denies
-
ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి నోటీసులు రాలేదు: వికీపీడియా
భారత ప్రభుత్వం నుంచ తమకు ఎలాంటి నోటీసులు అందలేదని వికీపీడియా తాజాగా వెల్లడించింది. వికీపీడియాలో ఎడిటింగ్ పద్దతులు, కంటెంట్‌లో ఖచ్చితత్వానికి సంబంధించి భారత ప్రభుత్వం నుంచి గత రెండు రోజుల్లో ఎలాంటి అధికారిక నోటీసులు అందలేదని వికీపిడియా ఫౌండేషన్ పేర్కొంది. ఈ మేరకు వికీపీడియా ఫౌండేషన్ ప్రతినిధి మాట్లాడుతూ.. వికీపీడియా లాభాపేక్ష లేని సంస్థ అని,ా ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి ఖర్చు లేకుండా లక్షలాది మందికి అవసరమైన సమాచారాన్ని అందిస్తుందన తెలిపారు.‘ప్రపంచవ్యాప్తంగా 2 లక్షల మందికి పైగా వాలంటీర్లు మా సైట్‌కు కంటెంట్‌ను అందిస్తున్నారు. ప్రతి నెల దాదాపు 850 మిలియన్లకు పైగా భారతీయులకు మా సైట్ ఉపయోగపడుతోంది. ప్రపంచంలోనే అత్యధిక వీక్షకుల్లో భారత్ అయిదో స్థానంలో ఉంది. ఇందులో వాలంటీర్లు వారికి తెలిసిన సమాచారాన్ని సైట్లో అప్లోడ్ చేయరు. విశ్వసనీయ వార్తాసంస్థలు, ప్రముఖ ప్రచురణ సంస్థల నుంచి మాత్రమే సమాచారాన్ని సేకరిస్తారు. అందుకే మా ఆర్టికల్స్లోను విశ్వసిస్తారు. వికీపీడియాలోని ఎడిటింగ్ పద్ధతులు, కంటెంట్‌లోని కచ్చితత్వానికి సంబంధించి భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి నోటీసులు అందలేదు. మా సంస్థలోని తటస్థ నిబంధనలను సంపాదకీయులు ఆచరిస్తారు. రాజకీయ నేపథ్యం ఉన్న అనేకమంది వాలంటీర్లు మా సంస్థలో భాగమై ఉన్నారు. ఏ ఆర్టికల్ అయినా విస్తృత సమాచారంతోనే రాస్తాం. ఆ సమాచారానికి సంబంధించిన సోర్సుల వివరాలు కూడా ఆర్టికల్ పేజీల్లో పేర్కొంటాం’ అని తెలిపారు. కాగా ప్రముఖ ఉచిత సమాచార సంస్థ వికీపీడియాకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. వికీపీడియాలో పక్షపాతంగా సమాచారం ఉంటుందని, కొన్ని తప్పుడు సమాచారాలు కూడా ఉంటున్నాయని పలువురి నుంచి ఫిర్యాదులు అందాయి. వీటిపై కేంద్రం తాజాగా చర్యలు చేపట్టింది. కేంద్రం రాసిన లేఖలో చిన్న సంపాదకులకు, సంస్థలకు కూడా కంటెంట్‌పై ఎడిటోరియల్ నియంత్రణ ఉంటుందని.. వికీపీడియాలో ఆ వ్యవస్థ ఎందుకు లేదని ప్రశ్నించింది. వికీపిడియాను కేవలం మధ్యవర్తిగా కాకుండా పబ్లిషర్‌గా(ప్రచురణకర్త) ఎందుకు పరిగణించకూడదని ప్రశ్నించింది. -
ఇజ్రాయెల్ ఆరోపణలను ఖండించిన అల్ జజీరా
గాజాలో ఆరుగురు అల్ జజీరా మీడియా సంస్థకు జర్నలిస్టులు పాలస్తీనా తీవ్రవాదులని ఇజ్రాయెల్ సైన్యం ఆరోపణలు చేసింది. హమాస్, ఇస్లామిక్ జిహాద్ మిలిటెంట్ గ్రూపులతో ఆరుగురు జర్నలిస్టులు అనుబంధంగా పనిచేస్తున్నారని వ్యాఖ్యలు చేసింది. ఈ ఆరోపణలై స్పందించిన ఖతార్‌కు చెందిన అల్ జజీరా మీడియా నెట్వర్క్ తీవ్రంగా ఖండించింది. ఇజ్రాయెల్ చేసిన ఆరోపణలు నిరాధారమని తోసిపుచ్చింది.‘‘ఇజ్రాయెల్ సైన్యం మా జర్నలిస్టులను ఉగ్రవాదులుగా చిత్రీకరించడాన్ని తిరస్కరిస్తున్నాం. ఇజ్రాయెల్ మా జర్నలిస్టులపై కల్పిత సాక్ష్యాలను సృష్టించడాన్ని తీవ్రం ఖండిస్తున్నాం. ఈ కల్పిత ఆరోపణలతో ఈ ప్రాంతంలో మిగిలి ఉన్న జర్నలిస్టుల గొతునొక్కేయడానికి ఇజ్రాయెల్ ప్రయత్నం చేస్తోంది. తద్వారా యుద్ధంలో జరుగుతున్న కఠినమైన వాస్తవాలను ప్రపంచానికి తెలియకూడదలనే కుట్రకు ఇజ్రాయెల్ తెరలేపింది. ఇజ్రాయెల్ బాంబు దాడులు, గాజాలో నెలకొన్న మానవతా సంక్షోభాన్ని ఎప్పటికప్పుడూ ప్రసారం చేస్తున్న ఏకైక అంతర్జాతీయ మీడియా నెట్వర్క్ అల్ జజీరానే’’ అని ఓ ప్రకటనలో తెలిపింది..‘‘గాజాలో హమాస్, ఇస్లామిక్ జిహాద్ తీవ్రవాద సంస్థలలోని సైనికులతో ఆరుగురు అల్ జజీరా జర్నలిస్టులు కలిసిపోయారని నిర్ధారించే గూఢచార సమాచారం, టెర్రరిస్ట్ శిక్షణా కోర్సుల జాబితా, ఫోన్లతో సహా గుర్తించబడ్డాయి. ఖతార్ అల్ జజీరా మీడియా నెట్‌వర్క్‌లో పనిచేసే సిబ్బంది హమాస్ ఉగ్రవాదులతో కలిసిపోయారడానికి ఈ పత్రాలే రుజువు. అల్ జజీరా హమాస్ ప్రచారానికి నాయకత్వం వహిస్తున్నట్లు చాలా మంది జర్నలిస్టులు బహిర్గతం చేశారు. అల్ జజీరా జర్నలిస్టులు.. అనస్ అల్-షరీఫ్, హోసామ్ షబాత్, ఇస్మాయిల్ అబు ఒమర్ , తలాల్ అర్రూకీలకు హమాస్‌తో సంబంధాలు ఉన్నాయి.అదేవిధంగా అష్రఫ్ సరాజ్, అలా సలామెహ్ ఇస్లామిక్ జిహాద్‌తో అనుబంధం కలిగి ఉన్నారు’’ అని బుధవారం ఇజ్రాయెల్ ‘ఎక్స్’లో పేర్కొంది. -
భరణం జీవనానికి మాత్రమే... విలాసాలకు కాదు!
జైపూర్ ఫ్యామిలీ కోర్ట్ మెయింటెనెన్స్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. విలాసవంతమైన జీవితం గడపడానికి భార్యకు భరణం ఇవ్వలేమంటూ మహిళ దాఖలు చేసుకున్న దరఖాస్తును తిరస్కరించింది. భార్య (దరఖాస్తు దారు)ఆదాయం, భర్త ఆదాయం కంటే ఎక్కువ అని ఈ నిర్ణయం తీసుకుంది.ఈ కేసులో ఫిర్యాది ఎస్బీఐలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. తన భర్త నెలవారీ ఆదాయం సుమారు రూ.2.50 లక్షలనీ, తన పోషణ, కేసు ఖర్చులు, నెలకు మెయింటెనెన్స్ అలవెన్స్ కింద రూ.75వేలు, అడ్వకేట్ ఫీజు, లిటిగేషన్ ఖర్చులు రూ.50వేలు, ఒక్కో విచారణకు హాజరయ్యేందుకు రూ.3వేలు ఇవ్వాలని భార్య డిమాండ్ చేసింది. దీనికి సమాధానంగా తన భార్యనెలకు రూ. 1,09,258 జీతంతోపాటు అదనపు అలవెన్స్‌లు పొందుతోందని కౌంటర్ పిటిషన్ వేశాడు భర్త. వాస్తవాలను పరిశీలించిన తర్వాత, విలాసవంతమైన జీవనంకాదు భరణం అంటే అంటూ ప్రిసైడిరగ్ అధికారి గార్గ్ మహిళ పిటిషన్‌ను కొట్టి వేశారు.భార్యకు ఎలాంటి ఆదాయ వనరులు లేని పక్షంలో విడాకులు, విడాకుల కేసు విచారణలో ఉండగా, హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 24 ప్రకారం, భార్య తన భర్త నుండి నెలవారీ భరణాన్ని అభ్యర్థించవచ్చు. మెయింటెనెన్స్ అంటేభార్య భర్తలు విడిపోయినప్పుడు, లేదా విడాకుల ప్రక్రియ కోర్టులో కొనసాగుతున్నప్పుడు ఆదాయం లేని భార్య జీవితాన్ని గడిపేందుకు ఇవ్వవలసిన సొమ్మునే మెయింటెనెన్స్ అంటారు. భాగస్వామి ఆహారం, దుస్తులు, వసతితో పాటు పిల్లల విద్య ఇతర బాగోగులు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మెయింటెనెన్స్ అనేది భాగస్వామికి మాత్రమే కాకుండా పిల్లలకు, తల్లితండ్రులకు కూడా వర్తిస్తుంది. -
త్రిషపై అనుచిత వ్యాఖ్యలు.. లియో నటుడికి మరో షాక్!
లియో నటుడు మన్సూర్ అలీ ఖాన్‌కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే అతనిపై నడిగర్ సంఘం నిషేధం విధించింది. హీరోయిన్ త్రిషపై అతను చేసిన అనుచిత వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున వివాదానికి దారితీయడంతో.. అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు వ్యక్తిగతంగా హజరై వివరణ ఇవ్వాలంటూ సమన్లు జారీ చేశారు. దీంతో అతను ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించాడు. అతని పిటిషన్ విచారణకు స్వీకరించిన స్థానిక కోర్టు బెయిల్ ఇచ్చేందుకు తిరస్కరించింది. అయితే పిటిషన్లో ఉన్న తప్పుల కారణంగా బెయిల్ ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ విషయంలో కోర్టు సమయం వృథా చేశారని మన్సూర్ అలీ ఖాన్‌ను హెచ్చరించినట్లు సమాచారం. కాగా.. ఈ కేసులో చెన్నైలోని థౌజండ్ ఐలాండ్ ఉమెన్ పోలీస్ స్టేషన్లో ఇవాళ విచారణకు ఆయన వ్యక్తిగతంగా హాజరయ్యాడు. ఖండించిన అగ్రతారలు త్రిషపై అతను చేసిన వ్యాఖ్యలను పలువురు సినీ అగ్రతారలు ఖండించారు. టాలీవుడ్ నటులతో పాటు మెగాస్టార్ చిరంజీవి, నటి ఖుష్బూ సుందర్ త్రిషకు మద్దతుగా పోస్టులు చేశారు. అతనిపై చర్యలు తీసుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే లియో డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ సైతం ఇలాంటి వారిని ఉపేక్షించేది లేదని అన్నారు. -
రూ.400 కోట్లకు అలనాటి మేటి హీరో బంగ్లా అమ్మకం: దాని స్థానంలో భారీ టవర్?
బాలీవుడ్ అలనాటి మేటి హీరో, దివంగత దేవానంద్కుచెందిన లగ్జరీ బంగ్లాను విక్రయించినట్టు మీడియాలో వార్తలుగుప్పుమన్నాయి. దేవానంద్ డ్రీమ్ హౌస్ ముంబైలోని జుహూ బంగ్లాని ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి భారీ మొత్తానికి రూ .400 కోట్లకు విక్రయించినట్టు తెలుస్తోంది. దాని స్థానంలో బహుళ అంతస్థుల భవనం నిర్మించబడుతుందనే వార్తలు హల్చల్ చేశాయి. అయితే ఇవన్నీ పుకార్లేనని తేలిపోయింది. ఈ రూమర్లపై దేవానంద్ మేనల్లుడు,నిర్మాత కేతన్ ఆనంద్ తాజాగా స్పందించారు. అలాంటి ఉద్దేశమేదీ లేదని, అవన్నీ తప్పుడు వార్తలని ఆయన ఖండించారు. దీనికి సంబంధించి దేవానంద్ కుమార్తె దేవీనా, ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడి ధృవీకరించుకున్నట్టు వెల్లడించారు. దాదాపు 40ఏళ్లపాటు దేవానంద్ తన భార్య కల్పనా కార్తీక్, పిల్లలు సునీల్ ఆనంద్ , దేవినా ఆనంద్‌లతో కలిసి గడిపారు. (భారీ తగ్గింపు: రూ. 48,900లకే ఐఫోన్ 15 దక్కించుకునే చాన్స్) అలాంటి ఇల్లును విక్రయించారని, డీల్ కూడా పూర్తయి పేపర్ వర్క్ జరుగుతోందని వార్తలొచ్చాయి. ప్రస్తుతం ఈ బంగ్లాను చూసుకోడానికి ఎవరూ లేని కారణంగా ముఖ్యంగా కొడుకు సునీల్ అమెరికాలోనూ, కూతురు దేవినా, తల్లి కల్పనాతో కలిసి ఊటీలో ఉంటోంది. అందుకే దీన్ని విక్రయించాలని నిర్ణయించుకున్నారు. దాదాపు అదే కారణంతో మహారాష్ట్రలోని పన్వెల్‌లో కొంత ఆస్తిని కూడా విక్రయించారని కథనాలొచ్చాయి. (వాట్సాప్ చానెల్: ప్రధాని మోదీ రికార్డ్..షాకింగ్ ఫాలోవర్లు) ఈ ప్రాంతంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, సినీ సెలబ్రిటీల బంగ్లాలు ఉన్న ప్రధాన ప్రదేశం కాబట్టి అంత దర పలికిందనీ, ఈప్లేస్లో 22 అంతస్తుల భారీ టవర్‌ను నిర్మించనున్నారని కూడా అంచనావేశారు. అంతేకాదు 10 సంవత్సరాల క్రితం ఆనంద్ స్టూడియో అమ్మినప్పుడు, ఆ డబ్బుతో మూడు అపార్ట్మెంట్లు కొని, ఒకటి సునీల్‌కు, మరొకటి దేవీనాక, మూడోది అతని భార్య కల్పనకు ఇచ్చారనీ జుహు బిల్డింగ్ అమ్మకం ద్వారా వచ్చిన సొమ్మును కూడా అలాగే పంచుకుంటారనేది కథనం. -
సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ..
ఢిల్లీ: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. టీచర్ రిక్రూట్మెంట్ కుంభకోణంలో సీబీఐ, ఈడీ విచారణలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీకి మధ్యంతర ఉపశమనం కల్పించకూడదన్న కలకత్తా హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ మేరకు టీఎంసీ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. టీఎంసీ దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణ చేపట్టిన సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మానసం.. టీచర్ రిక్రూట్మెంట్, మున్సిపల్ రిక్రూట్మెంట్ స్కాంలు లింక్ అయి ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ రెండు స్కాంలలో అభ్యర్థుల ఓఎమ్ఆర్లు తయారు చేసిన వ్యక్తి ఒకరేనని గుర్తించినట్లు వెల్లడించారు. ఇందులో సీబీఐ దర్యాప్తు పూర్తి అయినందున, హైకోర్టు వద్ద సమాచారం తక్కువ ఉందని ఎలా చెప్పగలమని ప్రశ్నించారు. ఈ మేరకు తీర్పును వెల్లడించారు. వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు.. అర్హత లేని వ్యక్తులకు టీచర్ పోస్టులను ఇచ్చినట్లు గుర్తించిన వ్యవహారంలో రూ.350 కోట్లు చేతులు మారినట్లు ధర్మాసనానికి చెప్పారు. చాలా ఓఎమ్ఆర్ పత్రాలు ధ్వంసమైనట్లు వెల్లడించారు. రూ.5 కోట్ల డబ్బు, నగలు గుర్తించినట్లు పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రిని కూడా అరెస్టు చేసినట్లు ధర్మాసనానికి చెప్పారు. ప్రతిపవాదనలు వినిపించిన సీనియర్ లాయర్ కపిల్ సిబల్.. ఇక్కడ ఈడీ దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ కేసులో మనీ లాండరింగ్ జరగలేదని న్యాయమూర్తికి విన్నవించారు. ఇదీ చదవండి: పార్కుకు 'వాజ్‌పేయీ' పేరు మార్పు.. బీజేపీ ఆందోళనలు.. -
బండి సంజయ్ పాదయాత్రకు అనుమతి నిరాకరణ
-
విలీనమా.. నో వే!...కావాలంటే వారు వెళ్లిపోవచ్చు!
సాక్షి, ముంబై: క్యాబ్ సేవల సంస్థలు, ఈ బిజినెస్‌లో ప్రధాన ప్రత్యర్థలు ఓలా, ఉబెర్ విలీనవుతున్నాయంటూ పలు రిపోర్టులు బిజినెస్ వర్గాల్లో సంచలనం రేపాయి. ఓలా ఉబర్ సంస్థల విలీనం గురించి ఇప్పటికే చర్చలు ప్రారంభించాయంటూ వార్తలు హల్చల్ చేశాయి. దేశీయ అతిపెద్ద రైడ్-హెయిలింగ్ కంపెనీ ఓలా వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ సోషల్ మీడియా ద్వారా తీవ్రంగా ఖండించారు. రబ్బిష్.. పూర్తిగా పుకార్లే అంటూ ఆయన ట్వీట్ చేశారు. దేశంలో తమ వ్యాపారం చాలా లాభదాయకంగా ఉందనీ, పురోగతి సాధిస్తున్నామని ఈ క్రమంలో విలీనమనే సమస్య లేదని స్పష్టం చేశారు. అంతేకాదు కావాలనుకుంటే విదేశీ కంపెనీలు దేశంనుంచి నిష్క్రమించాలనుకుంటే వారికి స్వాగతం! అంతేకానీ తాము ఎప్పటికీ విలీనం కామంటూ అమెరికా కంపెనీ ఉబెర్‌కు వ్యంగ్యంగా చురకలేశారు. ఈ మేరకు అగర్వాల్ వార్తా నివేదికలను ఉటంకిస్తూ ట్వీట్ చేశారు. బలమైన బ్యాలెన్స్ షీట్‌తో ప్రపంచంలోనే అత్యంత లాభదాయకమైన రైడ్ హెయిలింగ్ కంపెనీలలో ఒకటిగా, అందులోనూ భారతదేశంలో మార్కెట్ లీడర్‌గా ఉన్నామని ఓలా ప్రకటించింది. కాగా రైడ్ హెయిలింగ్ దిగ్గజాలు ఓలా, ఉబెర్ విలీనమార్గంలో ఇప్పటికే చర్చలు ప్రారంభించాయనీ, సీఈఓ అగర్వాల్ అమెరికాలో ఉబెర్ కీలక అధికారులతో భేటీ కానున్నారంటూ పలు వార్తలు వెలువడ్డాయి. రెండు కంపెనీలు ఇంతకు ముందు కూడా విలీన అవకాశాలపై చర్చించాయని, అయితే ఒప్పందం కార్యరూపం దాల్చలేదని నివేదిక పేర్కొంది. అయితే ఓలా తన క్విక్ ఫుడ్ డెలివరీ, యూజ్డ్ కార్ బిజినెస్‌ను మూసివేయడం, ఈ వారంలో దాదాపు 300-350 మంది ఉద్యోగులను తొలగించిన నేపథ్యంలో ఈ ఊహగానాలు వెలువడటం గమనార్హం. చదవండి: ట్విటర్ డీల్ వివాదం: మస్క్ మరో కీలక నిర్ణయం Absolute rubbish. We’re very profitable and growing well. If some other companies want to exit their business from India they are welcome to! We will never merge. https://t.co/X3wC9HDrnr — Bhavish Aggarwal (@bhash) July 29, 2022 -
అలాంటిదేమీ లేదు...దంచుడు దంచుడే!
సాక్షి,ముంబై: సీనియర్ సిటిజన్స్‌కు రైల్వే శాఖ అందించే రాయితీలను తిరిగి ప్రారంభించనున్నట్టు ఒక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. జూలై 1 నుండి సీనియర్ సిటిజన్స్ రాయితీలు తిరిగి పొందవచ్చు అనేవార్త వైరల్ అయింది. అయితే దీనిపై స్పందించిన ప్రభుత్వం ఇది ఫేక్ న్యూస్ అంటూ ఈ వార్తలను కొట్టిపారేసింది. ప్రస్తుతం రైల్వే మంత్రిత్వ శాఖ దివ్యాంగులు, రోగులతోపాటు, కొంతమంది విద్యార్థులకు మాత్రమే రాయితీలు ఇస్తోందని పునరుద్ఘాటించింది. అలాగే రైళ్లలో సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణకు సంబంధించి రైల్వే మంత్రిత్వ శాఖ ఎలాంటి ప్రకటన చేయలేదని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు పీఐబీ“ఫ్యాక్ట్ చెక్” హ్యాండిల్ ట్వీట్ చేసింది. దీంతో ఇక నైనా తమకు చార్జీల భారంనుంచి ఉపశమనం లభిస్తుందని ఆశించిన వయో వృద్ధులకు తీరని నిరాశే మిగిలింది. త్వరలోనే రాయితీ తిరిగి లభిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా కోవిడ్-19 సంక్షోభ సమయంలో రైళ్లలో సీనియర్ సిటిజన్లకు అందుబాటులో ఉన్న ఛార్జీల రాయితీని భారతీయ రైల్వే తాత్కాలికంగా నిలిపివేసింది. కరోనాకి ముందు రైల్వేలో ప్రత్యేక రాయితీల ద్వారా 58 ఏళ్లు పైబడిన స్త్రీలకు టిక్కెట్టు ధరలో 50 శాతం, 60 ఏళ్లు పైబడిన పురుషులు, థర్డ్ జెండర్ ప్యాసెంజర్లకు 40 శాతం రాయితీ అమలయ్యేది. అయితే తొలి విడత లాక్డౌన్ నుంచి ఈ రాయితీలు ఏవీ అమలు కావడం లేదు. గడిచిన రెండేళ్లలో సీనియర్ సిటిజన్లకు కనుక రాయితీని అమలు చేసి ఉంటే రైల్వేశాఖ ఖజానాలో రూ.3464 కోట్ల రూపాయలు, ఇందులో కనీసం రూ. 1500 కోట్ల రాయితీగా వృద్ధులకు అక్కరకు వచ్చేదని ఇటీవలి ఆర్టీఐ సమాచారం ద్వారా వెల్లడైంది. అలాగే కరోనా కారణంగా 2020 మార్చిలో వయోవృద్ధుల రాయితీలను తొలగించిన మంత్రిత్వ శాఖకు వాటిని పునరుద్ధరించే ఆలోచన ఏదీ ప్రస్తుతానికి లేదని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ ఏడాది మార్చిలో పార్లమెంటుకు తెలియజేశారు. A #Fake media report is claiming that the Indian Railways will resume concessions for senior citizens from July 1, 2022 ▶️ No such announcement has been made by @RailMinIndia ▶️ Indian Railways is currently providing concessions to divyangjans, patients & students only pic.twitter.com/ePoctCRu3A — PIB Fact Check (@PIBFactCheck) June 16, 2022 -
రెజ్లర్ సుశీల్‌కు చుక్కెదురు.. ముందస్తు బెయిల్ కొట్టివేత
న్యూఢిల్లీ: యువ రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో నిందితుడిగా ఉన్న భారత రెజ్లింగ్ స్టార్ సుశీల్ కుమార్‌కు కోర్టులోనూ చుక్కెదురైంది. గత రెండు వారాలుగా పరారీలో ఉన్న అతనికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. అరెస్ట్ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో తనకు బెయిల్ ఇవ్వాలంటూ సోమవారం స్థానిక రోహిణి కోర్టులో సుశీల్ పిటిషన్ దాఖలు చేయగా... మంగళవారం అతని విజ్ఞప్తిని అడిషనల్ సెషన్స్ జడ్జి జగదీశ్ కుమార్ కొట్టి పారేశారు. ఘటనలో ప్రధాన కుట్రదారుడిగా సుశీల్‌పై ఉన్న అభియోగాలు తీవ్రమైనవవి న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. మే 4న ఛత్రశాల్ స్టేడియం ముందు రెండు వర్గాలు కొట్టుకున్న ఘటనలో జాతీయ మాజీ జూనియర్ చాంపియన్ సాగర్ రాణా మరణించగా... సుశీల్‌పై ఆరోపణలు రావడంతో అతను అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. 37 ఏళ్ల సుశీల్ భారత్ తరఫున 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం, 2012 లండన్ ఒలింపిక్స్‌లో రజతం... 2010 ప్రపంచ చాంపియన్ షిప్లో స్వర్ణం... 2010 ఢిల్లీ, 2014 గ్లాస్గో, 2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లలో స్వర్ణం... 2006 దోహా ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించాడు. దర్యాప్తునకు సహకరిస్తాం... బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుశీల్ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లుథ్రా హాజరయ్యారు. ‘సదరు ఘటనతో నాకు ఎలాంటి సంబంధం లేదు. దర్యాప్తు మొత్తం నాకు వ్యతిరేకంగా పక్షపాత ధోరణిలో సాగుతోంది. విచారణ ముగిసేవరకు నేను సహకరించి వాస్తవాలు ఏమిటో చెబుతా. బాధితుల స్టేట్మెంట్లు ఇప్పటికే రికార్డు చేశారు. ఘటన జరిగిన స్థలం వద్ద నాకు సంబంధించిన ఎలాంటి వస్తువులు లభ్యం కాలేదు. అక్కడ జరిగినట్లుగా చెబుతున్న కాల్పులతో కూడా నాకు ఎలాంటి సంబంధం లేదు. పోలీసులకు లభించిన తుపాకీ, వాహనం నావి కావు. ఇలాంటి స్థితిలో నన్ను కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించాల్సిన అవసరం లేదు’ అని సుశీల్ తన బెయిల్ పిటిషన్లో పేర్కొన్నాడు. గొడవ సమయంలో అక్కడే ఉన్న సోనూ అనే వ్యక్తి రౌడీషీటర్ అని... తనతో విభేదాలు ఉన్న సోనూ నుంచి సుశీల్‌కు హాని జరిగే అవకాశం కూడా ఉందని లుథ్రా వాదించారు. సాక్ష్యాలు బలంగా ఉన్నాయి... అయితే నిందితుడి తరఫు వాదనతో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ శ్రీవాత్సవ విభేదించారు. ‘సుశీల్‌కు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు ఉన్నాయి. చేతిలో కర్రతో అతడు కొడుతున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. మొత్తం ఘటనలో అతనే ప్రధాన నిందితుడు. దాడి చేయడంలో అతనిదే కీలకపాత్ర. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నిపుణులు కూడా నేరం చేయడంలో సుశీల్ చురుగ్గా పాల్గొన్నాడని నిర్ధారించారు. కేసులో వాస్తవాలు వెలికితీయాలంటే సుశీల్‌ను కస్టడీలోకి తీసుకొని విచారించడం తప్పనిసరి. అతను దేశం విడిచి వెళ్లి పారిపోకుండా ఇప్పటికే పాస్‌పోర్ట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నాం’ అని వాదించారు. దీనిని అంగీకరిస్తూ న్యాయమూర్తి బెయిల్ తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. ‘విచారణ ఇంకా కొనసాగుతోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో కొందరు ఇంకా అరెస్టు కాలేదు. సుశీల్‌పై ఇప్పటికే నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారంట్ జారీ అయింది. ఇలాంటి స్థితిలో ముందస్తు బెయిల్ కుదరదు’ అని స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు 302 (హత్య) సహా ఐపీసీ, ఆయుధాల చట్టంలోని 11 వేర్వేరు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.ముందస్తు బెయిల్ కుదరదు చదవండి: Sushil Kumar: ఆచూకీ చెబితే రూ.1 లక్ష! -
బీజేపీకి వత్తాసు : ఫేస్బుక్ క్లారిటీ
సాక్షి, న్యూఢిల్లీ: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ బీజేపీతో చేతులు కలిపిందన్న విమర్శలపై ఫేస్బుక్ స్పందించింది. రాజకీయాలు, రాజకీయనేతలతో సంబంధం లేకుండా తమ విధానాలను అమలు చేస్తున్నామని స్పష్టం చేసింది. రాజకీయ లేదా పార్టీ అనుబంధ సంస్థలతో సంబంధం లేకుండా హింసను ప్రేరేపించే ద్వేషపూరిత కంటెంట్‌ను తాము నిషేధించామనీ, ప్రపంచవ్యాప్తంగా ఇదే విధానాలను అమలు చేస్తున్నామని ఫేస్బుక్ ప్రతినిధి వివరణ ఇచ్చారు. ఈ విషయంలో ఇంకా చాలా చేయాల్సి ఉందనీ, తమ కఠిన నిబంధనల అమలులో పురోగతి సాధిస్తున్నామన్నారు. ఖచ్చితత్వాన్ని నిర్ధారించేందుకు రెగ్యులర్ ఆడిట్లను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కాగా భారతదేశంలో అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తో పొత్తు పెట్టుకున్న ఫేస్బుక్ , బీజేపీ ,దాని అనుబంధ సంస్థ నేతలు చేస్తున్న ద్వేషపూరిత వ్యాఖ్యలను పట్టించుకోవడంలేదంటూ 'వాల్ స్ట్రీట్ జర్నల్' ప్రచురించిన ప్రత్యేక కథనం బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మాటల యుద్ధానికి దారి తీసింది. బీజేపీ సోషల్ మీడియాను తనకు అనుకూలంగా మలుచుకుంటోందంటూ కాంగ్రెస్‌నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఇండియాలో బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఫేస్బుక్, వాట్సాప్‌లను నియంత్రిస్తున్నాయనడానికి అమెరికా మీడియా కథనం నిదర్శనమని రాహుల్ విమర్శించారు. ఈ వ్యాఖ్యలకు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ సీనియర్ నేత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి నాయకత్వం వహిస్తున్న శశిథరూర్ పౌరుల హక్కులను పరిరక్షించడం, సామాజిక/ఆన్లైన్ న్యూస్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల దుర్వినియోగాన్ని నివారించడం అనే అంశంపై సాక్ష్యాలను పరిశీలిస్తామన్నారు. దీనిపై గతంలో ఫేస్బుక్ కు నోటీసులిచ్చినట్టు గుర్తు చేశారు. దీంతో వివాదం రేగింది. దీనిపై స్పందించిన కేంద్ర ఐటీ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఈ ఆ రోపణలను తీవ్రంగా ఖండించారు. ఓడిపోయినవారు ఇలాంటి ఆరోపణలు చేయడం సర్వసాధారణమేనని, కేంబ్రిడ్జ్ అనలిటికా, ఫేస్బుక్ ఒప్పందంతో రెడ్ హ్యాండెడ్ గా దోరికిపోయింది కాంగ్రెస్ పార్టీయేనంటూ ఎదురు దాడి చేసిన సంగతి తెలిసిందే. भाजपा-RSS भारत में फेसबुक और व्हाट्सएप का नियंत्रण करती हैं। इस माध्यम से ये झूठी खबरें व नफ़रत फैलाकर वोटरों को फुसलाते हैं। आख़िरकार, अमेरिकी मीडिया ने फेसबुक का सच सामने लाया है। pic.twitter.com/PAT6zRamEb — Rahul Gandhi (@RahulGandhi) August 16, 2020 Our Parliamentary committee will, in the normal course, consider testimony under the topic “Safeguarding citizens’ rights & prevention of misuse of social/online news media platforms”. The subject is squarely within the IT Cmt’s mandate& @Facebook has been summoned in the past. https://t.co/saoK8B7VCN — Shashi Tharoor (@ShashiTharoor) August 16, 2020 -
పేలిన రెడ్మి నోట్ స్మార్ట్‌ఫోన్
సాక్షి,ముంబై: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లలో ఒకటి, భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో దూసుకుపోతున్నషావోమికి మరోసారి పేలుడు షాక్ తగిలింది. షావోమి పాపులర్ స్మార్ట్‌ఫోన్ ‘రెడ్మి నోట్ 7ఎస్’ ఉన్నట్టుండి మంటల్లో చిక్కుకుంది. అంతేకాదు చార్జింగ్‌లో లేకుండానే ఈ ప్రమాదం చోటు చేసుకోవడం కలకలం రేపింది. అయితే షావోమి మాత్రం ఎలాంటి సాంకేతిక లోపం లేదని, కస్టమర్ తప్పిదం వల్లే ఇలా జరిగివుంటుందని పేర్కొనడం చర్చకు దారి తీసింది. ముంబైకి చెందిన ఈశ్వర్ చావన్ తనకెదురైన చేదు అనుభవాన్నిసోషల్ మీడియాలో పంచుకున్నారు. రెడ్మి నోట్ 7ఎస్ స్మార్ట్‌ఫోన్ అక్టోబర్‌లో ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేసినట్లు చావన్ ట్వీట్లో వివరించారు. ‘కొత్త ఫోన్ ఆఫీసు టేబుల్ మీద పెట్టాను. సడన్‌గా ఏదో కాలుతున్న వాసన గమనించాను. అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఫోన్ ఛార్జింగ్‌లో లేదు’ అని తెలిపారు. అంతేకాదు.. తన ఫోన్ ఎపుడూ కింద కూడా పడలేదని గుర్తు చేసుకున్నారు. వెంటనే ఆయన థానేలోని షావోమి అధీకృత దుకాణాన్ని సంప్రదించారు. ఐదు రోజుల తరువాత, బ్యాటరీలో కొంత సమస్య ఉందని కంపెనీ చెప్పిందని చావన్ పేర్కొన్నారు. బ్యాటరీ లోపం, తయారీ లోపం వల్లే ఇలా జరిగి వుంటుందని ఆయన ఆరోపిస్తున్నారు. అయితే షావోమీ స్పందిస్తూ..నాణ్యతకు, భద్రతకు అధిక ప్రాధాన్యత యిస్తామని, గత అయిదేళ్లుగా అభిమానులుతమ బ్రాండ్‌పై చూసిన అభిమానానికి ఇది నిదర్శనమని తెలిపింది. తాజా ఘటనను పరిశీలించిన తరువాత, బాహ్య పరిస్తితుల కారణంగానే నష్టం జరిగిందని తేల్చి పారేసింది. 'కస్టమర్ ప్రేరిత నష్టం' గా భావిస్తున్నట్టుగా పేర్కొంది. -
ఎల్ అండ్ టీ బై బ్యాక్‌కు సెబీ నో
ఇంజనీరింగ్ మేజర్ లార్సన్ అండ్ టుబ్రోకు సెబీ నిరాశను మిగిల్చింది. రూ. 9వేల కోట్ల విలువైన షేర్ల బై బ్యాక్ ఆఫర్‌కు సెబీ అనుమతినివ్వలేదు. ఈ మేరకు ఎల్ అండ్ టీ శనివారం రెగ్యులేటరీ సమాచారంలో తెలిపింది. సెబి నిబంధనలకు అనుగుణంలేని కారణంగా బై బ్యాక్ ఆఫర్‌ను తిరస్కరించిందని పేర్కొంది. కాగా ఈక్విటీ షేరు రూ. 1475 వద్ద సుమారు 6.1 కోట్ల షేర్లను బై బ్యాక్ చేయనున్నామని గత ఏడాది ఆగస్టులో ప్రతిపాదించింది. -
నేను ఆ రేసులో లేను
సాక్షి,న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్(బీఓఈ) గవర్నర్ గా కీలక భాధ్యతలు చేపట్టబోతున్నారన్న వార్తలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పందించారు. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ గవర్నర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలని తాను భావించడంలేదని రాజన్ స్పష్టం చేశారు. షికాగో యూనివర్శిటీ ఉద్యోగంలో చాలా హ్యాపీగా ఉన్నానని తెలిపారు. అంతేకాదు వాస్తవానికి తాను ప్రొఫెషనల్ సెంట్రల్ బ్యాంకర్ని కాదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అమెరికా యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న రఘురామ రాజన్ పేరు ఇటీవల వార్తల్లో నిలిచింది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్(బీఓఈ) గవర్నర్ గా కీలక భాధ్యతలు చేపట్టబోతున్నారని నివేదికలు వెలువడ్డాయి. బీఓఈ గవర్నర్ గా మార్క్ కార్నీ పదవీకాలం వచ్చే ఏడాది ముగియనున్న ఈ నేపథ్యంలో యూనివర్శిటీ ఆఫ్ షికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఫైనాన్స్ ఫ్రొఫెసర్ గా ఉన్న రఘురామ్ రాజన్ పేరు ప్రముఖంగా వినిపించిన సంగతి తెలిసిందే. -
బాలచందర్ ఆస్తుల వేలం.. గందరగోళం!
సాక్షి, చెన్నై : లెజెండరీ దర్శకుడు, దాదాసాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత.. కే బాలచందర్ ఆస్తుల వేలం వార్త గత రెండు రోజులుగా కోలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అలాంటిదేం జరగబోదని నిర్మాణ సంస్థ.. ఆస్తులను వేలం వేసి తీరతామని యూకో బ్యాంక్ వేర్వేరు ప్రకటనలు విడుదల చేశాయి. దీంతో ఈ వ్యవహారంలో ఇప్పుడు గందరగోళం మొదలైంది. ఆదివారం ప్రముఖ దినపత్రికల్లో దివంగత బాలచందర్ ఆస్తులను వేలం వేయబోతున్నట్లు ప్రకటన వెలువడింది. దీంతో రజనీ కాంత్, కమల్ హాసన్‌లు గురువు కోసం ఏదైనా చేస్తారేమోనని అంతా ఎదురు చూశారు. వారు స్పందించకపోయినప్పటికీ ఆయన నిర్మాణ సంస్థ కవితాలయ మూవీస్ ఓ ప్రకటన విడుదల చేసింది. బాలచందర్ ఆస్తుల వేలం ఉండబోదని తెలిపింది. ‘వ్యాపారంలో భాగంగానే బాలచందర్.. ఇళ్లు, కార్యాలయం డాక్యూమెంట్లు చెన్నైలోని యూకో బ్యాంకులో తాకట్టుపెట్టి రుణం తీసుకున్నారు. ఆయన చనిపోవటంతో రుణంపై వడ్డీ పేరుకుపోయింది. 1.36 కోట్లకు వేలం వేయాలని బ్యాంక్ నిర్ణయించింది. కానీ, ఇప్పటికే చాలా వరకు రుణం తిరిగి చెల్లించాం. మిగతా రుణాన్ని సింగిల్ సెటిల్మెంట్లో చెల్లించేలా మా ప్రతినిధులు బ్యాంక్ అధికారులతో చర్చలు జరుపుతున్నారు’ అని కవితాలయ ప్రతినిధి పేర్కొన్నారు. అయితే బ్యాంక్ మాత్రం ఈ ప్రకటనపై సానుకూలంగా స్పందించలేదు. బాలచందర్ ఇల్లు, కార్యాలయం వేలం వేస్తున్నామని, ఇది కోర్టు పరిధిలో వ్యవహారం కాబట్టి ఇంతకు మించి స్పందించలేమని బ్యాంకు అధికారులు చెప్పటంతో గందరగోళం మొదలైంది. -
‘పెళ్లి నాది కాదు.. నా ఫ్రెండ్‌ది’
సీనియర్ హీరోయిన్ శ్రియ శరన్ పెళ్లి మార్చిలో జరగనున్నట్టుగా వార్తలు వినిపించాయి. కొద్ది రోజులుగా ఓ రష్యాన్ యువకుడితో సన్నిహితంగా ఉంటున్న శ్రియ అతడినే పెళ్లాడనుందన్న వార్త మీడియా సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు రాజస్థాన్‌లో వీరి వివాహ వేడుక జరగనుందని, ఇప్పటికే ఈ జంట షాపింగ్ కూడా మొదలెసినట్టుగా వార్తలు వినిపించాయి. అయితే అవన్ని రూమర్ప్ అంటూ కొట్టి పారేసింది శ్రియ. రాజస్థాన్ లో జరగనున్న తన స్నేహితురాలి వివాహం కోసమే బట్టలు, నగలు ఆర్డర్ చేశానని, ఇప్పట్లో తన పెళ్లి ఉండదని క్లారిటీ ఇచ్చింది. ఈ విషయంపై స్పందించిన శ్రియ తల్లి నీర్జ.. ‘రానున్న నెల రోజుల్లో శ్రియ రెండు వివాహా వేడుకల్లో పాల్గొనబోతోంది. వాటికోసం షాపింగ్ చేయటం వల్లే ఈ రూమర్స్ పుట్టుకొచ్చాయి’ అని తెలిపారు. ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న గాయత్రి సినిమాలో కీలక పాత్రలో నటించిన శ్రియ ప్రస్తుతం కార్తీక్ నరేన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నరగసూరన్ సినిమాతో పాటు మరో బాలీవుడ్ సినిమాలో నటిస్తోంది. -
నేను ఆ రేసులో లేను
సాక్షి, బెంగళూరు: దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్‌కు సీఈవో కానున్నారనే వార్తలపై కండ్యూయెంట్ సీఈవో డైరెక్టర్ అశోక్ వేమూరి(49) స్పందించారు. తాను ఇన్ఫీ సీఈవో రేసులో లేనని స్పష్టం చేశారు. అశోక్ వేమూరి ఇన్ఫీ సీఈవో కానున్నారన్న అంచనాలు ఇటీవల ఇండస్ట్రీ వర్గాల్లో క్కర్లుకొట్టాయి. ఈ నేపథ్యంలో ఈ అంచాలన్నీ అవాస్తవాలని తేల్చి పారేశారు. తాను కండ్యూయెంట్ కంపెనీకి కట్టుబడి ఉన్నానని చెప్పారు. తాను కండ్యూయెంట్ కంపెనీకి, ఖాతాదారులకు, షేర్ హోల్డర్స్, ఉద్యోగులకు పూర్తిగా నిబద్ధుడినై ఉన్నానని ప్రకటించారు. అద్భుతమైన ప్రయాణం మధ్యలో ఉన్నాం, అది వేగంగా అభివృద్ధి చెందే దిశలో ఉంది . ఈ విషయంలో తనకు బోర్డుతో సహా ఇతర ఖాతాదారులు, టీం మద్దతు ఉందని వెల్లడించారు. తన దీర్ఘ కాల ప్రయాణంలో ఉన్నానని, అది పూర్తి చేయాలని భావిస్తున్నానని ఆఫ్ క్రాస్ రీసెర్చ్ విశ్లేషకుడు షానోన్ క్రాస్ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అంతేకాదు ఇక్కడ (కండ్యూయెంట్) కంటే ఎక్కువ ఉత్తేజకరమైన, వృత్తిపరంగా సంతృప్తికరమైన స్థలం గురించి తాను ఆలోచించలేనని అశోక్ వేమూరి స్పష్టం చేశారు. కాగా ఇన్ఫోసిస్ సీఎండీగా విశాల్ సిక్కా రాజీనామా అనంతరం ఈ పదవిలో రేసులో ఉ న్న వారి పేర్లలో అశోక్ వేమూరి పేరు ప్రముఖంగా వినిపించింది. ఇన్ఫోసిస్ మాజీ బోర్డు సభ్యుడు కూడా వేమూరి 2013లో కంపెనీ వీడారు. -
ఎన్డీటీవీని అమ్మేశారా?
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్డీటీవీని (న్యూఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్) స్పైస్‌జెట్ సహ వ్యవస్థాపకులు అజయ్ సింగ్ కొనుగోలు చేశారన్న వార్తలు ఒక్కసారిగా మీడియాలో గుప్పు మన్నాయి. టీవీలో మెజారిటీ వాటాను అజయ్ సింగ్ కొనుగోలు చేశారని వార్తలు వచ్చాయి. ఈ ఒప్పందం ప్రకారం అజయ సింగ్ 40శాతం వాటాను, ప్రణయ్‌రాయ్, రాధికా రాయ్ సుమారు 20శాతం వాటాను కలిగి వుంటారని అంచనాలు వెలువడ్డాయి. డీల్ లో భాగంగా ఎన్డీటీవీకి చెందిన రూ.400 కోట్లు అప్పును కూడా అజయ్ స్వీకరించారని, మొత్తం డీల్ విలువ రూ.600 కోట్ల అని మీడియాలో కథనాలు జోరుగా వ్యాపించాయి. దీంతో ఎన్డీటీవీ షేర్ భారీగా ఎగిసింది. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో షేర్ ధర అప్పర్ సర్క్యూట్‌ను తాకడం విశేషం. ప్రణయ్ రాయ్, రాధికా రాయ్, ప్రమోటింగ్ సంస్థ ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌లు సీబీఐ స్కానర్‌లో ఉండడంతో.. ఈ కంపెనీ చేతులు మారనుందనే వార్తలు హల్ చల్ చేశాయి. అయితే ఈ అంచనాలను ఎన్డీటీవీ కొట్టిపారేసింది. తాము ఎవరితోనూ, ఎలాంటి ఒప్పందాన్ని కుదుర్చుకోలేదని మార్కెట్ రెగ్యురేటరీ ఫైలింగ్ లో తెలిపింది. దీంతో మార్కెట్వర్గాల్లో గందరగోళం నెలకొంది. కాగా 1988లో ప్రణయ్‌రాయ్, ఆయన భార్య రాధికా రాయ్ ఎన్డీటీవీని స్థాపించారు. -
ఉద్యోగులకు విప్రో ఛైర్మన్ లేఖ
ముంబై: టెక్ దిగ్గజం విప్రో వాటాల విక్రయాలపై వస్తున్నవార్తలపై విప్రో లిమిటెడ్ ఛైర్మన్ అజిమ్ ప్రేమ్‌జీ అధికారికంగా స్పందించారు. విప్రో కంపెనీని లేదా కంపెనీకి చెందిన కొన్ని యూనిట్లను విక్రయించడానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయని, అమ్మడానికి ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకులు ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నారన్న మీడియా నివేదికలను అజిమ్ ప్రేమ్‌జీ తీవ్రంగా ఖండించారు. ఇవి పూర్తిగా నిరాధారమైనవి, హానికరమైనవంటూ తోసిపుచ్చారు. ఈ మేరకు ఆయన సంస్థ ఉద్యోగులకు ఒక లేఖను విడుదల చేశారు. గడచిన 50 ఏళ్ళుగా, కూరగాయల నూనెల వ్యాపారంతో ఒక చిన్న ప్రాంతీయ సంస్థగా ఉన్న విప్రో నేడు టెక్నాలజీలో ఒక ప్రపంచ సంస్థగా ఎదుగుతున్న సంస్థను చూస్తున్నా...ఇదే ఒరవడి ఒక ముందు కూడా కొనసాగుతుంది. ఎంతో పొటెన్షియాలిటీ ఉన్న విప్రో, ఐటి పరిశ్రమలో ఎంతో ఆనందంగా కొనసాగుతున్నాను. కంపెనీలో ఖాతాదారుల విజయానికి అలాగే కంపెనీ విజయానికి ఎంతో శక్తివంతమైన శక్తి ఉంది. దీనికి ఎప్పటిలాగానే విప్రో కట్టుబడి ఉందని అజీమ్ చెప్పారు. మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవాలనీ, నిరాధారమైన ఇలాంటి పుకార్లను నమ్మవద్దంటూ లేఖలో ప్రేమ్‌జీ ఉద్యోగులను కోరారు. -
క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
ముంబై: బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ఎట్టకేలకు మౌనం వీడింది. దురదృష్టవశాత్తు, ఇటీవల బీ టౌన్ లో షికార్ చేసిన పుకార్లపై క్లారిటీ ఇచ్చింది. సహనటుడు, మరో క్రేజీ హీరో ఫర్హాన్ అక్తర్ మధ్య ప్రేమ వ్యవహారం ఉందన్న విషయాన్ని పూర్తిగా తోసిపుచ్చింది. ఈ తప్పుడు కథనాలు తనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయని పేర్కొంది. తామూ మనుషులమే అన్న సంగతిని గుర్తించనంతవరకు ఇలాంటి రూమర్లు వస్తూనే ఉంటాయని తెలిపింది. సినీ నటులుగా ఉన్న తమలాంటి వారిపై గాసిప్స్ చదవడానికి సామాన్య జనం ఆసక్తి చూపిస్తారు. కానీ, ఇలాంటి కథనాలు తన తండ్రిని, ఆంటీని, తన సహనటుడిని జోడించడం సరికాదని వ్యాఖ్యానించినట్టుగా "బొంబాయి టైమ్స్ ' రిపోర్టు చేసింది. శ్రద్ధా, ఫర్హాన్ పీకల్లోతు ప్రేమలో ముగినిపోయారనీ, ఆ క్రమంలో ఇద్దరూ సహజీవనం చేస్తున్నారని బీ టౌన్ గుప్పుమంది. ఈక్రమంలో వీరిద్దరి వ్యవహారం నచ్చని ఆమె తండ్రి (శక్తి కపూర్) ఫర్హాన్ అపార్ట్మెంట్ నుంచి శ్రద్ధాను బలవంతంగా బయటకి లాకొచ్చిన్నట్టుగా కథనాలు వచ్చాయి. అయితే ఇవి పూర్తిగా నిరాధారమైనవిగా సీనియర్ కపూర్ ఖండించారు. ఇక ఇపుడు నేరుగా శ్రద్ధా కూడా స్పందించడంతో ఈ వార్తలకు ఇకనైనా ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి. కాగా బాలీవుడ్ సెన్సేషనల్ మూవీ ఆషిక్ 2 సినిమాలో గాయకురాలి పాత్రలో ఆకట్టుకున్న శ్రద్ధా తాజా చిత్రం 'ఒకే జాను' సినిమా బిగ్ రిలీజ్ కు సిద్ధంమవుతున్న సంగతి తెలిసిందే. -
స్నేహమంటే ఇదేరా..
స్నేహితుల కోసం త్యాగాలు, గొప్ప పనులు కేవలం మానవులు మాత్రమే కాదు తామూ చేయగలమని నిరూపించింది ఓ శునకం. ఈ చిత్రంలో చూస్తున్న శునకాలు రెండు స్నేహితులు. అయితే ఇందులో ఆడ శునకం ఓ రోజు గాయపడి రైలు పట్టాలపై పడిపోయింది. గమనించిన మరో మగ కుక్క దానికి కాపలాగా ఉంది. అచేతన స్థితిలో ఉన్న మరో శునకాన్ని వదలి వెళ్లలేక ఏకంగా రెండు రోజులపాటు దట్టమైన మంచులోనే రాత్రింబవళ్లు తోడుగా ఉంది. ఆ మార్గంలో రైళ్లు వెళ్తున్నా లెక్కచేయకుండా పట్టాలపైనే రెండు శునకాలు బిక్కుబిక్కుమంటూ నక్కి కూర్చున్నాయి. ఈ హృదయవిదారక సన్నివేశాన్ని చూసిన స్థానికులు వాటి పరిస్థితిని గమనించి గాయపడిన శునకాన్ని రక్షించారు. ఈ రెండు శునకాలు ఒకే కుటుంబానికి చెందినవట. కాగా, ట్రాక్‌పైన కుక్కల పరిస్థితిని డెనీస్ అనే వ్యక్తి వీడియో తీసి నెట్లో పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్లో వైరల్ అయింది. -
యాక్సిస్ బ్యాంక్ లైసెన్స్ రద్దు కానుందా?
ముంబై: దేశంలోని మూడవ అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంకు యాక్సిస్ బ్యాంకు కు సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ హల్ చల్ చేస్తోంది. అక్రమ లావాదేవీల ఆరోపణల నేపథ్యంలో యాక్సింగ్ బ్యాంక్ బ్యాంకింగ్ లైసెన్స్ రద్దు కానుందన్న వార్తలు చెలరేగాయి. మనీలాండరింగ్ వ్యవహారాల్లో జోక్యం కారణంగా యాక్సిస్ బ్యాంక్ రద్దుకానున్నట్టు జాతీయ పత్రికలో వార్తలొచ్చాయి. భారీ అక్రమ లావీదేవీలకారణంగా ఇటీవల బ్యాంకుకు చెందిన సుమారు 19 మంది ఉద్యోగులపై వేటుపడిన నేపథ్యంలో ఈ వార్తకు మరింత ప్రాధాన్యం లభించింది.పెద్ద నోట్ల రద్దు తరువాత భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడ్డ యాక్సిస్ బ్యాంక్ లైసెన్సును రద్దు చేసేందుకు కేంద్ర యోచిస్తోందటూ ప్రాంతీయ వార్తాపత్రిక (హిందీ) లో కథనాలు వచ్చాయి. అయితే ఈ వార్తలను బ్యాంకు తీవ్రంగా ఖండించింది. తమ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఎవరో కావాలనే దురుద్దేశంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడింది. కేంద్ర బ్యాంకు నిబంధనల ప్రకారం తాము కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్టు స్పష్టం చేసింది. సాధారణ ప్రజలను, ఖాతాదారులను, తమ సిబ్బందిలో ఆందోళన రేపి, భయభ్రాంతులను చేసేందుకు పన్నిన కుట్ర అని తాము నమ్ముతున్నట్టు స్టాక్ ఎక్సేంజ్ ఫైలింగ్ లో తెలిపింది. అక్రమాలకు తావులేని బలమైన వ్యవస్థ, నియంత్రణలను కలిగి ఉన్నామని బ్యాంక్ పేర్కొంది. కాగా ఈ వార్తల నేపథ్యంలో సోమవారం నాటి మార్కెట్ లో యాక్సిస్ షేర్ 3 శాతం నష్టపోయింది. -
మరో టీవీనటిపై రాహుల్ ఆరోపణలు..
ముంబై: టీవీనటి ప్రత్యూష్ బెనర్జీ అనుమానాస్పద మరణం కేసు ఒక కొలిక్కి వచ్చేలా కనపడ్డం లేదు. ఆమె చనిపోయి దాదాపు నెల రోజులు దాటినా రోజుకో వివాదం తెరపైకి వస్తోంది. తాజాగా ఆమె ప్రియుడు, ప్రధాన నిందితుడు రాహుల్ రాజ్ సింగ్ మరో టీవీ నటి కామ్యా పంజాబీపై ఆరోపణలు గుప్పించాడు. ఆమె ప్రత్యూష దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బు చెల్లించలేదని ఆరోపించాడు. ప్రత్యూష ఆత్మహత్య కేసులో తన స్నేహితులు చెప్పిందంతా అబద్ధమని పేర్కొన్నాడు. ప్రత్యూష బెనర్జీ దగ్గరనుంచి కామ్యా పంజాబి రెండున్నర లక్షలు అప్పుగా తీసుకుందని, అవి తిరిగి వెనక్కి ఇవ్వలేదని విమర్శించాడు. అయితే ఈ ఆరోపణలను కామ్యా తిరస్కరించింది. రాహుల్ పూర్తిగా తప్పుడు వాదనలు చేస్తున్నాడంటూ కొట్టి పారేసింది. బీసీఎల్ సీజన్ లో తాను జైపూర్ రాజ్ జోషిలే టీంకు యజమానిగా ఉన్నానని తెలిపింది. ఆ సమయంలో తన టీంకు ప్రత్యూష్ బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేసిందని కామ్యా తెలిపింది. ఈ క్రమంలో ప్ర్యతూష తండ్రి ఎన్జీవో ప్రమోషన్ లో భాగంగా తనకు రెండున్నర లక్షలు ఇచ్చిందని తెలిపింది. ఆ సమయంలో ఇద్దరం అనేక మీడియా ఇంటర్వ్యూ ల్లో పాల్గొన్నామని పేర్కొంది. దీనికి సంబంధించిన తన దగ్గర పూర్తి సాక్ష్యాలు ఉన్నాయని చెప్పింది. ఇది జరిగి సుమారు మూడేళ్లు అయిందనీ, అప్పటికీ ప్రత్యూష్ జీవితంలోకి అసలు రాహుల్ ప్రవేశించనే లేదని స్పష్టం చేసింది. ఇప్పటికైనా రాహుల్ నిజాలు చెప్పాలని డిమాండ్ చేసింది. కాగా గత ఏప్రిల్ 1 బాలికా వధు గా బుల్లితెరకు సుపరిచితమైన ప్రత్యూష బెనర్జీ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. మరి కామ్యా వివరణపై రాహుల్ ఎలా స్పందిస్తాడో చూడాలి. -
మూడో పెళ్లి వార్తలపై అజారుద్దీన్ స్పందన
-
ఆ వార్తల్లో నిజం లేదన్న సన్నీ లియోన్
ముంబై: బాలీవుడ్ నటి సన్నీ లియోన్ తనపై వస్తున్న వదంతులపై మండిపడింది. ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఎ దిల్ హై ముష్కిల్' చిత్రంలో సన్నీ లియోన్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఐశ్వర్య రాయ్, అనుష్క శర్మ, రణ్‌బీర్ కపూర్ నటిస్తున్న ఈ రొమాంటిక్ డ్రామాలో సన్నీ అవకాశాన్ని కొట్టేసిందని సినీజనాలు మాట్లాడుకుంటున్న విషయాన్ని శుక్రవారం మీడియా ఆమె వద్ద ప్రస్తావించగా.. అవన్నీ వట్టి వదంతులేనని కొట్టిపారేసింది. అలాగే సోహైల్ ఖాన్ చిత్రంలో నవాజుద్దిన్ సిద్దఖీ సరసన నటిస్తున్నట్లు వచ్చిన కథనాలను సైతం సన్నీ లియోన్ ఖండించింది. 'జనాలు ఆసక్తికరంగా ఉండే వార్తలను తయారుచేయడంలో భాగంగా ఇలా మాట్లాడుతున్నారు, ఇలాంటి విషయాలు ఏమైనా ఉంటే ట్విట్టర్ ద్వారా నేనే తెలియజేస్తాను' అని తెలిపింది. తన సొంత ప్రొడక్షన్ హౌస్ డెవలప్ చేసిన ఓ సూపర్ హీరో కాన్సెప్ట్ అద్భుతంగా ఉందని తెలిపిన సన్నీ.. భవిష్యత్తులో దీనికి సంబంధించి మరింత స్పష్టత వస్తుందని తెలిపింది. సన్నీలియోన్ నటించిన 'మస్తీజాదే' చిత్రం జనవరి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఐశ్వర్యతో మనస్పర్థలా?
నటుడు ధనుష్ చాలా బిజీ హీరో. తమిళం, హిందీ అంటూ జాతీయ స్థాయిని అధిగమిస్తున్నారు. అదేవిధంగా ఆయన అర్ధాంగి ఐశ్వర్య దర్శకురాలిగా తనను నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నారు. అలాంటి దంపతుల మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయనే ప్రచారం హల్చల్ చేస్తున్నది. వీటికి స్పందించిన ధనుష్, అవన్నీ వట్టి వదంతులేనని కొట్టి పారేశారు. ఆయన మాట్లాడుతూ, తనను అందగాడిగా మార్చింది తన భార్య ఐశ్వర్య అన్నారు. ఇంటిలో తమ కుటుంబ బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. తాను ఐశ్వర్య, పిల్ల లు, అమ్మానాన్న, అన్నయ్య అంటూ ఉమ్మడి కుటుం బంగా జీవిస్తుం డడం ఆనందంగా ఉందన్నారు. తాను షూటింగ్లలో బిజీగా ఉండి, ఇంటి కి వచ్చినప్పుడు చాలా ప్రశాంతంత లభిస్తుంద న్నారు. వృత్తి రీత్యా, తాను ఇంట్లో లేనప్పుడు కుటుంబ బాధ్యతలన్నీ ఐశ్వర్య చూసుకుంటున్నారని, అంతకంటే, తాను ఆశించేదేముంటుందని ధనుష్ అన్నారు. -
పుకార్లును తోసి పుచ్చిన సీతమ్మ
-
బీజేపీలో చేరుతున్నానన్న వార్తలు అవాస్తవం: మేకపాటి
నెల్లూరు : తాను బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ఆర్ సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని ఓ వర్గం మీడియాలో వస్తున్న వార్తలను ఆయన బుధవారమిక్కడ తీవ్రంగా ఖండించారు. కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయని, వైఎస్ఆర్ సీపీ పార్లమెంటరీ నేతగా ఉన్న తనపై కూడా తప్పుడు ప్రచారం చేయటం శోచనీయమన్నారు. మరోసారి ఇటువంటి వార్తలు పునరావృతమైతే ఆ సంస్థలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వాస్తవాలు తెలుసుకోకుండా ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వటం సరికాదని మేకపాటి అన్నారు. ప్రభుత్వ కార్యక్రమం వల్లే జన్మభూమిలో పాల్గొంటున్నామని ఆయన తెలిపారు. ఏ ప్రభుత్వం మంచి చేసిన సమర్థిస్తామని మేకపాటి వెల్లడించారు. ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఎండగడతామన్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా మే 19న ఇదే విషయాన్ని స్పష్టం చేశారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజలకు మంచి చేసే పనులకు మద్దతు ఇస్తామని జగన్ కూడా చెప్పారన్నారు. తాను వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్నానని, తాను నెరవేర్చాల్సిన పనులు, బాధ్యతలు చాలా ఉన్నాయని మేకపాటి అన్నారు. ఏ నాయకుడికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో వైఎస్ జగన్‌కు తెలుసునని, తనకు కూడా చాలా బాధ్యతలు అప్పగించారన్నారు. ఎంపీ కొత్తపల్లి గీతపై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామని మేకపాటి తెలిపారు.