
పనితీరు మార్చుకోకపోతే చర్యలు
తహశీల్దార్ల, ఆర్డీఓల పనితీరు సక్రమంగా లేదని..పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ సిహెచ్.విజయమోహన్ హెచ్చరించారు.
కర్నూలు రూరల్: తహశీల్దార్ల, ఆర్డీఓల పనితీరు సక్రమంగా లేదని..పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ సిహెచ్.విజయమోహన్ హెచ్చరించారు. శనివారం కలెక్టర్ సమావేశ మందిరంలో రెవెన్యూ అంశాలపై ఆర్‌డీఓ, తహశీల్దార్లతో ఆయన సమీక్ష చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ సమస్యలపై వచ్చే వారిని గౌరవించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రెవెన్యూ డివిజన్ అధికారులు క్షేత్ర స్థాయి పర్యటనలు చేయకుండా ఏసీ గదుల్లో కూర్చుంటే సమస్యలు పరిష్కారం కావన్నారు. విధుల నిర్వహణలో ఇబ్బందులుంటే తన దృష్టికి తీసుకో రావాలన్నారు.
ఆధార్ నమోదును 15 రోజుల్లోపు వంద శాతం పూర్తి చేయాలని, ఆగస్టు 15 నుంచి ఈ-పాస్ రేషన్ పంపిణీ కార్యక్రమం చేపడుతామని కలెక్టర్ తెలిపారు. అలాగే పట్టాదారు పాస్ పుస్తకాలను ఆధార్‌తో అనుసంధానం చేయాలని చెప్పారు. కొందరు రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగుల సంతకాలతో నకిలీ పాస్‌పుస్తకాలను తయారు చేసేందుకు ముఠాగా ఏర్పడినట్లు తెలిసిందని, వారిపై నిఘా పెట్టాలని తహశీల్దార్లకు సూచించారు. సమావేశంలో డీఆర్‌ఓ వేణుగోపాల్ రెడ్డి, డీఈఓ నాగేశ్వరరావు, ఆర్‌డీఓలు రఘుబాబు, నరసింహు లు, రాం సుందర్‌రెడ్డి, తహసీల్దార్లు పాల్గొన్నారు.
క్షేత్రస్థాయి పర్యటనలతోనే సమస్యలకు పరిష్కార అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తేనే స్థానిక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ సి.హెచ్. విజయమోహన్ అన్నారు. శనివారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్‌లో డ్వా మా అనుబంధ శాఖలతో ఆయన సమన్వ య సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మైక్రో ఇరిగేషన్, వాటర్ కన్జర్వేషన్‌పై 15 రోజు ల్లోపు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని ఆదేశించారు. ప్రతి మండలంలో 5 గ్రామాలను ఎంపిక చేసుకుని, అక్కడ బిందు సేద్యం ద్వారా ఉద్యా న పంటలు సాగు అయ్యేలా చూడాలన్నా రు. బీడు భూములు, పొలం గట్లపై పండ్ల మొక్కలు, పచ్చగడ్డి పెంచేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో డ్వామా పీడీ హరినాథరెడ్డి, ఏపీఎంఐపీ పీడీ పుల్లారెడ్డి పాల్గొన్నారు.
తాగునీటి సమస్యకు ప్రాధాన్యమివ్వాలి
కర్నూలు(రూరల్): గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలని జిల్లా కలెక్టర్ విజయమోహన్ ఆదేశించారు. శనివారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్‌లో పంచాయతీ, మండల అభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో అభివృద్ధి పనులు, తాగునీటి పథకాలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో తీవ్రంగా తాగునీటి సమస్య ఉన్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని చెప్పారు.
కొన్నిచోట్ల ట్రాక్టర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నామని, మరికొన్నిచోట్ల తాగునీటి పథకాల పనులు ప్రోగ్రెస్‌లో ఉన్నాయని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు కలెక్టర్‌కు నివేదించారు. మిడుతూరు మండలంలో తాగునీటి సమస్య కు కరెంటు కోతలే కారణమని తెలియజేశారు. మంచినీటి పథకాలకు కరెంటు సమస్య లేకుండా చూడాలని ట్రాన్స్‌కో అధికారుల కు కలెక్టర్ సూచించారు.
అధికారులు ఖచ్చితంగా వారంలో మూడు రోజులు గ్రామాల్లో పర్యటి ంచి సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలని ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ జయరామిరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి శోభాస్వరూపరాణి, ఎంపీడీఓలు, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.