legally binding security guarantees if NATO shut the Door: రష్య ఉక్రెయిన్‌పై తన దాడిని ఏడో రోజు కూడా కొససాగిస్తూనే ఉంది. ప్రస్తుతం ప్రజా ఆవాసాలపై కూడా దాడి చేసి రాజధాని కైవ్‌లోకి చొరబడేందుకు యత్నిస్తోంది. ఇప్పటికే పలు నగరాలలోకి బలగాలు చొరబడ్డాయి. దీంతో ఉక్రెయిన్ అద్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ అర్థవంతమైన చర్చలు జరిగేందుకైన ముందు ఉక్రెయిన్‌లోని నగరాలపై దాడి చేయడం ఆపేయాలని అన్నారు. కనీసం ప్రజలపై బాంబు దాడి చేయడం ఆపేయాలని విజ్ఞప్తి చేశారు.
అంతేకాదు ఉక్రెయిన్‌ను నాటోలోకి తీసుకోవడానికి సిద్ధంగా లేకున్నా.. రష్యా ఉక్రెయిన్ నాటోలో ఉండకూడదనుకుంటే గనుక కనీసం ఉక్రెయిన్‌కు చట్టబద్ధంగా కట్టుబడి ఉండే భద్రతా హామీలను రూపొందించాలి అని భాగస్వామ్య దేశాలను జెలెన్ స్కీ కోరారు. ఉక్రెయిన్ పతనమైతే ఈ రష్యన్ దళాలన్నీ మీ నాటో సభ్య దేశాల సరిహద్దుల్లో ఉంటాయని తెలుసుకోవడం చాలా ముఖ్యం అన్నారు. అంతేకాదు అక్కడ కూడా మీకు ఇదే ప్రశ్న తలెత్తుందని స్పష్టం చేశారు.
మరోవైపు ఉక్రెయిన్ గత వారం రష్యన్ దళాల దండయాత్రను తట్టుకోవడంలో సహాయపడటానికి నాటో సభ్యుల నుంచి ఆయుధాల రవాణాను పొందింది. అంతేగాక రష్యాను కట్టడి చేసి దిశగా పశ్చిమ దేశాలు రష్యా ఆర్థిక వ్యవస్థపై ఆంక్షలను కూడా ప్రవేశపెట్టాయి. అయితే జెలన్ స్కీ నో ఫ్లై జోన్ విధించడంతో పాటు మరిన్ని చేయాలని జెలెన్స్కీ అంతర్జాతీయ సమాఖ్యను కోరారు. రష్యా సైనిక చర్యతో త్వరితగతిన లాభలు పొందలేదని ప్రధాన నగరాలను స్వాధీనం చేసుకోలేదని స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఉక్రెయిన్ యుద్ధ భూమిలో ఒంటరిగా నిలబడి ఉందని, పైగా దాని స్వంత భద్రత పశ్చిమ దేశాలతో ముడిపడి ఉందనే విషయాన్ని గుర్తించాలన్నారు. అంతేకాదు తమకు ప్రతి రోజు యుద్ధం ఉందని, తమకు సహాయం కావాలని చెప్పారు. "నేను నా దేశం కోసం నిరంతరం పనిచేస్తున్నా, మేము మా భూమిని, మా ప్రజలను రక్షించుకునేందకు చివరి వరకు నిలబడి పోరాడుతాం. మా పిల్లల భవిష్యత్తు కోసం నిలబడతాం ". అని జెలెన్ స్కీ చెప్పారు.
(చదవండి: పుతిన్ ఆంక్షలు... రష్యన్లు దేశం విడిచి వెళ్లకుండా కట్టడి!)
Comments
Please login to add a commentAdd a comment