గాజాలో ఆరుగురు అల్ జజీరా మీడియా సంస్థకు జర్నలిస్టులు పాలస్తీనా తీవ్రవాదులని ఇజ్రాయెల్ సైన్యం ఆరోపణలు చేసింది. హమాస్, ఇస్లామిక్ జిహాద్ మిలిటెంట్ గ్రూపులతో ఆరుగురు జర్నలిస్టులు అనుబంధంగా పనిచేస్తున్నారని వ్యాఖ్యలు చేసింది. ఈ ఆరోపణలై స్పందించిన ఖతార్‌కు చెందిన అల్ జజీరా మీడియా నెట్‌వర్క్ తీవ్రంగా ఖండించింది. ఇజ్రాయెల్ చేసిన ఆరోపణలు నిరాధారమని తోసిపుచ్చింది.
‘‘ఇజ్రాయెల్ సైన్యం మా జర్నలిస్టులను ఉగ్రవాదులుగా చిత్రీకరించడాన్ని తిరస్కరిస్తున్నాం. ఇజ్రాయెల్ మా జర్నలిస్టులపై కల్పిత సాక్ష్యాలను సృష్టించడాన్ని తీవ్రం ఖండిస్తున్నాం. ఈ కల్పిత ఆరోపణలతో ఈ ప్రాంతంలో మిగిలి ఉన్న జర్నలిస్టుల గొతునొక్కేయడానికి ఇజ్రాయెల్ ప్రయత్నం చేస్తోంది. తద్వారా యుద్ధంలో జరుగుతున్న కఠినమైన వాస్తవాలను ప్రపంచానికి తెలియకూడదలనే కుట్రకు ఇజ్రాయెల్ తెరలేపింది. ఇజ్రాయెల్ బాంబు దాడులు, గాజాలో నెలకొన్న మానవతా సంక్షోభాన్ని ఎప్పటికప్పుడూ ప్రసారం చేస్తున్న ఏకైక అంతర్జాతీయ మీడియా నెట్‌వర్క్ అల్ జజీరానే’’ అని ఓ ప్రకటనలో తెలిపింది.
.
‘‘గాజాలో హమాస్, ఇస్లామిక్ జిహాద్ తీవ్రవాద సంస్థలలోని సైనికులతో ఆరుగురు అల్ జజీరా జర్నలిస్టులు కలిసిపోయారని నిర్ధారించే గూఢచార సమాచారం, టెర్రరిస్ట్ శిక్షణా కోర్సుల జాబితా, ఫోన్‌లతో సహా గుర్తించబడ్డాయి. ఖతార్ అల్ జజీరా మీడియా నెట్‌వర్క్‌లో పనిచేసే సిబ్బంది హమాస్ ఉగ్రవాదులతో కలిసిపోయారడానికి ఈ పత్రాలే రుజువు. అల్ జజీరా హమాస్ ప్రచారానికి నాయకత్వం వహిస్తున్నట్లు చాలా మంది జర్నలిస్టులు బహిర్గతం చేశారు. అల్ జజీరా జర్నలిస్టులు.. అనస్ అల్-షరీఫ్, హోసామ్ షబాత్, ఇస్మాయిల్ అబు ఒమర్ , తలాల్ అర్రూకీలకు హమాస్‌తో సంబంధాలు ఉన్నాయి.అదేవిధంగా అష్రఫ్ సరాజ్, అలా సలామెహ్ ఇస్లామిక్ జిహాద్‌తో అనుబంధం కలిగి ఉన్నారు’’ అని బుధవారం ఇజ్రాయెల్ ‘ఎక్స్’లో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment