
ప్రముఖ యూట్యూబర్, ఆర్జే మహ్‌వశ్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి మొదలైన చర్చ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్‌తో దుబాయ్ స్టేడియంలో మెరవడంతో ఒక్కసారిగా వీరిద్దరిపై చర్చ మొదలైంది. ఈ జంట డేటింగ్ ఉన్నారంటూ పలు కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే మరోసారి ఆర్జే మహ్‌వశ్ వార్తల్లో నిలిచింది. ఇటీవల లక్నోలోని ఓ హోటల్‌లో స్విమ్మింగ్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. అయితే చాహల్ ఐపీఎల్ మ్యాచ్ కోసమే తాను అక్కడికి వెళ్లిందని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
తనపై వస్తున్న డేటింగ్ వార్తల నేపథ్యంలో తాజాగా ఆర్జే మహ్‌వశ్ షేర్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఆమె పోస్ట్ చేసిన రీల్‌లో తన జీవితంలో రాబోయే వ్యక్తి గురించి ప్రస్తావించింది. నా లైఫ్‌లోకి వచ్చిన వ్యక్తే నా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్‌తో పాటు తనే నా భర్త కూడా అవుతాడు.. అంతేకాదు నేను అతని చుట్టూ తిరుగుతానంటూ మాట్లాడింది. అయితే ఈ వీడియోకు క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ లైక్ కొట్టాడు. దీంతో మీ జీవితంలో యుజ్వేంద్ర చాహల్ రాబోతున్నారా? అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఇటీవలే చాహల్‌కు తన భార్య ధనశ్రీ వర్మతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.
కాగా.. యుజ్వేంద్ర చాహల్ ప్రస్తుతం ఐపీఎల్ లీగ్‌తో బిజీగా ఉన్నారు. పంజాబ్ కింగ్స్ తరఫున ఐపీఎల్ ఆడుతున్నారు. ఇటీవల లక్నోలో జరిగిన మ్యాచ్ కోసం ఆర్జే మహ్‌వశ్ అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆర్జే వరుసగా సోషల్ మీడియా పోస్టులు పెట్టడంతో వీరిద్దరిపై డేటింగ్ రూమర్స్ మరోసారి నెట్టింట వైరలవుతున్నాయి.