంక్షలు పెట్టడం దారుణం. -
కళ్లజోడు... ఇపుడో ఫ్యాషన్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : కళ్లజోడును ఒకప్పుడు అవసరంగానే చూసేవారు. అందుకే పెద్దగా డిజైన్లుండేవి కావు. కానీ ఇప్పుడు!! ఇదో ఫ్యాషన్. దాంతో కొత్త కంపెనీలొచ్చాయి. ఆన్లైన్ కంపెనీలూ పుట్టాయి. వేల డిజైన్లలో ఆకట్టుకునే ఫ్రేమ్‌లు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయ్. సరైన కళ్లజోడు అందాన్ని పెంచుతుండటంతో... అలాంటి ఫ్రేమ్‌ల కోసం కస్టమర్లు ఎంతైనా వెచ్చిస్తున్నారు. పైపెచ్చు కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూర్చోవడం, స్మార్ట్ఫోన్ల వాడకం అధికమవడం... కళ్ల జోళ్ల అవసరాన్ని కూడా పెంచుతున్నాయి. దీంతో రూ.6,000 కోట్ల భారత కళ్లజోళ్ల పరిశ్రమలో ఇప్పుడిప్పుడే వ్యవస్థీకృత రంగం తన వాటాను పెంచుకుంటోంది. మారుతున్న ట్రెండ్... ఫ్రేమ్స్ డిజైన్ల విషయంలో ట్రెండ్ మారుతోంది. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత మార్కెట్ కూడా ఇందుకు తీసిపోవడం లేదు. పారదర్శకంగా ఉండే రంగురంగుల ఫ్రేమ్స్, వుడెన్ ఎఫెక్ట్, టార్టాయిస్ షెల్, మార్బుల్ స్టైల్, గోల్డ్ మెటల్ వైర్ ఫ్రేమ్స్ హవా నడుస్తోంది. క్యాట్ ఐ, సెమి రిమ్లెస్, ఏవియేటర్ స్టైల్, మందమైన రౌండ్ షేప్ ఫ్రేమ్స్ ఇప్పుడు పాపులర్ అయ్యా యని ఖమ్మంకు చెందిన కళ్లజోళ్ల షాప్ యాజమని జ్యోతిర్మయి తెలిపారు. భారత్‌లో అమ్ముడవుతున్న ఫ్రేమ్స్‌లో 70% విదేశాల నుంచి దిగుమతి అవుతున్నవే. సింథటిక్ లెన్స్ పూర్తిగా ఇంపోర్ట్ చేస్తున్నారు. అత్యధికం రూ.1,500 లోపువే.. ఫ్రేమ్స్‌లో సింథటిక్, మెటల్, టైటానియం, గోల్డ్ రకాలున్నాయి. మొత్తం పరిశ్రమలో రూ.1,500 లోపు ధరలో లభించే ఫ్రేమ్స్ వాటా ఏకంగా 65 శాతం. రూ.1,500–5,000 శ్రేణి 30 శాతం, రూ.5 వేలపైన లభించే ఉత్పత్తుల వాటా 5 శాతం ఉంది. ప్రీమియం విభాగంలో మోబ్లా, కరెరా, కార్టియర్ వంటి బ్రాండ్లు పోటీపడుతున్నాయి. రూ.1 లక్షల పైచిలుకు ధరలోనూ ఫ్రేమ్స్ లభిస్తున్నాయి. లెన్స్ రకాన్నిబట్టి ధర రూ.50 వేల వరకూ ఉంది. కస్టమర్లు తమ తొలి ఫ్రేమ్‌ను తక్కువ ధరలో కొంటున్నారని, రెండోసారి కాస్త ఖరీదైంది తీసుకుంటున్నారని టైటన్ కంపెనీ ఎండీ భాస్కర్ భట్ ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. ఇదీ కళ్లజోళ్ల మార్కెట్.. దేశవ్యాప్తంగా కళ్లజోళ్ల మార్కెట్ పరిమాణం రూ.6,000 కోట్లు. దీన్లో మూడింట రెండొంతులు అవ్యవస్థీకృత రంగానికి కాగా, మిగిలినది అంటే రూ.2,000 కోట్లు వ్యవస్థీకృత రంగానిది. పరిశ్రమ ఏటా 15 శాతం వృద్ధి చెందుతోంది. మెట్రో నగరాల వాటా 40 శాతం. ఈ నగరాల్లో ఒక్కో వినియోగదారు ఒకటికి మించి కళ్లజోళ్లను కొంటున్నారు. ఏడాది కాగానే మారుస్తున్నారట. దేశవ్యాప్తంగా కార్యకలాపాలు సాగిస్తున్న టైటన్ ఐ ప్లస్, విజన్ ఎక్స్‌ప్రెస్, లెన్స్‌కార్ట్, జీకేబీ లెన్స్ వంటి చైన్లు 10 వరకూ ఉన్నాయి. ఒకటిరెండు రాష్ట్రాలకు పరిమితమైన చైన్లు 30 దాకా ఉన్నాయి. వైద్యులు, ఆప్టోమెట్రిస్టులు నిర్వహిస్తున్న కేంద్రాలు దేశంలో 20 వేల పైచిలుకు ఉంటాయని సమాచారం. టాప్ కంపెనీలు ఆన్లైన్కూ విస్తరించాయి. -
చాహల్ కళ్లజోడు రహస్యం చెప్పిన తండ్రి..
ముంబై: టీమిండియా మణికట్టు స్పిన్నర్ యజువేంద్ర చాహల్ ఇటీవల వాండరర్స్ లో జరిగిన టీ20 మ్యాచ్‌లో కళ్లజోడుతో కనిపించాడు. చాహల్ బౌలింగ్ లేదా బ్యాటింగ్ చేసేటప్పుడు కళ్లద్దాలు ఉపయోగించాడు. ఫీల్డిండ్ చేసేటప్పుడు మాత్రమే వాడుతున్నాడు. ఈ విషయం వెనుక ఉన్న నిజాన్ని అతడి తండ్రి బయటపెట్టారు. ‘ దక్షిణాఫ్రికా టూర్‌కు వెళ్లే ముందు చాహల్ కంటి వైద్యుడిని సంప్రదించాడు. కేవలం డాక్టర్ చెప్పడం వల్లే తన కుమారుడు కళ్లజోడు ధరిస్తున్నాడు. చాహల్ కంటిచూపు మంచిగా ఉంది. కానీ అరుదుగా వాడమని వైద్యుడు సలహా ఇచ్చాడు’ అని తెలిపాడు. ప్రస్తుతం ఇండియా టీంలో చాహల్ మాత్రమే గ్లాసెస్ ఉపయోగిస్తున్నాడు. టీమిండియా విజయాల్లో ఇటీవల చాహల్ కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. కెప్టెన్ విరాట్ కోహ్లి, కీపర్ మహేంద్ర సింగ్ ధోనిలు కూడా బయట గ్లాసెస్ వాడుతారు. మ్యాచ్ జరిగే సమయంలో మాత్రం వారు కళ్లద్దాలు ఉపయోగించరు. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, స్పీన్నర్ వెటోరి కూడా మ్యాచ్‌లో నిత్యం కళ్లజోడు ధరించేవాడు. నేడు సెంచూరియన్‌లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0తో అధిక్యంలో ఉంది. -
ఇక 3డీ అద్దాల అవసరం లేదు!
న్యూయార్క్ః థియేటర్లలో 3డీ సినిమాలు చూడాలంటే తప్పనిసరిగా కళ్ళకు ప్రత్యేకమైన గ్లాసెస్ పెట్టుకోవాలన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇకపై అలాంటి అవసరం లేదంటున్నారు మసాచుసెట్స్.. వైజ్ మ్యాన్ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు. కంటికి ఎలాంటి 3డీ గ్లాసెస్ పెట్టుకోకుండానే త్రీడీ సినిమాలు చూసే అవకాశం దగ్గరలోనే ఉందంటున్నారు. అమెరికా కు చెందిన మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇజ్రాయెల్ లోని వైజ్ మ్యాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ పరిశోధకులు 3డీ అద్దాలు పెట్టుకోకుండానే థియేటర్లలో 3డీ సినిమాలు చూడొచ్చని చెప్తున్నారు. 'సినిమా 3డీ' పేరున్న ఆప్టిక్ లెన్స్ ను స్ర్కీన్ పై అమర్చడంతో సినిమా హాల్లోని ఏ సీట్లో కూర్చున్నా.. 3డీ అనుభూతి కలుగుతుందని తమ తాజా పరిశోధనల్లో కనుగొన్నారు. ఇప్పటికే గ్లాసెస్ లెస్ 3డీ టెక్నాలజీ అందుబాటులో ఉన్నా... అది హాల్లో ఆటూ ఇటూ తిరిగుతూ చూసే అవకాశం ఉండదని, సీట్ల అమరిక ఆధారంగా సింగిల్ యూజర్లను దృష్టిలో పెట్టుకొని దాన్ని రూపొందించారని ఎంఐటీ కంప్యూటర్ సైన్స్ అండ్ అర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ల్యాబ్ కు చెందిన ప్రొఫెసర్ వోసియెక్ మాటుసిక్ అంటున్నారు. అయితే కొత్త సినిమా 3డీ స్పెషల్ ఆప్టిక్ సిస్టమ్ లో థియేటర్లోని ఏ ప్రాంతంనుంచీ, ఏ యాంగిల్ లోనైనా 3డీ సినిమాను అద్దాల్లేకుండా చూడొచ్చని చెప్తున్నారు. ప్రస్తుతం ఈ కొత్త గ్లాసెస్ లెస్ 3డీ సిస్టమ్ అభివృద్ధి దశలో ఉందని, థియేటర్లలో ఈ కొత్త విధానం అందుబాటులోకి రావాలంటే మరికొంత సమయం పడుతుందని పరిశోధకులు చెప్తున్నారు. కాలిఫోర్నియాలోని అనాహైమ్ లో జరిగబోయే 'సిగ్ గ్రాఫ్' కంప్యూటర్ గ్రాఫిక్స్ కాన్ఫరెన్స్ లో తాము అభివృద్ధి చేసిన పరిశోధనలను ప్రవేశపెట్టనున్నట్లు వారు తెలిపారు. -
కంటికి శ్రమ తగ్గించే 'స్క్రీనర్లు'
న్యూయార్క్ః ఆధునిక జీవితంలో ప్రతి విషయం ఫింగర్ టిప్స్ పై ఉండాలంటే స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్ ల్యాప్ లపై ఆధారపడటం తప్పడం లేదు. కొందరు ఆధునిక టెక్నాలజీకి, సామాజిక మాధ్యమాలకు బానిసలు కూడ అయిపోతున్నారు. ఈ నేపథ్యంలో అతిగా స్క్రీన్ చూడటం వల్ల అనేక అనర్థాలు కలుగుతున్నాయి. స్క్రీన్ నుంచి వెలువడే కాంతికి కంటి సమస్యలూ అధికమౌతున్నాయి. ఇందుకు పరిష్కారం దిశగా ఆలోచించిన పరిశోధకులు కంటికి రక్షణ కల్పించే పారదర్శక అద్దాలను అందుబాటులోకి తెచ్చారు. స్క్రీన్ చూసేప్పుడు వాటిని వినియోగించడంవల్ల కాంతిని నిరోధించి కంటికి శ్రమ తగ్గిస్తాయని చెప్తున్నారు. స్క్రీనర్ల పేరిట కాంతిని నిరోధించే ప్రయోగాత్మక పారదర్శక అద్దాలు అందుబాటులోకి వచ్చాయి. కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ ట్యాప్ లు అధికంగా వాడేవారు తీవ్రమైన కంటి సమస్యలతో బాధపడుతుండటాన్ని దృష్టిలో పెట్టుకున్న 28 ఏళ్ళ ఛినో కిమ్ ఆ దిశగా ఆలోచించాడు. ఆధునిక అద్దాలను ధరించడంవల్ల అత్యధిక సమయం స్క్రీన్లు చూసేవారికి ఎంతో ఉపయోగంగా ఉంటుందని చెప్తున్నాడు. టెక్ సంస్కృతి వైరస్ లా వ్యాపిస్తున్న నేటి తరుణంలో కంటిని కాపాడేందుకు తన నూతన సృష్టి ఎంతగానో సహకరిస్తుందని ఇటీవల జరిగిన ఎన్ వై యు ఇంటరాక్టివ్ టెలికమ్యూనికేషన్స్ కార్యక్రమం స్ప్రింగ్ షోలో తెలిపాడు. 'స్క్రీనర్' ను తలకు ధరించి చూడ్డంద్వారా కంటి సమస్యలనుంచి బయటపడొచ్చని ఛినోకిమ్ చెప్తున్నాడు. దైనందిన జీవితంలో ఎక్కువశాతం స్క్రీన్లను చూసేవారు స్మార్ట్ ఫిల్మ్ తో తయారు చేసిన లెన్స్ కలిగిన ఈ స్క్రీనర్ ను వినియోగిస్తే ఫలితాలు ఉంటాయంటున్నాడు. 'మెషీన్ లెర్నింగ్ ఫర్ ఆర్ట్స్' చదువుతున్న సమయంలో తనకు ఈ కొత్త ఆలోచన వచ్చిందని, బేసిక్ మెషీన్ లెర్నింగ్ అండ్ కంప్యూటర్ ప్రోగ్రామ్ ద్వారా ఈ అద్దాలను రూపొందించినట్లు కిమ్ తెలిపాడు. స్క్రీనర్లు కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ నుంచి కూడ రక్షిస్తాయని తెలిపాడు. -
కళ్లజోడు మచ్చలకు కలబంద...
బ్యూటిప్స్ కళ్లజోడు పెట్టుకున్నవారికి ముక్కుకు ఇరువైపులా ముదురు గోధుమరంగులో, ఇంకొందరికి నల్లగా మచ్చలు ఏర్పడుతుంటాయి. ఈ మచ్చలు పోయి, చర్మం పూర్వపు రంగులోకి రావాలంటే...కలబంద జెల్‌ను మచ్చలు ఏర్పడిన చోట రాసి, 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. రోజూ ఇలా చేస్తూ ఉంటే మచ్చలు తగ్గుతాయి.మచ్చలపై తేనె రాసి, 10-15 నిమిషాల తర్వాత శుభ్రం చేయాలి. రోజూ ఇలా చేస్తూ ఉంటే మచ్చలు క్రమంగా తగ్గిపోతాయి.రెండు స్పూన్ల నిమ్మరసంలో స్పూన్ నీళ్లు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో దూది ఉండను ముంచి, మచ్చలపై రాయాలి. ఆరిన తర్వాత కడిగేయాలి. రోజూ ఈ విధంగా చేయడం వల్ల కళ్లజోడు వల్ల అయిన మచ్చలను తగ్గించుకోవచ్చు. బంగాళదుంప రసాన్ని మచ్చలున్న చోట రాయాలి. లేదంటే, బంగాళదుంప ముక్కతో మచ్చలున్న చోట మృదువుగా రుద్దాలి. రోజూ ఇలా చేస్తూ ఉంటే మచ్చలు తగ్గుతాయి. నారింజతొక్కలను ఎండబెట్టి, పొడి చేయాలి. దీంట్లో కొద్దిగా పాలు పోసి, పేస్ట్‌లా కలపాలి. ఈ మిశ్రమాన్ని మచ్చలున్న చోట రాసి, 20 నిమిషాల తర్వాత శుభ్రం చేయాలి. రోజూ ఈ విధంగా చేయాలి.అవకాడో పండును గుజ్జు చేయాలి. ఈ గుజ్జును మచ్చలున్నచోట మాత్రమే కాదు, ముఖమంతా రాసి, ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవచ్చు. అవకాడోలో ఉన్న సహజ ఔషధ గుణాలు చర్మం పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తుంది.రోజ్‌వాటర్‌లో దూది ఉండను ముంచి, మచ్చలున్న చోట రాయాలి. అలాగే శనగపిండిలో కొన్ని చుక్కల రోజ్‌వాటర్ పోసి, పేస్ట్ చేసి రాయాలి. ఈ విధంగా రోజూ చేస్తూ ఉంటే మచ్చలు క్రమంగా తగ్గిపోతాయి. {స్టాబెర్రీలో విటమిన్ ‘సి’ సమృద్ధిగా ఉంటుంది. స్ట్రాబెర్రీ గుజ్జును మచ్చల మీద రాసి, ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. -
రోగి స్పృహలో ఉండగానే బ్రెయిన్ సర్జరీ!
ఫ్రాన్స్ వైద్యులు సరికొత్త చరిత్ర సృష్టించారు. మెదడులోని క్యాన్సర్ కణతిని తొలగించేందుకు 3డీ వర్చువల్ గ్లాసెస్ వినియోగించి.. రోగి స్పృహలో ఉండగానే శస్త్ర చికిత్స నిర్వహించారు. కృత్రిమ ప్రపంచాన్ని రోగికి చూపుతూ.. ఆపరేషన్ సమయంలో మెదడులోని భాగాలను సులభంగా పరీక్షించేందుకు అనుమతించే త్రీడీ అద్దాలను వినియోగించారు. రోగి స్పృహలో ఉన్నపుడే శస్త్ర చికిత్స నిర్వహించడంలో భాగంగా వైద్యులు ఈ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. పశ్చిమ ఫ్రాన్స్ లోని ఏంజిర్ ఆస్పత్రిలో నిర్వహించిన చికిత్స విజయవంతమవ్వడంతో వైద్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సర్జరీ సమయంలో రోగి కళ్లముందు కృత్రిమ ప్రపంచాన్ని సృష్టించేందుకు త్రీడీ గ్లాస్ లు వాడినట్లు డాక్టర్లు చెప్తున్నారు. దీంతో మెదడు పని తీరును ప్రత్యక్షంగా గుర్తించగలిగినట్లు ఏంజెర్స్ ఆస్పత్రి న్యూరో సర్జన్ ఫిలిప్పీ మెనీ తెలిపారు. కణతి కారణంగా రోగి ఇప్పటికే ఓ కన్ను కోల్పోయాడని, అందుకే దృష్టిని రక్షించేందుకు ప్రత్యేకంగా వినియోగించే ఈ కొత్త టెక్నాలజీని అతడి ఆపరేషన్ కు వాడినట్లు వైద్యులు వెల్లడించారు. ఆపరేషన్ తర్వాత రోగి క్రమంగా కోలుకుంటున్నాడని, కీమో థెరపీ చేయించుకునే ప్రయత్నంలో కూడ ఉన్నాడని చెప్తున్నారు. స్పృహలో ఉండగా రోగికి ఆపరేషన్ చేయడం అనేది సుమారు పదేళ్లుగా జరుగుతోందని, అయితే వర్చువల్ రియాలిటీ అద్దాల వాడకం శస్త్ర చికిత్స సమయంలో వాడటం ఇదే మొదటిసారి అని డాక్టర్ మెనీ తెలిపారు. ఇలా చేయడంవల్ల రోగికి సంబంధించిన మాట, దృష్టి, కదలికలు చికిత్స సమయంలో స్పష్టంగా తెలుసుకోగలిగే అవకాశం ఉందంటున్నారు. పేషెంట్ కు ప్రత్యేక అనుభూతిని కల్గించడంకోసం కాదని, శస్త్ర చికిత్స సులభమవ్వడంకోసమే ఈ అద్దాలు వాడినట్లు వైద్యులు స్సష్టం చేశారు. ఈ ఆపరేషన్ విజయవంతం అవ్వడంతో మెనీ బృందం... భవిష్యత్తులో మెదడు కణతిల ఆపరేషన్ కు ఇదే విధానాన్ని అమల్లోకి తేనున్నారు. త్వరలో పిల్లల చికిత్సలకు కూడ వచ్చువల్ రియాలిటీ గ్లాసెస్ వినియోగించే యోచనలో ఉన్నారు. -
మిర్రర్ అండ్ ఎర్రర్!
హ్యూమర్ మిర్రర్స్ అండ్ ఎర్రర్స్ అండ్ కో అనే అద్దాల కంపెనీలోని ఉద్యోగులంతా కొత్త బిజినెస్ ఐడియా కోసం మేధోమథనం చేస్తున్నారు. అద్దాలన్నీ రొటీన్‌గా ఉంటు న్నాయి. కొత్తరకం అద్దం ఏదైనా తయారు చేద్దామన్నది ఆ మీటింగ్ ఉద్దేశం. అంతలో ఓనర్‌కు తటాలున ఒక ఐడియా తట్టింది. దాన్ని ప్రకటించగానే మిగతా భాగస్వాములంతా సంతోషంగా ఆమోదించారు. ‘‘నువ్వు వెంటనే ఆ ఫార్ములా ఏమిటో తెలుసుకొని ఆ తరహా అద్దాలు తయారు చెయ్. ఇక పిచ్చి సేల్స్. బ్లాకులో అమ్మినా అమ్ముతారు’’ అని ఆదేశించాడు కంపెనీ ఓనర్. వెంటనే రీసెర్చ్ అండ్ డెవెలప్మెంట్ వాళ్లను పిలిపించారు. అందులో ఒక చీఫ్ సైంటిస్టుకూ ఆ ఐడియా విపరీతంగా నచ్చింది. ‘‘భలే వచ్చింది సార్ మీకు ఐడియా. ఈ ఐడియాకు ఇన్స్పిరేషన్ ఏదైనా ఉందా?’’ అడిగాడు సైంటిస్ట్. ‘‘ఏమీ లేదయ్యా. రాత్రి మాయా బజార్ సినిమా చూశా. అందులోని పాత్ర ధారులంతా ఒక అద్దంలోకి చూస్తుంటారు కదా. మన టీవీలాంటిదే కదా ఆ అద్దం అనిపించింది మొదట్లో. కానీ తర్వాత గబుక్కున ఒక ఐడియా వచ్చింది. ఆ సినిమాలో ఉన్న తరహా మిర్రర్స్ చేసి అమ్మాం అనుకో.. సావిత్రికి ఏఎన్నార్ కనిపించినట్టు... దానిలోకి చూసిన వాళ్లందరికీ వాళ్ల లవర్స కనిపిస్తారని చెప్పామనుకో... ఇక అందరూ దాని కోసం ఎగబడతారు. ఓల్డేజి వాళ్లూ తమ లవర్స్ ఎవరో చూసుకోడానికి ఉవ్వి ళ్లూరుతారు. ‘వాలెంటైన్స్ డే’ నాడు ఈ ‘లవర్స్ మిర్రర్స్’ను మార్కెట్లోకి రిలీజ్ చేస్తే సందర్భానికి తగినట్లుగా కూడా ఉంటుంది’’ అన్నాడు మిర్రర్స్ అండ్ ఎర్రర్స్ యజమాని సంతోషంగా. ‘‘చాలా బాగుంటుంది సార్. అసలు ఐడియా వినడానికే ఎక్సైటింగ్‌గా ఉంది. అంతెందుకు, నా లవర్‌ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఉంది సార్’’ అన్నాడు అప్పుడే చేరిన యంగ్ అప్రెంటిస్ ఒకడు. ‘‘ఈ బిజినెస్ ఐడియా సూపర్‌గా ఉంది సార్. మారేజ్ బ్యూరోలూ, మ్యాట్రి మోనియల్ కంపెనీలకూ అమ్మవచ్చు. నిజానికి మనం అమ్మాల్సిన అవసరం లేదు సార్. తమ దగ్గర ఇలాంటి సదు పాయం ఉందనీ, సంబంధాలు వెతకడం అంతా షార్ట్‌కట్‌లో అయిపోతుందని వాళ్లంతా మనకు బోలెడు ఆర్డర్స్ ఇస్తారు’’ అన్నాడు బిజినెస్ డెవెలప్మెంట్ వింగ్ అధికారి. ‘‘అవున్సార్. మన టీవీ యాడ్స్‌లో ఈ క్లిప్పింగ్నూ చూపిద్దాం. ‘శశిరేఖకు అభిమన్యుడు, మరి మీకు ఎవరు...?’ అనేది మన టీవీ యాడ్ క్యాంపెయినింగ్ క్యాప్షన్. యూత్‌ను ఆక ర్షించే పవర్ఫుల్ స్లోగన్స్ కూడా తయారు చేద్దాం’’ అన్నాడు క్రియేటివ్ డెరైక్టర్. ‘‘నిజమే సార్. బ్రాండ్ అబాసిడర్స్గా స్టార్సని తీసుకోవాలి. మీరు చెప్పిన మాయాబజార్లోని శ్రీకృష్ణుడినే తీసుకుంటే దిగులే లేదు. పైగా ఆయన తనను లవ్ చేసిన రుక్మిణిని చేసుకున్నాడు. సొంత చెల్లెలు సుభద్ర అర్జునుడిని లవ్ చేస్తే వాళ్లకి పెళ్లి చేశాడు. అన్న కూతురు శశిరేఖ, చెల్లెలి కొడుకు అభిమన్యుడిని లవ్ చేస్తే అదీ సక్సెస్ అయ్యేలా చేశాడు. ఆ సినిమా చూసే కద్సార్ మీకు ఈ ఐడియా వచ్చింది’’ అన్నాడు మరో సబార్డినేట్. ‘‘వాట్ యాన్ ఐడియా సర్జీ’’ అన్నాడు మరో ఉద్యోగి. ‘‘ఇదంత వర్కవుట్ కాదనుకుంటా సర్’’ ఆ సంతోషపు మూడ్స్ చెడగొడుతూ మూల నుంచి ఒక గొంతు వినిపించింది. ‘‘ఏం మాట్లాడుతున్నారండీ...’’ అంటూ ఒక్కసారే అరిచారంతా. బాస్ ఐడియాను మెచ్చుకోని వాళ్లంతా మూకుమ్మడిగా ఆ గొంతు తాలూకు ఓనర్ ఎవరా అని ఆ వైపునకు తిరిగారు. అందరూ అవుననే దాన్ని ఎవడైతే కాదంటాడో వాడే రాంబాబు. ‘‘అయినా ఎంత ధైర్యం... ఇంత సేలబుల్ ఐడియాను బాస్ చెబితే కాదం టారా? పైగా అంత క్రియేటివ్ ఫ్యాంటసీ అద్దాన్ని రియల్‌గా తయారు చేయ బోతుంటే... తయారు కాకముందే ఆ అద్దాన్ని బద్దలు కొడు తున్నారా? హౌ శాడ్’’ అంటూ నిట్టూర్చారు ఒకరిద్దరు. ‘‘అవున్సార్. ఇది ఫ్యాంటసీ రియాలిటీ అయినా... అది అందు బాటులోకి రాకముందే ప్రొడక్ట్ చచ్చి పోతుంది సార్. ఇందులో పెద్ద ఆలో చించాల్సిందేమీ లేదు, చిన్న లాజిక్.’’ ‘‘మీకు మాత్రమే తెలిసిన ఆ లాజిక్ ఏమిటో?’’ వ్యంగ్యంగా అడిగాడు ఓనర్. ‘‘ఏమీ లేదు సార్. మీరు మీ లవర్ ఎవరో అందులో చూస్తారు. మీ ఆవిడ అదే మిర్రర్‌లోకి చూసినప్పుడు... ఇంకెవడో గానీ కనపడితే ఏముంద్సార్. కాపురం కొలాప్స్. అదే ఈ మిర్రర్‌లోని ఎర్రర్’’ అన్నాడు రాంబాబు. - యాసీన్ -
వంటింటికి వన్నె
సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు వంట గదిలో వెండితో చేసిన పాత్రలు, గ్లాసులుండటం దర్పానికి సంకేతం. మరి నేడో.. వంట గదిలో విలువైన లోహపు సామగ్రిని పక్కకు తోస్తూ క్రిస్టల్ వేర్స్ రంగప్రవేశం చేశాయి. వీటిని బహుమతులుగానూ ఇవ్వటం స్టేటస్ సింబల్‌గా మారింది. దీంతో ప్రస్తుతం వంట గది మరింత వన్నెలద్దుకుంటోంది. ఫ్రాన్స్, ఇంగ్లండ్, జర్మనీ, చైనా, ఇటలీ, రష్యాలకు చెందిన పలు భిన్నమైన క్రిస్టల్ వేర్స్‌ని అమ్మకానికి సిద్ధం చేశారు వ్యాపారులు. చెకోస్లోవియా, రష్యా కంపెనీలైతే ఇంటిని అలంకరించుకునే క్రిస్టల్ వస్తువులను తయారుచేస్తున్నాయి. ఈ కంపెనీలు తయారుచేస్తున్న భారీ షాండ్లీయర్లు కొనుగోలుదారుల్ని ఆకర్షిస్తున్నాయి కూడా. - నాణ్యమైన క్రిస్టల్ వస్తువులపై గీతలు పడవు. కింద పడినా పగలవు. వీటిని అధికమైన రాపిడికి గురి చేసినప్పుడు వెంట్రుక వాసి పరిమాణంతో నిప్పు రవ్వలను వెదజల్లుతుంది. ఇవన్నీ క్రిస్టల్ ఉత్పత్తుల నాణ్యతకు పరీక్షలు. నాణ్యమైన క్రిస్టల్ వస్తువుల్ని కళాకారులు హస్త నైపుణ్యంతో రూపొందిస్తారు. వీటి తయారీలో రసాయనాలు, యంత్రాలు వాడరు. - డిటర్జెంట్స్, ఆమ్లాలు, స్ప్రేలను క్రిస్టల్ వస్తువులపై ఉపయోగించరాదు. ఎందుకంటే రసాయనాలు క్రిస్టల్ వస్తువుల కాంతిని, పారదర్శకతను తగ్గిస్తాయి. గోరువెచ్చని నీటితో మాత్రమే వీటిని శుభ్రం చేయాలి. నిమ్మరసం తగలరాదు. కాలక్రమంలో క్రిస్టల్ వస్తువులు లేత గులాబీ రంగులోకి మారడాన్ని రోజ్ చిప్పింగ్ అంటారు. అయితే దీన్ని సులభంగా నివారించవచ్చు. క్రిస్టల్ వస్తువులను శుభ్రం చేసిన తర్వాత వాటిపై తడి లేకుండా మెత్తని గుడ్డతో తుడిస్తే మంచిది. -
ఆలోచిస్తే చాలు... ఫొటో తీసి ఫేస్బుక్లో పెడుతుంది!
కళ్లజోడుతో హ్యాండ్స్ ఫ్రీ కంప్యూటర్‌గా.. పేరుపొందిన గూగుల్ గ్లాస్‌కు మరో కొత్త హంగు వచ్చి చేరనుంది. గూగుల్ గ్లాస్‌ను పెట్టుకుని ఓ దృశ్యాన్ని చూస్తూ జస్ట్ ఆలోచిస్తే చాలు.. గూగుల్ గ్లాస్ ఆ దృశ్యాన్ని క్లిక్‌మనిపించడంతో పాటు దానిని ఫేస్బుక్లో కూడా పోస్టు చేయనుంది. ఇందుకు ఉపయోగపడే ‘మైండ్ఆర్డీఆర్’ అనే మొబైల్ అప్లికేషన్‌ను లండన్‌కు చెందిన ‘దిస్ ప్లేస్’ కంపెనీ అభివృద్ధిపర్చింది. సెన్సర్‌తో కూడిన చిన్న హెడ్‌సెట్‌తో ఈ యాప్ పనిచేస్తుంది. ఈ హెడ్సెట్ ధరించినవారి మెదడులో తరంగాలను విశ్లేషిస్తుంది. మనం గూగుల్ గ్లాస్ పెట్టుకుని ఏదైనా ఓ దృశ్యాన్ని చూస్తున్నప్పుడు గ్లాస్ తెరపై కనిపించే దృశ్యంపై ఓ గీత ప్రత్యక్షమవుతుంది. ఆ గీతను అలాగే చూస్తూ ‘ఫొటో తీసుకోవాలి. ఫేస్బుక్లో పోస్టు చేయాలి’ అని అనుకుంటే చాలు.. ఆటోమేటిక్‌గా ఫొటోను క్లిక్‌మనిపించి ఇది ఫేస్బుక్లో పోస్టు చేసేస్తుందని దిస్ ప్లేస్ క్రియేటివ్ డెరైక్టర్ క్లూ కిర్టన్ చెబుతున్నారు. శారీరక వికలాంగులు, ఇతర లోపాలు ఉన్నవారికి ఈ యాప్ బాగా ఉపయోగపడుతుందని అంటున్నారు. అయితే.. ఈ యాప్‌ను వాడేందుకు గూగుల్ గ్లాస్వారు ఇంకా ఆమోదం తెలపాల్సి ఉంది. -
ఈ కళ్లజోడుతో రేచీకటి పరార్....
దృష్టిలోపం, రేచీకటి ఉన్న వ్యక్తులు ఇక రాత్రిపూట లేదా వెలుతురు తక్కువగా ఉన్న సమయంలో అడుగు ముందుకు వేయడానికి తడుముకోనక్కరలేదు. అధునాతనమైన ఈ కళ్లజోడును పెట్టుకుంటే చాలు.. ఎదురుగా ఉన్న వస్తువులు, అడ్డంకులు వారికి ఎంచక్కా కనిపిస్తాయి. కళ్లజోడు ఫ్రేముపై ఉండే వీడియో కెమెరా ఎదురుగా ఉన్న దృశ్యాలను చిత్రీకరిస్తుంది. వాటిని ఫోన్మాదిరిగా జేబులో పెట్టుకునేంత చిన్నగా ఉండే ఓ కంప్యూటర్ ప్రాసెసింగ్ యూనిట్ విశ్లేషిస్తుంది. ఎదురుగా ఉన్న వస్తువులను స్పష్టమైన చిత్రాలుగా మలచి కళ్లజోడు అద్దాలపై ప్రత్యక్షమయ్యేలా చేస్తుంది. కుర్చీలు, బల్లలు, మనుషులు, జంతువుల వంటివాటినీ ఈ కంప్యూటర్ యూనిట్ ప్రత్యేకంగా గుర్తిస్తుంది. అయితే ఇది పూర్తిగా చూపును కోల్పోయినవారికి ఉపయోగపడకపోయినా.. స్వల్ప దృష్టిలోపం, రేచీకటి వంటి సమస్యలతో బాధపడుతున్నవారికి బాగా సాయపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. దీనిని 20 మంది చూపుమందగించిన వలంటీర్లు ధరించగా వారికి బాగా ఉపయోగపడిందని, భవిష్యత్తులో వీటిని మామూలు కళ్లజోడు స్థాయికి తగ్గిస్తామని దీనిని తయారుచేసిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకుడు స్టీఫెన్ హిక్స్ వెల్లడించారు. -
ఓల్డ్ ఈజ్ గోల్డ్..
మంచిర్యాల అర్బన్, న్యూస్‌లైన్ :ఒకప్పుడు మహాత్మగాంధీ ధరించిన కళ్లజోడు ఫ్రేంకు బాగా ఆదరణ ఉండేది. గాంధీజీ ఆశయ సిద్ధాంతాలనే కాకుండా ఆయన పెట్టుకునే అద్దాల మోడల్‌ను ఆదర్శంగా తీసుకునే వారు. గుండ్రటి ఫ్రేంతో కూడిన అద్దాలు గాంధీజీ ధరించేవారు. చాలా మంది అలాంటి ఫ్రేంతో కూడిన అద్దాలను పెట్టుకోవడానికి మక్కువ చూపేవారు. యువకులు మొదలుకొని వృద్ధుల వరకు అలాంటి ధరించేవారు. అలా గాంధీ అద్దాలు చాలా పాపులర్ అయ్యాయి. ఆ ట్రెండ్ కొన్ని దశాబ్దాల పాటు కొనసాగింది. గోల్డ్ ఫ్రేంలు.. తదుపరి గోల్డ్ ఫ్రేంలు వచ్చాయి. ఆర్థికంగా వెసులుబాటు ఉన్నవారు గోల్డ్‌కలర్ ఫ్రేం అద్దాలను పెట్టుకునేవారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న వారు పెద్దసైజులో ఉన్న ఫ్రేం అద్దాలు ధరించేవారు. గోల్డ్‌కలర్ ఫ్రేం అద్దాలు పెట్టుకున్న వారు ఆర్థికవంతులు అనే భావన కలిగించేది. ఆ రోజుల్లో ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులు, సినీనటులు, పారిశ్రామికవేత్తలు మాత్రమే వాటిని ధరించేవారు. మెటల్ఫ్రేంలు... అనంతరం మెటల్‌తో తయారు చేసిన ఫ్రేంల వాడకంలోకి వచ్చాయి. ఫైబర్‌తో కాకుండా మెటల్ ఫ్రేంలు ఫ్యాషన్‌గా మారాయి. ఫ్రేంలు ఎక్కువకాలం వినియోగంలో ఉండడం.. అద్దాలకు రక్షణగా ఉండడంతో వాటిని కొనుగోలు చేసేందుకు ఇష్టపడేవారు. మెటల్ ఫ్రేంల వాడకం ఇప్పటి కీ గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తూనే ఉంటుంది. ఆఫ్ ఫ్రేం అద్దాలు.. నెక్స్ట్ జనరేషన్లో ఆఫ్ఫ్రేం అద్దాలు ఫ్యాషనయి పోయింది. ప్రస్తుతం ఆ ట్రెండ్ ఇంకా నడుస్తూనే ఉంది. ఇలాంటి ఫ్రేంతో బరువు కొంత వరకు తగ్గడంతో ఎక్కువగానే ఆసక్తి చూపుతున్నారు. ఫ్రేం లేకుండా అద్దాలు... మారుతున్న కాలానికి అనుగుణంగా కళ్లజోడుల ఫ్రేంల మోడల్స్ కూడా మారుతూ వచ్చాయి. బరువుతో కూడిన ఫ్రేంలు కాకుండా తేలికపాటి బరువు ఉండే అద్దాలను పెట్టుకునేందుకు మక్కువ చూపారు. అలా పుట్టుకవచ్చిందే ఫ్రేం లేకుండా కళ్ల అద్దాలు. వీటిని త్రీపీస్ ఫ్రేం అంటారు. ఫ్రేం లేకుండా ఫైబర్‌తో కూడిన అద్దాలను అమరుస్తారు. ముఖానికి అద్దాలు పెట్టుకున్న భావనే కలగదు. ఇలాంటి ఫ్రేం అద్దాలు కొంత ధర ఎక్కువగా కాగా వాటిని వినియోగించడం కూడా సున్నితమైందే. నాడు వృద్ధులు.. నేడు యువకులు... ఒకప్పుడు వృద్ధులు సైతం పెద్దసైజు ఫ్రేం అద్దాలను పెట్టుకోలేక ఓ దశలో పక్కనపెట్టారు. ప్రస్తుతం అలాంటి ఫ్రేంతో కూడిన అద్దాలే ఫ్యాషన్‌గా మారాయి. కళ్లకు రక్షణ ఇవ్వడంతోపాటు ముఖానికి అందంగా కనిపిస్తాయి. అంతేగాకుండా ఫ్రేంలు విరిగిపోకుండా ఎక్కువ కాలం ఉంటాయి. యువతీ యువకులు అలాంటి ఫ్రేం కళ్లజోళ్లనే ధరిస్తున్నారు. అందుకే వీటికి డిమాండ్ కూడా పెరిగింది. సినిమాల ప్రభావం... సినిమాల ప్రభావం యువతపై ఎక్కువగా చూపుతోంది. సినిమా హీరోలు ఎలాంటి దుస్తులు, చెప్పులు, బూట్లు ధరిస్తే అలాంటివే వేసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. ఆ ట్రెండ్ కాస్త కళ్లజోడులను కూడా వదల్లేదు. గతంలో వృద్ధులు ధరించిన పెద్ద సైజ్ ఫ్రేం అద్దాలు.. ఇటీవల ఓ సినిమాలో ఓ స్టార్ హీరో ధరించాడు. అంతే ప్రస్తుతం ఎవరి మొఖాన చూసినా ఆ అద్దాలే కనిపిస్తున్నాయి. విటమిన్ల లోపంతో దృష్టి సమస్య.. గతంతో పోలిస్తే ఈ మధ్యకాలంలో కంటి అద్దాలు వాడేవారి సంఖ్య పెరుగుతోంది. అందుకు కారణం విటమిన్ల లోపమని వైద్యులు పేర్కొంటున్నారు. విటమిన్ ఏ లోపంతో చిన్న వయసు నుంచే కంటి సమస్యలు వస్తున్నాయి. దీంతో కళ్లద్దాలకు డిమాండ్ పెరిగింది. కంటికి రక్షణతోపాటు ముఖానికి అందాన్ని ఇచ్చే ఫ్రేంలను ఎంపిక చేసుకుంటున్నారు. రకరకాల మోడల్స్ మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి. -
కళ్లజోడు వాడుతుంటే మెడనొప్పి...
నా వయసు 48. నేను బై-ఫోకల్ కళ్లజోళ్లు ఉపయోగించి కంప్యూటర్ మీద పని చేస్తుంటాను. దాంతో స్క్రీన్‌వైపు చూడాలంటే తల బాగా ఎత్తి కింది అద్దాల్లోంచి చూడాల్సి వస్తోంది. ఫలితంగా కళ్లు అలసిపోవడం, మెడనొప్పి వచ్చి చాలా బాధపడుతున్నాను. అలా నొప్పులు తీవ్రమైనప్పుడు తలనొప్పిగా కూడా ఉంటోంది. దయచేసి నా సమస్యకు పరిష్కారం చెప్పండి. - గోపాల్‌రావు, అమలాపురం కంప్యూటర్ మీద పనిచేసే సమయంలో బైఫోకల్ కళ్లజోడు నుంచి చూడాల్సి వచ్చినప్పుడు తల బాగా పెకైత్తి చూడటంతో మీరు చెప్పిన సమస్యలు వచ్చి బాధపడేవారు చాలామందే ఉన్నారు. అందుకే మీరు కంప్యూటర్ మీద పని చేసేటప్పుడు ముందుగా బై-ఫోకల్ కళ్లజోళ్లు వాడటం మానేయ్యండి. ఎందుకంటే బైఫోకల్ కళ్లజోడు వాడే సమయంలో తల పైకి, కిందకి ఎక్కువ సార్లు కదపాల్సి రావడంతో మెడనొప్పి వస్తుంటుంది. మీ నొప్పి ముఖ్యంగా మెడ వల్ల వస్తుంది గాని నిజానికి కళ్లకు కాకపోవచ్చు. అయితే ఆ భాగంలో వచ్చిన నొప్పి తలనొప్పిగా కూడా మీకు అనిపిస్తుండవచ్చు. అందుకే మీ కంప్యూటర్ వాడకం కోసం ఒక రీడింగ్ గ్లాస్‌ను సిద్ధంగా ఉంచుకోండి. బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు తప్ప మిగతా అన్ని సమయాల్లో మీరు రీడింగ్ గ్లాసెస్‌ను మాత్రమే వాడండి. దాంతో కళ్లకు శ్రమ తగ్గుతుంది. ఇక ఒకసారి మీ కంటివైద్య నిపుణుడిని సైతం ఒకసారి కలిసి మీకు రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా అని పరీక్షించుకోండి. డాక్టర్ భక్తియార్ చౌదరి స్పోర్ట్స్ మెడిసిన్, ఫిట్నెస్ నిపుణుడు, హైదరాబాద్