ముంబై: టీమిండియా మణికట్టు స్పిన్నర్ యజువేంద్ర చాహల్ ఇటీవల వాండరర్స్ లో జరిగిన టీ20 మ్యాచ్లో కళ్లజోడుతో కనిపించాడు. చాహల్ బౌలింగ్ లేదా బ్యాటింగ్ చేసేటప్పుడు కళ్లద్దాలు ఉపయోగించాడు. ఫీల్డిండ్ చేసేటప్పుడు మాత్రమే వాడుతున్నాడు. ఈ విషయం వెనుక ఉన్న నిజాన్ని అతడి తండ్రి బయటపెట్టారు. ‘ దక్షిణాఫ్రికా టూర్‌కు వెళ్లే ముందు చాహల్ కంటి వైద్యుడిని సంప్రదించాడు. కేవలం డాక్టర్ చెప్పడం వల్లే తన కుమారుడు కళ్లజోడు ధరిస్తున్నాడు. చాహల్ కంటిచూపు మంచిగా ఉంది. కానీ అరుదుగా వాడమని వైద్యుడు సలహా ఇచ్చాడు’ అని తెలిపాడు.
ప్రస్తుతం ఇండియా టీంలో చాహల్ మాత్రమే గ్లాసెస్ ఉపయోగిస్తున్నాడు. టీమిండియా విజయాల్లో ఇటీవల చాహల్ కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. కెప్టెన్ విరాట్ కోహ్లి, కీపర్ మహేంద్ర సింగ్ ధోనిలు కూడా బయట గ్లాసెస్ వాడుతారు. మ్యాచ్ జరిగే సమయంలో మాత్రం వారు కళ్లద్దాలు ఉపయోగించరు. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, స్పీన్నర్ వెటోరి కూడా మ్యాచ్‌లో నిత్యం కళ్లజోడు ధరించేవాడు. నేడు సెంచూరియన్‌లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0తో అధిక్యంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment