IPL VS PSL: ఇటీవలి కాలంలో పాకిస్థాన్‌కు చెందిన కొందరు క్రికెటర్లు తమ దేశంలో జరిగే పీఎస్‌ఎల్ (పాకిస్థాన్ సూపర్ లీగ్) ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) కంటే తోపు అని జెబ్బలు చరుచుకున్న విషయం విధితమే. అయితే వారు వాపును చూసి బలుపు అన్న భ్రమలో ఉన్నారని తాజాగా జరిగిన ఐపీఎల్ మీడియా హక్కుల వేలం ద్వారా బహిర్గతమైంది. 2023-27 సీజన్‌కు గాను ఐపీఎల్ మీడియా హక్కుల వేలం ద్వారా బీసీసీఐ కనీవినీ ఎరుగని రీతిలో రూ. 48,390 కోట్లు అర్జించడంతో క్యాష్ రిచ్ లీగ్‌పై అవాక్కులు చవాక్కులు పేలిన పాక్ ప్రస్తుత, మాజీలు ముక్కున వేలేసుకున్నారు.
ఈ స్థాయిలో ఐపీఎల్ మీడియా హక్కులు అమ్ముడుపోవడంతో వారంతా నీళ్లునములుతున్నారు. ఐపీఎల్ మీడియా హక్కులు ఈ రేంజ్‌లో అమ్ముడుపోవడంతో చేసేదేమీలేక ఐసీసీకి చాడీలు చెప్పడం ద్వారా తమ అక్కసుకు వెళ్లగక్కుతున్నారు. ఐపీఎల్ ప్రపంచంలోనే రెండో అత్యంత ధనవంతమైన స్పోర్ట్స్ లీగ్‌గా అవతరించడాన్ని ఆ దేశ అభిమానులతో పాటు అక్కడి రాజకీయ నాయకులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు.
ఐపీఎల్ వర్సెస్ పీఎస్‌ఎల్..
- ఐపీఎల్ 2023-27 సీజన్ మీడియా హక్కులు రూ. 48,390 కోట్లకు అమ్ముడుపోగా.. 2022-2023 సీజన్‌కు గాను పీఎస్ఎల్ మీడియా హక్కులు కేవలం రూ. 166 కోట్లకు మాత్రమే అమ్ముడుపోయాయి.
- వచ్చే సీజన్ నుంచి ఐపీఎల్‌లో ఒక్కో మ్యాచ్ విలువ రూ. 118 కోట్లు (టీవీ, డిజిటల్, ఇతర రైట్స్ అన్నీ కలిపి) ఉండగా.. పీఎస్ఎల్‌లో కేవలం రూ. 2.76 కోట్లు మాత్రమే.
- ఐపీఎల్‌లో ఒక్కో ఓవర్ విలువ రూ. 2.95 కోట్లు కానుండగా.. పీఎస్ఎల్‌లో మ్యాచ్ మొత్తం విలువ మన ఒక్క ఓవర్ విలువ కంటే తక్కువే.
- ఐపీఎల్‌లో రాబోయే సీజన్ల నుంచి ఒక్కో బాల్ విలువ దాదాపు రూ. 50 లక్షలుగా ఉంటే.. పీఎస్ఎల్‌లో వేసే ఒక్కో బంతి విలువ లక్ష కంటే తక్కువగా ఉంది.
- పీఎస్‌ఎల్ మొత్తం మీడియా హక్కుల విలువ (రూ. 166 కోట్లు) ఐపీఎల్‌లో ఒక్క మ్యాచ్ విలువతో (రూ. 118 కోట్లు) పోలిస్తే కాస్త ఎక్కువగా ఉంది.
- మొత్తంగా చూస్తే ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ పీఎస్ఎల్ కంటే 50 రెట్లు అధికంగా ఉంది.
- 2017-2022 సీజన్‌కు గాను ఐపీఎల్ మీడియా హక్కులు రూ. 16,347.50 కోట్లుకు అమ్ముడుపోగా.. 2023-27 సీజన్‌కు ఈ లెక్క దాదాపు మూడింతలవ్వడం విశేషం.
చదవండి: IPL 2023: కోట్లు ఇచ్చారు... కోట్లు తెచ్చుకునేదెలా?
Comments
Please login to add a commentAdd a comment