Signature forgery
-
టీడీపీ నేత భూమేతకు చెక్!
సాక్షి టాస్క్‌ఫోర్స్ : అటవీ భూములంటే ఆ టీడీపీ నేతకు సొంత ఆస్తి కింద లెక్క. సుమారు పదెకరాలకు పైగా ఆక్రమించేసి ఏకంగా జామాయిలు చెట్లును పెంచాడు. ఇదేమని అడిగిన ఆ శాఖ అధికారులను బెదిరించడం.. చట్టంలో ఉన్న లొసుగులను అనుకూలంగా మార్చుకుని అధికారులను కోర్టులు చుట్టూ తిప్పడం ఆ నేతకు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడితని ఆగడాలకు చెక్‌పడడంతో కటకటాలపాలయ్యాడు. వివరాలివీ.. తిరుపతి జిల్లా డక్కిలి మండలం డీఉప్పరపల్లి (గొల్లపల్లి) గ్రామానికి చెందిన పావులూరు భాస్కర్‌నాయుడు టీడీపీ నేతగా చలామణి అవుతున్నాడు. గ్రామంలోని సర్వే నెంబరు 59లో సుమారు పదెకరాలకు పైగా అటవీ భూమిని అక్రమించాడు. అందులో జామాయిల్ మొక్కలను పెంచి ఒక దఫా కటింగ్ చేసి సొమ్ము చేసుకున్నాడు. మళ్లీ గత ఏడాది జూలైలో కటింగ్ చేసేందుకు ఆయన ప్రయత్నించగా అధికారులు అడ్డగించి నోటీసులిచ్చారు. అయితే, వాటిని తీసుకునేందుకు భాస్కర్‌నాయుడు నిరాకరించాడు. మరోవైపు.. ఇదే గ్రామంలో మరికొంతమందితో కలిసి అటవీభూమిని రాత్రిపూట ఆక్రమించి నిమ్మ మొక్కలను సాగుచేశాడు. దీంతో అటవీశాఖ అధికారులు అతనిపై భూ ఆక్రమణ కేసు నమోదుచేశారు. ఈ నేపథ్యంలో.. రెవెన్యూ, అటవీ శాఖాధికారులు ఈయన సాగుచేస్తున్న భూముల్లో ఇటీవల ఉమ్మడి సర్వే నిర్వహించారు. అవన్నీ అటవీశాఖ పరిధిలోకే వస్తాయని తేల్చి నివేదికను జిల్లా అధికారులకు సమాచారం అందించారు. అదుపులో భాస్కర్‌నాయుడు..దీంతో.. తిరుపతి జిల్లా డీఎఫ్ఓ వికాస్, సబ్ డీఎఫ్ఓ నాగభూషణం ఆదేశాలు మేరకు వెంకటగిరి ఇన్చార్జి రేంజ్ లోకేష్, బాలాయపల్లి డీఆర్వో సుభాషిణి ఆధ్వర్యంలో వెంకటగిరి రేంజ్, టాస్క్‌ఫోర్స్‌కు చెందిన సుమారు 25 మంది శుక్రవారం రాత్రి డీ.ఉప్పరపల్లిలో ఉన్న భాస్కర్‌నాయుడును అదుపులోకి తీసుకుని వెంకటగిరిలో మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా రిమాండ్ విధించారు. ఆయనను నెల్లూరు జైలుకు తరలించారు. ఇప్పటికే ఇతనిపై అటవీశాఖకు సంబంధించిన కేసులు నమోదై ఉండడంతో ప్రస్తుతం అటవీశాఖ అధికారులు నాన్ బెయిలబుల్ కేసు నమోదుచేశారు.2007లోనే అటవీ భూములను రిజిస్ట్రేషన్..నిజానికి.. భాస్కర్‌నాయుడుకు ముందునుంచి అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడడం.. ఆ భూములను విక్రయించి సొమ్ము చేసుకోవడం అలవాటుగా మారింది. 2007లో డీ.ఉప్పరపల్లిలోని 32 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించి ఆ భూములకు సంబంధించి ఫోర్జరీ సంతకాలతో పాసు పుస్తకాలు సృష్టించాడు. వాటిని నెల్లూరుకు చెందిన పామూరు నిరంజన్‌రెడ్డి, కృష్ణపట్నం సులోచనలకు తన కుటుంబ సభ్యులైన ఆరుగురి పేరుతో విక్రయించాడు. అప్పట్లో ఈ విషయం సంచలనమైంది. అంతేగాక.. ఫోర్జరీ సంతకాలతో పాసు పుస్తకాలు, తహసీల్దార్ పేరుతో నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఫోర్జరీ వంటి విషయాలు వెలుగులోకి రావడంతో రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు డక్కిలి పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. వైఎస్సార్సీపీ నేతపై అక్రమ కేసు..ఇదిలా ఉంటే.. టీడీపీ నేత పావులూరు భాస్కర్‌నాయుడు అటవీ భూముల్లో జామాయిల్ చెట్లను నరికి అక్రమంగా తరలించగా.. ఇప్పుడా పార్టీ అధికారంలోకి రాగానే డీ.ఉప్పరపల్లికే చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు, సొసైటీ మాజీ అధ్యక్షుడు బొల్లినేని భాస్కర్‌నాయుడే చెట్లు నరికినట్లు తప్పుడు ఫిర్యాదు చేశారు. దీంతో డక్కిలి పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారు. -
ఎన్ఆర్ఐ అకౌంట్లోని రూ.6.5 కోట్లు మాయం
పంజగుట్ట: ఓ ఎన్ఆర్ఐ ఖాతా నుండి రూ.6.5 కోట్ల నగదును బ్యాంకు సిబ్బంది మాయం చేసిన ఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆ్రస్టేలియాకు చెందిన పరితోష్ ఉపాధ్యాయకు బేగంపేటలోని యాక్సిస్ బ్యాంకులో 2017 నుండి ప్రీమియం అకౌంట్ ఉంది. బేగంపేట యాక్సిస్ బ్యాంకు సీనియర్ పార్టనర్ వెంకటరమణ పాసర్ల, వైస్ ప్రెసిడెంట్ హరివిజయ్, బ్రాంచ్ హెడ్ శ్రీదేవి రఘు, సురేఖ సైనాలు కలిసి పరితోష్ ఉపాధ్యాయ పేరుతో మొత్తం 42 నకిలీ చెక్కులను తయారు చేశారు. ఈ చెక్కుల ద్వారా గత రెండు సంవత్సరాలుగా ఆయన సంతకం ఫోర్జరీ చేసి బ్యాంకు నుండి పలుమార్లు మొత్తం రూ.6.5 కోట్లు విత్‌డ్రా చేసుకున్నారు. చెక్కులు డ్రా చేసుకునే సమయంలో ఖాతాదారునికి మెసేజ్ రాకుండా జాగ్రత్త పడ్డారు. అంతటితో ఆగకుండా పరితోష్ ఉపాధ్యాయ బ్యాంకు అకౌంట్‌ను పూర్తిగా క్లోజ్ చేశారు. బ్యాంకు అకౌంట్ క్లోజ్ అయిన విషయంపై పరితోష్‌కు మెయిల్ రావడంతో అతను వివరాలు ఆరా తీయగా తన బ్యాంకు అకౌంట్ నుండి రూ.6.5 కోట్లు మాయం అయిన విషయం తెలుసుకుని అవాక్కయ్యాడు. ఆన్లైన్ ద్వారా బ్యాంకు స్టేట్మెంట్ అడిగితే సిబ్బంది నిరాకరించారు. వెంటనే తన న్యాయవాది సాయంతో పంజగుట్ట పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్యూన్ పక్కా ప్లాన్.. రూ.10 కోట్ల మోసం -
టీడీపీ నేతల ఫోర్జరీ.. నామినేషన్ల తిరస్కరణ
సాక్షి, నెల్లూరు/వైఎస్సార్: ఎమ్మెల్సీ ఎన్నికల వేళ టీడీపీకి షాక్ తగిలింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫోర్జరీ సంతకాలతో టీడీపీ అడ్డంగా బుక్కయింది. అభ్యర్థుల నామినేషన్లలో మద్దతుదారుల పేరుతో టీడీపీ ఫోర్జరీ సంతకాలు చేసింది. కాగా, ఈ విషయంపై స్వతంత్ర అభ్యర్థులు స్పందించారు. తాము సంతకం చేయలేదని చెప్పారు. తమ సంతకాలు ఫోరర్జీ చేశారంటూ నాయకులు మీడియా ఎదుట చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో నెల్లూరు, కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్లు తిరస్కరణ గురయ్యాయి. -
విజయనగరంలో మేస్త్రీ నిర్వాకం..
విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్లో అవినీతి రాజ్యమేలుతోంది. ప్రజారోగ్య పరిరక్షణకు చిత్తశుద్ధితో విధులు నిర్వహించాల్సిన సిబ్బంది అక్రమార్జనలకు అలవాటు పడి అడ్డంగా దొరికిపోయిన అవినీతి భాగోతం బట్టబయలైంది. రూ.1.50లక్షలు సొమ్ము కోసం బిల్లు కలెక్టర్‌గా వేషం మార్చి.. ఏకంగా కార్పొరేషన్ కమిషనర్ పేరిట దొంగ సంతకం చేయడంతో పాటు దొంగ స్టాంపులు వేయటం సంచలనం సృష్టించింది. డబ్బులిచ్చిన వ్యక్తి ఫిర్యాదుతో స్పందించిన కమిషనర్ తన సంతకం చేయలేదని తేల్చటంతో అసలు విషయం బట్టబయలైంది. తదుపరి సొమ్ములు తీసుకున్న ఉద్యోగిపై చట్టపరమైన క్రమ శిక్షణా చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. వివరాల్లోకి వెళ్తే... విజయనగరం: విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజారోగ్య విభాగంలో సార్జెంట్ (పీహెచ్ మేస్త్రీ)గా ఎం.ఎల్లారావు పని చేస్తున్నారు. అక్రమార్జనకు అలవాటు పడిన ఎల్లారావు అడ్డగోలుగా డబ్బు సంపాదించేందుకు అలవాటు పట్టాడు. ఈ నేపథ్యంలో కార్పొరేషన్లో రెవెన్యూ విభాగంలోని విధులు నిర్వహించాల్సిన బిల్లు కలెక్టర్ ఉద్యోగాన్ని ఎంచుకున్నాడు. బిల్లు కలెక్టర్లు మాదిరి నగరంలోని కార్పొరేషన్‌కు చెందిన షాపింగ్ కాంప్లెక్స్‌లో అద్దెకు ఉంటున్న వారి వద్దకు వెళ్లి షాపుల రెన్యువల్ చేయించుకునేందుకు చలానా రూపంలో డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆ షాపింగ్ కాంప్లెక్స్‌లో 18, 21, 22, 23 షాపులు లీజుకు తీసుకున్న రేగాన ఆదినారాయణ అనే వ్యక్తి రూ.1.50 లక్షల మొత్తాన్ని ఎల్లారావుకు చెల్లించారు. ఈ మేరకు ఎల్లారావు కమిషనర్ సంతకం, స్టాంపులు ఉన్న కొన్ని కాగితాలను ఆదినారాయణకు ఇచ్చారు. రెండు నెలలు గడుస్తున్నా రెన్యువల్‌కు సంబంధించిన పత్రాలు ఇవ్వకపోవటంతో ఆదినారాయణ కార్పొరేషన్ ఉద్యోగి ఎల్లారావుపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో ఎల్లారావు రూ.50,000 నగదుకు సంబంధించి అగ్రిమెంట్స్ వస్తాయని సమాధానమిచ్చారు. అనుమానం వచ్చిన ఆదినారాయణ నేరుగా కార్పొరేషన్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. ఎల్లారావు ఇచ్చిన కాగితాలను పరిశీలించిన కమిషనర్ ఆ కాగితాలపై ఉన్నవి తన సంతకాలు కావని తేల్చారు. ఎల్లారావు దొరికిపోయింది ఇలా...? అచ్చం కమిషనర్లానే సంతకాలు చేశానని అనుకుంటున్న మేస్త్రీ ఎం.ఎల్లారావు ఆ సంతకం చేయటంలో దొర్లిన తప్పిదంతో అడ్డంగా దొరికిపోయాడు. వాస్తవానికి కమిషనర్ వర్మ ప్రతి ఫైల్‌పై తన పూర్తి పేరు ఎస్.సచ్చిదానంద వర్మ పేరిట సంతకం చేస్తారు. అయితే ఎల్లారావు బిల్లు కలెక్టర్‌గా మాయ చేసిన విషయంలో ఎస్ఎస్.వర్మ అంటూ సంతకం చేశాడు. సదరు పత్రాలను కమిషనర్ పరిశీలించిన సమయంలో ఎస్ఎస్ వర్మ అంటూ ఆ పత్రాలపై ఉండటంతో ఇవి తన సంతకాలు కాదని, మీరు మోసపోయారంటూ ఫిర్యాదుదారుడు రేగాన ఆదినారాయణకు వివరించారు. దీంతో అవాక్కయిన ఆదినారాయణ ఈ విషయంలో మీరే న్యాయం చేయాలంటూ లబోదిబోమంటున్నాడు. ఎల్లారావుపై ఫిర్యాదు కమిషనర్ సంతకం ఫోర్జరీ చేసి రూ1.50లక్షలు అక్రమార్జనకు పాల్పడిన ఎల్లారావుపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయటంతో పాటు చట్టపరంగా క్రమశిక్షణా చర్యలకు ఆదేశించినట్టు కమిషనర్ ఎస్ఎస్.వర్మ సాక్షికి తెలిపారు. అక్రమార్జనకు పాల్పడిన ఎల్లారావును 24 గంటల్లోగా విధుల నుంచి తొలగించాలని ప్రజారోగ్య విభాగాధికారులను ఆదేశించినట్టు చెప్పారు. ఇటువంటి తప్పిదాలు ఎవ్వరు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ప్రిన్సిపల్ సంతకం ఫోర్జరీ
పశ్చిమగోదావరి,చింతలపూడి: గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సంతకాన్ని ఫోర్జరీ చేసి పాఠశాల నిధుల నుంచి రూ. 7.40 లక్షల నగదును కాజేసిన ఘటన చింతలపూడి మండలం, నాగిరెడ్డిగూడెం బాలికల గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది. గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ఎస్.దుర్గాభవాని సోమవారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగుచూసింది. నాగిరెడ్డిగూడెం గురుకుల పాఠశాలలో దినసరి భత్యంపై పని చేస్తున్న కె.హరీష్‌బాబు, రిటైర్డ్ సీనియర్ అసిస్టెంట్ జీవీఆర్ మోహన్‌రావు కలిసి ఈ సొమ్మును కాజేశారని, వారిపై చర్యలు తీసుకుని గురుకుల పాఠశాల సొమ్మును రికవరీ చేయాలని ప్రిన్సిపల్ ఫిర్యాదులో కోరారు. గత ఏడాది జూలై, ఆగస్టు నెలల్లో స్కూల్ ఖాతా నుంచి సొమ్మును డ్రా చేశారని తెలిపారు. బ్యాంక్ స్టేట్మెంట్లో వివిధ దఫాలుగా సొమ్ములు డ్రా చేసినట్లు ఉందని, డ్రా అయిన సొమ్ముల వివరాలు తమ క్యాష్ బుక్‌లో లేక పోవడంతో బ్యాంకుకు వెళ్లి విచారించగా గత ఏడాది జూలై 6వ తేదీన రూ.1.40 లక్షలు, అదే నెల 15వ తేదీన రూ.2.50 లక్షలు, ఆగస్టు 9న రూ.3.50 లక్షలు తన సంతకాన్ని ఫోర్జరీ చేసి డ్రా చేసినట్లు ఉందని వెల్లడించారు. గురుకుల పాఠశాల నిధులను ఫోర్జరీ చేసి స్వాహా చేసిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ దుర్గా భవాని కోరారు. -
ఎన్ఓసీల కోసం బరితెగించిన దివాకర్ ట్రావెల్స్
సాక్షి ప్రతినిధి, అనంతపురం: అక్రమాలే పెట్టుబడిగా.. అధికారమే అరాచకంగా ఇన్ని రోజులుగా వ్యవహరిస్తున్న జేసీ బ్రదర్స్ పాపాలపుట్ట ఒక్కొక్కటిగా పగిలిపోతోంది. ఇప్పటికే పర్మిట్లు లేకుండా బస్సులను ఇష్టారాజ్యంగా తిప్పిన దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యం.. ఏకంగా పోలీసు సంతకాలనే ఫోర్జరీ చేసి నిరంభ్యంతర సర్టిఫికెట్(ఎన్ఓసీ) పత్రాలు సృష్టించింది. వీటితో లారీలను విక్రయించిన ఘటన బయటపడి 24 గంటలు కూడా గడవకముందే మరో ఫోర్జరీ బాగోతం వెలుగులోకి వచ్చింది. తాజాగా తాడిపత్రి ఎస్ఐ సంతాకాన్ని ఫోర్జరీ చేసి.. రవాణా శాఖకు దరఖాస్తు చేసుకుని ఎన్ఓసీ తీసుకోవడం ద్వారా తెలంగాణలో రెండు బస్సులను విక్రయించారు. ఈ వ్యవహారాన్ని గుర్తించిన రవాణాశాఖ అధికారులు సదరు యాజమాన్యంపై అనంతపురం ఒకటో పట్టణ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. దీంతో దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. కథ నడిపించారిలా.. దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన లారీలు, బస్సులకు సంబంధించిన రికార్డుల్లో అక్రమాలు భారీగా జరిగినట్టు తెలుస్తోంది. దీంతో వీటి విక్రయానికి దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యం అడ్డదారులు తొక్కినట్టు అర్థమవుతోంది. ఈ ట్రావెల్స్‌కు చెందిన ఆరు లారీలను బెంగళూరులో విక్రయించారు. ఇందుకోసం స్థానిక పోలీసుల నుంచి ఎన్ఓసీ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, రికార్డులన్నీ నకిలీవి కావడంతో అడ్డదారుల్లో పోలీసు సంతకాలను ఫోర్జరీ చేయడంతో పాటు నకిలీ స్టాంపులను తయారుచేసి పోలీసుల నుంచి ఎన్ఓసీ తీసుకున్నారు. తద్వారా ఎన్ఓసీ ఉన్నట్టు చూపించి లారీలను బెంగళూరులో విక్రయించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. అయితే, లారీలతోపాటు రెండు బస్సులను(ఏపీ02టీసీ9666, టీఎస్09యుబీ7034) కూడా ఇదే విధంగా పోలీసు సంతకాలను ఫోర్జరీ చేయడంతో పాటు నకిలీ స్టాంపులతో రవాణా శాఖకు ఎన్ఓసీ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేశారు. అనంతరం వీటిని తెలంగాణలో దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యం విక్రయించింది. అయితే, తమకు దరఖాస్తు చేసింది ఫోర్జరీ డాక్యుమెంట్లు అని గుర్తించిన రవాణాశాఖ అధికారులు అనంతపురం 1వ పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు మొత్తం దివాకర్ ట్రావెల్స్‌కు సంబంధించిన వాహనాల రికార్డుల్లో అక్రమాలు జరిగాయని.. వీటిపై లోతైన విచారణ జరపాలంటూ ఉన్నతాధికారులకు కొందరు ఆధారాలతో ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఆ మేరకు రవాణాశాఖ ఉన్నతాధికారులు అక్రమాలను వెలికితీసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మరింత లోతుగా.. ఇప్పటికే పర్మిట్లు లేని వ్యవహారంతో పాటు ఫోర్జరీ డాక్యుమెంట్ల తయారీలో దివాకర్ ట్రావెల్స్ వ్యవహారం బయటపడింది. ఇక ఏకంగా అసలు రవాణాశాఖ నుంచి ఉన్న బస్సులకు కూడా పర్మిట్లు తీసుకున్న వ్యవహారంలో మొత్తం ఫోర్జరీ డాక్యుమెంట్లను సమర్పించినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై కూడా రవాణాశాఖ ఉన్నతాధికారులు లోతుగా విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తం ట్రావ్సెల్ బస్సులకు సమర్పించిన వివిధ డాక్యుమెంట్లన్నీ కూడా నకిలీవేనన్న ఫిర్యాదులు రవాణాశాఖ ఉన్నతాధికారులకు చేరాయి. దీంతో ప్రధాన కార్యాలయానికి చెందిన ఉన్నతాధికారులు జిల్లాకు విచ్చేసి మొత్తం అక్రమ వ్యవహారాలను లాగే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ అక్రమాల మొత్తం లోగుట్టును ఒకటి రెండు రోజుల్లో రవాణాశాఖ అధికారులు బయటపెట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇదే జరిగితే దివాకర్ ట్రావెల్స్‌పై సీరియస్ చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదని అధికారులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా ఈ అక్రమ వ్యవహారాల్లో వెనుక నుంచి ఇన్నాళ్లుగా కథ నడిపించిన జేసీ బ్రదర్స్ దోషులుగా చట్టం ముందు నిలవాల్సిన పరిస్థితి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తన అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే ప్రభుత్వం వేధిస్తోందన్న వ్యాఖ్యలను జేసీ చేస్తున్నట్టు తాజా ఘటనలతో అర్థమవుతోంది. -
కేటీఆర్ సంతకం ఫోర్జరీ.. నిజమే!
సాక్షి, నల్లగొండ : పోస్టింగ్ కోసం ఫోర్జరీ... నిజమేనని తేలింది. విద్యాశాఖలో ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ పోస్టింగ్ కోసం మంగళ అనే హెడ్మాస్టర్ ఏకంగా మంత్రి కేటీఆర్ సంతకాన్నే ఫోర్జరీ చేసి రికమెండ్ లెటర్‌ను జిల్లా విద్యాశాఖాధికారికి అందించింది. ఈ విషయంపై ఈనెల 4న ‘సాక్షి’ మినీలో ‘పోస్టింగ్ కోసం ఫోర్జరీ’ శీర్షికన కథనాన్ని ప్రచురితమైంది. మంత్రి సంతకం ఫోర్జరీ చేసిన లేఖను కూడా ప్రచురించింది. అయితే లేఖపై కేటీఆర్ సంతకం చేశారా.. లేక ఫోర్జరీనా అన్న అంశాన్ని తేల్చేందుకు కలెక్టర్‌తోపాటు జిల్లా విద్యాశాఖాధికారి ఇరువురు రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్, డైరెక్టర్‌కు వేర్వేరుగా లేఖలు రాశారు. దీంతో విచారించిన ఉన్నత విద్యాశాఖ.. సంతకం ఫోర్జరీ చేసినట్లు తేల్చారు. ఓపెన్ స్కూల్ పోస్టింగ్ కోసం మంగళనే ఈ ఫోర్జరీకి పాల్పడినట్లు గుర్తించారు. దీంతో ఉన్నత విద్యాశాఖ జిల్లా విద్యాశాఖాధికారికి శుక్రవారం మెయిల్ ద్వారా సమాచారం అందించారు. దీంతో విద్యాశాఖాధికారి సరోజినీదేవి ఈ మేరకు వన్‌టౌన్ పోలీసులకు మంత్రి కేటీఆర్ సంతకాన్ని ఫోర్జరీ చేశారని మంగళపై ఫిర్యాదు చేశారు. ఫోర్జరీ వ్యవహారాన్ని బయటపెట్టిన సాక్షి జిల్లా విద్యాశాఖలో జరిగిన ఈ బాగోతాన్ని ‘సాక్షి’ తగిన ఆధారాలతో బయటపెట్టింది. విద్యాశాఖ పరిధిలోని ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్న రావుల పెంట హైస్కూల్‌కు చెందిన హెడ్మాస్టర్ మంగళను నెల రోజులక్రితం ఆ పోస్టు నుంచి తప్పించాలనుకున్నారు. అదే క్రమంలో సూర్యాపేట జిల్లా నుంచి మరో ఉపాధ్యాయుడికి ఇన్చార్జ్గా పోస్టింగ్ ఇచ్చారు. జిల్లా మంత్రి సూచనల మేరకు ఆ ఉపాధ్యాయుడిని ఇన్చార్జిగా నియమించినట్లు సమాచారం. ఈ క్రమంలో మంగళ ఏకంగా జిల్లా మంత్రిని కాదని, అంతకంటే పై స్థాయిలో ఉన్న కేటీఆర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆయన నల్లగొండ ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్‌గా మంగళను రికమెండ్ చేస్తున్నట్లుగా లెటర్ సృష్టించి డీఈఓకు అందజేశారు. దీంతో ఆమె అదే పోస్టులో కొనసాగుతోంది. ఈ క్రమంలో ‘సాక్షి’... కేటీఆర్ సంతకాన్ని మంగళ ఫోర్జరీ చేసిన విషయాన్ని బట్టబయలు చేసింది. దీంతో ఒక్కసారిగా విద్యాశాఖ ఉలిక్కిపడింది. వాస్తవంగా సాక్షి కథనం ప్రచురించిన నాడే కేటీఆర్ పేషీ ఆ లేఖను ఫోర్జరీ చేశారని రాష్ట్ర విద్యాశాఖకు సమాచారం అందించింది. అయినప్పటికీ కలెక్టర్ దానిపై విచారణకు రాసి విద్యాశాఖ ఉన్నతాధికారులనుంచి సమాచారం అందిన తర్వాతే చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. శుక్రవారం విద్యాశాఖ అధికారులు ఫోర్జరీ అని తేలు స్తూ డీఈఓకు సమాచారం ఇవ్వడంతో మంగళపై వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మంగళపై కేసు నమోదు చేసినట్లు సీఐ సురేశ్ తెలిపారు. -
కేటీఆర్ సంతకం ఫోర్జరీ చేసిన ‘మంగళ’
ముందుగా ఆమె ఓ స్కూల్‌కు ప్రధానోపాధ్యాయురాలు.. ఆ విధులను పక్కన పెట్టి జిల్లా కేంద్రంలోనే సుదీర్ఘంగా వివిధ పోస్టుల్లో ఇన్చార్జ్ అధికారిగా కొనసాగారు. తాను ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్న జిల్లా ఓపెన్ స్కూల్స్ కో–ఆర్డినేటర్ పోస్టులోనే కొనసాగేందుకు ఏ అధికారీ చేయకూడని సాహసం చేశారు. ఏకంగా రాష్ట్ర ఐ.టీ., మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు (కేటీఆర్) సంతకాన్ని ఫోర్జరీ చేసి ఒక రికమెండేషన్ లెటర్ సృష్టించి డీఈఓకు అందజేశారు..!! సాక్షి, నల్లగొండ: జిల్లా ఓపెన్ స్కూల్స్ కో–ఆర్డినేటర్ పోస్టు వ్యవహారం విద్యాశాఖ పరువు తీస్తోంది. ఈ పోస్టులో కొనసాగేందుకు రావులపెంట జెడ్పీ బాలికల హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలిగా ఉన్న మనావత్ మంగళ ఓపెన్స్ స్కూల్స్ కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఓ రెండు వారాల కిందట ఆమెను ఇన్చార్జ్ బాధ్యతలను తొలగించాలని ఓపెన్స్ స్కూల్స్ సొసైటీ కమిషనర్‌నుంచి జిల్లా విద్యాశాఖకు ఆదేశాలు అందాయి. కానీ, ఆమెను ఇప్పటికీ అదే పోస్టులో కొనసాగిస్తున్నారు. దీనివెనుక పెద్ద తతంగమే నడిచిందన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుత కో ఆర్డినేటర్ మంగళ స్థానంలో సూర్యాపేట జిల్లాకు చెందిన మరొక ఉపాధ్యాయుడికి ఇన్చార్జ్ బాధ్యతలు అప్పజెప్పాలని ఉత్తర్వులు కూడా ఇచ్చారు. కానీ ఆయనను జిల్లా విద్యాశాఖ అధికారి విధుల్లో చేర్చుకోలేదు. అయితే.. ఓపెన్స్ స్కూల్స్ కో ఆర్డినేటర్‌గా విధులు నిర్వహించడానికి ప్రధానోపాధ్యాయులే అర్హులని, సదరు ఉత్తర్వులు తెచ్చుకున్న ఉపాధ్యాయుడు స్కూల్ అసిస్టెంట్ కేడర్‌కు చెందిన వాడు కావడంతో ఎవరిని కొనసాగించాలో తేల్చుకోలేక ఆ స్కూల్ అసిస్టెంట్‌ను విధుల్లో చేర్చుకోలేదని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. కాగా, తననే ఆ పోస్టులో కొనసాగించాలని, మంత్రి సిఫారసు లేఖ తెచ్చుకుంటానని ఇన్చార్జ్ కోఆర్డినేటర్... డీఈఓను కోరడంతో గడువు ఇచ్చారని సమాచారం. ఈలోగా మంత్రి కేటీఆర్ సంతకంతో ఆయన లెటర్ హెడ్‌పై ఓపెన్ స్కూల్స్ సొసైటీ కమిషనర్‌కు లేఖ రాసినట్లు ఓ నకిలీ రికమెండేషన్ లేఖను సృష్టించారు. ఆ లేఖలో.. రావులపెంట జెడ్పీ గర్ల్స్ హైస్కూల్ ప్రిన్సిపల్ మంగళను జిల్లా కో ఆర్డినేటర్‌గా కొనసాగించాలని సిఫారసు చేస్తున్నట్లు తయారు చేశారు. ఈ లేఖను డీఈఓకు అందజేసి ప్రస్తుతం ఆ మహిళా అధికారి కోఆర్డినేటర్ పోస్టులో కొనసాగుతున్నారు. అయితే.. ఈ కొనసాగింపునకు సంబంధించి ఓపెన్ స్కూల్స్ సొసైటీ కమిషనర్ నుంచి జిల్లా విద్యాశాఖ అధికారికి ఎలాంటి ఉత్తర్వులూ అందలేదని సమాచారం. కేవలం ఈ ఫోర్జరీ లేఖ ఆధారంగానే జిల్లా విద్యాశాఖ అధికారి, మంగళ అనే హెచ్ఎంను కో ఆర్డినేటర్‌గా కొనసాగిస్తున్నారని విధితమవుతోంది. మంత్రి కేటీఆర్ పేషీ ఆరా ! రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి రికమెండేషన్ లెటర్ సృష్టించిన వ్యవహారం ఆ మంత్రి పేషీ అధికా రుల దృష్టికి వెళ్లింది. ఈ లెటర్ హెడ్ మంత్రికి సంబంధించింది కాకపోవడం, సంతకం కూడా మంత్రిది కాదని, ఫోర్జరీ చేశారని గుర్తించిన అధికారులు ఈ విషయాన్ని రాష్ట్ర ఓపెన్స్ స్కూల్స్ సొసైటీ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. జిల్లా మంత్రి దృష్టికి తీసుకెళ్లకుండా ఒక జిల్లాకు సంబంధించిన పోస్టింగులు, ఇతర పాలనా వ్యవహారాల్లో మరో మంత్రి రికమెండేషన్ లెటర్ ఇచ్చే అవకాశం లేదని చెబు తున్నారు. ఫోర్జరీ లేఖను సృష్టించిన బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని, ఈ వ్యవహారాన్ని ఆ శాఖ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారని చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 80 స్కూళ్లకు అధికారి ఓపెన్ స్కూల్స్ పాలనా వ్యవహారాల విషయానికి వస్తే ఉమ్మడి జిల్లాలో ఓపెన్ స్కూల్స్ సొసైటీ ఆధ్వర్యంలో 80 స్కూళ్లు నడుస్తున్నాయి. వీటిల్లో పదో తరగతి, ఇంటర్మీడియట్ క్లాసులను నిర్వహిస్తున్నారు. సెలవు రోజుల్లో ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో ఓపెన్స్ స్కూల్ విద్యార్థులకు తరగతులు జరుగుతున్నాయి. రెగ్యులర్ విద్యార్థులు, ఆ అకడమిక్ కేలండర్‌తో సంబంధం లేకుండా ఓపెన్ స్కూల్స్ విద్యార్థులకు పరీక్షలకు కూడా వేరే సమయాల్లో జరుపుతారు. జిల్లా ఓపెన్ స్కూల్ సొసైటీకి డైట్లో కూడా ఓపెన్ కాలేజీ ఉంది. ఈ స్కూళ్లన్నింటినీ కో ఆర్డినేట్ చేసే బాధ్యత జిల్లా కో ఆర్డినేటర్ది. ఇన్చార్జ్ పోస్టు కావడంతో అదనపు వేతనం కూడా లభిస్తుంది. అంతే కాకుండా జిల్లా స్థాయి అధికారి పోస్టు కూడా కావడం, పని ఒత్తిడి పెద్దగా లేకపోవడం వంటి కారణాలతో కో ఆర్డినేటర్ పోస్టుకు డిమాండ్ పెరిగింది. క్లారిఫికేషన్ కోసం ఉన్నతాధికారులకు లేఖ రాశాం ఓపెన్ స్కూల్స్ కో ఆర్డినేటర్‌గా ఓ స్కూల్ అసిస్టెంట్‌కు పోస్టింగ్ ఇచ్చిన మాట వాస్తవమే. అయితే.. కో ఆర్డినేటర్ పోస్టుకు ప్రధానోపాధ్యాయులు అర్హులు. ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాల్సిందిగా ఉన్నతాధికారులకు లేఖ రాశాం. అందుకే ఆ ఉపాధ్యాయుడిని విధుల్లో చేర్చుకోలేదు. కో ఆర్డినేటర్‌గా తననే కొనసాగించాలని మంగళ మంత్రి నుంచి సిఫారసు లేఖ తీసుకువచ్చారు. దీంతో ప్రస్తుతం ఆమెనే కో ఆర్డినేటర్‌గా కొనసాగిస్తున్నాం. – సరోజినీదేవి, డీఈఓ -
ఏపీ ఆర్టీసీ ఎండీ సంతకం ఫోర్జరీ
సాక్షి, విజయవాడ : ఆర్టీసీలో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ నియామకం కోసం కొందరు ఏకంగా ఆర్టీసీ ఎండీ మాల కొండయ్య, ఓఎస్డీ నాగేశ్వర్ రావుల సంతకాలనే ఫోర్జరీ చేశారు. కడపకు చెందిన షేక్ చాన్ బాషాను జూనియర్ అసిస్టెంట్‌గా నియమిస్తున్నట్లు ఉన్న ఫైల్ రవాశాఖ అధికారులకు చేరింది. అయితే ఈ పోస్ట్ నియమించే అధికారం ఓఎస్డీకి లేదు. దీంతో అనుమానంతో అధికారులు విచారణ చేయగా సంతకాలు ఫోర్జరీ జరిగనట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న ఓఎస్డీ నాగేశ్వర రావు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
సంతకాలు ఫోర్జరీ చేసి కారు అమ్మేశాడు
గుంటూరు : నమ్మి మోసపోయాం...మోసగాళ్లపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరుతూ అర్బన్ జిల్లా పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన బాధితులు ఎస్పీ విజయారావును వేడుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని అర్బన్‌ఎస్పీ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ జరిగింది. ఫిర్యాదులను పరిశీలించిన ఎస్పీ బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. న్యాయం జరిగేలా చూస్తానని బాధితులకు భరోసా ఇచ్చారు. బాధితుల సమస్యలు కొన్ని వారి మాటల్లోనే..... బోర్డు తిప్పేసిన కోచింగ్ సెంటర్ బ్రాడీపేట 4వలైనులో 9నెలల క్రితం ఓ కోచింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. నిర్వాహకుడు ఉదయభానుకు కోచింగ్ నిమిత్తం రూ.20 వేలు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాం. నా మాదిరిగానే మరో 19 మంది విద్యార్థులు డబ్బు చెల్లించారు. రాత్రికి రాత్రి బోర్డు తిప్పి పరారయ్యాడు. ఫోన్ చేస్తే సమాధానం లేదు. విచారించి న్యాయం చేయాలి. – తల్లిదండ్రులతో విష్ణుప్రియ, అరండల్‌పేట, గుంటూరు సంతకాలు ఫోర్జరీ చేసి కారు అమ్మేశాడు నరసరావుపేటకు చెందిన కాళంగి నాగేశ్వరరావుకు మారుతీ కారును కంటిన్యూ ఫైనాన్స్ పద్ధతిపై ఫైనాన్స్ చెల్లించేలా మాట్లాడుకొని కారును తొమ్మిది నెలల క్రితం విక్రయించాం. ఫైనాన్స్ చెల్లించపోగా, ఫోర్జరీ సంతకాలతో మా ప్రమేయం లేకుండానే కారును అమ్మినట్టు తెలిసింది. గట్టిగా నిలదీస్తే మీకు డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదంటున్నాడు. ఫైనాన్స్ వారు డబ్బు చెల్లించాలంటూ మాపై వత్తిడి చేస్తున్నారు. విచారించి నారాయణపై చర్యలు తీసుకోండి. – మేడిపల్లి వెంకటేష్, సునీత దంపతులు, చుట్టుగుంట, గుంటూరు -
మంత్రి అఖిలప్రియ సంతకం ఫోర్జరీ
- ఆ లేఖను ఆమెకే ఇచ్చి దొరికిపోయిన టీడీపీ నేత - నిందితుడి వద్ద పలువురు మంత్రుల నకిలీ లెటర్హెడ్లు సాక్షి, అమరావతి: పర్యాటక శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం కోసం ఏకంగా ఆ శాఖ మంత్రి అఖిల ప్రియ సంతకాన్ని టీడీపీ నేత ఒకరు ఫోర్జరీ చేశారు. పైగా ఆ లేఖను సదరు మంత్రికే ఇవ్వడం బుధవారం సచివాలయంలో కలకలం రేపింది. గుంటూరు జిల్లా పెదకూరపాడుకు చెందిన అలీ.. తనకు వారం రోజుల్లో ఉద్యోగం ఇవ్వాలని మంత్రి అఖిల ప్రియ సిఫారసు చేసినట్లు ఫోర్జరీ లేఖ సృష్టించాడు. ఆ లేఖతో సచివాలయంలో టూరిజం కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాను కలిశాడు. మంత్రి సంతకం ఉండటంతో ఆమెనే కలవాల్సిందిగా మీనా సూచించారు. అదే లేఖ తీసుకెళ్లి మంత్రి అఖిల ప్రియకు ఇవ్వగా.. తాను ఎప్పుడు సిఫారసు చేశానని ఆమె ప్రశ్నించడంతో లలీ ఖంగు తిన్నాడు. సంతకం తనది కాదని, ఫోర్జరీ చేశారని.. దీని సంగతేంటో చూడండి అని మంత్రి పేషీ సిబ్బందికి సూచించారు. వద్ద గుంటూరు జిల్లా టీడీపీ నేతల సంతకాలతో ఉన్న ఫోర్జరీ లేఖలు ఉన్నట్లు సిబ్బంది గుర్తించారు. వెంటనే సచివాలయం ఎస్పీఎఫ్ సిబ్బందికి సమాచారం అందించగా, వారు అలీని అదుపులోకి తీసుకున్నారు. అలీ వద్ద మంత్రులు, ఎమ్మెల్యేల నకిలీ లెటర్ హెడ్లు కూడా ఉన్నాయని మంత్రి పేషీ సిబ్బంది పేర్కొన్నారు. ఈ విషయమై అఖిల ప్రియ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆ లేఖ చూసి ఆశ్చర్యమేసింది. నా మినిస్ట్రీ స్టాంప్ కూడా ఉంది. నా సంతకం ఫోర్జరీ చేసిన ఆలీ గతంలో నంద్యాలలో కూడా తిరిగాడు. వారంలో ఉద్యోగం ఇవ్వాలని నేను ఎవరికీ లేఖ ఇవ్వలేదు’ అన్నారు. అయితే అలీ టీడీపీ నేత కావడంతో అతను సాక్షాత్తూ మంత్రి సంతకాన్నే ఫోర్జరీ చేసినా అతనిపై చర్యలు తీసుకోకపోవడం విశేషం. -
మంత్రి అఖిలప్రియ సంతకం ఫోర్జరీ
-
రైతుల సంతకాలు ఫోర్జరీ చేసి రూ.లక్షల్లో స్వాహా
-
ఫోర్జరీతో మోసం
కమర్షియల్ ట్యాక్స్ అధికారులను మోసం చేసిన వ్యక్తి అరెస్టు రాంగోపాల్‌పేట్: హోటల్ నిర్వహణకు భవనాన్ని అద్దెకు తీసుకున్న నిర్వాహకుడి సంతకాన్ని ఫోర్జరీ చేయడంతో పాటు కమర్షియల్ ట్యాక్స్ అధికారులను మోసం చేసిన ఓ వ్యక్తిని మార్కెట్ పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఐ తేజంరెడ్డి తెలిపిన మేరకు.. యాకుత్‌పురకు చెందిన రహీముద్దీన్ (50) నగరంలోని వనస్థలిపురం, నాగోల్, లక్డీకపూల్, ఎల్బీనగర్ ప్యారడైజ్ తదితర ప్రాంతాల్లో గ్రీన్ బావర్చీ పేరుతో హోటళ్లు నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో సికింద్రాబాద్ పాస్‌పోర్టు కార్యాలయం వద్ద 2014లో ప్రదీప్ సింగ్ అనే వ్యక్తికి చెందిన భవనాన్ని నెలకు రూ.1.95 లక్షల చొప్పున అద్దెకు తీసుకుని హోటల్ ప్రారంభించారు. 2015 ఫిబ్రవరి నెల వరకు అద్దెను సక్రమంగా చెల్లించిన రహీముద్దీన్ మే నెలలో మెట్రో పనుల్లో భాగంగా కొంత భవనం రోడ్డు విస్తరణలో పోవడంతో మరమ్మతులు ప్రారంభించారు. అటు తర్వాత అద్దెను చెల్లించకుండా నిలిపివేయడంతో పాటు నెలకు కేవలం రూ.4వేల మాత్రమే అద్దె చెల్లిస్తున్నట్లు అగ్రిమెంట్ చేసుకున్నట్లు డాక్యుమెంట్లను ఫోర్జరీ చేశాడు. ఈ డాక్యుమెంట్లను కమర్షియల్ టాక్స్ అధికారులకు అందించారు. ఇలా ఒకవైపు కమర్షియల్ ట్యాక్సు అధికారులను మోసం చేయడంతో పాటు భవన యజమానికి అద్దెను చెల్లించకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. తన సంతకాన్ని పోర్జరీ చేసినట్లు తెలుసుకున్న భవన యజమాని ప్రదీప్ సింగ్ ఫిబ్రవరి 11న మార్కెట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆదివారం నిందితున్ని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
కోర్టుకే ఫోర్జరీ పత్రాల సమర్పణ
గుర్తించిన న్యాయమూర్తి కారోబార్ అరెస్టు ఆర్మూర్అర్బన్(ఆర్మూర్) : నిర్మల్ జిల్లా అనంతపేట్‌కు చెందిన పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ చేసిన కేసులో అదే గ్రామ పంచాయతీకి చెందిన కారోబార్ నేరేళ్ల విద్యాసాగర్‌ను ఆర్మూర్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్సై సంతోష్ వివరాలు వెల్లడించారు. ఆర్మూర్‌లో మాయమాటలు చెప్పి యువతి నుంచి బంగారు నగలు కాజేసిన సంఘటనలో నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన తోటు కృష్ణను ఐదునెలల క్రితం ఆర్మూర్ పోలీసులు అరెస్టు చేశారు. కాగా కోర్టులో బెయిలు మంజూరు విషయంలో జమానతుగా ఇద్దరు వ్యక్తులు అవసరం ఉంటుంది. కాగా నిర్మల్ జిల్లా అనంతపేట్‌కు చెందిన బొబ్బాల భూమన్న, గడచంద రాజన్నలు జమానత్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. కాగా జమానత్‌కు ఇంటి విలువపత్రం సమర్పించాల్సి ఉంటుంది. ఇంటి విలువపత్రంపై సంబంధిత కార్యదర్శి సంతకం చేయాల్సి ఉంటుంది. దీంతో కారోబార్ విద్యాసాగర్ పంచాయతీ కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేశాడు. బెయిలు మంజూరులో ఫోర్జరీని గమనించిన న్యాయమూర్తి విచారణకు ఆదేశించారు. విచారణ చేపట్టిన పోలీసులు కారోబార్ విద్యా సాగర్, జమానత్‌లైన భూమన్న, గడచంద రాజన్నలను అరెస్టు చేశారు. అనంతరం వారిపై చీటింగ్ కేసు నమోదు చేసి ఆర్మూర్ కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి రిమాండ్‌కు తరలించారు. -
అమ్మపై కుట్ర
సీబీఐ విచారణకు ఎంపీ శశికళ పుష్ప డిమాండ్ శశికళ పథకం ప్రకారమే అన్నీ జరుగుతున్నాయి సాక్షి ప్రతినిధి, చెన్నై: ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యాన్ని అవకాశంగా తీసుకుని అన్నాడీఎంకే పార్టీని, ప్రభుత్వాన్ని కైవసం చేసుకునేందుకు శశికళ, ఆమె కుటుంబ సభ్యులు కుట్రపన్నుతున్నారని ఆ పార్టీ బహిష్కృత రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప ఆరోపించారు. అక్రమంగా జయ సంతకాన్ని ఫోర్జరీ చేసే ప్రమాదం కూడా ఉందని పేర్కొంటూ తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్‌రావుకు సోమవారం ఆమె ఒక లేఖను పంపారు. సోమవారం మీడియాతో ఆమె మాట్లాడుతూ జయలలిత నెచ్చెలి శశికళపై ఆమె పలు ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి చుట్టూ జరిగే అనేక సంఘటనలకు శశికళ కుటుంబ సభ్యులే పాత్రధారులని, అన్నీ ఓ పథకం ప్రకారం జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. జయలలిత అనారోగ్యానికి దారితీసిన పరిస్థితుల్లో సీబీఐ విచారణ అవసరమని శశికళ పుష్ప డిమాండ్ చేశారు. శశికళ, నటరాజన్ వారి కుటుంబ సభ్యులపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నందున వారందరినీ అపోలో నుంచి పంపించేయాలన్నారు. అన్నాడీఎంకే దిశగా కాంగ్రెస్ గత పదేళ్లుగా డీఎంకేకు మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్.. ఇపుడు అన్నాడీఎంకే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేతల వైఖరి సైతం ఈ విషయాన్ని ధ్రువీకరిస్తోంది. జయ స్థానంలో పార్టీ పగ్గాలు చేతపుచ్చుకునేందుకు శశికళ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. రానున్న ఉప ఎన్నికల్లో తంజావూరు నియోజకవర్గం నుంచి ఆమె పోటీచేసేందుకు సిద్ధమైనట్లు ప్రచారం ఊపందుకొంది. అన్నాడీఎంకేకు ఒక జాతీయ పార్టీ అండదండలు అవసరమని భావిస్తున్న శశికళ.. కాంగ్రెస్‌కు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. జయలలితను పరామర్శించేందుకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అకస్మాత్తుగా రావడం శశికళ వ్యూహంలో భాగమేనని విశ్లేషకులు అంటున్నారు. -
ఫోర్జరీ సంతకంతో బ్యాంకులో డబ్బులు డ్రా
సంతకానికి బదులు వేలిముద్ర వేసి పట్టుబడిన వైనం బ్యాంకు సిబ్బందిపై అనుమానం దర్యాప్తు చేస్తున్న ఇంటలిజెన్స్ అధికారులు యర్రగొండపాలెం(ప్రకాశం జిల్లా): మండలంలోని అమానిగుడిపాడులోని ఒక గ్రామీణ బ్యాంకులో ఫోర్జరీ సంతకంతో డబ్బులు డ్రా చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. ఈ విషయంపై ఇంటలిజెన్స్ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. కొలుకులకు చెందిన ఒక వ్యక్తి ఖాతాలోని రూ. 20 వేలు డ్రా చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఆ ఖాతాదారుడు మారుమూల గ్రామానికి చెందిన వ్యక్తి కావడం వల్ల అతనికి సంతకం చేయడంరాదని భావించి వేలిముద్ర వేసుకొని ఆ డబ్బును కాజేశారు. ఆ అకౌంట్ ఖాతాలో సంతకం చేసి ఉండటం వల్ల ఆ బ్యాంకు రీజనల్ కార్యాలయంలో ఈ విషయాన్ని గుర్తించారు. బ్యాంకు సిబ్బంది హస్తం లేకుండా ఆ డబ్బు డ్రా చేసుకునే అవకాశం లేదని ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసును ఆ బ్యాంకు ఉన్నతాధికారులు ఇంటలిజెన్స్ అధికారులకు అప్పచెప్పినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో వారు అమానిగుడిపాడు వచ్చి దర్యాప్తు చేపట్టారు. వేలిముద్రలు వేసి ఉన్న ప్లే స్లిప్‌తో పాటు ఖాతాదారుడి వేలిముద్రలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు సమాచారం. బ్యాంకు సిబ్బందే వేలిముద్రలు వేసుకొని డబ్బును డ్రా చేసుకొని ఉంటారని ఆ గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఖాతాదారుడు సంతకం చేయడం మరచిపోయి వేలిముద్ర వేసుకొని డబ్బులు డ్రా చేశాడని, పనివత్తిడి వల్ల తాము ఈ విషయం గమనించలేక పోయామని ఆ బ్యాంకుకు చెందిన సిబ్బంది చెప్తున్నట్లు తెలిసింది. ఈ పోర్జరీ వ్యవహారం ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి రిపోర్టు వచ్చిన తరువాత వాస్తవం ఏమిటో బయట పడుతుంది. సంబంధిత బ్యాంకు అధికారులు ఈ విషయంపై ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదు. -
చాప్టా (కె) వీఆర్వో మాయాజాలం
♦ ఆర్డీఓ మధుకర్‌రెడ్డి సంతకాల ఫోర్జరీ ♦ గుట్టురట్టయిన బాగోతం ♦ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన తహసీల్దార్ కంగ్టి: వీఆర్వో మాయాజాలానికి రైతులు బలయ్యారు. భూమి యాజమాన్య హక్కు పత్రాలపై ఆర్డీఓ ఫోర్జరీ సంతకాలతో రైతులకు పాస్‌బుక్‌లు పంపిణీకి సిద్ధం చేశాడు. అనుమానం వచ్చి సంతకాలను పరిశీలించగా గుట్టురట్టయింది. ఈ ఘటన కంగ్టి మండలంలో వెలుగుచూసింది. కంగ్టి మండలం చాప్టా(కె) క్లస్టర్లో వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్న నర్సింలు సంగారెడ్డిలోని ఆర్డీఓ కార్యాలయానికి సంబంధించిన వ్యవహారాలు చూస్తున్నాడు. తహసీల్ కార్యాలయం నుంచి పట్టాపాస్‌బుక్‌లు తీసుకొని ఆర్డీఓ సంతకాల కోసం తీసుకెళ్లాడు. ఈ క్రమంలో వాసర్ గ్రామం, తండాకు చెందిన రైతులు సుభాష్, సీతారాం, శ్రీరామ్, అంబుబాయి, జమలాబాయి, ఓంప్రకాష్, లక్ష్మయ్యల భూమి యాజమాన్య హక్కు పత్రాలపై బదిలీపై వెళ్లిన ఆర్డీఓ మధుకర్‌రెడ్డి సంతకాలు చేయించి తిరిగి కార్యాలయంలో సమర్పించాడు. సంబంధిత వాసర్ వీఆర్వో రాములు పరిశీలించారు. అనుమానం రావడంతో తహసీల్దార్ వసంత్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఆర్డీఓ కార్యాలయంలో అప్పటి ఆర్డీఓ మధుకర్‌రెడ్డి సంతకాలతో సరిపోల్చగా ఫోర్జరీ అని తేలిందని తహసీల్దార్ తెలిపారు. సదరు వీఆర్వో నర్సింలుపై చర్యలకు అనుమతి కోరుతూ బుధవారం ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్ రోనాల్డ్‌రోస్‌కు నివేదిక పంపినట్టు తహసీల్దార్ వసంత్‌కుమార్ తెలిపారు. -
కిషన్‌రెడ్డి సతీమణి సంతకం ఫోర్జరీ
రూ.10 లక్షలు డ్రా చేయడానికి యత్నించిన వ్యక్తి అరెస్ట్ పరారీలో నిందితుడు కాచిగూడ: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి భార్య కావ్య సంతకాన్ని ఫోర్జరీ చేసిన నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫోర్జరీ సంతకంతో బ్యాంకు నుంచి రూ.10 లక్షలు డ్రా చేయడానికి యత్నించిన వ్యక్తిని కాచిగూడ పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కాచిగూడ క్రైం ఎస్ఐ బీవీ కౌశిక్ తెలిపిన వివరాలు.. ఎర్రమంజిల్ కాలనీలోని నీమా ఫైర్ సేఫ్టీ ఇంజినీరింగ్ కంపెనీ యజమాని రాజశేఖర్‌రెడ్డి గతంలో ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి వద్ద పనిచేస్తుండేవాడు. కిషన్‌రెడ్డి భార్య కావ్వకు పంజగుట్టలోని ఆంధ్రా బ్యాంకులో అకౌంట్ ఉంది. కావ్య ఇచ్చినట్లుగా ఓ వ్యక్తి ఈ నెల 30వ తేదీన రూ.10 లక్షల చెక్కును డ్రా చేయడానికి బ్యాంకులో ఉన్న డ్రాప్ బాక్స్‌లో వేశాడు. ఈ విషయాన్ని బ్యాంకు అధికారులు కావ్య దృష్టికి తీసుకువచ్చారు. తాను ఎవరికి రూ.10 లక్షల చెక్కు ఇవ్వలేదని తెలిపారు. చెక్కు కోసం ఎవరైనా వస్తే తమ దృష్టికి తీసుకురావాలని బ్యాంకు అధికారులకు తెలియజేశారు. ఈ విషయమై కాచిగూడ పోలీసులుకు ఫిర్యాదు చేశారు. చెక్కు స్టేటస్ తెలుసుకోవడానికి రాజశేఖర్‌రెడ్డి వద్ద పనిచేస్తున్న బండారి అనంద్ క్రాంతి కుమార్ బ్యాంకుకు వచ్చాడు. బ్యాంకు అధికారులు కాచిగూడ పోలీసు స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే కాచిగూడ పోలీసులు బొల్లారం రిసాలబజార్ ప్రాంతానికి చెందిన బండారి అనంద్ క్రాంతి కుమార్ (30)ను అదుపులోకి తీసుకుని విచారించి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కావ్య సంతకాన్ని ఫోర్జరీ చేసిన రాజశేఖర్‌రెడ్డి పరారీలో ఉన్నాడు. కాచిగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఫోర్జరీ సంతకంతో కో-ఆప్షన్ ఎన్నిక
మున్సిపల్ చైర్మన్‌ను నిలదీసిన టీడీపీ కౌన్సిలర్ టీడీపీకి కాంగ్రెస్ అండదండలు గందరగోళంగా ముగిసిన కో-ఆప్షన్ ఎన్నికలు నిబంధనలకు విరుద్ధమన్న వైఎస్సార్ సీపీ నాయకులు మున్సిపల్ కార్యాలయం వద్దే ధర్నాకు దిగిన వైఎస్సార్ సీపీ నాయకులు శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి మున్సిపల్ కో-ఆప్షన్ ఎన్నిక టీడీపీకి చెందిన మున్సిపల్ చైర్మన్ పేట రాధారెడ్డి తన ఫోర్జరీ సంతకంతోనే పూర్తి చేశారని అదే పార్టీకి చెందిన 33వ వార్డు కౌన్సిలర్ నాగరాణి దుయ్యపట్టారు. దీంతో సమావేశం గందరగోళానికి దారితీసింది. పలువురు టీడీపీ కౌన్సిలర్లు ఎన్నికను వ్యతిరేకించారు. వైఎస్సార్ సీపీ కి చెందిన 11మంది కౌన్సిలర్లు కార్యాలయం ముందే బైఠాయించి, ధర్నాకు దిగారు. ఎన్నికల సమావేశానికి హజరుకాలేదు. అయినా మున్సిపల్ చైర్మన్ పేట రాధారెడ్డి కాంగ్రెస్ కౌన్సిలర్ల సహాయంతో కో-ఆప్షన్ ఎన్నికను తూతూమంత్రంగా ముగించారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆగస్టు 30వ తేదీన మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సాధారణ సమావేశంలో కో-ఆప్షన్ ఎన్నిక ప్రక్రియను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే అదే పార్టీకి చెందిన కౌన్సిలర్ల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎన్నికలు వాయిదా వేశారు. తిరిగి బుధవారం నిర్వహించడానికి నిర్ణయించారు. అయితే వైఎస్సార్ సీపీకి చెందిన కౌన్సిలర్లు నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తున్నారంటూ సమావేశానికి హజరుకాకుండా మున్సిపల్ కార్యాలయం ఎదుటే బైఠాయిం చారు. చైర్మన్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులతో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లోర్‌లీడర్ మిద్దెల హరి మాట్లాడుతూ ఆగస్టు 11వ తేదీన కో-ఆప్షన్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేశారని, నోటిపికేషన్ విడుదల చేసిన 15 రోజుల్లో కో-ఆప్షన్ ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని తెలిపారు. అయితే ఆగస్టు 30వ తేదీన సర్వసభ్య సమావేశంలో టీడీపీ కౌన్సిలర్లు మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో వాయిదా పడిందన్నారు. దీంతో ఈ నెల 3వ తేదీన ప్రత్యేక సమావేశం నిర్వహించి, కమిషనర్ శ్రీలక్ష్మి లేకపోయినప్పటికీ డెలిగేట్ కమిషనర్ పీవీరావు ఆధ్వర్యంలో తూతూ మంత్రంగా కో-ఆప్షన్ ఎన్నిక ముగిం చి, సమావేశం కూడా నిర్వహించకుండా వెళ్లిపోయారని ఆరోపించారు. టీడీపీ కౌన్సిలర్లు పూర్తి మద్దతు తెలపకపోవడంతో కాంగ్రెస్ కౌన్సిలర్లుతో కుమ్మకై నామమాత్రంగా ఎన్నికలు ని ర్వహించారని విమర్శించారు. అంతేకాకుండా 33వ వార్డు టీడీపీ కౌన్సిలర్‌తో పాటు పలు ఫో ర్జరీ సంతకాలు చేసి, ఎన్నికలు పూర్తి చేశారని ఆరోపించారు. వెంటనే చైర్మన్ పేట రాధారెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశా రు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలోని చైర్మన్ చాంబర్ వద్ద కూడా ప్లకార్డులతో నినాదాలు చేశారు. మరోవైపు మున్సిపల్ చైర్మన్ పేటరాధారెడ్డి మాట్లాడుతూ 35 మంది కౌన్సిలర్లుకు గాను 19 మంది మద్దతు ఉండడంతో కో-ఆప్షన్ ఎన్నికలు పూర్తి చేశామని, తాము ఫోర్జరీ సంతకాలు చేయలేదని తెలిపారు. కో-ఆప్షన్ సభ్యులుగా ధనంజయులు, షాకీర్‌ఆలీ, షాహిద్బేగంను ఎంపిక చేసినట్లు స్పష్టం చేశారు. -
ఫోర్జరీ సంతకంతో బంగారం డ్రా
దేవరకొండ : దేవరకొండ కో-ఆపరేటివ్ బ్యాంకులో నకిలీ పాస్‌పుస్తకాలతో కోట్ల రూపాయలు డ్రా చేసిన విషయం వెలుగు చూసిన నేపథ్యంలోనే ఫోర్జరీ సంతకంతో బంగారం డ్రా చేసిన మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. దేవరకొండకు చెందిన ఎం.ప్రేమలత 2012 సెప్టెంబరు 18న 15 తులాల బంగారు ఆభరణాలను దేవరకొండ కో-ఆపరేటివ్ బ్యాంకులో తనఖా పెట్టి 2లక్షల40వేల రూపాయలను లోనుగా తీసుకుంది. అయితే ప్రేమలత తన భర్త అశ్విన్‌కుమార్‌తో విబేధాలు రావడంతో ఏడాదిగా విడిగా ఉంటుంది. విడాకుల కోసం కోర్టులో కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల బ్యాం కులో బంగారు నగల విషయం వాకబు చేయగా 27డిసెంబరు 2013న డబ్బులు చెల్లించి బంగారాన్ని డ్రాచేసినట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. దీంతో తన బ్యాంకు ఖాతాలో ఉన్న సొమ్మును తన ప్రమేయం గానీ, తన సంతకం గానీ లేకుండా ఎలా డ్రా చేశారని బ్యాంకు అధికారులను ప్రశ్నించింది. ఆమె సంత కం స్థానంలో మరొకరు ఫోర్జరీ సంతకం చేశారని, దీనిపై విచారణ నిర్వహిస్తామని బ్యాంకు అధికారులు తెలిపారు. దీంతో ప్రేమలత అకౌంట్లో తన ఫొటో ఉండగా బ్యాంకు అధికారుల ప్రమేయం లేనిదే నగలను ఎలా డ్రా చేశారంటూ ప్రశ్నించడంతో పాటు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ప్రేమలత బ్యాంకు అధికారులపై, సంతకం ఫోర్జరీ చేసినట్లు అనుమానిస్తున్న తన భర్త అశ్విన్‌కుమార్‌పై దేవరకొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన నగలను తనకు ఇప్పించాలని వేడుకుంటుంది. ఇప్పటికే భర్తకు దూరంగా ఉంటూ ఇద్దరు ఆడపిల్లలతో ఎలా బతకాలంటూ బోరున విలిపించింది. ఈ విషయమై దేవరకొండ కో ఆపరేటివ్ బ్యాంకు మేనేజరు రవిని వివరణ కోరగా ఆమె అకౌంట్ నుంచి బంగారు ఆభరణాలు డ్రా చేసిన విషయం వాస్తవమేనని, అయితే లావాదేవీలు అధికంగా ఉన్నందున ఎవరు డ్రా చేశారనే విషయంపై విచారణ చేపడతామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమెకు అన్యాయం జరగదని పేర్కొన్నారు. ఇదే విషయమై ఎస్ఐ శేఖర్‌ను వివరణ కోరగా కేసు విషయమై పరిశీలిస్తున్నట్లు తెలిపారు. -
బ్యాంకుకు టోకరా
నకిలీ పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్స్ సమర్పించి రూ.43 లక్షలు స్వాహా ఆర్డీవో, తహసిల్దార్, వీఆర్వో సంతకాలు ఫోర్జరీ సెంటు భూమి లేకపోరుునా రుణాలు తెల్లమొహం వేసిన బ్యాంకు అధికారులు జంగారెడ్డిగూడెం, న్యూస్‌లైన్ : ఆర్డీవో, తహసిల్దార్, వీఆర్వో సంతకాలను ఫోర్జరీ చేశారు. నకిలీ పట్టాదార్ పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్స్‌ను సృష్టించారు. వాటిని బ్యాంకులో దర్జాగా కుదువబెట్టారు. అసలు పత్రాలున్నా సామాన్యుడికి రుణాలిచ్చేందుకు మీనమేషాలు లెక్కించే బ్యాంకు ఉద్యోగులు ఆ నకిలీ పత్రాలపై 11 మందికి రూ.43 లక్షలను రుణంగా ఇచ్చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఉదంతానికి సంబంధించి ‘న్యూస్‌లైన్’ సేకరించిన వివరాలిలా ఉన్నారుు. బుట్టాయగూడెం మండలం కోయరాజమండ్రి, సమీపంలోని గ్రామాలకు చెందిన 11మంది వ్యక్తులు తమకు జీలుగుమిల్లి మండలంలో భూములు ఉన్నట్టుగా నకిలీ పట్టాదార్ పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్స్ సృష్టించారు. వాటిని 2010, 11, 12 సంవత్సరాలలో బుట్టాయగూడెంలోని ఒక జాతీయ బ్యాం కులో కుదువబెట్టి సుమారు రూ.43 లక్షలను రుణంగా తీసుకున్నారు. ఇటీవల ఆ బ్యాంకు శాఖలో కొత్త మేనేజర్ బాధ్యతలు స్వీకరించారు. ఆర్థిక సంవత్సరం పూర్తి కావస్తుండటంతో రుణా ల రికవరీపై దృష్టి సారించిన ఆయన సిబ్బందితో కలసి రుణం తీసుకున్న వ్యక్తుల వివరాలు సేకరించేందుకు వెళ్లారు. రుణాలు తీసుకున్న వ్యక్తులకు ఎక్కడా సెంటు భూమికూడా లేదని స్థానికులు చెప్పడంతో కంగుతిన్నారు. తమకు జీలుగుమిల్లి మండలం మడకంవారిగూడెం, చీమలవారిగూడెం, గంగన్నగూడెం గ్రామా ల్లో సుమారు 60 ఎకరాల భూమి ఉన్నట్టు పే ర్కొంటూ రుణ గ్రహీతలు సమర్పించిన 9 పట్టాదార్ పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్స్ వివరాలను సమర్పిస్తూ ఆ భూముల ఎక్కడ ఉన్నాయో తెలపాల్సిందిగా కోరుతూ బ్యాంకు అధికారులు జీలుగుమిల్లి తహసిల్దార్‌కు లేఖ రాశారు. బ్యాం కు అధికారులు పేర్కొన్న సర్వే నంబర్లతో భూములేవీ ఆయూ గ్రామాల్లో లేవని రెవెన్యూ అధికారులు స్పష్టం చేస్తూ సమాధానం ఇచ్చారు. ఈ విషయూన్ని రెవెన్యూ అధికారులు ఆర్డీవో దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు సమాచారం. ఒక్క రూపారుు కడితే ఒట్టు నకిలీ పట్టాదార్ పాస్ పుస్తకాలతో రుణాలు పొందిన వ్యక్తులు బ్యాంకుకు తిరిగి ఒక్క రూపా రుు కూడా చెల్లించలేదు. ఆ వ్యక్తులు పొందిన రుణం మొత్తం వడ్డీతో కలిపి రూ.60 లక్షల వరకు అయినట్టు తెలిసింది. ఈ మొత్తాన్ని ఎలా రికవరీ చేయూలో అర్థంకాక బ్యాంకు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. సామాన్యు లు ఎవరైనా రుణం కోసం దరఖాస్తు చేసుకుం టే వంద ష్యూరిటీలు తీసుకుని, వెరుు్య ప్రశ్నలు వేసే బ్యాంకు అధికారులు నకిలీ పత్రాలు తీసుకుని అంత గుడ్డిగా ఎలా రుణాలిచ్చేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నారుు. ఇదే తరహాలో మరికొందరు బినామీలు సైతం రుణాలు పొం దినట్టు తెలుస్తోంది. కన్నాపురం, దొండపూడి, రెడ్డి గణపవరం, కొయ్యలగూడెం బ్యాంకుల్లోనూ బినామీ రుణాలు ఇచ్చినట్లు సమాచారం. ఇదేమీ కొత్త కాదు నకిలీ పత్రాలతో బ్యాంకుల నుంచి రుణాలు పొందడం ఈ ప్రాంతంలో కొత్తేమీ కాదు. గతంలోనూ నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలను సమర్పించి బ్యాంకుల నుంచి నిధులు కొల్లగొట్టిన వ్యవహారాలు వెలుగుచూశారుు. 2003లో వెలుగుచూసిన ఒక కుంభకోణంలో ఏకంగా రెండు వేల ఎకరాల భూములకు నకిలీ పట్టాలు సృష్టిం చినట్టు వెల్లడైంది. అప్పట్లో కేఆర్‌పురం ఐటీడీఏ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ జడ్జిమెంట్ కాపీని, పట్టాదార్ పాస్ పుస్తకాలను సైతం ఫోర్జరీ సంతకాలతో తయూరు చేసినట్టు రూఢీ అరుు్యంది. ఈ నేపథ్యంలో అప్పట్లో ఒక తహసిల్దార్‌ను, రెవెన్యూ కార్యాలయ సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేశారు. స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ జడ్జిమెంట్ కాపీని ఫోర్జరీ చేసిన వ్యవహారానికి సంబంధించి ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసును సీబీసీఐడీకి అప్పగించారు. అప్పట్లోనూ బుట్టాయగూడెం కేంద్రంగానే ఈ వ్యవహారం నడిచింది.