ఉద్యోగం కోసం ఏకంగా మంత్రి సంతకాన్నే ఫోర్జరీ చేసి ఓ యువకుడు అడ్డంగా బుక్ అయ్యాడు. వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా పెదకూరపాడుకు చెందిన అలీ అనే వ్యక్తి... ఉద్యోగం ఇవ్వాలంటూ పర్యాటకశాఖ మంత్రి అఖిలప్రియ సంతకాన్ని ఫోర్జరీ చేశాడు. అంతేకాకుండా మీ పేషీ సిబ్బంది పట్టించుకోలేదంటూ నేరుగా మంత్రి వద్దకే వెళ్లాడు. అయితే ఆ సంతకం తనది కాదంటూ మంత్రి అఖిలప్రియ ఆరా తీయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు పెదకూరపాడుకు చెందిన అలీ అనే వ్యక్తిగా గుర్తించారు. దీంతో మంత్రి పేషీ సిబ్బంది ఎస్పీఎఫ్కి ఫిర్యాదు చేశారు.