యాక్సిస్ బ్యాంక్ లైసెన్స్ రద్దు కానుందా? | Axis Bank Denies Local Media Report Of Threat To Its Banking Licence | Sakshi
Sakshi News home page

యాక్సిస్ బ్యాంక్ లైసెన్స్ రద్దు కానుందా?

Published Mon, Dec 12 2016 3:40 PM | Last Updated on Tue, Aug 28 2018 7:22 PM

యాక్సిస్  బ్యాంక్ లైసెన్స్ రద్దు కానుందా? - Sakshi

యాక్సిస్ బ్యాంక్ లైసెన్స్ రద్దు కానుందా?

ముంబై:  దేశంలోని మూడవ అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంకు  యాక్సిస్ బ్యాంకు కు సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ హల్ చల్ చేస్తోంది.   అక్రమ లావాదేవీల ఆరోపణల నేపథ్యంలో  యాక్సింగ్ బ్యాంక్ బ్యాంకింగ్ లైసెన్స్ రద్దు  కానుందన్న  వార్తలు చెలరేగాయి. మనీలాండరింగ్ వ్యవహారాల్లో  జోక్యం కారణంగా యాక్సిస్ బ్యాంక్ రద్దుకానున్నట్టు  జాతీయ పత్రికలో వార్తలొచ్చాయి.  భారీ అక్రమ లావీదేవీలకారణంగా   ఇటీవల బ్యాంకుకు చెందిన సుమారు 19 మంది ఉద్యోగులపై  వేటుపడిన నేపథ్యంలో ఈ వార్తకు మరింత ప్రాధాన్యం లభించింది.పెద్ద నోట్ల రద్దు తరువాత  భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడ్డ యాక్సిస్ బ్యాంక్ లైసెన్సును రద్దు చేసేందుకు కేంద్ర  యోచిస్తోందటూ ప్రాంతీయ వార్తాపత్రిక (హిందీ) లో కథనాలు వచ్చాయి. 

అయితే  ఈ వార్తలను బ్యాంకు తీవ్రంగా ఖండించింది.  తమ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఎవరో కావాలనే దురుద్దేశంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడింది. కేంద్ర బ్యాంకు నిబంధనల ప్రకారం  తాము   కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్టు స్పష్టం చేసింది. సాధారణ ప్రజలను, ఖాతాదారులను, తమ సిబ్బందిలో ఆందోళన రేపి, భయభ్రాంతులను చేసేందుకు పన్నిన  కుట్ర అని   తాము నమ్ముతున్నట్టు  స్టాక్ ఎక్సేంజ్ ఫైలింగ్ లో  తెలిపింది.  అక్రమాలకు తావులేని బలమైన వ్యవస్థ, నియంత్రణలను కలిగి  ఉన్నామని  బ్యాంక్ పేర్కొంది.

కాగా ఈ వార్తల నేపథ్యంలో సోమవారం నాటి మార్కెట్ లో యాక్సిస్ షేర్ 3 శాతం   నష్టపోయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement