banking licence
-
యాక్సిస్ బ్యాంక్ లైసెన్స్ రద్దు కానుందా?
ముంబై: దేశంలోని మూడవ అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంకు యాక్సిస్ బ్యాంకు కు సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ హల్ చల్ చేస్తోంది. అక్రమ లావాదేవీల ఆరోపణల నేపథ్యంలో యాక్సింగ్ బ్యాంక్ బ్యాంకింగ్ లైసెన్స్ రద్దు కానుందన్న వార్తలు చెలరేగాయి. మనీలాండరింగ్ వ్యవహారాల్లో జోక్యం కారణంగా యాక్సిస్ బ్యాంక్ రద్దుకానున్నట్టు జాతీయ పత్రికలో వార్తలొచ్చాయి. భారీ అక్రమ లావీదేవీలకారణంగా ఇటీవల బ్యాంకుకు చెందిన సుమారు 19 మంది ఉద్యోగులపై వేటుపడిన నేపథ్యంలో ఈ వార్తకు మరింత ప్రాధాన్యం లభించింది.పెద్ద నోట్ల రద్దు తరువాత భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడ్డ యాక్సిస్ బ్యాంక్ లైసెన్సును రద్దు చేసేందుకు కేంద్ర యోచిస్తోందటూ ప్రాంతీయ వార్తాపత్రిక (హిందీ) లో కథనాలు వచ్చాయి. అయితే ఈ వార్తలను బ్యాంకు తీవ్రంగా ఖండించింది. తమ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఎవరో కావాలనే దురుద్దేశంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడింది. కేంద్ర బ్యాంకు నిబంధనల ప్రకారం తాము కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్టు స్పష్టం చేసింది. సాధారణ ప్రజలను, ఖాతాదారులను, తమ సిబ్బందిలో ఆందోళన రేపి, భయభ్రాంతులను చేసేందుకు పన్నిన కుట్ర అని తాము నమ్ముతున్నట్టు స్టాక్ ఎక్సేంజ్ ఫైలింగ్ లో తెలిపింది. అక్రమాలకు తావులేని బలమైన వ్యవస్థ, నియంత్రణలను కలిగి ఉన్నామని బ్యాంక్ పేర్కొంది. కాగా ఈ వార్తల నేపథ్యంలో సోమవారం నాటి మార్కెట్ లో యాక్సిస్ షేర్ 3 శాతం నష్టపోయింది. -
ఐడీఎఫ్సీకి బ్యాంకింగ్ లెసైన్సు జారీ
న్యూఢిల్లీ : కొత్తగా బ్యాంకింగ్ కార్యకలాపాలు ప్రారంభించేందుకు రిజర్వ్ బ్యాంక్ లెసైన్సు మంజూరు చేసినట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ సంస్థ ఐడీఎఫ్సీ శుక్రవారం తెలిపింది. ముందుగా 20 శాఖలతో అక్టోబర్ 1 నుంచి బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. గతేడాది ఏప్రిల్‌లో మొత్తం 25 సంస్థలు పోటీపడగా ఐడీఎఫ్సీ, బంధన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ బ్యాంకింగ్ లెసైన్సులు దక్కించుకున్న సంగతి తెలిసిందే. బంధన్‌కు ఆర్బీఐ గత నెల అనుమతులు మంజూరు చేసింది. తాజాగా బ్యాంకింగ్ లెసైన్సు లభించిన దరిమిలా ఐడీఎఫ్సీ షేర్లు శుక్రవారం బీఎస్ఈలో 2.58% పెరిగి రూ. 157.30 వద్ద ముగిశాయి. -
లెసైన్సు రాకున్నా బ్యాంకుల్లో వాటాలు కొనొచ్చు
ముంబై: బ్యాంకింగ్ లెసైన్సు దక్కని సంస్థలు..ఇతర బ్యాంకుల్లో వాటాలు కొనేందుకు చేస్తున్న ప్రయత్నాలపై రిజర్వ్ బ్యాంక్ స్పందించింది. లెసైన్సు దరఖాస్తు తిరస్కరణకు గురైనంత మాత్రాన ఆయా కంపెనీలు.. వేరే బ్యాంకుల్లో వాటాలు కొనుగోలు చేయరాదంటూ ఏమీ లేదని కొత్తగా నియమితులైన ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఆర్ గాంధీ తెలిపారు. లెసైన్సు దరఖాస్తు తిరస్కరణకు గురైనప్పటికీ.. బ్యాంకులో సదరు సంస్థ వాటాదారుగా చేరాలనుకుంటే, ఆ ప్రతిపాదనను పరిశీలిస్తామనిఆయన వివరించారు. ప్రైవేట్ రంగ బ్యాంక్ యస్ బ్యాంక్‌లో ఎల్అండ్టీ ఫైనాన్స్ గణనీయంగా వాటాలు పెంచుకోవాలని యోచిస్తున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఏదైనా బ్యాంకులో ఏదైనా కంపెనీ 5 శాతం పైగా వాటాలను కొనాలనుకుంటే ఆర్బీఐ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని గాంధీ చెప్పారు. అన్ని విషయాలను కూలంకషంగా పరిశీలించి తాము నిర్ణయం తీసుకుంటామని, ఏ ఒక్క కంపెనీకో అనుకూలంగానో లేదా వ్యతిరేకంగానో వ్యవహరించమని ఆయన తెలిపారు. కొత్త బ్యాంకింగ్ లెసైన్సును దక్కించుకోవడంలో విఫలమైన ఎల్అండ్టీ ఫైనాన్స్.. యస్‌బ్యాంకులో వాటాలు కొనాలని యోచిస్తోంది. ఇది దొడ్డిదారిన బ్యాంకింగ్‌లోకి ప్రవేశించడమే అవుతుందని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.