గాజాపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో వెస్ట్‌బ్యాంక్ రమల్లాలోని ఖతార్ బ్రాడ్‌కాస్టర్ అల్ జజీరా ఆఫీసులో ఆదివారం సోదాలు చేశారు ఇజ్రాయెల్ సైనికులు. ఒక్కసారిగా ముసుగులు ధరించిన ఇజ్రాయెల్ సైనికులు అల్ జజీరా భవనంలోకి ప్రవేశించారు. సిబ్బంది ఆఫీసులో ఉన్న కెమెరాలు తీసుకొని త్వరగా అక్కడి నుంచి తీసుకొని వెళ్లిపోవాలని ఆదేశించారు. ఛానెల్ ఆఫీసును మూసివేయాలని అల్ జజీరా నెట్‌వర్క్ వెస్ట్‌బ్యాంక్ బ్యూరో చీఫ్ వాలిద్ అల్ ఒమారీను ఆదేశించారు. ఛానెల్ ప్రసారాలను 45 రోజుల్లో పూర్తిగా నిలిపివేయాలని సైనికులు చెప్పగా.. ఆయన లైవ్‌లోనే చదివినట్లు స్థానిక మీడియా పేర్కొంది.
HAPPENING NOW:
Israeli soldiers are raiding Al Jazeera’s office in Ramallah and forcing it to stop broadcasting in the West Bank for 45 days.
Israel is planning something terrifying across the West Bank, and doesn’t want the world to see. pic.twitter.com/mVr07W6A6M— sarah (@sahouraxo) September 22, 2024
ఇక.. జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ఆరోపిస్తూ అల్ జజీరా కార్యకలాపాలను ఇజ్రాయెల్‌లో ప్రసారాలు నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. మేలో నెలలో అల్ జజీరా.. తన కార్యాలయంగా ఉపయోగించుకుంటున్న జెరూసలేం హోటల్‌పై ఇజ్రాయెల్ దాడి చేసిన తర్వాత ఆదివారం ఈ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది.
బలవంతంగా 45 రోజుల్లో ప్రసారాలు పూర్తిగా నిలిపివేయాలని నిషేధం విధించడాన్ని అల్ జజీరా తీవ్రంగా ఖండించింది. ఇది మానవ హక్కులు, సమాచారాన్ని పొందే ప్రాథమిక హక్కును ఉల్లంఘించే నేరపూరిత చర్య అని అభివర్ణించింది. గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ మీడియాపై కొనసాగిస్తున్న అణచివేత అంతర్జాతీయ, మానవతా చట్టాలకు విరుద్ధంగా ఉందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment