'సాక్షి' ప్రసారాలు పునరుద్దరించాలి | Journalists stage protest after stopping Sakshi TV broadcasting | Sakshi
Sakshi News home page

'సాక్షి' ప్రసారాలు పునరుద్దరించాలి

Published Sun, Jun 12 2016 9:31 PM | Last Updated on Mon, Sep 4 2017 2:20 AM

Journalists stage protest after stopping Sakshi TV broadcasting

తిరుపతి : సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతకు నిరసనగా చిత్తూరు జిల్లాలో ఆదివారం జర్నలిస్టులు, వైఎస్సార్‌సీపీ నాయకులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ఆదివారం 28 మండలాల్లో నిరసనలు, ర్యాలీలు నిర్వహించారు. తిరుపతి ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది జర్నలిస్టులు నగర వీధుల్లో నిరసన ర్యాలీ నిర్వహించి బస్టాండ్ సెంటర్‌లోని బాపూజీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.


చిత్తూరు నగరంలో వైఎస్సార్‌సీపీ, బీజేపీ, వామపక్ష పార్టీల నేతలతో పాటు వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం నాయకులు నగర వీధుల్లో మానవహారం నిర్వహించి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. తిరుపతి ఎస్వీయూ విద్యార్థులు జర్నలిస్టులకు సంఘీభావంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. జిల్లాలోని శ్రీకాళహస్తి, సత్యవేడు, పుంగనూరు, పలమనేరు, నాగలాపురం, మదనపల్లి, పెనుమూరు, కార్వేటినగరం, పాలసముద్రం, వెదురుకుప్పం మండలాల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు నిరసన ర్యాలీలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement