నకిలీ పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్స్
సమర్పించి రూ.43 లక్షలు స్వాహా
ఆర్డీవో, తహసిల్దార్, వీఆర్వో
సంతకాలు ఫోర్జరీ
సెంటు భూమి లేకపోరుునా రుణాలు
తెల్లమొహం వేసిన బ్యాంకు అధికారులు
జంగారెడ్డిగూడెం, న్యూస్‌లైన్ :
ఆర్డీవో, తహసిల్దార్, వీఆర్వో సంతకాలను ఫోర్జరీ చేశారు. నకిలీ పట్టాదార్ పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్స్‌ను సృష్టించారు. వాటిని బ్యాంకులో దర్జాగా కుదువబెట్టారు. అసలు పత్రాలున్నా సామాన్యుడికి రుణాలిచ్చేందుకు మీనమేషాలు లెక్కించే బ్యాంకు ఉద్యోగులు ఆ నకిలీ పత్రాలపై 11 మందికి రూ.43 లక్షలను రుణంగా ఇచ్చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఉదంతానికి సంబంధించి ‘న్యూస్‌లైన్’ సేకరించిన వివరాలిలా ఉన్నారుు. బుట్టాయగూడెం మండలం కోయరాజమండ్రి, సమీపంలోని గ్రామాలకు చెందిన 11మంది వ్యక్తులు తమకు జీలుగుమిల్లి మండలంలో భూములు ఉన్నట్టుగా నకిలీ పట్టాదార్ పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్స్ సృష్టించారు. వాటిని 2010, 11, 12 సంవత్సరాలలో బుట్టాయగూడెంలోని ఒక జాతీయ బ్యాం కులో కుదువబెట్టి సుమారు రూ.43 లక్షలను రుణంగా తీసుకున్నారు. ఇటీవల ఆ బ్యాంకు శాఖలో కొత్త మేనేజర్ బాధ్యతలు స్వీకరించారు.
ఆర్థిక సంవత్సరం పూర్తి కావస్తుండటంతో రుణా ల రికవరీపై దృష్టి సారించిన ఆయన సిబ్బందితో కలసి రుణం తీసుకున్న వ్యక్తుల వివరాలు సేకరించేందుకు వెళ్లారు. రుణాలు తీసుకున్న వ్యక్తులకు ఎక్కడా సెంటు భూమికూడా లేదని స్థానికులు చెప్పడంతో కంగుతిన్నారు. తమకు జీలుగుమిల్లి మండలం మడకంవారిగూడెం, చీమలవారిగూడెం, గంగన్నగూడెం గ్రామా ల్లో సుమారు 60 ఎకరాల భూమి ఉన్నట్టు పే ర్కొంటూ రుణ గ్రహీతలు సమర్పించిన 9 పట్టాదార్ పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్స్ వివరాలను సమర్పిస్తూ ఆ భూముల ఎక్కడ ఉన్నాయో తెలపాల్సిందిగా కోరుతూ బ్యాంకు అధికారులు జీలుగుమిల్లి తహసిల్దార్‌కు లేఖ రాశారు. బ్యాం కు అధికారులు పేర్కొన్న సర్వే నంబర్లతో భూములేవీ ఆయూ గ్రామాల్లో లేవని రెవెన్యూ అధికారులు స్పష్టం చేస్తూ సమాధానం ఇచ్చారు. ఈ విషయూన్ని రెవెన్యూ అధికారులు ఆర్డీవో దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు సమాచారం.
ఒక్క రూపారుు కడితే ఒట్టు
నకిలీ పట్టాదార్ పాస్ పుస్తకాలతో రుణాలు పొందిన వ్యక్తులు బ్యాంకుకు తిరిగి ఒక్క రూపా రుు కూడా చెల్లించలేదు. ఆ వ్యక్తులు పొందిన రుణం మొత్తం వడ్డీతో కలిపి రూ.60 లక్షల వరకు అయినట్టు తెలిసింది. ఈ మొత్తాన్ని ఎలా రికవరీ చేయూలో అర్థంకాక బ్యాంకు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. సామాన్యు లు ఎవరైనా రుణం కోసం దరఖాస్తు చేసుకుం టే వంద ష్యూరిటీలు తీసుకుని, వెరుు్య ప్రశ్నలు వేసే బ్యాంకు అధికారులు నకిలీ పత్రాలు తీసుకుని అంత గుడ్డిగా ఎలా రుణాలిచ్చేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నారుు. ఇదే తరహాలో మరికొందరు బినామీలు సైతం రుణాలు పొం దినట్టు తెలుస్తోంది. కన్నాపురం, దొండపూడి, రెడ్డి గణపవరం, కొయ్యలగూడెం బ్యాంకుల్లోనూ బినామీ రుణాలు ఇచ్చినట్లు సమాచారం.
ఇదేమీ కొత్త కాదు
నకిలీ పత్రాలతో బ్యాంకుల నుంచి రుణాలు పొందడం ఈ ప్రాంతంలో కొత్తేమీ కాదు. గతంలోనూ నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలను సమర్పించి బ్యాంకుల నుంచి నిధులు కొల్లగొట్టిన వ్యవహారాలు వెలుగుచూశారుు. 2003లో వెలుగుచూసిన ఒక కుంభకోణంలో ఏకంగా రెండు వేల ఎకరాల భూములకు నకిలీ పట్టాలు సృష్టిం చినట్టు వెల్లడైంది. అప్పట్లో కేఆర్‌పురం ఐటీడీఏ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ జడ్జిమెంట్ కాపీని, పట్టాదార్ పాస్ పుస్తకాలను సైతం ఫోర్జరీ సంతకాలతో తయూరు చేసినట్టు రూఢీ అరుు్యంది. ఈ నేపథ్యంలో అప్పట్లో ఒక తహసిల్దార్‌ను, రెవెన్యూ కార్యాలయ సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేశారు. స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ జడ్జిమెంట్ కాపీని ఫోర్జరీ చేసిన వ్యవహారానికి సంబంధించి ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసును సీబీసీఐడీకి అప్పగించారు. అప్పట్లోనూ బుట్టాయగూడెం కేంద్రంగానే ఈ వ్యవహారం నడిచింది.
బ్యాంకుకు టోకరా
Published Sat, Feb 8 2014 2:33 AM | Last Updated on Thu, Apr 4 2019 2:50 PM
Advertisement
Advertisement