Al Jazeera
-
ఇజ్రాయెల్ ఆరోపణలను ఖండించిన అల్ జజీరా
గాజాలో ఆరుగురు అల్ జజీరా మీడియా సంస్థకు జర్నలిస్టులు పాలస్తీనా తీవ్రవాదులని ఇజ్రాయెల్ సైన్యం ఆరోపణలు చేసింది. హమాస్, ఇస్లామిక్ జిహాద్ మిలిటెంట్ గ్రూపులతో ఆరుగురు జర్నలిస్టులు అనుబంధంగా పనిచేస్తున్నారని వ్యాఖ్యలు చేసింది. ఈ ఆరోపణలై స్పందించిన ఖతార్‌కు చెందిన అల్ జజీరా మీడియా నెట్వర్క్ తీవ్రంగా ఖండించింది. ఇజ్రాయెల్ చేసిన ఆరోపణలు నిరాధారమని తోసిపుచ్చింది.‘‘ఇజ్రాయెల్ సైన్యం మా జర్నలిస్టులను ఉగ్రవాదులుగా చిత్రీకరించడాన్ని తిరస్కరిస్తున్నాం. ఇజ్రాయెల్ మా జర్నలిస్టులపై కల్పిత సాక్ష్యాలను సృష్టించడాన్ని తీవ్రం ఖండిస్తున్నాం. ఈ కల్పిత ఆరోపణలతో ఈ ప్రాంతంలో మిగిలి ఉన్న జర్నలిస్టుల గొతునొక్కేయడానికి ఇజ్రాయెల్ ప్రయత్నం చేస్తోంది. తద్వారా యుద్ధంలో జరుగుతున్న కఠినమైన వాస్తవాలను ప్రపంచానికి తెలియకూడదలనే కుట్రకు ఇజ్రాయెల్ తెరలేపింది. ఇజ్రాయెల్ బాంబు దాడులు, గాజాలో నెలకొన్న మానవతా సంక్షోభాన్ని ఎప్పటికప్పుడూ ప్రసారం చేస్తున్న ఏకైక అంతర్జాతీయ మీడియా నెట్వర్క్ అల్ జజీరానే’’ అని ఓ ప్రకటనలో తెలిపింది..‘‘గాజాలో హమాస్, ఇస్లామిక్ జిహాద్ తీవ్రవాద సంస్థలలోని సైనికులతో ఆరుగురు అల్ జజీరా జర్నలిస్టులు కలిసిపోయారని నిర్ధారించే గూఢచార సమాచారం, టెర్రరిస్ట్ శిక్షణా కోర్సుల జాబితా, ఫోన్లతో సహా గుర్తించబడ్డాయి. ఖతార్ అల్ జజీరా మీడియా నెట్‌వర్క్‌లో పనిచేసే సిబ్బంది హమాస్ ఉగ్రవాదులతో కలిసిపోయారడానికి ఈ పత్రాలే రుజువు. అల్ జజీరా హమాస్ ప్రచారానికి నాయకత్వం వహిస్తున్నట్లు చాలా మంది జర్నలిస్టులు బహిర్గతం చేశారు. అల్ జజీరా జర్నలిస్టులు.. అనస్ అల్-షరీఫ్, హోసామ్ షబాత్, ఇస్మాయిల్ అబు ఒమర్ , తలాల్ అర్రూకీలకు హమాస్‌తో సంబంధాలు ఉన్నాయి.అదేవిధంగా అష్రఫ్ సరాజ్, అలా సలామెహ్ ఇస్లామిక్ జిహాద్‌తో అనుబంధం కలిగి ఉన్నారు’’ అని బుధవారం ఇజ్రాయెల్ ‘ఎక్స్’లో పేర్కొంది. -
మీడియా సంస్థకు ఇజ్రాయెల్ సైనికుల వార్నింగ్
గాజాపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో వెస్ట్‌బ్యాంక్ రమల్లాలోని ఖతార్ బ్రాడ్‌కాస్టర్ అల్ జజీరా ఆఫీసులో ఆదివారం సోదాలు చేశారు ఇజ్రాయెల్ సైనికులు. ఒక్కసారిగా ముసుగులు ధరించిన ఇజ్రాయెల్ సైనికులు అల్ జజీరా భవనంలోకి ప్రవేశించారు. సిబ్బంది ఆఫీసులో ఉన్న కెమెరాలు తీసుకొని త్వరగా అక్కడి నుంచి తీసుకొని వెళ్లిపోవాలని ఆదేశించారు. ఛానెల్ ఆఫీసును మూసివేయాలని అల్ జజీరా నెట్వర్క్ వెస్ట్‌బ్యాంక్ బ్యూరో చీఫ్ వాలిద్ అల్ ఒమారీను ఆదేశించారు. ఛానెల్ ప్రసారాలను 45 రోజుల్లో పూర్తిగా నిలిపివేయాలని సైనికులు చెప్పగా.. ఆయన లైవ్‌లోనే చదివినట్లు స్థానిక మీడియా పేర్కొంది.HAPPENING NOW:Israeli soldiers are raiding Al Jazeera’s office in Ramallah and forcing it to stop broadcasting in the West Bank for 45 days.Israel is planning something terrifying across the West Bank, and doesn’t want the world to see. pic.twitter.com/mVr07W6A6M— sarah (@sahouraxo) September 22, 2024ఇక.. జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ఆరోపిస్తూ అల్ జజీరా కార్యకలాపాలను ఇజ్రాయెల్‌లో ప్రసారాలు నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. మేలో నెలలో అల్ జజీరా.. తన కార్యాలయంగా ఉపయోగించుకుంటున్న జెరూసలేం హోటల్‌పై ఇజ్రాయెల్ దాడి చేసిన తర్వాత ఆదివారం ఈ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది.బలవంతంగా 45 రోజుల్లో ప్రసారాలు పూర్తిగా నిలిపివేయాలని నిషేధం విధించడాన్ని అల్ జజీరా తీవ్రంగా ఖండించింది. ఇది మానవ హక్కులు, సమాచారాన్ని పొందే ప్రాథమిక హక్కును ఉల్లంఘించే నేరపూరిత చర్య అని అభివర్ణించింది. గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ మీడియాపై కొనసాగిస్తున్న అణచివేత అంతర్జాతీయ, మానవతా చట్టాలకు విరుద్ధంగా ఉందని పేర్కొంది.చదవండి: లెబనాన్‌పై ఇజ్రాయెల్ యుద్ధ విమానాల విధ్వంసం -
ఇజ్రాయెల్‌లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
టెల్ అవీవ్: తమ దేశంలో అల్–జజీరా మీడియా సంస్థకు చెందిన స్థానిక కార్యాలయాలన్నీ మూసివేస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ చెప్పారు. అల్–జజీరా ఆఫీసులను ఎప్పటినుంచి మూసివేస్తారన్నది వెల్లడించారు. ఇది తాత్కాలిమా? శాశ్వతమా? అనేది బయటపెట్టలేదు.ఖతార్‌కు చెందిన అంతర్జాతీయ మీడియా సంస్థ అల్–జజీరా గాజాలో పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ దాడులను మొదటినుంచీ వ్యతిరేకిస్తోంది. గాజాలో కాల్పుల విరమణ కోసం ఇజ్రాయెల్, హమాస్ మధ్య శాంతి చర్చలకు ఖతార్ చొరవ చూపుతోంది. ఇరువర్గాలను ఒప్పించేందుకు ప్రయతి్నస్తోంది. ఈ నేపథ్యంలో ఖతార్‌కు చెందిన మీడియా సంస్థ కార్యాలయాలను మూసివేస్తూ ఇజ్రాయెల్ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్‌పై నిషేధం
హమాస్‌పై దాడులకు తెగపడుతున్న వేళ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఖతర్‌కు చెందిన న్యూస్ నెటవర్క్ అల్ జజీరా ఛానెల్‌పై నిషేధం విధించారు. ఇజ్రాయెల్‌లో అల్ జజీరా ఛానెల్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ‘ఖతర్‌కు దేశానికి చెందిన న్యూస్ నెట్వర్క్ అల్ జజీరా ఛానెల్ ప్రసారాలను ఇజ్రాయెల్‌లో నిషేదిస్తున్నాం. ఇజ్రాయెల్ ప్రభుత్వం ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రేరేపించే విధంగా ఉన్న అల్ జజీరా ఛానెల్‌ను ఇజ్రాయెల్‌లో మూసివేస్తాం’ అని ప్రధాని బెంజమిన్ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. అయితే ఈ నిషేధం ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందన్న విషయంపై స్పస్టత లేదు.గాజాలో కాల్పుల విరమణకు సంబంధించి హమాస్ డిమాండ్‌ను ప్రధాని బెంజమిన్ తిరస్కరించారు. హమాస్ తమకు ఎప్పుడూ ప్రమాదకరమైనదేనని అన్నారు. ఇజ్రాయెల్ లొంగిపోదని.. గాజాలో హమాస్‌ను అంతం చేసేవరకు దాడులు కొనసాగిస్తాని తేల్చిచెప్పారు. మరోవైపు.. హమాస్, ఇజ్రాయెల్ మధ్య శాంతి నెలకొల్పడం కోసం ఖతర్, ఈజిప్ట్, అమెరికా ప్రయత్నాలు చేస్తున్నా.. బెంజమిన్ ససేమిరా అంటున్నారు. ఇక.. గాజాపై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇప్పటివరకు 34,683 మంది పాలస్తీనా ప్రజలు మృతి చెందారు. -
జర్నలిస్టుపై ఇజ్రాయెల్ ఆర్మీ సంచలన ప్రకటన
జెరూసలెం: పాలస్తీనాకు చెందిన అల్‌జజీరా విలేకరి మహమ్మద్ వషా హమాస్ సీనియర్ కమాండర్‌గా పనిచేస్తున్నాడని ఇజ్రాయెల్ ఆర్మీ సంచలన ప్రకటన చేసింది. గాజాలోని హమాస్ క్యాంపులపై తాము చేసిన దాడుల్లో ఈ విషయం వెలుగు చూసినట్లు తెలిపింది. మహమ్మద్ వషాకు చెందిన ల్యాప్‌టాప్‌లో దొరికిన చిత్రాలే ఇందుకు ఆధారాలని తెలిపింది. హమాస్ యాంటీ ట్యాంక్ మిసైల్ యూనిట్ హెడ్‌గా వషా పనిచేశారని వెల్లడించింది. ‘హమాస్ క్యాంపులో దొరికిన ఒక ల్యాప్‌టాప్‌పై మా ఇంటెలిజెన్స్ దర్యాప్తు జరిపింది. దానిలో మహ్మద్ వషా కార్యకలాపాలకు సంబంధించిన చిత్రాలు దొరికాయి. త్వరలో జర్నలిస్టు ముసుగులో ఉన్న ఉగ్రవాదుల వివరాలు ఇంకెన్ని బయటపెడతామో ఎవరికి తెలుసు’ అని ఐడీఎఫ్ లెఫ్టినెంట్ కల్నల్ అవిచే అడ్రే అన్నారు. ఇదీ చదవండి.. ఆగని ఉత్తర కొరియా కవ్వింపు చర్యలు -
ఇజ్రాయెల్ వైమానిక దాడిలో కుటుంబం మృతి, భోరున విలపించిన జర్నలిస్టు
గాజాపై ఇజ్రాయెల్(Israeil) జరిపిన వైమానిక దాడిలో గాజాలోని జర్నలిస్టు కుటుంబం ప్రాణాలు కోల్పోయింది. బుధవారం రాత్రి అల్ జజీరా జర్నలిస్ట్,అరబిక్ బ్యూరో చీఫ్ వేల్ అల్ దహదౌహ్ కుటుంబ సభ్యులు మరణించారు. సెంట్రల్ గాజాలోని ఇజ్రాయెల్ సురక్షిత ప్రాంతాల్లో ఒకటిగా భావిస్తున్న నుసెరాత్ క్యాంప్ అతని ఇంటిని లక్ష్యంగా జరిగిన దాడిలో భార్య, కుమార్తె , కొడుకును కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. దహదౌహ్ భార్య కుమారుడు, కుమార్తె గాజాలో నివసిస్తున్నారు. సురక్షితమైన ఈ ప్రాంతాన్ని టార్గెట్ చేసుకుని వైమానిక దాడులకు దిగబోతున్నాయనే విషయాన్ని భార్య తెలుసుకున్నారు. అక్కడి నుంచి తన కుమారుడు, కుమార్తెతో కలిసి పారిపోతుండగా వారిపైదాడి జరిగింది. దీంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దహదౌహ్ భార్య, కుమారుడు, కుమార్తె మరణించారని అల్ జజీరా రిపోర్ట్ చేసింది. వారంతా శిథిలాల కింద సమాధి అయ్యారని వెల్లడించింది. ఆసుపత్రిలో విగతజీవిగా పడి ఉన్న కుటుంబ సభ్యులను చూసిన దహదౌహ్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న దృశ్యాలు కలిచి వేస్తున్నాయి. “ఏమి జరిగిందో స్పష్టంగా తెలుస్తోంది. పిల్లలు, మహిళలు , పౌరులే టార్గెట్‌గా చేస్తున్న వరుస దాడులివి. ఇజ్రాయెల్ దాడులు నుసైరాత్‌తో సహా అనేక ప్రాంతాలను లక్ష్యంగా చేస్తున్న దాడుల గురించి యార్మూక్ నుండి రిపోర్టు చేస్తున్నాను..అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ఇజ్రాయెల్ ఆధీనంలో ఉన్న వారికి శిక్షించకుండా వదిలి పెట్టరనే అనుమానాలను కూడా ఆయన వ్యక్తం చేశారు. మరోవైపు గాజాలో అమాయక పౌరులను విచక్షణారహితంగా లక్ష్యంగా చేసుకుని చంపడాన్ని అల్ జజీరా తీవ్రంగా ఖండించింది.మరికొంతమంది జర్నలిస్టుల కుటుంబ సభ్యుల ఆచూకీ కూడా గల్లంతు అయినట్టు సమాచార.ం తీవ్ర విషాదానికి ముందు మమ్మల్ని కాపాడండి అంటూ వేల్ దహదౌ కుమారుడు మహమూద్, తల్లి, సోదరితో కలిసి మొరపెట్టుకున్న కొద్దిరోజులకే వారంతా చనిపోయారు.గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడి గురించి సోదరి ఖోలౌద్‌తో కలిసి ప్రపంచానికి ఒక వీడియో సందేశం పంపాడు. కాగా అక్టోబరు 7న హమాస్ ఆకస్మిక దాడిలో దాదాపు 1,400 మందిని చనిపోయారు. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ దాడులకారణంగా గాజాలో 6,500 మందికి పైగా మరణించినట్టు అంచనా. నివేదికల ప్రకారం, ఇజ్రాయెల్ బాంబు దాడుల కారణంగా దాదాపు 6,00,000 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇది ఇలా ఉంటే పాలస్తీనా జర్నలిస్టుల యూనియన్ ప్రకారం గాజా బాధితుల్లో 22 మందికి పైగా జర్నలిస్టులు ఉన్నారు. “This is the ‘safe’ area that the occupation army spoke of.” Al Jazeera's Wael Dahdouh lost his wife, son and daughter in an Israeli air raid in the southern Gaza Strip, where Israel told Palestinians to forcibly evacuate for their safety https://t.co/kaf1moxPRa pic.twitter.com/U12h7kWoFq — Al Jazeera English (@AJEnglish) October 25, 2023 My colleague at @AJArabic Wael Al Dahdouh just lost his wife, daughter, and son in an Israeli strike “ that targeted his home “ in #Gaza. He reported on that strike earlier, without knowing that some family members were among the dead in that Israeli bombing.#Gazabombing pic.twitter.com/SObiuP5zer — Wajd Waqfi وجد وقفي (@WajdWaqfi) October 25, 2023 "Help us to stay alive" was their outcry to the world from Gaza. Mahmoud, Al Jazeera Arabic’s Wael Dahdouh son, joined by his sister Kholoud, sent a message to the world, days before Mahmoud, his mother, and younger sister Sham were killed in an Israeli airstrike in Gaza ⤵️ pic.twitter.com/HWJ8SjIpvx — Al Jazeera English (@AJEnglish) October 25, 2023 -
అల్ జజీరా మహిళా జర్నలిస్టు కాల్చివేత
జెరూసలేం: ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య ఘర్షణలు జరుగుతున్న వెస్ట్‌బ్యాంక్ సిటీలో కవరేజీ సందర్భంగా అల్ జజీరా చానల్ మహిళా జర్నలిస్టు షిరీన్ అబు అక్లా (51) ప్రాణాలు కోల్పోయారు. మరో జర్నలిస్టు అలీ సమోదీ కాల్పుల్లో తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతున్నారు. ఇజ్రాయెల్ ఆర్మీయే ఈ దారుణానికి పాల్పడిందని అల్ జజీరా ఆరోపించింది. ఇజ్రాయెల్ సైనికులు షిరీన్ తలపై నేరుగా తుపాకీ పెట్టి కాల్చడంతో అక్కడికక్కడే చనిపోయినట్టు పాలస్తీనా కూడా చెబుతోంది. ఈ ఆరోపణల్ని ఇజ్రాయెల్ తోసిపుచ్చింది. పాలస్తీనా ఉగ్రవాదులే ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటారంది. బులెట్‌ప్రూఫ్ జాకెట్ వేసుకున్నా... కవరేజీ సమయంలో షిరీన్ తలకు హెల్మెట్ పెట్టుకున్నారు. బులెట్ ప్రూఫ్ జాకెట్ ధరించారు. దానిపై ప్రెస్ అని రాసుంది. ఆమె చెవి కింద తూటా గాయాలైనట్టుగా తెలుస్తోంది. దీనిపై విచారణకు ఇజ్రాయెల్ ప్రధాని ఆదేశించారు. పాలస్తీనా సాయుధుల కాల్పుల్లోనే ఆమె చనిపోయినట్టు తమకు సమాచారముందన్నారు. Large crowds gathering in Jenin to sat good bye to veteran AlJazeera Arabic journalist who was shot dead by Israeli fire while reporting near Jenin refugee camp. pic.twitter.com/1oLoCUIeXR — Arwa Ibrahim (@arwaib) May 11, 2022 AlJazeera journalists & other Palestinian reporters at the scene say veteran @AJArabic reporter Shireen Abu wallah was ´killed in cold blood’ by Israeli forces as she reported on an Israeli raid on Jenin refugee camp. pic.twitter.com/RRsP3PY7GF — Arwa Ibrahim (@arwaib) May 11, 2022 -
మసీదులో మారణకాండ
కాబూల్: పశ్చిమ అఫ్గానిస్తాన్ కుందుజ్ ప్రావిన్సులోని గోజార్ ఇ సయీద్ అబాద్ మసీదులో శుక్రవారం సంభవించిన పేలుడులో 60మంది మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడినట్లు ప్రముఖ మీడియా సంస్థ అల్‌జజీరా వెల్లడించింది. అయితే కుందుజ్ ఆస్పత్రి అధికారి ఒకరు పేలుడులో 25మంది మరణించారని, 51మంది గాయపడ్డారని చెప్పారు. మరోవైపు అధికారిక బఖ్తార్ న్యూస్ ఏజెన్సీ ఈ పేలుళ్లలో 46మంది మరణించారని, 140మంది గాయపడ్డారని తెలిపింది. ఇవన్నీ ప్రాథమిక గణాంకాలేనని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని రక్షణ వర్గాలు భావిస్తున్నాయి. దేశ పాలనపగ్గాలు తాజాగా చేపట్టిన తాలిబన్లకు ఈ పేలుడు సవాలుగా మారింది. పేలుడులో మొత్తం 100 మంది మరణించడం లేదా గాయపడడం జరిగిందని కుందుజ్ ప్రావిన్స్ తాలిబన్ పోలీసు అధికారి ఒబైదా ప్రకటించారు. గాయపడినవారి కన్నా మరణించినవారే ఎక్కువగా ఉండొచ్చన్నారు. షియాల రక్షణకు తాలిబన్లు కట్టుబడిఉన్నారని భరోసా ఇచ్చారు. అఫ్గాన్ పగ్గాలు తాలిబన్ల చేతికి వచ్చాక జరిగిన పెద్దదాడిగా దీన్ని భావిస్తున్నారు. దాడిని షియాల మతపెద్ద అలిమి బల్ఖి ఖండించారు. తాలిబన్లు షియాలకు రక్షణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రార్ధనాస్థలాల రక్షణకు ఉంచిన ఆయుధాలను తాలిబన్లు తీసుకుపోయినందున, వీటిని రక్షించాల్సిన బాధ్యత కూడా వాళ్లదేనన్నారు. ఐసిస్ హస్తం మసీదులో జరిగిన ఘోర పేలుడుకు కారకులెవరో తొలుత తెలియరాలేదు. అయితే పేలుడు జరిగింది షియా ముస్లింలకు చెందిన మసీదు కావడంతో ఐసిస్‌పైనే అందరికీ తొలుత అనుమానం వచ్చింది. ఇందుకు తగ్గట్లే తామే ఈ పేలుళ్లు జరిపామని ఐసిస్ అనుబంధ సంస్థ ఐసిస్– కే వారి మీడియా ఏజెన్సీ అమాక్ న్యూస్‌లో ప్రకటించింది. ఇదే అంశాన్ని ఎస్ఐటీఈ ఇంటిలిజెన్స్ గ్రూపు నిర్ధారించింది. షియా హజారాలను లక్ష్యంగా చేసుకొనే ఆత్మాహుతి దాడి చేసినట్లు ఐసిస్–కే టెలిగ్రామ్ ఛానెల్లో ప్రకటించుకుంది. గతంలో పలుమార్లు షియా మైనారీ్టలపై ఐసిస్ దాడులు చేసిన చరిత్ర ఉంది. అమెరికా సైన్యాలు వైదొలిగిన అనంతరం ఐసిస్ ఉగ్రవాదులు అఫ్గాన్‌లో దాడులు ముమ్మరం చేశారు. ముఖ్యంగా షియాలపై ఐసిస్–కే యుద్ధాన్నే ప్రకటించింది. తాజాదాడులను ఐరాస ఖండించింది. పేలుడుపై తమ పత్య్రేక దళాలు దర్యాప్తు జరుపుతున్నట్లు తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా చెప్పారు. ప్రస్తుతం పోలీసులు అక్కడ ఆధారాలను సేకరిస్తున్నారు. ఒకప్పుడు కొన్నిప్రాంతాలకే పరిమితమైన ఐసిస్ దాడులు ఇప్పుడు పలు చోట్ల జరగడం తాలిబన్లతో పాటు అఫ్గాన్ పొరుగుదేశాలను కూడా కలవరపరుస్తోంది. -
‘ఆ రెండు టెస్టుల్లో ఫిక్సింగ్ జరగలేదు’
దుబాయ్: సుమారు మూడేళ్ల క్రితం ‘క్రికెట్స్ మ్యాచ్ ఫిక్సర్స్’ పేరుతో ప్రముఖ టీవీ చానల్ ‘అల్ జజీరా’ ప్రసారం చేసిన రెండు డాక్యుమెంటరీలలోని ఆరోపణలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొట్టి పారేసింది. ఇందులో పేర్కొన్న అంశాలపై తాము పూర్తి స్థాయిలో విచారణ జరిపామని, ఎక్కడా తప్పు జరగలేదని స్పష్టం చేసింది. డాక్యుమెంటరీ తొలి భాగంలో రెండు టెస్టు మ్యాచ్‌లలో స్పాట్ ఫిక్సింగ్ జరిగిందని చెప్పిన చానల్... రెండో భాగంలో 2011–12 మధ్య కాలంలో 15 మ్యాచ్‌లలో ఫిక్సింగ్ చోటు చేసుకుందని ఆరోపించింది. 2016లో భారత్, ఇంగ్లండ్ మధ్య చెన్నైలో జరిగిన టెస్టు (ఇందులో భారత్ ఇన్నింగ్స్, 75 పరుగులతో గెలిచింది)...2017లో భారత్, ఆస్ట్రేలియా మధ్య రాంచీలో జరిగిన టెస్టు (మ్యాచ్ డ్రాగా ముగిసింది)లలో ఇంగ్లండ్, ఆసీస్ ఆటగాళ్లు ఫిక్సర్ల సూచనల ప్రకారం బ్యాటింగ్ చేసినట్లు అల్ జజీరా వెల్లడించింది. అయితే సుదీర్ఘ కాలం విచారణ జరిగిన ఐసీసీ వీటన్నింటిని తప్పుగా తేల్చింది. అసలు చానల్ సమర్పించిన ఆధారాలు ఏ రకంగానూ నమ్మశక్యంగా లేవని స్పష్టం చేసింది. ‘చానల్ చూపించిన దృశ్యాలను బట్టి చూస్తే ఏదీ అసహజంగా అనిపించలేదు. ఫిక్సింగ్‌ను సూచించే విధంగా ఎలాంటి అంశం అందులోనూ కనిపించలేదు. అసలు అందులో చెప్పే విషయాలేవీ నమ్మశక్యంగా లేవు. ఇలాంటి అంశాలపై పట్టు ఉన్న నలుగురు నిపుణులతో మేం నియమించిన కమిటీ అన్ని అంశాలను పరిశీలించి తమ నివేదిక ఇచ్చింది’ అని ఐసీసీ ప్రకటించింది. మొత్తంగా ఈ వివాదంతో సంబంధం ఉందంటూ ఆరోపణలు ఎదుర్కొన్న ఐదుగురికి కూడా క్లీన్చిట్ ఇచ్చింది. -
ఫిక్సింగ్ కలకలం.. ఇద్దరిపై నిషేధం
కొలంబో : ‘ఆల్ జజీరా’ స్టింగ్ ఆపరేషన్‌లో ఫిక్సింగ్ పాల్పడినట్లు ఒప్పుకున్న పిచ్ క్యూరేటర్, గ్రౌండ్స్‌మన్‌పై వేటు వేస్తున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. నవంబర్‌లో ఇంగ్లండ్‌తో గాలే వేదికగా జరిగే టెస్టు మ్యాచ్ ఫలితం ప్రభావితమయ్యేలా ఫిచ్‌ను సిద్దం చేస్తామని ఈ ఇద్దరు తెలిపినట్లు స్టింగ్ ఆపరేషన్‌లో వెల్లడైంది. ఈ ఘటనతో శ్రీలంక క్రికెట్ బోర్డు ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానెల్‌ను ఏర్పాటు చేసి దర్యాప్తుకు ఆదేశించింది. అంతేగాకుండా స్థానిక పోలీసులకు సైతం ఫిర్యాదు చేసింది. ఈ స్టింగ్ ఆపరేషన్‌తో ఉలిక్కిపడ్డ అంతర్జాతీయ క్రికెట్ మండలి సైతం దర్యాప్తు చేపడుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించిన జర్నలిస్ట్ డేవిడ్ హారిసన్‌తో కొలంబో ఆటగాడు తరిందు మెండీస్, గాలె పిచ్ క్యూరేటర్ తరంగ ఇండికాలు ఫలితాన్ని ప్రభావం చేసేలా పిచ్‌ను సిద్దం చేస్తామని ఒప్పుకున్నారు. గతంలో జరిగిన శ్రీలంక–ఆసీస్, భారత్–లంక టెస్టుల్లో సైతం పిచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు కూడా వెల్లడించారు. ఇక ఈ వివాదంలో ముంబైకి చెందిన ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ రాబిన్ మోరిస్ హస్తం ఉన్నప్పటికీ టీమిండియా క్రికెటర్ల పేర్లు మాత్రం లేవు. చదవండి: మూడు టెస్టులు ఫిక్స్! -
మూడు టెస్టులు ఫిక్స్!
న్యూఢిల్లీ: మళ్లీ ఫిక్సింగ్ భూతం బుసలు కొట్టింది. గత రెండేళ్లుగా భారత్ ఆడిన మూడు టెస్టులు ఫిక్స్ అయినట్లు ఖతర్‌కు చెందిన అల్ జజీరా టీవీ చానెల్ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో వెల్లడవడంతో క్రికెట్ ప్రపంచం ఉలిక్కి పడింది. ఇదంతా కూడా దావూద్ (డి) గ్యాంగ్ కనుసన్నల్లో జరిగినట్లు ఈ చానెల్ నిర్వహించిన శూల శోధనలో వెల్లడైంది. ఇందులో ముంబైకి చెందిన ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ రాబిన్ మోరిస్ హస్తం ఉన్నప్పటికీ టీమిండియా క్రికెటర్ల ప్రమేయం లేకపోవడం ఊరట. ఈ స్టింగ్ ఆపరేషన్ వీడియోలో భారత క్రికెటర్ల పేర్లు మాత్రం లేవు. జర్నలిస్ట్ డేవిడ్ హారిసన్ ఈ ఆపరేషన్‌ను ముంబై, యూఏఈ, శ్రీలంకల్లో నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో డాక్యుమెంటరీ ఆదివారం ‘హిందుస్తాన్ టైమ్స్’ వెబ్సైట్లో ప్రసారమైంది. మొత్తం మ్యాచ్, ఇన్నింగ్స్ కాకుండా కొన్ని ఓవర్లు, సెషన్లు మాత్రమే ఫిక్సయ్యాయి. అంటే మ్యాచ్‌లు జరిగిన ఐదు రోజుల్లో ఏదో ఓ రోజు పది ఓవర్లో, 20 ఓవర్లో ఫిక్స్ అయ్యాయి. చెన్నై (2016)లో భారత్–ఇంగ్లండ్ టెస్టు, గతేడాది రాంచీలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు, గాలే (శ్రీలంక)లో శ్రీలంకతో ఆడిన టెస్టు మ్యాచ్‌లు బుకీలు, ఫిక్సర్ల బారిన పడినట్లు ఆ డాక్యుమెంటరీలో వెల్లడైంది. ఇందులో ఇద్దరు ఆస్ట్రేలియన్, ముగ్గురు ఇంగ్లండ్ క్రికెటర్ల పాత్ర ఉన్నట్లు ఆ వీడియోలో ఉంది. అయితే సదరు ఆటగాళ్ల పేర్లను ‘బీప్’సౌండ్‌తో వినపడకుండా కవర్ చేశారు. పాకిస్తాన్, శ్రీలంక ఆటగాళ్ల పేర్లు మాత్రం వినిపించాయి. హసన్ రజా (పాక్ తరఫున టెస్టు ఆడిన అతిపిన్న క్రికెటర్), దిల్హార లోకుహెత్తిగె, జీవంత కులతుంగ, తరిందు మెండీస్ (శ్రీలంక)లు ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తెలిసింది. వీరితో పాటు గాలే పిచ్ క్యురేటర్ తరంగ ఇండిక పేరు వినిపించింది. ఆయన గాలేలో జరిగిన శ్రీలంక–ఆసీస్, భారత్–లంక టెస్టుల్లో పిచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారు. శూల శోధన వీడియోలో డి–గ్యాంగ్‌కు చెందిన అనీల్ మునవర్ మాట్లాడుతూ ‘ప్రతీ స్క్రిప్టు నాదే. నేనిచ్చిందే జరుగుతుంది... జరిగి తీరుతుంది’ అని జర్నలిస్ట్‌కు వెల్లడించారు. ఫిక్సింగ్‌కు పాల్పడిన ఆటగాళ్లకు రూ. 2 కోట్లు నుంచి 6 కోట్ల వరకు ఇస్తామన్నారు. గాలే క్యురేటర్‌కు రూ. 25 లక్షలిచ్చామని ఇది ఆయన (క్యురేటర్) ఎనిమిదేళ్ల జీతంతో సమానమని చెప్పారు. భారత మాజీ దేశవాళీ ఆటగాడు రాబిన్ మోరిస్ మాట్లాడుతూ ‘నా చేతిలో 30 మంది ఆటగాళ్లున్నారు. వాళ్లంతా నేనేది చెబితే అదే చేస్తారు’ అని అన్నాడు. అతని వ్యాపార భాగస్వామి గౌరవ్ రాజ్‌కుమార్ ‘మాకు గేమ్ వినోదంతో పనిలేదు. ఆట గురించి పట్టించుకోం. మాకు కావాల్సింది డబ్బే! దాని కోసమే ఇదంతా చేస్తున్నాం’ అని చెప్పాడు. ఐసీసీ పూర్తిస్థాయి విచారణ... ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించామని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వెల్లడించింది. ఇందులో ఆరోపణలెదుర్కొంటున్న ఆటగాళ్ల దేశాలతో మాట్లాడి పూర్తిస్థాయి విచారణ జరుపుతామని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) మాత్రం... ముందు సాక్ష్యాలు కావాలని, విశ్వసనీయ రుజువులందాకే తమ ఆటగాళ్ల ప్రమేయంపై విచారణ చేపడుతామని తెలిపింది. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) చీఫ్ ఎగ్జిక్యూటీవ్ టామ్ హారిసన్ మాట్లాడుతూ భారత్‌తో జరిగిన టెస్టులో మాకెలాంటి సందేహాలు లేవని, ఆటగాళ్లను అనుమానించాల్సిన అవసరం లేదని అన్నారు. ఐసీసీ దర్యాప్తు తర్వాతే... ఐసీసీ దర్యాప్తు జరిగేదాకా వేచి చూస్తామని, ఆ తర్వాతే తమ బోర్డు పరిధిలో విచారణ నిర్వహిస్తామని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఇందులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముంబై ఆటగాడు రాబిన్ మోరిస్‌కు బోర్డు నుంచి రూ. 22,500 పెన్షన్ చెల్లిస్తున్నామని, దోషిగా తేలితే దాన్ని నిలిపివేస్తామని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. -
అల్ జజీరాను మూసేయాల్సిందే!
దుబాయ్: ఖతార్‌ను ఇప్పటికే బహిష్కరించిన అరబ్ దేశాల్లో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, ఈజిప్టు దేశాలు తమ 13 డిమాండ్లను నెరవేర్చాల్సిందిగా అల్టిమేటమ్ జారీ చేశాయి. అందుకు పది రోజుల గడువును విధించాయి. ఆ డిమాండ్లలో ఖతార్‌లోని అల్ జజీరా మీడియా నెట్‌వర్క్‌ను, దాని అనుబంధ సంస్థలన్నింటిని మూసివేయాలని ముందుగా డిమాండ్ చేసింది. తీవ్రవాద సంస్థలతో సంబంధాలు పెట్టుకోక పోవడం, దేశంలో నిర్మిస్తున్న టర్కీ వైమానిక స్థావరం పనులను తక్షణం నిలిపివేయడం, ఇరాన్‌తో దౌత్య సంబంధాలను కుదించుకోవడం, తమ నాలుగు దేశాలకు చెందిన పౌరులకు ఖతార్ పౌరసత్వం ఇవ్వడం నిలిపివేయడం ప్రధాన డిమాండ్లు. ఈ డిమాండ్ల చిట్టా శుక్రవారం నాడే తమకు అందిందని, వాటిని పరిశీలిస్తున్నామని ఖతార్ ప్రభుత్వం తెలిపింది. అరబ్, తమ దేశాల మధ్య కువైట్ మధ్యవర్తిత్వం వహిస్తున్నందున ఆ దేశానికే తమ సమాధానం చెబుతామని ప్రభుత్వం పేర్కొంది. డిమాండ్లు చూడబోతే అంతర్జాతీయ టెర్రరిజాన్ని అరికట్టడంకన్నా తమ దేశ సార్వభౌమాధికారాన్ని కుదించడమే లక్ష్యంగా కనిపిస్తోందని ఖతార్ ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. కొన్ని డిమాండ్లు అంతర్జాతీయ మానవ హక్కులు, వాటి ఒడంబడికలను ఉల్లంఘించేవిగా ఉన్నాయని ఖతార్ జాతీయ మానవ హక్కుల సంఘం ఆరోపించింది. కాగా ఖతార్‌ను బహిష్కరించిన సోదరు అరబ్ దేశాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన 'అల్ జజీరా' టీవీ చానెల్‌పై పడ్డాయి. 'అల్ జజీరా' చానెల్‌ను వెంటనే మూసివేయాలని అల్టిమేటం జారీచేశాయి. ఉగ్రవాదాన్ని ఎగదొస్తున్నదనే ఆరోపణలతో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఈఏ), ఈజిప్టు, బ్రహెయిన్ దేశాలు ఖతార్‌తో పూర్తిగా దౌత్య సంబంధాలు తెగదెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే. -
ఆ చానెల్‌ను మూసివేయండి!
దుబాయ్: ఖతార్‌ను బహిష్కరించిన సోదరు అరబ్ దేశాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన 'అల్ జజీరా' టీవీ చానెల్‌పై పడ్డాయి. 'అల్ జజీరా' చానెల్‌ను వెంటనే మూసివేయాలని అల్టిమేటం జారీచేశాయి. ఉగ్రవాదాన్ని ఎగదొస్తున్నదనే ఆరోపణలతో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఈఏ), ఈజిప్టు, బ్రహెయిన్ దేశాలు ఖతార్‌తో పూర్తిగా దౌత్య సంబంధాలు తెగదెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే. మళ్లీ తమతో దౌత్యసంబంధాలు పునరుద్ధరించుకోవాలంటే తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ 13 డిమాండ్ల జాబితాను ఆయా దేశాలు ఖతార్‌కు అందజేశాయి. అందులో ఖతార్ కేంద్రంగా నడిచే 'అల్ జజీరా' చానెల్‌ను మూసివేయాలన్న డిమాండ్ కూడా ఉంది. అంతేకాకుండా తమ బద్ధ శత్రువైన ఇరాన్‌తో దౌత్య సంబంధాలు తెంపుకోవాలని, ముస్లిం అతివాద గ్రూపులైన ముస్లిం బ్రదర్హుడ్, ఇస్లామిక్ స్టేట్, అల్ కాయిదా, హిజ్బుల్లా, సిరియాలోని జభాత్ ఫతే అల్ షామ్ తదితర సంస్థలతో సంబంధాలు ఉండరాదని డిమాండ్ చేశాయి. ఖతార్‌లోని టర్కీ సైనిక స్థావరాన్ని సైతం ఎత్తివేయాలని డిమాండ్ చేశాయి. ఈ డిమాండ్లపై ఖతార్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి -
భారీ వరదలతో కోలరాడో అతలాకుతలం
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో అమెరికాలోని కోలరాడో రాష్టంలో వరదలు పోటెత్తాయి. ఆ వరదల ధాటికి నలుగురు మరణించారని అల్ జజిర వార్త సంస్థ ఆదివారం వెల్లడించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. వరద ప్రవాహ ఉధృతికి లోతట్లు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయని చెప్పింది. దాంతో వందలాది మంది నిరాశ్రయులయ్యారని,వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారు ముమ్మర చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. అలాగే చాలా మంది ఆచూకీ తెలియకుండా పోయారని, వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు వివరించింది. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు విద్యుత్, నీటి సరఫర వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఈ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ఒబామాకు విజ్ఞప్తి చేసినట్లు కోలరాడో రాష్ట్రానికి చెందిన ఉన్నతాధికారులు ఈ సందర్బంగా తెలిపారు. వరదలు ముంచెత్తె ప్రాంతాలను గమనించి ఇప్పటికే పలు ప్రాంతాల్లోని ప్రజలను ముందస్తు చర్యల్లో భాగంగా సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియను యూఎస్ జాతీయ విపత్తు నివారణ సంస్థ బాధ్యతులు తీసుకుని ముమ్మర చర్యలు చేపట్టినట్లు ఉన్నతాధికారులు వివరించారు.