నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్-2 ఓటీటీలో దూసుకెళ్తోంది. ఈ సారి టాలీవుడ్ ప్రముఖులతో షో ఓ రేంజ్‌లో టాక్ వినిపిస్తోంది. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ షోకు హాజరైన సంగతి తెలిసిందే. గోపీచంద్‌తో కలిసి ప్రభాస్ సందడి చేశారు. బాలయ్యతో వేసే సరదా ప్రశ్నలతో అందరినీ నవ్వించారు. ఈ ఎపిసోడ్‌ను రెండు పార్టులుగా ఆహా విడుదల చేసింది.
ప్రభాస్ ఎమోషనల్: ఈ ఎపిసోడ్‌లో పెదనాన్న కృష్ణంరాజు జ్ఞాపకాలను తెరపై చూస్తూ ప్రభాస్ భావోద్వేగానికి గురయ్యారు రెబల్ స్టార్. ఆయన మృతి పట్ల నటుడు గోపీచంద్, ప్రభాస్‌తో పాటు నందమూరి బాలకృష్ణ మౌనం పాటించి సంతాపం తెలిపారు.
ప్రభాస్ మాట్లాడుతూ.. 'ఈరోజు మనం ఇక్కడ ఉన్నామంటే ఆయనే కారణం. ఆయనకు మనందరం రుణపడి ఉంటాం. ఆ రోజుల్లో మద్రాస్ నుంచి వచ్చి 10-12 ఏళ్లు విలన్‌గా చేసి సొంత బ్యానర్ ప్రారంభించి మహిళలతో చరిత్ర సృష్టించాడు. లేడీస్ ఓరియంటెడ్ కథలు తీశారు. ఈరోజు మా కుటుంబం ఆయన్ను చాలా మిస్సవుతున్నాం. ఐ లవ్ హిమ్' అంటూ ఎమోషనలయ్యారు. బాలకృష్ణ మాట్లాడుతూ.. 'ఆ సమయంలో షూటింగ్ కోసం టర్కీలో ఉన్నా. ఆ క్షణం ఈ వార్త తెలియగానే ఏడుపు ఆపుకోలేక పోయాను.' అని అన్నారు.
Love cant have long descriptions..... I Love Him is enough gave a sense of still alive ❤️😭
— Raju Garu Prabhas 🏹 (@pubzudarlingye) January 6, 2023
Balayya hugged .#Prabhas on Peddhanana's behalf...... the true Heir #UnstoppableWithPrabhas pic.twitter.com/XvlmQjVFuX
Comments
Please login to add a commentAdd a comment