టీడీపీ అరాచకాలను అడ్డుకుంటాం | tdp fraud administration | Sakshi
Sakshi News home page

టీడీపీ అరాచకాలను అడ్డుకుంటాం

Published Mon, Dec 12 2016 9:58 PM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM

టీడీపీ అరాచకాలను అడ్డుకుంటాం - Sakshi

టీడీపీ అరాచకాలను అడ్డుకుంటాం

  •   వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రిరాజశేఖర్‌
  •  16వ తేదీ జగన్‌ సభను విజయవంతం చేయాలి 
  •  
    చిలకలూరిపేటటౌన్‌: టీడీపీ అరాచకాలను అడ్డుకుంటామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్‌ చెప్పారు. ఈ నెల 16వతేదీన మాజీ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి కుమారుడు మహేష్‌రెడ్డి వైఎస్సార్‌ సీపీలో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో నరసరావుపేటలో నిర్వహించే పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి సభను విజయవంతం చేసేందుకు చిలకలూరిపేట పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి  నాయకుల, కార్యకర్తల సమావేశం సోమవారం నిర్వహించారు. మర్రిరాజశేఖర్‌ మాట్లాడుతూ రోజురోజకు టీడీపీ అరాచకాలు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని వీటిని అడ్డుకొనేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. పాత నోట్లు  కేంద్రప్రభుత్వం రద్దు చేశాక అవే పాత నోట్లతో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తన అనుచరులతో భారీగా పత్తి కొనుగోళ్లు చేపట్టి నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకుంటున్నారని ఆరోపించారు. తమ పార్టీ నాయకులను కార్యకర్తలను పచ్చకండువా కప్పుకోవాలని అధికారం ఉపయోగించి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇందుకు పోలీసులను పావులుగా వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. యడ్లపాడు మండలం తిమ్మాపురంలో తమ పార్టీకి చెందిన సాంబిరెడ్డి అతని సోదరుల ఇళ్లను హైకోర్టు స్టే ఉన్నప్పటికీ అర్ధరాత్రి దౌర్జన్యంగా కూల్చివేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై న్యాయపోరాటంతోపాటు  ధర్నాలు ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. 16వ తేదీన నరసరావుపేటలో జగన్‌మోహనరెడ్డి పాల్గొనే సభను విజయవంతం చేయాలని కోరారు. 
     
    రాజన్న పాలన కోసం భేషరుతుగా.... 
    కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కాసు మహేష్‌రెడ్డి మాట్లాడుతూ జగన్‌మోహనరెడ్డి నాయకత్వంలో రాజన్నపాలన తెచ్చేందుకు భేషరుతుగా పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. ప్రజల కష్టాలు తొలగి పోవాలంటే మరో రెండేళ్లు జగన్‌ స్ఫూర్తితో కార్యకర్తలు పోరాటాలకు సిద్ధం కావాలని కోరారు. నిరంతరం ప్రజా సమస్యల కోసం ప్రజల్లో మమేకమై పోరాడుతున్న జగన్‌ స్ఫూర్తిదాయక నాయకుడని కొనియాడారు. జగన్‌ నాయకత్వంలో ప్రజా శ్రేయస్సు కోరే ప్రభుత్వం తెచ్చుకుందామని పేర్కొన్నారు. పార్టీలో చేరుతున్న తనకు ఆశీస్సులు అందజేయాలని కోరారు.
     
    నియంతృత్వ పాలనకు పరాకాష్ట ... 
     పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు డైమండ్‌ బాబు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో కక్ష సాధింపులకు పాల్పడి ఉంటే నేడు టీడీపీ మనుగడలోనే ఉండేది కాదని చెప్పారు. దుర్మార్గానికి పరాకాష్టగా నియంతృత్వ తరహా పాలన రాష్ట్రంలో కొనసాగుతున్నదని మండిపడ్డారు. పార్టీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు సయ్యద్‌ మాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక్క ముస్లింకు ఎమ్మెల్యే టికెట్, మంత్రి పదవి ఇవ్వని చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఎస్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు బండారు సాయిబాబా మాట్లాడుతూ గిన్నిస్‌బుక్‌ రికార్డు స్థాయిలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఆయన సతీమణి అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. సేవాదళ్‌ జిల్లా అధ్యక్షుడు చిన్నపరెడ్డి మాట్లాడుతూ సీబీఐ విచారణ నిర్వహిస్తే ప్రత్తిపాటి ఇంటి గోడల్లో అవినీతి డబ్బు బయట పడుతుందన్నారు. బీసీ విభాగం జిల్లా అ««ధ్యక్షుడు సునీల్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రభుత్వం బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు ఏవీఎం సుబాని, యడ్లపాడు , నాదెండ్ల పార్టీ అధ్యక్షులు కల్లూరి విజయకుమార్, గొంటు శ్రీనివాసరెడ్డి, మున్సిపల్‌ ప్రతిపక్ష నాయకుడు నాయుడు శ్రీనివాసరావు, డిప్యూటి ఫ్లోర్‌లీడర్‌ షేక్‌అబ్దుల్‌రౌఫ్, నాయకులు కంజుల వీరారెడ్డి, షేక్‌ అల్లీమియా, బైరా వెంకటకోటి, జరీనాసుల్తానా తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement