krishnamraju
-
న్యూస్ చానళ్లపై నిషేధం ఎత్తేయాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నాలుగు న్యూస్ చానళ్లపై మల్టిపుల్ సిస్టమ్ ఆపరేటర్లు (ఎంఎస్‌వోలు) విధించిన అప్రకటిత ఆంక్షలను అంతర్జాతీయ సంస్థలు తప్పుపడుతున్నాయని ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా ఉన్న ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (ఐఎఫ్‌జే) ఈ అప్రకటిత నిషేధం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిందన్నారు.రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛకు తీవ్ర విఘాతం కలిగిందని, ప్రసారాలు తిరిగి పునరుద్ధరించడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని బ్రస్సెల్ కేంద్రంగా ఉన్న ఆ సంస్థ సూచించిందని వెల్లడించారు. న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అండ్ డిజిటల్ అథారిటీ (ఎన్బీడీఏ) కూడా ఈ అప్రకటిత నిషేధాన్ని ఖండించిందని తెలిపారు. కేబుల్ ఆపరేటర్లపై ఒత్తిడి తెచ్చి ప్రసారాలు నిలిపివేయడం టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నిబంధనలకు విరుద్ధమని చెప్పిందన్నారు.రాష్ట్రంలోని పాలకులు ఈ వ్యవహారంతో తమకేమీ సంబంధం లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. ప్రభుత్వ చర్యల కారణంగా అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర ఇమేజ్ దెబ్బతిందని కృష్ణంరాజు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తెలంగాణలో కొన్ని న్యూస్ చానళ్ల ప్రసారాలను అక్కడి కేబుల్ ఆపరేటర్లు నిలిపివేయడాన్ని చంద్రబాబు తప్పుపట్టారన్నారు. ఆ తప్పు ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతుంటే ఆయన తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.ఉత్తరప్రదేశ్ వర్సెస్ రాజ్ నారాయణ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1) (ఎ), 19(1) (జి) భావ ప్రకటనా స్వేచ్ఛకు హామీ ఇస్తోందని చెప్పిందని గుర్తు చేశారు. ప్రజాహితానికి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడానికి , తెలుసుకోవడానికి కూడా ఆ ఆర్టికల్ హామీ ఇస్తోందని తెలిపారు. కాబట్టి సాక్షి, టీవీ9, ఎన్టీవీ, 10టీవీలపై విధించిన అప్రకటిత నిషేధాన్ని వెంటనే తొలగించాలని కోరారు. -
చంద్రబాబు స్పాన్సర్డ్ మేధావులను నమ్మకండి..!
-
బాబు.. ఓ ‘పిల్స్’ ఫ్యాక్టరీ..
సాక్షి, అమరావతి: చంద్రబాబు వందలాది తప్పుడు కేసులు పెట్టించి రాష్ట్రాభివృద్ధికి, సంక్షేమానికి అడుగడుగునా అడ్డుతగులుతున్నారని పలువురు న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. ‘పిల్స్’ (ప్రజాప్రయోజన వ్యాజ్యాలు) ఫ్యాక్టరీని నడుపుతూ దేశంలో ఏ ప్రభుత్వంపైనా లేనన్ని కేసులు ఈ అభివృద్ధి నిరోధక శక్తులు వేశాయని, వారు తమ స్వార్థం కోసం ప్రజాహిత వ్యాజ్యాన్ని కూడా దు ర్వినియోగపరుస్తున్నారని వారు దుయ్యబట్టారు. చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా రాష్ట్రానికి కరోనా వైరస్ కన్నా ప్రమాదకరంగా మారారని ఆరోపించారు. ‘జగన్ పాలన–న్యాయవాదుల స్పందన’ అంశంపై ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడలో రాష్ట్రస్థాయి సదస్సు జరిగింది. ఇందులో పెద్ద సంఖ్యలో పాల్గొన్న న్యాయవాదులు తమ అభిప్రాయాలను సూటిగా, స్పష్టంగా వెల్లడించారు. రాష్ట్రాభివృద్ధిపై ఆంధ్రా అడ్వకేట్స్ ఫోరం రూపొందించిన నివేదిక ముఖ్యాంశాల పోస్టర్లను అవిష్కరించిన అనంతరం వారు తమ మాట్లాడారు. ఎవరెవరు ఏమన్నారంటే.. చంద్రబాబు ఫ్యాక్టరీ నుంచే ‘పిల్స్’.. న్యాయ వ్యవస్థలోని కొందరు కక్షపూరితంగా వ్యవరించారు. జస్టిస్ రాకేష్‌కుమార్ పదవీ విరమణచేసే రోజు జగన్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కానీ, తర్వాత అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో ఉన్న ఆయనపై ఆరోపణలు రావడంతో పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అలాగే, జగన్‌పై ఇబ్బందికర వ్యాఖ్యలు చేసిన జస్టిస్ బట్టు దేవానంద్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మందలించారు. చంద్రబాబు ఒక ‘పిల్ ఫ్యాక్టరీ’ని తయారుచేసి జగన్ ప్రభుత్వంపై సొంత ఖర్చులతో పిల్స్ వేయిస్తున్నారు. అయినా ఈ ప్రభుత్వం అవన్నీ తట్టుకుంటూ ముందుకెళ్లడం అభినందనీయం. – వీవీఆర్ కృష్ణంరాజు, అధ్యక్షుడు, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ వారికి స్థలాలిచ్చి బీసీలకు ఇవ్వకుండా కోర్టు స్టేనా!? అమరావతిలో బలహీన వర్గాలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా కోర్టు స్టే ఇచ్చింది. కానీ, అదే అమరావతిలో న్యాయమూర్తులకు, బ్యూరోక్రాట్లకు స్థలాలు కేటాయించారు. ఇదేం న్యాయం? పాఠశాలల్లో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టి సీఎం జగన్ మంచి పనిచేశారు. విదేశీ విద్య పథకంతో సామాన్యులను చదివిస్తున్నారు. 75 ఏళ్లలో ఎవరూ ఇలాంటి పనిచేయలేదు. దేశంలోనే బెస్ట్ సీఎం జగన్. – బి.అశోక్‌కుమార్, అధ్యక్షుడు, ఆంధ్ర అడ్వకేట్స్ ఫోరం కేసులు లేకపోతే మరింత అభివృద్ధి.. ఇన్ఫ్రా రంగంలో రాష్ట్రం శరవేగంతో అభివృద్ధి చెందుతున్నప్పటికీ ప్రతి పక్షాలు, ఒక వర్గం మీడియా పురోగతి ఏమీలేదంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. క్రెడిట్ రేటింగ్ ఇన్ఫర్మేషన్ సర్విసెస్ ఇండియా లిమిటెడ్ నివేదిక ప్రకారం.. ప్రస్తుతం దేశంలో సుమారు రూ.70 లక్షల కోట్ల విలువైన మౌలిక సదుపాయాల కల్పన జరుగుతుండగా.. అందులో రూ.6.75 లక్షల కోట్ల విలువైన పనులు ఒక్క ఏపీలోనే జరుగుతున్నాయి. అలాగే, జగన్ ప్రభుత్వంలో ఆరు ప్రత్యేక ఆర్థిక మండళ్ళు, పది హార్బర్లు, నాలుగు పోర్టులు, మూడు ఇండ్రస్టియల్ కారిడార్లు, రెండు మేజర్ ఎయిర్‌పోర్టులు, 31 చిన్న, మధ్య తరహా పారిశ్రామిక పార్కుల నిర్మాణం జరుగుతోంది. ఇంత పెద్దఎత్తున ఇన్ఫ్రా డెవలప్మెంట్ మరే రాష్ట్రంలోనూ జరగడంలేదు. – వెంకట్ మేడపాటి, అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ దేశంలోనే అగ్రస్థానంలో ఏపీ.. ఇటీవల ప్రధాని మోదీ∙కూడా స్వార్థపూరిత ప్రజాహిత వ్యాజ్యాలపట్ల ఆందోళన వ్యక్తంచేశారు. 2023–24లో పారిశ్రామిక రంగంలో 16.36 శాతం, స ర్విస్ సెక్టార్లో 20 శాతం, వ్యవసాయ రంగంలో 13 శాతం వృద్ధిని మన రాష్ట్రం సాధించింది. కేంద్ర ప్రభుత్వం గత ఐదేళ్లుగా సుమారు రూ.20 లక్షల కోట్లు పేదలకు నేరుగా బదిలీ చేయగా, ఒక్క వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.2.60 లక్షల కోట్లు బదిలీచేసి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. – నారాయణమూర్తి, ఉపాధ్యక్షుడు, నవరత్నాలు అమలు కమిటీ స్వార్థశక్తుల చేతుల్లో ‘పిల్’ ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో తరచుగా కోర్టులు జోక్యం చేసుకోవడంవల్ల అభివృద్ధి కుంటుపడే ప్రమాదం ఉంది. సామాన్యుల కోసం పిల్ సదుపాయం కలి్పస్తే అది స్వార్థశక్తుల చేతిలో ఆయుధంగా మారింది. అనవసరమైన కోర్టు కేసులు లేకపోతే జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి ఉండేది. – నరహరశెట్టి శ్రీహరి, సీనియర్ న్యాయవాది విద్యలో కేరళను దాటేస్తున్నాం.. రాష్ట్రంలో పిలిచి ఉద్యోగాలిస్తున్నారు.. పోర్టులు కడుతున్నారు.. విద్యా వ్యవస్థలో కేరళను దాటి ఏపీ మొదటి స్థానానికి వెళ్తోంది. తమ సమస్యలకు తక్షణ పరిష్కారం లభిస్తుందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. పరోక్షంగా న్యాయవాదుల కుటుంబాలు బాగుపడుతున్నాయి. జూనియర్ లాయర్లకు రూ.5వేలు గతంలో ఎవరూ ఇవ్వలేదు. – ధనలక్ష్మి, న్యాయవాది ఈ సర్కారును మళ్లీ గెలిపించుకోవాలి.. విద్యావ్యవస్థలో సీఎం జగన్ ప్రక్షాళన తీసుకొచ్చారు. బడుగులు తెలుగు మీడియంలోనే చదవాలన్నట్లు గత ప్రభుత్వాలు చేశాయి. పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని సీఎం జగన్ అందుబాటులోకి తెచ్చారు. ఈ ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించుకోవాలి. – బి. సౌమ్య, న్యాయవాది ప్రతీ హామీని జగన్ నెరవేర్చారు.. మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీనీ సీఎం జగన్ నెరవేర్చారు. లాయర్లు, ఆటోడ్రైవర్ల దగ్గర్నుంచి పారిశ్రామికవేత్తల వరకూ, అన్ని వర్గాల వారికీ ఆరి్థక చేయూతనిస్తున్నారు. అలాంటి సీఎంను మళ్లీ మనందరం మద్దతిచ్చి గెలిపించుకోవాలి. – ఉషాజ్యోతి, న్యాయవాది సంక్షేమ పాలనను లాయర్లు అందరికీ చెప్పాలి.. రాష్ట్రంలో సీఎం జగన్ చేస్తున్న సంక్షేమ పాలన గురించి న్యాయవాదులు తమ వద్దకు వచి్చన ప్రతి ఒక్కరికీ చెప్పి, వాళ్లకు జరిగిన మేలు గురించి గుర్తుచేయాలి. వారి ద్వారా ప్రజలందరికీ తెలిసేలా చేయాలి. – జంగా జయలక్ష్మి, సీనియర్ న్యాయవాది లాయర్లకు జగన్ తప్ప ఎవరూ మంచి చేయలేదు.. గతంలో న్యాయవాదులను వాడుకోవడం తప్ప ఏ ప్రభుత్వం మంచి చేయలేదు. జగన్ సీఎం అయ్యాక రూ.100 కోట్లు ఇస్తామన్నారు. అన్నట్లుగానే ఇచ్చారు. నవరత్నాలు అనే పదాన్ని ఎక్కడ చదివారోగానీ ఆ పేరుతో అందరికీ మంచి చేస్తున్నారు. అవి నిలబడాలంటే జగన్ మళ్లీ గెలవాలి. – రమణి, సీనియర్ న్యాయవాది మళ్లీ టీడీపీ బానిసత్వంలోకి వెళ్లొద్దు.. పధా్నలుగు సంవత్సరాల వనవాసం నుంచి బయటకు వచ్చినట్లుంది జగన్ పాలన. మళ్లీ టీడీపీ బానిసత్వంలోకి వెళ్లకుండా ఉండాలంటే న్యాయవాదులంతా కలిసికట్టుగా ఉండాలి. రాష్ట్రంలో చెడ్డ వారంతా చంద్రబాబుకి మద్దతిస్తున్నారు. మంచివాళ్లు జగన్‌ని కోరుకుంటున్నారు. – జీవనజ్యోతి, న్యాయవాది రాష్ట్రంలో అద్భుత ప్రగతి.. జగన్ ప్రభుత్వం ఏదైనా విధానపరమైన నిర్ణయం తీసుకుంటే వెంటనే కేసులు వేసి సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుతగులుతున్నారు. ప్రజాహిత వ్యాజ్యం అనేది సామాన్యుల న్యాయం కోసం రూపొందిస్తే వాటిని పెత్తందారులు హస్తగతం చేసుకున్నారు. 24 నెలల కరోనా కాలం తర్వాత మిగిలిన మూడేళ్లలో రాష్ట్రం అద్భుతమైన ప్రగతి సాధించింది. 2023–24లో 17 శాతం స్ధూల జాతీయోత్పత్తి వృద్ధి రేటుతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్ధానంలో ఉంది. – చిన్నం రామకృష్ణ, న్యాయవాది -
థియేటర్లలో బిల్లా రీ రిలీజ్.. కృష్ణంరాజు కుమార్తె ఎమోషనల్
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జన్మదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో సందడి మొదలైంది. పాన్ ఇండియా స్టార్ బర్త్‌డేను పురస్కరించుకుని బిల్లా సినిమాను రెండు రాష్ట్రాల్లో రీ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా థియేటర్ల వద్ద అభిమానులు హల్చల్ చేశారు. ఏపీలోని ఓ థియేటర్లో ఏకంగా బాణాసంచా పేల్చారు. దీంతో అగ్నిప్రమాదం సంభవించింది. తాజాగా ఇవాళ హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌లో ఉన్న సుదర్శన్ థియేటర్లో బిల్లా సినిమాను ప్రదర్శించారు. ఈ షో చూసేందుకు కృష్ణంరాజు పెద్దకుమార్తె ప్రసీద హాజరయ్యారు. అభిమానుల మధ్య కూర్చొని బిల్లా సినిమాను వీక్షించారు. ఫ్రభాస్ ఫ్యాన్స్ మధ్య థియేటర్లో సినిమా చూడడం సంతోషంగా ఉందని ఆమె ఎమోషనల్ అయ్యారు. నాన్నను, అన్నయ్యను స్క్రీన్‌పై చూడడం చాలా ఆనందాన్నిచ్చిందని ఆమె భావోద్వేగంతో మాట్లాడారు. అనంతరం థియేటర్ వద్ద కేక్ కట్ చేసి ప్రభాస్ ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు తెలిపారు. (చదవండి: కృష్ణంరాజు ముగ్గురు కూతుళ్ల గురించి ఈ ఆసక్తిర విషయాలు తెలుసా?) కృష్ణంరాజు పెద్ద కుమార్తె ప్రసీద మాట్లాడుతూ...' ప్రభాస్ అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా బిల్లా సినిమా మళ్లీ రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. చాలా రోజుల తర్వాత అన్నయ్యను, నాన్నను స్క్రీన్‌పై చూడడం సంతోషం కలిగించింది. మేమందరం చాలా బాగా సినిమాను ఎంజాయ్ చేశాం. ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తుంటే చాలా ఎమోషనల్‌గా ఫీలయ్యాం. ' అంటూ తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యారు. అయితే ఇటీవలే ప్రభాస్ పెదన్నాన్న కృష్ణంరాజు మరణించిన విషయం తెలిసిందే. -
వందల ఎకరాలు, రాజభవనం.. కృష్ణంరాజు ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా!
‘భక్త కన్నప్ప’, ‘తాండ్ర పాపారాయుడు’ వంటి ఎన్నో చిత్రాల్లో నటించిన నటించి ప్రేక్షకులను మెప్పించారు కృష్ణంరాజు. 1940లో సినీ ఇండస్ట్రీలో అ్రగ హీరోగా రాణఙంచిన ఆయన విలన్‌గా, హీరో, సహా నటుడిగా టాలీవుడ్లో తనదైన ముద్ర వేసుకున్నారు. దాదాపు 60 ఏళ్లకు పైగా సినీ ఇండస్ట్రీలో రారాజుగా వెలిగిన కృష్ణంరాజు ఆదివారం(సెప్టెంబర్ 11న) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతితో ఒక్కసారిగా తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు, సినీ రాజకీయ ప్రముఖులు, అభిమానుల ఆశ్రునయనాల మధ్య కృష్ణంరాజు అంత్యక్రియలు సోమవారం పూర్తయ్యాయి. చదవండి: పెళ్లి చేసుకోకపోయినా.. పిల్లల్ని కంటాను: ‘సీతారామం’ బ్యూటీ షాకింగ్ కామెంట్స్ సంపన్న కుటుంబంలో జన్మించిన ఆయన నటనపై ఆసక్తికితో ఇండస్ట్రీ వచ్చి అవకాశాల కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో ఆయన పస్తులు ఉన్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అలా అంచెలంచెలుగా ఎదిగిన కృష్ణంరాజుకు వారసత్వంగా బాగానే ఆస్తులు కలిసోచ్చాయట. అంతేకాదు సినిమా రంగంలో కూడా ఆయన బాగానే ఆస్తులు సంపాదించారట. కృష్ణంరాజు మరణాంతరం ఆయన ఆస్తులు చిట్టా ప్రస్తుతం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే.. ఏలూరు జిల్లా మొగల్తూరులో ఉప్పలపాటి వీర వెంకట సత్యనారాయణ రాజు, లక్ష్మీదేవి దంపతులకు ఆయన జన్మించారు. నిజానికి కృష్ణంరాజు తండ్రి స్వస్థలం రాజమండ్రి. కానీ ఆయన మేనత్త మెట్టినిల్లు మొగల్తూరుకే తన తండ్రి, ఆయన సోదరులు వచ్చేశారని గతంలో ఆయన వెల్లడించారు. కృష్ణంరాజుకు తన తండ్రి వారసత్వంగా మొగల్తూరులో వందల ఎకరాల భూమి వచ్చింది. ఇప్పటికి ఆ భూముల వ్యవసాయ నిర్వహణ మొత్తం మొగల్తూరులోని కృష్ణంరాజు సమీప బంధువులు చూసుకుంటూ ఉంటారు. ప్రస్తుతానికి మొగల్తూరులో కృష్ణంరాజు పేరిట ఒక రాజభవనం కూడా ఉందట. ఇక జూబ్లిహిట్స్లో నివాసముంటున్న బిల్డింగ్ ఖరీదు రూ.18 కోట్ల వరకు ఉంటుందని అంచనా. చదవండి: కృష్ణంరాజు ముగ్గురు కూతుళ్లు ఏం చేస్తుంటారో తెలుసా? సినిమాల్లో అప్పుడప్పుడే ఎదుగుతున్న క్రమంలో ఆయన చెన్నైలో ఉండేందుకు ఓ ఇల్లుతో పాటు పలు ఆస్తులు కూడా కొనుగోలు చేశారని సమాచారం. ఇక కృష్ణంరాజు దగ్గర రూ. 90 లక్షల విలువ చేసే మెర్సిడెజ్ బెంజ్‌తో పాటు రూ.40 లక్షల విలువైన టొయోటా ఫార్చునర్, రూ. 90 లక్షల ఖరీదైన వోల్వో ఎక్స్ సీ కార్లు ఉన్నాయి. 2009 లోక్‌సభ ఎన్నికల్లో కృష్ణంరాజు అఫిడవిట్ ప్రకారం.. తన కుటుంబానికి రూ. 8.62 కోట్ల ఆస్తులు, రూ. 2.14 కోట్ల అప్పులు ఉన్నట్లు చూపించారు. అంతేకాదు అప్పట్లోనే ఆయన కుటుంబంలో 4 కిలోల బంగారం ఉండేదట. ఇవన్ని కలిపి కృష్ణంరాజు ఆస్తుల విలువ రూ. 200 నుంచి 300 కోట్ల మధ్య ఉండొచ్చని తెలుస్తోంది. -
కృష్ణంరాజు ముగ్గురు కూతుళ్ల గురించి ఈ ఆసక్తిర విషయాలు తెలుసా?
కుటుంబ సభ్యులు, అభిమానుల అశ్రునయనాల మధ్య రెబల్ స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియలు ముగిశాయి. మోయినాబాద్‌లోని కనకమామిడి ఫామ్‌హౌజ్‌లో ప్రభుత్వ లాంచనాల మధ్య అయన అంతిమ విడ్కోలు పిలికారు. ఆయన అంతిమ సంస్కరణలో సినీ రాజకీయ ప్రముఖులతో పాటు వేలాది సంఖ్యలో అభిమానులు కనకమామిడి ఫామ్‌హౌజ్‌కు తరలి వచ్చారు. ఆయన హఠాన్మరణంతో తెలుగు సినీ పరిశ్రమ ఒక్కసారిగా విషాదంలోకి వెళ్లిపోయింది. ఇదిలా ఉంటే కృష్ణం రాజుకు ముగ్గురు ఆడపిల్లలు అనే విషయం తెలిసిందే. వారిలో ఎవరికి ఇంకా పెళ్లి కాలేదు. చదవండి: కృష్ణంరాజుకు జయప్రద నివాళి.. వెక్కెక్కి ఏడ్చిన నటి కూతుళ్ల పెళ్లి చూడకుండానే ఆయన కన్నుమూయడం తీవ్రంగా బాధిస్తోంది. సాధారణంగా సినీ నేపథ్య కుటుంబంలో జన్మించిన వారు తెరకు చాలా దూరం. ఫ్యామిలీ ఫంక్షన్స్‌లో తప్పా ఎలాంటి సినిమా ఈవెంట్స్‌లోనూ వారు కనిపించరు. ఇక వారి ఫొటోలు కూడా సోషల్ మీడియాలో చాలా అరుదుగా కనిపిస్తాయి. ఆయన ముగ్గురు కుమార్తెలు మీడియా ముందుకు వచ్చింది కూడా చాలా తక్కువే. తాజాగా ఆయన మరణంతో కృష్ణంరాజు ముగ్గురు కూతుళ్లు ఏం చేస్తుంటారనేది ప్రస్తుతం అందిరిలో తలస్తోన్న విషయం. దీంతో వారి గురించి నెటిజన్లు ఆరా తీయడం మొదలు పెడుతున్నారు. చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన రజనీకాంత్ కూతురు అయితే ఆయన ముగ్గురు కూతుళ్లలో పెద్ద కూమార్తె ప్రసీద రీసెంట్గా లండన్‌లో ఏంబీఏ పూర్తి చేశారు. అంతేకాదు ప్రభాస్ ‘రాధేశ్యామ్’ చిత్రంతో ఆమె నిర్మాతగా సినీరంగ ప్రవేశం కూడా చేశారు. ఇక రెండో కూమార్తె ప్రకీర్తి హైదరాబాద్‌లోని జేఎన్టీయూ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్‌గా చదువుతున్నారు. మూడో అమ్మాయి ప్రదీప్తి సైకాలిజీలో డిగ్రీ పూర్తి చేశారు. అయితే ముగ్గురు కూమార్తెల్లో కృష్ణంరాజు ఎవరి పెళ్లి చూడకుండానే మృతి చెందారు. ఆయన ఎంతో ప్రేమించే తమ్ముడి కుమారుడైన ప్రభాస్ వివాహం కూడా చూడకుండానే అకాలంగా ఆయన మరణించడం అభిమానులను తీవ్రంగా కలచివేస్తోంది. -
కృష్ణం‘రాజసం’.. ఆరడుగుల ఆజానుబాహుడు
ఆరడుగుల ఆజానుబాహుడు.. వెండితెరపై ‘రెబల్ స్టార్’. బొబ్బిలి బ్రహ్మన్న, కటకటాల రుద్రయ్య, తాండ్ర పాపారాయుడు, భక్త కన్నప్ప... సాంఘికం, పౌరాణికం... ఇలా దాదాపు అన్ని జానర్లు టచ్ చేసిన పరిపూర్ణ నటుడు. ‘ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండే గుణం. ‘ఒక కారు కొంటాం.. ఇంకోటి కొంటాం.. కానీ ఆ కారు దిగి కాలు భూమి మీదే పెట్టాలి కదా.. కాళ్లతోనే నడవాలి కదా’.. రెబల్ స్టార్ చెప్పిన జీవిత సత్యం ఇది. అందుకే ఆయన నిరాడంబరమైన మనిషి. ‘ఈ చేత్తో చేసిన దానం ఆ చేతికి తెలియకూడదు’ అనేది ఆయన సిద్ధాంతం. ఎన్నో సహాయ కార్యక్రమాలు చేశారు. భర్తగా, తండ్రిగా, పెదనాన్నగా.. ఇంటిల్లిపాదినీ బాగా చూసుకున్నారు. పేరుకి తగ్గట్టే రాజులా బతికారు. అందుకే ఆయన పరిపూర్ణమైన మనిషి కూడా... ఆదివారం తెల్లవారుజాము ‘రెబల్ స్టార్ కృష్ణంరాజు’ ఇక లేరని ఓ చేదు వార్తని మోసుకొచ్చింది. 82 ఏళ్ల క్రితం ఓ మంచి మనిషి ఈ భూమ్మీదకు వచ్చాడు. రాజసంగా బతికాడు.. రాజసంగా వెళ్లిపోయాడు. ఒక శకం ముగిసింది.. ప్రముఖ నటులు, నిర్మాత, మాజీ కేంద్ర మంత్రి రెబల్ స్టార్ కృష్ణంరాజు (82) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున 3:25 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరులో ఉప్పలపాటి వీరవెంకట సత్యనారాయణరాజు, లక్ష్మీదేవి దంపతులకు 1940 జనవరి 20న కృష్ణంరాజు జన్మించారు. ఆయన అసలు పేరు శ్రీ ఉప్పలపాటి చినవెంకట కృష్టంరాజు. అయితే ఆ పేరు పెద్దగా ఉందని శ్రీ, చినవెంకట పేర్లను తీసేసి, ఉప్పలపాటి కృష్టంరాజు అని పెట్టుకున్నారు. మొగల్తూరులోని బోర్డింగ్, హైస్కూల్లో ఎనిమిదో తరగతి వరకూ చదువుకున్నారు కృష్ణంరాజు. ఆ తర్వాత నర్సాపూర్ టైలర్ హైస్కూల్లో తొమ్మిదో తరగతి ప్రవేశం కోసం వెళితే.. ఆ స్టాండర్డ్ సరిపోదని మళ్లీ ఎనిమిదో తరగతిలో చేరాలంటే, అదే స్కూల్లో ఎనిమిది, తొమ్మిది, ఎస్ఎస్ఎల్సి (పది) తరగతులు పూర్తి చేశారు. కాగా టైఫాయిడ్ జ్వరం కారణంగా ఎస్ఎస్ఎల్సి తప్పిన ఆయన రెండోసారి పాసయ్యారు. బీకాం మూడో సంవత్సరం చదువుతూ మధ్యలోనే మానేశారు. జర్నలిస్ట్‌గా... ధనిక కుటుంబంలో పుట్టిన కృష్ణంరాజు పాఠశాలకు గుర్రపు బండిలో, కళాశాలకు బీఎస్ఏ మోడల్ మోటార్ బైక్, వోక్సాలిన్ అనే కారులో వెళ్లి వచ్చేవారు. కారులో కళాశాలకు వెళుతుంటే ఆయన్ను యంగ్ లెక్చరర్ అనుకునేవారు. కళాశాలలో జరిగిన ఎన్నికలప్పుడు లెక్చరర్ కాదు స్టూడెంట్ అని అందరికీ తెలిసిందట. డిగ్రీ డిస్కంటిన్యూ చేశాక కొంతకాలంపాటు ‘ఆంధ్రరత్న’ అనే దినపత్రికలో జర్నలిస్టుగా చేశారు. హైదరాబాద్‌లో రాయల్ స్టూడియో చిన్నప్పటి నుంచి కృష్ణంరాజుకి ఫొటోగ్రఫీ అంటే ఇష్టం. 14 ఏళ్ల వయసు నుంచే మార్కెట్లోకి వచ్చిన ప్రతి కెమెరా కొని ఫొటోగ్రఫీలో ప్రయోగాలు చేశారు. ఆ అనుభవంతో హైదరాబాద్ అబిడ్స్‌లో ‘రాయల్ స్టూడియో’ను ప్రారంభించారు. చూడటానికి హీరోలా ఉన్నావని సీహెచ్‌వీపీ మూర్తిరాజు (బంధువు), స్నేహితులు కృష్ణంరాజుకి చెబితే నవ్వి ఊరుకునేవారట.. అంతేకానీ, సినిమాలు చేయాలనే ఆలోచన ఉండేది కాదట. ‘చిలకా గోరింకా’తో సినిమా ఎంట్రీ ‘అక్కా చెల్లెలు’ సినిమా తీసిన పద్మనాభరావు ఓ రోజు కృష్ణంరాజుని చూసి ‘సినిమాల్లో నటిస్తావా?’ అని అడగడం, అటు మూర్తిరాజు, ఇటు స్నేహితులు ప్రయత్నించి చూడమనడంతో పద్మనాభరావుతో కలిసి హైదరాబాద్ నుంచి మద్రాస్ (చెన్నై) వెళ్లారు కృష్ణంరాజు. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ సినిమా పట్టాలెక్కకపోవడంతో హైదరాబాద్‌కి తిరిగొచ్చేశారు. ఆ తర్వాత ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలోని ‘తేనె మనసులు’ సినిమా ఆడిషన్స్‌కి వెళ్లారు. ఆ ఆడిషన్స్‌కి కృష్ణ, జయలలిత, సంధ్యారాణి, హేమమాలిని కూడా హాజరయ్యారు. అయితే కృష్ణంరాజు, జయలలిత, హేమమాలినిలను రిజెక్ట్ చేశారట. ప్రత్యగాత్మ దర్శకత్వంలో చేసిన ‘చిలకా గోరింకా’ (1966) చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు కృష్ణంరాజు. రెబల్ స్టార్‌గా... ఐదున్నర దశాబ్దాల కెరీర్లో ‘బుద్ధిమంతుడు, మనుషులు మారాలి, పెళ్లి కూతురు, మహ్మద్ బిన్ తుగ్లక్, హంతకులు దేవాంతకులు, తల్లీకొడుకులు, రారాజు, త్రిశూలం, రంగూన్ రౌడీ, మన ఊరి పాండవులు, కటకటాల రుద్రయ్య, సతీ సావిత్రి, పల్నాటి పౌరుషం, తాతా మనవడు, టూ టౌన్ రౌడీ, జీవన తరంగాలు’ ఇలా... దాదాపు 185 సినిమాల్లో నటించారు. ‘తాండ్ర పాపారాయుడు, భక్త కన్నప్ప, బొబ్బిలి బ్రహ్మన్న, కృష్ణవేణి, అమరదీపం’ వంటి సినిమాలు కృష్ణంరాజుకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. సాంఘిక, పౌరాణిక సినిమాల్లో చేసిన పాత్రలే ప్రేక్షకుల మనసుల్లో రెబల్‌స్టార్‌గా పేరు తీసుకొచ్చాయి. స్టయిలిష్ విలన్‌గా.. హీరోగా చేస్తున్నప్పుడు ‘నేనంటే నేనే’ (తమిళ ‘నాన్’కి రీమేక్) చిత్రంలో విలన్‌గా చేయమని నిర్మాత డూండీ (అప్పటికి పేరున్న నిర్మాత) అడిగారు. అయితే విలన్‌గా చేయడం ఇష్టంలేక ‘సారీ’ అనేశారు కృష్ణంరాజు. ఆ విషయం తెలిసి,‘ అంత పెద్ద నిర్మాత అడిగితే కాదంటావా? ఈరోజు పెద్ద హీరోలుగా రాణిస్తున్న శివాజీ గణేశన్వంటి వారు ఒకప్పుడు విలన్‌గా చేసినవారే’ అని దర్శకుడు ప్రత్యగాత్మ అన్నారు. ‘అయితే ఒక కండీషన్.. అందులో మనోహర్ కొంచెం ఓవర్ యాక్షన్ చేశారు.. నేను నా పద్ధతిలో చేస్తా’ అని కృష్ణంరాజు అన్నారు. పెద్ద నిర్మాత అయిన నాకే కండీషనా? అన్నప్పటికీ డూండీ ఒప్పుకున్నారు. చిత్రదర్శకుడు రామచంద్రరావు మాత్రం షూటింగ్ లొకేషన్లో మనోహర్ స్టయిల్లో చేయమన్నారు. అయితే డూండీ మాత్రం కృష్ణంరాజుని తనదైన శైలిలో నటించమన్నారు.. కొత్తగా చేశారు. ఆ పాత్రకు మంచి ప్రశంసలు దక్కాయి. ‘మరో ఆర్. నాగేశ్వరరావు (ప్రముఖ విలన్ నాగేశ్వరరావు అప్పటికి మరణించారు) ఇండస్ట్రీకి వచ్చాడు’ అనే పేరు వచ్చింది. ఆ తర్వాత విలన్ పాత్రలు వచ్చినప్పటికీ అప్పుడు నడుస్తున్న ట్రెండ్ ప్రకారం గళ్ల లుంగీ, చారల బనియన్, క్రూరమైన చూపులు.. కృష్ణంరాజు ఇలా రొటీన్‌గా కనిపించదలచుకోలేదు. స్టైలిష్ విలన్‌గా చేయాలనుకున్నారు. ఆ విధంగా ట్రెండ్ సెట్టింగ్ విలన్ అనిపించుకున్నారు. అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా ఓ స్థాయి ఉన్న పాత్రలే చేశారాయన. ‘బావా బావమరిది, జైలర్‌గారి అబ్బాయి, గ్యాంగ్ మాస్టర్, పల్నాటి పౌరుషం, నాయుడుగారి కుటుంబం, మా నాన్నకి పెళ్లి’ తదితర చిత్రాల్లో మంచి పాత్రలు చేశారాయన. అవార్డులు.. రివార్డులు కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన ‘అమరదీపం (1977)’, ‘బొబ్బిలి బ్రహ్మన్న’ (1984) చిత్రాలకు గానూ ప్రభుత్వం నుంచి రెండు నంది అవార్డులు అందుకున్నారు కృష్ణం రాజు. ‘అమరదీపం’, ‘మన ఊరి పాండవులు’ (1978) సినిమాల్లోని నటనకుగానూ రాష్ట్రపతి పురస్కారాలు వరించాయి. 1994లో శరత్ దర్శకత్వంలో వచ్చిన ‘జైలర్‌గారి అబ్బాయి’ చిత్రంలో ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నంది అవార్డు అందుకున్నారాయన. అదే విధంగా 2014లో ‘రఘుపతి వెంకయ్య’ అవార్డు అందుకున్నారు కృష్ణంరాజు. వీటితోపాటు పలు ప్రైవేట్ సంస్థల నుంచి ఎన్నో అవార్డులు అందుకున్నారాయన. కేంద్రమంత్రిగా... 1991లో కాంగ్రెస్ పార్టీలో చేరి, అదే ఏడాది నర్సాపురం నుంచి లోక్‌సభకు పోటీచేసి ఓడిపోయారు కృష్ణంరాజు. ఆ తర్వాత బీజేపీలో చేరి, 1999లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో నర్సాపురం నుంచి ఎంపీగా విజయం సాధించి, కేంద్రమంత్రిగా చేశారు. ఆ తర్వాత చిరంజీవి స్థాపించిన ‘ప్రజారాజ్యం’ పార్టీలో చేరారు కృష్ణంరాజు. అనంతరం బీజేపీలోనే కొనసాగారు. సినీ పరిశ్రమలో ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా)కి సేవలందించారు. అలాగే ‘క్రమశిక్షణా సంఘం (మా)’కి అధ్యక్షుడిగా ఉన్నారు. కాగా ప్రభాస్ హీరోగా నటించిన ‘రాధేశ్యామ్’ కృష్ణంరాజుకి ఆఖరి సినిమా. చిత్రసీమ ఓ మంచి నటుడిని కోల్పోయింది. ఆతిథ్యం ఇచ్చే విషయంలో రారాజు అనిపించుకున్న ఓ మంచి మనిషి దూరం అయ్యారు. కృష్ణంరాజు అంత్యక్రియలు చేవెళ్లలోని మొయినాబాద్‌లో గల కనకమామిడి ఫామ్ హౌస్‌లో ఈరోజు మధ్యాహ్నం అధికారిక లాంఛనాలతో జరుగుతాయని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. సీతాదేవితో వివాహం 1969లో కోట సంస్థానాధీశుల వంశస్తులు రాజా కలిదిండి దేవి ప్రసాద వరాహ వెంకట సూర్యనారాయణ కుమార లక్ష్మీ కాంత రాజ బహుద్దూర్ (గాంధీబాబు), సరస్వతీ దేవిల కుమార్తె సీతాదేవిని వివాహమాడారు కృష్ణంరాజు. 1995లో సీతాదేవి రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, 1996లో తూర్పుగోదావరి జిల్లా తునికి చెందిన శ్యామలాదేవిని రెండో వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు. తీరని ఆశలు కృష్ణంరాజు టైటిల్ రోల్లో బాపు దర్శకత్వంలో వచ్చిన ‘భక్త కన్నప్ప’ చిత్రానికి అమితమైన ప్రేక్షకాదరణ లభించింది. ఈ సినిమాను ప్రభాస్‌తో రీమేక్ చేయాలని కృష్ణంరాజు ఆశపడ్డారు.. కానీ కుదర్లేదు. అలాగే ప్రభాస్ హీరోగా నటించిన ‘ఛత్రపతి’ (2005) సినిమాలోని ఓ పవర్ఫుల్ డైలాగ్‌లో ‘ఒక్క అడుగు’ అనే పదం ఉంటుంది. దీన్నే టైటిల్‌గా పెట్టి, ఓ మల్టీస్టారర్ సినిమాను తన దర్శకత్వంలోనే చేయాలనుకున్నారు కృష్ణంరాజు. అయితే ఇది కూడా కార్యరూపం దాల్చలేదు. అలాగే ‘విశాల నేత్రాలు, జీవన తరంగాలు’ నవలలంటే ఆయనకు ఇష్టం. వీటి ఆధారంగా సినిమాలు తీయాలనుకున్నారు. అదీ నెరవేరలేదు. ఇక ప్రభాస్ పెళ్లి చూడాలని కృష్ణంరాజు ఎంతగానో ఆశపడ్డారు. కానీ ప్రభాస్‌కు ఉన్న వరుస సినిమాల కమిట్మెంట్స్ కారణంగా వివాహం వాయిదా పడుతూ వస్తోంది. అలాగే తన ముగ్గురు కుమార్తెలు సాయి ప్రసీద, సాయి ప్రకీర్తి, సాయి ప్రదీప్తిల వివాççహాల విషయంలోనూ కృష్ణంరాజుకి ఆశ ఉండటం సహజం. మరోవైపు ఎంపీ అయిన కృష్ణంరాజుకు గవర్నర్ హోదాలో బాధ్యతలు నిర్వర్తించాలని ఉండేదట. ఓ దశలో కృష్ణంరాజుకు తమిళనాడు గవర్నర్ పదవి అంటూ వార్తలు వినిపించాయి. కానీ ఇది కూడా కార్యరూపం దాల్చలేదు. యంగ్ రెబల్ స్టార్‌తో మూడు చిత్రాలు కృష్ణంరాజు–ప్రభాస్ కాంబినేషన్లో మూడు సినిమాలు వచ్చాయి. పెద్దనాన్న కృష్ణంరాజుతో కలిసి ప్రభాస్ స్క్రీన్ షేర్ చేసుకున్న తొలి సినిమా ‘బిల్లా’ (2009). ఈ సినిమా వచ్చిన మూడేళ్లకు ‘రెబల్’ (2012) సినిమాలో కలిసి నటించారు కృష్ణంరాజు, ప్రభాస్. ‘రెబల్’ తర్వాత మరోసారి కృష్ణంరాజు, ప్రభాస్ కలిసి నటించడానికి పదేళ్లు పట్టింది. ప్రభాస్ హీరోగా నటించిన ‘రాధేశ్యామ్’ (2022)లో పరమహంస అనే కీ రోల్ చేశారు కృష్ణంరాజు. ఇది ఆయనకు చివరి సినిమా. పరిశ్రమ నుంచి వెళ్లిపోవాలనుకున్నారు కానీ...! కథానాయకుడిగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు చలన చిత్రపరిశ్రమలో కృష్ణంరాజుది సుదీర్ఘమైన సక్సెస్ఫుల్ కెరీర్. అయితే ఇంత ప్రతిభావంతుడైన కృష్ణంరాజు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ముఖ్యకారణం ప్రముఖ ప్రొడ్యూసర్, యాక్టర్, డైరెక్టర్ ఎల్వీ ప్రసాద్. వెండితెరపై కృష్ణంరాజు తొలి సినిమా ‘చిలకా గోరింకా’. ఈ సినిమాకు బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో నంది అవార్డు వచ్చింది కానీ కమర్షియల్‌గా సక్సెస్ కాలేదు. దీంతో కాస్త దిగాలు పడ్డారు కృష్ణంరాజు. ఆ తర్వాత కృష్ణ హీరోగా నటించిన ‘నేనంటే నేనే’ చిత్రంలో కాస్త ప్రతినాయకుడి ఛాయలు ఉండే రోల్లో నటించే అవకాశం వచ్చింది కృష్ణంరాజుకు. దీంతో మరింత కలత చెందిన ఆయన సినీ పరిశ్రమకు వీడ్కోలు చెబుదాం అనుకున్నారట. కానీ పాత్ర ఏదైనా ప్రేక్షకులకు దగ్గర కావడం ముఖ్యమని, ఈ విషయంపై దృష్టి పెట్టమని కృష్ణంరాజుకు ఎల్వీ ప్రసాద్ హితబోధ చేశారు. దీంతో ఆలోచనలో పడ్డ కృష్ణంరాజు నూతనోత్సాహంతో మళ్లీ యాక్టర్‌గా మేకప్ వేసుకున్నారు. ‘నేనంటే నేనే’లో కృష్ణంరాజు పోషించిన ఆనంద్ పాత్రకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కాయి. దీంతో నటుడిగా తిరుగులేని సక్సెస్ఫుల్ ప్రయాణాన్ని కొనసాగించారు కృష్ణంరాజు. రాజుకి ఆకలి బాధ పుట్టినప్పటినుంచి ఆకలి బాధ తెలియకుండా పెరిగిన కృష్ణంరాజు ఓ సందర్భంలో రెండు రోజులు పస్తులు ఉన్నారు. నటనలో సంతృప్తి పొందేవరకూ ట్రైనింగ్ తీసుకునే సమయంలోవచ్చిన ప్రతి సినిమానీ వదులుకున్నారాయన. అప్పటికి ఇంటి నుంచి కృష్ణంరాజు తండ్రి డబ్బులు పంపించేవారు. అయితే తన దగ్గర డబ్బులయిపోయాయని తండ్రికి ఉత్తరం రాయడానికి బద్ధకించి కృష్ణంరాజు రాయలేదు. దాంతో రెండు రోజులు పస్తులు ఉన్నారు. పోనీ ఎవరినైనా అడుగుదామంటే ఆత్మాభిమానం.. మొహమాటం. ఆ సమయంలో వచ్చిన శివకుమార్ రెడ్డి (పొలిటీషియన్ బెజవాడ గోపాల్‌రెడ్డి బావ) అనే ఫ్రెండ్ నీరసంగా ఉన్న కృష్ణంరాజుని చూసి, విషయం అడిగి తెలుసుకున్నారు. ‘మాకయితే డబ్బులిస్తావు కానీ నీక్కావాలంటే అడగవా’ అంటూ చివాట్లు పెట్టి, బలవంతంగా హోటల్‌కి తీసుకెళ్లి బిర్యానీ తినిపించారు. అయితే కృష్ణంరాజు తండ్రికి ఈ విషయం తెలిసి, బాధపడి అప్పట్నుంచి నెలకు 1200 రూపాయలు పంపించడం మొదలుపెట్టారు. అప్పట్లో 1200 అంటే పెద్ద మొత్తం కింద లెక్క. నటన కోసం పుస్తక పఠనం తొలి చిత్రం ‘చిలకా గోరింకా’ సినిమా కృష్ణంరాజుకు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దాంతో పాటు ఈ సినిమాలో ఇంకా బాగా యాక్ట్ చేసుంటే బాగుండనే ఫీలింగ్ ఆయనకు కలిగింది. దీంతో నటన గురించి, నటనావిధానాల గురించి తెలుసుకోవడానికి పుస్తకాలు చదవాలనుకున్నారు. ఈ క్రమంలోనే రష్యన్ యాక్టర్ స్టాన్స్ లాస్కీ రచించిన ‘మై లైఫ్ ఇన్ ఆర్ట్’, మరో అంతర్జాతీయస్థాయి దర్శక – నటుడు పుడోకిన్స్ రాసిన వ్యాసాలు, వరల్డ్ లిటరేచర్‌లో వచ్చిన ‘ది ఆర్ట్ ఆఫ్ సినిమా అండ్ యాక్టింగ్’పై వచ్చిన పుస్తకాలను చదివారాయన. కానీ పుస్తక జ్ఞానం మాత్రమే సరిపోదని, ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఉండాలని తెలుసుకున్నారు కృష్ణంరాజు. ఇందుకోసం అప్పటి సినీ ప్రముఖుడు సీహెచ్ నారాయణరావు దగ్గర కృష్ణంరాజు శిక్షణ తీసుకున్నారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి లంచ్ అవర్ వరకు, మళ్లీ మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు కృష్ణంరాజు నటనలో శిక్షణ తీసుకునేవారు. ఇలా నటనలో తనకు కాన్ఫిడెన్స్ వచ్చేంత వరకు మేకప్ వేసుకోకూడదని నిర్ణయించుకున్నారు కృష్ణంరాజు. ఈ క్రమంలో రంగూన్ రామారావు డైరెక్షన్‌లోని ఓ సినిమా, జోసఫ్ తలియత్ అనే దర్శక– నిర్మాతలు ఇచ్చిన హీరో ఆఫర్స్‌ను రిజెక్ట్ చేశారు కృష్ణంరాజు. దీంతో ఆయన మిత్రులు కృష్ణంరాజుపై కోప్పడ్డారు. కానీ ఆయన మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకునేందుకు ససేమిరా అన్నారు. నటనపై పూర్తి పట్టు సాధించిన తర్వాతే కృష్ణంరాజు తన తర్వాతి సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. మరణం గురించి కృష్ణంరాజు చెప్పిన విషయం జీవించి ఉన్నప్పుడే చావు గురించిన ఆలోచన అంటే చాలామంది భయపడతారు. కానీ కృష్ణంరాజు భయపడలేదు. పైగా తాను ఎలా చనిపోవాలనుకుంటున్నారో ఓ సందర్భంలో ఆయనే చెప్పారు. ‘పచ్చని చెట్టు నీడలో కూర్చొని.. జీవితంలో నేను ఎవరికీ అన్యాయం చేయలేదనే భావనతో గుండెల మీద చేతులు వేసుకుని నిర్మలమైన ఆకాశం వంక చూస్తూ నా తుదిశ్వాస విడవాలి. ఆ రోజూ, ఈ రోజూ .. అదే నా కోరిక’’ అని మరణం గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు కృష్ణంరాజు. ధ్యానంలో దైవ దర్శనం కృష్ణంరాజుకి శివుడు అంటే ఇష్టం. ఆ విషయం గురించి, కొన్ని ఆధ్యాత్మిక విషయాలను గతంలో ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు. కృష్ణంరాజు: సినిమాల్లోకి వచ్చిన మొదట్లోనే శివయ్య పరిచయం అయ్యాడు. ధ్యానంలో అలా కైలాసగిరికి వెళ్లి స్వామిని దర్శించుకొని, తిరుమల వెంకన్నస్వామిని చేరుకొని ఆయన పాదాలకు నమస్కరించుకొని, అన్నవరం సత్య నారాయణ స్వామి దగ్గరకు వెళతాను. అక్కడి నుంచి షిరిడీ వెళ్లి బాబా హారతిలో పాల్గొని శబరిమలై వెళ్లి పద్దెనిమిది మెట్లు ఎక్కి స్వామిని దర్శిస్తే .. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేం. ఈ ధ్యానప్రయాణంలో శరీరం తేలికైన భావన. పాజిటివ్ ఎనర్జీ శరీరాన్ని, మనసును తేజోవంతం చేస్తుంది. టికెట్ లేకుండా ఉచిత దర్శనాలు చేసుకొస్తు్తంటారని మా ఇంట్లో అంటారు (నవ్వుతూ). మీ మీద దైవానికి కోపం వచ్చిందని ఎప్పుడైనా భావించారా? సినిమాల్లోకి వచ్చిన మొదట్లో గమనించాను. నా పూర్తి పేరు శ్రీ ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో కుదించి ‘కృష్ణంరాజు’ అని రిజిస్ట్రేషన్ చేయించాను. అప్పటి నుంచి కొన్నాళ్లపాటు ఏ పని చేసినా కలిసి వచ్చేది కాదు. మా ఊళ్లో ఒకతను ‘మీ కులదైవం వెంకటేశ్వరస్వామి. నీ పేరులో ముందున్న ‘వెంకట’ పేరు తీసేశావు.. అందుకే ఈ సమస్యలు’ అన్నాడు. నాకూ అది నిజమే అనిపించింది. కొన్ని తరాల నుంచి ‘వెంకట’ అని మా ఇంట్లో అందరికీ వారి వారి పేర్ల ముందు ఉంటుంది. దాంతో నా పేరుకు ముందు మళ్లీ ఇంటిపేరు (యు), వెంకట (వి) జత చేసుకున్నప్పడు నా ఎదుగుదలలో మంచి మార్పులు చూశాను. దేవుడు, భక్తుడి పాత్రలు చేస్తున్నప్పుడు దైవానికి సంబంధించిన వైబ్రేషన్స్ వచ్చేవా? మేకప్ వేసుకున్నానంటే నాకు వేరే ఏదీ గుర్తొచ్చేది కాదు. ఆ పాత్రలో లీనమవుతాను. ఇక భక్తిరస సినిమాలైతే చెప్పక్కర్లేదు. ‘భక్త కన్నప్ప’లో శివుడికి కన్ను ఇచ్చే సీన్ చేసేటప్పుడు శరీరం, మనసులో ఏదో తెలియని ఉద్వేగం ఆవరించేది. నిర్మాతగానూ... కన్నడ చిత్రం ‘శరపంజర’ (1971) ఆధారంగా తెలుగులో వచ్చిన ‘కృష్ణవేణి’ (1974) సినిమాతో నిర్మాతగా మారారు కృష్ణంరాజు. ఈ సినిమాకు మంచి ప్రేక్షకాదరణ లభించింది. దాంతో తన తమ్ముడు ఉప్పలపాటి సూర్య నారాయణ రాజు (ప్రభాస్ తండ్రి) నిర్మాతగా గోపీకృష్ణా మూవీస్ బ్యానర్‌ను స్థాపించి, ‘భక్త కన్నప్ప’ సినిమా నిర్మించి, నటించారు కృష్ణంరాజు. బాపు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అనూహ్య విజయం సాధించింది. ఆ తర్వాత అమరదీపం, ‘మన ఊరి పాండవులు, ‘సీతారాములు , మధురస్వప్నం, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు, బిల్లా’ వంటి సినిమాలను నిర్మించారు కృష్ణంరాజు. ‘రాధేశ్యామ్’కు సమర్పకులుగా ఉన్నారు. అలాగే హిందీ చిత్రం ‘ధర్మ్ అధికారి’కి సమర్పకుడిగా ఉన్నారు కృష్ణంరాజు. ఇక ‘బొబ్బిలి బ్రహ్మన్న’ చిత్రానికి హిందీ రీమేక్‌గా ‘ధర్మ్ అధికారి’ని నిర్మించారు. హిందీలోనూ ఈ చిత్రం బాగా ఆడినప్పటికీ కొందరు ఉత్తరాది పంపిణీదారులు మోసం చేయడంతో కొంత నష్టం జరిగిందని ఓ సందర్భంలో కృష్ణంరాజు పేర్కొన్నారు. -
Krishnam Raju: రాజకీయాల్లో పడిలేచిన కెరటం!
సాక్షి, హైదరాబాద్: రెబల్ స్టార్ కృష్ణంరాజు సినిమాల్లోనే కాకుండా రాజకీయ రంగంలోనూ తనదైన ముద్ర వేశారు. సినిమాలతో ఓ వెలుగు వెలుగుతున్న సమయంలోనే ఆయన రాజకీయాల వైపు ఆకర్షితులు అయ్యారు. 1991లో కాంగ్రెస్‌లో చేరిన ఆయన.. అదే ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నరసాపురం నుంచి పోటీ చేశారు. అయితే టీడీపీ అభ్యర్థి భూపతిరాజు విజయకుమార్‌రాజు చేతిలో ఓటమి చవిచూశారు. కొంతకాలం సినిమాలపైనే దృష్టిపెట్టిన ఆయన 1998లో బీజేపీలో చేరారు. అదే ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాకినాడ నుంచి ఎంపీగా గెలిచారు. ఆ లోక్‌సభ రద్దయి 1999లో మధ్యంతర ఎన్నికలు జరగడంతో బీజేపీ తరఫున నరసాపురం నుంచి పోటీ చేసి.. కాంగ్రెస్ అభ్యర్థి కనుమూరు బాపిరాజుపై గెలుపొందారు. రెండోసారి లోక్‌సభలోకి అడుగుపెట్టిన ఆయన కేంద్రంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 1999–2000 మధ్య లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ కమిటీ సభ్యుడిగా, 2000లో కేంద్ర వాణిజ్య శాఖ సలహాకమిటీ సభ్యుడిగా పనిచేశారు. తొలిసారిగా 2000 సెప్టెంబర్ 30న వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2001 జూలై 22 వరకు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా, అప్పటి నుంచి 2002 జూన్ 20 వరకు రక్షణశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఇదే ఏడాది జూలై 1న వినియోగదారుల వ్యవహరాలు, ప్రజాపంపిణీ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2003 జనవరి 29 నుంచి 2004 మే 22 వరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా సేవలు అందించారు. కలిసి రాని సెకండ్ ఇన్నింగ్స్ 2004 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున నరసాపురం నుంచి పోటీచేసిన కృష్ణంరాజు.. కాంగ్రెస్ అభ్యర్థి చేగొండి హరిరామజోగయ్య చేతిలో ఓటమి చవిచూశారు. తర్వాత ఐదేళ్లపాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2009లో సినీ నటుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ టికెట్‌పై రాజమండ్రి నుంచి పోటీచేసి పరాజయం పాలయ్యారు. అయితే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశాక.. కొంతకాలం రాజకీయాలకు దూరం పాటించారు. మళ్లీ 2014లో బీజేపీలో చేరి కొంత యాక్టివ్‌గా పనిచేశారు. ఈ సమయంలో కృష్ణంరాజుకు గవర్నర్ పదవి రాబోతున్నదనే ప్రచారం జరిగింది. కానీ ఆరోగ్యం సహకరించలేదు. బీజేపీలోనే కొనసాగినా యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరమయ్యారు. ఇదీ చదవండి: Krishnam Raju: రారాజు ఇకలేరు -
‘మా’ఎన్నికల్లో మరో ట్విస్ట్
-
కృష్ణంరాజు పుట్టినరోజు వేడుకల్లో ప్రభాస్
-
నా విజయ రహస్యం అదే!
కృష్ణంరాజు గురించి పరిచయ వాక్యాలు అవసరం లేదు. శక్తిమంతమైన పాత్రలకు చెరగని చిరునామా ఆయన. ఇటీవలి కాలంలో ఆయన చాలా ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఆయన నటించిన ‘ఎవడే సుబ్రమణ్యం’లోని రామయ్య పాత్ర ఆ సినిమాకుకీలకంగా నిలిచి, ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో కృష్ణంరాజు ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ మధ్యకాలంలో పాత్రల ఎంపికలో చాలా సెలక్టివ్‌గా ఉంటున్నారు. ‘ఎవడే సుబ్రమణ్యం’లో రామయ్య పాత్ర చేయడానికి కారణం? ఒక సినిమా టైటిల్ కార్డ్‌లో నా పేరు ఉందంటే.. సహజంగానే ఆ పాత్రపై ప్రేక్షకులకు అంచనాలుంటాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా లేకపోతే ‘ఎందుకీ పాత్ర చేయాల్సి వచ్చింది’ అనుకుంటారు. మొహమాటంతో స్నేహం కొద్దీ ఆ మధ్య చేసిన రెండు, మూడు పాత్రలు మామూలుగా ఉన్నాయి. దాంతో, అభిమానులు అసంతృప్తికి గురయ్యారు. అందుకే, కారెక్టర్లో ‘దమ్ము’ ఉంటేనే అంగీకరిస్తున్నా. దాదాపు రెండు వందల సినిమాలు చేసిన నా దగ్గరకొచ్చి ఓ పాత్రకు అడిగారంటే, ఆ పాత్ర ఎంతో గొప్పగా ఉండాలి. నేను చేయడం ద్వారా ఆ సినిమాకి హెల్ప్ అవ్వాలి. అశ్వనీదత్ నాకు మంచి స్నేహితుడు కావడం కూడా ఈ సినిమా చేయడానికి ఒక కారణం. అతను నన్ను ‘మావా’ అని పిలుస్తాడు. అశ్వనీదత్ కూతుళ్లు స్వప్నాదత్, ప్రియాంకా దత్ ినా దగ్గరికొచ్చి. ‘ఓ వైవిధ్యమైన కథాంశంతో సినిమా చేస్తున్నాం. ఇందులో కీలక పాత్రను మీరు చేస్తే బాగుంటుంది’ అన్నారు. తర్వాత దర్శకుడు నాగ్ అశ్విన్ కథ చెప్పినప్పుడు, అతనికి మంచి భవిష్యత్తు ఉంటుందనిపించింది. నా పాత్ర కూడా బాగా నచ్చింది. మరి, ఈ పాత్ర ఎలాంటి తృప్తినిచ్చింది? రామయ్య పాత్ర సినిమాకు కీలకం. హీరోలో మంచి మార్పు రావడానికి కారణంగా నిలిచే పాత్ర. మామూలుగా ఓ సినిమాలో పూర్తి స్థాయి పాత్ర చేస్తే ఎన్ని అభినందనలు వస్తాయో, ఈ పాత్రకు అన్ని వచ్చాయి. బోల్డన్ని ఫోన్ కాల్స్, లెటర్స్ వచ్చాయి. కొంతమందైతే ‘సార్.. మీ వల్లే సినిమా ఆడుతోంది’ అన్నారు. అది అభిమానంతో అనే మాట. ఈ సినిమా విజయానికి నేనో కారణం మాత్రమే. ఓవరాల్‌గా సినిమా చాలా బాగుంటుంది. రామయ్య పాత్ర గెటప్ చాలా బాగుంటుంది. చిన్ని చిన్ని సంభాషణలతో, ఎదుటి వ్యక్తిని ప్రభావితం చేసే హావభావాలతో సాగే ఆ పాత్రకు మంచి నటన కనబరచడానికి కుదిరింది. దాంతో నటుడిగా సంతృప్తినిచ్చింది. ఒక పాత్ర అంగీకరించిన తర్వాత మీరు చేసే కసరత్తులు ఎలా ఉంటాయి? నేనే పాత్ర చేసినా నేను కనిపించకుండా ఆ పాత్రే కనిపించాలనుకుంటాను. ఈ విషయంలో నాకు ఎస్వీ రంగారావుగారు ఆదర్శం. నా తొలి చిత్రం ‘చిలకా గోరింక’లో ఆయన కాంబినేషన్లో చేశాను. మొదటి సినిమాకే అంతటి నటుడితో చేయడం, అది కూడా ఆయనకు దీటైన పాత్ర కావడంతో చాలా పట్టుదలగా చేశాను. ఎస్వీ రంగారావుగారు చాలా మెచ్చుకున్నారు. ఆ సమయంలో ఆయనో సలహా కూడా ఇచ్చారు. అదేంటంటే, ‘‘నువ్వు ఒక పాత్ర ఒప్పుకున్న తర్వాత, షూటింగ్లో క్లోజ్ షాట్ పెట్టి ‘అక్కడ చూడండి’ అని దర్శకుడంటే ‘ఎందుకు చూడాలి?’ అనడగాలి. అదే భయపడే సీన్ అయితే ‘దేనికి భయపడాలి. పులిని చూసినప్పుడు కలిగే భయం ఒకలా ఉంటుంది. మనిషిని చూస్తే ఒకలా ఉంటుంది? నా భయం ఎలా ఉండాలి’ అని అడగాలి. అలా ఓ పది ప్రశ్నలేసి డెరైక్టర్‌ను విసిగిస్తే, అతను తనకేం కావాలో బాగా వివరిస్తాడు. అప్పుడు మనం కూడా సహజమైన నటన కనబర్చగలుగుతాం. పాత్రకు ఎలాంటి హావభావాలు కనబరచాలో తెలుసుకోగలుగుతాం’ అన్నారు. ఆ మాటలు నా మీద బాగా పని చేశాయి. అప్పటి నుంచీ దర్శకుడు తాను అనుకున్నది వివరంగా చెప్పేవరకూ ప్రశ్నించడం నేర్చుకున్నా. నా విజయ రహస్యం కూడా అదే. తెలుగు నటీనటులు, ఇతర భాషల నటీనటులను పోలిస్తే... ‘సహజమైన నటన’ ప్రదర్శించే తారల సంఖ్య ఎక్కడ ఎక్కువగా ఉంది? నిస్సంకోచంగా తెలుగు పరిశ్రమకు చెందిన నటీనటులే అంటాను. అప్పట్లో తమిళ పరిశ్రమలో అగ్రహీరోలుగా రాణించినవారిలో చాలామంది ఎక్కువ డ్రామా పండించేవారు. ఉదాహరణకు శివాజీ గణేశన్ భారీ డైలాగ్‌లతో, అంతకు మించిన నటనతో ప్రేక్షకులు చప్పట్లు కొట్టేలా చేసేవారు. ఎస్వీ రంగారావుగారు కూడా భారీ డైలాగులు చెప్పారు. కానీ, నటనలో డ్రమటైజేషన్ ఉండదు. ఒక సినిమాలో కేవలం కంటి చూపుతో ఆయన పలికించిన హావభావాలకు ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. ఎస్వీ రంగారావుగారు, కన్నాంబగారు... ఇలా కొంతమంది నటీనటులు నటించినట్లుగా ఉండదు. జీవించినట్లుగా ఉంటుంది. తమిళ, హిందీ రంగాల్లో కన్నా మన తెలుగు పరిశ్రమలోనే సహజత్వానికి దగ్గరగా నటించే తారలు ఎక్కువ ఉన్నారు. గుణశేఖర్ ప్రతిష్ఠాత్మకంగా తీస్తున్న ‘రుద్రమదేవి’లో మీ పాత్ర గురించి? ఇందులో నాది గణపతిదేవుడి పాత్ర. చారిత్రక పాత్ర కాబట్టి, సంభాషణలు శక్తిమంతంగా ఉంటాయి. అయితే అవి ఉపన్యాసం తరహాలో ఉండవు. చిత్రానికి కీలకమే కాక, నటనకు అవకాశం ఉన్న పాత్ర. గెటప్ కూడా బాగుంటుంది. కొంతమంది ఈ చిత్రం రషెస్ చూశారు. చాలా బాగుందన్నారు. నాక్కూడా సంతృప్తికరంగా అనిపించింది. ఎప్పట్నుంచో మీ దర్శకత్వంలో ‘ఒక్క అడుగు’ సినిమా చేయాలనుకుంటున్నారు కదా! దాని గురించి? అవును. అప్పటి ఎన్నికల నేపథ్యంలో కథ తయారు చేశాం. కానీ, ఎన్నికలు పూర్తి కావడంతో వాయిదా వేశాం. ఇప్పుడా కథను మార్చేశాం. తప్పకుండా ఈ చిత్రం ఉంటుంది. -
ఎవరు గెలిచినా 'మా'ను ముందుకు నడిపించాలి..
హైదరాబాద్ : 'మా' అసోసియేషన్ ఎన్నికలు సరదాగా, ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని సీనియర్ నటుడు కృష్ణంరాజు చెప్పారు. ఎవరు గెలిచిన అసోసియేషన్ ను ముందుకు నడిపిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సినీ ఇండస్ట్రీలో ఇబ్బంది పడుతున్న చిన్న చిన్న నటులకు సహాయం చేయాలన్నారు. -
సినిమా చూపిస్తారట!
ఆ మధ్య విడుదలైన ‘రేసు గుర్రం’లో ‘సినిమా చూపిస్త మావా..’ పాట ఎంత హిట్టయ్యిందో తెలిసిందే. ఇప్పుడదే పదాలను టైటిల్‌గా చేసుకుని బోగాది అంజిరెడ్డి, బెక్కెం వేణుగోపాల్, రూపేష్ డి.గోవిల్, జి. సునీత నిర్మిస్తున్న చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాజ్ తరుణ్ హీరో. నటుడు కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముహూర్తపు దృశ్యానికి హీరో ‘అల్లరి’ నరేశ్ కెమెరా స్విచాన్ చేయగా, నిర్మాత డి. సురేశ్‌బాబు క్లాప్ ఇచ్చారు. దర్శకులు భీమనేని శ్రీనివాసరావు గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ -‘‘వినోద ప్రధానంగా సాగే చిత్రం ఇది. ఇందులో మావగారి పాత్రను సాయికుమార్, బావమరుదుల పాత్రలను సంపూర్ణేష్‌బాబు, సప్తగిరి చేస్తున్నారు’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సమర్పణ: అంజిరెడ్డి ప్రొడక్షన్స్, ఆర్.డి.జి. ప్రొడక్షన్స్. -
‘తూర్పు’న తారల తళుకులు
ఎన్నికల రణరంగంలో సినీ తారల తళుకులు తూర్పు గోదావరి జిల్లా రాజకీయ చరి త్రకు ఓ ప్రత్యేకతను సంతరించి పెడుతున్నాయి. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పోటీ చేసి, విజయాన్ని సొంతం చేసుకున్న తారలు ఉన్నారు. గోదావరి వాసులు కళాకారులను ఆదరిస్తారనడానికి ఆ విజయాలే తార్కాణం. కాగా ఇక్కడి నుంచి బరిలో నిలిచి అదష్టాన్ని పరీక్షించుకోవాలని ఆశ పడ్డ వారిలో నిరాశే మిగిలిన వారూ ఉన్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో జిల్లాలోని వివిధ నియోజక వర్గాల నుంచి బరిలో ఉండి గెలిచిన వారు, ఓడిన వారు, అదష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్న వారి వివరాలు జమున సినీ తారల తళుకు బెళుకులతో సీట్లు సాధించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ 1989 ఎన్నికల్లో రాజమండ్రి పార్లమెంటు స్థానం నుంచి ప్రముఖ నటి జూలూరి జమునను బరిలోకి దింపింది. ఆ ఎన్నికల్లో విజయం సాధించిన జమున 1989 నుంచి 1991 వరకూ ఎంపీగా కొనసాగారు. 1991లో పోటీచేసి ఓడిపోయారు. కృష్ణంరాజు పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరుకు చెందిన కృష్ణంరాజు బీజేపీ నుంచి 1998లో కాకినాడ ఎంపీగా గెలిచి, విదేశీ వ్యవహారాల సహాయమంత్రిగా కొనసాగారు. 1999లో ఓడిపోయారు. 2004లో నర్సాపురం నుంచి ఎంపీగా నెగ్గారు. 2009లో పీఆర్పీ తరఫున రాజమండ్రి ఎంపీగా పోటీ పడి ఓడిపోయారు. మురళీమోహన్ రాజమండ్రి లోక్‌సభ స్థానానికి మురళీమోహన్ స్థానికుడు కాకపోయినా 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ను సినీ గ్లామర్‌తో ఎదుర్కోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయనను అభ్యర్థిగా నిలుపగా ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారు. జయప్రద పై నటులందరూ స్థానికేతరులుగా ఉండి ఈ ప్రాంతంలో బరిలో నిలిచారు. కానీ రాజమండ్రి ఆడపడుచు జయప్రద మరో రాష్ట్రంలో ఎన్నికల గోదాలో దిగి విజయాలు సాధించారు. 1962లో రాజమండ్రిలో పుట్టిన జయప్రద చిన్ననాడే నగరం వదిలి వెళ్లి పోయారు. 1994లో టీడీపీలో చేరిన జయప్రద ఎన్టీఆర్ మరణానంతరం పార్టీని వీడారు. తర్వాత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ పార్లమెంటు నియోజక వర్గం నుంచి 2004, 2009 ఎన్నికల్లో విజయం సాధించారు. అక్కడ వ్యక్తిగత, రాజకీయపరమైన ప్రతిష్టను దెబ్బతీసే విధంగా పలు విమర్శలు ముప్పిరిగొన్నా తట్టుకుని నిలబడ్డారు. బాబూమోహన్ ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన తర్వాత పార్టీలో చేరి మెదక్ జిల్లా ఆంధోల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రముఖ హాస్యనటుడు బాబూమోహన్ ఎన్టీఆర్ మరణానంతరం లక్ష్మీ పార్వతి నాయకత్వంలోని ఎన్టీఆర్ టీడీపీలో చేరారు. 1996 ఎన్నికల్లో అమలాపురం ఎస్సీ రిజర్వుడు స్థానం నుంచి పార్లమెంటు స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో టీడీపీ ఓట్లు చీల్చి, ఆ పార్టీ అభ్యర్థి బాలయోగి పరాజయానికి కారకులయ్యారని ప్రచారం సాగింది. బాబూమోహన్ 1.43 లక్షల ఓట్లు పొంది మూడోస్థానంలో నిలిచారు. 1998లో ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలోనూ పోటీ చేసిన బాబూ మోహన్ అప్పుడూ ఓటమినే చవి చూశారు. హేమ సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి హేమ ఈ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. విభిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన ఆమె పొలిటికల్ పాత్రలోకి ప్రవేశిస్తున్నారు. తన సొంత జిల్లా తూర్పుగోదావరి నుంచి జై సమైక్యాంధ్ర పార్టీ తరపున ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈ ఎన్నికల్లో మండపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి హేమ పోటీ చేస్తున్నారు.