
దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తూ దొరికిపోయిన కన్నడ నటి రన్యా రావు (Ranya Rao Case) కేసులో రోజుకో ట్విస్ట్ బయటకు వస్తోంది. తాజాగా ఈ కేసు మరో మలుపు తిరిగింది. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో తెలుగు నటుడు తరుణ్ రాజ్ కొండూరుని పోలీసులు అరెస్ట్ చేశారు.
‘పరిచయం’(2018)అనే సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన తరుణ్ రాజ్.. డెబ్యూ ఫిల్మ్‌తోనే ప్లాప్‌ని మూటగట్టుకున్నాడు. లక్ష్మీకాంత్ చెన్నా ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, సిమ్రత్ కౌర్ హీరోయిన్‌గా నటించింది. 2018 తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు. ఇప్పుడు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ కావడంతో తరుణ్‌రాజ్ కొండూరు పేరు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

రోజుకో ట్విస్ట్
గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టై ప్రస్తుతం డీఆర్ఐ కస్టడీలో ఉన్న కన్నడ నటి రన్యారావు గురించి రోజుకో ట్విస్ట్ బయటకు వస్తూనే ఉంది. ఆమెకు గత నవంబర్‌లో వివాహం అయిందట. పెళ్లయిన నెల నుంచే తాము విడిగా ఉంటున్నట్లు ఆమె భర్త జతిన్ హుక్కేరి కోర్టులో వెల్లడించారు. తాము అధికారికంగా విడిపోలేదని, అయితే కొన్ని కారణాల వల్ల వేరుగా జీవిస్తున్నామని చెప్పారు.
ఈ కేసు విషయంలో తాజాగా జతిన్ హుక్కేరీని అధికారులు కర్ణాటక హైకోర్టులో హాజరుపరిచారు. రన్యారావు చేస్తున్న స్మగ్లింగ్ తో ఏమైనా సంబంధాలు ఉన్నాయన్న కోణంలో జతిన్ ను కస్టడీకి ఇవ్వాలంటూ డీఆర్ఐ కోరింది. ఈ క్రమంలోనే జతిన్ ను మరోసారి ఈరోజు(సోమవారం) కోర్టు ముందు హాజరుపరిచారు. అయితే రన్యారావు స్మగ్మింగ్ తో తనకు ఏమీ సంబంధం లేదని చెబుతున్న జతిన్.. తాము పెళ్లి చేసుకున్నాం.. కానీ వేరుగా ఉంటున్నామని కోర్టుకు తెలిపాడు. ఇదే విషయాన్ని జతిన్ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. అతని విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న కోర్టు.. తదుపరి విచారణ వరకూ జతిన్ పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని అధికారులను ఆదేశించారు.
ఏం జరిగింది?
నటి రన్యారావు మార్చి 3న బెంగళూరు ఎయిర్‌పోర్టులో 14 కిలోల బంగారాన్ని అక్రమంగా తీసుకొస్తూ పట్టుబడింది. ఈమెకు సీనియర్ ఐపీఎస్ అధికారి కె.రామచంద్రారావు సవతి తండ్రి అవుతాడు. భద్రతా తనిఖీలను తప్పించుకునేందుకు తండ్రి పేరును దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలున్నాయి. ఆమెను అరెస్టు చేసిన అధికారులు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

Comments
Please login to add a commentAdd a comment