
కుటుంబ సభ్యులు, అభిమానుల అశ్రునయనాల మధ్య రెబల్ స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియలు ముగిశాయి. మోయినాబాద్‌లోని కనకమామిడి ఫామ్‌హౌజ్‌లో ప్రభుత్వ లాంచనాల మధ్య అయన అంతిమ విడ్కోలు పిలికారు. ఆయన అంతిమ సంస్కరణలో సినీ రాజకీయ ప్రముఖులతో పాటు వేలాది సంఖ్యలో అభిమానులు కనకమామిడి ఫామ్‌హౌజ్‌కు తరలి వచ్చారు. ఆయన హఠాన్మరణంతో తెలుగు సినీ పరిశ్రమ ఒక్కసారిగా విషాదంలోకి వెళ్లిపోయింది. ఇదిలా ఉంటే కృష్ణం రాజుకు ముగ్గురు ఆడపిల్లలు అనే విషయం తెలిసిందే. వారిలో ఎవరికి ఇంకా పెళ్లి కాలేదు.
చదవండి: కృష్ణంరాజుకు జయప్రద నివాళి.. వెక్కెక్కి ఏడ్చిన నటి
కూతుళ్ల పెళ్లి చూడకుండానే ఆయన కన్నుమూయడం తీవ్రంగా బాధిస్తోంది. సాధారణంగా సినీ నేపథ్య కుటుంబంలో జన్మించిన వారు తెరకు చాలా దూరం. ఫ్యామిలీ ఫంక్షన్స్‌లో తప్పా ఎలాంటి సినిమా ఈవెంట్స్‌లోనూ వారు కనిపించరు. ఇక వారి ఫొటోలు కూడా సోషల్ మీడియాలో చాలా అరుదుగా కనిపిస్తాయి. ఆయన ముగ్గురు కుమార్తెలు మీడియా ముందుకు వచ్చింది కూడా చాలా తక్కువే. తాజాగా ఆయన మరణంతో కృష్ణంరాజు ముగ్గురు కూతుళ్లు ఏం చేస్తుంటారనేది ప్రస్తుతం అందిరిలో తలస్తోన్న విషయం. దీంతో వారి గురించి నెటిజన్లు ఆరా తీయడం మొదలు పెడుతున్నారు.
చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన రజనీకాంత్ కూతురు
అయితే ఆయన ముగ్గురు కూతుళ్లలో పెద్ద కూమార్తె ప్రసీద రీసెంట్‌గా లండన్‌లో ఏంబీఏ పూర్తి చేశారు. అంతేకాదు ప్రభాస్ ‘రాధేశ్యామ్’ చిత్రంతో ఆమె నిర్మాతగా సినీరంగ ప్రవేశం కూడా చేశారు. ఇక రెండో కూమార్తె ప్రకీర్తి హైదరాబాద్‌లోని జేఎన్టీయూ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్‌గా చదువుతున్నారు. మూడో అమ్మాయి ప్రదీప్తి సైకాలిజీలో డిగ్రీ పూర్తి చేశారు. అయితే ముగ్గురు కూమార్తెల్లో కృష్ణంరాజు ఎవరి పెళ్లి చూడకుండానే మృతి చెందారు. ఆయన ఎంతో ప్రేమించే తమ్ముడి కుమారుడైన ప్రభాస్ వివాహం కూడా చూడకుండానే అకాలంగా ఆయన మరణించడం అభిమానులను తీవ్రంగా కలచివేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment