బ్యాంకు సిబ్బంది చేతివాటం
నగదు డ్రా చేస్తే ఖాతాదారునికి మెసేజ్ వెళ్లకుండా కుట్ర
బ్యాంకు ఖాతాను క్లోజ్ చేయడంతో బయటపడ్డ విషయం
పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు
పంజగుట్ట: ఓ ఎన్‌ఆర్‌ఐ ఖాతా నుండి రూ.6.5 కోట్ల నగదును బ్యాంకు సిబ్బంది మాయం చేసిన ఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆ్రస్టేలియాకు చెందిన పరితోష్ ఉపాధ్యాయకు బేగంపేటలోని యాక్సిస్ బ్యాంకులో 2017 నుండి ప్రీమియం అకౌంట్ ఉంది. బేగంపేట యాక్సిస్ బ్యాంకు సీనియర్ పార్టనర్ వెంకటరమణ పాసర్ల, వైస్ ప్రెసిడెంట్ హరివిజయ్, బ్రాంచ్ హెడ్ శ్రీదేవి రఘు, సురేఖ సైనాలు కలిసి పరితోష్ ఉపాధ్యాయ పేరుతో మొత్తం 42 నకిలీ చెక్కులను తయారు చేశారు.
ఈ చెక్కుల ద్వారా గత రెండు సంవత్సరాలుగా ఆయన సంతకం ఫోర్జరీ చేసి బ్యాంకు నుండి పలుమార్లు మొత్తం రూ.6.5 కోట్లు విత్‌డ్రా చేసుకున్నారు. చెక్కులు డ్రా చేసుకునే సమయంలో ఖాతాదారునికి మెసేజ్ రాకుండా జాగ్రత్త పడ్డారు. అంతటితో ఆగకుండా పరితోష్ ఉపాధ్యాయ బ్యాంకు అకౌంట్‌ను పూర్తిగా క్లోజ్ చేశారు.
బ్యాంకు అకౌంట్ క్లోజ్ అయిన విషయంపై పరితోష్‌కు మెయిల్ రావడంతో అతను వివరాలు ఆరా తీయగా తన బ్యాంకు అకౌంట్ నుండి రూ.6.5 కోట్లు మాయం అయిన విషయం తెలుసుకుని అవాక్కయ్యాడు. ఆన్‌లైన్ ద్వారా బ్యాంకు స్టేట్‌మెంట్ అడిగితే సిబ్బంది నిరాకరించారు. వెంటనే తన న్యాయవాది సాయంతో పంజగుట్ట పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్యూన్ పక్కా ప్లాన్.. రూ.10 కోట్ల మోసం
Comments
Please login to add a commentAdd a comment