న్యూస్‌ చానళ్లపై నిషేధం ఎత్తేయాలి | VVR Krishnam Raju Comments On News Channels Ban In AP, More Details Inside | Sakshi
Sakshi News home page

న్యూస్‌ చానళ్లపై నిషేధం ఎత్తేయాలి

Published Tue, Jun 25 2024 3:29 AM | Last Updated on Tue, Jun 25 2024 12:15 PM

VVR Krishnam Raju Comments On News channels Ban in AP

ఏపీ ఎడిటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కృష్ణంరాజు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నాలుగు న్యూస్‌ చానళ్లపై మల్టిపుల్‌ సిస్టమ్‌ ఆపరేటర్లు (ఎంఎస్‌వోలు) విధించిన అప్రకటిత ఆంక్షలను అంతర్జాతీయ సంస్థలు తప్పుపడుతున్నాయని ఆంధ్రప్రదేశ్‌ ఎడిటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వీవీఆర్‌ కృష్ణంరాజు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశా­రు. ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా ఉన్న ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ జర్నలిస్ట్స్‌ (ఐఎఫ్‌జే) ఈ అప్రకటిత నిషేధం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిందన్నారు.

రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛకు తీవ్ర విఘాతం కలిగిందని, ప్రసారాలు తిరిగి పునరుద్ధరించడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని బ్రస్సెల్‌ కేంద్రంగా ఉన్న ఆ సంస్థ సూచించిందని వెల్లడించారు. న్యూస్‌ బ్రాడ్‌­కాస్టర్స్‌ అండ్‌ డిజిటల్‌ అథారిటీ (ఎన్‌బీడీఏ) కూడా ఈ అప్రకటిత నిషేధాన్ని ఖండించిందని తెలిపారు. కేబుల్‌ ఆపరేటర్లపై ఒత్తిడి తెచ్చి ప్ర­సా­రాలు నిలిపివేయడం టెలికాం రెగ్యులేటరీ అ­థా­రి­టీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) నిబంధన­ల­కు వి­రు­ద్ధమని చెప్పిందన్నారు.

రాష్ట్రంలోని పా­ల­కులు ఈ వ్యవ­హారంతో తమకేమీ సంబంధం లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉంద­ని తెలి­పారు. ప్ర­భు­త్వ చర్యల కారణంగా అంత­ర్జాతీయ స్థాయి­లో రాష్ట్ర ఇమేజ్‌ దెబ్బతిందని కృష్ణంరాజు ఆవే­దన వ్యక్తం చేశారు. గతంలో తెలంగాణలో కొన్ని న్యూస్‌ చానళ్ల ప్రసారాలను అక్కడి కేబుల్‌ ఆప­రేటర్లు నిలిపివే­యడాన్ని చంద్రబాబు తప్పు­ప­ట్టారన్నారు. ఆ తప్పు ఇప్పుడు రాష్ట్రంలో జరు­గు­తుంటే ఆయన తనకేమీ పట్టనట్లు వ్య­వ­హ­రిస్తు­న్నారని ఆరోపించారు.

ఉత్తరప్రదేశ్‌ వర్సెస్‌ రాజ్‌ నారాయణ్‌ కేసులో సుప్రీంకోర్టు తీర్పు­నిస్తూ.. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19(1) (ఎ), 19(1) (జి) భావ ప్రకటనా స్వేచ్ఛకు హామీ ఇస్తోందని చెప్పిందని గుర్తు చేశారు. ప్రజాహితానికి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడానికి , తెలుసు­కో­వడానికి కూడా ఆ ఆర్టికల్‌ హామీ ఇస్తోందని తెలి­పారు. కాబట్టి సాక్షి, టీవీ9, ఎన్‌టీవీ, 10టీవీలపై విధించిన అప్రకటిత నిషేధాన్ని వెంటనే తొలగించాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement