కర్నూలు ఆర్‌డీఓగా హుసేన్‌సాహెబ్‌ | hussain saheb as kurnool rdo | Sakshi
Sakshi News home page

కర్నూలు ఆర్‌డీఓగా హుసేన్‌సాహెబ్‌

Published Mon, May 8 2017 11:14 PM | Last Updated on Tue, Sep 5 2017 10:42 AM

hussain saheb as kurnool rdo

- ఉత్తర్వులు విడుదల చేసిన ప్రభుత్వం 
 
కర్నూలు సీక్యాంప్‌: కర్నూలు ఆర్డీఓగా హుసేన్‌సాహెబ్‌ను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.  కర్నూలు ఆర్డీఓ పోస్ట్‌ కొన్ని నెలలుగా ఖాళీగా ఉంది. దీంతో హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌–3 డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న మల్లికార్జునను ప్రభుత్వం నియమించింది. అయితే కొందరు అధికార పార్టీ నేతలు అడ్డుకోవడంతో బాధ్యతలు స్వీకరించలేదు. ఈ క్రమంలో హౌసింగ్‌ పీడీగా పనిచేస్తున్న హుసేన్‌సాహెబ్‌ను ఇన్‌చార్జ్‌ ఆర్‌డీఓగా అప్పటి కలెక్టర్‌ సీహెచ్‌. విజయ్‌మోహన్‌ నియమించారు. రెండు కీలకకైన పోస్టులపై దృష్టి సారించడం సమస్య కావడంతో పూర్తి స్థాయి ఆర్డీఓగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన జిల్లాలో డోన్, కృష్ణగిరి, కర్నూలు, తదితర మండలాల తహసీల్దార్‌గా బాధ్యతలు నిర్వహించారు. డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి పొంది అనంతపురం జిల్లాలో పనిచేశారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement