ఏలూరు, న్యూస్‌లైన్ :
మునిసిపల్ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియను రెండు గంటల్లో పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ సిద్ధార్థజైన్ ఆర్డీవోలను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి జిల్లాలోని మునిసిపల్ కమిషనర్లు, ఆర్డీవోలతో ఆదివారం నిర్వహించిన వీడియో కాన్ఫెరెన్ ్సలో ఆయన మాట్లాడారు.
ఏప్రిల్ రెండో తేదీ ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుందన్నారు. సమస్మాత్మక, అతి సమస్మాత్మకమైనవిగా గుర్తించిన 204 పోలింగ్ బూత్‌ల్లో వెబ్‌కెమెరాలను ఈ నెల 27 నాటికి ఏర్పాటు చేస్తామమన్నారు. ఓటర్లందరికీ ఈ నెల 27లోగా ఫొటో గుర్తింపు స్లిప్‌లను ఇంటింటికి తిరిగి అందజేయాలని, మునిసిపల్ కార్యాలయాల్లో వీటి కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ముగ్గురికి షోకాజ్ నోటీసులు ఎన్నికల సిబ్బంది పోస్టల్ బ్యాలెట్‌లను ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత వాటిని బ్యాలెట్ బాక్సుల్లో భద్రపర్చి స్ట్రాంగ్‌రూమ్‌కు తరలించాలన్న ఆదేశాల అమలులో నిర్లక్ష్యంపై కొవ్వూరు ఆర్డీవో గోవిందరావు, నిడదవోలు, కొవ్వూరు మున్సిపల్ కమిషనర్లకు షోకాజ్ నోటిసులు జారీ చేసి, ఎన్నికల సంఘానికి నివేదిక సమర్పించాలని డీఆర్వో ప్రభాకర్‌రావును కలెక్టర్ ఆదేశించారు.
పోస్టల్ బ్యాలెట్లను ఉద్యోగులకు ఇచ్చి వాటిని అక్కడే వినియోగించుకోకుండా ఉద్యోగులు ఇళ్లకు తీసుకు వెళ్లడంపై కొవ్వూరు ఆర్డీవోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఆర్వో కె ప్రభాకర్‌రావు, నిక్‌నెట్ అధికారి గంగాధరరావు పాల్గొన్నారు.
రెండు గంటల్లో కౌంటింగ్ పూర్తవ్వాలి
Published Mon, Mar 24 2014 2:35 AM | Last Updated on Thu, Mar 21 2019 8:19 PM
Advertisement