సలాం సిద్ధిఖ్ భాయ్ | Salam Bhai siddhikh | Sakshi
Sakshi News home page

సలాం సిద్ధిఖ్ భాయ్

Published Fri, Jun 24 2016 11:55 PM | Last Updated on Sat, Jul 6 2019 3:18 PM

సలాం సిద్ధిఖ్ భాయ్ - Sakshi

సలాం సిద్ధిఖ్ భాయ్

రూ.7.50కే ప్లేట్ టిఫిన్ విక్రరుుస్తున్న చిరువ్యాపారి
నిత్యావసరాల ధరలు మండిపోతున్నా తక్కువ రేటుకే అల్పాహారం
కూలీలు, పేదలకు అండగా నిలుస్తున్న మానుకోట వాసి

 

మహబూబాబాద్ :  మానుకోటలో ఎక్కడికి వెళ్లినా ప్లేట్ టిఫిన్ ధర రూ.20కి తగ్గకుండా ఉంటుంది. కానీ.. పట్టణంలోని తొర్రూరు బస్టాండ్ సమీపంలో ఉన్న సిద్ధిఖ్ సెంటర్‌కు వె ళ్తే మాత్రం రూ.7.50కే ప్లేట్ టిఫిన్ దొరుకుతుంది. నిత్యావసరాల ధరలు మండిపోతున్నా సెంటర్ నిర్వాహకుడు కొన్నేళ్లుగా అల్పాహారం ధరను పెంచకుండా అన్ని వర్గాల ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారు. మానుకోటకు చెందిన మహ్మద్ సిద్ధిఖ్, నూరున్నీసాబేగం దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పట్టణంలోని కొండపల్లి గోపాల్‌రావునగర్‌కాలనీలో ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఆయన చిన్నఇల్లు నిర్మిం చుకుని వారు జీవనం సాగిస్తున్నారు. సిద్ధిఖ్ 20 ఏళ్ల క్రితం స్థానికంగా ఉన్న ఓ హోటల్‌లో వర్కర్‌గా పనిచేశారు. అరుుతే అనుకోకుండా జరిగిన ఓ ప్రమాదంలో ఆయన వెన్నెముక దెబ్బతినడంతో పాటు కుడికాలు విరిగింది. దీంతో అప్పటినుంచి బరువైన పనులు చేయలేకపోతున్నా రు. ఈ క్రమంలో కుటుంబపోషణ కోసం తొలు త తొర్రూరు బస్టాండ్ సమీపంలో తోపుడు బం డిపై అల్పాహారం (టిఫిన్) విక్రయూలను ప్రా రంభించారు. అనంతరం కొంతకాలానికి అక్క డే గుమ్చీని ఏర్పాటు చేసుకుని అందులో రోజు ఉదయం వేళలో టిఫిన్లను అమ్ముతున్నారు.

2006లో టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేసినప్పుడు రూ. 5కే ప్లేట్ ఇడ్లీ (నాలుగు), రూ.5 కే ప్లేట్ దో శ అమ్మారు. మూడేళ్ల క్రితం నుంచి ఇడ్లీ, దోశ ప్లేట్ రేటును స్వల్పంగా రూ.7.50కు పెంచడం తో కూలీలు, హమాలీలు, ప్రయూణికులు తక్కు వ ధరకు అల్పాహారాన్ని చేసేందుకు ఆసక్తి చూ పుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో మినపప ప్పు ధర కిలోకు రూ.200, ఇడ్లీ రవ్వ కిలోకు రూ.25, పల్లీలు కిలోకు రూ.90, మిర్చి కిలో రూ.70 పలుకుతున్నారుు. అరుునప్పటికీ రూ.7.50కే ప్లేట్ టిఫిన్ అందిస్తున్న సిద్ధిఖ్‌ను వినియోగదారులు అభినందిస్తున్నారు.

 

నిర్వహణ ఖర్చులు తగ్గుతున్నందుకే..
సిద్ధిఖ్ తక్కువ రేటుకు టిఫిన్ విక్రరుుంచేందుకు ఓ కారణముంది. అది ఏమంటే ఆయన కుటుంబ సభ్యులంతా టిఫిన్ సెంటర్ నిర్వహణకు రోజు సాయం చేస్తుంటారు. అల్పాహారం తయూరీకి కావాల్సిన పిండి, తదితర పదార్థాలను ఇంటివద్దే ిసిద్ధిఖ్ భార్యతో పాటు కూతుళ్లు సిద్ధం చేస్తుంటారు. ఇద్దరు కుమారులు ఇడ్లీ బండి వద్ద తండ్రికి చేదోడుగా ఉంటారు. పెద్ద కుమారుడు సాజిద్ పదో తరగతి పూర్తి చేసి సెంటర్‌లో పనిచేస్తున్నాడు. చిన్న కుమారుడు వాజిద్ ఐటీఐ చదువుతూ 10 గంటల వరకు సెంటర్‌లో పనిచేసి కాలేజీకి వెళ్తుంటాడు. ఉద యం 6 నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు ప్రతిరోజూ ఇడ్లీ, దోశ కలిపి 200 ప్లేట్ల విక్ర యూలు జరుగుతాయన్నారు. ఇంటిల్లిపాది సెంటర్ నిర్వహణకు సహ కరిస్తుండడంతో నిర్వహ ణ ఖర్చులు తగ్గుతున్నాయని, అందుకే తక్కువ ధరకు టిఫిన్ విక్రయిస్తున్నానని చెప్పారు.

 

కూలీ మాత్రమే గిట్టుబాటు
నా భార్య, పిల్లలందరూ సహకరిస్తుండడంతోనే ఇన్నాళ్లుగా తక్కువ రేటుకు టిఫిన్ తయూరుచేసి విక్రరుుస్తున్నా. టిఫిన్ సెంటర్ ద్వారా మాకు పెద్దగా ఆదాయం రాదు. కేవలం కూలీ మాత్రమే గిట్టుబాటు అవుతుంది. తెల్లవారుజామున 3 నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు కుటుంబ సభ్యులమంతా కష్టపడితే అన్ని ఖర్చులు పోనూ రూ.500 మిగులుతారుు. ఎక్కువ ఆదాయం సంపాదించాలనే ఆలోచన లేదు. నిరుపేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు తక్కువ రేటు టిఫిన్ ఇవ్వాలనేదే నా లక్ష్యం.  - మహ్మద్ సిద్ధిఖ్, టిఫిన్ సెంటర్ నిర్వాహకుడు, మానుకోట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement