Preminchukundam Raa Movie Heroine Anjala Zaveri Life Story In Telugu - Sakshi
Sakshi News home page

గుర్తుపట్టలేనంతగా మారిన ‘ప్రేమించుకుందాం రా’ హీరోయిన్‌.. ఇప్పుడెలా ఉంది?

Feb 26 2023 11:25 AM | Updated on Feb 26 2023 11:48 AM

Preminchukundam Raa Movie Heroine Anjala Zaveri Present Life Story In Telugu - Sakshi

టాలీవుడ్‌లోకి ప్రతి ఏడాది పదుల సంఖ్యలో కొత్త హీరోయిన్లు వస్తుంటారు. వారిలో కొందరు తొలి సినిమాతోనే విజయం సాధించి స్టార్‌ హీరోయిన్‌గా అవతరిస్తే.. మరికొందరు తొలి సినిమాతోనే కనుమరుగైపోతారు.  ఇంకొంత మంది అయితే వరుస సినిమాలు చేస్తూ తమదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తూనే సడన్‌గా వెండితెరకు దూరమవుతారు. అలాంటి వారిలో అంజలా ఝవేరి ఒకరు.

ఈ పేరు అందరికి తెలియకపోవచ్చు కానీ.. ఆమె నటించిన సినిమాల పేర్లు చెబితే ఈజీగా గుర్తుపట్టేస్తారు. విక్టరీ వెంకటేశ్‌ హీరోగా నటించిన ‘ప్రేమించుకుందాం రా’ చిత్రంలో పక్కింటి అమ్మాయి కావేరి పాత్రలో నటించిన బ్యూటీయే ఈ అంజలా ఝవేరి. ఇది ఆమె తొలి సినిమా. ఫస్ట్‌ సినిమాలోనే తనదైన నటనతో ఆకట్టుకున్న ఈ బ్యూటీకి రెండో సినిమా ఏకంగా మెగాస్టార్‌ చిరంజీవి సరసన నటించే అవకాశం లభించింది. 

టాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ గుణ శేఖర్‌ దర్శకత్వంలో మెగాస్టార్‌ నటించిన చిత్రం ‘చూడాలని ఉంది’. 1998లో విడుదలైన ఈ చిత్రంలో సౌందర్య మొదటి హీరోయిన్‌ కాగా.. అంజలా ఝవేరి సెకండ్‌ హీరోయిన్‌గా నటించింది. అది కూడా సూపర్‌ హిట్‌ కావడంతో ఈ బ్యూటీకి వరుస అవకాశాలు వచ్చాయి. 'రావోయి చందమామ', 'దేవీ పుత్రుడు', 'ప్రేమ సందడి' లాంటి హిట్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించి ముఖ్యంగా యూత్​లో మంచి క్రేజ్ సంపాదించుకుంది.  

తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ మూవీల్లో నటించిన ఈ భామ చాలా మంది అగ్రహీరోలతో జతకట్టి స్టార్ హీరోయిన్​గా పేరు తెచ్చుకుంది. ఇలా కెరీర్ పీక్ స్టేజిలో ఉండగానే బాలీవుడ్‌ నటుడు తరుణ్‌ అరోరాని పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.

పెళ్లి తర్వాత సినిమాలకు గ్యాప్‌ ఇచ్చిన అంజలా ఝవేరి.. 2012లో చివరగా లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో నటించింది. ఆ తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించలేదు. మంచి పాత్రలు వస్తే మళ్లీ నటించేందుకు అంజలా ఝవేరి సిద్ధంగా ఉన్నట్లు ఆమె భర్త తరుణ్‌ అరోరా చెప్పారు. ప్రస్తుతం అతను తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో స్టైలిష్ విలన్‌గా రాణిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement