సస్పెన్షన్ ఎత్తివేయకుంటే ఉద్యమిస్తాం
Published Sat, Aug 27 2016 12:27 AM | Last Updated on Mon, Sep 4 2017 11:01 AM
ఏలూరు (మెట్రో) : వీఆర్వో దుర్గారావును ఆర్డీవో చేయి చేసుకోవడం తప్పు కాదా అని జిల్లా వీఆర్వోలు, రెవెన్యూ సంఘ నాయకులు ప్రశ్నిం చారు. శుక్రవారం సాయంత్రం స్థానిక రెవెన్యూ భవన్‌లో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు ఎల్.విద్యాసాగర్ మాట్లాడుతూ వీఆర్వో దుర్గారావుకు కలెక్టర్ సొమ్ములు ఇచ్చి అది లంచం అని చెప్పడం ఎంతవరకూ సమంజసమన్నారు. కనీసం నేటికీ బాధితుల వద్ద నుంచి ఎటువంటి ఫిర్యాదు అందలేదని, అయినప్పటికీ తహసీల్దార్‌తో బలవంతంగా నివేదిక తెప్పించుకుని దుర్గారావును సస్పెండ్ చేశారన్నారు. జిల్లాలో అవినీతి అంతా జిల్లా అధికారుల వద్దే ఉందని, కిందిస్థాయి ఉద్యోగుల పట్ల నిరాధార ఆరోపణలు చేసి సస్పెన్షన్ వేటు వేయడం సరికాదని సాగర్ అన్నారు. కార్యదర్శి కె.రమేష్ మాట్లాడుతూ ఇటీవల జమాబంధీ పేరుతో ఒక్కో వీఆర్వో రూ.10 వేల నుంచి రూ. 20 వేలు వసూలు చేసి ఇచ్చారని, ఈ లంచాలు తీసుకున్న ఉన్నతాధికారులు నిజాయతీపరులా అని ప్రశ్నించారు. బలవంతంగా సొమ్ములు ఇచ్చి దానికి లంచం అని పేరుపెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దుర్గారావుపై సస్పెన్షన్ ఎత్తివేయకుంటే ఎన్జీవోలు, రెవెన్యూ, జేఏసీ సంఘాల ఆ««దl్వర్యంలో ఉద్యమిస్తామని రమేష్ చెప్పారు. పలువురు నాయకులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement