ఫ్రీ బేసిక్స్ సర్వీసును ఆపండి.. | Put FB's Free Basics service on hold, TRAI tells Reliance Communications | Sakshi
Sakshi News home page

ఫ్రీ బేసిక్స్ సర్వీసును ఆపండి..

Published Thu, Dec 24 2015 2:36 AM | Last Updated on Sun, Sep 3 2017 2:27 PM

ఫ్రీ బేసిక్స్ సర్వీసును ఆపండి..

ఫ్రీ బేసిక్స్ సర్వీసును ఆపండి..

రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు ట్రాయ్ ఆదేశం
 న్యూఢిల్లీ:
ఫ్రీ బేసిక్స్ సేవల చార్జీల అంశం తేలేంత వరకూ ఈ సర్వీసులను వాణిజ్యపరంగా ప్రవేశపెట్టడాన్ని నిలిపివేయాల్సిందిగా రిలయన్స్ కమ్యూనికేషన్స్‌ను (ఆర్‌కామ్) ట్రాయ్ ఆదేశించింది. ఈ సర్వీసులకు సంబంధించిన నియమ, నిబంధనల వివరాలు ఇవ్వాలంటూ కంపెనీని ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇంటర్నెట్ మాధ్యమానికి ప్రాచుర్యంలోకి తెచ్చేదిగా పేర్కొంటూ... సోషల్ నెట్‌వర్కింగ్ సైటు ఫేస్‌బుక్.. డేటా చార్జీల ప్రసక్తి లేకుండా కొన్ని వెబ్‌సైట్లను ఉచితంగా అందించేందుకు ఫ్రీ బేసిక్స్ సర్వీసును తెరపైకి తీసుకొచ్చింది.
 
  ఇందుకోసం భారత్‌లో ఆర్‌కామ్‌తో చేతులు కలిపింది. అయితే, ఫ్రీ బేసిక్స్ అనేది నెట్ న్యూట్రాలిటి (వెబ్‌సైట్ల విషయంలో వివక్ష చూపకుండా తటస్థంగా వ్యవహరించడం) నిబంధనకు విరుద్ధంగా ఉందని వివాదం రేగిన సంగతి తెలిసిందే. దీనికి తోడు ఈ సేవలకు సంబంధించి వివిధ కస్టమర్ల నుంచి వివిధ రకాలుగా వసూలు చేసే చార్జీలు, నియమ నిబంధనలు, షరతుల వివరాలు ఇచ్చే దాకా ఈ సేవలను ఆపేయాలంటూ డిసెంబర్ 1న ఆర్‌కామ్‌కు ట్రాయ్ సూచించింది.
 
  డిసెంబర్ 7న ట్రాయ్‌కి లేఖ రాసిన ఆర్‌కామ్.. డిసెంబర్ 9 దాకా గడువు కోరింది. కానీ ఆ తర్వాత స్పందించలేదు. దీంతో ట్రాయ్ మరోసారి లేఖ రాసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు, ట్రాయ్ ఆదేశాల మేరకు అనుమతులు వచ్చేదాకా ఫ్రీ బేసిక్స్ వాణిజ్యపరమైన సర్వీసుల ప్రారంభాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు ఆర్‌కామ్ వర్గాలు తెలిపాయి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement