సినిమా చూపిస్తారట! | cinema chupista mama movie shooting Began | Sakshi
Sakshi News home page

సినిమా చూపిస్తారట!

Published Wed, Oct 8 2014 10:37 PM | Last Updated on Sat, Sep 2 2017 2:32 PM

సినిమా చూపిస్తారట!

సినిమా చూపిస్తారట!

ఆ మధ్య విడుదలైన ‘రేసు గుర్రం’లో ‘సినిమా చూపిస్త మావా..’ పాట ఎంత హిట్టయ్యిందో తెలిసిందే. ఇప్పుడదే పదాలను టైటిల్‌గా చేసుకుని బోగాది అంజిరెడ్డి, బెక్కెం వేణుగోపాల్, రూపేష్ డి.గోవిల్, జి. సునీత నిర్మిస్తున్న చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాజ్ తరుణ్ హీరో. నటుడు కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముహూర్తపు దృశ్యానికి హీరో ‘అల్లరి’ నరేశ్ కెమెరా స్విచాన్ చేయగా, నిర్మాత డి. సురేశ్‌బాబు క్లాప్ ఇచ్చారు. దర్శకులు భీమనేని శ్రీనివాసరావు గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ -‘‘వినోద ప్రధానంగా సాగే చిత్రం ఇది. ఇందులో మావగారి పాత్రను సాయికుమార్, బావమరుదుల పాత్రలను సంపూర్ణేష్‌బాబు, సప్తగిరి చేస్తున్నారు’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సమర్పణ: అంజిరెడ్డి ప్రొడక్షన్స్, ఆర్.డి.జి. ప్రొడక్షన్స్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement