rdo
-
ఇథనాల్‌పై గెలుపులో అంతా ఆమే!
అభివృద్ధికి ఎవరు మాత్రం కాళ్లు అడ్డుతారు? అయితే అభివృద్ధి అనుకున్నది ఊరువాడకు చేటు చేసేలా ఉందని అనిపిస్తే... ఆందోళన మొదలవుతుంది. మంచి అని చెబుతున్నది ‘చెడు’ చేయడానికి వస్తుంది అనుకుంటే ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటుంది. ఆ ఆందోళన. ఆగ్రహం ఉద్యమ రూపం దాల్చుతుంది. నిర్మల్ జిల్లా దిలావర్పూర్–గుండంపల్లి గ్రామాల మధ్య ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. ఇది ఉద్యమ విజయం. ఈ ఉద్యమ ప్రత్యేకత... మహిళా శక్తి.అక్షరజ్ఞానం లేని మహిళల నుంచి చదువుకున్న మహిళల వరకు, కూలిపనులు చేసుకునే శ్రామిక మహిళల నుంచి ఇంటిపనుల్లో తలమునకలయ్యే గృహిణుల వరకు ఈ ఉద్యమంలో భాగం అయ్యారు. ఉద్యమానికి వెన్నెముకై ముందుకు నడిపించారు. మరో వైపు....ఆ ఉద్యమంలో ఎలాంటి అపశ్రుతులు దొర్లకుండా, హింసాత్మక ఘటనలు చోటు చేనుకోకుండా వెయ్యి కళ్లతో పర్యవేక్షించిన మహిళా అధికారులు. ఆర్డీఓ రత్నకల్యాణి, శాంతిభద్రతలు అదుపుతప్పకుండా చూసిన ఎస్పీ జానకీషర్మిల, ఎప్పటికప్పుడు సీఎంఓకు సమాచారమిస్తూ చర్చలు జరిపిన కలెక్టర్ అభిలాష అభినవ్... ఇలా ఎంతోమంది మహిళలు ఉన్నారు.‘ఉన్న ఊరు కన్నతల్లి’ అంటారు. ఆ కన్నతల్లి కళ్లలో కలవరం మొదలైంది. నవ్వుతూ పచ్చగా పలకరించే పొలంలో కళ తప్పింది. ఊరి చెరువు దుఃఖసముద్రం అయింది. ‘ఇక మన ఊరు మనుపటిలా ఉండదా?’‘ఇథనాల్ పరిశ్రమ కాలుష్య పడగనీడలో భయంభయంగా మనుగడ సాగించాల్సిందేనా?’....ఇలా ఎన్నో ప్రశ్నలు, ఆందోళనల మధ్య ఇథనాల్ పరిశ్రమ వ్యతిరేక ఉద్యమం మొదలైంది.నమ్ముకున్న పొలాలే లేకుంటే...‘మాకు పట్టెడన్నం పెట్టే పంట పొలాలే లేకుంటే రేప్పొద్దున్న మా పరిస్థితి ఏంటన్న ప్రశ్నే మమ్మల్ని ఇంతలా కదిలించింది’ అంటున్నారు ఉద్యమశంఖారావం పూరించిన మహిళలు. నిజామాబాద్ జిల్లాలో అంకాపూర్ ఎలాగో నిర్మల్ జిల్లాలో దిలావర్పూర్–గుండంపల్లి ప్రాంతాలు అలాగ. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌కు ఆమడదూరంలో ఉండే ఈ నేలంతా వ్యవసాయాధారితమే. ఇంటిల్లిపాది పొద్దున్నే పంటచేలోకి వెళ్తారు. అలాంటి చోట ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టడం ఆ రైతు కుటుంబాలు, గ్రామాలను కలవరపెట్టింది.ఊరూరా..ఇంటింటికీ..పొద్దున్నే పొలాలు, చేలకు వెళ్లి మధ్యాహ్నం కల్లా ఇంటికి తిరిగి వచ్చే మహిళలు ఆ తరువాత ఉద్యమబాటలో కదిలేవారు. తోటి మహిళలతో కలిసి తమ ఊళ్లో ప్రతి ఇంటికీ వెళ్లేవాళ్లు. ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు వల్ల ఏం నష్టపోతాం, భవిష్యత్తులో ఎదురయ్యే పరిస్థితులు ఎలా ఉంటాయో వివరించేవారు. పక్కనున్న గ్రామాలకు కూడా వెళ్లి మహిళలతో మాట్లాడేవారు. ఒక్కముక్కలో చెప్పాలంటే ఉద్యమకార్యాచరణ అనేది వారి దైనందిన జీవితంలో భాగం అయింది.లాఠీలతో కొట్టినా... ఇగ వెనక్కి తగ్గద్దు అనుకున్నాం‘మా ఊళ్లు బాగుండాలన్నా, మా పిల్లల భవిష్యత్తు భద్రంగాఉండాలన్నా పచ్చని మా పల్లెల్లో చిచ్చుపెట్టే ఆ ఫ్యాక్టరీ ఉండొద్దని అనుకున్నాం. ఊళ్లో మగవాళ్లు చేస్తున్న పోరుకు ఎప్పుడూ ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. అందుకే ఈసారి మేమే ముందుండాలని నిర్ణయించుకున్నాం. పోలీసులు అరెస్టులే చెయ్యనీ, లాఠీలతో కొట్టనీ... ఇగ వెనక్కు తగ్గేది లేదని గట్టిగ అనుకునే ముందుకొచ్చాం..’ అంటుంది గుండంపల్లికి చెందిన శ్వేతారెడ్డి.‘క్షణం తీరిక లేకుండా పొలం పనులు, ఇంటి పనులు. అయినంత మాత్రాన ఊరు ఎటు బోతే నాకేంది అనుకోలేము కదా. ఇది ఒక్కరి సమస్య కాదు. ఊరందరి సమస్య. కాబట్టి ఎంత పని ఒత్తిడి ఉన్నా ఉద్యమంలో భాగం అయ్యాను’ అంటుంది ఒక రైతు బిడ్డ......ఎవరి మాట ఎలా ఉన్నా మహిళలందరూ ఉద్యమ బాట పట్టారు. మహిళలే ఉద్యమం అయితే ఆ శక్తి ఎలా ఉంటుందో మరోసారి నిరూపించారు.నిద్రలేని రాత్రులుదిలావర్పూర్–గుండంపల్లి ఊళ్ల మధ్య ఇథనాల్ ఫ్యాక్టరీ పెడుతున్నారట అని తెలిసినప్పటి నుంచే మాలో ఆందోళన మొదలైంది. ఆ పరిశ్రమతో భవిష్యత్‌లో మా ఊళ్లు, పంటచేలు దెబ్బతింటాయని తెలిసినప్పటి నుంచి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం. మా పిల్లల భవిష్యత్తు కోసం ఇక ఏమైనా పర్వాలేదనే ముందుకు వచ్చాం.– కొమ్ముల శ్వేతారెడ్డి, గుండంపల్లిఅందరం ఒక్కటై...మన ఊళ్లు బాగుండాలని చేపట్టిన ఉద్యమంలో మనమంతా భాగం కావాలని మా గ్రామ మహిళలందరం నిర్ణయించుకున్నాం. ఇది ఏ ఒక్కరి కోసం చేసేది కాదని, మన ఊళ్లు, పిల్లలు బాగుండాలని చేస్తున్నామని చెబుతూ అందరూ ఇందులో భాగమయ్యేలా చేశాం.– ఆలూరు లక్ష్మి, దిలావర్పూర్రెండడుగులు వెనక్కి వేసి...తీవ్ర అస్వస్థతకు గురైన ఆర్డీవో రత్నకల్యాణిని ఎస్పీ జానకీశర్మ స్వయంగా రోప్‌పార్టీతో వెళ్లి బయటకు తీసుకువచ్చింది. దిలావర్పూర్లో తమపై రాళ్లు రువ్వుతున్నా. ఎక్కడా ఆవేశపడకుండా తమ బలగాలను శాంతియుతంగా నడిపింది. తాను వెనుకడుగు వేస్తూ ఉద్యమకారులకు దగ్గరైంది. చివరకు ‘ఎస్పీ జిందాబాద్’ అని అనిపించుకుంది.– రాసం శ్రీధర్, సాక్షి, నిర్మల్ -
అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలకు ‘ధరణి’ పవర్స్
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్‌కు వచ్చిన వివిధ కేటగిరీల పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో భాగంగా వాటికి తుది ఆమోదం తెలిపే అధికారాలను అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలకు కట్టబెడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను ప్రకటిస్తూ భూపరిపాలన విభాగం చీఫ్ కమిషనర్ (సీసీఎల్ఏ) నవీన్‌మిట్టల్ ఈ నెల 26న సర్క్యులర్ జారీచేశారు. ధరణి కమిటీ సిఫారసుల అమల్లో భాగంగా ఈ చర్యలు తీసుకున్నారు.అదనపు కలెక్టర్లకు 4 కొత్త అధికారాలు అదనపు కలెక్టర్లు(రెవెన్యూ) కొత్తగా ధరణి సాఫ్ట్‌వేర్‌లోని నాలుగు మాడ్యూల్స్‌కు తుది ఆమోదం తెలిపే అధికారం పొందనున్నారు. మ్యూటేషన్ దరఖాస్తులు(టీఎం3), పీపీబీ–కోర్టు కేసు(టీఎం24), ఇళ్లు/ఇంటి స్థలంగా పేరు ఉన్న సందర్భంలో పీపీబీ/నాలా కన్వర్షన్ జారీ(టీఎం31), పాస్‌బుక్‌లో తప్పుల దిద్దుబాటు/పేరు మార్పు(టీఎం33)కు సంబంధించిన దరఖాస్తులకు ఆయన స్థాయిలోనే పరిష్కరిస్తారు. ఈ ప్రక్రియకు సంబంధించిన విధివిధానా లను సైతం సీసీఎల్ఏ ప్రకటించింది. తొలుత తహసీల్దార్లు దరఖాస్తుదారులను విచారించి తమ ఆదేశాలను అప్లోడ్ చేయడం ద్వారా వారి దరఖాస్తులను ఆర్డీ ఓలకు పంపించాలి. ఆర్డీఓలు దరఖాస్తు లను పరిశీలించి తమ ఆదేశాలను అప్లోడ్ చేయడం ద్వారా అదనపు కలెక్టర్లకు ఫార్వ ర్డ్ చేయాలి. తహసీల్దార్/ఆర్డీఓ సిఫారసుల ఆధారంగా అదనపు కలెక్టర్లు దరఖాస్తులను ఆమోదించాలి లేదా తిరస్కరించాలి. ఒకవేళ దరఖాస్తులను తిరస్కరిస్తే అదనపు కలెక్టర్లు అందుకు సరైన కారణాలు తెలపాలి. ఆర్డీఓలకు మరిన్ని అధికారాలు..ఆర్డీఓలకు ఇప్పటికే ఉన్న ధరణి మాడ్యూల్ అధికారాలకు అదనంగా మరో నాలుగు మాడ్యూల్స్‌కు తుది ఆమోదం తెలిపే అధికారాన్ని ప్రభుత్వం కట్టబెట్టింది. అసైన్డ్ భూములతో సహా పట్టా భూముల వారసత్వ బదిలీ దరఖాస్తులు(టీఎం4), పెండింగ్ నాలా దరఖాస్తులు (టీఎం27), సర్వే నెంబర్ డిజిటల్ సైనింగ్(టీఎం 33), సర్వే నెంబర్ డిజిటల్ సైనింగ్(జీఎల్ఎం) దరఖాస్తులకు తుది ఆమోదం తెలిపే అధికారాన్ని వారికి కల్పించింది. గత ఫిబ్రవరి 28న ప్రకటించిన గడువుల్లోగానే దరఖాస్తులను పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లా కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకొని ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించింది. -
భూమి హక్కులకు ‘కొత్త చట్టం’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తులపై హక్కులను నమోదు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురానుంది. ఈ మేరకు ‘ది తెలంగాణ రికార్డ్ ఆఫ్ రైట్స్–2024’ పేరుతో రూపొందించిన ముసాయిదా బిల్లును ప్రజల ముందుకు తెచ్చింది. భూహక్కుల రికార్డులను ఎప్పటికప్పుడు సవరించడం, ఇప్పటివరకు పాస్‌బుక్‌లు రాని భూముల సమస్యలను పరిష్కరించడం, సర్వే చేసి కొత్తగా భూహ క్కుల రికార్డు తయారు చేసుకునే అధికారాన్ని కల్పించడమే ప్రధాన ఉద్దేశాలుగా ఈ చట్టాన్ని రూపొందిస్తున్నట్టు పేర్కొంది.రిజి్రస్టేషన్, మ్యుటేషన్, భూ ఆధార్, ఆబాదీలకు ప్రత్యేక హక్కుల రికార్డు, అప్పీల్, రివిజన్ వంటి సెక్షన్లను ముసాయి దా బిల్లులో ప్రతిపాదించారు. దీనిపై ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్నాక.. ప్రత్యేకంగా అసెంబ్లీ ని సమావేశపర్చి బిల్లుకు ఆమోదం తీసుకునే అవ కాశాలు ఉన్నాయని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. ⇒ భూమి హక్కుల బదలాయింపు కోసం 18 రకాల పద్ధతులు గుర్తించి.. వాటిలో ఏ రకంగా హక్కుల బదలాయింపు జరిగినా ‘రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్)’లో నమోదు చేయాల్సి ఉంటుంది. రిజిస్టర్డ్ దస్తావేజులు, వారసత్వం, భాగ పంపకాల ద్వారా హక్కుల బదలాయింపునకు పాత చట్టంలోని నిబంధనను కొనసాగించారు. ఈ పద్ధతుల్లో తహసీల్దారే రిజి్రస్టేషన్, మ్యుటేషన్ చేస్తారు. అయితే మ్యుటేషన్ చేసే సమయంలో విచారణ జరిపే వెసులుబాటు ఉంటుంది. ⇒ ఆ విచారణలో తప్పులేమైనా గుర్తిస్తే.. ఆయా కారణాలను వివరిస్తూ మ్యుటేషన్ నిలిపేయవచ్చు. ప్రస్తుత చట్టంలో ఈ అవకాశం లేదు. రిజిస్టర్డ్ దస్తావేజులు, భాగ పంపకాలు, వారసత్వ హక్కుల మ్యుటేషన్‌ను విచారించే అధికారం తహసీల్దార్లకు ఉంటుంది. మిగతా అంశాలకు సంబంధించి ఆర్డీవోకు అధికారం ఉంటుంది. ⇒ రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేసేటప్పుడు సర్వే మ్యాప్ తప్పనిసరి చేశారు. రిజిస్ట్రేషన్‌కు వెళ్లేవారు ఈ మ్యాప్‌ను తీసుకెళ్లాల్సి ఉంటుంది. భవిష్యత్తు వివాదాలకు చెక్ పెట్టేలా గతంలో లేని ఈ కొత్త నిబంధన తెస్తున్నారు. అయితే ప్రభుత్వం నిర్దేశించిన తేదీ తర్వాత (ఇందుకు అవసరమైన వ్యవస్థను తయారు చేసుకున్నాక) మాత్రమే ఈ మ్యాప్ తప్పనిసరి అవుతుందని బిల్లులో పొందుపరిచారు. ⇒ ఇప్పటికే తీసుకున్న సాదాబైనామా దరఖాస్తులను కొత్త చట్టం కింద చేసుకున్న దరఖాస్తులుగానే పరిగణించాలి. తద్వారా పెండింగ్‌లో ఉన్న 9.4లక్షల దరఖాస్తులు అలాగే కొనసాగుతాయి. వాటి పరిష్కార సమయంలో స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. అయితే కొత్తగా సాదాబైనామాల దరఖాస్తులను తీసుకుని పరిష్కరించే అధికారాన్ని ఈ బిల్లులో పొందుపరిచారు. కొత్త దరఖాస్తుల పరిష్కార సమయంలో మాత్రం స్టాంపు డ్యూటీ, రిజి్రస్టేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సాదాబైనామాల పరిష్కార అధికారం గతంలో కలెక్టర్లకు ఉండగా.. కొత్త చట్టంలో ఆర్డీవోలకు అధికారాలిచ్చారు. ⇒ ప్రతి భూకమతానికి తాత్కాలిక, శాశ్వత భూదార్ (ప్రత్యేక గుర్తింపు సంఖ్య) ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుత రికార్డులను పరిశీలించి తాత్కాలిక సంఖ్య ఇస్తారు. సర్వే తర్వాత శాశ్వత భూదార్ జారీ చేస్తారు. ఈ భూదార్‌కు సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తుంది. ⇒ కొత్తగా గ్రామీణ ప్రాంత ఇంటి స్థలాలకు (ఆబాదీ) కూడా ప్రత్యేక హక్కుల రికార్డు తయారు చేయాలని బిల్లులో పొందుపరిచారు. భూదార్తోపాటు ఈ ఆబాదీల ఆర్వోఆర్కు అవసరమైన నిధులు కేంద్రం నుంచి తెచ్చుకోవచ్చు. గత చట్టంలో ఆర్వోఆర్ రికార్డుకు, గ్రామ పహాణీకి సంబంధం ఉండేదికాదు. ఈ కొత్త చట్టంలో.. హక్కుల బదలాయింపు జరగ్గానే గ్రామ పహాణీలో ఆ హక్కుల రికార్డును నమోదు చేసేలా నిబంధన విధించారు. ⇒ తహసీల్దార్లు, ఆర్డీవోలు చేసే రిజి్రస్టేషన్లు, మ్యుటేషన్లకు సంబంధించి వివాదాలు వస్తే.. అప్పీల్, రివిజన్‌కు కొత్త చట్టం అవకాశం ఇవ్వనుంది. కలెక్టర్లు లేదా అడిషనల్ కలెక్టర్లకు అప్పీల్ చేసుకోవచ్చు. తర్వాత సీసీఎల్ఏకు సెకండ్ అప్పీల్ చేసుకోవచ్చు. ఇది పాత చట్టంలో లేదు. ⇒ రివిజన్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం లేదా సీసీఎల్ఏ మాత్రమే చేయాలని బిల్లులో పొందుపరిచారు. గతంలో జాయింట్ కలెక్టర్లకు ఉన్న రివిజన్ అధికారాలను ఇప్పుడు సీసీఎల్ఏకు దఖలు పర్చారు. ఏదైనా రికార్డులో తప్పు జరిగిందని భావిస్తే.. సుమోటోగా తీసుకుని కూడా పరిష్కరించవచ్చు. అయితే అడిషనల్ కలెక్టర్ స్థాయి నుంచి ప్రభుత్వం వరకు అప్పీల్ లేదా రివిజన్లలో ఏ నిర్ణయం తీసుకున్నా లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వడాన్ని తప్పనిసరి చేశారు.2020 చట్టంలో ఈ అంశం లేదని.. కొత్త చట్టం అమల్లోకి వస్తే భూమి హక్కుల రికార్డుల వివాదాలన్నీ అప్పీలు, రివిజన్లతోనే పరిష్కారమవుతాయని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. యాజమాన్య హక్కుల వివాదాలు, భాగపంపకాల విషయంలో వివాదాలున్నప్పుడు మాత్రమే కోర్టులకు వెళ్లాల్సి ఉంటుందని, తద్వారా కోర్టులపై భారం తగ్గుతుందని అంటున్నాయి. రూపకల్పన కోసం విస్తృత కసరత్తు ‘రికార్డ్ ఆఫ్ రైట్స్–2024 చట్టం’è ముసాయిదా బిల్లు రూపకల్పన కోసం రెవెన్యూ వర్గాలు విస్తృతస్థాయిలో కసరత్తు చేశాయి. తెలంగాణలో ఇప్పటివరకు అమలైన 1936, 1948, 1971, 2020 నాటి చట్టాలను పరిశీలించి.. వాటి అమలు వల్ల వచి్చన ఫలితాలను బేరీజు వేసి కొత్త చట్టాన్ని రూపొందించారు. తెలంగాణలో ఆర్వోఆర్ చట్టాల అమలు చరిత్ర, ప్రస్తుత సమస్యలు, రాబోయే అవసరాలను అంచనా వేసి 20 సెక్షన్లతో ముసాయిదాను సిద్ధం చేశారు.ఈ క్రమంలో 18 రాష్ట్రాల్లోని ఆర్వోఆర్ చట్టాలను పరిశీలించడంతోపాటు బిహార్‌లో అమల్లో ఉన్న మ్యుటేషన్ చట్టాన్ని కూడా అధ్యయనం చేశారు. భూములకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య (భూదార్), గ్రామీణ ప్రాంత ఆస్తుల రికార్డు తయారు చేయడం ద్వారా.. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు అవసరమైన వెసులుబాటును కలి్పంచనున్నారు. ముసాయిదా రూపకల్పనలో భూచట్టాల నిపుణుడు ఎం.సునీల్‌కుమార్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, సీఎంఆర్వో పీడీ వి.లచి్చరెడ్డి కీలకపాత్ర పోషించారు. ప్రజల సలహాలు, సూచనలకు అవకాశం ఈ ముసాయిదా బిల్లుపై రాష్ట్ర ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటామని రెవెన్యూ శాఖ వెల్లడించింది. సీసీఎల్ఏ వెబ్సైట్ ( ccla.telan gana.gov.in ) లో ఈ బిల్లును అందుబాటులో ఉంచుతున్నామని.. ఈ నెల 2వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ప్రభుత్వానికి అభిప్రాయాలు తెలియజేయాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్ ఒక ప్రకటనలో కోరారు. ప్రజలు తమ సలహాలు, సూచనలను ror2024-rev@telangana.gov.in కు ఈ–మెయిల్ ద్వారా పంపవచ్చని.. లేదా ల్యాండ్ లీగల్ సెల్, సీసీఎల్ఏ కార్యాలయం, నాంపల్లి స్టేషన్‌రోడ్, అన్నపూర్ణ హోటల్ ఎదురుగా, అబిడ్స్, హైదరాబాద్–500001కు పోస్టు ద్వారా పంపవచ్చని వెల్లడించారు. -
ప్రభుత్వ భూమిని రక్షించడం కోసమే పెన్సింగ్:ఆర్డీవో
-
గీతం యూనివర్సిటీలో మొత్తం 40 ఎకరాలు ఆక్రమణ: ఆర్డీవో
-
దిన్నెమీద గంగమ్మ లేఅవుట్ పరిశీలన
పీలేరు : మండలంలోని కాకులారంపల్లె పంచాయతీ దిన్నెమీద గంగమ్మ లేఅవుట్‌ను రాయచోటి ఆర్డీఓ రంగస్వామి పరిశీలించారు. దిన్నెమీద గంగమ్మ లేఅవుట్ జగనన్న కాలనీ, ఆటో నగర్లో ఆక్ర మణలు జరిగినట్లు కొత్తపల్లెకు చెందిన దేవేంద్రరెడ్డి స్పందనలో ఫిర్యాదు చేశాడు. దీంతో గురువారం ఆర్డీఓ దిన్నెమీద గంగమ్మ లేఅవుట్‌ను ఆటో నగర్‌లోని స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ఆక్రమణలకు పాల్పడితే ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఇది వరకే దిన్నెమీద గంగమ్మ లేఅవుట్లో నిబంధనలకు విరుద్ధంగా ఇంటి నిర్మాణాలు చేపట్టిన నేపథ్యంలో వీఆర్వో హేమంత్ నాయక్, ఇంజినీరింగ్ అసిస్టెంట్ ఆసిఫ్‌ను విధుల నుంచి తొలగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్డీఓ స్థలాలను పరిశీలించారు. అలాగే మండలంలో ల్యాండ్ కన్వర్షన్ స్థలాలు పరిశీలించారు. పీలేరు పంచాయతీ సర్వే నెంబరు 42లో 3.60 ఎకరాలు, ముడుపులవేములలో సర్వే నెంబరు 405/3లో ఒక ఎకరా, బోడుమల్లువారిపల్లెలో సర్వే నెంబరు 731లో ఒక ఎకరా, 715లో రెండు ఎకరాలు, 711లో 90 సెంట్లు, 636లో 83 సెంట్లు, 639లో 1.84 ఎకరాలకు సంబంధించి ల్యాండ్ కన్వర్షన్‌కు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రవి, ఆర్ఐలు రాజశేఖర్, భార్గవి, సర్వేయర్ దేవి పాల్గొన్నారు. -
Rapthadu: ఆర్టీఓగా ఎంపికైన రైతు బిడ్డ
రాప్తాడు (అనంతపురం): మండలంలోని రైతు బిడ్డ గ్రూప్–1లో ప్రతిభ చూపి ఆర్టీఓ పోస్టుకు ఎంపికయ్యారు. వివరాలు.. బుక్కచెర్లకు చెందిన రైతు గొర్ల సూర్యనారాయణరెడ్డి, సరోజ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమారై గొర్ల మనీషా గ్రూప్–1లో సత్తా చాటి ఆర్టీఓగా ఎంపికయ్యారు. కాగా, ఆమె ప్రాథమిక విద్యాభ్యాసం రాప్తాడు మండలంలోని ఎల్లార్జీ స్కూల్లో జరిగింది. 6 నుంచి 10వ తరగతి వరకూ అనంతపురంలోని సీవీఆర్ మెమోరియల్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో చదివారు. విజయవాడ శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్, హైదరాబాద్‌లోని ఐఏఎస్ అకాడమీలో బీఏ పూర్తి చేశారు. ఈ క్రమంలోనే 2018లో గ్రూప్–1 పరీక్ష రాశారు. ఈ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈ సందర్భంగా మనీషా మాట్లాడుతూ.. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన తాను ఈ స్థాయికి ఎదగడం వెనుక తల్లిదండ్రుల శ్రమ దాగి ఉందన్నారు. అమ్మ, నాన్న కోరిక మేరకు సివిల్స్‌కు సిద్ధమవుతున్నట్లు చెప్పారు. చదవండి: (ఆర్బీకే ఓ అద్భుతం!) -
హార్సిలీహిల్స్‌లో భూ ఆక్రమణలపై ఉక్కుపాదం
బి.కొత్తకోట: అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌లో రెవెన్యూ భూ ఆక్రమణలపై మదనపల్లె ఆర్డీఓ ఎంఎస్.మురళీ ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా గురువారం తహసీల్దార్ కీతలం ధనుంజయలు, ఎంపీడీఓ శంకరయ్య, డీఎల్పీఓ లక్ష్మీ, ఏఈ సంతోష్‌గౌడ్‌లతో సమావేశమయ్యారు. ఇక్కడి పరిస్థితులపై సమీక్షించారు. అనంతరం టూరిజం అసిస్డెంట్ మేనేజర్ నేదురుమల్లి సాల్వీన్‌రెడ్డి, అధికారులతో కలిసి కొండపై ప్రతి నిర్మాణాన్ని, ఆక్రమిత స్థలాలను స్వయంగా పరిశీలించారు. బీఎస్ఎన్ఎల్ ప్రాంగణానికి తాళం కొండపై బీఎస్ఎన్ఎల్ టవర్ నిర్వహణ కోసం రెవెన్యూ అధికారులు భూమిని కేటాయించారు. ఈ భవనాన్ని ప్రయివేటు వ్యక్తులకు లీజుకు అప్పగించడంతో ఇక్కడ అనుమతి లేకుండా నిర్మాణాలు, పాత భవనాన్ని ఆధునికీకరించడం, ఖాళీ స్థలంలో కొత్తగా నిర్మాణాలు, అతిథిగృహలను నిర్మించారు. వీటిని పరిశీలించిన ఆర్డీఓ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనిఖీ సమయంలో అక్కడ పనులు జరుగుతుండటంతో ఆధునికీకరణకు, అతిథిగృహల నిర్మాణాలకు ఎవరి అనుమతి పొందారు, లీజు నిబంధనలు ఏమిటి, దేన్ని లీజుకు ఇచ్చారు అని ప్రశ్నల వర్షం కురిపించారు. వీటికి అనుమతి ఉందని అక్కడివారు చెప్పడంతో పత్రాలతో కార్యాలయానికి రావాలని అంతవరకు పనులు నిలిపివేసి తాళం వేయాలని ఆర్డీఓ ఆదేశించగా గేటుకు తాళం వేశారు. బీఎస్ఎన్ఎల్కు కేటాయించిన రెవెన్యూ భూమి కేటాయింపును రద్దు చేసి స్వాధీనం చేసుకుంటామని ఆర్డీఓ ప్రకటించారు. కొండపై కోర్టుకేసులు నడుస్తున్న వివాదాస్పద భూముల్లో జరిగిన భారీ నిర్మాణాలను ఆర్డీఓ పరిశీలించారు. వీరు నిర్మాణాలు చేసుకోవడమేకాక రోడ్డును అక్రమించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు విస్తీర్ణం గుర్తించేందుకు తక్షణం సర్వే నిర్వహించి మార్కింగ్ ఇవ్వాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. కొండపై రెవెన్యూ స్థలాలను ఆక్రమించుకొని వాణిజ్య, గృహ నిర్మాణాలు చేసుకొన్న వారితో ఆర్డీఓ మాట్లాడారు. ప్రతిఒక్కరి వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు. మీరు నిర్మించుకున్న నిర్మాణాలకు స్థలాన్ని ఎవరు కేటాయించారు, ఎవరి అనుమతి పొందారని ప్రశ్నించారు. కొండపై రెవెన్యూ భూమిని ప్రయివేటు సంస్థలకుకాని, వ్యక్తులకు కాని కేటాయించలేదు. అలాంటప్పుడు ఎలా ఇంటి నిర్మాణాలు చేశారని ప్రశ్నిస్తూ..ఇకపై గృహలు, దుకాణాలు హార్సిలీహిల్స్ టౌన్షిప్ కమిటీకి చెందుతాయని, ఎవరైనా ఇక్కడ ఉండాలంటే అద్దెలు చెల్లించాలని కోరారు. విద్యుత్ కనెక్షన్లు ఎలా ఇచ్చారు రెవెన్యూ స్థలాల్లో అక్రమంగా ఇళ్లు నిర్మించుకొన్న వారికి డిస్కం అధికారులు ఏ హక్కు పత్రాలతో విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారని ఆర్డీఓ మురళీ విస్మయం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై డిస్కం అధికారులతో సమావేశం నిర్వహించి కనెక్షన్లను టౌన్షిప్ కమిటీ పేరుపై బదిలీ చేయిస్తామని చెప్పారు. కొండపై ఇటుక పేర్చాలన్నా, కదిలించాలన్నా టౌన్షిప్ కమిటీ అనుమతి తప్పనిసరని, ఉల్లంఘించిన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొండపై ప్రభుత్వశాఖలకు కేటాయించిన భూములు, వాటి స్థితిగతులు, అసంపూర్తి క్రీడా ప్రాంగణ నిర్మాణ పనులను పరిశీలించారు. -
కొత్త డివిజన్లకు ఆర్డీవోల నియామకం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 47 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యుటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేస్తూ కొత్త రెవెన్యూ డివిజన్లకు ఆర్డీవోలుగా నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. 21 కొత్త రెవెన్యూ డివిజన్లకు ఆర్డీవోల నియామకం కోసం పలువురిని బదిలీ చేశారు. కొత్తగా ఏర్పాటైన రెవెన్యూ డివిజన్లలో సోమవారం నుంచి పరిపాలన ప్రారంభం కానుంది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా జేసీ (ఆసరా–సంక్షేమం)గా పని చేస్తున్న కె. శ్రీరాములు నాయుడును సహకార శాఖ (సొంత శాఖ)కు బదిలీ చేశారు. ప్రస్తుతం కర్నూలు జిల్లా జేసీ (ఆసరా–సంక్షేమం)గా పనిచేస్తున్న ఎం.కె.వి. శ్రీనివాసులును వ్యవసాయ, సహకార శాఖ (సొంత శాఖ)కు బదిలీ చేశారు. ఆర్డీవోల బదిలీలు ఇలా ఉన్నాయి. -
కర్ణాటక రోడ్డు ప్రమాదం: గాడిదలు కాస్తున్నారా! ఆర్టీఓ అధికారులపై ఎంపీ ఆగ్రహం..
సాక్షి, చింతామణి (కర్ణాటక): తాలూకాలోని మరినాయకనహళ్లి క్రాస్ దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి చెందిన ఘటనపై ఎంపీ మునిస్వామి అధికారులపై నిప్పులు చెరిగారు. సోమవారం ఉదయం ఆయన చింతామణి ఆస్పత్రిలో మృతదేహాలకు నివాళులర్పించిన అనంతరం ఆర్టీఓ అధికారులను అక్కడికే పిలిపించారు. వారిని చూడగానే ఎంపీ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. విధులు నిర్వహించకుండా గాడిదలు కాస్తున్నారా... చేతకాకపోతే రాజీనామా చేసి వెళ్లిపోండి అంటూ తీవ్రవ్యాఖ్యలు చేశారు. అక్రమంగా నడుపుతున్న వాహనాలను సీజ్ చేయకపోవడంతోనే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. అంతకు ముందు ఆయన మృతుల కుటుంబాలకు రూ. లక్ష అందించారు. ఎంపీ వెంట డీఎస్పీ లక్ష్మయ్య, తహశీల్దార్ హనుమంత రాయప్ప తదితరులు ఉన్నారు. చదవండి: ఏడు రోజుల్లో పెళ్లి.. బండరాయితో కొట్టుకొని పెళ్లి కొడుకు ఆత్మహత్య -
ఇటు నుంచి ఇటే జైలుకు పంపేవాళ్లం
సాక్షి, హైదరాబాద్: ఓ భూ వివాదానికి సంబంధించి సింగిల్ జడ్జి ఉత్తర్వులను అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంగారెడ్డి అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీవో ఎస్.శ్రీను, తహసీల్దార్ యు.ఉమాదేవిలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ పిటిషన్లపై అప్పీల్ దాఖలు చేసిన కేసుల్లో సదరు అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించినా ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించింది. ఈ రోజు విచారణకు హాజరై ఉంటే.. ఇటు నుంచి ఇటే ఈ ముగ్గురిని జైలుకు పంపేవాళ్లమని హెచ్చరించింది. ఓ భూ వివాదం వ్యవహారంలో ఈ ముగ్గురు అధికారులకు 2 నెలల జైలు, రూ.2 వేలు జరిమానా విధిస్తూ 2020 డిసెంబర్ 15న సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన అప్పీళ్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా సదరు అధికారులు హాజరయ్యారా అని ధర్మాసనం ప్రశ్నించగా.. లేదని ప్రభుత్వ న్యాయవాది చెప్ప డంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘సింగిల్ జడ్జి ఆదేశాల్లో లోపం ఎక్కడ ఉందో చెప్పకుండా ఆదేశాలను అమలు చేయలే దు. పైగా కోర్టు ఆదేశాలను తమకు అనుకూలంగా మల్చుకు నే ప్రయత్నం చేశారు. పిటిషనర్లకు పట్టాదార్ పాస్‌పుస్తకాలు ఇవ్వాలని ఆదేశించినా.. ఇవ్వకపోగా రుజువు చేయకుండా పిటిషనర్ ఆక్రమణదారుడు అని ఎలా అంటారు? సింగిల్ జడ్జి ఉత్తర్వులపై అభ్యంతరముంటే ఆ ఉత్తర్వులను ఎత్తేయా లని కోరాలి. ఇవేమీ చేయకుండా నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ చేయాల్సిందంతా చేసి బేషరతు క్షమాపణలు కోరితే అంగీకరించం’అని కోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణకు ఈ ముగ్గురు అధికారులు హాజరుకావాలని స్పష్టం చేస్తూ విచారణను ఏప్రిల్ 7కు వాయిదా వేసింది. సింగిల్ జడ్జి ఏమన్నారంటే.. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఈజె డేవిడ్.. ఎనిమిదేళ్ల క్రితం సంగారెడ్డి రెడ్డి జిల్లా కంది సమీపంలోని చిమ్నాపూర్‌లో ఐదెకరాల భూమిని కొనుగోలు చేశారు. ఈ భూమికి పట్టాదార్ పాస్‌బుక్ ఇవ్వాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా.. అది ప్రభుత్వ భూమి అని రెవెన్యూ అధికారులు అభ్యర్థనను తిరస్కరించారు. దీంతో డేవిడ్ హైకోర్టును ఆశ్రయించగా.. రెవెన్యూ అధికారులు పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని సింగిల్ జడ్జి ఆదేశించారు. అయితే.. ఈ భూమికి సంబంధించి విలేజ్ మ్యాప్, టిప్పన్, వసూల్ బక్వాయి, సేత్వా ర్ తదితర రికార్డులు లేవని, ఇవి ‘ఖిల్లాదాఖ్లా’భూములంటూ డేవిడ్ దరఖాస్తును తహసీల్దార్ తిరస్కరించారు. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ ఆర్డీవో, తర్వాత అదనపు కలెక్టర్ ముందు అప్పీల్ దాఖలు చేయగా.. తహసీల్దార్ ఆదేశాలను సమర్థిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ నేపథ్యంలో కోర్టు ధిక్కరణ కింద డేవిడ్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సింగిల్ జడ్జి జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు.. అధికారులు ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారంటూ ముగ్గురికి రెండు నెలల జైలు, రూ.2 వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. -
సిద్దిపేట కలెక్టర్‌కు జైలు శిక్ష
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు మంగళవారం సంచలన తీర్పు వెల్లడించింది. ఇద్దరు కలెక్టర్లు, ఆర్డీవోకు కోర్టు ధిక్కరణ నేరం కింద జైలు శిక్ష విధించింది. ఈ అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణలో కోర్టు ఆదేశాలు పాటించలేదని కోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో హైకోర్టు సిద్ధిపేట కలెక్టర్ పి.వెంకట్రామిరెడ్డికి 3 నెలల జైలు శిక్ష, రెండు వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. అలానే పిటిషనర్‌కు 25వేల రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. సిద్దిపేట కలెక్టర్‌తో పాటు రాజన్న సిరిసిల్ల కలెక్టర్ కృష్ణభాస్కర్‌కు రెండు వేల రూపాయల జరిమానా.. ఆర్డీఓ జయచంద్రారెడ్డికి 4 నెలల జైలు, రెండు వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. ఈ అధికారులు ముగ్గురు ఉద్దేశపూర్వకంగా కోర్టు ఉత్తర్వులు ధిక్కరించారని అభిప్రాయపడింది. అప్పీలుకు వెళ్లేందుకు 6 వారాల పాటు తీర్పు నిలిపివేస్తూ హై కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై హైకోర్టులో పిల్ దాఖలు -
డబ్బు అంటే కార్పొరేటర్‌కు కూడా చేదు కాదు కదా!
ఫెర్టిలైజర్‌సిటీ (రామగుండం): ‘‘మీరు డబ్బులు తీసుకుని ఓటేశారు.. అందుకు కార్పొరేటర్ పని చేయమంటే ఇప్పుడు డబ్బులు అడుగుతున్నడు..’’ఇదీ పింఛన్ ఇప్పించండి సారూ..అంటూ వేడుకున్న ఓ వృద్ధురాలికి ఆర్డీవో ఇచ్చిన సమాధానం. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ 39వ డివిజన్లోని మాతంగి కాలనీకి మంగళవారం పెద్దపల్లి ఆర్డీవో శంకర్‌కుమార్ భూములపై విచారణకోసం వచ్చారు. ఈ సమయంలో ఓ వృద్ధురాలు పింఛన్ ఇప్పించాలని ఆర్డీవోను వేడుకుంది. అక్కడే ఉన్న మరో మహిళ మాట్లాడుతూ.. కార్పొరేటర్‌ను అడిగితే రూ.2 వేలు లంచం అడుగుతున్నాడని తెలిపింది. దీంతో ‘మీరు ఓటు వేసేటప్పుడు డబ్బులు తీసుకోలేదా’ అని ఆర్డీవో ప్రశ్నించారు. ‘మేము అడగలేదు, వాళ్లే ఇచ్చి వెళ్లారు.. డబ్బులంటే ఎవరికి చేదు సారు.. కూలీ చేసుకుని బతికేటోళ్లం.. అందుకే పైసలు తీసుకున్నం’ అని ఆ మహిళ బదులిచ్చింది. ‘మీరు డబ్బులు తీసుకుని ఓటు వేశారు.. అందుకు కార్పొరేటర్ ఇప్పుడు పని చేయమంటే డబ్బులు అడుగుతున్నడు.. డబ్బు అంటే కార్పొరేటర్‌కు కూడా చేదు కాదు కదా’ అని ఆర్డీవో వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వీడియో స్థానికంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ అంశంపై ఆర్డీవో స్పందిస్తూ ‘డబ్బులు తీసుకుని ఓటేసినందుకు ప్రశ్నించే హక్కుని కోల్పోయారు..’అని వారికి తెలియజేశానని అన్నారు. -
ఆర్డీవో నరేందర్ ఆచూకీ ఎక్కడ!
సాక్షి, కామారెడ్డి: ఇటీవల సస్పెండ్ అయిన కామారెడ్డి ఆర్డీవో నరేందర్ వారం రోజులుగా కనిపించడం లేదు. ఆయనపై క్రిమినల్ కేసు నమోదు కావడంతో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తునట్లు తెలిసింది. సంగారెడ్డి జిల్లాలో తహసీల్దార్‌గా పనిచేసిన సమయంలో జిన్నారం మండలం కాజిపల్లిలో మాజీ సైనికుల పేర భూమి కేటాయించిన విషయంలో అక్రమాలకు పాల్పడినట్టు నరేందర్‌పై ఆరోపణలున్నాయి. దీంతో ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకుంది. సస్పెండ్ చేయడంతోపాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసింది. దీంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రస్థాయిలో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో సన్నిహిత సంబంధాలు ఉండడంతో ఆయన అరెస్ట్కాకుండా ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. (అడిషనల్ కలెక్టర్ 'నగేష్' కేసులో మహిళ పాత్ర) ఆరోపణల వెల్లువ.. సంగారెడ్డి జిల్లాలో భూ అక్రమాల్లో సస్పెండ్ అయిన తరువాత నరేందర్‌పై ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కామారెడ్డి ఆర్డీవోగా ఆయన మూడు నెలలు పనిచేశారు. ఈ మూడు నెలల్లోనే పలు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. భిక్కనూరు మండలం జంగంపల్లి, బస్వాపూర్ గ్రామాల పరిధిలో పలు భూ వివాదాల్లో తలదూర్చినట్లు సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా జంగంపల్లి శివారులో ప్రభుత్వ భూములను నిబంధనలను విరుద్ధంగా కట్టబెట్టే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. గతంలో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్‌గా కామారెడ్డి ప్రాంతంలో చాలా కాలం పనిచేసిన నరేందర్‌కు ఇక్కడి భూములపై పూర్తి అవగాహన ఉంది. దీంతో ఆయన ఆర్డీవోగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజు నుంచే భూ వివాదాల్లో తలదూర్చారని ఆరోపణలు వస్తున్నాయి. (ఆ ముగ్గురు ఎక్కడ?..) -
అక్కడ లాక్డౌన్ ఆంక్షలు కఠినం
సాక్షి, కృష్ణా : మచిలీపట్నంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో లాక్డౌన్ ఆంక్షలు కఠినతరం చేస్తున్నట్లు గురువారం ఆర్డీఓ ఖాజావలీ పేర్కొన్నారు. రేపటి (గురువారం) నుంచి మచిలీపట్నంలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకే దుకాణాలకు అనుమతి ఇస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్ సమావేశంలో ఆర్డీఓ తెలిపారు. రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు పూర్తి స్థాయి కర్ఫ్యూ విధిస్తున్నట్లు వెల్లడించారు. మూడు స్థంభాల సెంటర్లో చెక్‌పోస్టునును మరింత పటిష్టంగా నిర్వహిస్తామన్నారు. (ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రికి కరోనా పాజిటివ్ ) కర్ఫ్యూను పకడ్బందీగా నిర్వహిస్తామని, ఎవరు రోడ్డు మీదకు వచ్చినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. డివిజన్లో కేసులు 54కు చేరాయి. కేవలం మచిలీపట్నం నియోజకవర్గంలోనే అత్యధికంగా 40 కేసులు నమోదయ్యాయి. కార్పొరేషన్లో 29, రూరల్‌లో 11 కేసులు నమోదు కాగా తాజాగా బుధవారం ఒక్క రోజులోనే 13 కేసులు నమోదు అయ్యాయి. మచిలీపట్నం రూరల్ మాలకాయలంకలో 4, ఉల్లిపాలెంలో 2, మంగినపూడిలో 1, నిజాంపేటలో 3, సర్కారుతోటలో 2, జవ్వారుపేటలో 1 కేసులు వెలుగు చూశాయి. (వైద్యులకు పూర్తి వేతనాలు: సుప్రీంకోర్టు) -
ఆర్డీఓ సంతకం ఫోర్జరీ.. నాయబ్ తహసీల్దార్ రిమాండు
సాక్షి, కందుకూరు: ఆర్డీఓ సంతకం ఫోర్జరీ కేసులో నాయబ్ తహసీల్దార్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ జంగయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మహేశ్వరం మండలం తుమ్మలూరుకు చెందిన కావలి వెంకటయ్య, యశోద దంపతులకు సర్వే నంబర్ 239, 240, 250, 251లో 40 ఎకరాల భూమి ఉంది. సదరు భూమి వివాదంలో ఉండటంతో పాటు కోర్టులో కేసు నడుస్తోంది. భూమి ఇనాం పట్టాకు సంబంధించినది కావడంతో ఓఆర్సీ తీసుకోవాల్సి ఉంది. దీంతో యాచారం మండలానికి చెందిన కేశమోని వెంకటయ్య, నోములకు చెందిన బుట్టి బాలరాజు కలిసి వెంకటయ్య, యశోద దంపతుల అనుమతితో మాడ్గుల మండలం నాయబ్ తహసీల్దార్ ఈసన్నగారి శ్రీనివాస్(42) సహకారంతో ఓఆర్సీ పత్రాలను ఆర్డీఓ సంతకంతో ఫోర్జరీ చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న కందుకూరు ఆర్డీఓ రవీందర్‌రెడ్డి సెప్టెంబర్ 11న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు 14న కేశమోని వెంకటయ్య, బుట్టి బాలరాజు, వెంకటయ్య, యశోదను అరెస్టు చేశారు. గురువారం నాయబ్ తహసీల్దార్‌ను రిమాండుకు పంపారు. -
ఆర్డీఓ సంతకం ఫోర్జరీ..
సాక్షి, నెల్లికుదురు: తొర్రూర్ ఆర్డీఓ తాటిపల్లి ఈశ్వరయ్య సంతకం ఫోర్జరీ చేసిన కేసులో కొండపల్లి కిరణ్‌కుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్ పంపించినట్లు తొర్రూర్ సీఐ వి.చేరాలు తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బుధవారం నెల్లికుదురు ఎస్సై పెండ్యాల దేవేందర్‌తో కలసి విలేకరులకు వివరాలు వెల్లడించారు. వారి కథనం ప్రకారం.. ఇసుక అక్రమంగా రవాణా చేసేందుకు తన సంతకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఫోర్జరీ చేసినట్లు తొర్రూర్ ఆర్డీఓ తాటిపల్లి ఈశ్వరయ్య ఆగస్టు 19న నెల్లికుదురు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన నెల్లికుదురు ఎస్సై దర్యాప్తు ప్రారంభించారు. మండలంలోని బ్రాహ్మణకొత్తపల్లి గ్రామానికి చెందిన మాజీ వీఆర్ఓ కొండపల్లి నర్శింగరావు కుమారుడు కొండపల్లి కిరణ్‌కుమార్ నెల్లికుదురు తహసీల్దార్ అనిశెట్టి పున్నంచందర్‌తో కుమ్మక్కై ఆర్డీఓ సంతకాలు ఫోర్జరీ చేశారు. ఇసుక రవాణాకు ఆర్డీఓ ప్రొసీడింగ్స్ ఇచ్చినట్లు ట్రాక్టర్ యజమానుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి ఇసుక కూపన్లు సరఫరా చేశారు. ఈ తతంగం ఈ ఏడాది జనవరి నుంచి కొనసాగుతున్నట్లు విచారణలో వెల్లడైంది. నిందితుడు ఏ1 కొండపల్లి కిరణ్ కుమార్‌ను ఈనెల 1న రాత్రి అరెస్టుచేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. అయితే ఏ2 నిందితుడు నెల్లికుదురు తహసీల్దార్ అనిశెట్టి పున్నంచందర్ పరారీలో ఉన్నట్లు సీఐ చేరాలు తెలిపారు. వెలుగు చూసింది ఇలా.. బ్రాహ్మణకొత్తపల్లికి చెందిన కొండపల్లి నర్సింగరావు నెల్లికుదురు తహసీల్ కార్యాలయం ఏర్పాటైన కొద్ది సంవత్సరాలు వీర్‌ఓగా పనిచేశాడు. 2009లో నర్సింగరావుకు ఆరోగ్యం సహకరించకపోవడంతో అతడి కుమారుడు కిరణ్‌కుమార్ రెవెన్యూ అధికారులతో కుమ్మకై తండ్రి స్థానంలో వీఆర్ఓగా చేరాడు. బ్రాహ్మణకొత్తపల్లితో పాటు మధనతుర్తితో పనిచేశాడు. 2010లో బ్రాహ్మణకొత్తపల్లికి ప్రభుత్వం పంటల నష్టం కింద గ్రామానికి మంజూరు చేసిన సుమారు రూ.80వేలు తన ఒక కుటుంబానికే వాడుకుని అక్రమాలకు పాల్పడ్డాడు. ఈ విషయమై గ్రామస్తులు అప్పటి ట్రెయినీ కలెక్టర్ అంబేడ్కర్‌కు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టి కొండపల్లి నర్సింగరావును వీఆర్ఓ పోస్టు నుంచి సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నెల్లికుదురు తహసీల్దార్ కార్యాలయంలో కిరణ్‌కుమార్ హవా కొనసాగుతూనే ఉందని.. ఎట్టకేలకు పాపం పడిందని ప్రజలు అనుకుంటున్నారు. -
తెనాలి ఆర్డీవో ఆదర్శం
సాక్షి, తెనాలి: విద్యార్థుల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని నలుగురికీ చెప్పడానికే పరిమితం కాకుండా తన కుమారుడిని సర్కారీ బడిలో చేర్చి స్ఫూర్తిదాయకంగా నిలిచారు తెనాలి ఆర్డీవో చెరుకూరి రంగయ్య. పాఠశాలలు పునఃప్రారంభమైన తరుణంలో రంగయ్య తన కుమారుడు సిద్ధార్థను స్థానిక కొత్తపేటలోని రావి రంగయ్య మున్సిపల్ ఉన్నత పాఠశాలలో చేర్చారు. గత ఏడాది వరకు సిద్ధార్థ కార్పొరేట్ పాఠశాలలో చదివాడు. కుమారుణ్ణి ప్రభుత్వ పాఠశాలలో చేర్పిండానికి కారణమేమిటనే విషయమై ఆర్డీవోను ఫోన్లో సంప్రదించగా.. ప్రభుత్వ విద్యారంగం బలోపేతం కావాలనే ఉద్దేశంతో చేర్చానని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా బోధన బాగుంటుందని అన్నారు. ప్రధానోపాధ్యాయుడు వెలగా శరత్‌బాబు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన, వసతులు బాగున్నాయన్నారు. ఈ విషయాన్ని అందరూ ఇప్పటికే గుర్తించారన్నారు. (చదవండి: ఒక టీచర్.. ఒక కలెక్టర్.. ఒక మంచి పని..) -
కేసీఆర్ సంతకం ఫోర్జరీ
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి రూ.90 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని మ్యుటేషన్ చేయాలని దరఖాస్తు చేసిన ముగ్గురు నిందితులను రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. మ్యుటేషన్ ప్రక్రియ సందర్భంగా అధికారులకు అనుమానం రావడంతో.. ధ్రువీకరించుకునేందుకు సీఎంవోను సంప్రదించగా ఈ కుట్ర వ్యవహారం బట్టబయలైంది. దీంతో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరికి సహకరించిన మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ కేసును విచారిస్తున్న క్రమంలోనే హైదరాబాద్ పోలీసు కమిషనర్‌కు, మెట్రో రైల్ ఎండీకి కూడా వేర్వేరు సందర్భాల్లో ఇలాంటి లేఖలు రాసిన విషయం వెలుగులోకి వచ్చింది. అయితే వీటిపై పూర్తి వివరాలేవీ వెల్లడికాలేదు. శనివారం గచ్చిబౌలిలోని మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ ఎ.వెంకటేశ్వర్ రావు కేసు వివరాలు వెల్లడించారు. ఈ సమావేశంలో మాదాపూర్ ఏసీపీ శ్యామ్‌ప్రసాద్ రావు, రాయయదుర్గం సీఐ ఎస్.రవిందర్, ఎస్ఐలు మురళీధర్, అన్వేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాంపల్లి దారుస్సలాంకు చెందిన కోల్డ్ స్టోరేజ్ వ్యాపారి మహ్మద్ ఉస్మాన్ ఖురేషి (50) గచ్చిబౌలి సర్వే నంబర్ 44/పీలో 2.02 ఎకరాల స్థలాన్ని గోల్కొండకు చెందిన రజియా సుల్తానా నుంచి కొనుగోలు చేసేందుకు అగ్రిమెంట్ చేసుకున్నాడు. అయితే ఈ అగ్రిమెంట్ పత్రాలు సరైనవా కాదా? అసలు భూమి రజియా సుల్తానా పేరుతోనే ఉందా అనే విషయంపైనా స్పష్టత లేదు. 1954నాటి పహాణీల్లో చాలా మంది పేర్లతో ఇనాం భూముల వివరాలున్నప్పటికీ.. సీలింగ్ యాక్ట్ అమల్లోకి వచ్చాక అవన్నీ ప్రభుత్వ భూములుగా మారిపోయాయి. అయితే ఇప్పుడు ప్రభుత్వ భూమిగా ఉన్న సర్వేనెంబర్ 44/పీ స్థలాన్ని తన పేరుపైకి మ్యుటేషన్ చేయించుకునేందుకు ఉస్మాన్ ఖురేషి ప్రయత్నించారు. ప్రభుత్వ స్థలం కావడంతో వ్యవహారాన్ని జాగ్రత్తగా నడిపేందుకు పన్నిన వ్యూహం బెడిసి కొట్టడంతో అడ్డంగా దొరికిపోయాడు. టీఆర్ఎస్ చీఫ్ లెటర్‌హెడ్‌పై.. ఈ తతంగాన్ని విజయవంతంగా పూర్తిచేసేందుకు శాలిబండలో చెప్పుల షాపు యజమాని రషీద్ హుస్సేన్ (37)తో జతకట్టాడు. మొగల్పురా డివిజన్ టీఆర్ఎస్ కార్యదర్శిగా ఉన్న రషీద్ హుస్సేన్.. రూ.60వేలు తీసుకుని టీఆర్ఎస్ అధ్యక్షుడి హోదాలో రాసే 10 లెటర్‌హెడ్స్‌ను ఖురేషీకి ఇచ్చాడు. ఆ లెటర్‌హెడ్‌పై తెలంగాణ రాష్ట్ర సమితి పేరు, కేసీఆర్ ఫొటో, మధ్యలో తెలంగాణ ప్రభుత్వ లోగో, కింది భాగంలో టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని రాసుంది. దీనిపై కేసీఆర్ చేసినట్లుగా ఓ సంతకం చేశారు. ఈ లెటర్‌హెడ్‌పై మ్యుటేషన్ చేయాల్సిందిగా మూసారాంబాగ్‌కు చెందిన బి.అమరేంద్ర (40) టైప్ చేశారు. కాగా.. నిజామాబాద్‌కు చెందిన బాబాఖాన్ రూ.40 వేలు తీసుకొని లెటర్హెడ్లను రషీద్‌కు విక్రయించినట్లు తెలిసింది. పరారీలో ఉన్న బాబాఖాన్ పట్టుబడితేనే నకిలీ లెటర్హెడ్లను ఎక్కడ తయారు చేశారో తెలుస్తుందని డీసీపీ తెలిపారు. నిందితులపై ఐపీసీ 420, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుల నుంచి 10 లెటర్హెడ్లను స్వాధీనం చేసుకున్నారు. సీఎం రికమండేషన్ కావడంతోనే అనుమానం గచ్చిబౌలి సర్వే నెంబర్ 44/పీలో 2.02 ఎకరాల స్థలం విలువ రూ.90 కోట్ల పై మాటే. ఈ స్థలం మ్యుటేషన్ కోసం మహ్మద్ ఖురేషి దరఖాస్తు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ ఫొటో, పార్టీ అధ్యక్షుని హోదాలో సంతకం చేసిన లెటర్‌ను ధరఖాస్తుకు జతపరిచాడు. సీఎం రికమండ్ చేస్తున్నట్లుగా లెటర్‌హెడ్ ఉండటంతో ఫైల్‌కు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. ఇన్‌వార్డు నుంచి జాయింట్ కలెక్టర్ ద్వారా రాజేంద్రనగర్ ఆర్డీవో చంద్రకళకు ఫైల్ చేరింది. అయితే.. సీఎం రికమండ్ చేయడంపై అనుమానం కల్గిన ఆమె దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించారు. పార్టీ అధ్యక్షుని హోదాలో సీఎం సంతకం చేసినట్లు ఉండటంతో ఆమెకు అనుమానం వచ్చింది. దీంతో ఆ దరఖాస్తును వాట్సాప్‌లో సీఎంఓకు పంపించారు. సీఎం ఎవరికీ ఇలాంటి రికమండేషన్ లెటర్ ఇవ్వలేదని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి స్పష్టత వచ్చింది. దీంతో ఈ నెల 15న రాయదుర్గం పీఎస్‌లో ఆర్డీవో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఫోర్జరీ డాక్యుమెంట్ల ద్వారా విలువైన స్థలాన్ని మ్యుటేషన్ చేసేందుకు పెట్టుకున్న దరఖాస్తుగా గుర్తించి కుట్రదారులను పట్టుకున్నారు. హైదరాబాద్ సీపీ, మెట్రో ఎండీకీ లేఖలు గచ్చిబౌలి వివాదంలో ఈ ఫోర్జరీ వ్యవహారం తెరపైకి వచ్చినా విచా రణ సందర్భంగా.. నిందితులు సీఎం పేరుతో కొంతకాలం కింద దొంగలేఖలు వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు ఇచ్చారని వెల్లడైంది. చాదర్‌ఘాట్‌లో 300 చద రపు గజాల స్థలం వివాదంలో ఉం దని, త్వరగా పరిష్కరించాలని సీఎం ఫొటో, సంతకం ఉన్న సిఫారసు లేఖతో హైదరాబాద్ కమిషనర్ అంజనీకుమార్‌కు దర ఖాస్తు అందింది. చాదర్‌ఘాట్‌లో మరో 200 చదరపు గజాల స్థలానికి నష్ట పరిహరం రాలేదని, సమస్యను పరిష్కరించాలని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డికి లెటర్ పంపారు. పోలీసుల దర్యాప్తులో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అయితే సీపీ, మెట్రోరైల్ ఎండీ కార్యాలయాల్లో ఈ ఫైల్స్ పరిష్కారం ఏ స్టేజీలో ఉందనే విషయం మాత్రం తెలియలేదు. -
అనుమతి లేకుండా తొలగించొద్దు
నాగర్‌కర్నూల్: ఓటర్ జాబితా నుంచి ప్రొఫార్మా–7, ఎన్నికల సంఘం అనుమతి లేకుండా ఓటర్ జాబితా నుంచి ఓట్లను తొలగించొద్దని జిల్లా కలెక్టర్ ఈ.శ్రీధర్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం ఓటర్ జాబితాలో బోగస్ ఓట్ల తొలగింపుపై తహసీల్దార్లు, ఆర్డీఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తహసీల్దార్ బోగస్ ఓట్లను తొలగించేందుకు అన్ని పోలింగ్ బూత్ లెవల్ అధికారులతో సమావేశం నిర్వహించి డబుల్ ఎంట్రీ ఓటర్లను తొలగించాలన్నారు. ఓటరు జాబితా సవరణలో క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేయకుండా కొన్ని చోట్ల ఓట్లను తొలగించారని, మరికొన్ని చోట్ల రెండు పేర్లను తొలగించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పూర్తి స్థాయిలో బోగస్ ఓట్లను తొలగించేందుకు బూత్ లెవల్ అధికారులను సంప్రదించి ఎన్ని ఓట్లు తొలగించారో పూర్తి సమాచారంతో గురువారం జరిగే సమావేశానికి హాజరు కావాలన్నారు. రెండు ఓట్లు తొలగించిన వారితో ప్రొ ఫార్మా–6తో తిరిగి వారికి ఓటుహక్కు కల్పించాలని ఆదేశించారు. జిల్లాలో సాంకేతిక లోపంతో ఉన్న 450 ఓట్లను ప్రొ ఫార్మా–8 వినియోగించి పేర్లు, డేట్ ఆఫ్ బర్త్, ఇతర సవరణలను సరిచేయాలని తహసీల్దార్లకు సూచించారు. నియోజకవర్గంలో డబుల్ ఎంట్రీ ఓట్లను ఆయా మండలాల్లో తొలగించేందుకు ఆర్డీఓలు రాష్ట్ర ఎన్నికల అధికారి అనుమతి పొందేందుకు లేఖతో సమావేశానికి హాజరు కావాలన్నారు. అదే విధంగా భూ ప్రక్షాళన పనులు వేగవంతం చేసి, వాటికి సంబంధించిన డిజిటల్ సంతకాలు, ఇతర విషయాలపై దృష్టి సారించాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్ఓ మధుసూదన్‌నాయక్, జిల్లా ఎన్నికల నోడల్ అధికారులు మోహన్‌రెడ్డి, అనిల్ ప్రకాశ్, ఆర్డీఓలు హనుమనాయక్, పాండునాయక్, రాజేష్‌కుమార్, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈవీఎంలపై వీడియో కాన్ఫరెన్స్ కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు బుధవారం జిల్లా కలెక్టర్లతో ఈవీఎంలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నిక ల్లో వినియోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, వీవీ ప్యాట్ల పనితీరు, నియోజకవర్గానికి అవసరమైన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, పార్లమెంట్ నియోజకవర్గాలకు చేరాయా లేదా అనే విషయంపై సమీక్ష నిర్వహించారు. అదే విధంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు మొదటి విడత తనిఖీలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈవీఎంలకు సంబంధించి టెక్నికల్ సమస్యలు వస్తే భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ కంపెనీ నుంచి ప్రతినిధులు వస్తారని తెలిపారు. ఈ వీసీలో కలెక్టర్ ఈ.శ్రీధర్, జేసీ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మాట వినకపోతే బదిలీయే!
కర్నూలు, నంద్యాల: మంత్రి, అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్పినట్లు మాత్రమే పని చేయాలి. కాదు.. లేదు.. అంటే మాత్రం అధికారులకు బదిలీ వేటు తప్పడం లేదు. నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఈ తంతు కొనసాగుతోంది. వీఆర్ఓల డిప్యూటేషన్ వ్యవహారమే ఇందుకు నిదర్శనంగా నిలిచింది. సాధారణంగా గ్రామ రెవెన్యూ అధికారులను బదిలీ చేసే అధికారం.. డిప్యూటేషన్ వేసే అధికారం జిల్లా కలెక్టర్‌కు తప్ప మరెవరికి లేదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అయితే నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 22 మంది వీఆర్ఓలకు నంద్యాల ఆర్డీఓ రామసుందర్‌రెడ్డి చేత అధికార పార్టీ నేతలు డిప్యూటేషన్ వేయించారు. తమ మాట వినలేదని, ప్రతిపక్ష పార్టీ నాయకులతో అనుకూలంగా ఉన్నారని ఇలా చేసినట్లు తెలుస్తోంది. నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సెప్టెంబర్ 1 నుంచి ఓటరు నమోదు, సవరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులను ఎవరినీ బదిలీ చేయకూడదు. ఎందుకంటే ఓటర్ల మార్పులు, చేర్పేలు, నమోదులో వీఆర్ఓలు బూత్‌లెవెల్ అధికారులుగా ఉంటారు. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు బదిలీలు చేయకూడదు. అయితే నంద్యాల డివిజన్లోని 22 మంది వీఆర్ఓలను నంద్యాల ఆర్డీఓ రామసుందర్‌రెడ్డి ఎన్నికల కోడ్ ఒకరోజు ముందుగా ఆగస్టు 30వ తేదీన డిప్యూటేషన్‌పై బదిలీ చేస్తున్నట్లు ఆన్లైన్లో ఉత్తర్వులు పంపారు. టీడీపీ నేతల ఒత్తిళ్లతోనే ఇలా చేశారనే విమర్శలు వస్తున్నాయి. సాధారణంగా ఆరోపణలు, విధుల పట్ల నిర్లక్ష్యం ఉన్నవారిపై డిప్యూటేషన్‌పై వేస్తుంటారు. అయితే ఏకంగా నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 22మంది వీఆర్ఓలను ఏ విధంగా డిప్యూటేషన్ వేశారనే ప్రశ్న ఉదయిస్తోంది. టీడీపీ నేతలు ఆర్డీఓపై తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు తీసుకొచ్చి మాటవినని వీఆర్ఓలను డిప్యూటేషన్‌పై బదిలీ చేయించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వీఆర్వో రాజేశ్వరిని నూనెపల్లె నుంచి బండిఆత్మకూరు మండలం పార్నపల్లెకు, ప్రియాంకను చాపిరేవుల నుంచి గోస్పాడు మండలం యాళ్లూరు–1కు, పద్మావతిని పులిమద్ది నుంచి గడివేముల మండలం బూజనూరుకు డిప్యూటేషన్ వేస్తూ ఆన్లైన్లో తహసీల్దార్లకు ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా గోస్పాడు మండలం యాళ్లూరుకు చెందిన రమాకాంతరావును కోవెలకుంట్ల మండలం రేవనూరుకు, చింతకుంట్ల వీఆర్ఓ జనార్దన్‌ను అవుకు మండలం కునుకుంట్లకు, గడివేముల మండలం బూజనూరు వీఆర్ఓ వెంటకృష్ణుడును నంద్యాల మండలం పులిమద్దికి, కొలిమిగుండ్ల వీఆర్ఓ గూడుబాయిని కోటపాడుకు, అవుకు మండలం కునుకుంట్ల వీఆర్ఓ వెంకటేశ్వరరెడ్డిని చింతకుంట్లకు, శిరివెళ్ల వీఆర్ఓ లక్ష్మయ్యను జూలేపల్లెకు డిప్యూటేషన్‌పై బదిలీ చేసినట్లు సంబంధిత తహసీల్దార్లకు ఆర్డీఓ ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే వీరు విధుల్లో చేరాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని ఆదేశాలు ఇచ్చారు. విధి నిర్వహణలో నిష్పక్షపాతంగా వ్యవహరించే వీఆర్ఓలకు డిప్యూటేషన్ వేయడం, అది కూడా ఆర్డీఓ స్థాయి అధికారి వేయడంపై రెవెన్యూ అధికారులే ఆశ్చర్యపోతున్నారు. టీడీపీ పాలనలో అధికారులపై అజమాయిషీ సర్వసాధారణమైందని, అధికార పార్టీ నాయకులు చెప్పినట్లు వినకుంటే బదిలీలు చేస్తారంటూ అధికారులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. -
ఆర్డీఓ కోసం ఆరు గంటలు పడిగాపులు
శ్రీకాళహస్తి : పట్టణంలోని ఎన్జీఓ కార్యాలయంలో తిరుపతి ఆర్డీఓ నరసింహులు కోసం అన్నదాతలు గురువారం ఆరు గంటల పాటు పడిగాపులు కాశారు. చివరకు ఆయన రాకపోవడంతో నిరుత్సాహంగా వెళ్లిపోయారు. పూతలపట్టు–నాయుడుపేట ప్రధాన రహదారి విస్తరణ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు రైతుల నుంచి భూములు సేకరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్డీఓ వారానికి ఓ సారి రెండు, మూడు గ్రామాలకు చెందిన రైతులతో సమావేశం నిర్వహించి..వారి భూములకు «ఎంత మేరకు ధర చెల్లిస్తారనే విషయాన్ని తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం శ్రీకాళహస్తి మండలంలోని చెర్లోపల్లె, కాపుగున్నేరి, ఇసుకగుంట గ్రామాలకు చెందిన రైతులు గురువారం ఉదయం 10 గంటలకు ఎన్జీఓ కార్యాలయంలో ఆర్డీఓ నిర్వహించే సమావేశానికి హాజరుకావాలని తహసీల్దార్ సుబ్రమణ్యం రెండు రోజుల క్రితం ఆదేశాలు జారీచేశారు. రైతులు టెన్షన్‌తో గురువారం ఉదయం 9 గంటలకే ఎన్జీఓ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. మధ్యాహ్నం రెండు గంటలు అయింది. అయినా ఆయన రాలేదు. అప్పుడు ‘భోజనం చేసి రండి..ఆర్డీఓ మూడు గంటలకు వస్తారు...’ అంటూ తహసీల్దార్ సుబ్రమణ్యం అదేశాలు జారీచేశారు. అయినా రైతులు అక్కడే వేచి ఉన్నారు. చివరకు సాయంత్రం నాలుగు గంటల సమయంలో ‘ఆర్డీఓ రావడం లేదు...మరోసారి సమావేశం నిర్వహిస్తాం....సమావేశం ఎప్పుడు నిర్వహించే విషయం వీఆర్ఏలతో చెప్పి పంపుతాం’ అంటూ తహసీల్దార్ చల్లగా కబురు చెప్పారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆరు గంటలసేపు వేచివున్న రైతులకు కోపమొచ్చింది. తహసీల్దార్ అలా చెప్పడంపై తీవ్రంగా మండిపడ్డారు. అడ్డదిడ్డంగా రోడ్డు అలైన్మెంట్ అధికార పక్షానికి చెందిన నేతల భూములు ఉంటే వాటిని తప్పించి పేదోడి భూములపైకి రోడ్డును తిప్పడం దారుణమంటూ రైతులు తహసీల్దార్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. అన్ని గ్రామాలను వదిలిపెట్టి.. ఒక్క ఇల్లు పోకుండా పొలాల్లో అలైన్మెంట్ ఏర్పాటు చేసిన రెవెన్యూ అధికారులు ఇసుకగుంటలో మాత్రం ఇళ్లపై, గిడ్డంగులపై రోడ్డు అలైన్మెంట్ ఇవ్వడం దారుణమంటూ రైతు సిద్దాగుంట శంకర్‌రెడ్డి ప్రశ్నించారు. ‘మీకు ఇష్టం వచ్చినట్లుగా రోడ్డును తిప్పుకోవడం న్యాయమేనా ?’ అంటూ నిలదీశారు. రోడ్డులో మలుపులు ఉన్న చోట తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, మలుపులు తప్పించడానికి కొన్ని చోట్ల అలైన్మెంట్ మార్పు చేశారని...అంతేతప్ప నేతల ఒత్తిళ్లతో పక్కకు తిప్పాపని చెప్పడం సరికాదంటూ తహసీల్దార్ వివరణ ఇచ్చారు. జీవితమంతా ఈ ప్రభుత్వానికి భూములను నామమాత్రపు «ధరలకు చెల్లించాల్సిన దుస్థితి నెలకొందని పలువురు వాపోయారు. తమ భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేమని...ఒకవేళ బలవంతంగా లాక్కుంటే గిట్టుబాటు ధర కల్పించాలని వారు డిమాండ్ చేశారు. మార్కెట్ విలువ ప్రకారమే భూములు ఇవ్వడానికి అంగీకరిస్తామని తేల్చిచెప్పారు. -
వీఆర్వోలపై ఆర్డీఓ ఆగ్రహం
కొడంగల్ రూరల్: మండల పరిధిలో విధులు నిర్వహిస్తున్న గ్రామ పరిపాలనాధికారులపై తాండూరు ఆర్డీఓ వేణుమాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్వోలతో సమావేశం నిర్వహించారు. వీఆర్వోల పనితీరుపై ఆర్డీఓ అసహనం వ్యక్తం చేశారు. గ్రామాలకు వెళ్లి ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన వీఆర్వోలు తహసీల్దార్ కార్యాలయానికే పరిమితమయ్యారని అన్నారు. రైతుబంధు చెక్కులు, పాసుపుస్తకాల పంపిణీలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం నూతనంగా ఇచ్చిన పాసుపుస్తకాల్లో ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దాల్సిన బాధ్యతను వీఆర్వోలు విస్మరిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేయడానికి కృషి చేస్తోందన్నారు. ఈ క్రమంలో ఉద్యోగులు జవాబుదారీతనం లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్, డీటీ ధనుంజయ, ఆర్ఐ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
తెనాలిలో కన్నెర్రజేసిన రైతులు
తెనాలి: అఖిలపక్ష రైతు సంఘాల పిలుపు మేరకు సోమవారం తెనాలిలో ఆర్డీవో కార్యాలయాన్ని పెద్దసంఖ్యలో రైతులు, కౌలురైతులు ముట్టడించారు. కార్యాలయం గేటు మూసివేసి అడ్డుగా కూర్చున్నారు. మరికొందరు కార్యాలయం ప్రధానద్వారం వద్ద బైఠాయించారు. ఇంకొందరు కార్యాలయం లోపలకు ప్రవేశించి ఉద్యోగుల సీట్ల పక్కనే పడుకున్నారు. రైతుల ఆందోళనతో కొద్దిసేపు మీకోసం కార్యక్రమానికి ఆటంకం కలిగింది. తెల్లజొన్న, మొక్కజొన్నను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. కార్యాలయంలోకి ప్రవేశించిన రైతునాయకులను పోలీసులు బలవంతంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం రైతు నాయకులు మాట్లాడుతూ ఏప్రిల్ 25వ తేదీ సాయంత్రంలోగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేస్తామని ప్రభుత్వం ప్రకటించకుంటే, 26న ఆర్డీవో కార్యాలయంలో వంటా వార్పూ కార్యక్రమం పెడతామని హెచ్చరించారు. ముట్టడి సమావేశానికి ఏపీ కౌలురైతు సంఘం జిల్లా అధ్యక్షుడు తోడేటి సురేష్‌బాబు అధ్యక్షత వహించారు. ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.నరసింహారావు మాట్లాడుతూ ప్రభుత్వం మద్దతు ధరను ప్రకటించి చేతులు దులుపుకోవడం సరికాదని, బాధ్యత వహించి చివరిగింజ వరకు మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రప్రభుత్వం తెల్లజొన్నలకు 2017–18లో క్వింటాలుకు రూ.1725 మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేయలేదని, మళ్లీ 2018–19కు క్వింటాలుకు రూ.2600 ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. మహారాష్ట్ర రైతాంగ ఉద్యమస్ఫూర్తితో కదిలితేనే ప్రభుత్వం దిగివస్తుందన్నారు. కౌలురైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలో 145 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం సిగ్గుచేటన్నారు. ఏపీ రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివసాంబిరెడ్డి మాట్లాడుతూప్రభుత్వం రూ.200 బోనస్ ప్రకటన రైతులను అవమానించేదిగా ఉందన్నారు. ఏపీ కౌలురైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వల్లభనేని సాంబశివరావు మాట్లాడుతూ ఇప్పటికే పంట అమ్ముకున్న రైతులకు ఏ విధంగా న్యాయం చేస్తారో ప్రభుత్వం చెప్పాలని నిలదీశారు. రైతాంగ ఆవేదనను జిల్లా కలెక్టరు దృష్టికి తీసుకెళ్లానని ఆర్డీవో నరసింహులు రైతు ప్రతినిధులతో చెప్పారు. డెల్టా పరిరక్షణ సమితి అధ్యక్షుడు డాక్టర్ వేమూరి శేషగిరిరావు, రైతుసంఘాల ప్రతినిధులు చెరుకుమల్లి సింగారావు, కొల్లిపర బాబూప్రసాద్, మట్లపూడి థామస్, బొనిగల అగస్టీన్, మేకల చిట్టిబాబు, కావూరి సత్యనారాయణ, మంగళగిరి వెంకటేశ్వర్లు, కంతేటి శ్రీమన్నారాయణ, పి.జోనేష్, ఎన్.రాజ్యలక్ష్మి, నక్కా నాగపార్వతి, దాసరి రమేష్ మాట్లాడారు. -
డిజిటల్ ప్రక్రియను వేగవంతం చేయాలి
రాయికల్(జగిత్యాల): పట్టాదారు పాస్‌బుక్‌లను జారీ చేసేందుకు డిజిటల్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆర్డీవో నరేందర్ అన్నారు. రాయికల్‌లోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా రైతులంతా తమ పట్టాదారు పాస్‌బుక్‌లను ఆధార్‌తో అనుసంధాన ప్రక్రియ దాదాపు పూర్తయిందని, డిజిటలైజేషన్ ప్రక్రియ వేగవంతం అవుతోందని తెలిపారు. రైతులు తమ ఆధార్‌ను పట్టాదారు పాస్‌బుక్‌లకు అనుసంధానం చేయకపోతే వెంటనే వీఆర్వోలకు అందించాలని కోరారు. తద్వారానే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అందుతాయని పేర్కొన్నారు. తమ భూములను సర్వే చేయించాలని దావన్‌పల్లి గ్రామస్తులు ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లారు. ఆర్డీవో వెంట తహసీల్దార్ హన్మంతరెడ్డి ఉన్నారు. -
అడ్డగోలు ఆర్డీవోపై కొరడా
సాక్షి, విశాఖపట్నం: విశాఖ మాజీ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఎస్.వెంకటేశ్వర్లుపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది.ఆర్వోఆర్, ఇనాం, ఏపీ భూ అధీకరణ చట్టాల కింద ఆయన జారీ చేసిన ఉత్తర్వులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని ప్రభుత్వం నిగ్గుతేల్చింది. చట్టాలను ఉల్లంఘిస్తూ ప్రైవేటు పార్టీలకు ప్రభుత్వ భూములను ధారాదత్తం చేసేందుకు వీలుగా ఆయన పలు ఉత్తర్వులు జారీ చేశారని ప్రభుత్వం గుర్తించింది. ఇటీవలే ఆయనను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ సస్పెన్షన్‌కు సిఫార్సు చేసిన కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తన నివేదికలో చేసిన అభియోగాలన్నీ వాస్తవాలేనని ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. విశాఖ ఆర్డీవోగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వెంకటేశ్వర్లు ఇనాం, ఆర్వోఆర్, ఏపీ భూ అధీకరణ చట్టాల కింద జారీ చేసిన పలు ఉత్తర్వులు వివాదస్పదమయ్యాయి. ఈ అడ్డగోలు ఉత్తర్వులలో లొసుగుల్ని ‘సాక్షి’ అనేక సందర్భాలలో వెలుగులోకి తేవడం సంచలనమైంది. ‘సాక్షి’ బట్టబయలు చేసిన రికార్డుల ట్యాంపరింగ్, భూ కబ్జాల ఉదంతాల వెనుక ఆర్డీవో హస్తం కూడా ఉన్నట్టుగా ఆరోపణలున్నాయి. మధురవాడ, కొమ్మాది, పీఎం పాలెం, పరదేశి పాలెం వంటి ప్రాంతాలతో పాటు విశాఖ రూరల్, భీమిలి, ఆనందపురం, పెందుర్తి తదితర ప్రాంతాల్లో జరిగిన భూకబ్జాలను ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురాగా ఆర్డీవో జారీ చేసిన ఉత్తర్వులే ఈ అక్రమాలకు కారణమని జిల్లా యంత్రాంగం గుర్తించింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన విశాఖ భూ కుంభకోణంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తులో కూడా ఆర్డీవో పాల్పడిన పలు అక్రమాలు వెలుగు చూశాయి. ‘సాక్షి’ కథనాల నేపథ్యంలో సుమారు తొమ్మిది భూ వివాదాల్లో అప్పిలేట్ అథారిటీగా ఆర్డీవో జారీ చేసిన ఉత్తర్వులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని సిట్ సైతం నిగ్గు తేల్చింది. ఆర్డీవోపై సస్పెన్షన్ వేటు వేయాలని, పలుకేసుల్లో ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిట్ సిఫార్సుల్లో ఉన్నట్టుగా తెలియవచ్చింది. జేసీ నిర్దేశం సిట్ నివేదిక సమర్పించిన తర్వాత కూడా కోరాడ సీలింగ్ భూముల స్వాధీనం వ్యవహారంలో ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా ఆర్డీవో జారీ చేసిన ఉత్తర్వులు తీవ్ర దుమారం రేపాయి. ఈ పరిణామంపై జిల్లా జాయింట్ కలెక్టర్ జి.సృజన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 28 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ కేసులో ఆరురోజుల్లోనే తుది ఉత్తర్వులు జారీచేయడం, పైగా ఆనందపురం మండలం వేములవలసలో సర్వే నెం.329లోని 11.14 ఎకరాలకు బదులుగా రావికమతం మండలం బాదనపాడు గ్రామంలో సర్వే నెం.40లో కోరాడ కుటుంబీకులు కొనుగోలు చేసిన భూములను స్వాధీనం చేసుకోవాలని ఆర్డీవో ఆదేశాలు జారీ చేయడం.. వీటిని క్షణం ఆలోచించకుండా రావికమతం తహశీల్దార్ సిద్ధయ్య అమలు చేయడాన్ని ఆమె సీరియస్‌గా తీసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ‘సాక్షి’లో వచ్చిన వరుస కథనాల నేపథ్యంలో ఆర్డీవోకు జేసీ సృజన షోకాజ్ నోటీసు జారీ జేశారు. ఆయన ఇచ్చిన సమాధానం ఏమాత్రం సంతృప్తికరంగా లేకపోవడంతో పాటు గతంలో ఆయన జారీ చేసిన పలు ఉత్వర్వులు కూడా నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతో ఆయన్ని సరెండర్ చేయాలని సూచించారు. దాంతో కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించడమే కాకుండా ఆర్డీవోను సరెండర్ చేశారు. నివేదికలోని అభియోగాలను ఇప్పుడు ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ధారించింది. దీంతో ఆర్డీవోను సస్పెండ్ చేస్తూ రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మన్మోహన్సింగ్ జీవో ఆర్టీ నెం.341ను జారీ చేశారు. తదుపరి విచారణ పూర్తయ్యే వరకు ఆయన హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లడానికి వీల్లేదని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆయన ఉత్తర్వులన్నీ పరిశీలిస్తున్నా ఆర్డీవోగా వెంకటేశ్వర్లును సస్పెండ్ చేయాల్సిందే. ఆయన ఎన్నో అవకతవకలకు పాల్పడ్డారు. మమ్మల్ని కూడా తప్పు దారి పట్టించేలా ఉత్తర్వులు ఇచ్చారు. పలు తీర్పుల విషయంలో ఆది నుంచి ఆయన్ని హెచ్చరిస్తూనే ఉన్నా. ఆయన జారీ చేసిన ఉత్తర్వుల్లో ఎక్కువ శాతం వివాదస్పద మయ్యాయి. ఆయన హయాంలో జారీ చేసిన ఆర్వోఆర్, ఇతర అప్పిలేట్ ఉత్తర్వులన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం.ఏ ఒక్కటి అమలు కాకుండా చర్యలు తీసుకున్నాం. ఈ వ్యవహారంలో సస్పెన్షన్‌కు సిఫార్సు చేస్తూ తీసుకున్న నిర్ణయం సరైనదిగా భావిస్తున్నాం. –జి.సృజన, జిల్లా జాయింట్ కలెక్టర్ -
నా భూమి దక్కదేమో!
శాయంపేట (భూపాలపల్లి): వారసత్వంగా వచ్చిన భూమిని రికార్డుల్లో నమోదు చేయడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఓ రైతు ఆర్డీఓ ఎదుటే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఘటన సోమవారం వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట తహసీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకుంది. మండలంలోని కొత్తగట్టు సింగారం 114 సర్వే నంబరులో కర్రు ఆదిరెడ్డి వారసత్వంగా తండ్రి నుంచి పొందిన 2.21 ఎకరాల భూమి ఉంది. 2008 వరకు రికార్డుల్లో వివరాలు సరిగ్గానే ఉండగా.. 2010 తరువాత 1.31 ఎకరాలు మాత్రమే ఉంది. దీంతో బాధిత రైతు ఆరు నెలలుగా రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందనలేదు. ఇదే విషయమై సోమవారం ఆదిరెడ్డి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చాడు. ఆ సమయంలో డబుల్ బెడ్రూం నిర్మాణ పనులను పరిశీలించడానికి ఆర్డీఓ మహేందర్‌జీ వచ్చారు. ఆదిరెడ్డి తన సమస్యను ఆర్డీఓ దృష్టికి తీసుకొచ్చాడు. వెంటనే సంచిలో తెచ్చుకున్న పురుగుల మందు డబ్బా తీసి తాగేందుకు యత్నించాడు. గమనించిన ఆర్డీఓ డబ్బాను లాక్కుని వారించాడు. రెండు రోజుల్లో విచారణ చేపట్టి సమస్య పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ఒకవేళ అధికారులు రాకుంటే తనకు నేరుగా ఫోన్ చేయాలని తన నంబర్ ఇవ్వడంతో బాధిత రైతు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం సంబంధిత అధికారులపై ఆర్డీఓ మండిపడ్డారు. విచారణ పూర్తి చేసి రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు. -
బోండా ఉమా భార్యకు నోటీసులు
సాక్షి, విజయవాడ : భూకబ్జా ఆరోపణల కేసులో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు భార్య సుజాతకు ఆర్డీవో నోటీసులు జారీ చేశారు. ఆమెతో పాటు ఆయన అనుచరుడు మాగంటి బాబుకు కూడా నోటీసులిచ్చారు. బాధితుడు కేసిరెడ్డి సురేష్ బాబు ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన ఆర్డీవో అధికారులు సోమవారం సబ్‌కలెక్టర్‌కు హాజరు కావాలని నోటీసులలో పేర్కొన్నారు. నేడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్టీవో విచారణ చేపట్టనున్నారు. 1951లో సూర్యనారాయణ అనే స్వాతంత్య్ర సమరయోధుడికి ప్రభుత్వం పదెకరాల స్థలాన్ని కేటాయించింది. 2016లో నకిలీ పత్రాలు సృష్టించి బోండా ఉమ కబ్జాకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న సూర్యనారాయణ మనువడు సురేష్ 2017, ఫిబ్రవరి 10న విజయవాడ సింగ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో సురేష్ సీఐడీ అధికారులను ఆశ్రయించారు. సీఐడీ అధికారుల దర్యాప్తులో ఎమ్మెల్యే బొండా ఉమా కుటుంబం భూబాగోతం వెలుగులోకి వచ్చింది. మరోవైపు తనపై నమోదు అయిన కేసులు కొట్టివేయాలంటూ బోండా ఉమ సతీమణి సుజాత హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన హైకోర్టు 8వారాల స్టే విధించింది. ఆలోపు కౌంటర్ దాఖలు చేయాలంటూ సీఐడీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో బోండా సుజాత ఏ-8 ముద్దాయిగా ఉన్నారు. -
నీకు సగం.. నాకు సగం..
బాన్సువాడ: బాన్సువాడ మున్సిపాలిటీగా ఆవిర్భవించడంతో గతంలో గ్రామ పంచాయతీలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్‌గా ఆర్డీవో రాజేశ్వర్ బాధ్యతలు స్వీకరించి, బల్దియాపై పూర్తిస్థాయి దృష్టి సారించారు. బల్దియాలో జీతభత్యాలు, జమా ఖర్చులు, ఆదాయ వనరులు, అక్రమ లే అవుట్లు, మున్సిపల్ స్థలాలపై ఆయన విచారిస్తున్నారు. అయితే వీటిలో కీలకమైన లేఅవుట్లు, 10శాతం భూముల కేటాయింపులపై ఆర్డీవో చేతికి ఫైళ్లు అందకుండా కొందరు అక్రమార్కులు ఫైళ్లనే మాయం చేశారు. 1990 నుంచి 2015 వరకు గల ఫైళ్లను మొత్తం బల్దియాలోనే లేకుండా చేశారు. కొందరు వార్డు సభ్యులు, అధికారులు కలిసి చేసిన అక్రమాలను కప్పి పుచ్చుకునేందుకు ఏకంగా పాత ఫైళ్లనే గల్లంతు చేయడం చర్చనీయాంశమవుతోంది. బల్దియా పరిధిలో చేసే లే అవుట్ల సందర్భంగా పార్కులు, ఇతర ప్రజా కార్యకలాపాల కోసం కేటాయించే భూమిని కొందరు వార్డు సభ్యులు, అధికారుల సహకారంతో విక్రయించిన సంఘటనలు కోకొల్లాలుగా ఉన్నాయి. 1995 నుంచి 2018 వరకు లే అవుట్లకు సంబంధించిన భూములు జీపీ పరిధిలో ఉండాలి. అయితే వార్డు సభ్యులు ‘నీకు సగం.. నాకు సగం’ అనే రీతిలో అధికారులతో మిలాఖాత్ అయి ఆ భూములను అమ్ముకున్నారు. చేతులు మారిన భూములు.. వాస్తవానికి బాన్సువాడ బల్దియా పరిధిలో అధికారికంగా 28,509 గజాల భూమి ఉందని రికార్డులు చెబుతున్నాయి. 1983 నుంచి 2018 వరకు గ్రామ పంచాయతీ(ప్రస్తుత బల్దియా) పరిధిలో 63 లే అవుట్లు చేశారు. వీటిలో 10 శాతం చొప్పున భూములను కేటాయించారు. అయితే ప్రజాప్రతినిధులు వివిధ కుల సంఘాల పేరిట భూములను ధారాదత్తం చేశారు. వాటిని ప్లాట్లుగా మార్చి ఇద్దరు, ముగ్గురు చేతులు మార్చి మరీ అమ్ముకున్నారు. ప్రస్తుతం పదిశాతం భూముల్లో భవనాలు వెలిసాయి. జీపీ లెక్కల ప్రకారం 4,298 గజాల భూమిని సంఘాలకు కేటాయించారు. అయితే అనధికారికంగా మరో 10వేల గజాల భూమి కబ్జాకు గురైనట్లు తెలుస్తోంది. కొందరు అక్రమార్కులు 10శాతం భూములను కాజేసేందుకు పాలకవర్గంతో తీర్మానాలు కూడా చేయించారు. ప్రస్తుతానికి 14,211 గజాల భూమి మున్సిపాలిటీ ఆధీనంలో ఉంది. లేఅవుట్ ఫైళ్లు గల్లంతవడంతో ఆ భూములను గుర్తించడం మున్సిపల్ సిబ్బందికి ఇబ్బందికరంగా మారింది. ఇన్చార్జి కమిషనర్ రాజేశ్వర్ మున్సిపల్ కార్యాలయంలోని అన్ని రికార్డులను పక్షం రోజుల క్రితమే స్వాధీనం చేసుకున్నారు. వాటిలో లేఅవుట్ ఫైళ్లు లేకపోవడం గమనార్హం. ఫైళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం.. బల్దియాకు కీలకం లే అవుట్ ఫైళ్లు. వాటి ఆధారంగానే రోడ్లు, ప్లాట్లు, ఇండ్ల నిర్మాణాలు, జీపీకి కేటాయించిన భూములను గుర్తిస్తారు. ఇంతటి ప్రాముఖ్యత గల ఈ ఫైళ్ల మాయంతోపాటు వాటి నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యం చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ ఫైళ్లను గల్లంతు చేస్తే తాము చేసిన అక్రమాలను కప్పి పుచ్చవచ్చని, అమ్మిన భూములను స్వాధీనం చేసుకొనే వీలుండదని పక్కా ప్రణాళిక ప్రకారం వీటిని మున్సిపాలిటి కాకముందే మాయం చేశారు. అనుమతులన్నీ పెండింగ్‌లోనే.. గత నెల 20న బాన్సువాడను మున్సిపాలిటీగా మార్చుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే మూడు నెలల క్రితమే బాన్సువాడ మున్సిపాలిటీగా మారనుందనే ప్రచారం జరగడంతో అనేక మంది భవన నిర్మాణాల కోసం దరఖాస్తులు చేసుకొని వార్డు సభ్యుల ద్వారా అనుమతులు పొందారు. అయినా మరో వంద దరఖాస్తులు ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నాయి. మున్సిపల్ నిబంధనల ప్రకారం వాటికి అనుమతి ఇవ్వాలి. లేఅవుట్ల ఫైళ్లు కూడా ఆర్డీవో పెండింగ్‌లో పెట్టారు. మున్సిపాలిటీలో ఆదాయ వనరుల వివరాలు స్పష్టంగా లేవు. అక్రమాలపై వెంటనే విచారిస్తాం.. మున్సిపాలిటీలో గతంలో జరిగిన అక్రమాలపై విచారణ జరుపుతాం. లే అవుట్ ఫైళ్ల గల్లంతవగా, దీనిపై ఆరా తీçస్తున్నాం. ఇంకా పూర్తిస్థాయిలో సిబ్బంది లేరు. సిబ్బంది రాగానే బల్దియా పాలనను గాడిలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తా. జీపీకి సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్నాం. ఇకపై ఏ అనుమతి లేనిదే పనులు చేయరాదు. –రాజేశ్వర్, ఇన్చార్జి కమిషనర్ -
వైఎస్సార్ సీపీ ఆందోళనతో దిగొచ్చిన అధికారులు
సాక్షి, విజయవాడ: ఉయ్యూరులో ప్రభుత్వ కార్యాలయాలు మార్పు విషయంలో వైఎస్సార్ సీపీ నేతల ఆందోళనతో అధికారులు దిగొచ్చారు.జాతీయ రహదారి వెడల్పు చేసే క్రమంలోనే ఉయ్యూరులోని ఎమ్మార్వో, ఎండీవో కార్యాలయాలతో పాటుగా పోలీస్ స్టేషన్‌ను తొలగించిన విషయం తెలిసిందే. కార్యాలయాల ప్రత్యామ్నాయ ఏర్పాటు కోసం కొంత మంది రైతులు వద్ద భూమిని సేకరిస్తున్నామని నూజివీడు ఆర్డీవో రంగయ్య తెలిపారు. ఓ రైతు కార్యాలయాల ఏర్పాటుకు ఎకరం 30 సెంట్లు భూమి ఉచితంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారని చెప్పారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే స్థలాలను పరిశీలించారు. ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటుపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. వైఎస్సార్ సీపీ నేతలు కోరినట్లుగానే అందరి ఆమోదంతోనే ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కడ నిర్మించాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని ఆర్డీవో రంగయ్య వివరించారు. -
ఏసీబీకి చిక్కిన మరో అవినీతి చేప
సాక్షి, నిజామాబాద్: ఏసీబీ అధికారులకు మరో అవినీతి చేప చిక్కింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఆర్డీవో శ్రీనివాస్ గౌడ్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఆర్మూర్‌లోని మంజీర వాటర్ ప్లాంట్ పర్మిషన్ కోసం రాజ్ కుమార్ అనే వ్యక్తి నంచి శ్రీనివాస్ రూ. 40 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ రైడ్ చేసి రెడ్ హ్యండెడ్‌గా పట్టుకుంది. దీంతో పాటు ఆయనపై పలు ఆరోపణలు రావడంతో నిజామాబాద్, కరీంనగర్‌లోని బంధువుల ఇళ్లలో సోదాలు చేపట్టారు. జగిత్యాలలో 3 ప్లాట్లు, హైదరాబాద్‌లో 2 ఓపెన్ ప్లాట్స్, కొన్ని విలువైన పత్రాలను అధికారులు గుర్తించారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. -
ఉద్యోగాల కల్పన పేరుతో టీడీపీ నయాదందా
నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న వైనం అర్హులకు అన్యాయం జరిగితే ఆందోళన తప్పదన్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ఆర్డీవోతో చర్చించిన మాలగుండ్ల శంకరనారాయణ పెనుకొండ : ‘మండలంలో ఏర్పాటు కానున్న కియా కార్ల పరిశ్రమలో ఉద్యోగాలు కల్పిస్తామంటూ టీడీపీ నేతలు మభ్య పెడుతున్నారు. నిరుద్యోగులకు ఆశ చూపి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దీని వల్ల అర్హులకు అన్యాయం జరిగితే సహించబోం’ అంటూ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ హెచ్చరించారు. టీడీపీ నేతలు సాగిస్తున్న నయా దందాపై ఆయన ఆర్డీవో రామ్మూర్తికి సోమవారం ఫిర్యాదు చేసి, మాట్లాడారు. ఉద్యోగాలు కల్పిస్తామంటూ నిరుద్యోగులను స్థానిక ఎమ్మెల్యే పార్థసారథి అనుచరులు కొందరు మభ్యపెట్టి దరఖాస్తులు స్వీకరిస్తున్నారని అన్నారు. ఈ రూపేనా పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారి, అర్హులకు అన్యాయం జరిగే అవకాశముందన్నారు. ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు, భూములు స్వాధీనం చేసిన రైతుల కుటుంబాలకు తొలి ప్రాధాన్యతనివ్వాలని కోరారు. ఎలాంటి అవకతవకలకు పాల్పడినా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన వెంట పార్టీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గుట్టూరు శ్రీరాములు, లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి భాస్కరరెడ్డి, మండల కన్వీనర్ శ్రీకాంత్‌రెడ్డి, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ నాగలూరు బాబు, టౌన్ కన్వీనర్ ఏనుగుల ఇలియాజ్, ఎంపీటీసీ సభ్యుడు రామ్మోహన్‌రెడ్డి, సర్పంచ్‌లు సుధాకరరెడ్డి, సరస్వతమ్మ చంద్రారెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, స్థానిక నేతలు పాల్గొన్నారు. స్పందించిన ఆర్డీఓ శంకర్‌నారాయణ అభ్యర్థనపై ఆర్డీఓ రామ్మూర్తి సానుకూలంగా స్పందించారు. నిరుద్యోగుల రాజకీయ నాయకులెవ్వరూ దరఖాస్తులు స్వీకరించరాదని స్పష్టం చేశారు. ఆశలు రేకెత్తించడం నేరమని అన్నారు. రాజకీయాలకు అతీతంగా ఉద్యోగావకాశాలు కల్పిస్తామని భరోసానిచ్చారు. -
పేకాట ఆడుతూ పట్టుబడ్డ ఆర్డీవో
ఖమ్మం: ఓ వైపు పేకాటపై సీఎం కేసీఆర్ ఉక్కుపాదం మోపుతుండగా.. మరో వైపు ప్రభుత్వ జీతం తీసుకుంటున్న అధికారులే యధేచ్చగా పేకాట ఆడుతున్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెర్వుమాదారం సమీపంలో ఓ ఆర్డీవో ఇద్దరు డీటీలు, ఒక రెవెన్యూ ఇన్స్ పెక్టర్ పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డారు. వీరంతా సదరు ఆర్డీవో ఫాంహౌస్ లో పేకాట ఆడుతుండగా సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. అయితే అధికారులు పట్టుబడ్డ విషయం బయటకి రాకుండా మేనేజ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కర్నూలు ఆర్డీఓగా హుసేన్‌సాహెబ్
- ఉత్తర్వులు విడుదల చేసిన ప్రభుత్వం కర్నూలు సీక్యాంప్: కర్నూలు ఆర్డీఓగా హుసేన్‌సాహెబ్‌ను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూలు ఆర్డీఓ పోస్ట్ కొన్ని నెలలుగా ఖాళీగా ఉంది. దీంతో హెచ్ఎన్ఎస్ఎస్ యూనిట్–3 డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న మల్లికార్జునను ప్రభుత్వం నియమించింది. అయితే కొందరు అధికార పార్టీ నేతలు అడ్డుకోవడంతో బాధ్యతలు స్వీకరించలేదు. ఈ క్రమంలో హౌసింగ్ పీడీగా పనిచేస్తున్న హుసేన్‌సాహెబ్‌ను ఇన్చార్జ్ ఆర్డీఓగా అప్పటి కలెక్టర్ సీహెచ్. విజయ్‌మోహన్ నియమించారు. రెండు కీలకకైన పోస్టులపై దృష్టి సారించడం సమస్య కావడంతో పూర్తి స్థాయి ఆర్డీఓగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన జిల్లాలో డోన్, కృష్ణగిరి, కర్నూలు, తదితర మండలాల తహసీల్దార్‌గా బాధ్యతలు నిర్వహించారు. డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి పొంది అనంతపురం జిల్లాలో పనిచేశారు. -
డ్వాక్రాలపై అప్పు డప్పు
తక్షణమే రుణాలు చెల్లించాలంటూ మహిళా సంఘాలకు నోటీసులు లేదంటే ఆస్తులను జప్తు చేస్తామని హెచ్చరికలు ఆర్డీవో చెంతకు వెళ్లి వివరణ ఇచ్చుకోవాలంటూ ఆదేశాలు రుణమాఫీ ఊసెత్తొదంటున్న అధికారులు ః డ్వాక్రా మహిళలపై అప్పు డప్పు మోగుతోంది. రుణాలకు సంబంధించి బకాయిలు చెల్లించకపోతే రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగిస్తామని.. గ్రామాల్లో టాం టాం వేయించి పరువు తీస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్‌లో అప్పులు పుట్టకుండా చేస్తామని.. వడ్డీ వ్యాపారులు కూడా ఆదుకోలేని స్థితి కల్పిస్తామని బెదిరిస్తున్నారు. ’అదేంటయ్యా.. డ్వాక్రా రుణాలు మాఫీ చేయమని మేం అడిగామా. చంద్రబాబు వీధివీధికీ వచ్చి మరీ రుణాలు మాఫీ చేస్తామన్నారు. ఆయన మాటవల్లే కదా బకాయి పడ్డాం. అసలు కంటే వడ్డీ భారం ఎక్కువైపోయింది. ఎలా కట్టమంటారు’ అని మహిళలు అడుగుతుంటే.. ’ఆ మాటలేం చెల్లవ్. రుణమాఫీ గురించి మాట్లాడొద్దు’ అంటూ అధికారులు హుకం జారీ చేస్తున్నారు. కొవ్వూరు : రుణాలు కట్టాలంటూ డ్వాక్రా మహిళలపై నిన్నటి వరకూ బ్యాంకులు విరుచుకుపడితే.. ఇప్పుడు ఆ బాధ్యతను అధికారులు తీసుకున్నారు. బకాయిలు చెల్లించాలంటూ బెదిరింపులకు దిగుతున్నారు. కొవ్వూరులో సుమారు 400 మంది మహిళలకు బుధవారం ఇదే పరిస్థితి ఎదురైంది. మండలంలో 70 గ్రూపులకు చెందిన మహిళలకు ఇటీవల బ్యాంకుల నుంచి నోటీసులు అందాయి. తక్షణమే బకాయిలు చెల్లించకపోతే కోర్టుకెళ్లి ఆస్తులను జప్తు చేయిస్తామని అందులో పేర్కొన్నారు. గురువారంలోగా ఆర్డీవో ఎదుట హాజరై వివరణ ఇచ్చుకోవాలని.. లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో సుమారు 400 మంది మహిళలు బుధవారం ఆర్డీవో కార్యాలయానికి తరలివచ్చారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కార్యాలయ ఆవరణలోని నీట్లనీడన పడిగాపులు పడ్డారు. ఆస్తులు జప్తు చేయిస్తామని హెచ్చరిక డ్వాక్రా మహిళలతో భేటీ అయిన ఆర్డీవో బి.శ్రీనివాస్ మాట్లాడుతూ.. ’బకాయిలు కట్టకపోతే రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగిస్తాం. గ్రామాల్లో టాం టాం వేయిస్తాం.అప్పుడు మీ గౌరవం పోతుంది. బ్యాంకులు నడవాలంటే సకాలంలో రుణాలు కట్టాలి. బకాయిలు చెల్లించకపోతే మీకు అప్పులు ఇచ్చేందుకు బ్యాంకులే కాదు వడ్డీ వ్యాపారులు కూడా ముందుకు రారు. మీకు ఎక్కడా అప్పులు పుట్టవు’ అంటూ హెచ్చరించారు. ’అదేంటి సార్. చంద్రబాబు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామన్నారు కదా. ఆయన మాటనమ్మి బాకీలు కట్టలేదు. ఇప్పుడేమో అసలు కంటే వడ్డీలు పెరిగిపోయాయ్. ఎలా కట్టగలం’ అని మహిళలు నిలదీశారు. ఆర్డీవో స్పందిస్తూ.. ’ఎవరు హామీ ఇచ్చారో వాళ్లను అడగండి. ఎవరో చెప్పిన మాటలు నమ్మి.. ఎవరికోసమో ఎదురుచూస్తూ రుణాలు చెల్లించడం మానేయవద్దు’ అన్నారు. ’బకాయిలు చెల్లించకపోతే ఆస్తులన్నీ వేలం వేస్తారు. మీకు ఇష్టమేనా’ అని ప్రశ్నించారు. బడికెళ్లే మీ పిల్లల్ని డ్వాక్రా బకాయిలు ఎగ్గొట్టారంటగా అని తోటి విద్యార్థులు అడిగితే వాళ్లు తలదించుకోవాల్సి వస్తుందని హితోపదేశం చేశారు. బ్యాంకు రుణాలను వాయిదాలు లేదా వన్‌టైమ్ సెటిల్మెంట్ ద్వారా చెల్లించాలని సూపించారు. నెల రోజుల తరువాత ఇలా మాట్లాడే అవకాశం తమకు ఉండదన్నారు. ’కాగితాలొస్తాయి. మా తహసీల్దార్లు వస్తారు. రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం బకాయిలన్నీ ముక్కుపిండి వసూలు చేస్తారు’ అని హెచ్చరించారు. దీంతో అవాక్కవడం మహిళల వంతైంది. అధికారులకు లక్ష్యాలు డ్వాక్రా బకాయిలను రాబట్టుకునేందుకు మండల శాఖ అధికారులకు ప్రభుత్వం టార్గెట్లు ఇచ్చింది. మార్చినెలాఖరు నాటికి నూరు శాతం బకాయిలు వసూలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. డ్వాక్రా మహిళలపై ఒత్తిళ్లు పెరిగాయి. రంగంలోకి దిగిన అధికారులు సామదాన దండోపాయలను ప్రయోగిస్తున్నారు. బకాయిల వసూలు విషయంలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపే ప్రయత్నంలో భాగంగా వేధింపులకు దిగుతున్నారు. జిల్లాలోని డ్వాక్రా మహిళలు తీసుకున్న మొత్తం రుణాల్లో 1.32 శాతం (సుమారు 20 కోట్లు) మాత్రమే బకాయిలు ఉన్నాయి. మార్చి నెలాఖరు నాటికి దీనిని సున్నాగా చూపించే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఒక్క జీలుగుమిల్లి మండలంలోనే అత్యధికంగా రూ.3.50 కోట్ల మేర బకాయిలున్నాయి. పాత రుణాలు చెల్లిస్తే కొత్త రుణాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటామని మహిళలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. హామీ ఇచ్చి నోటీసులు పంపుతారా డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారు. నాలుగేళ్ల కిత్రం బ్యాంకు నుంచి మా గ్రూపు సభ్యులు రూ.2 లక్షల రుణం తీసుకున్నాం. రుణాలు కట్టవద్దని చంద్రబాబు హామీ ఇచ్చారు. తాను అధికారంలోకి రాగానే మాఫీ చేస్తానన్నారు. ఇప్పుడు రుణాలు కట్టకపోతే ఆస్తులు జప్తు చేయిస్తామని నోటీసులు పంపారు. ఇది ఎంతవరకు సమజసం. చదలవాడ రూత్కుమారి, డ్వాక్రా మహిళ, తోగుమ్మి హామీలు నమ్మి వీధిన పడ్డాం డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పి నమ్మించారు. ఎన్నికల సమయంలో ఎంపీ మురళీమోహన్ ఇంటింటికీ మరీ ఈ విషయం చెప్పారు. ఇప్పుడు బకాయిలు మాఫీ చేయకపోవడంతో వీధిన పడ్డాం. నోటీసులు ఇచ్చి బెదిరిస్తున్నారు. ఆర్డీవో వద్ద వివరణ ఇవ్వాలంటే కూలీ పనులు మానుకుని వచ్చాం. ముప్పిడి కుమారి, డ్వాక్రా మహిళ, తోగుమ్మి మోసం చేశారు డ్వాక్రా రుణాలు కట్టొద్దన్నారు. మాఫీ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారు .రుణం తీసుకుని మూడేళ్లయ్యింది. ప్రభుత్వం హామీ ఇవ్వకపోతే వాయిదాలు కట్టేసేవాళ్లం. ఇప్పుడు రుణాలపై వడ్డీలు పెరిగి తడిసిమోపెడయ్యాయి. ఇచ్చిన మాట నిలుపుకోలేనప్పుడు హామీ ఇవ్వడం ఎందుకు. పేదలను మురిపించి ముంచేశారు. రుణాలు మాఫీ చేయమని మేం అడిగామా. ఇప్పుడు కట్టకపోతే ఇళ్లకు తాళాలు వేస్తామని బెదిరిస్తున్నారు. కాకులపాటి మల్లేశ్వరి, డ్వాక్రా మహిళ బకాయిలు చెల్లించాల్సిందే బకాయిల చెల్లింపుల్లో మన జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్ధానంలో ఉంది. ఇంకా సుమారు రూ.19 కోట్లు బకాయిలు ఉన్నాయి. వీటి వసూలు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం. వడ్డీ లేని రుణాలు పొందాలంటే సకాలంలో రుణాలు చెల్లించాలి. జీలుగుమిల్లి మండలంలో అత్యధికంగా రూ.3.50 కోట్లు బకాయిలు ఉన్నాయి. మార్చి నెలాఖరు నాటికి బకాయిలన్నీ వసూలు చేయాలని ప్రయత్నిస్తున్నాం. కె.శ్రీనివాసులు, ప్రాజెక్టు డైరెక్టర్, డీఆర్డీఏ -
ఆర్డీఓల బదిలీ
- కర్నూలుకు మల్లికార్జున - నంద్యాలకు రాంసుందర్‌రెడ్డి నియాకం - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం కర్నూలు(అగ్రికల్చర్): ఎట్టకేలకు ఆర్డీఓల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు వచ్చాయి. కర్నూలు ఆర్డీఓగా మల్లికార్జున, నంద్యాల ఆర్డీఓగా రాంసుందర్‌రెడ్డిలను నియమించారు. కర్నూలు జిల్లాకు చెందిన మల్లికార్జునను ఇదే జిల్లాలో ఆర్డీఓగా నియమించడం విశేషం. గతంలోఇతను కర్నూలు, కోడుమూరు, గూడూరు, సి. బెళగల్, గోనెగండ్ల, తహసీల్దార్‌గా పనిచేశారు. ప్రస్తుతం హంద్రీనీవా సుజల స్రవంతి యూనిట్–4లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారిగా పనిచేస్తున్నారు. కర్నూలు ఆర్డీఓగా పనిచేస్తున్న రఘుబాబును కాకినాడ బదిలీ చేశారు. ఈయన మూడేళ్ల పాటు ఇక్కడ పనిచేశారు. నంద్యాల ఆర్డీఓగా రాంసుందర్‌రెడ్డి నియమితులయ్యారు.ఇతను గతంలో ఆదోని ఆర్డీఓగా దాదాపు రెండేళ్ల పాటు పనిచేశారు. ప్రస్తుతం విజయవాడలో ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పోరేషన్ ఈడీగా పనిచేస్తున్నారు. ఇంతవరకు నంద్యాల ఆర్డీఓగా పనిచేసిన సుధాకర్‌రెడ్డి హంద్రీనీవా సుజల శ్రవంతి యూనిట్–4 స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం జరుగుతోంది. తుది ఓటర్ల జాబితాను జనవరి 16న ప్రకటిస్తారు. ఓటర్ల జాబితా సవరణకు ఆటంకం లేకపోతే వీరిని రిలీవ్ చేయవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కర్నూలు, నంద్యాల ఆర్డీఓలు రిలీవ్ కావడం, కొత్త ఆర్డీఓలు బాధ్యతలు స్వీకరించడం జిల్లా కలెక్టర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. -
ఆర్డీవోలను వేధిస్తున్న ప్రభుత్వం: బీజేపీ
సాక్షి, హైదరాబాద్: 50 మంది ఆర్డీవో స్థారుు అధికారులకు నాలుగు నెలలుగా పోస్టింగులు ఇవ్వకుండా, వేతనాలు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం వేధిస్తోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్.మల్లారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. కొత్త జిల్లాల్లో అధికారుల కొరత దృష్ట్యా తక్షణమే ఆర్డీవోలతోపాటు ఖాళీగా ఉన్న అధికారులకు పోస్టింగులిచ్చి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తగినంత మంది ఐఏఎస్, ఐపీఎస్‌లు లేరని, పరిపాలనా సౌలభ్యం కోసం మరింత మందిని కేటారుుంచాలంటూ పదేపదే కేంద్రాన్ని కోరుతున్న ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అధికారుల సేవలను సద్వినియోగం చేసుకోవడంపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. ఆజాద్ దిష్టి బొమ్మ దహనం... ఉడీ ఘటనలో మృతి చెందిన సైనికులకంటే నోట్ల రద్దుతో చనిపోరుున ప్రజలే అధికంగా ఉన్నారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ యువమోర్చా నాయకులు శుక్రవారం ఇక్కడ పంజగుట్ట చౌరస్తాలో ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆజాద్ వ్యాఖ్యలు సైనికులను అవమానించేలా ఉన్నాయని, తక్షణమే జాతికి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. -
‘దొంగ పాస్ పుస్తకాల’పై విచారణ
వినుకొండ టౌన్: దొంగ పాస్ పుస్తకాల తయారీ, ఆన్లైన్ చేయటానికి అందినకాడికి గుంజుతున్నారన్న అరోపణలపై రెవెన్యూ డివిజనల్ అధికారి రవీంద్ర దర్యాప్తు చేయనున్నారన్న సమాచారం వినుకొండ ప్రాంతంలోని రెవెన్యూ ఉద్యోగుల్లో బుధవారం కలకలం రేపింది. ఇప్పటి వరకు అప్రతిహాతంగా కొనసాగిస్తున్న అవినీతి బండారం ఎక్కడ బట్టబయలవుతుందోనని రెవెన్యూ సిబ్బందిలో ఆందోళన మొదలైంది. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో అవినీతి వీఆర్వోలు తమ తప్పులు కప్పి పుచ్చుకోవడానికి అప్పుడే దిద్దుబాటు చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. ‘సాక్షి’ పత్రికలో వచ్చిన కథనం మేరకు మండల అధికారుల నుంచి ఆర్డీవో ఇప్పటికే కొంత సమాచారం సేకరించినట్లు సమాచారం. దీంతో రెవెన్యూ ఉద్యోగులు ఈ విషయం అటు తిరిగి ఇటు తిరిగి తమ మీదకు ఎక్కడ వస్తుందోనని గుమ్మనంగా వ్యవహరిస్తున్నారు. పాస్ పుస్తకాలు, ఆన్లైన్ నమోదులో సాక్ష్యాధారాలతో సహా ఓ మహిళా వీఆర్వో అడ్డంగా బుక్కవ్వడం, బాధితులు పోలీసులను ఆశ్రయించడం పట్టణంలో చర్చనీయాంశం అయింది. ఆర్డీవో నిష్పక్షపాతంగా విచారణ చేస్తే రైతులకు మేలు చేసిన వారవుతారని అనుకుంటున్నారు. అవినీతి వీఆర్వోలు, వారికి సహకరించిన అధికారుల భరతం పట్టడం వల్ల పారదర్శకంగా ఆన్లైన్లో భూ యజమానుల పేర్లు పైసా ఖర్చు లేకుండా ఎక్కించుకోగలమని పేద రైతులు భావిస్తున్నారు. -
ఆమోదయోగ్యమైన ధర చెల్లిస్తాం
–ఆర్డీవో బి.శ్రీనివాసరావు వెల్లడి కొవ్వూరు–గుండుగోలను జాతీయ రహదారి–16 ఆరులైన్ల విస్తరణలో భాగం సేకరించే భూములకు రైతులకు ఆమోదయోగ్యమైన ధరలు చెల్లించేందుకు ప్రయత్నిస్తామని ఆర్డీవో బి.శ్రీనివాసరావు స్వష్టం చేశారు.శనివారం సాయంత్రం ఆర్డీవో కార్యాలయంలో పట్టణ పరిధిలో భూములు కొల్పోయే రైతులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా భూసేకరణలో భాగంగా ఇచ్చిన నోటిఫికేషన్‌పై పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.జాతీయ రహదారుల భూసేకరణ చట్టం సెక్షన్ 3( సీ) ప్రకారం రైతులను ఆర్డీవో అభ్యంతరా లు స్వీకరించారు.పురపాలక సంఘం పరిధిలో ఉన్న భూములకు వాణిజ్య పర ంగా విలువ అధికంగా ఉన్నందున అత్యధిక నష్టపరిహారం ఇప్పించాలని రైతులు కోరారు.ప్రస్తుతం కొవ్వూరులో నడుస్తున్న «భూముల ధరలను పరిగణనలోకి తీసుకుని పరిహారం చెల్లించాలని రైతులు కోరారు.పోలాల్లో ఉన్న మురుగునీరు బయటికి వెళ్లడానికి అనువుగా ఉన్న కాలువలు, డ్రయిన్లు రోడ్డు నిర్మాణ సమయంలో పరిగణనలోకి తీసుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అర్భన్ బ్యాంకు చైర్మన్ మద్దిపట్ల శివరామకష్ణ కోరారు.లేదంటే మిగిలిన రైతుల భూములన్నీ ముంపుబారిన పడే ప్రమాదం ఉందన్నారు. రైతులు పోలాలల్లోని పంటను బయటికి తీసుకెళ్లెందుకు అనువుగా తక్కువ దూరంలోనే సర్వీసు రోడ్లు ఏర్పాటు చేయించాలని రైతులు కోరారు. నాయకులు ముదునూరి నాగరాజు,ముదునూరి సత్తిరాజు, గండ్రోతు కోదండరామారావు, పి.వెంకట సుబ్బరాజు, ఏ.నాగేశ్వరరావు, పి.సత్యనారాయణ రాజు, డి.సందీప్‌కుమార్, గోలి.శ్రీనివాస చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీవో @ రూ.30 కోట్లు
సాక్షి, నెట్వర్క్: ప్రకాశం జిల్లా రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ (ఆర్టీవో) కె.రాంప్రసాద్‌కు చెందిన ఆస్తులపై ఏసీబీ అధికారులు గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఒంగోలు, నెల్లూరు, గూడూరు, గుంటూరు, తెనాలి, వినుకొండ, బెంగళూరు ప్రాంతాల్లోని ఆర్టీవోకు చెందిన ఆస్తులతో పాటు బంధువుల ఇళ్లపై నెల్లూరు ఏసీబీ డీఎస్పీ తోట ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈ సోదాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆదాయానికి మించి దాదాపు రూ.30 కోట్లకు పైగా విలువైన ఆస్తులను గుర్తించినట్లు సమాచారం. బయటపడిందిలా..: రాంప్రసాద్ కుమార్తెకు నెల్లూరు ఆర్డీవో కార్యాలయ ఏవో వరకుమార్ కుమారుడితో వివాహమైంది. అల్లుడికి కట్నం కింద రూ. 1.50 కోట్ల నగదు, కిలో బంగారు ఆభరణాలు, ఎకరా స్థలం, ఒక ప్లాటు ఇస్తానని రాంప్రసాద్ ఒప్పందం కుదుర్చుకొన్నట్లు సమాచారం. కానీ కట్నం తక్కువ ఇచ్చాడని.. ఈ విషయమై గొడవల నేపథ్యంలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఆర్డీఓ కార్యాలయంలో అన్ని వసతులు కల్పించాలి
కోదాడఅర్బన్ : పట్టణంలోని ఎన్ఎస్పీ క్యాంపులో నూతనంగా ఏర్పాటు చేసే ఆర్డీఓ కార్యాలయంలోని సౌకర్యాలను గురువారం రాత్రి జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎన్.సత్యనారాయణ పరిశీలించారు. కార్యాలయ భవనంలో అన్ని గదులను కలియదిరిగి చూశారు. కార్యాలయం ప్రారంభం నాటికి అన్ని వసతులు కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యాలయం ముందు గ్రీన్‌బెల్టు ఏర్పాటు చేయాలని, కార్యాలయానికి చుట్టూ ఫెన్సింగ్ లేదా ప్రహరీ గోడ నిర్మించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏర్పాట్లపై అసంతృప్తి వ్యక్తం చేసిన జేసీ.. కార్యాలయం ఏర్పాటుకు సంబంధించినపనులు నత్తనడకన జరుగుతుండడం పట్ల జేసీ అసంతృప్తి వ్యక్తం చేశారు. నెల 11న కార్యాలయం ప్రారంభం కానుందని తెలిసినా పనులు చురుకుగా సాగకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. కార్యాలయం ప్రారంభోత్సవానికి జిల్లా మంత్రి రానున్నందున ఈ నెల 10వ తేదీ నాటికి అన్ని పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట ఆర్డీఓ నారాయణరెడ్డి, కోదాడ తహసీల్దార్ వి.శ్రీదేవి, డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వరశర్మ, ఆర్ఐ జానకిరామిరెడ్డి, పలువురు వీఆర్ఓలు పాల్గొన్నారు. -
వేధిస్తున్నారని ఆర్డీవోకు ఫిర్యాదు
పళ్లిపట్టు: నివాసం ఉంటున్న ఇళ్లను ఖాళీ చేయాలని వేధిస్తున్నట్లు తొయిదావూర్ దళితులు తిరుత్తణి ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. తిరుత్తణి తాలూకాలోని తిరువాలాంగాడు మండలం తొయిదావూర్ దళితవాడలో దాదాపు 150 కుటుంబాల వారు నివాసం ఉంటున్నారు. ఈ ప్రాంతంలో దాదాపు 300 సంవత్సరాల పురాతన ఆదికుమరేశ్వరర్ ఆలయం దుస్థితికి చేరుకుని శిథిలావస్థలో ఉండేది. ఆ ఆలయాన్ని కొంత మంది మరమ్మతులు చేపట్టి దీపం వెలిగించి పూజలు నిర్వహిస్తున్నారు. అయితే ఆ ఆలయంలో విలువైన ఆభరణాలు ఉన్నందునే కొందరు పథకం ప్రకారం ఆలయాన్ని తమ చేతుల మీదకు తీసుకుని ఆలయానికి సమీపంలోని వున్న దళితుల ఇళ్లు కూల్చేందుకు కుట్ర పన్ని వేధిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం తిరుత్తణిలోని ఆర్డీవో కార్యాలయం చేరుకున్న దళిత కుటుంబాలవారు తమ నివాస ప్రాంతాలను తొలగించేందుకు కొందరు ఆలయం పేరిట కుట్ర చేస్తున్నట్లు ఆలయంలోని విలువైన ఆభరణాలు దోపిడీ చేసేందుకు వీలుగా కుట్ర చేస్తున్నట్లు ఆరోపిస్తూ ఆర్డీవో విమల్‌రాజ్‌కు ఫిర్యాదు చేశారు. దళితుల ఫిర్యాదు స్వీకరించిన ఆర్డీవో తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
ప్రజలు సంతృప్తి చెందేలా పనిచేయండి
ఆర్డీఓలు, డీఎస్పీల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సాక్షి, అమరావతి: ప్రజలంతా ప్రభుత్వం పట్ల సంతృప్తి చెందే విధంగా పరిపాలన సాగించాలని సీఎం చంద్రబాబు ఆర్డీఓలు, డీఎస్పీలకు సూచించారు. వినూత్న ఆలోచనలతో పరిపాలనను ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. విజయవాడలో మంగళవారం సబ్ కలెక్టర్లు, రెవెన్యూ డివిజన్ అధికారులు, డీఎస్పీల సమావేశంలో చంద్రబాబు ప్రసంగించారు. ప్రజలు విజ్ఞానం, ఆరోగ్యం, సంపద, సంతోషం పొందేలా అధికారులు పని చేయాలన్నారు. ఇందుకు అవసరమైన పాలనా పరమైన సంస్కరణలను సూచించాలని కోరారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం నెలకు రూ.10 వేలు సంపాదించేలా ఆర్డీఓలు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ.. పట్టాదారు పాస్ పుస్తకాలను రద్దు చేయలేదన్నారు. వాటిని అవసరమైన వారు ఉపయోగించుకోవచ్చని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ.. పోలీసు అధికారులు శాంతి భద్రతలను పరిరక్షిస్తూ రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని అన్నారు. కాగా, ప్రభుత్వాసుపత్రుల్లో జన్మించే శిశువులకు ఎన్టీఆర్ సురక్ష కిట్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకాన్ని చంద్రబాబు ఆర్డీఓలు, డీఎస్సీల సమావేశంలో ప్రారంభించారు. -
విద్యార్థులు సేవాదృక్ఫథాన్ని అలవర్చుకోవాలి
కొండ్రపోల్(దామరచర్ల): విద్యార్థులు సేవాదృక్పథాన్ని అలవర్చుకోవాలని ఆర్డీఓ బి.కిషన్‌రావు కోరారు. శుక్రవారం దామరచర్ల మండలం కొండ్రపోల్‌లో వ్యవసాయ విద్యార్థుల ఎన్ఎస్ఎస్ శిబిరాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ మానవాళికి మేలు చేసే సేవా కార్యక్రమన్నారు. వారం రోజులపాటు జరిగే ఈకార్యక్రమంలో గ్రామస్తులతో మమేకమై వారి జీవన శైలిని, స్థితితిగతులను గమనించాలని కోరారు. విద్యార్థులు చదువుల అనంతరం ఎప్పుడూ కూడా వ్యక్తిత్వాన్ని వదులుకోవద్దన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అసోసియేటెడ్ డీన్ విష్ణువర్ధన్‌రెడ్డి, తహసీల్దార్ గణేష్, సర్పంచి అడావత్ అచ్చమ్మ ఆనంద్, హెచ్ఎం భీమ్లానాయక్, శాస్త్రవేత్తలు రవీంద్రానాయక్, రాజేశ్వర్‌నాయక్, బాలాజీనాయక్, ముర ళి పాల్గొన్నారు. -
ఆర్డీఓకు నయీమ్ బాధితురాలి ఫిర్యాదు
భువనగిరి న యీమ్ అనుచరులు తన భూమిని ఆక్రమించుకున్నారని మండలంలోని హన్మాపురం గ్రామానికి చెందిన సాధినేని మంజు సోమవారం భువనగిరి ఆర్డీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. వివరాలు ఆమె మాటల్లోనే.. మంజు ఆమె భర్త సాధునేని హరినాథ్‌కు హన్మాపురంలో 2.21 ఎకరాల భూమి ఉంది. ఆమె భర్త సాధినేని హరినాథ్ 26–06–2015న అనారోగ్యంతో మృతిచెందారు. ఆయన బతికి ఉన్న సమయంలో (2.21) ఎకరాల భూమిని ప్రేమ్‌కుమార్ అనే వ్యాపారి కొనుగోలు చేశారు. అ వ్యాపారి పూర్తిగా డబ్బులు ఇవ్వకుండా వాయిదాల వారీగా కొన్ని ఇచ్చాడు. పూర్తిగా డబ్బులు ఇవ్వలేదు. ఇంకా రావాల్సిన డబ్బు గురించి ప్రేమ్‌కుమార్‌ను అడిగితే ఇంకా అతను రూ. 10,50,000 లక్షలు బకాయి ఉన్నట్లు చెప్పాడు.. మిగతా డబ్బులు ఎప్పుడు ఇస్తావని అడిగితే ఒక వారం తరువాత ఇస్తానని చెప్పాడు. మళ్లీ ఒత్తిడి చేస్తే ఢిల్లీ Ðð ళ్లి గిరిష్జాజు అనే వ్యక్తి నుంచి తీసుకవస్తానని వివరించాడు. ఈ సమయంలో మా బావ రఘు అనే వ్యక్తి మాకు డబ్బులు ఇవ్వకూడదు అని చెప్పాడు. దీంతో వ్యాపారి మీకు డబ్బులు కావాలంటే మీ బావను కూడా తీసుకుని రావాలని వ్యాపారి చెప్పాడు. ఈ క్రమంలో రఘు కోర్టులో పిటిషన్ వేశాడు. నేను నీకు డబ్బులు ఇవ్వను కోర్టులోనే చెల్లిస్తాను అని వ్యాపారి చెప్పాడు. కానీ ఇంత వరకు ఇవ్వలేదు. అనంతరం వాయిదాలు వేస్తూనే ఓ రోజు భువనగిరిలో డబ్బు చెల్లిస్తానని చెప్పిన ప్రేమ్‌కుమార్ తన వద్ద పనిచేసే కంచుకుంట్ల లక్ష్మయ్యను పంపించాడు. ఆయన నేరుగా తనను నÄæూమ్ అనుచరుడు షకీల్ వద్దకు తీసుకెళ్లాడు. షకీల్ చంపుతానని బెదిరించి బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని తెలిపింది. దీంతో ప్రాణభయంతో పుట్టింటికి వెళ్లి అక్కడే జీవనం సాగిస్తున్నానని తెలిపింది. అయితే ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో నÄæూమ్ బాధితులను ఆదుకుంటామని ప్రభుత్వ ప్రకటన చూసి న్యాయం చేయాలని అధికారులకు ఫిర్యాదు చేసినట్టు వివరించింది. -
జనగామ ఆర్డీఓపై జేసీకి ఫిర్యాదు
హన్మకొండ అర్బన్ : దళితులకు భూమి కొనుగోలు పథకం కింద కొడకండ్ల మండలం పెద్దవంగరలో అనర్హులకు భూములు కేటాయించారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ మేరకు గురువారం ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆధ్వర్యంలో కలెక్టరేట్‌కు వచ్చి జేసీ ప్రశాంత్ జీవన్‌పాటిల్‌కు వినతిపత్రం అందజేశారు. గ్రామసభ తీర్మానం లేకుండా లబ్ధిదారులను ఎంపికచేశారని ఈ విషయంలో జనగామ ఆర్డీఓ పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించారు. గ్రామస్తులు తీవ్ర ఆగ్రహంతో ఆర్డీఓపై మాటల దాడితో విరుచుకుపడ్డారు. దీంతో జేసీ, ఎమ్మెల్యే కలుగజేసుకుని శాంతిం పజేశారు. ఈ విషయంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని జేసీ హామీ ఇచ్చారు. గ్రామంలో 33 ఎకరాలు కొనుగోలు చేసి ఎలాంటి తీర్మానం లేకుండా 11 మందికి కేటాయించారన్నారు. -
ఆస్పత్రిలో ఆర్డీఓ విచారణ
– డబ్బులు తీసుకుంటున్నారని రోగుల బంధువుల ఫిర్యాదు నల్లగొండ రూరల్ చేయి చాపుతాం...ఇస్తేనే తీసుకుంటాం సార్ అని ఆస్పత్రి సిబ్బంది...కాదూ సార్ వంద ఇస్తే భిక్షం ఇస్తున్నావా అంటు ముఖంపై విసిరేస్తున్నారు...అడిగినంత ఇవ్వకపోతే రాబందుల్లా వేధిస్తున్నారు.. అంటూ విచరాణాధికారి ముందు రోగులు తమ గోడును వెల్లబోసుకున్నారు. జలగలే నయం అనే శీర్షికన గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ సీరియస్ అయ్యారు. ఆయన ఆదేశాల మేరకు నల్లగొండ ఆర్డీఓ ఇ.వెంకటాచారి శనివారం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి కాన్పులవార్డులో పనిచేసే సిబ్బందిని, రోగుల కుటుంబ సభ్యులను విచారించారు. విచారణ సాగింది ఇలా.. ఆర్డీఓ ః ఎంత తీసుకుంటున్నారమ్మా అంటూ సిబ్బందిని ప్రశ్నించారు. సిబ్బంది ః చేయి చాపుతున్నాం...ఇస్తే తీసుకుంటున్నాం...రూ.100, 50 ఇస్తున్నారు సార్. రోగిబంధువు ః కాదు సార్ రాబందుల్లా పీక్కుతింటున్నారు. ప్రతిపనికి ఒక రేటు ఫిక్స్ చేసుకుని ఇచ్చేంత వరకు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. ఆర్డీఓ ః ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారంటు సిబ్బందిని నిలదీత సిబ్బంది ః జీతాలు పెరిగి దగ్గర నుంచి తీసుకోవడం లేదు సార్... రోగి బంధువు ః డాక్టర్లు వచ్చిపోయేంత వరకు బాగానే ఉంటారు. తరువాత డబ్బుల కోసం పీడిస్తున్నారు. ప్రైవేటు దవాఖానాకు ఇక్కడకు ఏం తేడా లేదు సార్. ఆర్డీవో ః నీ జీతం ఎంత సిబ్బందికి ప్రశ్న సిబ్బంది ః రూ.40వేలు సార్... ఆర్డీఓ ః రూ.40వేల జీతం సరిపోవడం లేదా...ప్రభుత్వం ఇంత జీతం ఇచ్చి నియమిస్తే విధులు నిర్వహించకుండా రోగులను ఇబ్బంది పెట్టడం వలన జిల్లా పరిపాలనకు, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చినట్లవుతుంది. ఆస్పత్రి నుంచి వెళ్లేపోయే వరకు ఒక్కో పేషెంట్ దగ్గర రూ.6 నుంచి 8వేల వరకు అడుగుతున్నట్లు చెబుతున్నారు. రోగిబంధవు ః రూ.100 ఇస్తే ముఖంపై విసిరారు సార్...ఇబ్బంది పెడుతున్నారని వారు అడిగినంత ఇచ్చాను. పక్క బెడ్‌పై ఉన్న పేషెంట్ భర్త డబ్బులు లేవని దండం పెట్టినా వినిపించుకోలేదు. ఆటో నడుపుతున్న తెలిసిన వ్యక్తి దగ్గరకు వెళ్లి బతిమిలాడి డబ్బులు తెచ్చుకుని సిబ్బందికిచ్చినా చెప్పి ఏడ్చాడు సార్. పరిస్థితి ఏంటో మీరే అర్థం చేసుకోండి సార్. ఆర్డీవో ః వైద్యులు ఈ విషయాలు మీ దృష్టికి వచ్చాయా... వైద్యులు ః మేము బాగానే విధులు నిర్వహిస్తున్నాం. సిబ్బంది వలనే ఆస్పత్రికి చెడ్డపేరు వస్తోంది. పనిష్మెంట్ లేకపోవడం వలనే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి. అయితే డబ్బులు తీసుకుంటున్నారనే మాకు చెప్పినప్పుడు పద్ధతి మార్చుకోవాలని సిబ్బందిని హెచ్చరిస్తున్నాం సార్. -
మేడారం పెద్ద చెరువును పరిశీలించిన ఆర్డీఓ
పెద్దఅడిశర్లపల్లి మండల పరిధిలోని మేడారం పెద్దచెరువును బుధవారం దేవరకొండ ఆర్డీఓ గంగాధర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు మేడారం పెద్ద చెరువు నిండడం శుభపరిణామమన్నారు. చెరువు కింద ఉన్న గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాతావరణశాఖ సూచన మేరకు మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఆయన వెంట తహసీల్దార్ ధర్మయ్య, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. -
నయీం ఆగడాలపై ఫిర్యాదుల వెల్లువ
-
సస్పెన్షన్ ఎత్తివేయకుంటే ఉద్యమిస్తాం
ఏలూరు (మెట్రో) : వీఆర్వో దుర్గారావును ఆర్డీవో చేయి చేసుకోవడం తప్పు కాదా అని జిల్లా వీఆర్వోలు, రెవెన్యూ సంఘ నాయకులు ప్రశ్నిం చారు. శుక్రవారం సాయంత్రం స్థానిక రెవెన్యూ భవన్లో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు ఎల్.విద్యాసాగర్ మాట్లాడుతూ వీఆర్వో దుర్గారావుకు కలెక్టర్ సొమ్ములు ఇచ్చి అది లంచం అని చెప్పడం ఎంతవరకూ సమంజసమన్నారు. కనీసం నేటికీ బాధితుల వద్ద నుంచి ఎటువంటి ఫిర్యాదు అందలేదని, అయినప్పటికీ తహసీల్దార్‌తో బలవంతంగా నివేదిక తెప్పించుకుని దుర్గారావును సస్పెండ్ చేశారన్నారు. జిల్లాలో అవినీతి అంతా జిల్లా అధికారుల వద్దే ఉందని, కిందిస్థాయి ఉద్యోగుల పట్ల నిరాధార ఆరోపణలు చేసి సస్పెన్షన్ వేటు వేయడం సరికాదని సాగర్ అన్నారు. కార్యదర్శి కె.రమేష్ మాట్లాడుతూ ఇటీవల జమాబంధీ పేరుతో ఒక్కో వీఆర్వో రూ.10 వేల నుంచి రూ. 20 వేలు వసూలు చేసి ఇచ్చారని, ఈ లంచాలు తీసుకున్న ఉన్నతాధికారులు నిజాయతీపరులా అని ప్రశ్నించారు. బలవంతంగా సొమ్ములు ఇచ్చి దానికి లంచం అని పేరుపెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దుర్గారావుపై సస్పెన్షన్ ఎత్తివేయకుంటే ఎన్జీవోలు, రెవెన్యూ, జేఏసీ సంఘాల ఆ««దl్వర్యంలో ఉద్యమిస్తామని రమేష్ చెప్పారు. పలువురు నాయకులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ కార్యాలయాల భవనాల పరిశీలన
సూర్యాపేట : సూర్యాపేటలోని ప్రభుత్వ కార్యాలయాల భవనాలను శుక్రవారం సూర్యాపేట ఆర్డీఓ సి.నారాయణరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సూర్యాపేట ఎంపీడీఓ, స్త్రీశక్తి భవనం, పాత మున్సిపల్ , సహకార బ్యాంకు కార్యాలయం, మున్సిపల్ కాంప్లెక్స్ భవనాలను పరిశీలించారు. ఈ భవనాల్లో జిల్లా కార్యాలయాలు అనువుగా నెలకొల్పిందేందుకు వీలుగా ఉన్నాయా.. లేవా.. అని చూశారు. భవనాల పరిస్థితి, వాటి అంచనాలను రికార్డుల్లో నమోదు చేయించారు. ఆయన వెంట తహసీల్దార్ మహమూద్ అలీ, ఆర్ఐలు ప్రభుకుమార్, సిబ్బంది ఉన్నారు. -
కాణిపాకం ఉత్సవాలకు సన్నద్ధం
– ఏర్పాట్లపై అధికారులకు ఆర్డీవో సూచనలు – విజయవంతం చేయాలని ఆదేశాలు కాణిపాకం(ఐరాల): కాణిపాకంలో సెప్టెంబర్ 5వ తేదీ నుంచి నిర్వహించనున్న వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని ఆర్డీవో కోదండరామిరెడ్డి అన్నారు. సోమవారం కాణిపాకంలోని ఆలయ గెస్ట్ హౌస్‌లో అధికారులతో జరిగిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా వసతి సౌకర్యాల కల్పనకు అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు,సిబ్బంది కృషి చేయాలన్నారు. పూతలపట్టు నుంచి కాణిపాకం వరకు రోడ్డు మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలని ఆర్ అండ్ బీ అధికారులకు సూచించారు. భక్తులకు అత్యవసర సేవల్లో భాగంగా ఆలయం వద్ద 24గంటలు వైద్య సేవలు అందించడానికి ప్రత్యేక వైద్య శిబిరాన్ని,108 వాహనాన్ని ఏర్పాటు చేయాలని ఆలయ అధికారులను ఆదేశించారు. తాగునీటి వసతి కల్పించాలని, పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని గ్రామ పంచాయతీ అధికారులకు సూచించారు. భక్తుల సౌకర్యార్థం ఉదయం నుంచి రాత్రి 11గంటల వరకు ప్రతి ఐదు నిమిషాలకు బస్సు నడపాలని ఆర్టీసీ అధికారులను కోరారు. బ్రహ్మోత్సవాలు జరిగే 21 రోజులు మద్యం దుకాణాలను రాత్రి 8 గంటలకే మూసివేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్వామి వారి ఊరేగింపు సమయంలో బాణసంచా కాల్చకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆలయ ఈవో పూర్ణచంద్రరావు,ఉభయదారుల సంఘం అధ్యక్షుడు ఈశ్వర బాబు, జెడ్పీటీసీ సభ్యురాలు లత, కాణిపాకం సర్పంచ్ మధుసుధన్ రావు, డెప్యూటీ తహశీల్దార్ నరేష్ బాబు , ఎంపీడీవో పార్వతమ్మ,ఆలయ అదనపు ఈఈ మురళి బాలకృష్ణæ, ఏఈవోలు కేశవరావు, సూపరింటెండెంట్లు రవీంద్ర,స్వాములు,ఆలయ ప్రధాన అర్చకులు ధర్మేశ్వర గురుకుల్, 14 గ్రామాల ఉభయదారులు పాల్గొన్నారు. -
రచ్చకెక్కిన ఉద్యోగుల గొడవ
విచారణ చేపట్టిన ఆర్డీవో ఇద్దరూ ఉద్యోగుల పై బదిలీ వేటు..? వేములవాడ రూరల్ : స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఉద్యోగుల మధ్య సమన్వయం లోపించింది. పరస్పరం దూషించుకోవడం తారస్థాయికి చేరింది. సమాచారం అందుకున్న సిరిసిల్ల ఆర్డీవో శ్యామ్‌ప్రసాద్‌లాల్ ఘటనపై విచారణ చేపట్టారు. వివరాలు.. తహసీల్దార్‌కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ గంగాధర్, వీఆర్వో రాజయ్యకు మధ్య శనివారం ఓ విషయంలో గొడవ జరిగింది. ఇది తీవ్రస్థాయికి చేరడంతో జిల్లా అధికారులు విచారణకు ఆదేశించారు. ఆర్డీవో సోమవారం విచారణ చేపట్టారు. గొడవకు కారణమైన అంశాలపై ఇద్దరి నుంచి లిఖితపూర్వకం పత్రాలు స్వీకరించారు. వీఆర్వోలు, ఆర్ఐల నుంచి సైతం సమాచారం సేకరించారు. ‘అవినీతి’ ప్రక్రియ ఉద్యోగుల మధ్య గొడవకు దారితీసిందనే ఆరోపణలు వస్తున్నాయి. డెప్యూటీ తహసీల్దార్ సాక్షిగా ఇద్దరు ఉద్యోగులు గొడవ పడ్డ తీరు కార్యాలయానికి వచ్చిన ప్రజలు ఆశ్చర్యానికి లోనయ్యారు. గొడవతో రచ్చకెక్కిన ఈ ఇద్దరు ఉద్యోగులపై బదిలీ వేటు పడనున్నట్లు తెలిసింది. కొన్నేల్లుగా ఇక్కడే విధులు నిర్వర్తిస్తున్న వీరిద్దరూ లావాదేవీల్లో ఏర్పడ్డ విభేదాలతోనే గొడవకు దిగినట్లు సమాచారం. ఈవిషయంపై తహసీల్దార్ శ్రీనివాస్‌ను వివరణ కోరడానికి ప్రయత్నించగా ఆయన ఓ సమావేశంలో ఉన్నట్లు తెలిసింది. -
మొద్దుగుట్ట ఎన్‌కౌంటర్‌పై రెండో విచారణ
ములుగు : గత సంవత్సరం సెప్టెంబర్ 15వ తేదీన గోవిందరావుపేట మండలం మొద్దుగుట్ట వద్ద జరిగిన ఎన్కౌంటర్ లో భాగంగా అధికారి ఆర్డీఓ చీమలపాటి మహేందర్‌జీ బుధవారం రెండో విచారణ జరిపారు. విచారణకు తాడ్వా యి, గోవిందరావుపేట మండలాల తహసీల్దార్లు, రంగాపురం, చల్వాయికి చెందిన నలుగురుని, ఇద్దరు పోలీస్ సిబ్బంది, పస్రాకు చెందిన ఓ నాయకుడు హాజరయ్యారు. విచారణలో వారు ఆర్డీఓకు వాంగ్మూలం ఇచ్చారు. కాగా, ఈ నెల 3వ తేదీన ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన శృతి, విద్యాసాగర్ తల్లిదండ్రులు, మానవహక్కులు సంఘాల సభ్యులు విచారణ అధికారి ముందు హాజరై తమ వాంగ్మూలాలను సమర్పించిన విషయం తెలిసిందే. -
అజ్మాపురం ఘాట్‌ను పరిశీలించిన ఆర్డీఓ
అధికారులు సమన్వయంతో పని చేయాలి – దేవరకొండ ఆర్డీఓ గంగాధర్ పెద్దఅడిశర్లపల్లి : మండలంలోని అజ్మాపురం పుష్కరఘాట్‌ను శుక్రవారం ఆర్డీఓ గంగాధర్ వివిధ శాఖల అదికారులతో కలిసి సందర్శించారు. అనంతరం సమావేశం ఏర్పాటు చేసి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులు సమన్వయంతో పని చేయాలని కోరారు. వివిధ శాఖల నుంచి 33 సిబ్బందికి డ్యూటీ వేసినట్లు తెలిపారు. వీరందరూ ఘాట్ వద్ద మూడు షిఫ్టుల్లో పని చేయాల్సి ఉంటుందన్నారు. రెండు మూడు రోజుల్లో పనులన్నీ పూర్వవుతాయని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో అజ్మాపురం పుష్కర ఘాట్ ఇన్చార్జి, సెరికల్చర్ ఏడీ అశోక్, తహసీల్దార్ ధర్మయ్య, ఎంపీడీఓ జావేద్‌అలీ, వైద్యాధికారి హిమబిందు,వలిగొండ తహసీల్దార్ అరుణ, పీఆర్ ఏఈ, ఆర్ఐ ముఖ్తార్ తదితరులున్నారు. -
రైతు ఆత్మహత్యలపై అధికారుల విచారణ
పూడూరు: రైతు ఆత్మహత్యలపై గురువారం చేవెళ్ల ఆర్డీఓ చంద్రమోహన్, డీఎస్పీ శృతకీర్తి మండల పరిధిలో జరిగిన రైతు ఆత్మహత్యలపై విచారణ చేపట్టారు. మండల పరిధిలో గతేడాది పూడూరు గ్రామానికి చెందిన రాము అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు గురువారం గ్రామంలో ఆత్మహ్యతకు గల కారణాలు, ఎలా జరిగింది, అప్పులు ఎన్ని ఉన్నాయని కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. గతంలో అప్పులు ఇచ్చిన వారిని పిలిపించి వారి వివరాలు నమోదు చేసుకున్నారు. చిన్న చిన్న విషయాలకు రైతులు ఆత్మహత్యలకు పాల్పడొద్దని ప్రభుత్వం అన్ని విధాల రాయితీలను అందిస్తోందని తెలిపారు. ఆర్డీఓ వెంట పూడూరు సర్పంచ్ యాదమ్మ, ఆర్ఐ మహేష్, నాయకులు తాజోద్దీన్, శ్రీనివాస్‌రెడ్డి, మల్లేష్, రామకృష్ణ తదితరులు ఉన్నారు. -
‘సువెన్’ సేవలు అభినందనీయం
సూర్యాపేటరూరల్ : సమాజ అభివృద్ధికి సువెన్ ట్రస్ట్ చేస్తున్న సేవలు అభినందనీయమని ఆర్డీఓ సి.నారాయణరెడ్డి అన్నారు. బుధవారం సువెన్ లైఫ్ సైన్సెస్ కంపెనీ ఆధ్వర్యంలో కంపెనీలో ఏర్పాటు చేసిన శాంతినగర్, కేసారం, దురాజ్‌పల్లి, ఖాసీంపేట ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బెంచీలు, నోట్‌బుక్స్ షూ, సాక్స్, టై, బెల్ట్స్ ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలోనూ కంపెనీ భాగస్వామ్యం కావాలని, మొక్కలను నాటడమే కాకుండా..వాటిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ సందర్బంగా ఆయా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సువెన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రెండు లక్షల విలువైన స్టడీ మెటీరియల్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట తహసీల్దార్ మహమూద్‌అలీ, ఎంఈఓ గ్లోరి, సర్పంచ్ బాలిని పద్మ, లింగస్వామి, ఎంపీటీసీ సూర సంధ్య, వెంకన్న, సువెన్ యూనిట్ హెడ్ వి.ఎస్ఎన్ మూర్తి, డీజీఎం బి.లక్ష్మణమూర్తి, ఏజీఎంలు సి.హెచ్ వీరయ్య, ఎం.కృష్ణారావు, పి.జగపతిరాయుడు, చంద్రహాస, రసూల్మదీన, ఎం.వెంకటరమణ, మేనేజర్లు డి.సుధాకర్, డి.వి శేషగిరిరావు, పి.వెంకటరమణ, పీఆర్ఓ బూర రాములుగౌడ్, పాఠశాలల హెచ్ఎంలు సురేష్, కట్కూరి రవీందర్‌రెడ్డి, నాగార్జున్‌రెడ్డి, నీరజ, మంగతాయారు పాల్గొన్నారు. -
తల్లిపాలతోనే సంపూర్ణ ఆరోగ్యం
నల్లగొండ టౌన్: తల్లిపాలు ఎంతో శ్రేష్టమైనవని తల్లిపాలతోనే చిన్నారులు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని నల్లగొండ ఆర్డీఓ వెంకటాచారి అన్నారు. మంగళవారం తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని స్థానిక జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి నుంచి నిర్వహించిన ర్యాలీని ఆయన జెండాను ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బిడ్డ పుట్టిన గంటలోపే తల్లిపాలను విధిగా పట్టించాలన్నారు. ముర్రుపాలలో రోగనిరోధక శక్తి ఉంటుందని, తల్లిపాలు చిన్నారుల ఆరోగ్యాలకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. జిల్లా కేంద్ర ఆస్పత్రి నవజాత శిశు సంరక్షణ కేంద్రం నోడల్ అధికారి డాక్టర్ దామెర యాదయ్య మాట్లాడుతూ చిన్నారులకు పుట్టినప్పటి నుంచి రెండేళ్ల వరకు తల్లిపాలనే తాగించాలన్నారు. డబ్బాపాల వల్ల ఎన్నో అనర్థాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో జిల్లా కేంద్ర ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ టి.నర్సింగరావు, డాక్టర్ శ్రీనివాసరావు, డాక్టర్ శ్రీకాంత్‌రెడ్డి, డాక్టర్ సుచరిత, డాక్టర్ వసంతకుమారి, డాక్టర్ రాజేశ్వరీ, డాక్టర్ జిలానీ, డాక్టర్ సుధాకర్, డాక్టర్ లీలావతి, సిద్ధార్థ, దీప్తి నర్సింగ్ కళా«శాలల విద్యార్థినులు పాల్గొన్నారు. -
నాటిన మొక్కలను సంరక్షించాలి : ఆర్డీఓ
మునగాల : హారితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మెుక్కలను సంరక్షించే బాధ్యత ప్రతిఒక్కరిదని సూర్యాపేట ఆర్డీఓ సి.నారాయణరెడ్డి అన్నారు. హారితహారం కార్యక్రమంలో భాగంగా శనివారం ఆయన స్థానక తహసీల్దార్ కార్యాలయంలో మొక్కలు నాటి మాట్లాడారు. ఈ కార్యక్రమంఓ జెడ్పీటీసీ సభ్యుడు కోల ఉపేందర్‌రావు, ఎంపీపీ ప్రమీల, తహసీల్దార్ కె.ఆంజనేయులు, ఆర్ఐ స్వప్న, ఎంపీడీఓ డి.శ్రీనివాసరావు, ఎంపీటీసీ అమరబోయిన మట్టయ్య పాల్గొన్నారు. -
పుష్కరఘాట్లను పరిశీలించిన ఆర్డీఓ
బుగ్గమాధవరం (మేళ్లచెర్వు): మండలంలోని బుగ్గమాధవరం, వజినేపల్లి గ్రామాల వద్ద ఏర్పాటు చేస్తున్న పుష్కరఘాట్లను మంగళవారం సూర్యాపేట ఆర్డీఓ నారాయణరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ చేపడుతున్న విద్యుత్, మరుగుదొడ్లు, తాగునీరు వంటి సౌకర్యాలను పరిశీలించారు. ఆయన వెంట ఎంపీపీ భూక్యా ఝామా చోక్లానాయక్, తహసీల్దార్ శ్రీదేవి, సీఐ మధుసూదన్‌రెడ్డి, ఎస్ఐ.రవికుమార్ పాల్గొన్నారు. -
పుష్కర ఘాట్‌ను పరిశీలించిన ఆర్డీఓ
కిష్టాపురం (మేళ్లచెర్వు): మండలంలోని కిష్టాపురం వద్ద నిర్మిస్తున్న పుష్కరఘాట్ పనులను సోమవారం సూర్యాపేట ఆర్డీఓ నారాయణరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా భక్తులకు తాగునీరు, మరుగుదొడ్లు, పార్కింగ్ వంటి సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఇన్చార్జి తహసీల్దార్ శ్రీదేవి, ఐబీ డీఈ స్వామి, ఏఈఈ పిచ్చయ్య, పాండునాయక్, ఆర్ఐ వీరయ్య, జిలానీ ఉన్నారు. -
చాప్టా (కె) వీఆర్వో మాయాజాలం
♦ ఆర్డీఓ మధుకర్‌రెడ్డి సంతకాల ఫోర్జరీ ♦ గుట్టురట్టయిన బాగోతం ♦ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన తహసీల్దార్ కంగ్టి: వీఆర్వో మాయాజాలానికి రైతులు బలయ్యారు. భూమి యాజమాన్య హక్కు పత్రాలపై ఆర్డీఓ ఫోర్జరీ సంతకాలతో రైతులకు పాస్‌బుక్‌లు పంపిణీకి సిద్ధం చేశాడు. అనుమానం వచ్చి సంతకాలను పరిశీలించగా గుట్టురట్టయింది. ఈ ఘటన కంగ్టి మండలంలో వెలుగుచూసింది. కంగ్టి మండలం చాప్టా(కె) క్లస్టర్లో వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్న నర్సింలు సంగారెడ్డిలోని ఆర్డీఓ కార్యాలయానికి సంబంధించిన వ్యవహారాలు చూస్తున్నాడు. తహసీల్ కార్యాలయం నుంచి పట్టాపాస్‌బుక్‌లు తీసుకొని ఆర్డీఓ సంతకాల కోసం తీసుకెళ్లాడు. ఈ క్రమంలో వాసర్ గ్రామం, తండాకు చెందిన రైతులు సుభాష్, సీతారాం, శ్రీరామ్, అంబుబాయి, జమలాబాయి, ఓంప్రకాష్, లక్ష్మయ్యల భూమి యాజమాన్య హక్కు పత్రాలపై బదిలీపై వెళ్లిన ఆర్డీఓ మధుకర్‌రెడ్డి సంతకాలు చేయించి తిరిగి కార్యాలయంలో సమర్పించాడు. సంబంధిత వాసర్ వీఆర్వో రాములు పరిశీలించారు. అనుమానం రావడంతో తహసీల్దార్ వసంత్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఆర్డీఓ కార్యాలయంలో అప్పటి ఆర్డీఓ మధుకర్‌రెడ్డి సంతకాలతో సరిపోల్చగా ఫోర్జరీ అని తేలిందని తహసీల్దార్ తెలిపారు. సదరు వీఆర్వో నర్సింలుపై చర్యలకు అనుమతి కోరుతూ బుధవారం ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్ రోనాల్డ్‌రోస్‌కు నివేదిక పంపినట్టు తహసీల్దార్ వసంత్‌కుమార్ తెలిపారు. -
న్యాయం.. జైలు పాలు
నవనిర్మాణ దీక్షలో అవినీతిపై గళం విప్పిన మహిళ ఆరోపణలు అవాస్తవమని ఆర్డీఓ నివేదిక ఆర్డీఓతో వాగ్వాదానికి దిగిన మహిళ, సీపీఐ నేతలు నలుగురిపై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు అరెస్ట్ చేసిన పోలీసులు నంద్యాల: పొలం పాసు పుస్తకం కోసం రూ.10వేలు లంచం ఇచ్చినా, భర్త మరణ ధ్రువీకరణ పత్రం కోసం రూ.5వేలు ఇచ్చినా అధికారులు పని చేయలేదని నవనిర్మాణదీక్షలో నిలదీసిన మహిళపై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేశారు. న్యాయం చేయమని అడిగిన ఆమెను, మద్దతుగా నిలిచిన సీపీఐ నేతలపై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేసి శుక్రవారం అరెస్ట్ చేశారు. ఈనెల 7వ తేదీన ఆళ్లగడ్డలో నిర్వహించిన నవ నిర్మాణ దీక్ష సదస్సులో వితంతువు విమలారాణి.. ఆర్డీఓ సుధాకర్‌రెడ్డి, ఇతర రెవెన్యూ అధికారులకు షాక్ ఇచ్చింది. చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో అవినీతి అధికమైందని, ప్రజలను కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని, లంచాలు తీసుకున్నా, పనులు చేయడం లేదని ఆరోపించింది. తన భర్త మరణ ధ్రువీకరణ పత్రం కోసం రూ.5వేలు, పొలం పాసు పుస్తకం కోసం రూ.10వేలు లంచం తీసుకున్న అధికారులు ఏడాది గడిచిన పనులు కూడా చేయలేదని చెప్పింది. ఆర్డీఓ సుధాకర్‌రెడ్డి స్పందించి కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేస్తే న్యాయం చేస్తానని చెప్పారు. ఈ మేరకు ఆమె శుక్రవారం ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుంది. అయితే ఆర్డీఓను కలిసే అవకాశం ఇవ్వలేదు. మధ్యాహ్నం వరకు ఆమె కార్యాలయం ప్రాంగణంలోనే నిరీక్షించాల్సి వచ్చింది. దీంతో ఆమెకు సీపీఐ నేత మురళీ, మరో ముగ్గురు నేతలు అండగా నిలబడ్డారు. వీరు ఆర్డీఓ వద్దకు వెళ్లి విమలారాణికి మద్దతుగా మాట్లాడారు. అయితే విమలారాణి ఆరోపణలు సరిగ్గా లేవని ఆర్డీఓ సుధాకర్‌రెడ్డి చెప్పడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఆర్డీఓ తన విధులకు ఆటంకం కలిగిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో త్రీటౌన్ పోలీసులు విమలారాణి, సీపీఐ నేత మురళీ, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. ఆర్డీఓ సుధాకర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేశామని సీఐ వెంకటరమణ తెలిపారు. తన అనుమతి లేకుండా చాంబర్లోకి ప్రవేశించారని, విధులకు ఆటంకం కల్పించారని ఆర్డీఓ ఫిర్యాదును అందజేశారని, ఈ మేరకు నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేశామని చెప్పారు. అవినీతిని ప్రశ్నించినందుకే తాము అవినీతిని ప్రశ్నించినందుకే రెవెన్యూ అధికారులు పోలీస్ స్టేషన్ పాలు చేశారని సీపీఐ నేత మురళీ తెలిపారు. విమలారాణి ఫిర్యాదు చేశాక రెవెన్యూ అధికారులు రాత్రికి రాత్రే విచారణ జరిపి అవాస్తవమని తేల్చారని చెప్పారు. ఆరోపణలకు గురైన అధికారితోనే విచారణ జరిపిస్తే న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ఈ విషయంపై ఆర్డీఓను నిలదీయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. -
తిరుపతికి సబ్‌కలెక్టర్
ఇమామ్‌సు శుక్లా నియామకం మదనపల్లెకు క్రిటిక భత్రా ఏ.మల్లికార్జున విజయవాడ సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్‌గా బదిలీ తిరుపతి మంగళం/మదనపల్లె రూరల్: తిరుపతి రెవెన్యూ డివిజన్‌కు ఆర్డీవో స్థానంలో ఇమామ్‌సు శుక్లాను సబ్‌కలెక్టర్‌గా నియ మిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా మదనపల్లె సబ్‌కలెక్టర్ మల్లికార్జునను బదిలీచేసి ఆయన స్థానంలో ఢిల్లీకి చెందిన మహిళా సబ్‌కలెక్టర్ క్రిటిక భత్రాను నియమించింది. తిరుపతి నగరాన్ని స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చేయనున్న నేపధ్యంలో ఇప్పటికే ఐఏఎస్ అధికారి వినయ్‌చంద్‌ను కార్పొరేషన్ కమిషనర్‌గా నియమించింది. ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఆర్డీవో కేడర్ లేకుండా ఏకంగా సబ్‌కలెక్టర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అయితే ఆర్డీవోగా పనిచేస్తున్న వీరబ్రహ్మయ్యను తిరుపతి నుంచి బదిలీ చేస్తున్నట్టు ఇప్పటివరకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదు. మదనపల్లెకు క్రిటిక భత్రా మదనపల్లె సబ్ కలెక్టర్ డాక్టర్ ఏ.మల్లికార్జున విజయవాడ సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో మహిళా సబ్‌కలెక్టర్ క్రిటిక భత్రా నియమితులయ్యారు. -
స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే: ఆర్డీవో
హైదరాబాద్ : హైదరాబాద్ టోలీచౌకీలోని 'ఇండియన్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్'లో విష వాయువుతో 16మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు సికింద్రాబాద్ ఆర్డీవో తెలిపారు. విద్యార్థులకు క్యాండీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. స్కూల్లో ప్రాక్టికల్స్ నిర్వహిస్తుండగా ల్యాబ్‌లో కెమికల్ బాటిల్ పగిలి విద్యార్థులు స్వల్పంగా గాయపడిన అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై ఆర్డీవో మాట్లాడుతూ గాయపడిన 12మంది విద్యార్థులకు శస్త్రచికిత్స చేసి డిచ్చార్జ్ చేశారని, మరో నలుగురికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. 7వ తరగతి వరకే స్కూల్ నిర్వహించేందుకు అనుమతి ఉందని, అయితే 10వ తరగతి వరకూ నడిపిస్తున్నారని, స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ సంఘటన జరిగిందన్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
'ఎస్వీయూలో ర్యాగింగ్ వాస్తవమే'
తిరుపతి: శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ వాస్తవమేనని రిజిస్ట్రార్ దేవరాజులు, ఆర్డీవో వీరబ్రహ్మయ్య తెలిపారు. ఎస్వీ వర్సిటీలో కలకలం సృష్టించిన ర్యాగింగ్‌పై తిరుపతి ఆర్డీవో సోమవారం విచారణ ప్రారంభించారు. ఆర్డీవో వీరబ్రహ్మం వర్సిటీలోని డీ-బ్లాక్‌కు వెళ్లి ర్యాగింగ్ సంఘటనపై విద్యార్థులు, అధికారులతో చర్చించారు. అనంతరం వారు 'సాక్షి' మీడియాతో మాట్లాడారు. ఐదుగురు సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడినట్టు గుర్తించామన్నారు. అదే విధంగా ర్యాగింగ్‌కు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు పెడుతున్నట్టు తెలిపారు. ర్యాగింగ్ ఘటనపై విచారణకు ఏడుగురు సభ్యులతో కమిటీ వేశామని చెప్పారు. కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ ప్రారంభించినట్లు ఆర్డీవో వీరబ్రహ్మయ్య, రిజిస్ట్రార్ దేవరాజులు మీడియాకు తెలిపారు. -
రగడ..!
జిల్లా కేంద్రంలో ఆర్డీఓ కార్యాలయం అన్ని హంగులతో ఉండాలనే ఉద్దేశంతోనే రూ.2 కోట్లు మంజూరు చేయించి 10 నెలల్లో పూర్తి చేయించా. కొన్ని దుష్టశక్తుల కన్ను ఆర్డీఓ కార్యాలయంపైన, నాపైన పడింది. ఆ దిష్టిపోయేందుకే కొబ్బరి, గుమ్మడికాయలు కొట్టి ప్రారంభించా. - కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సాక్షి ప్రతినిధి, నల్లగొండ : కొంతకాలంగా స్తబ్ధుగా ఉన్న జిల్లా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. నల్లగొండ రెవెన్యూ డివిజనల్ కార్యాలయ ప్రారంభోత్సవం అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్‌ల మధ్య వివాదానికి దారితీసింది. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జిల్లా కాంగ్రెస్ నేతలు అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారన్న రాజకీయ వర్గాల అంచనాలకు భిన్నంగా నల్లగొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి టీఆర్ఎస్తో ప్రత్యక్ష పోరుకు దిగారు. మందీమార్బలాన్ని తీసుకుని వెళ్లి తన చేతుల మీదుగా ఆర్టీఓ కార్యాలయాన్ని ప్రారంభించారు. అయితే, ఈ ఆర్డీఓ కార్యాలయ ప్రారంభోత్సవం ఆదినుంచి వివాదాస్పదంగానే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే నిధులు మంజూరు చేయించి నిర్మాణం పూర్తిచేయించాము.. కనుక తన చేతుల మీదుగానే ఆర్డీఓ కార్యాలయం ప్రారంభోత్సవం జరగాలని మొదటినుంచి కోమటిరెడ్డి పట్టుపడుతున్నారు. కానీ ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వస్తోన్న టీఆర్ఎస్ నాయకులు తొలుత సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయాలని భావించారు. నకిరేకల్ మండలం చందుపట్లకు సీఎం వచ్చినప్పుడు ఆయన చేత ప్రారంభించాలని భావిం చారు.. కానీ సాధ్యపడలేదు. ఆ తర్వాత రాష్ట్ర మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్‌ను జిల్లా కేంద్రానికి రప్పించి ప్రారంభోత్సవం కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేయాలనుకున్నారు. కానీ అది కూడా జరగకపోవడంతో సమయం కోసం అధికార పార్టీ నేతలు ఎదురుచూస్తున్నారు. అయితే, అనూహ్యంగా బోనాల పండగ సందర్భంగా ఆర్టీఓ కార్యాలయం ప్రారంభమంటూ నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జిల్లా కేంద్రంలో హల్చల్ చేశారు. తన నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులను వందలాదిగా వెంటబెట్టుకుని వెళ్లి రామగిరి రోడ్డులో నిర్మించిన కొత్త ఆర్డీఓ కార్యాలయ భవనాన్ని అనధికారికంగా ప్రారంభించారు. జై కాంగ్రెస్, జై కోమటిరెడ్డి నినాదాల మధ్య సోమవారం ఉదయం ఆర్డీఓ కార్యాలయ భవన ప్రాంగణం మారుమోగిపోయింది. భవన నిర్మాణం పూర్తయి 14 నెలలు దాటినా ప్రారంభానికి నోచుకోని ఆర్డీఓ కార్యాలయాన్ని కోమటిరెడ్డి ఉన్నపణంగా ఆగమేఘాల మీద సోమవారం ప్రారంభించేందుకు ప్రయత్నించారు. ప్రారంభ ఏర్పాట్లకు సంబంధించి ఆదివారం సాయత్రం పట్టణంలో ముఖ్య కూడలిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి ఫ్లెక్సీలు చింపేసినట్లుగా పోలీసులకు సమాచారం అందడంతో పట్టణంలో శాంతిభద్రత చర్యలు చేపట్టారు. టీఆర్ఎస్ వర్గీయులే ఫ్లెక్సీలు చింపేసినట్లుగా భావించిన కాంగ్రెస్ శ్రేణులు సోమవారం కార్యాలయ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే వెంట భారీగా తరలివచ్చారు. అయితే, ఇప్పటికే నల్లగొండ నియోజకవర్గంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మద్య రాజకీయ విభేదాలు చాపకింద నీరులా ఉన్నా ఇటీవల కాలంలో రచ్చకెక్కాయి. ఇంతవరకు స్తబ్ధుగా ఉన్న ఈ వర్గపోరు కాస్తా ఎమ్మెల్యే నేరుగా రంగప్రవేశం చేయడంతో మరింత రసకందాయంలో పడ్డాయని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అధికారులు దూరం... ఆర్డీఓ కార్యాలయ ప్రారంభోత్సవానికి ప్రొటోకాల్ ప్రకారం హాజరుకావాల్సిన జిల్లా అధికారులు దూరంగానే ఉన్నారు. సోమవారం ఉదయం కార్యాలయం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేను లోపలికి ప్రవేశించకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులకు సర్దిచెప్పి లోపలికి వెళ్లిన ఎమ్మెల్యే దిష్టిగుమ్మడి కాయ కొట్టారు. ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టి ప్రారంభం అయిపోయిందని చెప్పి బయటకు వచ్చేశారు. అయితే, ఈ కార్యక్రమం అధికారికమా, అనధికారికమా అని తెలుసుకునేందుకు ‘సాక్షి’ ప్రయత్నించినా అధికారులు అందుబాటులోకి రాలేదు. సాయంత్రానికి మాత్రం నల్లగొండ ఆర్టీఓ వెంకటాచారి టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేతో పాటు మరో 16 మంది అక్రమంగా ఆర్డీఓ కార్యాలయంలోనికి ప్రవేశించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, తామేమీ ప్రజా ఆస్తులను ధ్వంసం చేయలేదని, పోలీసుల ముందే కార్యాలయంలోనికి వెళ్లి కొబ్బరికాయ కొట్టి వచ్చామని కాంగ్రెస్ శ్రేణులంటున్నాయి. ప్రత్యక్ష పోరుకు సన్నాహం... ఆర్డీఓ కార్యాలయం ప్రారంభమంటూ సోమవారం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన హడావిడి అటు జిల్లా కేంద్రంతోపాటు జిల్లా రాజకీయ వర్గాల్లో చ ర్చనీయాంశమైంది. త్రిముఖ వ్యూహంతో కోమటిరెడ్డి ఈ చర్యకు పూనుకున్నారని కాంగ్రెస్ శ్రేణులంటున్నాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు గడువు సమీపిస్తుండడంతో కాంగ్రెస్ శ్రేణులను ఉత్తేజపర్చడంతోపాటు తనపై గతంలో వచ్చిన ఆరోపణలను తొలగించుకుని తాను టీఆర్ఎస్తో ప్రత్యక్షంగా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానని పార్టీ శ్రేణులకు సంకేతాలివ్వడం, తనహయాంలో కట్టించిన భవనాన్ని తానే ప్రారంభించాలన్న కోరిక నెరవేర్చుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని పార్టీ శ్రేణులంటున్నాయి. అయితే, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ తరపున మాజీ ఎంపీ రాజగోపాల్‌రెడ్డి బరిలో ఉన్నందున ఈ కార్యాలయ ఉదంతంతో కాంగ్రెస్ కేడర్‌ను కాపాడుకునేందుకు బ్రదర్స్ ఇద్దరూ టీఆర్ఎస్తో నేరుగా కయ్యానికి కాలుదువ్వుతున్నారని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఏదిఏ మైనా.. ఆర్టీఓ కార్యాలయ ప్రారంభం అధికారకమా.. అనధికారికమా... అక్కడి నుంచి కార్యకలాపాలు వెంటనే ప్రారంభమయినా కాకపోయినా... టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల నడుమ ఈ వివాదం పెద్ద చిచ్చునే రగిల్చిందనేది రాజకీయ వర్గాల భావన. -
ఉద్రిక్త వాతావరణంలో ‘తోటపల్లి’ తవ్వకాలు
రాజాం: ఆగూరు పంచాయతీ పరిధిలో తోటపల్లి కాలువ తవ్వకాల పనుల్లో ఆయా భూములకు చెందిన కంచరాం రైతులు వారం రోజులుగా పనులను అడ్డుకొని ఆందోళన చేపడుతున్నారు. భూముల్లో తవ్వకాలు చేపడుతున్నారే తప్ప ఆ భూములకు సంబంధించిన పరిహారం మాత్రం రైతులకు అందించడంలేదని అధికారులపై దుయ్యబడుతున్నారు. పరిహారం అందించే వరకూ పనులు జరపనివ్వమని ఖరాఖండీగా తెలిపి పనులను అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎలాగైనా శనివారం పనులు చేపట్టాలనే ఉద్దేశంతో సంబంధిత అధికారులు ముందస్తుగానే రైతులను అడ్డుకోవడానికి పోలీస్ బందోబస్తును కోరారు. ఈ మేరకు ఎస్సై ప్రభాకర్ సిబ్బందితో సంఘటన స్థలానికి ఉదయం ఆరు గంటలకే చేరుకున్నారు. రైతులను సంయమనం పాటించాలని సూచించారు. అయినా పనులను అడ్డుకోవడంతో పాలకొండ ఆర్డీవో సాల్మన్‌రాజ్, తోటపల్లి ఈఈ రామచంద్రరావు, తహశీల్దార్ సూపరింటెండెంట్ కృష్ణారావు వచ్చి రైతులతో చర్చించారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా రైతుల ప్రతినిధి గెడ్డాపు అప్పలనాయుడు మాట్లాడుతూ కంచరాం గ్రామానికి చెందిన సుమారు 25 మంది రైతులకు ఆగూరు పరిధిలో భూములున్నాయని, పరిహారం ఇవ్వకుండా వాటిలో తోటపల్లి కాలువ పనులు చేపట్టడం దారుణమని వాపోయాడు. దీనికి ఆర్డీఓ సాల్మన్‌రాజ్ స్పందిస్తూ ఇంతవరకూ పరిహారం ఎందుకు చెల్లించలేదో దర్యాప్తు జరిపిస్తామన్నారు. వారంలోగా పరిహారం అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. అనంతరం రైతుల ప్రతినిధి అప్పలనాయుడతో సహా అధికారులంతా రాజాంలోని నగరపంచాయతీ కార్యాలయంలో సమావేశమై దర్యాప్తు ప్రారంభించారు. భూములకు సంబంధించిన వివరాలు రైతులు ఇవ్వకపోవడంతోనే ఎన్ఓసీ ఇవ్వలేకపోయామని స్థానిక రెవెన్యూకార్యాలయ సూపరింటెండెంట్ కృష్ణమూర్తి తెలిపారు. నాలుగు రోజుల్లోగా రైతుల నుంచి వివరాలు సేకరించి ఎన్ఓసీ అందించాలని ఆదేశాలు జారీ చేశారు. -
జిల్లాలో వడదెబ్బ మృతులు లేరు
- సర్కారు లెక్కల్లో వింత సంగతులు - ధ్రువీకరణ లేకపోవడమే కారణం - పట్టించుకోని వైద్య ఆరోగ్య శాఖ - భగభగ మండుతున్న సూరీడు సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఎండలు మండుతున్నాయి. ఎండా కాలానికి ఈసారి కొత్త నిర్వచనం చెబుతున్నాయి. సూర్యుడు ఉదయిస్తూనే భగభగ మండిపోతున్నాడు. మధ్యాహ్నంలోపే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మండే ఎండలకుతోడు వేడిగాలులు ప్రాణాలు తీస్తున్నాయి. నాలుగు రోజులుగా ఎండ దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. వడదెబ్బతో మే 19న నలుగురు, 20న 11 మంది, 21న 22 మంది, 22న 54 మంది, 23న(శనివారం) 63 మంది చనిపోయారు. వేసవి కాలం మొదలైన ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు 150 మందికిపైగా చనిపోయూరు. సాంకేతికంగా చూస్తే మృతుల లెక్కలు వంద శాతం కరెక్టు కాకపోవచ్చు. అయినా ఎంతో కొంత మేరకు ఉంటుంది. ప్రభుత్వ లెక్కలు చూస్తే మాత్రం విచిత్రంగానే కనిపిస్తోంది. ప్రస్తుత వేసవి సీజనులో ఒక్కరు కూడా వడదెబ్బతో మృతి చెందిన దాఖలాలు లేవని ప్రభుత్వ నివేదిక చెబుతోంది. గతంలో ఎప్పుడూ లేనంత తీవ్ర స్థాయిలో ఎండలు ఉన్నా.. వడదెబ్బకు ఒక్కరూ చనిపోలేదని జిల్లా యంత్రాంగం గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుత సీజనులో వడదెబ్బ కారణంగా మృతి చెందిన కేసు ఒక్కటి నమోదు కాలేదని జిల్లా రెవెన్యూ అధికారి శోభ ‘సాక్షి’కి తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో అధికారిక సమాచారం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సకాలంలో స్పందించని అధికారులు వడదెబ్బకు సంబంధించి ఫిబ్రవరి 1 నుంచి పరిగణలోకి తీసుకుంటారు. ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి మే 10 వరకు 60 మం ది వడదెబ్బతో మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖకు సమాచా రం ఉంది. పరిశీలన తర్వాత వచ్చిన తుది నివేదిక దీనికి విరుద్ధంగా ఉంది. మృతి చెందిన 60 మందిలో ఏ ఒక్కరి మరణానికి వడదెబ్బ కారణం కాదని పేర్కొంది. పైగా వేర్వేరు కారణాలతో వీరు మృతి చెందినట్లు నివేదించింది. ఎండలు తీవ్రత పెరిగిన మే 10 నుంచి మే 18 వరకు 88 మంది వడదెబ్బతో మృతి చెందినట్లు వచ్చిన సమాచారం మేరకు పరిశీలన జరుగుతోంది. ఈ మృతులకు సంబంధించిన కారణాలు వెల్లడికావాల్సి ఉంది. వడదెబ్బ మృతులకు సంబంధించి అధికారులు సకాలంలో స్పందించడం లేదు. దీంతో మృతుల లెక్కలు నమోదు కావడం లేదు. ముఖ్యంగా వైద్యఆరోగ్య శాఖ ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రజల అవగాహన లేమితో ఈ విషయంలో వైద్య ఆరోగ్య శాఖ వైఫల్యం బయటికిరావడం లేదు. తేలితే.. ఆపద్బంధు సాయం వడదెబ్బ మృతులకు సంబంధించి.. దహన సంస్కారాలకు ముందే అధికారికంగా కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. ఇతర అకాల మరణాలలాగే.. వడదెబ్బ మృతుల విషయంలోనూ అధికారులు నివేదిక రూపొందించాలి. మృతి విషయం తెలిసిన వెంటనే స్థానిక వీఆర్వో.. తహసీల్దారుకు, పోలీసులకు చెప్పాలి. సివిల్ అసిస్టెంట్ సర్జన్‌తో కలిసి వీరు సంఘటన స్థలానికి వచ్చి పంచనామా నిర్వహించి కేసు నమోదు చేస్తారు. పోస్టుమార్టం చేయాల్సి ఉంటుంది. పంచనామా, పోలీసు శాఖ ఎఫ్ఐఆర్ కాపీ, పోస్టుమార్టం నివేదికల ఆధారంగా మృతికి కారణం వడదెబ్బ అని నిర్ధారించాల్సి ఉంటుంది. ఇలా నిర్ధారణ చేసిన తర్వాత.. తహసీల్దారు, ఆర్డీవో ల ద్వారా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సమాచారం వస్తుంది. ప్రభుత్వానికి ఈ విషయాన్ని నివేదిస్తారు. వడదెబ్బతో మృతి చెందిన వారి కుటుంబానికి రూ.50 వేలు ఆర్థిక సహాయం అందజేస్తారు. ఆపద్బంధు పథకం కింద ఈ ఆర్థిక సహాయం ఇస్తున్నారు. జాతీయ విపత్తుల నిర్వహణ మార్గదర్శకాల ప్రకారం వడదెబ్బ మృతులకు ప్రత్యేకంగా ఆర్థిక సహాయం ఏమీ లేదు. రాష్ట్ర స్థాయిలోని ఆపద్బంధు పథకమే అమలువుతుంది. రోడ్డుప్రమాదాలు, పాముకాటు, కరెంటు షాక్, అగ్నిప్రమాదాల మృతుల కేటగిరీలోనే వడదెబ్బ మృతులకు సహాయం అందజేస్తున్నారు. అధికార యంత్రాంగం మాత్రం వడదెబ్బ మృతులను గుర్తించడంలో నిర్లక్ష్యంగా వ్యవహిస్తోంది. ఆర్డీవోకు వడదెబ్బ నర్సంపేట : ప్రభుత్వ కార్యక్రమాల అమలు, ఇతర సామాజిక కార్యక్రమాలతో కొన్ని రోజులుగా తీరిక లేకుండా ఉంటున్న న ర్సంపేట రెవెన్యూ డివిజనల్ అధికారి రామకృష్ణారెడ్డికి వడదె బ్బ తగిలింది. వుూడు రోజుల క్రితం రెవెన్యూ శాఖ ఆధ్వర్యం లో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విజయువంతం చేయుడం కోసం ఆర్డీవో మండే ఎండలోనూ బిజీ గా పని చేశారు. ఆ రోజు ఎండ ప్రభావంతో ఆర్డీవో అస్వస్తతకు గురయ్యారు. రెండో రోజులుగా చికిత్స పొందుతున్నారు. వడదెబ్బతో అనారోగ్యానికి గురైన ఆర్డీవో రామకృష్ణారెడ్డి ప్రజలకు పలు సూచనలు చేశారు. ‘ఎండలో ఎక్కువ సవుయుం గడపొ ద్దు. రోడ్లపై ఎక్కువ సవూయూన్ని కేటారుుస్తే వడదెబ్బకు గురి కావాల్సి వస్తుంది. వడదెబ్బకు గురైనవారికి చికిత్స కోసం ఆస్పత్రుల్లో తగిన వుందులు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం’ అని ఆర్డీవో చెప్పారు. -
ఏం చేస్తారో చేసుకోండి..
- ఏమైనా మాట్లాడితే కేసులు పెట్టిస్తా - వైఎస్ఆర్సీపీ నాయకుడు రామలింగారెడ్డితో ఆర్డీవో వినాయకం వేముల : మండలంలోని బెస్తవారిపల్లె గ్రామంలో టీడీపీకి చెందిన వారితోనే బియ్యం పంపిణీ చేస్తాం.. ఏమి చేస్తారో చేసుకోండి.. ఇంకా ఏమైనా మాట్లాడితే కేసులు పెట్టిస్తానంటూ జమ్మలమడుగు ఆర్డీవో వినాయకం వేముల మండల వైఎస్ఆర్సీపీ పరిశీలకులు రామలింగారెడ్డితో ఫోన్లో వాగ్వాదానికి దిగారు. వివరాలలోకి వెళితే.. మండలంలోని వేల్పుల పంచాయతీ పరిధిలోని బెస్తవారిపల్లె గ్రామంలో డీలర్ అశోక్ బియ్యం పంపిణీ చేసేవారు. ఇది జీర్ణించుకోని టీడీపీ నాయకులు ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులతో చౌక దుకాణంపై దాడులు చేయించారు. బోర్డుపై ధరల పట్టిక లేదని సస్పెండ్ చేశారు. దీంతో బియ్యం పంపిణీని టీడీపీకి చెందిన వారికి రెవెన్యూ అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. అయితే గ్రామంలో 200కార్డుదారులు ఉండగా.. 185మంది కార్డుదారులు అక్కడికి బియ్యానికి వెళ్లారు. వారం రోజులక్రితం గ్రామానికి చెందిన వంద మంది కార్డుదారులు తాము అక్కడికి బియ్యానికి వెళ్లమని.. తమ కార్డులకు దేవాలయం వద్ద పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని తహశీల్దార్ చిన్నయ్యకు విజ్ఞప్తి చేశారు. దీంతో ఆయన కార్డుదారులతో ఇరువురికి ఆమోదయోగ్యమైన పేరును సూచిస్తే వారితో పంపిణీ చేస్తామని హామీనిచ్చారు. వారం రోజులు గడిచినా తహశీల్దార్ చర్యలు తీసుకోకపోవడంతో బుధవారం మళ్లీ కార్డుదారులు తహశీల్దార్‌కు సమస్యను వివరించారు. దీంతో ఆయన గ్రామంలో బియ్యాన్ని టీడీపీ వారే పంపిణీ చేస్తారు.. ఏమి చేస్తారో చేసుకోండంటూ గ్రామస్తులతో చిర్రుబుర్రులాడారు. వెంటనే వారు వైఎస్ఆర్సీపీ మండల పరిశీలకులు రామలింగారెడ్డికి విషయం చెప్పారు. ఆయన రెవెన్యూ కార్యాలయానికి చేరుకొని తహశీల్దార్‌తో చర్చించారు. దీంతో ఆయన తన చేతుల్లో ఏమీ లేదని ఆర్డీవో వినాయకంతో మాట్లాడుకోవాలని సూచించారు. వెంటనే రామలింగారెడ్డి ఆర్డీవో తో ఫోన్లో మాట్లాడారు. గ్రామంలో టీడీపీ వారి వద్దకు కార్డుదారులు బియ్యానికి వెళ్లనప్పుడు దేవాలయం వద్ద పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు ఆర్డీవో వినాయకం రామలింగారెడ్డితో వాగ్వాదానికి దిగారు. గ్రామంలో టీడీపీ వారితోనే బియ్యం పంపిణీ చేస్తాం.. ఏమి చేస్తారో చేసుకోండి, తమాషా చేస్తున్నారా.. ఎక్కువగా మాట్లాడితే కేసులు పెట్టిస్తామంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. ఇందుకు రామలింగారెడ్డి కూడా తమ కార్డుదారులకు బియ్యం పంపిణీ చేయాలని అడుగుతున్నాం, మీరు కేసులు పెడతామంటే..ఎవరూ భయపడరంటూ సమాధానం ఇచ్చారు. రెవెన్యూ కార్యాలయానికి కార్డుదారులు చేరుకోవడంతో పోలీసులు అక్కడికి చేరుకొని పంపించివేశారు. -
ఆర్డీవో ఘెరావ్
సూర్యాపేట: అకాల వర్షాలకు పంటలను నష్టపోయిన రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో నల్లగొండ జిల్లా సూర్యాపేట పట్టణంలో ఆర్డీవో శ్రీనివాసరెడ్డిని కార్యాలయంలోకి వెళ్లనీయకుండా రైతులు బుధవారం అడ్డుకున్నారు. వర్షాలకు పంటలు దెబ్బతిని రెండు రోజులు దాటిపోతున్నా పంట నష్టంపై పరిశీలన జరిపి ప్రభుత్వానికి నివేదిక పంపకపోవడంపై రైతులు ఆర్డీవో శ్రీనివాసరెడ్డిని నిలదీశారు. దీంతో పంట నష్టంపై తక్షణమే పరిశీలన చేయించి ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామని బాధిత రైతులకు ఆర్డీవో హామీ ఇచ్చినట్టు సమాచారం. -
అంగన్వాడీల ఆందోళన పథం
డిమాండ్ల సాధనకోసం అంగన్ వాడీలు ఆందోళన బాట పట్టారు. గడచిన వారం రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టిన వారు జిల్లాలోని అన్ని ఆర్డీవో కార్యాలయాలను శుక్రవారం ముట్టడించారు. కనీస వేతనాలు ఇవ్వాలని, పనిఒత్తిడి తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 17వ తేదీన చేపట్టనున్న చలో హైదరాబాద్ కార్యక్రమంలో తమ సత్తా ఏమిటో చూపుతామని ప్రకటించారు. గుంటూరు ఈస్ట్ కనీస వేతనాలు అమలు చేయాలనీ, పని ఒత్తిడి తగ్గించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు శుక్రవారం ఇక్కడి ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. సీఐటీయూ ఆధ్వర్యంలో చేపడుతున్న రాష్ట్రవ్యాప్త ఉద్యమంలో భాగంగా పెద్ద సంఖ్యలో అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు ఆర్డీఓ కార్యాలయానికి ఉదయమే తరలి వచ్చారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కార్యాలయంలోకి చొచ్చుకు పోయేందుకు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో వారు గేటు వద్దే బైఠాయించిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్బంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి కాపు శ్రీనివాసరావు మాట్లాడుతూ బీఎల్వో, తదితర డ్యూటీలతో పాటు సూపర్వైజర్లు, సీడీపీఓలు చేయాల్సిన ఆన్లైన్ పనులు కూడా అంగన్వాడీ కార్యకర్తలతో చేయిస్తున్నారన్నారు. కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికలలో ఎన్నో వాగ్దానాలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటివరకూ వారి సమస్యలపై స్పందించకపోగా, ప్రపంచ మహిళా దినోత్సవంనాడు తమ సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై విరుచుకుపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 17 వ తేదీన చేపట్టిన చలో హైదరాబాదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జ్యోతి రాణి మాట్లాడుతూ సస్పెండ్ చేసిన కార్యకర్తలను వెంటనే పనుల్లోకి తీసుకోవాలని, వేసవి సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీరికి మద్దతు తెలిపిన డీసీసీ అధ్యక్షుడు మక్కెన మల్లిఖార్జున రావు మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తల న్యాయమైన కోర్కెలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలన్నారు. మాజీ ఎమ్యెల్యే మస్తాన్ వలి, సీఐటీయూ ఉపాధ్యక్షుడు లక్ష్మీ నారాయణ, ఉడా మాజీ చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి, వర్కర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కె.పద్మ, కె.శ్యామల తదితరులు ప్రసంగించారు. -
కాలనీ తాకట్టుపై విచారణ
కావలి: కొండాపురం మండలం గానుగపెంట ఎస్సీ-బీ కాలనీకి నకిలీ పాస్‌బుక్‌లు సృష్టించి బ్యాంకులో రుణం తీసుకున్న సంఘటనపై జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ విచారణకు అదేశించారు. దీంతో దీనిపై కొండాపురం రెవెన్యూ అధికారులు విచారణ ప్రారంభించారు. ‘కాలనీని తాకట్టుపెట్టారు’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి ఉన్నతాధికారులు స్పందించారు. సమగ్ర విచారణ జరపాలంటూ తహశీల్దార్‌ను ఆదేశించారు. కొండాపురం మండలం గానుగపెంట ఎస్సీకాలనీలోని సర్వేనెంబర్ 266/2లో ప్రభుత్వం 7.58 ఎకరాలను 1997లో 60 మంది ఎస్సీలకు నివాస స్థలాలను ఇచ్చారు. అదే స్థలాన్ని రవి, హజరత్ అనే వ్యక్తులు నకిలీ పాస్‌బుక్‌లు తయారుచేసి కలిగిరి, కొండాపురం మండలంలోని పలు బ్యాంకుల్లో రూ. 6.50 లక్షల రుణాలను తీసుకున్నారు. బ్యాంకుల్లో ఆధార్‌కార్డు అనుసంధానంతో ఈవిషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని కాలనీవాసులు కావలి ఆర్డీఓ లక్ష్మీనరసింహంకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేయాల్సిందిగా జేసీ ఆదేశాలిచ్చారు. జేసీ ఆదేశాలతో కొండాపురం తహశీల్దార్ ప్రమీల ఆకాలనీని పరిశీలించారు. ఆకాలనీ సర్వే నంబర్‌తో రుణం తీసుకున్న బ్యాంకులకు వివరాల కోసం రెవెన్యూ సిబ్బంది, వీఆర్వోలు గురువారం వెళ్లారు. రుణం పొందేందుకు ఏయే పత్రాలు ఇచ్చారు అనేదానిపై విచారణ చేస్తున్నారు. ఆ భూమిని హజరత్, రవిల పేరున అడంగళ్ ఏ సంవత్సరంలో వచ్చింది, అందులో పాత్రధారులు ఎవరనే దానిపై వారు విచారణ చేస్తున్నారు. దీనిపై కొండాపురం తహశీల్దార్ ప్రమీల మాట్లాడుతూ జేసీ ఆదేశాలతో కాలనీ తాకట్టుపై విచారణ చేస్తున్నామని చెప్పారు. విచారణకు సంబంధించి నివేదికను ఆర్డీఓ ద్వారా జేసీకి పంపుతామన్నారు. -
రెవె‘న్యూ’.. జగడం
* గంటాకు చెక్ పెట్టేందుకు హైదరాబాద్‌లో మంత్రి అయ్యన్న మంత్రాంగం * భూ వ్యవహారంపై విజిలెన్స్ విచారణతో కలకలం * ఆర్డీవోపై వేటు కోసం వ్యూహం! * మంత్రుల మధ్య వేడెక్కుతున్న రాజకీయం సాక్షి, విశాఖపట్నం : ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న రీతిలో మంత్రి అయ్యన్న బాణం సంధించారు. కోట్ల విలువైన భూములను అధికార పార్టీ నేతలకు అప్పనంగా కట్టబెట్టడం ద్వారా స్వామి భక్తిని ప్రదర్శించే అధికారులపై వేటుకు రంగం సిద్ధం చేశారు. మరోవైపు మంత్రి గంటాకు అనుకూలంగా ఉన్న అధికారులపై వేటుకు మార్గం సుగమం చేశారు. అదను చూసి వేసిన ఎత్తుకు మంత్రి గంటా బిత్తరపోవాల్సిన పరిస్థితి కల్పించారు. భీమిలి, పరవాడలలో భూ వ్యవహారాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించడం జిల్లా రాజకీయ, అధికార యంత్రాంగంలో చర్చనీయాంశమైంది. మరోవైపు ఇప్పటికే ఉప్పూ నిప్పుగా ఉన్న అయ్యన్న, గంటాల మధ్య తాజా ఆధిపత్య పోరుకు ఆజ్యం పోసింది. ఇద్దరు మంత్రుల ఆధిపత్యపోరులో తాము అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్నామని అధికారులు వాపోతున్నారు. జిల్లాలో పనిచేయడం కంటే ఇతర ప్రాంతాలకు బదిలీ చేయించుకోవడం ఉత్తమమని కూడా భావిస్తున్నారు. జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైన ఈ వ్యవహారం కథకమామిషు ఇదిగో ఇలా ఉంది... పరవాడ మండలంలో సర్వే నంబర్ 54లో 32.75 ఎకరాల ప్రభుత్వ భూమిపై ఒక ప్రభుత్వ పెద్ద ఎప్పటి నుంచో కన్నేశారు. అదే విధంగా భీమిలి మండలం గంభీరంలో సుమారు 30 ఎకరాల అసైన్డ్ భూములను కూడా ఇదే రీతిలో ఆక్రమించాలని ఎప్పటినుంచో పథకం పన్నారు. ఈ భూములు ప్రస్తుతం రైతులు, స్థానికుల ఆక్రమణలో ఉన్నాయి. వీటిని ఎలాగైనా తన పరం చేసుకోవాలని కొంతమంది రెవెన్యూ అధికారుల అండదండలతో సదరు ప్రభుత్వ పెద్ద చక్రం తిప్పారు. తన అడుగులకు మడుగులొత్తే రెవెన్యూ అధికారి ద్వారా కథ నడిపించారు. గత ప్రభుత్వ హయాంలోనే గంభీరం వద్ద ఉన్న భూములను క్రమబద్ధీకరించుకున్నారని సమాచారం. పరవాడలో రైతుల ఆక్రమణలో ఉన్న భూములను ఇతరులకు విక్రయించుకునేందుకు అనుమతిచ్చే విషయం పరిశీలిస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించడంతో ఈ భూములను హస్తగతం చేసుకునేందుకు ఆ కీలక నేత, ఈయన తనకు అనుకూలుడైన రెవెన్యూ అధికారి ఒకరు సదరు తహశీల్దార్ కార్యాలయంలో రికార్డులను టాంపరింగ్ చేసినట్టుగా ఆరోపణలు గుప్పుమన్నాయి. ఈ వ్యవహారంపై ఫిర్యాదు అందడంతో జిల్లా ఉన్నతాధికారి ఒకరు తీవ్రంగా పరిగణించారు. కానీ ఆ కీలక నేత ఒత్తిడితో టాంపరింగ్ విషయం తెలిసినా సదరు అధికారి మిన్నకుండిపోయినట్టుగా తెలియవచ్చింది. భీమునిపట్నం మండలంలోని చిప్పాడ గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 86/4, 184/6లలో ఉన్న భూముల రికార్డులను తారుమారు చేసినట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఈ సర్వే నంబర్లో సుమారు 500 ఎకరాల్లో ఓ లేబొరేటరీ ఉండగా, మిగిలిన భూముల్లో అటవీ, విజయనగరం జిల్లా మాన్సాస్ భూములు ఉన్నాయి. ఈ వ్యవహారంపై సీఎం, డీప్యూటీ సీఎంలకు ఫిర్యాదుల వెల్లువెత్తడంతో విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. ఇటీవల బదిలీల్లో రాష్ర్ట స్థాయిలో చర్చనీయాంశమైన సదరు రెవెన్యూ అధికారిపై ఈ విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించడంతో రెవెన్యూ శాఖలో కలకలం మొదలైంది. విచారణ పేరుతో సదరు అధికారిని బలవంతంగా పంపించేందుకే జిల్లాకు చెందిన కీలక మంత్రి పావులు కదిపినట్టుగా తెలుస్తోంది. -
ఆన్‌లైన్‌లోనూ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు
* డిసెంబర్ 16 వరకు అవకాశం * ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తులు హన్మకొండ అర్బన్ : వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గానికి కొత్తగా ఓటరుగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కిషన్ తెలిపారు. అర్హులైన పట్టభద్రులు డిసెంబర్ 16వ తేదీలోగా ఓట ర్లుగా నమోదు చేసుకోవాలని సూచించారు. అంతేకాకుండా ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తులు అందజేయొచ్చని ఆయన తెలిపారు. కాగా, 2008 ఎమ్మెల్సీ ఓటర్ల జా బితాలో పేరు ఉన్నవారు ప్రస్తుతం తమ ఓటరు గుర్తింపు కార్డు వివరాలు అందజేస్తే సరిపోతుందని కలెక్టర్ కిషన్ వివరించారు. ఆన్లైన్ దరఖాస్తు ఇలా.. http://ceotelangana.nic.in వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి. అక్కడ ఈ-రిజిస్ట్రేషన్‌ను క్లిక్ చేయాలి. అందులో ఫారం-18ని ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత వరంగల్, ఖమ్మం, నల్ల గొండ నియోజకవర్గం.. ఆపై జిల్లాను ఎంపిక చేసుకోవాలి. ఫారంలోని అన్ని వివరాలను ఇంగ్లిష్‌లో పూర్తి చేయాలి. అయితే, స్టార్ గుర్తు ఉన్న కాలమ్స్ తప్పనిసరిగా నింపాలి. వివరాలు నింపడం పూర్తయ్యాక ట్రాన్స్‌లేట్ బటన్ నొక్కితే తెలుగులో సమాచారం కనిపిస్తుంది. అప్పుడు అక్షరదోషాలు ఏమైనా ఉంటే సరిచేసుకోవచ్చు. ఇక స్కాన్ చేసిన, 100కేబీ సైజ్ కంటే తక్కువగా ఉన్న కలర్ పాస్‌పోర్టు సైజ్ ఫొటోతో పాటు అటెస్టెడ్ చేయించిన అర్హత పత్రాలను అప్లోడ్ చేసి సేవ్ బటన్ నొక్కాలి. అప్పుడు కనిపించిన అప్లికేషన్ ఐడీ నంబర్‌ను తదుపరి అవసరాల కోసం గుర్తుం చుకోవాలి. కాగా, ఇప్పటికే పట్టభద్ర ఓటరుగా నమోదై ఉంటే http//: ceoaperms.ap. gov.in వెబ్సైట్లోకి వెళ్లి వివరాలు చూసుకోవచ్చు. ఇక ఆన్లైన్లో కాకుండా మండల తహసీల్దార్ కార్యాలయాలు, ఆర్డీఓ కార్యాలయాల్లో కూ డా ఓటరు నమోదు ఫారం పొంది పూర్తి చేసి జిరాక్స్ ప్రతులు, ఫొటో జతచేసి అందజేయవ చ్చు. అలాగే, జాబితాలో సవరణలు, తొల గింపు కోసం ఫారం-7, ఫారం-8, 8(ఏ) అం దజేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఓటరు జాబి తాలో పేరు ఉన్న వారు ఓటరు గుర్తింపు కార్డు వివరాలను అందజేస్తే సరిపోతుంది. కా ర్డు లేకపోతే ఫొటో, నివాస ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. అర్హతలివే... పట్టభద్రుల ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు కోసం ఉండాల్సిన అర్హతలను ఎన్నికల కమిషన్ వెల్లడించారు. పేరు నమోదుకు 31-10-2011కు ముందు దేశంలోని ఏదైనా విశ్వ విద్యాలయంలో పట్టభద్రులై ఉండాలి. డిగ్రీకి తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులైన ఉన్న వారు కూడా అర్హులే. అయితే, ఏ నియోజకవర్గంలో పేరు నమోదు చేసుకోవాలంటున్నారో ఆ పరిధిలో నివాసి అయి ఉండాలి. ఈ మేరకు అర్హతలు ఉన్న వారు ఫారం-18 పూర్తి చేసి పట్టభద్ర ధ్రువీకరణ పత్రాలు, సాధారణ ఓటర్ల గుర్తిం పు కార్డు జత చేసిన దరఖాస్తులను ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాయాల్లో అందజేయాలి. ఫొటో గుర్తింపు కార్డు లేని వారు పాస్‌పోర్టు సైజ్ ఫొటోతో పాటు నివాస ధ్రువీకరణ పత్రం అందజేయాల్సి ఉంటుంది. ఈ మేరకు పట్ట భద్రులు ఓటర్ల జాబితాలో తమ పేరు నమో దు చేసుకుని రానున్న ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. -
ఇసుక రీచ్‌ల్లో కాంట్రాక్టర్ హల్చల్
* పెత్తనమంతా ఆయనదే..! * పేరుకే డ్వాక్రా మహిళల నిర్వహణ * నిబంధనలకు విరుద్ధంగా అయినవిల్లి మండల రీచ్‌లు * నోరు మెదపని అధికారులు * ఆర్డీవోకు ఫిర్యాదు చేసిన గ్రామీణులు అమలాపురం టౌన్/అయినవిల్లి : ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు అప్పగించిన ఇసుకరీచ్‌ల్లో వాస్తవానికి రాజకీయ అండ ఉన్న పెత్తందారులు, పెట్టుబడిదారుల హవా నడుస్తోంది. వారి కనుసన్నల్లోనే వాటి నిర్వహణ నడుస్తోంది. ఫలితంగా మహిళలు ఏమీ చేయలేని అసహాయులుగా మిగిలిపోతున్నారు. దీనికి అయినవిల్లి మండలంలోని అయినవిల్లిలంక, వీరవల్లిపాలెం రీచ్‌లే సజీవ సాక్ష్యాలు. ఈ రీచ్‌లను కాకినాడకు చెందిన లారీల సప్లయి కాంట్రాక్టర్, ఇసుక వ్యాపారి హస్తగతం చేసుకుని హల్చల్ చేస్తున్నారు. రీచ్ నిర్వహణ బాధ్యతలను అధికారికంగా తీసుకున్న డ్వాక్రా మహిళలు రీచ్ వద్ద నామ్‌కే వాస్తుగా మిగిలిపోయారు. సదురు కాంట్రాక్టర్‌కు అయినవిల్లి మండలానికి చెందిన ఓ మండల స్థాయి ప్రజాపతినిధి, కొందరు టీడీపీ నాయకులు అండగా నిలిచారు. అలాగే మండలానికి చెందిన కొందరు అధికారులు, డీఆర్డీఏ అధికారి ఒకరు కూడా ఆ కాంట్రాక్టర్ అడుగులకు మడుగులొత్తుతున్నారు. దీంతో ఇసుక తవ్వకాలు, రవాణాలో కాంట్రాక్టర్ చెలరేగిపోతున్నారు. ఇసుక ట్రాక్టర్లకు డీడీలు ఇచ్చే విషయంలోనూ అవకతవకలకు పాల్పడుతూ ప్రభుత్వ ఆదాయానికే కాదు, డ్వాక్రా మహిళల ఉపాధికీ గండికొడుతున్నారు. దీంతో అయినవిల్లిలంకకు చెందిన కొందరు ప్రజలు డ్వాక్రా మహిళలను డమ్మీ చేసి వారి ముసుగులో ఇసుక రవాణాలో అక్రమాలకు పాల్పడుతున్న కాంట్రాక్టర్ తీరుపై నిప్పులు చెరుగుతున్నారు. డీడీ రూపంలో చేస్తున్న మోసాలను ఉటంకిస్తూ ఆ గ్రామస్తులు కొందరు గురువారం రాత్రి అమలాపురం ఆర్డీవో జి.గణేష్‌కుమార్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు కూడా. ప్రభుత్వ సిబ్బంది, కాంట్రాక్టరు కుమ్మక్కై ఇసుక అక్రమాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. అలాగే ఇదే మండలంలోని కొండుకుదురు ఇసుక రీచ్‌లో గురువారం రాత్రి సమయంలోనూ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వటంతోపాటు అక్రమంగా తరలిస్తున్న పరిణామాలపై కూడా ఆ గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. కొండుకుదురు రీచ్‌లోనూ ఆ కాంట్రాక్టర్ పెత్తనం సాగుతోందని విమర్శించారు. అవకతవకలు ఇలా... ఇసుక రీచ్‌ల్లో ఇసుక పొందాలంటే తొలుత యూనిట్ రూ. రెండు వేలు వంతున డీడీ తీసి ఇవ్వాలి. అలాగే మైనింగ్ శాఖకు సంబంధించి బిల్లు కూడా ఉండాలి. అయినవిల్లిలంక, వీరవల్లిపల్లి, కొండుకొదురు రీచ్‌ల్లో సదరు కాంట్రాక్టర్ రాజకీయ అండతో మైనింగ్ బిల్లుపై తేదీలు లేకుండా ఇసుక రవాణా చేస్తున్నారు. ఆ ఇసుకుకు సంబంధించిన డీడీలు ఉండటం లేదు. దీంతో అయినవిల్లిలంక గ్రామస్తులు ర్యాంపు నుంచి ఇసుకతో వెళుతున్న వాహనాన్ని గురువారం అడ్డుకుని డీడీ ఏదని ప్రశ్నించారు. సిబ్బందిని నిలదీశారు. అలాగే మైనింగ్ బిల్లుపై తేదీ లేకపోవడాన్ని కూడా గమనించారు. ఈ ఆధారాలతోనే ఆ గ్రామస్తులు ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. ఎప్పుడైతే గ్రామస్తులు ఇసుక వాహనాలను అడ్డుకుని అవతవకలను గుర్తించారో, ఆ విషయం క్షణాల మీద ఆ కాంట్రాక్టర్‌కు తెలిసిపోయింది. దీంతో కేవలం ఆరగంట సమయంలో ఆ వాహనాల్లోని ఇసుకకు డీడీలను అధికారులకు చూపించారు. అయినప్పటికీ ఆ కాంట్రాక్టర్ ఇసుక అక్రమాలకు శుక్రవారం కూడా కొనసాగించారు. అధికారులు ఆకస్మిక తనిఖీలకు వస్తున్నారన్న సమాచారం శుక్రవారం సాయంత్రం గుప్పుమనటంతో అప్పటికే అయినవిల్లిలంక రీచ్‌లో లోడ్ అయిన లారీల్లోంచి ఇసుకను ఆదరాబాదరాగా దించేశారు. ఈ లారీలన్నీ మైనింగ్ బిల్లులు సక్రమంగా లేకపోవటంవల్లే అక్రమార్కులు లారీల్లోంచి ఆకస్మికంగా అన్లోడ్ చేసేసి అధికారులకు దొరక్కుండా జాగ్రత్త పడ్డారు. గత కొన్ని రోజులుగా ఈ అవతవకలు జరుగుతున్నా అధికారుల పర్యవేక్షణ లేకపోవటంతో అడ్డుకునే నాథుడే కరవయ్యాడు. అక్కడ డీఆర్డీఏ అధికారుల నిఘా కాదు కదా! కనీస పర్యవేక్షణ కూడా లేదు. గురువారం గ్రామస్తులు అడ్డుకున్నారు కాబట్టి ఆ అక్రమాలు వెలుగు చూశాయి. గత కొన్ని రోజులుగా ఇలా ఎన్ని యూనిట్ల ఇసుక డీడీలు లేకుండా పక్కదారి పట్టాయో అంచనా వేయవచ్చు. ఒక డీడీ చూపించి అదే డీడీ పేరుతో పలు వాహనాలను ఇసుకతో పక్కదారి పట్టిస్తున్నారని అయినవిల్లిలంక గ్రామస్తులు విమర్శిస్తున్నారు. ఆర్డీవో గణేష్‌కుమార్ అయినవిల్లి మండలంలోని ఇసుక రీచ్‌లపై వస్తున్న ఫిర్యాదులు, ఆరోపణలు నేపథ్యంలో తానే స్వయంగా తనిఖీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. -
వైఎస్సార్ సీపీ కన్నెర్ర
* గుంటూరు ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా * తొలగించిన పింఛన్లు,రేషన్ కార్డులు పునరుద్ధరించాలని డిమాండ్ * పేదల సమస్యలు పరిష్కరించాలని ఆర్డీఓకు విన్నవించిన ఎమ్మెల్యే ముస్తాఫా, లేళ్ల ఆప్పిరెడ్డి సాక్షి, గుంటూరు: అర్హుల ఫించన్లు, రేషన్ కార్డుల తొలగింపుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్నెర్ర చేసింది. పేదల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ గురువారం ఉదయం గుంటూరు ఆర్డీఓ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తాఫా, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డిల ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అర్హులైన వారందరికీ ఫించన్లు, రేషన్ కార్డులు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం ఆర్డీఓ భాస్కరనాయుడును కలిసి సమస్యను వివరించారు. * పింఛన్లు కోల్పోయిన వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, రేషన్ కార్డులు లేని పేదల బాధలను చూడలేని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన బాట పట్టింది. పేదలకు అండగా నిలిచేందుకు గుంటూరు నగరంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళనకు నడుం బిగించింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరాగా, ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడకు చేరుకున్న పేదల బాధలను ఆలకించారు. * శివపార్వతి అనే పేద మహిళ మాట్లాడుతూ ‘ నాకు ఉండటానికి ఇల్లు లేదు...దాసరిపాలెంలో ఓ పూరిపాకలో అద్దెకు ఉంటున్నా...ఆధార్ కార్డు లేదని రేషన్ బియ్యం ఇవ్వడం లేదు..’అని కంట తడిపెట్టుకుంది. * ఇలా ఒక్కొక్కరు తమ బాధలను తెలియజేయడంతో పేదల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోందని వైఎస్సార్ సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘ తొలగించిన రేషన్‌కార్డులు పునరుద్ధరించాలని, పేదలందరికి బియ్యం ఇవ్వాలని, అర్హులైనవారి ఫించన్లు తిరిగి ఇవ్వాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీఓ భాస్కరనాయుడును కలసి సమస్య తీవ్రతను ఆయనకు వివరించారు. * ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముస్తాఫా మాట్లాడుతూ ‘నిన్నటి వరకు వచ్చే పింఛన్ ఇప్పుడు ఆగిపోయింది. రేషన్ బియ్యం రావటం లేదు.పేదలు కూలి పనులు మానుకొని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇదెంత దారుణం’ అని ఆర్డీఓను నిలదీశారు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వరు, సమస్యలు పరిష్కారం కావు, మరెందుకు జన్మభూమి నిర్వహిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. * అనంతరం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం ఉన్న కార్డులు, పింఛన్లు తీసివేస్తే ఎలా అని ప్రశ్నించారు. జిల్లా వ్యాప్తంగా 1.81 లక్షల రేషన్ కార్డులు, 9.88 లక్షల వ్యక్తిగత యూనిట్లలకు రేషన్ నిలిపివేశారు. గుంటూరు నగరానికి సంబంధించి దాదాపు 36 వేల రేషన్ కార్డులు, లక్ష వ్యక్తిగత యూనిట్లకు రేషన్ రావటం లేదు. లక్ష మంది ఇక్కడికి వచ్చి ఆధార్ అనుసంధానం చేయించుకోవాలంటే ఎన్ని రోజులు పడుతుందో అర్థం చేసుకోవాలన్నారు. జిల్లాలో 53 వేలకుపైగా పింఛన్లు తీసివేశారని ఆయన ధ్వజమెత్తారు. * అనంతరం ఆర్డీఓ భాస్కర నాయుడు మాట్లాడుతూ జన్మభూమి జరిగే సమయంలో డివిజన్ల వారీగా కౌంటర్లు ఏర్పాటు చేసి అర్జీలు తీసుకోవడం తో పాటు, ఆధార్ అనుసంధానం వంటి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. * కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్రమైనార్టి సెల్ కార్యదర్శి చాంద్‌బాషా, రాష్ట్ర మహిళ కమిటీ సభ్యురాలు మేరుగ విజయలక్ష్మి, నగర మైనార్టి సెల్ అధ్యక్షులు షేక్‌బాబు, నాయకులు చిన్నపరెడ్డి, మద్దుల రాజాయాదవ్ తదితరులు పాల్గొన్నారు -
ఆళ్లగడ్డ ఉప ఎన్నికకు నేడే నోటిఫికేషన్
కర్నూలు(అగ్రికల్చర్): ఆళ్లగడ్డ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు మంగళవారం నోటిఫికేషన్ జారీ కానుంది. అదే రోజు నుంచి నామినేషన్ల ఘట్టం కూడా మొదలు కానుంది. నామినేషన్ల పర్వం మొదలు కానుండడంతోనే రాజకీయ సందడి నెలకొననుంది. నామినేషన్లు ఈ నెల 21వ తేదీ వరకు స్వీకరిస్తారు. ఉప ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా నంద్యాల ఆర్డీఓ సుధాకర్‌రెడ్డి వ్యవహరిస్తారు. ఆళ్లగడ్డ తహశీల్దార్.. అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా ఉంటారు. నామినేషన్లు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరిస్తారు. నామినేషన్ సమయంలో పోటీ చేసే అభ్యర్థులు రూ.10 వేలు డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఇందులో 50 శాతం చెల్లిస్తే సరిపోతుంది. పోటీ చేసే అభ్యర్థులను నియోజకవర్గానికి చెందిన 10 మంది ఓటర్లు బలపరచాల్సి ఉంది. నవంబర్ 8వ తేదీన పోలింగ్ జరగనుంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారా పోలింగ్ నిర్వహిస్తారు. గత ఎన్నికల్లో ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా భూమా శోభా నాగిరెడ్డి పోటీ చేశారు. నామినేషన్ల ఉపసంహరణ పూర్తి అయి పోటీలో ఉన్న అభ్యర్థులను ప్రకటించిన తర్వాత రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించారు. అప్పటికే పోటీలో ఉన్న అభ్యర్థుల ప్రకటన పూర్తి అయినందున ఎన్నికలు నిర్వహించారు. మరణించిన శోభా నాగిరెడ్డి ఎన్నికల్లో గెలుపొందారు. శోభా నాగిరెడ్డి భౌతికంగా లేకపోవడంతో మళ్లీ ఎన్నిక నిర్వహించడం అనివార్యమైంది. ఇప్పటికే వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పార్టీ అభ్యర్థిగా దివంగత శోభానాగిరెడ్డి కూతురు భూమా అఖిలప్రియ పేరును ప్రకటించారు. ఆళ్లగడ్డ నియోజకవర్గం ఎన్నికను ఏకగ్రీవం చేసే దిశగా ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఇది నామినేషన్ల ఘట్టం పూర్తయ్యేలోపు స్పష్టం కానుంది. ఆళ్లగడ్డ నియోజకవర్గం ఉప ఎన్నిక ఈ ఏడాది జనవరి ఒకటిన ప్రచురించిన ఓటర్ల జాబితా ప్రకారం జరుగుతుంది. మొత్తం ఓటర్లు 2,20,812 మంది ఉండగా, ఇందులో మహిళలు 1,11,997 మంది, పురుషులు 1,08,800 మంది, ఇతరులు 15 మంది ఉన్నారు. గత నెల చివరి వారం నుంచి ఈనెల 10వ తేదీ బీఎల్ఓలు ఇంటింటి సర్వే చేసి చనిపోయిన వారు, డబుల్ ఎంట్రీలు, గ్రామాలు వదిలి వెళ్లిన వారిని గుర్తించడంతో పాటు అర్హులైన వారి నుంచి ఫారం-6లు కూడా స్వీకరించారు. ఇందులో ఓటర్ల సంఖ్యలో స్వల్ప హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంది. నియోజకవర్గంలో ప్రస్తుతం 267 పోలింగ్ కేంద్రాలు ఉండగా, అదనంగా 8 కొత్త పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. నియోజకవర్గాన్ని సందర్శించిన కలెక్టర్ నామినేషన్ల ఘట్టం మంగళవారం నుంచి మొదలు కానుండటంతో జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ సోమవారం నియోజకవర్గాన్ని సందర్శించారు. అధికారులతో సమావేశమై నామినేషన్లలో ఎలా వ్యవహరించాలనేది వివరించారు. ఎన్నికను పకడ్బందీగా, నిస్పక్షపాతంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. నియోజకవర్గంలో ఆరు మండలాలు ఉన్నాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు మండలానికి ఒక మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ టీమ్‌ను నియమించారు. అక్రమ మద్యం, నగదును అరికట్టేందుకు 12 చెక్‌పోస్టులు ఏర్పాటయ్యాయి. ఇది ఎన్నికల షెడ్యూలు : నామినేషన్లు - ఈ నెల 14 నుంచి 21వ తేదీ వరకు పరిశీలన - ఈనెల 22న ఉపసంహరణ - ఈనెల 24న పోలింగ్ - నవంబర్ 8న ఓట్ల లెక్కింపు - నవంబర్ 12న -
రాజకీయ బదిలి
రాజంపేట: రాజంపేట రెవెన్యూ డివిజన్లో పనిచేసే ఆర్డీఓలకు రాజకీయ బదిలీ తప్పడం లేదు. అధికార పార్టీకి అనుకూలంగా పనిచేయకపోతే వారిని సాగనంపడమే ధ్యేయంగా పెట్టుకుంటున్నారు. తక్కువ వ్యవధిలోనే ముగ్గురు ఆర్డీఓలకు రాజకీయ బదిలీ తప్పలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నిన్న కాంగ్రెస్.. నేడు తెలుగుదేశం పాలకుల హయాంలో ముగ్గురు మహిళా ఆర్డీఓలపై బదిలీ వేటు పడింది. పద్మజ నుంచి.. వెంకటరమణారెడ్డి ఆర్డీవోగా పనిచేసి బదిలీ అయిన తర్వాత ఆర్డీవోగా పద్మజ బాధ్యతలు తీసుకున్నారు. అప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉండటంతో ఆ సమయంలో సీఎంకు ముఖ్యుడిగా వ్యవహరిస్తున్న ఈ నియోజకవర్గానికి చెందిన నేత ఆమెను ఉద్దేశపూర్వకంగా బదిలీ చేయించారు. ఆ తర్వాత శ్రీనివాసులు వచ్చారు. అనంతరం ఐఏఎస్ క్యాడర్‌కు చెందిన అధికారిణి ప్రీతిమీనా సబ్‌కలెక్టర్‌గా నియమితులయ్యారు. ఈమె ముక్కుసూటిగా విధులు నిర్వర్తించడంతో అధికారపార్టీ నేతలు బదిలీ చేయించారు. అయితే ఆమె బదిలీపై వెళ్లడానికి స్వతహాగానే సిద్ధమైన నేపథ్యంలో ఆమెకు ఈ బదిలీ కలిసి వచ్చింది. ఆరునెలలకే.. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాకముందే ఈ యేడాది ఫిబ్రవరి 13వతేదీన విజయసునీత ఆర్డీవోగా బాధ్యతలు తీసుకున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికలు, మండలపరిషత్, పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించడంలో ఆమె సఫలీకృతులయ్యారు. ఈమె పట్టుమని పది నెలలు కూడా పనిచేయకముందే ఆరు నెలలకే బదిలీ చేశారు. ఈ బదిలీపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఈ ముగ్గురి బదిలీలోనూ గతంలో కాంగ్రెస్‌లో..ప్రస్తుతం టీడీపీలో కీలక పాత్ర పోషిస్తున్న నేతప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. -
బదిలీల కోసం ప్రయత్నాలు
కీలకపోస్టుల కోసం ప్రజాప్రతినిధుల చుట్టూ అధికారుల ప్రదక్షిణలు అరండల్‌పేట (గుంటూరు) : ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు (జీవో నంబర్ 175) జారీ చేసింది. దీంతో ఎప్పటి నుంచో బదిలీలపై ఆశలు పెట్టుకున్న ఉద్యోగులు, అధికారులు తమ ప్రయత్నాలను మమ్మురం చేశారు. ప్రధానంగా జిల్లా పాలనలో కీలక పోస్టుల కోసం అధికారులు ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు మొదలుపెట్టారు. జిల్లాపరిషత్ సీఈఓ, ఆర్డీఓలు, తహశీల్దార్లు, ఖజానా శాఖ అధికారి, డీటీసీ వంటి పోస్టుల కోసం అనేక మంది అధికారులు ఇప్పటికే తమ పైరవీలను మమ్మురం చేశారు. వీరితో పాటు నగరపాలక సంస్థ కమిషనర్, అదనపు కమిషనర్, మున్సిపల్ కమిషనర్లు, ఇంజినీర్లు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి, జీజీహెచ్ సూపరింటెండెంట్, ఇలా కీలక స్థానాల్లో పోస్టింగ్‌ల కోసం జిల్లాకు చెందిన మంత్రుల వద్దకు అధికారు లు క్యూ కడుతున్నారు. గుంటూరు ఆర్డీఓ పోస్టు ఖాళీగా ఉండటంతో చిత్తూరుకు చెందిన ఆర్డీఓకు పోస్టింగ్ ఇస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ►నరసరావుపేట ఆర్డిఓ తెనాలికి, గుంటూరు ఇన్చార్జి ఆర్డిఓ మురళి గురజాల ఆర్డిఓగా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ►గుంటూరు తహశీల్దారు పోస్టుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. డెల్టాకు చెందిన ఓ తహశీల్దారుకు జిల్లాకు చెందిన మంత్రి హామీ ఇచ్చినట్లు సమాచారం. ►నగరపాలక సంస్థకు వచ్చేందుకు అనేక మంది ఇంజినీరింగ్ అధికారులు పావులు కదుపుతున్నారు. ఇందుకోసం అవసరమైన సిఫార్సు లేఖలను మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి పొందారు. ►నగరపాలక సంస్థ తాత్కాలిక కమిషనర్‌గా ఉన్న పి. నాగవేణి సైతం తనను ఇక్కడే ఉంచాలని ప్రజాప్రతినిధులను కోరుతున్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యే, మంత్రి మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయి. ఐఏఎస్ అధికారి కావాలంటూ ఎమ్మెల్యే ఒత్తిడి తీసుకువస్తున్నారు. అదనపు కమిషనర్, డిప్యూటీ కమిషనర్ల పోస్టుల కోసం ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్‌పై వచ్చేందుకు కొంతమంది అధికారులు ఆసక్తి చూపుతున్నారు. ►వైద్య ఆరోగ్యశాఖలో డిఎం అండ్ హెచ్ఓగా ఉన్న గోపీనాయక్ ధీర్ఘకాలికంగా పని చేస్తుండటంతో ఆయన బదిలీ కావడం ఖాయమైంది. దీంతో ఆయన జీజీహెచ్‌లో ఆర్ఎంఓ లేదా ఆర్డి పోస్టు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ►డిఎం అండ్ హెచ్ఓ పోస్టు కోసం ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన అధికారులు అక్కడి నాయకులతో పైరవీలు చేస్తున్నారు. ►మరో వైపు బదిలీలకు సంబంధించి ఉద్యోగ సంఘాల్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. విద్యా సంవత్సరం మధ్యలో వేరేప్రాంతానికి వెళితే తమ పిల్లలు ఇబ్బందులు పడతారని వాపోతున్నారు. బదిలీలు కోరుకున్న వారినే పరిగణలోకి తీసుకోవాలి తప్ప, బలవంతంగా బదిలీలు చేయవద్దని ఏపీఎన్జీఓ నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.