broadcasting
-
మీడియా సంస్థకు ఇజ్రాయెల్ సైనికుల వార్నింగ్
గాజాపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో వెస్ట్‌బ్యాంక్ రమల్లాలోని ఖతార్ బ్రాడ్‌కాస్టర్ అల్ జజీరా ఆఫీసులో ఆదివారం సోదాలు చేశారు ఇజ్రాయెల్ సైనికులు. ఒక్కసారిగా ముసుగులు ధరించిన ఇజ్రాయెల్ సైనికులు అల్ జజీరా భవనంలోకి ప్రవేశించారు. సిబ్బంది ఆఫీసులో ఉన్న కెమెరాలు తీసుకొని త్వరగా అక్కడి నుంచి తీసుకొని వెళ్లిపోవాలని ఆదేశించారు. ఛానెల్ ఆఫీసును మూసివేయాలని అల్ జజీరా నెట్వర్క్ వెస్ట్‌బ్యాంక్ బ్యూరో చీఫ్ వాలిద్ అల్ ఒమారీను ఆదేశించారు. ఛానెల్ ప్రసారాలను 45 రోజుల్లో పూర్తిగా నిలిపివేయాలని సైనికులు చెప్పగా.. ఆయన లైవ్‌లోనే చదివినట్లు స్థానిక మీడియా పేర్కొంది.HAPPENING NOW:Israeli soldiers are raiding Al Jazeera’s office in Ramallah and forcing it to stop broadcasting in the West Bank for 45 days.Israel is planning something terrifying across the West Bank, and doesn’t want the world to see. pic.twitter.com/mVr07W6A6M— sarah (@sahouraxo) September 22, 2024ఇక.. జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ఆరోపిస్తూ అల్ జజీరా కార్యకలాపాలను ఇజ్రాయెల్‌లో ప్రసారాలు నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. మేలో నెలలో అల్ జజీరా.. తన కార్యాలయంగా ఉపయోగించుకుంటున్న జెరూసలేం హోటల్‌పై ఇజ్రాయెల్ దాడి చేసిన తర్వాత ఆదివారం ఈ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది.బలవంతంగా 45 రోజుల్లో ప్రసారాలు పూర్తిగా నిలిపివేయాలని నిషేధం విధించడాన్ని అల్ జజీరా తీవ్రంగా ఖండించింది. ఇది మానవ హక్కులు, సమాచారాన్ని పొందే ప్రాథమిక హక్కును ఉల్లంఘించే నేరపూరిత చర్య అని అభివర్ణించింది. గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ మీడియాపై కొనసాగిస్తున్న అణచివేత అంతర్జాతీయ, మానవతా చట్టాలకు విరుద్ధంగా ఉందని పేర్కొంది.చదవండి: లెబనాన్‌పై ఇజ్రాయెల్ యుద్ధ విమానాల విధ్వంసం -
మీడియా స్వేచ్ఛకు కళ్లెమా!
వక్ఫ్ బిల్లుపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఏర్పాటు చేయకతప్పని పక్షం రోజుల్లోనే ప్రస్తుతం భిన్నవర్గాల పరిశీలనలో ఉన్నదని చెబుతున్న బ్రాడ్‌కాస్టింగ్ సర్వీసెస్ రెగ్యులేషన్ బిల్లు ముసాయిదాను కేంద్రంలోని ఎన్డీయే సర్కారు వెనక్కి తీసుకుంది. కారణమేదైనా ఇది ఆహ్వానించ దగ్గ పరిణామం. ఈ బిల్లు తొలి ముసాయిదా నిరుడు నవంబర్‌లో విడుదల చేయగా దానిపై వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నామని చెబుతూ గత నెల రెండో ముసాయిదా తీసుకొచ్చారు. తాజాగా దాన్ని కూడా వెనక్కి తీసుకున్నారు. వచ్చే అక్టోబర్ 15 వరకూ ముసా యిదా బిల్లుపై సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతుందని ప్రభుత్వం చెబుతోంది. బహుశా శీతా కాల సమావేశాలనాటికి దీనికి తుదిరూపం ఇవ్వాలన్నది పాలకుల ఉద్దేశం కావొచ్చు. డిజిటల్ మీడియా ప్రస్తుతం ఊహకందని రీతిలో విస్తరించింది. 1959లో ప్రయోగాత్మకంగా ఢిల్లీలో ప్రారంభించిన టెలివిజన్ ప్రసారసేవలు 80వ దశకం చివరినాటికి కొత్త పుంతలు తొక్కాయి. స్టార్ టీవీ, ఎంటీవీ, బీబీసీ, సీఎన్ఎన్ వగైరాలు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ప్రస్తుతం యూట్యూబ్, ఫేస్బుక్, ట్విటర్వంటి సామాజిక మాధ్యమాలతోపాటు ఓటీటీలు వచ్చాయి. వాట్సాప్, టెలిగ్రామ్ వంటివి సరేసరి. అన్నింటా మంచీ చెడూ ఉన్నట్టే వీటివల్ల కూడా సమస్యలు ఎదురువుతూ ఉండొచ్చు. అవి దుష్పరిణామాలకు దారితీయటం నిజమే కావొచ్చు. అందుకు తగిన చట్టాలు తీసుకు రావటం కూడా తప్పేమీ కాదు. కానీ ఈ మాధ్యమాలను నియంత్రించే పేరిట భావప్రకటనా స్వేచ్ఛకు కళ్లెం వేయాలనుకోవటం, అసమ్మతిని అణిచేయాలనుకోవటం ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. బ్రాడ్‌కాస్టింగ్ సర్వీసెస్ రెగ్యులేషన్ ముసాయిదా బిల్లు చేస్తున్నది అదే. గతంలో కేబుల్ రంగం హవా నడిచినప్పుడు వీక్షకులకు ఇష్టం ఉన్నా లేకున్నా అనేక చానెళ్లు వచ్చిపడేవి. వర్తమానంలో అలా కాదు. ఏం చూడాలో, వద్దో నిర్ణయించుకునే స్వేచ్ఛ వీక్షకులకు ఉంటుంది. పార్టీలకు అమ్ముడుపోయిన చానెళ్లు వాస్తవాలను వక్రీకరిస్తున్నారని అర్థమయ్యాక జనం వాటిని చూడటం మానుకుంటున్నారు. ఆన్లైన్లో ప్రత్యామ్నాయాలను వెదుక్కుంటున్నారు. తమకు నచ్చిన, తాము తెలుసుకోవాలనుకుంటున్న విషయం ఉన్నదనుకుంటేనే ఆన్లైన్లో లభ్య మయ్యే వీడియోలను వీక్షిస్తారు. వార్తా విశ్లేషణలను చదువుతారు. ఒక అంశంపై ఎవరెవరి అభిప్రా యాలు ఎలావున్నాయో తెలుసుకుంటారు. ఈ క్రమంలో సహజంగానే ప్రజలను పక్కదోవపట్టించేవాళ్లు ఉంటారు. అశ్లీలతనూ, దుర్భాషలనూ గుప్పించేవారుంటారు. తప్పుడు కథనాలను ప్రసారం చేసేవారూ ఉంటారు. అలాంటివారిపై తగిన చర్యలు తీసుకోవటాన్ని ఎవరూ కాదనరు. కానీ నిజాయితీగా అభిప్రాయాలు వ్యక్తీకరించేవారిని కూడా వారితో సమంచేసి శిక్షించే ధోరణి ఎంతవరకూ సబబు? అత్యధిక వీక్షకుల్ని రాబట్టుకుంటున్న ఆన్లైన్ మాధ్యమాలకు సైతం ముసా యిదాలో ఏముందో అధికారికంగా తెలియదు. అనేకానేక ఆన్లైన్ చానెళ్లు, ఇతర ప్రచురణ మాధ్య మాలూ సభ్యులుగా ఉన్న డిజిపబ్ వంటి స్వయంనియంత్రణ సంస్థలకే ఈ ముసాయిదాపై ప్రభుత్వం నుంచి ఎలాంటి వర్తమానమూ లేదు. మరి కేంద్రం ఇంతవరకూ సాగించామంటున్న సంప్రదింపులు ఎవరితో జరిగినట్టు? రెండు మూడు ఓటీటీ యాజమాన్యాలనో, కార్పొరేట్ రంగ ఆధిపత్యంలో సాగుతున్న ఇతర మాధ్యమాలనో, తాము నిపుణులుగా భావించేవారినో సంప్రదిస్తే సరిపోతుందా? సాగు చట్టాల విషయంలోనూ లక్షలాదిమంది రైతులతో, వేలాది సంఘాలతో చర్చించామని అప్పట్లో ప్రభుత్వం చెప్పింది. చివరకు ఏమైంది? రైతులు పట్టుదలగా పోరాడాక వెనక్కు తీసుకోకతప్పలేదు. సమస్యేమంటే...ట్విటర్లో లక్షల్లో అనుయాయులున్న రాజకీయ నాయకులు మొదలుకొని ధ్రువ్రాఠివంటి పాపులర్ యూట్యూబర్ల వరకూ... ఎంతో నిబద్ధతతో సీనియర్ జర్నలిస్టులు నడిపే మాధ్యమాలవరకూ అందరినీ ముసాయిదా బిల్లు ఒకే గాటన కడు తోంది. ఆఖరికి పత్రికలూ, చానెళ్లూ అనుబంధంగా నడుపుతున్న డిజిటల్ మాధ్యమాలు సైతం ఈ పరిధిలోకొస్తాయి. పైగా ఈ కార్యకలాపాలు క్రిమినల్ చట్టాల పరిధిలోకి కూడా వెళ్లి అనేక కేసులు దాఖలవుతాయి. అరెస్టయితే బెయిల్ దుర్లభమవుతుంది. తటస్థంగా విశ్లేషణలందిస్తూ వేలల్లోనో, లక్షల్లోనో వీక్షకుల్ని సంపాదించుకుంటున్న వ్యక్తులు కూడా ఈ బిల్లు చట్టమైతే అనేకానేక పత్రాలు దాఖలుచేయాల్సివస్తుంది. అంతేకాదు...ఒక గ్రీవెన్స్ అధికారిని నియమించుకోవటం, స్వీయ మదింపు కమిటీని ఏర్పాటుచేసుకోవటం తప్పనిసరవుతుంది. ఈ వ్యయాన్నంతా వీక్షకులనుంచి వసూలు చేయటం సాధ్యమేనా? అసలు వచ్చే ఆదాయం ఎంత? పైగా తప్పుడు కథనాలు ప్రసారం చేశారనుకుంటే వారెంట్ లేకుండా దాడులు చేసి పరికరాలను స్వాధీనం చేసుకునే అధికారం ప్రభు త్వాలకు వస్తుందంటున్నారు.ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ విధించి విపక్షాలను జైళ్లలో కుక్కి అసమ్మతిని అణి చేశారని బీజేపీ తరచు చెబుతుంటుంది. రాజ్యాంగాన్ని హత్య చేసిన రోజుగా ప్రతియేటా జూన్ 25ను పాటించాలని కూడా పిలుపునిచ్చింది. అలాంటి పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ ముసాయిదాను తీసుకురావటం, దాన్ని బహిరంగపరచకపోవటం వింత కాదా? మన పొరుగు నున్న బంగ్లాదేశ్‌లో హసీనా హయాంలో ఇలాంటి చట్టాన్నే తీసుకొచ్చారు. కానీ అక్కడ నిరసన వెల్లువ ఆగిందా? తమ నిర్ణయాలపై సామాన్యులు ఏమనుకుంటున్నారో, వారిలోవున్న అసంతృప్తి ఏమిటో తెలుసుకోవటానికి డిజిటల్ మీడియా తోడ్పడుతుంది. అది పాలకులకే మంచిది. మీడియా స్వేచ్ఛకు గొడ్డలిపెట్టయిన ఇలాంటి ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవటం ఉత్తమం. -
ఏపీలో ఆ చానళ్ల ప్రసారాలు వెంటనే పునరుద్ధరించండి
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలో నిలిపివేసిన చానళ్ల ప్రసారాలను తక్షణమే పునరుద్ధరించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. జూన్ 6 నుంచి ఏపీలో సాక్షి, టీవీ9, ఎన్టీవీ, 10టీవీ ప్రసారాలను నిలిపివేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ మిని పుష్కర్ణ మంగళవారం విచారించారు. ఆయా చానళ్లను పునరుద్ధరించాలని కేబుల్ ఆపరేటర్లను ఆదేశించారు. లిఖితపూర్వక ఆదేశాలు ఇంకా వెబ్సైట్లో పొందుపరచాల్సి ఉంది. ఢిల్లీ హైకోర్టు నిర్ణయంపై న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ (ఎన్బీఎఫ్) హర్షం వ్యక్తం చేసింది. ఏపీలో ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా తీసుకొన్న నిర్ణయంపై కొరడా లాంటి ఆదేశాలుగా అభివరి్ణంచింది. ‘ప్రజాస్వామ్య పనితీరుకు అవసరమైన బహిరంగ, పారదర్శక మీడియా వాతావరణాన్ని నిర్వహించే ప్రాముఖ్యతను హైకోర్టు జోక్యం నొక్కి చెబుతోంది. ఈ తీర్పు పత్రికా స్వేచ్ఛను సమరి్థంచడం, జర్నలిస్టుల హక్కులను పరిరక్షించడంపై ఓ ఉదాహరణగా నిలుస్తుంది’ అని మంగళవారం ఎన్బీఎఫ్ ఓ ప్రకటనలో తెలిపింది. -
న్యూస్ చానళ్లపై నిషేధం ఎత్తేయాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నాలుగు న్యూస్ చానళ్లపై మల్టిపుల్ సిస్టమ్ ఆపరేటర్లు (ఎంఎస్‌వోలు) విధించిన అప్రకటిత ఆంక్షలను అంతర్జాతీయ సంస్థలు తప్పుపడుతున్నాయని ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా ఉన్న ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (ఐఎఫ్‌జే) ఈ అప్రకటిత నిషేధం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిందన్నారు.రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛకు తీవ్ర విఘాతం కలిగిందని, ప్రసారాలు తిరిగి పునరుద్ధరించడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని బ్రస్సెల్ కేంద్రంగా ఉన్న ఆ సంస్థ సూచించిందని వెల్లడించారు. న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అండ్ డిజిటల్ అథారిటీ (ఎన్బీడీఏ) కూడా ఈ అప్రకటిత నిషేధాన్ని ఖండించిందని తెలిపారు. కేబుల్ ఆపరేటర్లపై ఒత్తిడి తెచ్చి ప్రసారాలు నిలిపివేయడం టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నిబంధనలకు విరుద్ధమని చెప్పిందన్నారు.రాష్ట్రంలోని పాలకులు ఈ వ్యవహారంతో తమకేమీ సంబంధం లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. ప్రభుత్వ చర్యల కారణంగా అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర ఇమేజ్ దెబ్బతిందని కృష్ణంరాజు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తెలంగాణలో కొన్ని న్యూస్ చానళ్ల ప్రసారాలను అక్కడి కేబుల్ ఆపరేటర్లు నిలిపివేయడాన్ని చంద్రబాబు తప్పుపట్టారన్నారు. ఆ తప్పు ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతుంటే ఆయన తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.ఉత్తరప్రదేశ్ వర్సెస్ రాజ్ నారాయణ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1) (ఎ), 19(1) (జి) భావ ప్రకటనా స్వేచ్ఛకు హామీ ఇస్తోందని చెప్పిందని గుర్తు చేశారు. ప్రజాహితానికి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడానికి , తెలుసుకోవడానికి కూడా ఆ ఆర్టికల్ హామీ ఇస్తోందని తెలిపారు. కాబట్టి సాక్షి, టీవీ9, ఎన్టీవీ, 10టీవీలపై విధించిన అప్రకటిత నిషేధాన్ని వెంటనే తొలగించాలని కోరారు. -
Winter Parliament Session 2023: పత్రికల రిజిస్ట్రేషన్ ఇక సులభతరం
న్యూఢిల్లీ: ప్రచురణ రంగానికి సంబంధించిన బ్రిటిష్ పాలన కాలం నాటి చట్టం స్థానంలో పత్రికల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసేందుకు ఉద్దేశించిన బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. సమాచార, ప్రసార శాఖల మంత్రి అనురాగ్ వైష్ణవ్ గురువారం లోక్‌సభలో ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు–2023ను ప్రవేశ పెట్టారు. ఇప్పటిదాకా అమల్లో ఉన్న ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్(పీఆర్బీ) చట్టం–1867 ప్రకారం పత్రికలను రిజిస్టర్ చేసుకోవాలంటే ఎనిమిదంచెల కఠినమైన విధానాన్ని అనుసరిస్తున్నారు. తాజా బిల్లులో దీనిని సులభతరం చేశారు. కొత్తగా పత్రికను ప్రారంభించాలనుకునే వారు ఒకే ఒక విడతలో రిజిస్టర్ చేసుకునేందుకు వీలు కల్పించేలా నిబంధనలు తీసుకొచ్చారు. ఈ బిల్లు ఆగస్ట్ 3వ తేదీన రాజ్యసభ ఆమోదం పొందింది. -
ఐటీలో పరిశోధనలకు ప్రోత్సాహంపై ట్రాయ్ కసరత్తు
న్యూఢిల్లీ: టెలికం, బ్రాడ్‌కాస్టింగ్, ఐటీ రంగాల్లో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను ప్రోత్సహించే మార్గాలను అన్వేíÙంచడంపై టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా పరిశ్రమ వర్గాలతో సంప్రదింపుల కోసం చర్చాపత్రాన్ని విడుదల చేసింది. ఐసీటీ రంగంలో ఆర్అండ్డీ కార్యకలాపాల కోసం ప్రస్తుతమున్న విధానం సరిపోతుందా లేక ప్రత్యేక ఏజెన్సీ ఏదైనా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందా అనే విషయంపై అభిప్రాయాలను కోరింది. అలాగే, ప్రైవేట్ రంగం ఆర్అండ్డీని చేపట్టేలా ప్రోత్సహించేందుకు ట్యాక్స్ మినహాయింపులు, ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహకాలు వంటి విధానాలు ఎంత వరకు ఉపయోగకరంగా ఉంటాయనేది తెలపాలని సూచించింది. దీనితో పాటు పలు ప్రశ్నలను చర్చాపత్రంలో ట్రాయ్ పొందుపర్చింది. వాటిల్లో కొన్ని.. ► ఆర్అండ్డీ ప్రోగ్రామ్‌లకు తగినన్ని నిధులను, సకాలంలో మంజూరు చేసేందుకు పారదర్శకమైన విధానాన్ని అమలు చేయడానికి ఏమేమి చర్యలు తీసుకోవచ్చు? ► నవకల్పనల స్ఫూర్తిని పెంపొందించాలంటే రాష్ట్రాలకు ర్యాంకింగ్ విధానాన్ని అమలు చేస్తే ఉపయోగకరంగా ఉంటుందా? ► భారత్‌లో పేటెంట్ ఫైలింగ్ వ్యయాలను తగ్గించాల్సిన అవసరం ఉందా? ఒకవేళ సమాధానం అవును అయితే, ఎలా చేయొచ్చు? -
స్వదేశంలో టీమిండియా ఆడే మ్యాచ్‌లు ఇవే.. ఇంగ్లండ్, ఆసీస్లతోనే అధికం
రానున్న బ్రాడ్కాస్ట్ సైకిల్లో (సెప్టెంబర్ 2023-మార్చి 2028, ఐదేళ్లు) టీమిండియా స్వదేశంలో 88 మ్యాచ్‌లు ఆడనున్నట్లు తెలుస్తుంది. ఇందులో దాదాపు సగం మ్యాచ్‌లు (39) ఇంగ్లండ్, ఆసీస్లతోనే జరుగుతాయని ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ క్రిక్‌బజ్ వెల్లడించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌తో మొదలయ్యే ఈ సైకిల్ 2028 మార్చిలో ఇంగ్లండ్‌తో జరిగే 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌తో ముగుస్తుంది. కాగా, రానున్న బ్రాడ్కాస్ట్ సైకిల్లో మీడియా హక్కుల కోసం బీసీసీఐ ఇటీవలే టెండర్లకు ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఆగస్ట్ 25 వరకు దరఖాస్తుల స్వీకరించనున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి పేర్కొంది. ఆసక్తిగల మీడియా సంస్థలు 15 లక్షల నాన్ రీఫండబుల్ ఫీజ్ చెల్లించాలని తెలిపింది. సెప్టెంబర్ 2023-మార్చి 2028 మధ్యలో స్వదేశంలో టీమిండియా ఆడబోయే సిరీస్‌ల వివరాలు.. 2023 సెప్టెంబర్: ఆస్ట్రేలియాతో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ 2023 నవంబర్: ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ 2024 జనవరి: ఆఫ్ఘనిస్తాన్‌తో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ 2024 జనవరి-మార్చి: ఇంగ్లండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ 2024 సెప్టెంబర్-అక్టోబర్: బంగ్లాదేశ్‌తో 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్, 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ 2024 అక్టోబర్-నవంబర్: న్యూజిలాండ్‌తో 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ 2025 జనవరి-ఫిబ్రవరి: ఇంగ్లండ్‌తో 3 వన్డేలు, 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ 2025 అక్టోబర్: విండీస్‌తో 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ 2025 నవంబర్-డిసెంబర్: సౌతాఫ్రికాతో 2 టెస్ట్‌లు, 3 వన్డేలు, 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ 2026 జనవరి: న్యూజిలాండ్‌తో 3 వన్డేలు, 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ 2026 జూన్: ఆఫ్ఘనిస్తాన్‌తో టెస్ట్, 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ 2026 సెప్టెంబర్-అక్టోబర్: విండీస్‌తో 3 వన్డేలు, 5 టీ20లు 2026 డిసెంబర్: శ్రీలంకతో 3 వన్డేలు, 3 టీ20లు 2027 జనవరి-మార్చి: ఆస్ట్రేలియాతో 5 టెస్ట్‌లు 2027 నవంబర్-డిసెంబర్: ఆస్ట్రేలియాతో 3 వన్డేలు, 5 టీ20లు 2028 జనవరి-మార్చి: ఇంగ్లండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ -
రూ. 10 వేల కోట్లకు టీవీ స్పోర్ట్స్ మార్కెట్
న్యూఢిల్లీ: టీవీ స్పోర్ట్స్ మార్కెట్ 2026 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 9,830 కోట్లకు చేరనుంది. అలాగే స్పోర్ట్స్ డిజిటల్ ఆదాయం రూ. 4,360 కోట్ల స్థాయిని తాకనుంది. పరిశ్రమల సమాఖ్య సీఐఐ, కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ, ఇండియా బ్రాడ్‌కాస్టింగ్ డిజిటల్ ఫౌండేషన్ (ఐబీడీఎఫ్) సంయుక్తంగా రూపొందించిన నివేదికలో ఈ అంచనాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2021 ఆర్థిక సంవత్సరంలో మొత్తం టీవీ స్పోర్ట్స్ మార్కెట్ రూ. 7,050 కోట్లుగాను, డిజిటల్ మార్కెట్ ఆదాయం రూ. 1,540 కోట్లుగా ఉంది. ఐపీఎల్ వంటి టోర్నీలతో దేశీయంగా స్పోర్ట్స్ వ్యూయర్షిప్లో క్రికెట్ అగ్రస్థానంలో కొనసాగుతోండగా.. కబడ్డీ, ఫుట్బా ల్, ఖో–ఖో వంటి క్రికెట్‌యేతర ఫ్రాంచైజీ ఆధారిత ఆటలకు కూడా క్రమంగా ఆదరణ పెరుగుతోంది. ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల్లో భారత్‌లో స్పోర్ట్స్ వ్యూయర్షిప్ 72.2 కోట్లుగా నమోదైంది. ఏడాది మొత్తం మీద చూస్తే కోవిడ్ పూర్వం (2019లో) నమోదైన 77.6 కోట్ల వ్యూయర్షిప్ను దాటేసే అవకాశాలు ఉన్నాయని నివేదిక అంచనా వేసింది. ఓటీటీ ఊతం..: ఎక్కడైనా, ఎప్పుడైనా చూసుకునే సౌలభ్యం కారణంగా ఓటీటీ (ఓవర్–ది–టాప్) ప్లాట్‌ఫామ్‌లపై స్పోర్ట్స్ వ్యూయర్షిప్ పెరుగుతోంది. అడ్వర్టయిజర్లు కూడా డిజిటల్ మాధ్యమంపై ఆసక్తి చూపుతున్నారు. ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ పెరుగుతుండటం స్పోర్ట్స్‌కి లాభించనుంది. అయితే, గడిచిన కొన్నేళ్లుగా డిజిటల్ వినియోగం పెరుగుతున్నా.. ఇప్పటికీ టీవీ స్పోర్ట్స్ మార్కెట్ ఆధిపత్యమే కొనసాగుతోందని నివేదిక తెలిపింది. మధ్య నుండి దీర్ఘకాలికంగా ఇది .. మొత్తం డిజిటల్ స్పోర్ట్స్ మార్కెట్‌కి రెండింతల స్థాయిలో ఉంటుందని పేర్కొంది. నివేదికలోని మరిన్ని విశేషాలు.. ► స్పోర్ట్స్ డిజిటల్ ఆదాయం ఏటా 22 శాతం మేర వృద్ధి చెందుతోంది. 2026 ఆర్థిక సంవత్సరం నాటికి ఇది మూడు రెట్లు పెరగనుంది. టీవీ స్పోర్ట్స్ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 7 శాతం మేర వృద్ధి చెందుతోంది. ► టీవీల వినియోగం పెరిగే కొద్దీ స్పోర్ట్స్ సబ్స్క్రిప్షన్ ఆదాయాలకు ఊతం లభించవచ్చని అంచనా. బ్రాడ్కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) అంచనాల ప్రకారం 2020లో 21 కోట్ల కుటుంబాల్లో టీవీలు ఉన్నాయి. సుమారు 90 కోట్ల మంది వీక్షిస్తున్నట్లు అంచనా. టీవీల వినియోగం ఎక్కువగానే ఉన్నప్పటికీ వాటిలో స్పోర్ట్స్ కార్యక్రమాల వ్యూయర్షిప్ మాత్రం ఇంకా భారీ స్థాయిలో లేదు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో మొత్తం టీవీ కార్యక్రమాల వీక్షణలో స్పోర్ట్స్ వాటా 10 శాతంగా ఉండగా భారత్‌లో ఇది 3 శాతంగానే ఉంది. ఈ నేపథ్యంలో ఈ విభాగంలో వృద్ధికి మరింత ఆస్కారముంది. భారతీయ క్రికెటర్లు, ఇతర క్రీడాకారులు అంతర్జాతీయ వేదికలపై మెరుపులు మెరిపిస్తుండటంతో ఆయా ఈవెంట్లను టీవీల్లో చూసేందుకు వీక్షకుల్లో ఆసక్తి పెరగవచ్చు. ► భారత్‌లో స్పోర్ట్స్‌కి సంబంధించి క్రికెట్ ఆధిపత్యమే కొనసాగుతోంది. ఐపీఎల్ సీజన్ అత్యంత ప్రభావవంతంగా ఉంటోంది. 2022లో 44వ వారం వరకూ 16,217 గంటల మేర లైవ్ క్రికెట్ కంటెంట్ టెలికాస్ట్ అయ్యింది. 2021లో ఇది 15,506 గంటలుగా నమోదైంది. పరిమాణంపరంగానూ అలాగే విస్తృతిపరంగాను ఇతరత్రా ఏ క్రీడలు కూడా క్రికెట్‌కు దరిదాపుల్లో లేవని నివేదిక పేర్కొంది. అయితే, కబడ్డీ వంటి క్రికెట్‌యేతర స్పోర్ట్స్‌ను చూడటం కూడా క్రమంగా పెరుగుతోందని వివరించింది. దీంతో ఏడాది పొడవునా ఏదో ఒక క్రీడల కార్యక్రమం వీక్షకులకు అందుబాటులో ఉంటున్నట్లు పేర్కొంది. -
ఐపీఎల్ కంటే పీఎస్ఎల్ గొప్ప అన్న వారు ఈ లెక్కలు చూస్తే ఖంగుతినాల్సిందే..!
IPL VS PSL: ఇటీవలి కాలంలో పాకిస్థాన్‌కు చెందిన కొందరు క్రికెటర్లు తమ దేశంలో జరిగే పీఎస్ఎల్ (పాకిస్థాన్ సూపర్ లీగ్) ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) కంటే తోపు అని జెబ్బలు చరుచుకున్న విషయం విధితమే. అయితే వారు వాపును చూసి బలుపు అన్న భ్రమలో ఉన్నారని తాజాగా జరిగిన ఐపీఎల్ మీడియా హక్కుల వేలం ద్వారా బహిర్గతమైంది. 2023-27 సీజన్‌కు గాను ఐపీఎల్ మీడియా హక్కుల వేలం ద్వారా బీసీసీఐ కనీవినీ ఎరుగని రీతిలో రూ. 48,390 కోట్లు అర్జించడంతో క్యాష్ రిచ్ లీగ్‌పై అవాక్కులు చవాక్కులు పేలిన పాక్ ప్రస్తుత, మాజీలు ముక్కున వేలేసుకున్నారు. ఈ స్థాయిలో ఐపీఎల్ మీడియా హక్కులు అమ్ముడుపోవడంతో వారంతా నీళ్లునములుతున్నారు. ఐపీఎల్ మీడియా హక్కులు ఈ రేంజ్లో అమ్ముడుపోవడంతో చేసేదేమీలేక ఐసీసీకి చాడీలు చెప్పడం ద్వారా తమ అక్కసుకు వెళ్లగక్కుతున్నారు. ఐపీఎల్ ప్రపంచంలోనే రెండో అత్యంత ధనవంతమైన స్పోర్ట్స్ లీగ్‌గా అవతరించడాన్ని ఆ దేశ అభిమానులతో పాటు అక్కడి రాజకీయ నాయకులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. ఐపీఎల్ వర్సెస్ పీఎస్ఎల్.. ఐపీఎల్ 2023-27 సీజన్ మీడియా హక్కులు రూ. 48,390 కోట్లకు అమ్ముడుపోగా.. 2022-2023 సీజన్‌కు గాను పీఎస్ఎల్ మీడియా హక్కులు కేవలం రూ. 166 కోట్లకు మాత్రమే అమ్ముడుపోయాయి. వచ్చే సీజన్ నుంచి ఐపీఎల్లో ఒక్కో మ్యాచ్ విలువ రూ. 118 కోట్లు (టీవీ, డిజిటల్, ఇతర రైట్స్ అన్నీ కలిపి) ఉండగా.. పీఎస్ఎల్లో కేవలం రూ. 2.76 కోట్లు మాత్రమే. ఐపీఎల్లో ఒక్కో ఓవర్ విలువ రూ. 2.95 కోట్లు కానుండగా.. పీఎస్ఎల్లో మ్యాచ్ మొత్తం విలువ మన ఒక్క ఓవర్ విలువ కంటే తక్కువే. ఐపీఎల్లో రాబోయే సీజన్ల నుంచి ఒక్కో బాల్ విలువ దాదాపు రూ. 50 లక్షలుగా ఉంటే.. పీఎస్ఎల్లో వేసే ఒక్కో బంతి విలువ లక్ష కంటే తక్కువగా ఉంది. పీఎస్ఎల్ మొత్తం మీడియా హక్కుల విలువ (రూ. 166 కోట్లు) ఐపీఎల్లో ఒక్క మ్యాచ్ విలువతో (రూ. 118 కోట్లు) పోలిస్తే కాస్త ఎక్కువగా ఉంది. మొత్తంగా చూస్తే ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ పీఎస్ఎల్ కంటే 50 రెట్లు అధికంగా ఉంది. 2017-2022 సీజన్‌కు గాను ఐపీఎల్ మీడియా హక్కులు రూ. 16,347.50 కోట్లుకు అమ్ముడుపోగా.. 2023-27 సీజన్‌కు ఈ లెక్క దాదాపు మూడింతలవ్వడం విశేషం. చదవండి: IPL 2023: కోట్లు ఇచ్చారు... కోట్లు తెచ్చుకునేదెలా? -
IPL 2023: కోట్లు ఇచ్చారు... కోట్లు తెచ్చుకునేదెలా?
పెట్టుబడిగా పెట్టిన ప్రతీ రూపాయిపై కనీస లాభం సంపాదించడమే వ్యాపారం... ముంబైలో అంబానీ అయినా ఊర్లో కిరాణా కొట్టు నడిపే వ్యక్తి అయినా ఈ విషయంలో ఒకేలా ఆలోచిస్తారు. మరి ఐపీఎల్లో ప్రసారహక్కుల కోసం వేల కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టిన సంస్థలు ఈ విషయంలో ఎలాంటి వ్యూహాలతో ఉంటాయి? ఐదేళ్ల కాలానికిగాను వారు చెల్లించబోయే మొత్తానికి ‘గిట్టుబాటు’ అవుతుందా! ప్రసార హక్కుల కోసమే మూడు వేర్వేరు సంస్థలు కలిపి బీసీసీఐకి రూ. 48,390.32 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైన నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఐపీఎల్ ఎలా ఉండబోతోంది? కేవలం వ్యాపార ప్రకటనలతోనే తమ పెట్టుబడితో పాటు లాభాలను తీసుకోవడం ఈ సంస్థలకు సాధ్యమేనా! ఇంకా చెప్పాలంటే ఈ భారీ మొత్తం వల్ల ఐపీఎల్లో ఎలాంటి మార్పులు వస్తాయనేది ఆసక్తికరం! రూ. 118.02 కోట్లు... టీవీ, డిజిటల్ విభాగాలు కలిపి చూస్తే ఒక్కో ఐపీఎల్ మ్యాచ్‌కు ప్రసారకర్తలు చెల్లించబోయే మొత్తం ఇది. ఇంకా వివరంగా చెప్పాలంటే 410 మ్యాచ్‌లలో మ్యాచ్‌కు 40 ఓవర్ల చొప్పున (ఎక్స్ట్రా బంతులు కాకుండా) 98,400 బంతులు... అంటే ఒక్కో బంతి విలువ అక్షరాలా 50 లక్షలు! టీవీలో అయితే ‘స్టార్’ సంస్థ ప్రతీ మ్యాచ్‌కు కనీసం రూ. 57.5 కోట్లు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై ‘వయాకామ్–18’ కంపెనీ ప్రతీ మ్యాచ్‌కు రూ. 50 కోట్ల కేవలం ప్రసార హక్కులకు మాత్రమే బీసీసీఐకి చెల్లించబోతోంది. దీనికి అదనంగా ఆయా సంస్థలకు బోలెడు ఖర్చులు! మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం కోసం కెమెరాలు, ఇతర సాంకేతిక సౌకర్యాలు ఏర్పాటు, కామెంటేటర్లు, ఉద్యోగులకు చెల్లింపులు, ఇతర సాధారణ ఖర్చులకు సొంత డబ్బు వాడాల్సిందే. ఇలాంటి స్థితిలో ఒక్కో మ్యాచ్‌కు వారు ఆశించే మొత్తం తిరిగి రావడం సాధ్యమేనా! ప్రసారకర్తల కోసం ఐపీఎల్ వీక్షణంలో కూడా పలు మార్పులకు బీసీసీఐ అంగీకరించవచ్చు. ప్రకటనలే ప్రధానం... ఇన్నింగ్స్‌కు 2 చొప్పున ‘స్ట్రాటజిక్ బ్రేక్’లతో పాటు ఓవర్ల మధ్యలో విరామ సమయం తదితరాలు కలిపి ప్రస్తుతం ప్రకటనల కోసం గరిష్టంగా ఒక టి20 మ్యాచ్‌లో 2,400 సెకన్లు (40 నిమిషాలు) అందుబాటులో ఉన్నాయి. 2022 ఐపీఎల్ మ్యాచ్‌లకు 10 సెకన్ల ప్రకటనకు సుమారు రూ.15 లక్షల వరకు ‘స్టార్’ వసూలు చేసింది. దీంతో పాటు ‘కో ప్రజెంటర్’ పేరుతో గరిష్టంగా ఒక్కో వ్యాపార సంస్థ నుంచి రూ. 180 కోట్ల వరకు... అసోసియేట్ స్పాన్సర్ ద్వారా గరిష్టంగా రూ. 105 కోట్ల వరకు తీసుకుంది. ఇతర అనుబంధ అంశాలు (ఫోర్లు, సిక్స్‌లు, ఫాస్టెస్ట్ బాల్) తదితరాల ద్వారా మరో రూ. 300 కోట్లు, హైలైట్స్ ప్యాకేజీల ద్వారా రూ. 200 కోట్ల వరకు అదనంగా ‘స్టార్’ ఖాతాలో చేరాయి. ఇది ఐపీఎల్ ప్రకటనలకు సంబంధించి తాజా పరిస్థితి. సాధారణంగా ప్రతీ ఏటా ఐపీఎల్ ప్రకటనల రేటు సుమారు 10–15 శాతం పెరుగుతోంది. అయితే ఇప్పుడు జరిగిన ఒప్పందం ప్రకారం చూస్తే ఇది సరిపోదు. కనీసం 80 శాతం వరకు రేటు పెంచాల్సి ఉంటుంది. ఇది అంత సులు వేమీ కాదు. లీగ్‌పై ఎంత క్రేజ్ ఉన్నా... ప్రకటన దారులు అంత సులువుగా ముందుకొస్తారా అనేది ప్రశ్న. ఈ ఏడాదితో పోలిస్తే మున్ముందు మ్యాచ్‌ల సంఖ్య పెరగడం సానుకూలాంశం కాగా... అభిమానులు రెండున్నర నెలలు సుదీర్ఘంగా సాగే లీగ్‌పై ఒకే స్థాయిలో ఆసక్తి చూపిస్తారా అనేది సందేహమే. 2022లోనే వ్యూయర్షిప్ 30 శాతం తగ్గినా... దాని ప్రభావం తాజా వేలంపై పడలేదు కాబట్టి సమస్య గా అనిపించలేదు. కానీ మున్ముందు చెప్పలేం. అయితే అన్ని లెక్కలు చూసుకున్నాకే పెద్ద సంస్థలు హక్కుల కోసం బరిలోకి దిగి ఉంటాయి. కాబట్టి బయటకు కనిపించని లెక్కలూ ఉండవచ్చు! ఇలా కూడా జరగొచ్చు... ఇంత భారీ మొత్తానికి హక్కులు అమ్మిన తర్వాత రాబోయే సీజన్లలో ప్రసారకర్తల భిన్న డిమాండ్లను బోర్డు సహజంగానే గౌరవించాల్సి రావచ్చు. ‘స్ట్రాటజిక్ టైమౌట్’లను 5 ఓవర్లకు ఒక్కోసారి చొప్పున మ్యాచ్‌కు ఆరు వరకు పెరిగే అవకాశం ఉంది. మ్యాచ్‌లో ఎక్కడ వీలైతే అక్కడ ప్రకటనలు పెట్టుకునే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి సహజంగానే మ్యాచ్ వ్యవధి కూడా పెరగడం ఖాయం. కాస్త వ్యంగ్యంగా చెప్పాలంటే ప్రకటనల మధ్యలో ఐపీఎల్ మ్యాచ్ చూడాల్సి రావచ్చు! డిజిటల్ కోసం భారీ మొత్తం చెల్లించిన ‘రిలయన్స్’ ఐపీఎల్ కోసం ఎక్కువ మొత్తంతో ప్రత్యేక సబ్స్క్రిప్షన్ ఆఫర్ చేసే అవకాశమూ ఉంది. ఈ భారీ ఒప్పంద ప్రభావం పడే కీలక అంశాన్ని చూస్తే ఇరు దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక టి20 సిరీస్‌లకు మంగళం పలికినట్లే! ఐపీఎల్ ప్రభావం, దానితో ముడిపడి ఉన్న డబ్బు, ఐసీసీని శాసించగలిగే బీసీసీఐని చూస్తే ప్రపంచకప్‌లో మినహా ఇతర అంతర్జాతీయ టి20లు కనిపించకపోవచ్చు. అన్నింటికి మించి ఫాంటసీ లీగ్‌లు, క్రికెట్ బెట్టింగ్ మరింతగా విజృంభించడం ఖాయం! సాక్షి క్రీడా విభాగం -
IPL: అమెజాన్ అవుట్
న్యూఢిల్లీ: భారత కుబేరుడు ముకేశ్ అంబానీ, ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్‌ల మధ్య ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మీడియా ప్రసార హక్కుల పోటీ రసవత్తరం అవుతుందనుకుంటే... మరోకటి జరిగింది. ఈ రేసు నుంచి ఓటీటీ సంస్థ అమెజాన్ తప్పుకుంది. దీంతో రిలయన్స్‌కు చెందిన ‘వయాకామ్ 18’ మిగతా మూడు సంస్థలతో రేసులో నిలిచింది. అమెజాన్ సహా డిస్నీ స్టార్, వయాకామ్–18, సోనీ, జీ సంస్థలు ప్రాథమిక బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొన్నాయి. అయితే శుక్రవారం అమెజాన్ ప్రైమ్ వైదొలగడంతో ఇప్పుడు టీవీ, డిజిటల్ హక్కుల పోటీ ప్రధానంగా నాలుగు సంస్థల మధ్యే నెలకొనే అవకాశముంది. నిజానికి అపర కుబేరుడికి చెందిన అమెజాన్ పోటీలో ఉన్నంతసేపూ ఈసారి ఐపీఎల్ మీడియా హక్కులకు ఎవరూ ఊహించని విధంగా రూ. 70 వేల కోట్ల మొత్తం రావొచ్చని బ్రాడ్‌కాస్టింగ్ వర్గాలు భావించాయి. కానీ కారణం లేకుండానే అమెజాన్ తప్పుకోవడంతో ముందనుకున్న అంచనాలు తప్పే అవకాశముంది. ‘అవును అమెజాన్ ఐపీఎల్ మీడియా ప్రసార హక్కుల ప్రక్రియ నుంచి వైదొలగింది. బిడ్ వేసేందుకు డాక్యుమెంట్లు తీసుకుంది. కానీ శుక్రవారం కీలకమైన సాంకేతిక బిడ్డింగ్‌లో వాటిని దరఖాస్తు చేయలేదు. గూగుల్‌కు చెందిన యుట్యూబ్ వాళ్లు కూడా డాక్యుమెంట్ కొనుగోలు చేశారు. కానీ వారు కూడా దరఖాస్తు సమర్పించలేదు. అయితే నాలుగు ప్రధాన టెలివిజన్, స్ట్రీమింగ్కు చెందిన మొత్తం 10 సంస్థలు పోటీలో ఉన్నాయి. ఆదివారం మొదలయ్యే ఇ–వేలం రెండు రోజులపాటు జరిగే అవకాశ ముంది.’ అని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. నిజమా... రూ. 45 వేల కోట్లా? అమెజాన్ వైదొలగినప్పటికీ... పోటీలో ఉన్న సంస్థలన్నీ పెద్ద మొత్తం చెల్లించేందుకు సై అంటున్నాయి. ఐదారేళ్ల క్రితంతో పోల్చుకుంటే డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఇప్పుడు అందరి ‘అరచేతి’ లో ఉండటమే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బిడ్ ప్రారంభ ధరే రూ. 32 వేల కోట్లు ఖాయమంటున్నాయి బీసీసీఐ వర్గాలు. ఇదే జరిగితే పోటాపోటీలో అక్షరాలా 45 వేల కోట్ల రూపాయాలు ఐపీఎల్ మీడియా హక్కుల ద్వారా రావొచ్చని అంచనా. అంటే గత మొత్తం రూ. 16,347.50 కోట్లకు రెండున్నర రెట్లు అధిక మొత్తం ఈసారి గ్యారంటీ! ఇ–వేలం సంగతేంటి? బీసీసీఐ టెండర్ల ప్రక్రియతో గత హక్కు లు కట్టబెట్టింది. ఇప్పుడు ఇ–ఆక్షన్ (ఎలక్ట్రానిక్ వేలం) నిర్వహించనుంది. ఆదివారం మొదలయ్యే ఈ ఇ–ఆక్షన్‌లో పోటీదారులంతా ఆన్లైన్ పోర్టల్‌లో బిడ్లు వేస్తారు. స్క్రీన్‌లో ఎక్కువ మొత్తం పెరుగుతున్న కొద్దీ పోటీలో ఉన్న సంస్థలు తప్పుకుంటాయి. చివరకు మిగిలిన సంస్థ విజేతగా నిలుస్తుంది. అయితే ఎంత మొత్తమో కనబడుతుంది కానీ ఎవరు వేసింది అనేది స్క్రీన్‌లో కనపడదు. ఎందుకంటే పలా నా సంస్థ వేసిందంటే దానికి ధీటుగా వేయా లని ఇతర సంస్థలు నిర్ణయించుకుంటాయి. నాలుగు ‘ప్యాకేజీ’లు నాలుగు ప్యాకేజీల్లో ఎ, బి, సి పూర్తిగా భారత ఉపఖండానికి సంబంధించినవి. ‘ఎ’ టీవీ హక్కులు, ‘బి’ డిజిటల్ రైట్స్. ‘సి’ ప్లే–ఆఫ్స్ సహా కొన్ని ప్రత్యేక మ్యాచ్‌లకు సంబంధించిన డిజిటల్ రైట్స్. ఇక ‘డి’ ఉపఖండం మినహా మొత్తం ప్రపంచానికి సంబంధించిన ఉమ్మడి టీవీ, డిజిటల్ రైట్స్. కొత్తగా ‘ప్రత్యేక’ హక్కులేంటంటే... సీజన్లో ఒక్కోసారి మ్యాచ్‌లు పెరిగితే దానికి సంబంధించిన ప్యాకేజీ అన్నమాట. ఒక సీజన్లో 74 ఉండొచ్చు. ఇవి మరో సీజన్లలో 84 లేదంటే 94కు పెరగొచ్చు. ఇవీ ప్రారంభ ధరలు... ‘ఎ’ టీవీ ప్యాకేజి కోసం ఒక్కో మ్యాచ్‌కు రూ. 49 కోట్లు ప్రారంభ బిడ్డింగ్ ధర కాగా... ‘బి’ డిజిటల్ కోసం మ్యాచ్‌కు రూ. 33 కోట్లు, ‘సి’లో ప్రాథమిక ధర రూ. 11 కోట్లు, ‘డి’లో రూ. 3 కోట్లకు తక్కువ కాకుండా బిడ్ వేయాల్సి ఉంటుంది. ఒక సంస్థ ఒకదానికే పరిమితమన్న నిబంధన లేదు. నాలుగు ప్యాకేజీలకూ ఒకే సంస్థ పోటీ పడొచ్చు. అయితే గతంలో ఏక మొత్తంలో ఒకే సంస్థకు కట్టబెట్టినట్లుగా కాకుండా ఈసారి ప్రతీ ప్యాకేజీలో ఎవరు ఎక్కువకు కోట్ చేస్తే వాళ్లకే హక్కులిస్తారు. గతంలో టీవీ హక్కులకు భారీ మొత్తం కోట్ చేసిన స్టార్ నెట్వర్క్ డిజిటల్‌కు తక్కువ కోట్ చేసింది. ఫేస్బుక్ డిజిటల్ కోసం రూ.3,900 కోట్లు కోట్ చేసినా... ఓవరాల్‌గా గరిష్ట మొత్తాన్ని పరిగణించి స్టార్‌కు హక్కులిచ్చారు. ఈసారి డిజిటల్ విభాగంలో టైమ్స్ ఇంటర్నెట్, ఫన్ఆసియా, డ్రీమ్11, ఫ్యాన్‌కోడ్... ఉపఖండం ఆవల హక్కుల కోసం స్కై స్పోర్ట్స్ (ఇంగ్లండ్), సూపర్‌స్పోర్ట్ (దక్షిణాఫ్రికా) కూడా బరిలో ఉన్నాయి. -
ఐపీఎల్-2022 బ్రాడ్‌కాస్టింగ్ హక్కులను దక్కించుకున్న యప్ టీవీ
టాటా ఐపీఎల్-2022 బ్రాడ్ కాస్టింగ్ హక్కులను వరుసగా యప్ టీవీ ఐదో సారి గెల్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా యప్ టీవీ సబ్స్రైబర్లకు టాటా ఐపీఎల్-2022 స్ట్రీమింగ్ అందుబాటులో ఉండనుంది. ఐపీఎల్-15 ఎడిషన్‌ను దాదాపు 99 దేశాల్లో యప్ టీవీ ప్రసారం చేయనుంది. మార్చి 26 నుంచి మే 29 వరకు జరిగే ఐపీఎల్-15 ఎడిషన్‌ను చూడవచ్చును. ఆస్ట్రేలియా, కాంటినెంటల్ యూరోప్, ఆగ్నేయాసియా (సింగపూర్ మినహా), మలేషియా, మధ్య & దక్షిణ అమెరికా, మధ్య ఆసియా, శ్రీలంక, పాకిస్తాన్, జపాన్, నేపాల్, భూటాన్, మాల్దీవులుతో పాటుగా ఇతర దేశాల్లో కూడా ఐపీఎల్-2022ను యప్‌టీవీ ప్రసారం చేయనుంది. ఈ సందర్భంగా యప్ టీవి వ్యవస్థాపకుడు అండ్ సీఈవో ఉదయ్ రెడ్డి మాట్లాడుతూ.. “క్రికెట్ ఎల్లప్పుడూ భారీ క్రౌడ్-పుల్లర్‌గా ఉంటుంది. క్రికెట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో...ప్రపంచవ్యాప్తంగా 99 దేశాలకు విస్తరించడంలో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారంగా యప్ టీవీ నిలుస్తోన్నందుకు మేము సంతోషిస్తున్నాము. అంతర్జాతీయ లీగ్‌లకు సంబంధించి భారత్‌ను ప్రపంచ పటంలో ఉంచేందకు కృషి చేస్తాము. ప్రపంచ స్థాయి కంటెంట్‌తో గ్లోబల్ ఇండియన్ డయాస్పోరా సేవలను కొనసాగిస్తున్న యప్ టీవీతో మా దీర్ఘకాల అనుబంధాన్ని కొనసాగిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నామ’’ని అన్నారు. టాటా ఐపీఎల్-15 ఎడిషన్ ప్రజలకు అద్బుతమైన అనుభవాన్ని అందిస్తోందని డిస్నీ స్టార్ అక్విజిషన్ అండ్ సిండికేషన్-స్పోర్ట్స్ హెడ్ హ్యారీ గ్రిఫిత్ పేర్కొన్నారు. ఇక యప్ టీవీ ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్నెట్ ఆధారిత టీవీ, ఆన్ డిమాండ్ సర్వీస్ ప్రొవైడర్‌గా నిలుస్తోంది. చదవండి: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ప్రాసెసర్‌ను లాంచ్ చేసిన ఇంటెల్..! ధర ఏంతంటే..? -
రేడియో స్టేషన్‌పై రష్యా కన్నెర్ర
మాస్కో: రష్యాలోని ఉదారవాద ఎకో మాస్కీ రేడియో స్టేషన్‌పై అధికారులు కన్నెర్ర జేశారు. దీంతో ప్రసారాలు నిలిపివేస్తున్నామని గురువారం రేడియో స్టేషన్ ఎడిటర్ ఇన్ చీఫ్ అలెక్సీ వెనిడిక్టోవ్ ప్రకటించారు. ఉక్రెయిన్‌పై పలు కీలక కథనాలను ఈ రేడియో ప్రసారం చేసింది. దీంతో తమపై అధికారులు గుర్రుగా ఉన్నట్లు ముందే తెలిసిందని అలెక్సీ చెప్పారు. ఈ నేపథ్యంలో రేడియో ఛానెల్‌ను, వెబ్‌సైట్‌ను మూసేయాలని నిర్ణయించామన్నారు. ఉక్రెయిన్‌పై కథనాలకుగాను ఎకో మాస్కీతో పాటు రైన్ టీవీని మూసేయాలని గతంలో రష్యా ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం డిమాండ్ చేసింది. వీటి మూసివేత మీడియా స్వేచ్ఛను హరించడమేనని అమెరికా దుయ్యబట్టింది. నిజాలు చెప్పడాన్ని రష్యా సహించలేకపోయిందని విమర్శించింది. ఇప్పటికే ఇన్‌స్టా, ఫేస్బుక్, ట్విట్టర్‌లాంటి సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై రష్యా నియంత్రణలు విధించింది. తమది దురాక్రమణ కాదని, కేవలం ఉక్రెయిన్ను నిస్సైనికీకరణ చేయడమే ఉద్దేశమని రష్యా పేర్కొంది. ఇకపై రష్యాలో ఫేక్ న్యూస్ ప్రసారం చేస్తే 15 ఏళ్ల జైలుశిక్ష విధించేందుకు చర్యలు ప్రారంభించింది. (చదవండి: అగ్రరాజ్యానికి షాక్ ఇచ్చిన రష్యా!) -
ఐపీఎల్ కోసం అమెజాన్, రిలయన్స్ మధ్య యుద్ధం..!
కాసుల వర్షం కురిపించే ఐపీఎల్‌కు మరో జాక్‌పాట్ తగలబోతోందా? లీగ్ ప్రసార హక్కులు కనీవినీ ఎరుగని ధరకు అమ్ముడుపోనున్నాయా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. వచ్చే ఐదేళ్ల కోసం ఐపీఎల్ ప్రసార హక్కుల ధర రూ.40 వేల కోట్ల నుంచి రూ.50 వేల కోట్ల వరకూ పలుకుతుందని అంచనా. 2018 నుంచి 2022 వరకూ ఐదేళ్ల కాలానికిగానూ గతంలో రూ.16,347 కోట్లు చెల్లించి "స్టార్ ఇండియా" ఆ హక్కులను సొంతం చేసుకుంది. వచ్చే ఐదేళ్లకు అంతకంటే చాలా ఎక్కువ ధరే పలికే అవకాశాలున్నాయి. అయితే, ఈసారి ఐపీఎల్ ప్రసార హక్కులను పొందడం కోసం కార్పొరేట్ కంపెనీల మధ్య పోటీ వాతావరణం ఏర్పడింది. కోట్ల మంది వీక్షించే ఇండియన్ ప్రీమియర్ క్రికెట్ లీగ్ ప్రసార హక్కుల కోసం అమెజాన్, రిలయన్స్, సోనీ కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఈసారి వచ్చే ఐదేళ్ల కోసం ఐపీఎల్ ప్రసార హక్కులు రికార్డు స్థాయిలో రూ.50 వేల కోట్ల వరకు పలికే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ, సాంప్రదాయ మీడియా సంస్థలు ఇప్పుడు భారతదేశం అతిపెద్ద రిటైలర్ రిలయన్స్, అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీలతో గట్టి పోటీని ఎదుర్కొంటున్నాయి. అమెజాన్, రిలయన్స్ ఇప్పటికే ఫ్యూచర్ గ్రూప్ ఆస్తుల విషయంలో కోర్టుల వరకు వెళ్లాయి. రిలయన్స్ తన బ్రాడ్ కాస్టింగ్ జాయింట్ వెంచర్ వయాకామ్18 కోసం 1.6 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సేకరించడానికి విదేశీయులతో సహా ఇతర పెట్టుబడిదారులతో చర్చలు జరుపుతోంది. "ఈ బిడ్ గెలుచుకోవడం రిలయన్స్ జియో ప్లాట్ ఫారమ్, దాని డిజిటల్ విస్తరణ కోసం దీర్ఘకాలిక ప్రణాళికలలో కీలకం" అని కంపెనీకి చెందిన ఒక అధికారి తెలిపారు. ఇటీవల లైవ్ స్ట్రీమింగ్ క్రికెట్ మ్యాచ్‌లను ప్రారంభించిన అమెజాన్ తన ప్లాట్ ఫామ్ యూజర్ బేస్ పెంచుకోవడానికి ఐపీఎల్ ప్రసార హక్కులను గెలుచుకోవాలని అనుకుంటుంది. ఈ కంపెనీకి టీవి ఫ్లాట్ ఫారం లేదు, టీవిలో క్రికెట్ ప్రసార కోసం మరో భాగస్వామితో చేతులు కలిపే అవకాశం ఉంటుంది. (చదవండి: సీనియర్ సిటిజన్లకు ఐసీఐసీఐ బ్యాంక్ శుభవార్త..!) -
ఐపీఎల్‌పై కన్నేసిన రిలయన్స్ ఇండస్ట్రీస్...!
కరోనా కారణంగా ఐపీఎల్-14 మధ్యలోనే అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. మిగిలిన మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ చూస్తోంది. ఇప్పటికే ఐపీఎల్-14 షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది. ఐపీఎల్-14 మ్యాచ్‌లను ప్రస్తుతం స్టార్ స్పోర్ట్స్ ప్రత్యక్షప్రసారం చేస్తోంది. వచ్చే ఏడాది నుంది ఐపీఎల్ బ్రాడ్‌కాస్టింగ్‌ను డీల్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్ దక్కించుకోవడం కంపెనీ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. బ్రాడ్ కాస్టింగ్‌పై కన్సేసిన రిలయన్స్..! ఐపీఎల్ బ్రాడ్ కాస్టింగ్‌ను స్టార్‌స్పోర్ట్స్ ఐదేళ్ల పాటు కాంట్రాక్ట్‌ను దక్కించుకుంది. ఈ ఏడాదితో ఐపీఎల్ బ్రాడ్ కాస్టింగ్ కాంట్రాక్ట్ ముగియనుంది. దీంతో ఐపీఎల్ బ్రాడ్‌కాస్టింగ్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్ దక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. నెట్వర్క్ గ్రూప్-18, రిలయన్స్ జియో భాగస్వామ్యంతో ఐపీఎల్ మ్యాచ్‌లను బ్రాడ్ కాస్టింగ్ హక్కులను పొందాలని రిలయన్స్ భావిస్తోంది. మొదలైన రిక్రూట్మెంట్ ప్రాసెస్..! ఐపీఎల్‌తో పాటు ఇతర స్పోర్ట్స్‌ను బ్రాడ్ కాస్టింగ్ చేసే ఏర్పాట్లలో భాగంగా అందుకు సంబంధించిన పనులను ఇప్పటికే రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదలు పెట్టినట్లుగా తెలుస్తోంది. సొంత బ్రాడ్ కాస్టింగ్ టీంను కూడా రెడీ చేయనుంది. కాగా ఇతర బ్రాడ్‌కాస్టింగ్ నెట్‌వర్క్‌లో పనిచేసే టాప్ ఎగ్జిక్యూటివ్‌లను రిలయన్స్ రిక్రూట్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం డిస్నీ-హాట్‌స్టార్ ఎస్వీపీ అండ్ హెడ్ ఆఫ్ అడ్వర్టైజింగ్ ఛీఫ్ గుల్షన్ వర్మ రిసేంట్‌గా జియో యాడ్స్ సీఈవోగా బాధ్యతలను చేపట్టారు. ప్రముఖ బ్రాడ్‌కాస్టింగ్ నెట్‌వర్క్‌కు చెందిన మరో యాడ్స్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ కూడా రిలయన్స్ కంపెనీలో చేరేందుకు చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ విషయంపై నెట్వర్క్-18 అధికారికంగా స్పందిచలేదు. నెట్వర్క్-18 బ్రాడ్ కాస్టింగ్ సంస్థను రిలయన్స్ ఇండస్ట్రీస్ కలిగి ఉన్న విషయం తెలిసిందే. గతంలో రిలయన్స్ ఐపీఎల్ బ్రాడ్‌కాస్టింగ్ హక్కుల కోసం వేలంలో కూడా పాల్గొంది. ఇండియన్ ఎస్వీఓడీ మార్కెట్‌పై మీడియా పార్టనర్స్ ఆసియా (MPA) ఇటీవల ఇచ్చిన నివేదిక ప్రకారం.. డిస్నీ, అమెజాన్, ఫేస్బుక్, జియో, సోనీ ఐపీఎల్ మీడియా హక్కులను దక్కించుకోవాలని చూస్తున్నాయి. 2022 వరకు ఐదు సంవత్సరాల పాటు ఐపీఎల్ మీడియా హక్కులను సొంతం చేసుకోవడానికి స్టార్ ఇండియా 16347.5 కోట్ల రూపాయలను చెల్లించింది. ఇది ఐపీఎల్ ప్రసార హక్కుల కోసం మొదటి 10 సంవత్సరాల కోసం సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా చెల్లించిన దాని కంటే దాదాపు రెట్టింపు. -
25న డిస్కవరీలో ‘కాళేశ్వరం’పై డాక్యుమెంటరీ
సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలో అత్యంత భారీ స్థాయిలో చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై ఈ నెల 25న డిస్కవరీ చానల్లో ప్రత్యేక డాక్యుమెంటరీ ప్రసారం కానుంది. ‘లిఫ్టింగ్ ఎ రివర్’పేరుతో గంటపాటు సాగనున్న ఈ డాక్యుమెంటరీ శుక్రవారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. 2017లో ఈ బృహత్తర పథకం మొదలుపెట్టింది మొదలు ఇప్పటివరకు జరిగిన పనులను చూపుతూనే, బృహత్తర యజ్ఞాన్ని పూర్తి చేసే క్రమంలో ఎదురైన అనుభవాలను ఈ డాక్యుమెంటరీలో చూపనున్నారు. ఇంగ్లిష్ సహా ఆరు భారతీయ భాషల్లో దీన్ని ప్రసారం చేయనున్నారు. Save The Date! "Lifting A River" A @Discovery Channel exclusive documentary on #KaleshwaramProject on June 25, at 8 PM. Don't miss! @KTRTRS pic.twitter.com/kZwZUp755C — Telangana Digital Media Wing (@DigitalMediaTS) June 19, 2021 చదవండి: జూలై నుంచి కాళేశ్వరం ఎత్తిపోత! -
భారత్‌పై మరోసారి విషం కక్కిన పాక్.. కారణం తెలిస్తే షాక్
లాహోర్: భారత కంపెనీలైన స్టార్, ఆసియా ఛానెల్‌లకు దక్షిణాసియా క్రికెట్ ప్రసార హక్కులు దక్కాయన్న కారణంగా, తమ దేశం ఆడే క్రికెట్ మ్యాచ్‌లను సైతం పాక్‌లో ప్రసారం చేసేందుకు అక్కడి ప్రభుత్వం నో చెప్పింది. 2019 ఆగస్టు 5న భారత ప్రభుత్వం జమ్మూ కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసినందు వల్ల తాము భారత కంపెనీలతో వ్యాపారం చేయబోమని పాక్ సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ మంత్రి ఫవాద్ చౌదరి వెల్లడించారు. భారత్ ప్రభుత్వం స్వయంప్రతిపత్తి రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాకే ఆయా కంపెనీలతో తాము వ్యాపారం చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ చర్య వల్ల తమ దేశ క్రికెట్ బోర్డుకు నష్టపోయినా పర్వాలేదని, తమ నిర్ణయంలో మాత్రం ఏ మార్పు ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. కాగా, వచ్చే నెల ఇంగ్లండ్‌లో పర్యటించనున్న పాక్.. మూడు వన్డేలు (జులై 8, 10, 13), మూడు టీ20లు (జులై 16, 18, 20) ఆడనుంది. ఈ ఆరు మ్యాచ్‌లను తమ దేశంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రసారం చేసేది లేదని ఆక్కడి ప్రభుత్వం భీష్మించుకుని కుర్చుంది. ఈ నేపథ్యంలో పాక్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆ దేశ క్రికెట్ అభిమానులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, భారత్‌పై విషం కక్కే క్రమంలో పాక్.. తమ వేలితో, తమ కంటినే పొడుచుకుంటుందని భారత అభిమానులు అభిప్రాయపడుతున్నారు. చదవండి: టీమిండియా కెప్టెన్‌గా శిఖర్ ధవన్ పేరు ఖరారు..? -
నూతన ధరల విధానంతో పారదర్శకత
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్రాడ్‌కాస్టింగ్ రంగంలో డిసెంబరు 29 నుంచి అమలులోకి రానున్న నూతన ధరల విధానంతో పారదర్శకత వస్తుందని ‘స్టార్ మా’ నెట్వర్క్ బిజినెస్ హెడ్ అలోక్ జైన్ తెలియజేశారు. స్టార్ ఇండియా డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ హెడ్ గుర్జీవ్ సింగ్ కపూర్‌తో కలిసి మంగళవారమిక్కడ మీడియాతో ఆయన మాట్లాడారు. ‘నూతన ధరల విధానంలో ప్రతి చానెల్‌కు మీడియా సంస్థలు ఎంత చార్జీ చేసేదీ కస్టమర్‌కు తెలుస్తుంది. దీనినిబట్టి అవసరమైన చానళ్లను లేదా ప్యాక్‌నే వినియోగదారు ఎంపిక చేసుకుంటారు. ఈ విధానంతో బ్రాడ్‌కాస్టింగ్ రంగంలో పారదర్శకత వస్తుంది. గతంతో పోలిస్తే ఎంచుకున్న చానళ్లను బట్టి కస్టమర్ల నెలవారీ వ్యయంలో హెచ్చుతగ్గులుంటాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 2.2 కోట్ల ఇళ్లలో టీవీలున్నాయి. టీవీ వీక్షకుల్లో 31 శాతం వాటా ‘స్టార్ మా’ నెట్‌వర్క్‌కు ఉంది’ అని వివరించారు. స్టార్ వాల్యూ ప్యాక్‌కు సంబంధించి దేశవ్యాప్తంగా ఎనిమిది భాషల్లో స్టార్ ఇండియా వినియోగదారులకు అవగాహన కల్పిస్తోంది. -
నూతన ధరల విధానంతో పారదర్శకత
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్రాడ్‌కాస్టింగ్ రంగంలో డిసెంబరు 29 నుంచి అమలులోకి రానున్న నూతన ధరల విధానంతో పారదర్శకత వస్తుందని ‘స్టార్ మా’ నెట్వర్క్ బిజినెస్ హెడ్ అలోక్ జైన్ తెలియజేశారు. స్టార్ ఇండియా డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ హెడ్ గుర్జీవ్ సింగ్ కపూర్‌తో కలిసి మంగళవారమిక్కడ మీడియాతో ఆయన మాట్లాడారు. ‘నూతన ధరల విధానంలో ప్రతి చానెల్‌కు మీడియా సంస్థలు ఎంత చార్జీ చేసేదీ కస్టమర్‌కు తెలుస్తుంది. దీనినిబట్టి అవసరమైన చానళ్లను లేదా ప్యాక్‌నే వినియోగదారు ఎంపిక చేసుకుంటారు. ఈ విధానంతో బ్రాడ్‌కాస్టింగ్ రంగంలో పారదర్శకత వస్తుంది. గతంతో పోలిస్తే ఎంచుకున్న చానళ్లను బట్టి కస్టమర్ల నెలవారీ వ్యయంలో హెచ్చుతగ్గులుంటాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 2.2 కోట్ల ఇళ్లలో టీవీలున్నాయి. టీవీ వీక్షకుల్లో 31 శాతం వాటా ‘స్టార్ మా’ నెట్‌వర్క్‌కు ఉంది’ అని వివరించారు. స్టార్ వాల్యూ ప్యాక్‌కు సంబంధించి దేశవ్యాప్తంగా ఎనిమిది భాషల్లో స్టార్ ఇండియా వినియోగదారులకు అవగాహన కల్పిస్తోంది. -
రూ. 16,347 కోట్లకు ప్రసార హక్కులు
ముంబై: రాబోవు ఐదేళ్ల కాలానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) మీడియా హక్కుల్ని స్టార్ ఇండియా దక్కించుకుంది. ఈ మేరకు సోమవారం జరిగిన వేలంలో రూ. 16, 347 కోట్ల రికార్డు ధర తో ఐపీఎల్ మీడియా హక్కుల్ని స్టార్ ఇండియా సొంతం చేసుకుంది. ఇందులో ఇండియా బ్రాడ్ కాస్టింగ్, ఇండియా డిజిటల్ హక్కులతో పాటు అంతర్జాతీయ బ్రాడ్ కాస్టింగ్, డిజిటల్ హక్కుల్ని కూడా స్టార్ ఇండియా దక్కించుకుంది. ఏడాదికి రూ.3,270 కోట్ల చొప్పన స్టార్ ఇండియా చెల్లించనుంది. దీనిలో భాగంగా 2018 నుంచి 2022 వరకు ఐపీఎల్ 'బ్రాడ్ కాస్టింగ్' హక్కులు స్టార్ ఇండియా వద్ద ఉండనున్నాయి. దాదాపు 20 ప్రముఖ కంపెనీలు వేలంలో పాల్గొనగా వాటిని స్టార్ ఇండియా వెనక్కునెట్టి మరీ మీడియా హక్కుల్ని కైవసం చేసుకుంది. ఈ వేలంలో స్టార్ ఇండియాతో పాటు సోనీ నెట్వర్క్, అమెజాన్ సెల్లర్ సర్వీసెస్, ఫాలోఆన్ ఇంటరాక్టివ్ మీడియా, తాజ్ టీవీ ఇండియా, టైమ్స్ ఇంటర్నెట్, సూపర్‌స్పోర్ట్ ఇంటర్నేషనల్, రిలయన్స్ జియో డిజిటల్, గల్ఫ్ డీటీహెచ్, గ్రూప్ ఎమ్ మీడియా, బెల్ ఎన్ ఈకోనెట్ మీడియా, సై యూకే, ఈఎస్పీఎన్ డిజిటల్ మీడి యా, బీటీజీ లీగల్ సర్వీసెస్, బీటీ పీఎల్సీ, ట్విట్టర్, ఫేస్బుక్ తదితర సంస్థలు పోటీ పడ్డాయి. ఐపీఎల్ తొలినాళ్లలో పదేళ్ల కాలానికి సోనీ పిక్చర్స్ నెట్వర్క్ రూ. 8200 కోట్లు వెచ్చించి టీవీ హక్కులు పొందింది. డిజిటల్ హక్కులను గత మూడేళ్ల (2015–17) కాలానికి నోవి డిజిటల్ సంస్థ రూ. 302.2 కోట్లతో చేజిక్కించుకుంది. -
ప్రసారానికి పోటాపోటీ
కోట్ల కాసుల రాశులు కురిపించే ఐపీఎల్ మరో భారీ వేలం ప్రక్రియకు సిద్ధమైంది. పదేళ్లుగా ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ ప్రసార హక్కుల కోసం విపరీతమైన పోటీ నెలకొంది. బడాబడా నెట్వర్క్ సంస్థలు, టెలికామ్ కంపెనీలే కాదు ఈసారి ఈ–కామర్స్ దిగ్గజాలు హక్కుల కోసం పోటెత్తడంతో బోర్డుకు రూ.20 వేల కోట్ల పైచిలుకు రాబడి రానుంది. ♦ ఐపీఎల్ ‘బ్రాడ్ కాస్టింగ్’ వేలం నేడు ♦ ఐదేళ్లకే రూ.20 వేల కోట్లు! ముంబై: ఐపీఎల్ మీడియా హక్కుల వేలం ప్రక్రియ సోమవారం ఇక్కడ జరుగనుంది. మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసార హక్కులు, డిజిటల్ (ఇంటర్నెట్, మొబైల్) హక్కుల కోసం దిగ్గజ టీవీ చానెళ్లు, టెలికామ్ సంస్థలు ప్రతిష్టకు పోతున్నాయి. దీంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ధనాగారం ఊహించనంత మొత్తంతో నిండిపోనుంది. రికార్డు స్థాయిలో ఐదేళ్ల కాలానికే రూ. 20 వేల కోట్ల పైచిలుకు ఆదాయం వస్తుందని బోర్డు వర్గాలు ఆశిస్తున్నాయి. వీరి అంచనాలకు అనుగుణంగానే మొత్తం 24 సంస్థలు మీడియా రైట్స్ కోసం సై అంటే సై అంటున్నాయి. ప్రత్యేకించి కొత్తగా డిజిటల్ విభాగంలో ఈసారి తీవ్ర పోటీ నెలకొంది. రిలయన్స్ జియో, ఎయిర్టెల్ సంస్థలు ఎలాగైనా హక్కులు చేజిక్కించుకోవాలనే కసితో టెండర్లు దాఖలు చేశాయి. ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్, వెబ్ సర్వీస్ ప్రొవైడర్ యాహూ, సామాజిక నెట్వర్కింగ్ సైట్లు ఫేస్బుక్, ట్విట్టర్ సంస్థలు కూడా ఐపీఎల్ హక్కుల కోసం ఎగబడటం విశేషం. ఈ రెండు రకాల మీడియా రైట్స్‌ను మార్కెటింగ్ వ్యూహాలకు అనుగుణంగా పలు రకాలుగా విభజించారు. దేశం లోపల, భారత ఉపఖండం, ఉపఖండం వెలుపల, అంతర్జాతీయ మార్కెట్ ఇలా విభజించారు. 2018 నుంచి 2022 వరకు మీడియా హక్కులను అమ్ముతారు. టెండర్ల ప్రక్రియపై బోర్డు సీఈఓ రాహుల్ జోహ్రి మాట్లాడుతూ బ్రాడ్‌కాస్టింగ్ హక్కుల కోసం సోమవారం నిర్వహించే వేలం ఊహకందని రాబడితో చరిత్ర సృష్టిస్తుందని చెప్పారు. ఐపీఎల్ తొలినాళ్లలో పదేళ్ల కాలానికి సోనీ పిక్చర్స్ నెట్వర్క్ రూ. 8200 కోట్లు వెచ్చించి టీవీ హక్కులు పొందింది. డిజిటల్ హక్కులను గత మూడేళ్ల (2015–17) కాలానికి నోవి డిజిటల్ సంస్థ రూ. 302.2 కోట్లతో చేజిక్కించుకుంది. వేలంలో పాల్గొంటున్న సంస్థలివే... స్టార్ ఇండియా, సోనీ నెట్వర్క్, అమెజాన్ సెల్లర్ సర్వీసెస్, ఫాలోఆన్ ఇంటరాక్టివ్ మీడియా, తాజ్ టీవీ ఇండియా, టైమ్స్ ఇంటర్నెట్, సూపర్‌స్పోర్ట్ ఇంటర్నేషనల్, రిలయన్స్ జియో డిజిటల్, గల్ఫ్ డీటీహెచ్, గ్రూప్ ఎమ్ మీడియా, బెల్ ఎన్ ఈకోనెట్ మీడియా, సై యూకే, ఈఎస్పీఎన్ డిజిటల్ మీడి యా, బీటీజీ లీగల్ సర్వీసెస్, బీటీ పీఎల్సీ, ట్విట్టర్, ఫేస్బుక్ తదితర సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి. -
'సాక్షి' ప్రసారాలు పునరుద్దరించాలి
తిరుపతి : సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతకు నిరసనగా చిత్తూరు జిల్లాలో ఆదివారం జర్నలిస్టులు, వైఎస్సార్సీపీ నాయకులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ఆదివారం 28 మండలాల్లో నిరసనలు, ర్యాలీలు నిర్వహించారు. తిరుపతి ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది జర్నలిస్టులు నగర వీధుల్లో నిరసన ర్యాలీ నిర్వహించి బస్టాండ్ సెంటర్లోని బాపూజీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. చిత్తూరు నగరంలో వైఎస్సార్సీపీ, బీజేపీ, వామపక్ష పార్టీల నేతలతో పాటు వైఎస్సార్సీపీ మహిళా విభాగం నాయకులు నగర వీధుల్లో మానవహారం నిర్వహించి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. తిరుపతి ఎస్వీయూ విద్యార్థులు జర్నలిస్టులకు సంఘీభావంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. జిల్లాలోని శ్రీకాళహస్తి, సత్యవేడు, పుంగనూరు, పలమనేరు, నాగలాపురం, మదనపల్లి, పెనుమూరు, కార్వేటినగరం, పాలసముద్రం, వెదురుకుప్పం మండలాల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు నిరసన ర్యాలీలు నిర్వహించారు.