హైదరాబాద్ : హైదరాబాద్ టోలీచౌకీలోని 'ఇండియన్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్'లో విష వాయువుతో 16మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు సికింద్రాబాద్ ఆర్డీవో తెలిపారు. విద్యార్థులకు క్యాండీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. స్కూల్‌లో ప్రాక్టికల్స్ నిర్వహిస్తుండగా ల్యాబ్‌లో కెమికల్ బాటిల్ పగిలి విద్యార్థులు స్వల్పంగా గాయపడిన అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.
ఈ సంఘటనపై ఆర్డీవో మాట్లాడుతూ గాయపడిన 12మంది విద్యార్థులకు శస్త్రచికిత్స చేసి డిచ్చార్జ్ చేశారని, మరో నలుగురికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. 7వ తరగతి వరకే స్కూల్ నిర్వహించేందుకు అనుమతి ఉందని, అయితే 10వ తరగతి వరకూ నడిపిస్తున్నారని, స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ సంఘటన జరిగిందన్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.